-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Jayanth C. Paranjee"



చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , కత్రినాకైఫ్, ఛార్మి
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: యమ్.ఆర్.వి.ప్రసాద్
విడుదల తేది: 05.10.2005



Songs List:



డిక్కీ డిక్కీ డీడిక్కీ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్ , చిత్ర

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి
డిక్కీ డిక్కీ డీడిక్కీ పరువాల పండక్కి
వచ్చానయ్యో చెక్కిలి ఎరుపెక్కి
వయ్యారాలే చప్పున బరువెక్కి
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
కొల్లగొట్టేసి పోనా తెల్లారేకల్లా
రారాదు బువ్వేలేరా శృంగార కోటకి

అష్టాచెమ్మాలే  చెమ్మచెక్కాలే
జరగాలి జామురేయి జాగారాలే
గుడు గుడు గుంచాలే చడుగుడు మంచాలే
ఈదాలి సంబరాల సాగరాలే

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి

చెరువుల్లో చేపలకై వెతికేస్తుంది కొంగ
చీకట్లో చీరంతా తడిమేస్తావ దొంగ (2)
సరసాల సమరంలో సరదాల సమయంలో 
తెరచాటు ఉంటే వేగేదెలా
అడిగింది ఏమైనా వీల్లేదు అన్నానా
బాహాటమైతే బాగోదుగా
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
అల్లాడించేసి పోనా తెల్లారేకల్లా
అయితే మరి వెళ్ళొద్దామ అనువైన చోటుకి

అల్లోనేరేల్లో అమ్మో నీకళ్లు
అచ్చంగా ఉన్నావమ్మో బొమ్మలాగ
పుల్ల మావిల్లో అపుడే వేవిల్లో
విడ్డురం చూడాలమ్మో అమ్మలాలో

తెలియంది తెలియాలంటే చదవాలయ్యో బుక్స్
చూసింది కావాలంటే కలపాలయ్యో లిప్స్ (2)
నీమాటలు ముదిరాయే అధరాలే అదిరాయే
అరుదైన దాహం తీరేదెలా
తాపాలే పెరిగాక తమకంతో రగిలాక
పడకింటి తీరం చేరాలిగా
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
గిల్లి గిచ్చేసి పోనా తెల్లారేకల్లా
దుప్పట్లో దూరేద్దామ బాబు సయ్యాటకి

బంగరు బుల్లోడే బంపరుగున్నాడే
మాటల్తో మాయచేసి లాగుతాడే
తుంటరి పిల్లోడే తొందరగున్నాడే
ఎన్నెన్నో తందనాలు ఆడుతాడే

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి





మల్లెల్లోన ఇల్లెయ్రా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్, సుజాత 

మల్లెల్లోన ఇల్లెయ్రా  ఇల్లెక్కేసి ఈలేయ్ రా



చినుకులాగా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ 
గానం: రంజిత్, సుచిత్ర 

చినుకులాగా 




మా సుబ్బలచ్చమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సునీత 

మా సుబ్బలచ్చమ్మ 



ఒంగోలు గిత్తరో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, మహలక్ష్మి అయ్యర్ 

ఒంగోలు గిత్తరో 




నేడే ఈ నాడే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: మల్లికార్జున్ , శ్రీవర్ధిని

(ఈ పాటను యన్.టి.రామారావు నటించిన భలే తమ్ముడు (1969) సినిమాలో నుండి  రీమిక్స్ చేశారు)

నేడే ఈ నాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..

వాలుకన్నుల వన్నెలాడివి వగలే చాలు నిరజాణ
దోర ఆశల దొంగ చూపుల చొరవే నీవు అనుకోన
వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా
ప్రేమంటే శృంగరమా రమ్మంటే చిరు కోపమా
మహా పెంకి మగువలు మీరు 
మనసైతె మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు

నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..

ఆరుబైటిలా కన్ను గీటడం ఔరా మీకు మర్యాదా
కంటి సైగకే పైట జారడం ఐనా తమకు బాగుందా
పైపైకి పరిహాసమా బెట్టంత చెలి కోసమా
పెదవుల్లో దరహసమా అదికూడ ఓ వేషమా
మహారాజు భోగులు మీరు మరి నాకు లొంగకపోరు
పరువాల మేనకగారు నను ఇంక విడిపోలేరు

నేడే ఈ నాడే కలిపింది కన్ను చెలి తానే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
అహ హా... ఆ ఆ ఆ 
అహ హా... ఆ ఆ ఆ 


Palli Balakrishna Sunday, October 15, 2017



చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: తరుణ్ , నహీద్ సైరుసి
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాతలు: ఆర్.అప్పలరాజు, ఎ. కె.కుమార్
విడుదల తేది: 02.12.2004



Songs List:



నన్నొచ్చి తాకింది పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్, గోపికా పూర్ణిమ 

నన్నొచ్చి తాకింది 



ఓ చంద్రమా పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: చిత్ర , మల్లికార్జున్

ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
యే నాటికీ నన్నే వీడి పోబోకుమా
చెలి నీవే నా ఆరోప్రాణం అంతున్నానే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
ఇక నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా

ఓ గోరింకా నూరేళ్ళింకా తొదే నీవై వుండాలిలే
ఓ నా మైనా యే జన్మానా నీకె జంటై వుంటానులే
నీ గుండెలోనా వున్నంత ప్రేమా
ఆ కళ్ళలోనా చూసా ఈ వేళా
చేసాక నిలపాలి బాస
ఇచ్చక మాటా విడిచేన బాట
విడిపోయే వరకు నా శ్వాసా

అంతా నీకే సొంతం అవుతా నీ ప్రేమంతా అందించుమా
అయితే నాకో ముద్దిస్తేనే ప్రేమిస్తాలే ఓ నేస్తమా
నేడే నీతోనా నేనవుతు వీణ
నీ పూలవాన స్వప్నాలలోనా
నిలువెల్ల పులకించిపోనా
నేనే నీవైనా ఆ వేణువులోనా రాగాలు రవళించుకోనా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా
యే నాడికా నిన్నే వీడి పోలేనుగా
ఇక నీవే నా ఆరొప్రాణం అంతున్నాలే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
సఖి నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా ఓ అందమా




వాన వాత్సాయన పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్ 
గానం: యస్. పి. చరణ్, సునీత 

వాన వాత్సాయన 



రాదు కదా పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, కల్పన 

రాదు కదా 



నోటిలోన పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: మల్లికార్జున్ 

నోటిలోన



చక్కరంటి పాట సాహిత్యం

 
చిత్రం: సఖియా (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: మనో, లెనినా చౌదరి

చక్కరంటి 

Palli Balakrishna Friday, September 22, 2017



చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , ఆసీన్
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 14.01.2004



Songs List:



దేవున్నే పిలిచావంటే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

దేవున్నే పిలిచావంటే 



అందంలో ఆంధ్రా కోస్తా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, శ్రేయా ఘోషల్

అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందో బస్తా
అంతేదో చూస్త జోరుగా
అందాలే చందాలిస్తా
మందార ఘంధాలిస్తా
రాసిస్తా నన్నే తేరగా

కస్సుల బస్సుల కారప్పొడి
కసి కసామిస నా దోపిడీ
కిస్సు కి మిస్ కి వెంటే పడీ
కధే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జీవ్వంటూ కవ్వించు
కుంటాను రావే మరి
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది హొయ్

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా

మత్తెక్కే అందాల మహిళామని
చెయ్యవే తియ్యగా పూబోణి
కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి
సయ్యంటూ కలిపాను చెయ్యి చెయ్యి
ఎత్తులే వెయ్యకు అబ్బాయి
అందుకైతే మోగనివ్వు సన్నాయి

గుచ్చుకుంటే నీకు ఏడు ముళ్ళు
చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు
హత్తుకున్నాక పుట్టేది ఆ హాయి హైలెస్సలే
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది హొయ్

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా

భామ నీ బాడీ కి భంధో బస్తు
సిగ్గులే దోచితే శ్రీరస్తు
కంటితోనే ఒంటి తేనే లాగేస్తూ
పొమ్మంటే రమ్మంటు నీతో చిక్కు
గాలిలో ముద్దుల మ్యూజిక్కు
లాహిరాల కళ్ళతోటి మ్యాజిక్కు
అః జబ్బ చూస్తే పచ్చ డబ్బ పండు
నువ్వు నవ్వుతుంటే నాకు మల్లె చెండు
ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లి పేరంటమే
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా
ఓ అందాలే చందాలిస్తా
మందార ఘంధాలిస్తా
రాసిస్తా నన్నే తేరగా

కసుల భూస్సుల కారప్పొడి
కసి కాసమిస నా దోపిడీ
కిస్సు కి మిస్ కి వెంటే పడీ
కథే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జివ్వంటూ కవ్వించు
కుంటాను రావే మరి
కుడికాలే కదిలింది
అరెరే కుడి కన్నె అదిరింది హొయ్



జడతోటి కొడితే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, సుజాత

జడతోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ
కన్నె చీరమ్మ బెణికింది నారాయణ
నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ
ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ

జడతోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

ప్రేమించి పెళ్ళాడినా... ఓ ఓ పెళ్ళాడి ప్రేమించినా... ఓ ఓ
ముందుకొచ్చినా, పక్కకొచ్చినా, మీదికొచ్చినా నేనేగా
కొపమోచ్చినా, కోరికొచ్చినా, దారికొచ్చినా నేనేగా
చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ
ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా
చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ
ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా
నీ ఆటే కట్టినా, నిన్నే ఆకట్టినా
ఆ తాళి కట్టేది నాకే కదా
కొత్త కౌగిళ్ళు కడుతుంటే నారాయణ
కొంగు గొంగళ్ళు పరిచింది నారాయణ
సోకు పెద్దిల్లు కడుతుంటే నారాయణ
సిగ్గు చిన్నిల్లు కూలింది నారాయణ

చాపేసి దిండేసినా... ఓ ఓ దిండేసి చాపేసినా... ఓ ఓ
సేవ చేసినా, దాడి చేసినా, గొడవ చేసినా నేనేగా
తప్పు చేసినా, ఒప్పు చేసినా, చెప్పి చేసినా నేనేగా
గిలిగిలి గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల
మరుమరు మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా
హోయ్ గిలిగిలి గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల
మరుమరు మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా
మోమాటం పెట్టినా, ఇరకాటం పెట్టినా
అడిగింది పెట్టేది నేనే కదా
సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ
సన్న నడువమ్మ నవ్వింది నారాయణ
పాలు పళ్ళన్నీ పెడుతుంటే నారాయణ
పట్టు పరుపమ్మ ఏడ్చింది నారాయణ

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ
కన్నె చీరమ్మ బెణికింది నారాయణ
నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ
ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ




మరుమల్లి జాబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, మురళీధర్ , శ్రీవర్ధిని

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమయి జరుగుతున్న పెళ్ళి
బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్ళి 

దేవుళ్ళు దేవతలు కొలువయిలేరు కొవెలలో
బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో
ఊరు వాడా వేడుకా ప్రతి ఒక్కరి హౄదయం వేదిక
లేనే లేదు తీరికా ప్రతి నిమిషం తెలియని తికమకా
మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో
మా వాళ్ళై అయినోళ్ళై ఒక చెయ్యేసినాయి మేళంలో
పందిరిలోన పండుగలన్ని నిలుపుతున్న పెళ్ళి
నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళి

మా నాన్నా మా అన్న ఇద్దరు నాకు పుట్టిళ్ళు
అందరికి సెలవంటు నేవెళ్ళి వొస్తా అత్తిళ్ళు
చల్లని చూపే కాటుకా ఇక తరగని ప్రేమే బొట్టుగా
మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా
ఆత్రాన్నయి సూత్రన్నయి ముద్దుగా వెస్తా బంధాలు
నేస్తాన్నయి నీ వాడ్నై నీ వద్ద వుంటా వందేళ్ళు
మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటయిన పెళ్ళి
కలిసిన మనసె శక్షిగా నిలిచే స్వచ్చమయిన పెళ్ళి





పప్పేసుకో చారేసుకో పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్

పప్పేసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో 
కన్నెసుకో కాలిసుకో ముల్లే వేసీ అల్లేసుకో
దమ్మున్నొడు భలే రిమ్మున్నొడూ
అయ్యాడు నీ వాడూ...
రమ్మన్నాడు అదె ఇమ్మన్నాడూ అమ్మమ్మో చీ పాడూ...

పువ్వుల్నే తెస్తాడు కొప్పుల్లో  పెట్టేయడు
నా చీర కుచ్చిళ్ళు తురిమేస్తాడు
చీకట్లో వస్తాడు చంపల్నే గిల్లేయడు
అరికాలే గీరేస్తుంటాడు
హే పట్టిమంచం ఊయలల్లే మార్చి మంత్రాలయ్యాడు
పట్టపగలు మంచివాడే రాత్రి మహా పిచ్చోడు హేయ్ 
వేషం మార్చి సరసం నేర్చి
రామయ్యే మళ్ళీ నీకోసం పుట్టాడు

అరె పప్పేసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో 
అరె కన్నెసుకో కాలిసుకో ముల్లె వేసీ అల్లేసుకో

బైటేమో గొప్పొడూ మొనగాడు రౌడి గాడు
ఈ రాణి సేవల్లో బంటౌతాడూ
దొంగల్నె పడతాడూ తిడతాడు కొట్టెస్తాడూ
పొంగుల్లొ డంగై పోతాడూ..

హే ఆకలేస్తే అన్నం కాదూ సోకె తింటానంటాడూ
దాహం వేస్తే నీరె కాదు నిప్పె తాగలంటాడూ..
ఏదో చేసీ నన్నే దోచీ ఏడాదిలోగానె నాన్నై పోతాడూ

పప్పెసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో
హ కన్నెసుకో కాలిసుకో ముల్లె వేసీ అల్లేసుకో
దమ్మున్నొడు భలే రిమ్మున్నొడూ
అయ్యాడు నీ వాడూ...
రమ్మన్నాడు అదె ఇమ్మన్నాడూ అమ్మమ్మో చీ పాడూ...




నాతోటి నీకు పనుంది పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తిక్, మహాలక్ష్మి అయ్యర్

నాతోటి నీకు పనుంది

Palli Balakrishna Wednesday, September 13, 2017




చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: పవన్ కళ్యాణ్ , త్రిష , కృతి కర్బంద
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 14.04.2011



Songs List:



ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, శ్రావణభార్గవి

ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే
ఆలె బాలే ఆలె బాలే ధూమ్‌ధామేలే
అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం
పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం
గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం
కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం
ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం
హాయి దారుల్లో సాగిపోదాం
మనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాడుతుందే


ఆలె బాలే ఆలె బాలే దుమ్ము రేపాలే
ఆలె బాలే ఆలె బాలే కెవ్వు కేకేలే
ఈగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం
సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం
గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం
అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం
రెండు మనసుల ఫీలింగ్సు ప్రింటు తీసుకుందాం
దాచుకోకుండా ఓపెనైపోదాం
మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం


ఆలె బాలే ఆలె బాలే పిచ్చ హ్యాపీలే
ఆలె బాలే ఆలె బాలే రచ్చరచ్చేలే
చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే
నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలే
నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం
వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం
స్పీడు మీద ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం
దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం
మనలా ఎవరుండలేరు అని వల్లకాదు
అని బల్లగుద్ది చెబుదాం



బార్బీ బొమ్మకి చెల్లెలివా పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: బెన్నీ దయాల్ , సుచిత్ర

ఓహో బస్తీదొరసానీ మస్తుగా ముస్తాబయ్యింది
గుండె చిటపట మంటూ నీకే డయలే చేసిందే 

వారేవా ధీరుడు నువ్వేరా
బలారేవీరుడు నువ్వేరా
చూపుల్తోనే చున్నినే లగే జాదూ నువ్వేరా

బార్బీ బొమ్మకి చెల్లెలివా 
బాబోయ్ ప్రపంచ సుందరివా
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే

వారేవా బస్తీ దొరసాని 
థోడా ముస్తాబయ్యింది 
గుండె చిటపట మంటూ నీకే డయలే చేసిందే 

బార్బీ బొమ్మకి చెల్లెలివా 
బాబోయ్ ప్రపంచ సుందరివా
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే

కోరుకున్నవి చేయిదాటిపోతే వెళ్ళిపోనిలే 
బాధ పడ్డం బెంగ పడిపోవడం మనకి రాదసలే
మగాడ నచ్చిన మొనగాడ నీకాడ ఏదో ఉన్నదిరా 
చూపుల్తోనే చున్నినే లాగే జాదూ నువ్వేరా
నాకు నచ్చినవి ఎక్కడెక్కడున్న వాలిపోతాలే
కింద పడ్డం లేచి దూసుకెళ్లడం మనకి మాములే 
ఎదిగిన బంగరు బాతురా ఇది నీకే దొరికెన రా 

వారేవా బస్తీ దొరసాని 
థోడా ముస్తాబయ్యింది 
గుండె చిటపట మంటూ నీకే డయలే చేసిందే 

గోకులంలో లేని సీత కోసం గోల మనకేలా 
కన్ను కొడితే రాధాలెంత మందో ట్రెండ్ మారిందే

వారేవా మాయా మసిన్చద్ర 
నీలో ఆ పొగరే నచ్చింద్ర 
నిన్నే చూసి బోడీలోనే బ్లాస్టింగ్ అవుతుందిరా
వెళ్ళిపోయిన రైలు బండి కోసం వేచి చూడాలా 
ఈల కొడితే మిస్సు బస్సులెన్నో  క్యూలె కడతాయే
పిట పిట బాటిల్ నేనురా ఎత్తేయ్ తొందరగా 

వారేవా బస్తీ దొరసాని 
థోడా ముస్తాబయ్యింది 
గుండె చిటపట మంటూ నీకే డయలే చేసిందే 




చిగురు బోణియ పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విశ్వా
గానం: విశ్వా

చిగురు బోణియ వలపు తేనియ జింకలేయు 
చొక్కరీలు తస్సదీయా 
మెరుపు మారియా తుళ్లేటి తానియా లల్లీ లకుముకులన్నీ మోగె మామామీయా
జలుగు జూలియా చెంగావి చెల్సియా చొరవ చూపి చేరువైతే చాంగు ఛెయ్య
సృజన సింథియ జులాయొలీవియా 
కళ్ళతోటి గిల్లు కూడా సో కు లవ్యా
దిట్టంగా పట్టేయ్ నా గుట్టంతా కొట్టేయ్ 
నా చుట్టంలా జట్టేయ్ బేబీ 
చేజిక్కి నా చుంబీన షాంపేనూ పొంగిన తెైతక్క రింగీల బేబీ
మగువ మారియా రిహన రోసియా చింగు ఛాంగు జింగు బ్యాంగు చిందులెయ్య

సుహన సిసీలియా బహన బూలియా సడేమీయా హడావిడికి తాళమేయ




గెలుపు తలుపులే పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రెహమాన్
గానం: శ్రీరామచంద్ర

గెలుపు తలుపులే తీసే ఆకాశమే 
నేడు నాకోసమే
అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీబంధమే
ఎటువైపుకు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా
మెరిసావే రంగుల్లోనా
కలతీరే సమయాన అల నేనై లేస్తున్నా 
అనుకుందే చేసేస్తున్నా
దారులన్ని  నాతో పాటుగా 
ఊయలూగి పాటేపాడగా 
నను వీడి కదలదు కాల మొక క్షణమైనా 

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే

ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే 
ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే 
సందేహమేది లేదుగా 
సంతోషమంత నాదిగా
చుక్కల్లో చేరి చూపగా
ఉప్పొంగుతున్న హోరుగా 
చిందేసి పాదమాడగా 
దిక్కుల్ని మీటి వీణగా
చలరేగి కదిలెను గాలి తరగలె పైన 

గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే

అలుపేరాదు అంటూ కొలిచా నింగి అంచులనే 
జగమే ఏలుకుంటూ పరిచా కోటికాంతులే 
ఇవ్వాళ గుండెలో ఇలా 
చల్లారిపోని శ్వాసలా 
కమ్మేసుకుంది నీ కల 
ఇన్నాళ్ళు లేని లోటులా 
తెల్లారిపోని రేయిలా 
నన్నళ్లుకుంటే నువ్విలా 
నను నేను గెలిచిన ఒంటరిగ నిలిచానే 

గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే




శ్రీ గంగా నీలాంటి పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: హేమచంద్ర, శ్రీవర్ధిని, బృందం

జై బోలో
శంకర మహారాజ్‌కీ
బోలో కాశీవిశ్వనాథ్‌కి
హర హర హర హర మహదేవ్ 

శ్రీ గంగా నీలాంటి మనసీయవే
జన్మంతా నీ బాట నడిపించవే
శివపూజను... శివపూజను కరుణించవే
ప్రియసేవలో తరియించు వరమియ్యవే
కాశీ వాసా సాంబశివ కాచే తండ్రి మహదేవా
పొంగే గంగే నీ చలవ కరుణకు లేదే ఏ కొదవ
మదిలో కోరిక తీరే మార్గం కావా

జై బోలో శంకర మహారాజ్‌కి
హర హర మహాదేవ్
జగమేలు శివశంకరా...
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా
చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు
కలగన్న మాట నిజమైపోతదిరా

చరణం: 1
నిప్పు నీరు రెంటినీ...
నిప్పు నీరు రెంటినీ జతగా నిలిపావుగా
విడ్డూరం చూపావుగా నీ లీలతో
నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా
అమావాస్య లేదుగా కలలో ఇలలో
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ
ఆలోచనలో నీ ఉనికి ఆశాదీపం రేపటికి
నీ దయ పొందిన పుణ్యం మాదైపోనీ

సనిపని సరి సనిపని సరి మపనిసా
సనిపని సరి సనిపని సరి మపనిసా
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి 
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి 
సరిసని దనిపమ గమనిప మగరినిసా
సరిసని దనిపమ గమనిప మగరినిసా

చరణం: 2
ఆరాధించే తొందర...
ఆరాధించే తొందర ఆగే వీల్లేదురా
మారేడై మనసుందిరా నీ ముందర
నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా
అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా
వీచే గాలే సాక్ష్యమట నింగి నేలే సాక్ష్యమట
ఆత్మాదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట
ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ




వయ్యారాల జాబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రెహ్మాన్
గానం: కారుణ్య

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నది వలె కదిలా నిలబడక
కలలను వదిలా నిను వెతక
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే
అలలై తపన తడిపినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై
జగాలు మెరిసెనులే...
నా ఎద గుడిలో నీ అలికిడిని
పదాలు పలుకవులే...
ఆణువణువూ చెలిమి కొరకు
అడుగడుగు చెలికి గొడుగు
ఇదివరకు గుండె లయకు
తెలియదులే ఇంత పరుగు
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై
శుభాలు తొణికెనులే
నీ శృతి తెలిపే కోయిల పిలుపే
తధాస్తు పలికెనులే
గగనములా విరిసి మెరిసి
పవనములా మురిసి మురిసి
నిను కలిసే క్షణము తలచి
అలుపు అనే పదము మరచి

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే

Palli Balakrishna Monday, July 31, 2017




చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
నటీనటులు: చిరంజీవి, సొనాలి బింద్రే
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: అక్కినేని రవిశంకర ప్రసాద్
విడుదల తేది: 15.10.2004



Songs List:



శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: మనో

శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. ఊ హా ఊ హా
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. ఊ హా ఊ హా
హొయ్...

హే బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్ట పిల్లమ్మో...
హే బేగంపేట బుల్లమ్మో...
పంజాగుట్టా పిల్లమ్మో
బాడీలోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో
హే చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో
హే...హైదర్ గూడా గున్నమో
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
అరె దోమల్ గూడ గుండమ్మో....
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
హైదర్ గూడ గున్నమ్మో
దోమల్ గూడ గుండమ్మో
వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్మో
నీ పేరేందబ్బాయా....
దా దా దా దా దా దా...

కో: శంకర్ దాదా... శంకర్ దాదా...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
హే శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

హే బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్టా పిల్లమ్మో...
ఎహె ఎహె ఎహె ఎహె

హే... నడవలేని వాళ్ళు ఉరికేలాగా
నే పెంచుకున్న కుక్క నొదులుతా  హె... హె...
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా
నే రాసుకున్న కవిత చదువుతా... హె...హె...హె...
అరె మూర్ఛపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా
మలయాళం ఫిల్ము చూపుతా.... హెయ్...
అరె జంతర్ మంతర్ జాలీ
అరె చూ  మంతర కాళీ నీ బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే మందు ఓరన్నా ...హొయ్....స్

నిన్న హేసరనప్పా
నన్న హేసరా...అహహహ....

కో: శంకర్ దాదా శంకర్ దాదా  ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదాఎం.బి.బిఎస్  
బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

చేతకానితనము టీబీ అయితే
నే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే....హే...హె...
అన్యాయాలు అధర్మాలు అక్రమాలు కాన్సరైతే
అంతు తేల్చు ఆన్సరుందిలే...
అరె మోసమున్న  బీ.పి. యమ స్వార్ధమన్న షుగరు
ప్రతి జబ్బుకీ వైద్యముందిలే
మరి అన్నిటికీ ఒకే మందులే  హా
కో: ఏం మందు గురూ.....?
ఏం మందా ...?  అహహహ....

కో: శంకర్ దాదా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
అరె హో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ కో జై బోలో

అరె శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్  ఊ హ ఊ హ (11)




నా పేరే కాంచనమాల పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్ , మాలతి లక్ష్మణ్ 

నా వయసే పాదరసం... నేనసలే చిన్న రసం
నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం
నా సోకు పూలవనం నా చూపు నీకు వరం
అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం... ఓయ్

హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
తందాన తాన అంటు మోగనీ తబలా
హేయ్ రావే నా రస రంగీలా నీ గుట్టే నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా
నీదేరా రాకుమారా దోర దోర ఊడుకుల ఊయ్యాలా
ఊ... నన్ను అల్లుకో అల్లుకో
ఆ...నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో చంపుకో... ఓ...ఓ...ఓహ్
ఊ... నిన్ను తాకనా తాకనా
నిన్ను చుట్టుకోనా హే...
ముద్దు పెట్టనా పెట్టనా...హొయ్...

హాయ్యో  హాయ్యో  హాయ్యో  (4)

ఆ నీ రాకలో రాపిడుంది నా సోకుల దోపిడుంది
నీ దొంగ చుపుకే నా బెంగ తీరనా నీవుండిపో రాత్రికి
నీ మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా తెల్లారదీ ఆటకి
మాయాబజార్ మల్లెపూలకి వేలాల వెర్రి నాకు రేగే
పారాహుషార్ పట్టుచిక్కెరో మామా ఓ మామా ఓ మామా
కావాలిలే కజ్జికాయలే నీ గిల్లి కజ్జికాయలే
ఆడాలిలే గచ్చకాయలే భామ ఓ భామ ఓ భామ

ఊ...నన్ను అల్లుకో అల్లుకో 
ఆ నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో  చంపుకో...ఓ...ఓ...ఓహ్

హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
తందాన తాన అంటు మోగనీ తబలా

ఓలమ్మో...
నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెలో గుచ్చుకుంది
ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఎప్పుడూ
నీ సూపులో సూదివుంది సూదంటులా లాగుతుంది
నీవంటు తొక్కిన నావంటి చెక్కన నేమోయలేనిప్పుడు
బస్తీ సవాల్ బాలీవుడ్ లో చిత్రాంగి చీర కట్టదాయె
చారుమినార్ సెంటుబుడ్డివే భామ ఓ భామ ఓ భామ
తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే
ముట్టించనా ముంజకాయలే మామా ఓమామా ఓ మామా

ఊ... నన్ను అల్లుకో అల్లుకో
ఆ... నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో చంపుపో...ఓ....ఓ..ఓహ్
హొయ్...నా పేరే - కాంచనమాల
నావయాసే - గరమ్  మసాలా
తందాన తాన అంటు మోగని తబలా
హే...రావే నా - రస రంగీలా
నీ బుగ్గే  - నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా లా లా
హే...ఊయ్....ఆ....ఆహ...



చైలా చైలా చైలా చైలా పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్  
గానం: చిరంజీవి, కె.కె

కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు
లైలా మజ్నూలకు తెలుసు 
పారు దేవదాసులకు తెలుసు
ఆ తరువాత తమకే తెలుసు

ఇదిగో తమ్ముడూ...
మనకీ ఓ లవ్ స్టోరీ ఉందమ్మా వింటావా ఆ

ఓ యస్   ఓ యస్

హేయ్...చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హేయ్...చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హొయ్ లా హొయ్ లా హొయ్ లే హొయ్ లా
నడక చూస్తే చిక్కుబుక్కురైలా
గులాబిలాంటి లిప్పుచూసి నా పల్సురెటే పెరిగింది
జిలేబిలాంటి హిప్పుచూసి నా హర్టు బీటే అదిరింది
పాల మీగడంటి రంగుచూసి  నా రక్తమంతా మరిగింది
నా ఏరియాలో ఎప్పుడూలేని లవ్వేరియా నాకు అంటుకుంది

ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా చైలా  చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా

తర్వాతేమయ్యిందన్నా...
ఏమయిందా...ఆ రోజువరకూ హాయిగా 
ఎలాపడితే అలా తిరుగుతూ గడిపేసేవాణ్ణి
కానీ ఆ రోజు నుంచి 
తిరుగుళ్ళు నో చాన్స్...దాదాగిరి...నోచాన్స్... 
ఓన్లీ రొమాన్స్...

ఊ...తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా
తెల్లావారుజామునే జాగింగే చేశా
డే...వన్...దమ్ము కొట్టడం వదిలేశా
డే... టూ...దమ్ముదులపటం ఆపేశా
డే...త్రీ... పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
హొ యా ఇంటి ముందరే టెంటువేశా
హొ యా ఒంటికందిన సెంటు పూశా
హొ యా మంచినీళ్ళ లారీ దగ్గర బిందెకూడా బ్లాకుచేశా
ఆ దెబ్బతో చిన్న చిర్నవ్వుతో ఫేసు నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది
అదెమిటో మరి ఆ నవ్వు తో నా మనసంతా రఫ్ఫాడేసింది

ఓ మాయా ఓ మాయా ఈప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా చైలా చైలా చైలా...

జీవితంలో దేనీ మీదా ఆశపడని నేను
ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కలలుకన్నాను ఆ అమ్మాయి 
నాకే సొంతం అనుకున్నాను
కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలీదు
ఆ అమ్మాయికి  పెళ్ళయిపోయింది...

కళ్లలోన కలలు అన్నీ కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెలే

మరి తర్వాత ఏమయింది....
హు...తర్వాత...తర్వాత ఏమౌతుంది

ఆ మరుసటిరోజు ...
మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందీ

ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా  చైలా  చైలా  చైలా .....
ఇదర్ ఆ...ఏంటిరా మీ కుర్రవాళ్ల గోల

చూడు తమ్ముడూ 
ప్రేమ అనేది లైఫ్లో ఓ చిన్న పార్టేకానీ ప్రేమే లైఫ్ కాదు
ఆ మాత్రం దానికి అమ్మాయికోసం
ప్రాణాలు తీసుకోవటం లేదా 
ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం...
క్షమించరాని నేరం అండర్ స్టాండ్

ఓడిపోవటం తప్పుకాదురా 
చచ్చిపోవడం తప్పు సోదరా
చావు ఒక్కటే దారంటే 
ఇక్కడుండే వాళ్లు ఎంతమందిరా
జీవితం అంటే జోక్ కాదురా 
దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ రా
దాన్ని మద్యలో కతమ్ చేసే 
హక్కు ఎవరికీ లేదురా
నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా
అరె బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా
దాటేయరా అడ్డు దాటేయరా 
ఏ ఓటమీ నిన్ను ఇక ఆపలేదురా

ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా



ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: అద్నన్ శామి, కల్పన

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా (2)
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఇరవై మూడు జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా
ఇరవై నాలుగు నీ నడుము కొలత ఐతే చాలులే
ఇరవై ఐదు నిముషాలలోనే కవ్విస్తాను రావే మైనా
ఇరవై ఏడు ముద్దుల్ని పెట్టి 
తకిట  తకిట  తకిట తకిట తా

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా (2)

హెయ్ నువ్వట్టా జల్సా పూర్ సిగ్నల్నే దాటేస్తా
నేనట్టా సిగ్గాపూర్ సిగ్నల్ నే దాటేస్తా
నువ్వట్టా మనసాపూర్ సెంటర్ లో మాటేస్తే
నేనట్టా సరసాపూర్ సెంటర్ లో వాటేస్తా
కమ్మేస్తాను కొకాకుళంలోరాజేస్తాను రాణిమండ్రి
ఊరిస్తాను ఊపేశ్వరంలో ఉడికిస్తానులే
మురిపిస్తాను మద్దాపురంలో చేరుస్తాను సోకునాడ
సాగించాలి హింసాచలంలో  
తకిట తకిట  తకిట  తకిట  తా

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా (2)

కో: ఏ జిల్లా .....ఏ జిల్లా...

ఓ నీలోని అందం చందం అదిరేబాదవుతుంటే
నాలోని ఆత్రం మొత్తం ముదిరేబాదయిపోదా
నువ్వట్టా కన్నేకొట్టి గిల్లూరు రమ్మంటే
నేనిట్టా మూటేకట్టి ఒళ్ళూరు రాసేస్తా
చంపాపేట సరిహద్దు దాటి పెదవుల పాడు చేరుకుంటా
ఆ పై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే
పగలే కానీ రాత్రైన గానీ నిదురానగరు వెళ్లనంటా
పక్కలపల్లి పొలిమేరలోనే  
తకిట  తకిట  తకిట తకిట  తా

ఏ ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఆ జిల్లా ఆ జిల్లా పిల్లోడా నాది ఆజిల్లా
దాచెయ్ నా దుప్పట్లో మరుమల్లె పూలజల్లా




పట్టు పట్టు చెయ్యే పట్టు పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సాహితి 
గానం: మణిక్క వినయాగం , సుమంగళి 

పట్టు పట్టు చెయ్యే పట్టు 




సండే పొద్దుల్ల తాండె పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సాహితి 
గానం: శంకర్ మహదేవన్ , కల్పన


సండే పొద్దుల్ల తాండె

Palli Balakrishna Friday, July 28, 2017



చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, రంభ, రచన
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: నాగేంద్ర బాబు
విడుదల తేది: 09.04.1998



Songs List:



ఆంటీ కూతుర అమ్మో అప్సర పాట సాహిత్యం

 
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్. పి. బాలు, చిత్ర

ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది (2)
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది
వడ్డాణం తొందరన్నదీ వెడ్డింగే సిద్ధమైనదీ
పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా
గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా

ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా
గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా

ఆంటీ కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ

చరణం: 1
ఆదివారమర్ధరాత్రి వేళలో ఆ అల్లరంత మరిచేదెట్టా
సోమవారమాడుకున్న ఆటలో ఆ హాయికింక సరిలేదంట
వంటఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో
వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబలో
ఎట్టా లెక్కెట్టినా పిట్టా నీ ఒంటిలో పుట్టుమచ్చలున్నవి ఏడు
ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు ఇటువైపు చూడసాగే వేయికళ్ళు
ముద్దు మురిపాలు అంటే గిట్టనోళ్ళు
మున్ముందు జన్మలోన కీటకాలు

ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ

చరణం: 2
ఇంచుమించు ఇరువై ఆరు నడుముతో నువ్వు కదిలితే సాగదు కాలం
నిబ్బరంగ డెబ్భై ఆరు బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
గోల్డ్ చైన్ సాక్షిగా యెన్ని గోటిముద్దలో
హెయిర్ పిన్ సాక్షిగా యెన్ని హాట్ గుర్తులో
కైపే పుట్టించిన చిట్టా ఒకటుందిగా కొండవీటి చాంతాడంతా
పెళ్లే కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా
ముళ్ళే పడలేదు గాని సుబ్బరంగా థ్రిల్లేదో నాకు తెలిసే రంగ రంగా

ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా
గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా

ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ





చల్నేదో ఘాడి పాట సాహిత్యం

 
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో

చల్నేదో ఘాడి దొరక్కపోదుర జోడి 
తెలుగోడి వాడి చాలాగ్గా చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాస మవ్వగ భలేగ బతికెయ్ రా
మిఠాయికోర్కెల చిటారుకొమ్మన గిటారు మీటెయ్ రా

చల్నేదో ఘాడి దొరక్కపోదుర జోడి 
తెలుగోడి వాడి చాలాగ్గా చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాస మవ్వగ భలేగ బతికెయ్ రా
మిఠాయికోర్కెల చిటారుకొమ్మన గిటారు మీటెయ్ రా

కోటలో పవళించేటందుకు రాసే ఉంది
మన హార్ట్ లో ఒకరుండేటందుకు ప్లేసే ఉందోయ్
ఇంట్లో జలకాలాడేందుకు సవరే ఉందోయ్
మన ఒంట్లో లవ్వాడేటందుకు పవరే ఉందోయ్
శాట్లైట్లు ఇన్సాట్లు లోకాన్ని ఏలే కాలం
సరదాలు సరసాలు వదిలేస్తే మనకే నష్టం

చల్ చల్నేదో ఘాడి దొరక్కపోదుర జోడి 
తెలుగోడి వాడి చాలాగ్గా చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాస మవ్వగ భలేగ బతికెయ్ రా
మిఠాయికోర్కెల చిటారుకొమ్మన గిటారు మీటెయ్ రా

నన్నే గురిపెట్టేటందుకు దునియా ఉందోయ్
పగవాన్నే ఓదార్చేటందుకు ఇండియా ఉందోయ్
ఫ్రీగా తెగ పెరిగేటందుకు క్రాఫే ఉందోయ్
హ్యాపీగా గడిపేసేటందుకు లైఫే ఉందోయ్
డిస్కోలు డేటింగ్లు చేస్తుంటే మాయాజాలం
బుద్ధావతారంలా బజ్జుంటే లేదోయ్ లాభం

చల్ చల్ చల్నేదో ఘాడి దొరక్కపోదుర జోడి 
తెలుగోడి వాడి చాలాగ్గా చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాస మవ్వగ భలేగ బతికెయ్ రా
మిఠాయికోర్కెల చిటారుకొమ్మన గిటారు మీటెయ్ రా




మత్తెక్కి తూగే మనసా పాట సాహిత్యం

 
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, ఫెబి మణి

మత్తెక్కి తూగే మనసా ఏమైందో ఏమో తెలుసా
వేదిస్తావేంటి వయసా నీక్కూడా నేనే అలుసా
తానేదో చేయి జారి తాకేనే ఒక్కసారి
ఆ మత్తే నన్ను చేరి అల్లింది హద్దు మీరి నాకేంటి దారి

మత్తెక్కి తూగే మనసా ఏమైందో  నీకు తెలుసా
వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా

ముద్దా తలుపులే మూసినా ఏకాంతమే లేదే 
నిజం తెలిసినా నమ్మవే నువ్వే ఒంటిగ లేవే
అంతా అదే అన్నది అర్ధం ఏమై ఉంటది నిత్యం నీలో ఉన్నది నేనే కదా అన్నది 
కనివిని ఎరుగనది కడున

మత్తెక్కి తూగే మనసా ఏమైందో  నీకు తెలుసా
వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా

వేలే తగిలితే ఒళ్లిలా వీణై పలుకుతుందా
ఆ గాలే తడిమితే ఇంతలా ప్రాణం ఉడుకుతుందా
వీచే గాలే నీవై విచ్చాసావే వెచ్చగా
విచ్చే పూవ్వే నీవై ఇచ్చేస్తావా కానుక
చిలిపిగ చిదుముకుపో త్వరగా

మత్తెక్కి తూగే మనసా ఏమైందో ఏమో తెలుసా
వేడెక్కి వేగి వయసా చిత్రంగా ఉందే వరసా
తానేదో చేయి జారి తాకేనే ఒక్కసారి
ఆ మత్తే నన్ను చేరి అల్లింది హద్దు మీరి నాకేం దారి
మత్తెక్కి తూగే మనసా ఏమైందో  నీకు తెలుసా
వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా




నవమి దశమి తగిన రోజులు పాట సాహిత్యం

 
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, సుజాత

నవమి దశమి తగిన రోజులు 
యువతి యువకుల తపనలకు
మకరం మిథునం వృషభ రాశులు
అనుకూలించును రసికులకు
దొరికినది సమయం ఓ... 
విరహంతో సమరం
సాయం అందించు ఆలించు పాలించు 
బిడియం చాలించు చుంబించు చిగురించు

నవమి దశమి తగిన రోజులు 
యువతి యువకుల తపనలకు

ప్రాయం పెరటిలో లతలు అడిగే
తొలకరి చినుకువు నువ్వే
సాయం సంధ్యలో స్వాగతించే పడమర ప్రమిదవు నువ్వే
చెంగావి రంగుల్లో చేరని 
కంగారు రాగలే తీయని
దీపం వెలిగించు ఒడిపంచు చలి దించు 
తాపం వివరించు వినిపించు వికసించు

నవమి దశమి తగిన రోజులు 
యువతి యువకుల తపనలకు

స్వర్గం దారిలో పరుగు తీసే పరువపు పరవడి నీదే
సర్వం దోచగా ఎదురు చూసే మధనుడి ఉరవడి నీదే
కావేరి పొంగుల్లో బుడగని 
కస్తూరి తిలకాలే కరగని
మైకం కలిగించు కవ్వించు కరిగించు
మంత్రం పలికించు పులకించు పవళించు

నవమి దశమి తగిన రోజులు 
యువతి యువకుల తపనలకు
మకరం మిథునం వృషభ రాశులు
అనుకూలించును రసికులకు
దొరికినది సమయం ఓ... 
విరహంతో సమరం
సాయం అందించు ఆలించు పాలించు 
బిడియం చాలించు చుంబించు చిగురించు




సారీ సారీ సారీ పాట సాహిత్యం

 
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో, సుజాత

సారీ సారీ సారీ
సో సారీ సారీ సారీ
హేయ్

సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారి
ప్యారీ బ్రహ్మచారి మన్నించేయ్ ఈ సారి
నిన్నే ఏరి కోరి చేరిందోయ్ చిన్నారి
నువ్వేలేని దారి సహారా ఎడారి
తాగించాలా బిస్లెరి ఏయ్ తినిపించాలా కేడ్బరి
అందించాలా స్ట్రాబెర్రీ కొంచం మారాలి నీ వైఖరి

సో సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారి
ప్యారీ బ్రహ్మచారి మన్నించేయ్ ఈ సారి

లవ్వులోన చిన్న తప్పులే కామన్ కమాన్
నవ్వమంటు వేడుకున్నది సాజన్
ఆ నింగి రాలిందా అట్లాంటిక్ పొంగిందా
తూఫాన్ రానుందా అనుబాంబ్ మీద పడనుందా
మూడీగా ఉండొద్దయ్యా నన్నే ముద్దుల్లో ముంచాలయ్యా
హేయ్ దూరంగా వెళ్ళొద్దయ్య నన్నే ఘాడంగా వాటెయ్ ప్రియా

సారీ సారీ సారీ, సో సారీ సారీ సారీ

మొదటిసారి ఇలా జరిగితే కలహం హోయ్
ముందు ముందు కలిసి ఉండుటే ఖాయం
జూన్ ఎండ ముగిసాక జూలై వాన వస్తుంది
నీ తీరు చూశాక తలకే ఆవిరవుతుంది
మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్ గా నెగ్గావమ్మో యమ్మో...
మాయేదో చేసావమ్మో నన్నే మొత్తంగా మార్చావమో

జాని జాని జాని విన్నా నీ కహానీ
రాజా హిందుస్తానీ మెచ్చాడే నీ బాణీ
చీకు చింత మాని అందించేయ్ జవాని
ఏదేమైనా కాని జైబోలో భవాని
లల లల లాలా లాలా (4)

Palli Balakrishna



చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
నటీనటులు: వెంకటేష్ , ప్రీతీ జింటా
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాతలు: బూరుగపల్లి శివరామకృష్ణ , కె.అశోక్ కుమార్
విడుదల తేది: 30.10.1998



Songs List:



నైజాం బాబులు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో , స్వర్ణలత

నైజాం బాబులు నాటుబాంబులు
అతిదులు మీరండీ ఆర్డరు వేయండీ
చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ
కోర్కెలు చూపండీ
వదువు మా ఫ్రెండ్‌ ఆడీడవరుడు మావడండీ
సేవలను పొందండి చేసుకోండి 

జర్ధాలూ పాన్‌ మసాలులు పట్టుకురండీ
జల్దీగా కోల్డ్‌ప్లాపులు కొనుక్కుతెండీ
పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
పొగతాగితే మగతనమే ఉష్‌కాకంటుందీ
పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్దులు మీరండీ పద్దతి మార్చండీ

ఉడకని పప్పులు నోటిగొప్పలు కోతలు
మానండీ మౌతులు మూయండీ
తొందరగా నల్లకొంగను తీసుకురండీ
తక్షణమే కొండమీది కోతిని తెండీ
మసి పూస్తే మీరేమో కొంగవు తారండీ
ఆ మీ ఫ్రేండు ఉండంగా కోతెందుకులెండి
తింగరి బాబులు వెర్రికుంకలు గొర్రెలు
మీరాండీ బుర్రలు పెంచండీ
తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాలండీ మాది మగజాతండీ తాలికట్టే
వేళా తలోంచాలి తప్పదు




నాలో ఉన్న ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో , స్వర్ణలత

నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా 
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా 
సరదాతీరగా ఊయంటనుగా
మనల్నే చూడగా ఎవరూ లేరుగా 
మనసే పాడగా అడ్డేలేదుగా

ఇద్దరికీ వద్దిక కుదరక 
ఇష్టసఖీ వద్దని వదలక
సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి
తపించి తతంగ మడగగా

రెప్పలలో నిప్పులే నిగనిగ 
నిద్దురనే పొమ్మని తరమగ
ఇప్పటితోప్పుడు దిరకక వయ్యారి వయస్సు
తయారయిందిగా 




వయసా చూసుకో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా
సొగసా చేరుకో వరసే అందుకో నికిది తొలి వేగం
ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
ఓ ఊహకందని భాషా నేర్చుకోమనసా
ఓ సామిరారా ప్రేమంటే ఇదేరా
నాసితారా ప్రేమంటే ఇదే రా

రేయిభారం రెట్టింపయిందీ లేవయారం నిట్టూరుస్తుందీ
రాయబారం ఇట్టేచెప్పిందీ హాయ్ భేరం గిట్టేలా ఉందీ
మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయమడిగే ప్రేమంటే ఇదేరా

తేనె మేఘం కాదా నీదేహం కూనేరాగం కోరే నాదాహం
గాలివేగం చూపే నీ మోహం తాకగానే పోదా సందేహం
పాడమంది ప్రేమంటే ఇదేరా
రాయమందీ ప్రేమంటే ఇదే 





మనసే ఎదురు తిరిగి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

మనసే ఎదురు తిరిగి మాటవినదు
కలిసే ఆశ కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగ కొత్త మైమరపు

కలలో మొదటి పరిచయం గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా అలలోనే నీ కొలువా
చెలిమైన వెన్నెలవా నిజమైనా నా కలవా
నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా

చినుకై కురిసినది కదా చిలిపి సరదా
అలలై ఎగసినది కదా వలపు వరద
మనసే తడిసి తడిసి పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి తగుదారి కనపడదా
వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా



ఏమో ఎక్కడుందొ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఏమో ఎక్కడుందొ కుసే కొయిల
నాతొ ఎమిటందొ ఉహించెదెల
ఎదలొ ఊయల ఊగె సరిగమ
ఏదొ మాయల అలె మధురిమ
ల ల ల లా ల ల లా ల లా ల ల
ల ల ల లా ల ల లా ల లా ల ల



ఓ మేరి బుల్ బుల్ తార పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: రమణగోగుల

ఓ మేరి బుల్ బుల్ తార 




బొంబాయి బొమ్మ సూడరా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: రమణగోగుల

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టరా
బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో 

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టరా
బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో 

సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తా
పిండివంటలు గుమాగుమా చేయిస్తా
వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా
ఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తా
బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా
బాజాలకు కబురుపెట్టవోయ్
ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగా
మాపైనే జులుం ఏమిటోయ్

స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాం
దగ్గరుండీ తలంబ్రాలే పోస్తాం
లగ్గంలోని తతంగమే చేస్తాం
అడుగులు ఏడు నడిపించేస్తాం పెళ్ళే నాదని భావించేస్తా
చాకంటీ చురుకు నీదిరోయ్ నీసిగతరగా
నీకెంతా చొరవ ఉందిరోయ్
ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్ నీ సిగతరగా
నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్


Palli Balakrishna Monday, July 24, 2017



చిత్రం: ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్, మణిశర్మ 
నటీనటులు: వెంకటేష్, అంజలీ జవేరి
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: డి. సురేష్ బాబు
విడుదల తేది: 09.05.1997

(గమనిక: ఇందులోని మూడు పాటలు మణిశర్మ గారు కంపోజ్ చేశారు )



Songs List:



అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది  పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది 
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది 
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది 
ప్రేమించుకుందాం రా నేస్తం 
మన వయస్సు తపస్సు తరించు వరమిది

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది 
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది 

చరణం: 1 
ప్రతీ జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ 
అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా 
అదే పాట నాదాకా ఎలా చేరెనమ్మా 
ప్రతీ బాట నావైపే నిన్నే పంపెనమ్మా 
నిరంతరం నీ ఊసేదో నను రమ్మన్నది 
ప్రతీక్షణం నీ ధ్యాసేగా కలవరించి 
వరించి రతించుతున్నది

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది 
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది 

చరణం: 2 
అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా 
తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా 
వెలే వేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం 
ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం 
రహస్య రాజ్యం చేరే జత కధే ఇది 
సుఖాల తీరం కోరే మన ప్రయానమివాళ 
ఫలించు క్షణమిది

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది 
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది 
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది 
ప్రేమించుకుందాం రా నేస్తం 
మన వయస్సు తపస్సు తరించు వరమిది

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది 
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది 





సూర్య కిరీటమే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, అనురాధా శ్రీరామ్

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ 
నీ సరి ఎవ్వరు లేరే భామ
నీ తోనే పుట్టింది ప్రేమా

కణ్వ శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వనవాసినీ కావేరి

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా

సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరగని తేనె పువ్వా 
సౌందార్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేరరావా

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి



మేఘాలే తాకింది హాయి హైలెస్స పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
చేలరేగాలి రమ్మంది హల్లో అంటూ
ఒళ్ళోవాలే అందాల అప్సరస

మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ
అల్లేసింది నీ మీద నా ఆశ

ఆ...ఆ...ఆ...

తొలిసారి నిను చూసి మనసాగక
పిలిచానే చిలకమ్మ మెల మెల్లగ
తెలుగంత తీయంగ నువ్వు పలికావే స్నేహంగా
చెలిమన్న వలవేసి నను లాగగా
చేరాను నీ నీడ చల చల్లగా
గిలిగింత కలిగేలా తొలి వలపంటే తేలిసేలా
హా కునుకన్న మాటే నను చేరక
తిరిగాను తేలుసా ఏం తోచక
 
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా 

ఆ...ఆ...ఆ...

తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా
నిలువెల్ల పులకింత చిగురించగా
దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది ఈ వింత
ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
నిజమేదో కల ఏదో మరిపించగా
పగలేదో రేయేదో రెండు కలిశాయి నీ చెంత 
ప్రేమంటే ఇంతే ఏమో మరి
దానంతు ఏదో చూస్తే సరి

మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా 
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ...
అల్లేసింది నీ మీద నా ఆశ
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా





అంబరాల కోటలో (చిన్ని చిన్ని గుండెలో ) పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

అంబరాల కోటలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా 
సన్నజాజి తీగలా ప్రియుణ్ణి ఎట్ట హత్తుకుంది చూడరా 
లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా 
వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా 

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా 
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా 
నీడలాగ తోడు ఉంటా పారిజాతమా 
గుండెలోనే దాచుకుంటా నిన్నే ప్రాణమా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా 

చరణం: 1 
నీ వాకిట ముగ్గునౌతా సందెపొద్దు వాలినాక సిగ్గునౌతా 
నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్న మావి చెట్టునవుతా 
నా నవ్వులే నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా 
కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా 
ప్రేమ కన్న గొప్పదేది సృష్టిలోన లేదురా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా 
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా 

చరణం: 2 
ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన 
చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా 
ఆ మాటే చాలునంట ఎన్ని బాధలైన నేను ఓర్చుకుంటా 
నీ చేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేను ఇచ్చుకుంటా 
సృష్టిలోనే అందమైన ప్రేమజంట మీదిరా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా 
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా 

ఆ నుదుటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను
మల్లె పూల మీద ఒట్టు మాట దాటను

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడరా
చిన్నదాని కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడరా
లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా 
వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా 




పెళ్లికళ వచ్చేసిందే బాలా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర , స్వర్ణలత

పెళ్లికళ వచ్చేసిందే బాలా 
పల్లకిని తెచ్చేసిందే బాలా 
హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా 
ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా 
తద్దినక తాళం ఉంది ఆజా ఆజా 
మంటపం రమ్మంటుంది ఆజా ఆజా 
జంటపడు వేళయ్యింది ఆజా ఆజా

పెళ్లికళ వచ్చేసిందే బాలా 
పల్లకిని తెచ్చేసిందే బాలా 

చరణం: 1 
అక్షితలు వేసేసింది షాదీ 
అడ్డు తెర తీసేసింది షాదీ 
స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్ 
ఇష్టపడు కన్యాదానం లేజా లేజా 
జానేమన్ ఏ దుల్హన్ కో లేజా లేజా 
మై డియర్ హబ్బీ ముజ్కో లేజా లేజా 
ఆశపడు అందం చందం లేజా లేజా

అక్షితలు వేసేసింది షాదీ 
అడ్డు తెర తీసేసింది షాదీ 

చరణం: 2 
ఆలుమగలైపోయామే భామా 
అసలు కధ భాకీ ఉంది రామ్మా 
అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా 
మల్లెలతో మంచం సిద్దం దేఖో దేఖో 
అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో 
మన్మధుని ఆహ్వానిద్దాం దేఖో దేఖో 
ముద్దులతో సన్మానిద్దాం దేఖో దేఖో

ఆలుమగలైపోయామే భామా 
అసలు కధ భాకీ ఉంది రామ్మా 
అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా 




ఓ పనైపోతుంది బాబు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో

పల్లవి:
చదువుకి టాటా చేప్పేస్తే.. ఓ పనైపోతుంది బాబు
బుక్సును అటకే ఎక్కిస్తే.. ఓ పనైపోతుంది బాబు
రోడ్డులు సర్వే చేసేస్తే.. ఓ పనైపోతుంది బాబు
ఊరును మొత్తం చుట్టొస్తే.. ఓ పనైపోతుంది బాబు
ఫ్రీ పక్షుల్లాగా తిరిగేస్తే పొద్దేక్కే దాకా నిదరోతే..ఏ..

ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు

చరణం: 1
బ్యూటీ బేబీకికి బీటేస్తే.. ఓ పనైపోతుంది బాబు
బాటాతో తను బదులిస్తే.. ఓ పనైపోతుంది బాబు
గువ్వల కోసం గుడికెళ్తే.. ఓ పనైపోతుంది బాబు
ఆ తప్పుకు చెప్పులు మిస్సైతే.. ఓ పనైపోతుంది బాబు
మిడ్-నైటుకు ఇంటికి దయ చేస్తే.. దొంగనుకుని కుక్కలు తరిమేస్తే..ఏ..

ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు
ఒ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు

Yo Mama.. so no one makes me too cool
things all work so well come on
speak it out a sensation

అందరి హాజరు ఒకడే పలికే హుంగామా ఇక లేదు
ఔరంగజేబ్ రూలింగ్ గురించి నోరెత్తే పని లేదు
హాలిడేకై ఎదురే చూసే అవసరమే ఇక రాదు
అక్బర్ చేసిన ఘనకార్యాలు అసలే అక్కర్లేదు
మర్కుల మాటే మరిచేస్తే ర్యాంకుల గొడవే వదిలేస్తే
నిన్నటి బూజును దులిపేస్తే రేపటి రోజును కొలిచేస్తే..ఏ..

ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు

చరణం: 2
ఇంగ్లీష్ ఫిల్ముకి చెక్కేస్తే.. ఓ పనైపోతుంది బాబు
అక్కడ నాన్నే ఎదురొస్తే.. ఓ పనైపోతుంది బాబు
ఎంట్రమ్స్ పేపర్ లీకైతే.. ఓ పనైపోతుంది బాబు
ఎక్జామ్ వాయిదా పడిపోతే.. ఓ పనైపోతుంది బాబు
లవ్ లెటర్ పోస్టులో వచ్చేస్తే.. చిరునామా తప్పని తెలిసొస్తే..ఏ..

ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు

చరణం: 3
జెనరేషన్ కో సిలబస్ చొప్పున కోర్సులు మారేనండి
ప్రతి సీజన్ లో ఆక్సిజన్ లా స్నేహం నిలబడుతుంది
గుండెల్లోనా ఫ్రెండ్షిప్ కోసం బాండే రాసుందండి
ఎండే రాని వానే రాని రెండుగ విడిపోమండి
సందడి ఉంటే మనతోడే సంక్రాంతేగా ఎవ్రీడే
లోకం మొత్తం ఇవ్వాళే.. స్నేహం విలువను వివరిస్తే..ఏ..

ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు... ఓ పనైపోతుంది బాబు

హీరో రోలుకి ట్రై చేస్తే.. ఓ పనైపోతుంది బాబు
ఎక్స్ట్రాలాగే ఫిక్సైతే.. ఓ పనైపోతుంది బాబు
సింగర్ లాగా సెటిలైతే.. ఓ పనైపోతుంది బాబు
డాంకీలొచ్చి డ్యాన్సేస్తే.. ఓ పనైపోతుంది బాబు
చదవాలని బ్రదర్ని తిట్టేస్తే నెక్స్ట్ డేనే రిజల్ట్ వచ్చేస్తే..ఏ..

ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు
ఓ పనైపోతుంది బాబు.. ఓ పనైపోతుంది బాబు

ఓ పనైపోయింది బాబు..

Palli Balakrishna



చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నాగార్జున, అంజలి జవేరి, జగపతిబాబు, కీర్తి రెడ్డి
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 15.10.1999



Songs List:



నా కోసమే పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో 

నా కోసమే 



నంద నందనా పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, హరిణి

నంద నందనా ముద్దే ముందు ముందునా 
అందు ఇన్దునా నేనే నీకు చెన్దనా 
వరించాను వెచ్చగా వసంతాల చాటు నా 
సుఖించాలి జంట గా సుతారాలు మీటనా 
నా మాట విను మదన 
విడిచి నేను పో గలనా 
లవ్ అన్నదే తపనా 
లాలి పాడవే లలనా 

నాజుక్‌కు లూగి నాదాలు రేగి నాదాని వవుతుంటే 
సొంపుల్లో సోకు సంపంగి రేకు సొంతాలు చేస్తుంటే 
ఏ తేనె తీగో నీ కంటి చూపై కాటేసి పోతుంటే 
నా కన్నె పూల దాగున్న తేనె నీ కంటుకుంటుంటే 
నీ లయలు హృదయముల యమున లైన సమ్యమున 
నా మనసు నీ మధుర మధురమైనదీ కదరా 

ఆ మంచు కొండ ప్రేమించు గుండె మల్లెల్లొ ఇల్లేస్తే 
మత్తెక్కి పోయి నా కళ్ళా నిండా ఆ కళ్ళు నింపెస్తా 
నీలాల కురుల మేఘాల తెరలా అందాలు ఆరెస్తే 
సూరీడు తగిలి నా ఈడు రగిలి ఆరాలు తీసేస్తే 
నీ క చ ట తపనాలలో కరుగుతున్నాదీ సొగసు 
నీ గజాద దబ దబలో కధలు ఏమిటో తెలుసూ




జగడజాం జవాని పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, శంకర్ మహదేవన్ 

జగడజాం జవాని 




లవ్ టు లైవ్ పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: కవితా కృష్ణమూర్తి, సోను నిగమ్ 

లవ్ టు లైవ్



స్వప్నవేణువేదో పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ

స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే

చరణం: 1
నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ రేయి పగలూ హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలూ అష్ట దిక్కులూ నిన్ను చూచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాలా
కాలాలే ఆగిపోయినా  గానాలే మూగబోవునా

చరణం: 2
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ

స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే




జుమ్మని జుమ్మని పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలునై
కొమ్మన రెమ్మన పడెను సన్నాయి
వెన్నల నీడల్లొ అరువిచ్చిన అందాలు
మధుమాసం మనస్సుకు వచ్చే వేళలొ
కన్నుల కలువల్లొ సరిగం పరాగాలు
శుభ మంగల్ వాద్యలు వచ్చే వేళలొ

ఆకాశానికి తారలు పొదిగిన నా అనందంలొ
పల్లవించే నా గీతం పలకరించే సంగీతం
ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశం లొ
తరుముకొచ్చే ఉల్లసం తలలు దించే కైలాసం
ఒక్కసారి వస్తై తియ్యని క్షణాలెన్నొ
ఒక్కటవమంటై తీరని రుణాలే శుభలేఖనుకొ నా గీతం

నీ పాదలకు పారాణి అద్దిన ఈ పేరంటంలొ
డెవతయే నీ రూపం దీవనయే నా ప్రాణం
వయ్యరలను ఉయ్యలుపిన ఈ వైబోగం లొ
మౌనమయే నా భవం రాగమయే నీ కోసం
మూడు ముళ్ళ భందం ఏడు జన్మల అనుభందం
వేణువన నాలొ ఆలాపనై న గానం
ఆశిస్సు అనుకొ అనురాగం





లేత లేత గాలి వానల్లో  పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

లేత లేత గాలి వానల్లో 
స్వాతి ముత్య మన్తి ప్రేమల్‌లో 
మేఘ మాల మెరిసే 
కలికి మేని కళలొ తెలిసే 
అదుపు తప్పినా వలపు ఉప్పెనా 
తగిలే రగిలె తపనాలలో ఓ ఓ 

వానే వలపు అనీ పిలిచా ప్రియతమా 
చినుకులే సిగ ముడిగ మురిచే పరువామా 
ముద్దాడే పెదవుల్లో నీ జావళి 
చిరునవ్వు చినుకుల్లో దీపావళి 
తదిసేటి తనువంత తారావళి 
మూదిరేటి మూచట్లో గాలే బలి 
వొళ్ళంతా వయ్యారి తుల్లింత గోదారి 
వరదై పొంగే అలజడి లో 

వీణే విరహమై పలికే చలి గమ 
తడుములో తహ తహ లా తనువె హృదయమా 
గాలుల్లో తేలిందీ నా కౌగిలి పూలెన్నొ పరిచింది నీకై చెలి 
అద్దాలే కోరింది నా ఆకలి 
గిలిగిన్థల్లొ పుట్టింది గీతాంజలి 
నిప్పన్థ చన్నీటి అక్షీంతై జారేటి 
జతిలొ జతలొ చలి గుడి లో





మల్లె పువ్వా మజా ల గువ్వ పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ 
జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా 

అమ్మో అమ్మో కవిత్వం.... 

మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ 
జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా 
మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ 
జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా 

ముల్లే దాచే నవ్వా మురిసే రోజా పువ్వా 
వొల్లే తూలే తువ్వ..వద్దు నాతో రావా 

వాలి పోవా వరాలు తేవా స్వరాలు పాడేవా 
శ్రుతి మించి నావ సుఖాల నావ చుక్కాణి కాలేవా 
స్నేహ బాల చిరు నవ్వా చేయి కలపవా 
తోడు చెట్టు తొలి పువ్వా నీడ నివ్వవా 
కాపు కాచేవా దాచేవా నాతో ఇలా 
కమ్ము కొచ్చేవా మెచ్చేవా నా వెల్లువా 

మల్లె పువ్వా 

వాన కావా వదెసి పోవా వాగల్లే పొంగావ 
జడి వాన దేవా జల్లుల్లో రావ చలించి పోలేవా 
గొడుగు నీడ కొచ్చేవా గొడవ లెక్కువా 
మడుగు లోన మునిగెవా పడవ లెక్కవా 
రెక్క తీసేవ చూసేవా వీచే హవాః 
తాళ మెసెవా చూసేవా తీసేవ తాన్‌సేన్ వా





గుడు గుడు గుంచం పాట సాహిత్యం

 
చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుఖ్విందర్ సింగ్, స్మిత, లలితా సాగరి 

గుడు గుడు గుంచం గుర్తుననాదా 
మన చెడుగుడు పందెం గుర్తున్నదా 
హో వీరి వీరి గుమ్మాడిరో... 
మన ఊరు పేరు గుర్తున్నవా 
సరదాలో హంగామా సంగీతం అందామా 
చిరునవ్వుల చిరునామా మనమే అనుకుందామ 
విదున్నా సరే మనం కోరితే కలే చేరుకోదా 
ఇలా రమ్మని అలై పాడితే హరివిల్లై రాదా 

తరంగమల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ 
ప్రతీ పదాన్ని గతాలు తడిపే నేస్తమై రానీ 
తరంగమల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ 
ప్రతీ పదాన్ని గతాలు తడిపే నేస్తమై రానీ 
గుర్తున్నాయ చెర్లోని జల్లాటలు 
అద్దరి ఇద్దరి ఏకం చేసే నీ ఈతలు 
నీళ్ళల్లోనే చేరగానే ఆ రాతలు చూపిస్తున్నవి 
రోజూ పూసే చంగల్వలు 

క్షణాల మీద ఉయ్యాలలూగె పాప కావాలి 
ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి
క్షణాల మీద ఉయ్యాలలూగె పాప కావాలి 
ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి
చేమంతైనా చింతే లేని నీ జంటలో 
సమయం మొత్తం సంబరమైంది కేరింతలో 
ఎంతో ఉన్న అనుకుంటున్నా బతుకింతలో 
ఇంతై పోయి పారాడింది నీ వింతలో

Palli Balakrishna Sunday, July 16, 2017




చిత్రం: టక్కరి దొంగ  (2002)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మహేష్ బాబు, బిపాసా బసు, 
దర్శకత్వం: జయంత్ సి. పరాంజి
నిర్మాత: జయంత్ సి. పరాంజి
విడుదల తేది: 11.01.2002



Songs List:



నలుగురికి నచ్చినది పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి దొంగ  (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో 
నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో 
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో 
నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో 
పొగరని అందరని అన్నా అది మాతృఅం నా వైజం 
తెలువని కొందరు అన్నా అది నాలో మేనరిజం? 
నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు 
నెను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు 
నెను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు 

చరణం: 1 
నువ్వు నిలబడి నీళ్ళు తాగడం nothing special 
పరుగులెత్తుతు పాలు తాగడం something special 
నన్ను అడిగితే నిజం చెప్పడం nothing special 
అప్పుడప్పుడు తప్పు చెప్పడం something special 
లేనివాడికి ధానమివ్వడం nothing special 
లేనివాడికి ధానమివ్వడం nothing special 
ఉన్నవాడిని దోచుకెళ్ళడం something special 

చరణం: 2 
బుద్దిమంతుడి బృఆండు దక్కడం nothing special 
పోకిరోదిల పేరుకెక్కడం something special 
రాజ మార్గమున ముందుకెళ్ళడం nothing special 
దొడ్డి దారిలో దూసుకెళ్ళడం something special 
హాయి కలిగితే నవ్వు చిందడం nothing special 
హాయి కలిగితే నవ్వు చిందడం nothing special 
బాధ కలిగినా నవ్వుతుండడం something special 




అలెబ అలెబ పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి దొంగ  (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కె.కె. ,కల్పన

అలెబ అలెబ అలెబ బా బా అలెబ 
ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ 
ధగ ధగ ధగ లాడె కల్లు 
నిగ నిగ నిగ లాడె వొల్లు 
సల సల సల కాగె వయసు నీదే హొయ్ 
యేస్కోర నాతొ భెటి చెస్కోర బ్యుటి లూటి 
అందంలొ నేనె నాకు సాటి హ 

అలెబ అలెబ అలెబ బా బా అలెబ 
ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ 

కన్నె వొంపుల్లోన ఉన్నదొయ్ సుఖం.. 
అలెబ అలెబ అలెబ అలెబ 
తడిమై చూపుల్తొ న అంగంగమూ 
అలెబ అలెబ అలెబ అలెబ 
ఓసి నంగనాచి ఇదేం సంగతీ 
తేనె కల్ల బూచి నాతొ నా పేచీ 
ఔనంటె కులికెస్థా కాదంటె కరిచేస్తా 
వొడికొస్తెయ్ వెచ్చని ముద్దె ఇస్తా హొయ్ 
పొ పొ వొయ్ కొరకంచు నీ పొగరె చాలించు 
తలకెక్కిన కైపుని కాస్త దించు 

అలెబ లెబ అలెబ లెబ 
అలెబ బ బ అలెబ లెబ లెబ 
ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ 

కన్నె పిల్ల గుర్రం ఒకటేలె వరసా 
అలెబ అలెబ అలెబ అలెబ 
పడకుంటె కల్లెం మానవులె నసా 
అలెబ అలెబ అలెబ అలెబ 
రాతునవుతనంటె నెదానై పోనా 
కలకాలం రాజ కౌగిలినై పోనా 
అట్టాగ దొరసానీ చుసాగా సరదన్నీ 
పలికిస్త రావె నీ తబలానీ హొయ్ 
అసలె నె పసిదన్నీ ఆపైన కసిదాన్నీ 
నిన్నొదలను ఎమైన ఐపొనీ హ 

అలెబ లెబ అలెబ లెబ 
అలెబ బ బ అలెబ లెబ లెబ 
అలెబ అలెబ చూపిస్త రా రా నా దెబ్బా



హేయ్ మామా మామా పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి దొంగ  (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: టిప్పు , కల్పన

హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా 
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా 
లక్కి సోలక్కి నిను చూశానులే 
డిక్కి డీడిక్కి ఆడేశానులే 
లుక్కే నీ లుక్కే ఒక్కేసిందిలే 
చుక్కే ఎంచక్కా పక్కేసిందిలే 
సోనా సోనా సుల్తాన ఆడేయి ముల్తానా 
నిన్నే వీడి వెళ్తానా ముద్దు ఖోరి వద్ద చేరన 
జీనామర్నా ఏమయిన నీదే ఈమయిన 
సోకే నీకు నజరానా నాధిన్ ధిర్నా 

చరణం: 1 
హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చడి గామా 
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా 
షాదీ మస్తానీ జల్సా చెయ్యని సూదీ సోగ్గాడ్ని ఒక చూపెయ్యనీ 
మరో మచ్చారో చినా బాలురో హెరో నాహెరో ఇక నువ్వేవరో 
ఆజా ఆజా నా రోజా చెయ్యాలే పూజ 
తాజా తాజా కౌగిళ్ళ తపనల తకధిమిలో 
లేజా లేజా లే రాజా వుందా కలేజా 
ఏసా పైసా తేల్చేస్తా కాస్కో మచ్చా 

చరణం: 2 
హేయ్ మామా మామా మామా హేహే మామా 
వచ్చాడే వాస్కోడిగామా 
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా 
హల్లో హయిబుల్లో నాకల్లోకిరా 
పిల్లా ఆ పిల్లా నా ఒళ్ళోకి రా 
ముల్లా ఓ మల్లా నా గాల్లీకి రా 
గుల్లా రసగుల్లా ఒడి బళ్ళోకి రా 
గోల గోల రంగోల గోలే చెయ్యాల 
గోడ దూకే నీ ఈడు ఆడమంది రాసలీల 
హోల హోల వుయ్యాల వూగించెయ్యాల 
వేళపాళా లేదింక వేసెయి ఈల 




బాగుందమ్మ బాగుంది పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి దొంగ  (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్.పి.బి.చరణ్, ఉష

బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు 
మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు 
ఊయలల్లె ఊగే నీ నడుమె ముద్దు 
హమ్మ హమ్మ హమ్మ సెగ మాగాలమ్మ 

బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు 
మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు 
ఊయలల్లె ఊగే నీ నడుమె ముద్దు 
హమ్మ హమ్మ హమ్మ సెగ మాగాలమ్మ 

చరణం: 1 
గుప్పెడు గుండెల చప్పుళ్ళో నా కంటి రెప్పల్లో 
పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే 
పున్నమి వెన్నెల కాంతుల్లో ఆ మబ్బు డొంకల్లో 
రేయంత వెతికానమ్మ నీ కోసమే 
అమ్మాయి బుగ్గల్లో మందారం మొగ్గల్లే 
దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు 
వద్దు వద్దు వద్దు నన్ను కవ్వించొద్దు
మోమాటాలె వద్దు గిలిగింతే ముద్దు 

బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు 
మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు 

చరణం: 2 
ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేనెంత కాదన్న
నీలోనే చేరిందమ్మ నా ఊపిరి 
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఈరోజే చూస్తున్న 
నా కెంతో నచ్చిందమ్మ నీ వైఖరి 
చి పాడు సిగ్గన్న సూదంటూ రాయల్లే 
కుచ్చెల్లు లాగేస్తున్న చూపే ముద్దు 
ముద్దు ముద్దు ముద్దు నీ నడుమె ముద్దు 
విప్పొద్దయ్యొ నువ్వు మరి చిట్టా పద్దు





చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి దొంగ  (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్.పి.బాలు, ప్రసన్న

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు 
చూపుల్లో సూర్యుడీ సోగ్గాడు 
ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి 
మోగించెయ్ మంటవా సన్నాయి 
సింగంలా దూకరా మగధీరుడా 
దమ్మెంతో చూపరా పని వీరుడా 
మాటల్తో చంపకే ఓ బాలికా వస్తాలే కాసుకో నీ ఓపిక 
హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ 
వద్దనక ముద్దులతో మురిపించవా 
హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో 
నేను మరి తేలికగా పడిపోనల్లా 

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు 
ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి 

చరణం: 1 
పాల పొంగు పాప తెగరువ్వకే నవ్వు 
నీలి కళ్ళ చేప వలవెయ్యకే నువ్వు 
గాలిలాగ వచ్చి నను తాకితే నువ్వు 
మాయదారి మోహం తొణికించదా నవ్వు
ఇద్దరి కధ ఇవ్వాళే తెంచెయ్యకు 
విచ్చల విడి దుకాణం పెట్టెయ్యకు 
హద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు 
అద్దిరిపడి గుడారం దించెయ్యకు

హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో 
నేను మరి తేలికగా పడిపోనల్లా 
హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ 
వద్దనక ముద్దులతో మురిపించవా 

ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి 
చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు 

చరణం: 2 
టిప్పుటాపు బావ మొహమాటమేలేదు 
అప్టు డేటు గుంటే డౌటన్నదే రాదు 
రాలుగాయి పిల్లా చెలగాటమే వద్దు 
కాలు జారకుండా మన కుందిలే హద్దు 
కష్టమనకు ఓ రయ్యో ఈ పూటకు 
ఇష్టసఖిని ఇలాగే జోకొట్టకు 
కూతపెరిగె నివాళే ఈ పిట్టకు 
తోడుపెరుగు నివాలి నా పెట్టకు 
ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు పిట్టకు బెంగ 
చీరలకి సిగ్గులకి సెలవే ఇక 
హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో 
ఇప్పుడిక తప్పదిక తొలివేడుక 

ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు పిట్టకు బెంగ 
చీరలకి సిగ్గులకి సెలవే ఇక 
హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో 
ఇప్పుడిక తప్పదిక తొలివేడుక 

Palli Balakrishna Thursday, July 6, 2017

Most Recent

Default