-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chanti Addala"



చిత్రం: తిరుమల తిరుపతి వేంకటేశ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, బ్రహ్మానందం, రోజా, మహేశ్వరి, కోవై సరళ
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల తేది: 21.12.2000



Palli Balakrishna Thursday, February 14, 2019



చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
నటీనటులు: బాలక్రిష్ణ , మీన , రాశి, అబ్బాస్ 
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: చంటి అడ్డాల, వి.శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 16.09.1999



Songs List:



సఖి మస్త్ మస్త్ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

సఖి మస్త్ మస్త్ 




ముద్దుల పాప పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ 
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

ముద్దుల పాప 



హల్లో మిస్ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: కోటి, హరిణి 

హల్లో మిస్ 





ప్రేమ పాటశాలలో పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

ప్రేమ పాటశాలలో 




పంపర పనసమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు , చిత్ర 

పంపర పనసమ్మ 




ఓ మనసా ఎదురీతే నేర్చుకో పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాసు

ఓ... ఓ...ఓ...ఓ...
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో
గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు
గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు
కలిసిన రూపం నీ వనుకో

ఓ... ఓ...ఓ...ఓ...
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో

పినతల్లి జూదాన ఒక పావుగా 
నీ వల్ల నీ తండ్రి మరణించినా
కారడవిలో దారి కనిపించక 
చేజేతులా తెలిసి చితిపేర్చిన
ఏమి విధి రాతనక  రామకథ అనుకో
ఏ జన్మ రక్షణకో జన్మ పొందావనుకో
నీ వేదనే వేదమై చదువుకో

ఓ... ఓ...ఓ...ఓ...
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో

ఎందరికి ఆశ్రయము కలిపించినా
నీ గుండెల్లో చోటింక మిగిలున్నదే
అందుకనే కష్టాలు ఎన్నోచ్చినా 
అవి నీ అందకోరాయి అని నవ్వుకో
కొండంత భారాలే సూదంత లనుకుంటూ
బంధించు సంకెళ్ళే బంధు జనాలనుకుంటూ
ఈ భాదలే బలముగా మార్చుకో

ఓ... ఓ...ఓ...ఓ...
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో
గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు
గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు
కలిసిన రూపం నీ వనుకో

ఓ... ఓ...ఓ...ఓ...

Palli Balakrishna Friday, March 23, 2018



చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
నటీనటులు: అల్లరి నరేష్ , రిచా పనాయి, రమ్యకృష్ణ
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల తేది: 27.12.2012



Songs List:



ఓరోరి మగధీర పాట సాహిత్యం

 
చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీకృష్ణ అంజనా సౌమ్య 

ఓరోరి మగధీర 





పిస్తోలు పిల్లదానివో పాట సాహిత్యం

 
చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హేమచంద్ర, శ్రావణ భార్గవి 

పిస్తోలు పిల్లదానివో 




నరోత్తమా పాట సాహిత్యం

 
చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: వసుందరా దాస్

నరోత్తమా 





అత్తో అత్తమ్మ కూతురో పాట సాహిత్యం

 
చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: గీతా మాధురి , రాహుల్ సిప్లిగంజ్

(ఈ పాటని చిరంజీవి నటించిన అల్లుడా మజాకా (1995)  సినిమా నుండి రీమిక్స్ చేశారు)

అత్తో అత్తమ్మ కూతురో 
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
యమ్మో ఓ యమ కూతురో 
మొత్తంగా సత్తా చూపించ మందిరో
తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి
మళ్ళీ మళ్ళీ అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావాలి హో హో హో

అత్తో అత్తమ్మ కూతురో 
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
యమ యమ యమ యమ్మో ఓ యమ కూతురో 
మొత్తంగా సత్తా చూపించ మందిరో

జోయ్ జోయ్ జోయ్ యమ జాతరచెయ్
అల్లాడించే అల్లరోడా నన్నోడించే దమ్మున్నోడ
సొగసులన్ని అంకితమిస్తా ప్రియా - యా యా

హాయ్ హాయ్ హాయ్ హోయ్ హొయ్ హొయ్ 
మత్తెక్కించే మానవుడా మతి తప్పించే యవ్వనుడా
సరసమైతే రారా రసిక గజ  - థాంక్యూ
అందం దక్కని అత్తని చూస్తే రంగా రింగా
అత్తరు అద్దిన పిల్లను చూస్తే శృంగారంగా
అత్తకు తగ్గ అల్లుడు నువ్వేరో... ఓ... ఓ..

అత్తో అత్తమ్మ కూతురో 
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
యమ్మో ఓ యమ కూతురో 
మొత్తంగా సత్తా చూపించ మందిరో

కాయ్ కాయ్ కాయ్ యమ హోయ్ హోయ్ హోయ్
ఓరల్లుడో ఏం గిల్లుడో చూపించరో నీ దూకుడు
మచ్చికైతే ముచ్చట పడతావ్ కదా - అంతే కదా
ఏయ్ ఏయ్ ఏయ్ ఇరగేసేసెయ్ 
ఏవత్తావో ఏవిత్తావో గమ్మత్తులో కుమ్మేత్తావో
సరుకు చూస్తే ఇంకా ఇరుకే కదా - హో యా
ఆటకి ఆట వేటకి వేట ఆడేసుకో
మరి పూటకు పూట పువ్వుల పంట పండించుకో
పందిరి మంచం ఎక్కించేస్తారా... ఓ.. ఓ..




జనక్ జనక్ పాట సాహిత్యం

 
చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తీక్ 

జనక్ జనక్ 



గోటితో పెకలించు పాట సాహిత్యం

 
చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రోహిత్ 

గోటితో పెకలించు 




మమహో యమ పాట సాహిత్యం

 
చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చంద్రతేజ 

మమహో యమ 

Palli Balakrishna Tuesday, March 13, 2018


చిత్రం: ఒక ఊరిలో (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం: మల్లికార్జున్
నటీనటులు: తరుణ్ కుమార్ , రాజా , సలోని
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల తేది: 01.07.2005

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఏ చోట మలుపు తిరిగెనో తన చివర అ ఆ ఏదో
కథ కంచికె ఎపుడు వెళుతుందో తెలిపేది ఎవరో...

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఒంటరిగా నువ్వుంటే జత చేసుకున్నానే
జంటగానే నన్ను అనుకుంటే నేను ఒంటరిగా చేయిచ్చనే
చితిమంట నను రమ్మందే బ్రతుకింక నాకు లేదే
కడసారి నేను చూడాలి కోన ఊపిరుండగా

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

తుది క్షణమే ఒక హృదయం  అందే ఒక మాట ఏమందే
ఆ నిజమే కడదాక నాలో అంటుందే
మెతకటి నను చూడందే అటువైపు నువునా
నీ ప్రేమ నేను కాదు అనా ఈ స్నేహము ఉందిలే

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

Palli Balakrishna Wednesday, December 6, 2017



చిత్రం: అల్లరి రాముడు (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
నటీనటులు: జూ.యన్.టి.ఆర్, ఆర్తి అగర్వాల్, గజాల, నగ్మా 
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల: 19.07.2002



Songs List:



ఒప్పుల కుప్ప వయ్యారిభామ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి రాముడు (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: ఆర్. పి. పట్నాయక్, ఉష

ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా

ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
ఒయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా

ఓయ్ ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
ఆ హాహా తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా

కనులు మూసిన నీ రూపం కలలై విసెరెను నీ శాపం
చెంపకు చుమ్మా...
చెంపకు చుమ్మా ఇస్తాలేమ్మా చెంతకే చేరని
నిలవక మాటమీద ఈ మనసు నిన్ను చూసి ఆగనంది ఈ వయసు
స్వీటే హాటుగుంది హాటే ఘాటుగుంది హయ్యరే హొయ్యారే నేనింకా తయ్యారే

ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
హొయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా

చిలిపి ఆటలకు వస్తావా కౌగిలి గింతలు ఇస్తావా
కొట్టకు కన్ను...
కొట్టకు కన్ను చంపకు నన్ను చూపుతో సోకుకూ
సన్నజాజి పందిరుంది సరదాగా వెన్నెలమ్మ మారుతుంది పరదాగా
నువ్వే ఎస్ అంటే నేనే కస్సు మంటే ఆ బుగ్గా ఈ బుగ్గా రాస్తావింక

ఒప్పుల కుప్పా...
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు గుద్దులు కావాలా లేక ముద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా

ఒహో  ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
లాలా లాలాలా లాల లాలా లాలాలా




రెండువేల రెండు వరకు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి రాముడు (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: పోతుల రవికిరణ్

రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
సోకుల్తో వచ్చేసింది సూదుల్తో గుచ్చేసింది
చినుకుల్తో చిందేసింది జివ్వంటూ లాగేసింది

పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే
పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే
బాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గోడవచ్చింది
రవ్వంత నొప్పేసింది మువ్వంత ముద్దేసింది

ఊరించి ఓ మెరుపు రాగాలు తీస్తుంటే అహ అహ అహా అహ
ఉడికించి ఓ చినుకు గారాలు పోతుంటే అహ అహ అహా అహ
ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే
ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే ఊగిందే నీ నడుము తడి ఆరిపోతుంటే
కోరింది నీ కిచ్చుకుంటే ఆహా
సయ్యటలే ఆడుకుంటే ఊరుకుంటే జారుకుంటే ఆకు చాటున్న పిందల్లే నే ఉంటే
అహా అహా ఆహా అహా అహా ఆహా

రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే

మత్తోచ్చి నీ చూపు మత్తెక్కిపోతుంటే అహ అహ అహా అహ
మత్తోచ్చి నాకేమో మతి తప్పిపోతుంటే అహ అహ అహా అహ
ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే
ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే నీ మత్తు మాటలతో వెన్నే సలుపేస్తుంటే
అహా ఈ వానలో కన్ను గీటి, అహా
రసవీణలా నిన్ను మీటి వరస తెలిసి వయసు కురిసి మనసులోతుల్లో ఉయ్యాల లుగాలి
అహా అహా ఆహా అహా అహా ఆహా

రెండువేల రెండు వరకు అహా అహా అహా అహా
చూడలేదే ఇంత సరుకు అహా అహా అహా అహా
రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
సోకుల్తో వచ్చేసింది సూదుల్తో గుచ్చేసింది
చినుకుల్తో చిందేసింది జివ్వంటూ లాగేసింది

పోక పోక తోటకెళితే అహా అహా అహా అహా
వేటగాడు వెంటపడితే అహా అహా అహా అహా
పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే
బాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గోడవచ్చింది
రవ్వంత నొప్పేసింది మువ్వంత ముద్దేసింది

లాలాల లాలాలలా లాలాల లాలాలలా
లాలాల లాలాలలా లాలాల లాలాలలా



చెలియా చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి రాముడు (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: ఆర్. పి. పట్నాయక్, ఉష

లలలా లాలా లలలా
లలలా లాలా లలలా
లల లాలా లల లాలా హ్మ్ ఉఁ ఉఁ

చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా
ప్రియురాలు ఇచ్చింది పెదవి లంచము
దొరగారి కౌగిలే నా ప్రపంచము
రస సీమలో చేయనా పరిపాలనం

చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

వయ్యారి ఈ చిన్నది పడకటింటి కయ్యాని కొస్తున్నది
ఓరయ్యో కామయ్యె ఏంచేసినావయ్యో నాకేదో అవుతున్నది
మనసైన మాగధీరుడు అయ్యయ్యో అయ్యారే సుకుమారుడు
ఈ ప్రేమ పాటలు నీ చేతి వాటాలు నే చేసి చూపించని
యతి కూడ మతిపోయి జతకోరగా రతియోగమంటాను జపియించగా
నీ తీయని అల్లరి చేస్తుంది నా...

చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

జేగంట మోగించని చిన్నదాన్ని జాగారం చేయించని
లేలేత అందాల గంధాలు తీయించి గ్రంధాలు రచియించని
నా ముడుము చెల్లించని చెప్పరాని పాటలు వల్లించని
శ్రీగీత గోవింద శృంగార శ్లోకాల గానాలు సాగించని
కన్నయ్య అలివేణి ఆ రాధిక కాదయ్య పోవయ్య అనరాదిక
మది మురళిని సరళిలో రవలించగా

చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా
ప్రియురాలు ఇచ్చింది పెదవి లంచము
దొరగారి కౌగిలే నా ప్రపంచము
రస సీమలో చేయనా పరిపాలనం

చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా





జడకు జడా మెడకు మెడా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి రాముడు (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: మనో, ఆర్. పి. పట్నాయక్, ఉష

ఈ టౌను నాదిరా ఈ గౌను నాదిరా
ఈ పిల్ల నాదిరా పిల్ల తల్లి నాదిరా హోయ్
కాదు నాది ఏటి కప్పొద్దా? సరే లాగించు...

గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా
గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా
గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా...

జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
అఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
ఈ ఎండి పళ్లెంలో నా ఎన్న పూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారితో

ఆఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
ఆఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో

ఏమి బువ్వ తిన్నదో ఏపుగ ఉన్నాది నాటుకోడి పులుసులాగ మోతగ ఉన్నాది
ఈడు చిన్నదైనా తొనికిస్తాంది జోడు కోరుకుంటూ రంకేస్తాంది
చురుకైన కళ్ళురో ఇరుకైన ఒల్లురో మెరుపంటి పిల్లరో మరి అదే సిరి సరే సరి

జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
అరె జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో

మరీ చీపు... మరి కప్పో...

ఏడ పుట్టి ఉన్నాడో పిల్లకు మొగుడు ఎతికి తెచ్చుకోవయ్య తల్లికి మొగుడా
మంచి లగ్గం చూసి ముడిపెట్టేయి పట్టెమంచమేసి గడ పెట్టేయి
ఇది పాలబొమ్మరో మురిపాల గుమ్మరో అరుదైన జన్మరో ఇక సరే సరి చలో పిల్లో

జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
యహ అందుకో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
ఈ ఎండి పళ్లెంలో నా ఎన్న పూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారితో

జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో హా




బొడ్డును చూడయ్యె పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి రాముడు (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: కార్తిక్, ఉష

బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
అందమంత ఆరేసి ఆగలేనయ్యో ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో
ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని అరిచేలా అల్లుకోనా గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో

బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే

రమ్మంటే రానంటావు ఇమ్మంటే లేదంటావు ఇస్తుంటే వద్దంటావు ఎప్పటికప్పటికే
రమ్మంటు ఉరిస్తావు ఇమ్మంటు ఉడికిస్తావు ముద్దంటే పడిచస్తావు ఎక్కడికక్కడికే
పట్టు కున్నా పద్దేమో మల్లేకన్నా ముద్దేమో
చెప్పుకున్నా సిగ్గేమో చెప్పకున్నా అగ్గెమో
అంతలోనే ఇంత సిగ్గా చెప్పగానే అమ్మమ్మమ్మో

బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే

పట్టిందే పట్టంటావు కట్టిందే చీరంటావు కట్టందే బాగుంటవు అక్కడికక్కడికే
వద్దటంటే ఊ అంటావు బెట్టంటే రా అంటావు హద్దంటె లేదంటావు ఇక్కడికిక్కడికే
ఒక్కటయ్యే ఇద్దరిలో లక్షలయ్యే ముద్దర్లు
దిక్కులయ్యే చప్పట్లు చప్పగయ్యే ముచ్చట్లు
ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ ముద్దుగా ముద్దు ముద్దర బరిలో

బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
అందమంత ఆరేసి ఆగలేనయ్యో ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో
ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని అరిచేలా అల్లుకోనా గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో

బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే




రుక్మిణి రుక్మిణి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి రాముడు (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: రవివర్మ , ఉష

రుక్మిణి రుక్మిణి రుక్మిణి రుక్మిణి
రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...
రుక్మిణి రుక్మిణి రుక్మిణి నన్ను చెయ్యమంది పట్టపగలు కొంటె పని
లుక్స్ లోని ఎక్స్ రేటు పెంచుతుంది పల్స్ బీటు లిప్స్ రెండు మిక్స్ చెయ్యమన్నది
నన్ను పెళ్ళిడేటు ఫిక్స్ చెయ్యమన్నది హేయ్

రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...

ఎర్రని మామిడి బద్దర రుచి చూడక పట్టదు నిద్దర
మమకారం ఘాటుకు మతిపోతుందమ్మో నా రుక్మిణి
మురిపాలును వేడిగ కాగని మది మీగడ తోడుగ వేయని
ప్రతి ముద్దుకు ముద్దులు కమ్మగ కలపనీ హొయ్
నాకు కంచమైన మంచమైన లంచమియ్యి
దోర కోరికంత కొంచమైన పంచనియ్యి
దీపమారినాక అందమంత హారతియ్యి రుక్మిణీ

రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...
రుక్మిణి రుక్మిణి రుక్మిణి నన్ను చెయ్యమంది పట్టపగలు కొంటె పని
లుక్స్ లోని ఎక్స్ రేటు పెంచుతుంది పల్స్ బీటు లిప్స్ రెండు మిక్స్ చెయ్యమన్నది
నన్ను పెళ్ళిడేటు ఫిక్స్ చెయ్యమన్నది

చిరు గజ్జలు గుఱ్ఱం రుక్మిణి జలపాతం దూకుడు రుక్మిణి
చిరునవ్వుల చాకుతో గుండెను కోసేదేనా రుక్మిణి
నిను వలచిన చిన్నది రుక్మిణి నువు పిలిచిన వస్తది రుక్మిణి
నువ్వంటే తెగపడి చస్తది రుక్మిణీ హొయ్
ఈడు కోడికూత కొచ్చెనేమో రుక్మిణి
సోకు కూడబెట్టి ఇచ్చి నీకు రుక్మిణి
కోడిపెట్ట పుంజు ఆటకింక సిద్దమంది రుక్మిణీ

రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...
రుక్మిణి రుక్మిణి రుక్మిణి నన్ను చెయ్యమంది పట్టపగలు కొంటె పని
లుక్స్ లోని ఎక్స్ రేటు పెంచుతుంది పల్స్ బీటు లిప్స్ రెండు మిక్స్ చెయ్యమన్నది
నన్ను పెళ్ళిడేటు ఫిక్స్ చెయ్యమన్నది హేయ్

రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...

Palli Balakrishna Saturday, July 22, 2017




చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: ప్రబాష్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాతలు: చంటి అడ్డాల
విడుదల తేది: 21.05.2004



Songs List:



జింకవేటకు సింహంలా వస్తా పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: హరిహరన్ , చిత్ర


జింక వేటకు సింహంలా  వస్తా 




ఆకాశం సాక్షిగా పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సోనునిగం, మహలక్ష్మి అయ్యర్


ఆకాశం సాక్షిగా 



నగరం పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మల్లికార్జున్


నగరం




గోవిందా పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కార్తీక్, శ్రేయ ఘోషల్ 


గోవిందా



అడుగేస్తే కడలైనా.. పాట సాహిత్యం

 
చిత్రం: అడవి రాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, మాలతి, సంగీత రాజేస్వరన్

అడుగేస్తే కడలైనా...దారిస్తుందీ
పిలిస్తే పొడి ఇసుకైనా...నీరిస్తుందీ..
మనసిస్తే  శిలైనా ప్రేమిస్తుందీ..హో
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ
ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ
కత్తులు తీర్చనిదీ కాటిచిన్న కాల్చనిదీ
గాలులు తుంచనిదీ జడివానలు ముంచనిదీ
ఆత్మకున్న అన్నిలక్షణాలు ప్రేమా
కృష్ణుడన్న గీతలోని భావమె ప్రేమా

జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ

ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ
చితినైనా బతికించే అమృతమే కాదా ప్రేమించే మనసంటే...
విధినైనా ఎదిరించ్చే నమ్మకమే రదా...ఆ మనసే నిదైతే...
అందుకే పద పద తెగించి ముందుకే సదా ఎదా తలొంచినందుకే
కదా ఇదంతా సహించి ఎందుకే వృదా  వ్యధా భరించి
చూస్తూ కూర్చుంటే బ్రతుకంతా బరువు కదా
బాధే బలమైతే ఎడబాటే బాటవదా
కొండనెత్తు సత్తు వున్న ఎంత ఘనులైనా

జంట చిచ్చు అంటుకున్న మంటనార్పగలరా
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ

ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ
నీకోసం జివించే చెలిమే వెలుగవదా నువు సాగే దారుల్లో...
నీపేరే ధ్యానించ్చే పిలుపే వినలేదా నిను తాకే గాలుల్లో..
ప్రాణమా నువ్వే ఇలా వెలేసి పోకుమా ఎటో అలా 
జతైన పాదమా నువ్వే ఇలా అసలిదిన్యాయమా క్షనమ్ క్షనమ్
వెన్నంటి ప్రేమా నావెంటే కడదాకా నీవుంటే నిప్పే నీరవదా
నిట్టూర్పే తూర్పవదా అష్ట దిక్కులడ్డువచ్చి నిన్ను ఆపగలవా
సప్తసాగరాలు దాటి నన్ను చేరలేవా...

జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ
ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ
ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ




ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: సంధ్యా , యస్. పి. బాలు

జనక జజ్జినక జనక జజ్జినక జనక జజ్జినక జా జా జా (2)

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నువ్వు కొంటె చూపు చూస్తేనే.! చలి చలి చలి చలి హా... చలి చలి

పారేసుకోవాలనారేసుకున్నావు అరె అరె అరె అరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హరి హరి హరి హరి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి

రంపంపం పరంపం రంపంపం పరంపం రంపంపం పరంపం రంపం పరపం

నా లోని అందాలు నీ కన్నులా ఆరేసుకోనీ సందేవెళ
హో నాపాట ఈపూట నీ పైటలా దాచేసుకోనీ తొలి పొంగులా

ఆ...నా లోని అందాలు నీ కన్నులా ఆరేసుకోనీ సందేవెళ
హే నాపాట ఈపూట నీ పైటలా దాచేసుకోనీ తొలి పొంగులా

నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
ఆ నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి చలిమంటకావాలీ...

నీ వింత కవ్వింతకే కాగిపోవాలీ...
నీ కౌగిలింతలోనే దాగి పోవాలీ...

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
హరి... హా... హరి... హా... హరి... హా... హరి... హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హాఁ హరి హరి హే హరి హరి

పారేసుకోవాలనారేసుకున్నావు
అరె... ఆఁ... అరె... ఆఁ... అరె... ఆఁ... అరె... ఆఁ

నీ ఒంపులో సొంపులే హరివిల్లు.! నీ చూపులో రాపులే విరిజల్లు
హా... నీ రూపు నా వలపు ఏరువాక నిను తాక నీలిమబ్బు నా కోక

నే రేగి పోవాలి
హా నేనూగిపోవాలి
నే రేగి పోవాలి
నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలీ...

ఈ జోడు పులకింతలే నా పాట కావాలీ...
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి...

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
హరి... హా... హరి... హా... హరి... హా... హరి... హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి హా చలి చలి హా హా చలి చలి
అరెరరె పారేసుకోవాలనారేసుకున్నావు అరె అరె అరె అరె
నీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హరి హరి హరి హరి

లాలా లాలా లాలా లాలా లల ఆఁ... లల ఆఁ... లల ఆఁ... లల ఆఁ

Palli Balakrishna Monday, July 3, 2017

Most Recent

Default