-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Srihari"
Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics Album Cover

Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Banner : Sumanth Art Productions
Music : Devi Sri Prasad
Director : Prabhu Deva
Producer : M. S. Raju
Actors : Siddharth, Srihari
Actresses : Trisha Krishnan, Archana Shastry (Veda), Santhoshi
Release Date : 14 January 2005

Chandrullo Unde Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Chandrullo Unde' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Shankar Mahadevan
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా తందానే తందానే చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా తందానే తందానే నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంట ఏవంట నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా... ఓ... చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా ఏలే ఏలే ఏలో ఏలేలేలో ఏలో ఏలేలేలో ఏలో ఏలో ఏలే ఏలేలో హాయ్ మై నేమ్ ఈజ్ సంతోష్ యువర్ నేమ్ ప్లీజ్ - స్టెల్లా స్టెల్లా ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్ కెన్ యూ హేవ్ ఏ ఫోన్ నంబర్ రేయ్ రేయ్ రేయ్... ఓ... కమింగ్ డాడ్ గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ... హే గగగా రిగ రిసాస సానినిస గగగా రిగ రిససా... కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జాణతనం బాటచూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంత వరకో రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా

Something Something Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Something Something' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Tippu.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Tippu
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: టిప్పు something something something something something there is some thing... Come on... అందర్లోనూ ఉంది something అర్ధం కానీ ఏదో feeling లో లో దాగున్నా no no nothing అంటున్నా పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... ఓ కొంటె కలా ఆ పంతమేలా రా ముందుకిలా కం నియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళా సందేహిస్తా వెందుకలా సంకెళ్ళేమీ లేవు కదా why fear అలా చిలిపి చిటికి తలుపు తడితే నిదరపోతే ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఎలాంటి అలుపు లేక ఆటాడమంది వేళ మాయదారి హాయి గోల అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అందర్లోనూ ఉంది something అర్ధం కానీ ఏదో feeling నీ కాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్ళెనంట క్యా కమాల్ అనేలా ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా తకిట తదిమి జతులు ఉరిమి తరుముతున్న వేళ ఉలికిపడదు తళుకు తారకా మహానంద లీల సాగుతోంది వేళ కాలమంత ఆగిపోదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా...

Niluvaddam Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Niluvaddam' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Karthik and Sumangali.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Karthik, Sumangali
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్, సుమంగళి ఊ నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా హే నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా హా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు నీలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం హే నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

Paripoke Pitta Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Paripoke Pitta' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Mallikarjun and Sagar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Mallikarjun, Sagar
Special Note : 'Paripoke Pitta' పాటలో హీరో సిద్ధార్థ్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రభుదేవా కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం.
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: మల్లికార్జున్, సాగర్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా హే పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా అంత మారాం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట చరణం: 1 నా సంతోషాన్నంతా పంపించా తన వెంట భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా హోయ్ చినబోయిందేమో చెలి కొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట హే పుటుక్కు జర జర డుబుక్కు మేఁ పుటుక్కు జర జర డుబుక్కు మేఁ చరణం: 2 ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది నిద్దర ఎదురయ్యింది తెగ చిరాగ్గ ఉన్నట్టుంది తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది హోయ్ ఏం గారం చేస్తావే ప్రేమ నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకూ తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా తీసుకుపో నీ వెంట ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట తీసుకుపో నీ వెంట అరి తీసుకుపో నీ వెంట అరి హొయ్ హొయ్ హొయ్

Prema Kosamai Valalo (Remix) Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Prema Kosamai Valalo (Remix)' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Ghantasala.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Pingali Nagendra Rao
Singers : Ghantasala
Special Note : ఈ పాటను యన్.టి.రామారావు గారు నటించిన పాతాళభైరవి (1951) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు, దీనికి సంగీతం ఘంటసాల గారు అందించారు, V.J. వర్మ ఆలపించారు, పింగళి నాగేంద్రరావు సాహిత్యం అందించారు.
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: జూనియర్ ఘంటసాల పల్లవి: ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు. అయ్యో పాపం పసివాడు ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు అయ్యో పాపం పసివాడు

Ghal Ghal Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Ghal Ghal' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అణువణువును మీటె మమతల మౌనం పదపదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) చరణం: 1 ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితను సైతం చదవనివైనం కవితలు సైతం పలకని భావం సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటె దరిదాటి ఉరకలు వేసె ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినదేదంటే చిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) చరణం: 2 మండే కొలిమినడగందే తెలియదే మన్నుకాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరె ప్రియురాలే గెలుపంటె తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జతవుంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతె నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

Padam Kadalanantunda Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Padam Kadalanantunda' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Sagar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Sagar
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్ పాదం కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూడందే దూరం కరగనంటుందా తారలను దోశిల పట్టే ఆశలు దూసుకు పోతుంటే లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా తన కలలుగ మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం పిసలను తరిమే ఉరుమే ప్రేమంటే నువ్వే తన ఐదో తనమని నీకై నోచే నోముంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా తానే నీ పెదవులపై చిరు నవ్వై నిలిచే ప్రేమంటే ఆ తీపికి విషమైన అమృతమే ఐపోదా

Adhire Adhire Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Adhire Adhire' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Jassie Gift and Kalpana Raghavendar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Jassie Gift, Kalpana Raghavendar
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: జస్సి గిఫ్ట్, కల్పన రాఘవేందర్ శివశివ మూర్తివి గణనాథా శివశివ మూర్తివి గణనాథా శివుని కొమరుడవు గణనాథా శివుని కొమరుడవు గణనాథా ఛల్ సిరికి హరికీ మనువంట ఛల్ సిరికి హరికీ మనువంట భళరే అనరా జనమంతా భళరే అనరా జనమంతా హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి చిందు కొట్టే జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుకా ఓ... ఓ... అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే చరణం: 1 ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో హెయ్ వరసై పిలిచే అందాలు అరె మనమై చిలికే గంధాలు అహ మనసే గెలిచే పంతాలు అరె మనువై కలిపే బంధాలు రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా అదిరే అదిరే కన్నే అదిరే ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే చరణం: 2 పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో పందార తునకో పదం లేని తెలుగో మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో హే ఎదురై రానీ మేనాలు హో హో చెవిలో పడనీ మేళాలు అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా అదిరే అదిరే కన్నే అదిరే హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్...

Palli Balakrishna Thursday, June 18, 2026



చిత్రం: పరశురాం (2002)
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
నటీనటులు: శ్రీహరి, సంఘవి 
దర్శకత్వం: మోహన గాంధీ 
నిర్మాత: ప్రియాంక 
విడుదల తేది: 07.03.2002



Songs List:



జారిందమ్మ జారిందమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: పరశురాం  (2002)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: మహేష్ 
గానం: ఉన్నికృష్ణన్ , సుజాత మోహన్ 

జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా...
బాగుందమ్మ బాగుందమ్మ
బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా...

నీ ముద్దు ముత్యం జారే
పగడం జారే పరువం జారెనే
నీ ముందే సరదా తీరే
సరసాలూరే అందమంత జాలువారి

జారిందమ్మ

జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా...
బాగుందమ్మ బాగుందమ్మ
బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా...

హహ..హహ..

జారింది కొప్పు చూసుకోవమ్మా
జారిన పూవు అందుకోవయ్యా
నువ్వెంత ఆపినా వద్దంటు చెప్పిన
నీ ఒంపులు నా చూపులు జారే
చెజారి పోకు చందమామయ్యొ
నేజారు నాకు సందె పొద్దమ్మొ
తబ్బిబ్బు అయిందో
తడబాటు కలిగిందో
నీ వైపే నా అడుగులు సాగే

చేయి వేస్తెజారుతుందీ
వెన్ను పులుము కుంటివేమో
కన్నె మనసు జారుతుందీ
వెన్ను మలుపు కుంటివేమో
చేయే జారిందో కాలే జారిందో
పరాచికాలా కలలో తేలి

జారిందమ్మ

జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా...
బాగుందమ్మ బాగుందమ్మ
బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా...

హహ..హహ

సూదంటురాయి వొళ్ళు నీదమ్మో
నిన్నంటు కుంటె వదిలి పోనయ్యో
ఉవ్విళ్లు ఊరించే పూవంటి పెదవుల్లో
ఎ తేనె రసాలు ఉన్నాయో
పల్లున్న వెండి పళ్లెమిదిలే
ఒక్కొక్క పండు వొలుచుకుంటాలే
మాటల్లొ దింపేసి కమ్మంగా ముద్దిస్తే
నా భర్తా చలనుకుంటాలే
గాలి మాటలేల పిల్లా
గుండె తలుపు తీస్తెకాదా
తాలమేది వేయలేదు
పట్టిచూడు తెరిచే ఉంది
సొమ్మే ఇస్తావో సోకే ఇస్తావో
కుమారి సిగ్గు తెరలే తీసి

జారిందమ్మ

జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా...
బాగుందమ్మ బాగుందమ్మ
బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా...

నీ ముద్దు ముత్యం జారేణ
పగడం జారే పరువం జారెనే
నీ ముందే సరదా తీరే
సరసాలూరే అందమంత జాలువారి జారిందమ్మ

Palli Balakrishna Thursday, December 15, 2022



చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ (All)
నటీనటులు: ఆది, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీహరి
దర్శకత్వం: సి. హెచ్. సుబ్బా రెడ్డి
నిర్మాత: ఎమ్.అభిలాష్
విడుదల తేది: 28.11.2014



Songs List:



రబ్బరు బంతి పాట సాహిత్యం

 
చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: నరేంద్ర, సుధామయి

రబ్బరు బంతి



ఓయ్ ఓయ్ మీట్టపిల్లకు పాట సాహిత్యం

 
చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: కారుణ్య 

ఓయ్ ఓయ్ మీట్టపిల్లకు



ఎడుకొండల వెంకట పాట సాహిత్యం

 
చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: నరేంద్ర, శ్రావణ భార్గవి 

ఎడుకొండల వెంకట




అబ్బోబో వీడు పాట సాహిత్యం

 
చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: పవన్ చరణ్ 

అబ్బోబో వీడు



ఈ వెన్నెల బొమ్మని పాట సాహిత్యం

 
చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: పవన్ చరణ్ 

ఈ వెన్నెల బొమ్మని



నందు ఐ లవ్ యు పాట సాహిత్యం

 
చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: హేమచంద్ర 

నందు ఐ లవ్ యు




ఎడుకొండల వెంకట సింహ పాట సాహిత్యం

 
చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: సింహా, శ్రావణ భార్గవి 

ఎడుకొండల వెంకట సింహ

Palli Balakrishna Friday, February 12, 2021



చిత్రం: నర్తనశాల (2020)
సంగీతం: మాధవపెద్ది సురేష్
నటీనటులు: బాలకృష్ణ, సౌందర్య, శ్రీహరి
దర్శకత్వం: నందమూరి బాలకృష్ణ
నిర్మాతలు: పూసపాటి  లక్ష్మిపతి రాజు, బాలకృష్ణ
విడుదల తేది: 24.10.2020

Palli Balakrishna Saturday, January 23, 2021




చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
నటీనటులు: కౌశిక్ బాబు, నాగార్జున, మోహన్ బాబు, సుమన్, శ్రీహరి, సాయి కుమార్
దర్శకత్వం: J.K. భారవి
నిర్మాత: నారా జయ శ్రీ దేవి
విడుదల తేది: 15.08.2013



Songs List:



ఓంకారం పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: వేదవ్యాస్
గానం: శంకర్ మహదేవన్ 

ఓంకారం 



అఖిల చరాచర పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: వేదవ్యాస్
గానం: శంకర్ మహదేవన్ 

అఖిల చరాచర 



ఓం నమశివాయ పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: వేదవ్యాస్
గానం: ఉన్ని కృష్ణన్

ఓం నమశివాయ



భజగోవిందం పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన
గానం: మధు బాలకృష్ణన్

భజగోవిందం



భ్రమ అని తెలుసు పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: జె.కె.భారవి
గానం: శ్రీరామ చంద్ర 

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఆ.....భ్రమ అని తెలుసు
భ్రమ అని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు 
ఆ.....కత అని తెలుసు
కత అని తేలుసు కతలన్ని కంచికే చేరునని తెలుసు 
తెలుసు తెర తొలుగుతుందని తెలుసు తెల్లారుతుందని తెలుసు 
ఈ కట్టే పుట్టుక్కుమంటాడని తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని 
ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని 

మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... 
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య....

ఆ...వేదం తెలుసు - తైలం ఉన్నదకే దీపమను వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు - శాశ్వతంగా ఉండేదేవ్వడీడా లేడని తెలుసు
తెలుసు ఇది నీటి మూటని తేలుసు లే  గాలి మేడని 
తెలుసు ఈ బుడగ టాప్పని పగిలిపోతదని 
తెలుసు ఉట్టి మీద ఉన్నదంతా హుష్ కాకి అని 
అన్ని తెలిసి అడుసులోపడి దోల్లుతుంటావు దేనికని

మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... 
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య....

ఆ...తేలిపోయింది  తెలిసిపోయింది
తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉన్నదని మనసా
తెలుసని ఎందరు చెబుతున్న అది ఉందో లేదో తేలది హంసా ....
కళ్ళు రెండు ముసెయ్యలంట  మూడో కంటిని తెరవాలంట...
మిన్ను, మన్ను, మిట్ట, పళ్ళెం, ఒక్కటిగా కనిపించాలంట ..
ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంట..
ఆ ఎరుక వచ్చి రాగాలే...ఆ ఎరుక వచ్చి రాగాలే...
ఆ ఎరుక వచ్చి రాగాలే మాయంఅయిపొతుండటమాయ

మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... 
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య.....



శ్రీ కృష్ణః పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: జె.కె.భారవి
గానం: ఎస్.పి.బాలు, మణి నాగరాజ్

శ్రీ కృష్ణః



ఎవడు నీవు పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: జె.కె.భారవి
గానం: ఎస్.పి.బాలు

ఎవడు నీవు 



లక్ష్మీ పద్మాలయ పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన
గానం: ఎస్.పి.బాలు

లక్ష్మీ పద్మాలయ 



సౌందర్య లహరి పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన
గానం: రంజిత్

సౌందర్య లహరి 





లక్ష్మీ నృసింహా పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన
గానం: టిప్పు

లక్ష్మీ నృసింహా



వేద తాండవం పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: వేదాస్
గానం: కోరస్

వేద తాండవం 



నిత్యానంద కరీ పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన
గానం: ఎస్.పి.బాలు 

నిత్యానంద కరీ



శంకర విజయం పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన
గానం: కోరస్

శంకర విజయం



శివోహం పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన
గానం: హరిహరన్

శివోహం



చిరంజీవి ఆది శంకరాచార్యుల గురించి పాట సాహిత్యం

 
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: జె.కె.భారవి
గానం: చిరంజీవి

ఆది శంకరాచార్యుల గురించి చిరంజీవి చెప్పారు

Palli Balakrishna Tuesday, January 22, 2019


చిత్రం: యుద్ధం  (2014)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: రేవంత్ , సాహితి కోమందురి (సోనీ)
నటీనటులు: తరుణ్ కుమార్, యామి గౌతమ్, శ్రీహరి
దర్శకత్వం: భారతి గణేష్
నిర్మాతలు: నట్టుకుమార్
విడుదల తేది: 14.03.2014

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏందీ ఈ ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగో..
ఇదిగో డార్లింగ్.. ఒక సారిటు సుడర్రాదు

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్
ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్
ఏంటేంటో డూయింగు ఏమైందో సంథింగ్
ఎద నిన్నే కాలింగు ఎంట్రీలో వెయిటింగ్
నేనిన్ను మిస్సింగు సేమ్ టు సేమ్ ఫీలింగు
మనమైతే మాచింగ్ చేసేద్దాం డేటింగ్
ఇంకేంటి సోది మీటింగు

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్

హలో హలో డార్లింగ్ డార్లింగ్  (2)
సునో సునో  డార్లింగ్ డార్లింగ్  (2)

హలో హలో డార్లింగ్ డార్లింగ్  (2)
ఏదో ఏదో ఫీలింగ్ ఫీలింగ్ (2)

చరణం: 1
గోళ్లు రంగు ఘోర రంగు హంగుపొంగులో
నన్ను చేసే డిస్టర్బింగ్
డిజైనింగ్ డెవలపింగ్ అన్ని రంగులు
పెళ్లిరోజే టోలేటింగు
అందాక డార్లింగ్ ఆకాల ఈటింగ్
బాబోద్దు క్రాసింగ్ దాస్తేనే థ్రల్లింగ్
హే నీ రూపే థింకింగ్ నీ పేరే రైమింగ్
ప్రేమంటే కాదా కేరింగూ..

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్

చరణం: 2
ఎవ్రిథింగ్ అమేజింగ్ పిల్ల సోకులు
ఎలుకుంటా లైఫ్ లాంగ్
ఎరైవింగ్ ఎటర్నింగ్ అందుకోసము
జంటగానే ట్రావిలింగు
ఏరేసను డార్లింగ్ స్వర్గాలే సంథింగ్
నువ్వేనా డేరింగ్ నీతోనే సంథింగ్
నువ్వే నా బ్రీతింగ్ నేనే నీ క్లోనింగ్
ఐపోతా నీలో మిక్సింగ్

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్


Palli Balakrishna Thursday, December 21, 2017


చిత్రం: బద్రాద్రి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్
నటీనటులు: శ్రీహరి, రాజా అబెల్ , గజాల , నిఖిత, బాలాదిత్య
దర్శకత్వం: మల్లికార్జున్
నిర్మాత: యమ్.శివకుమార్
విడుదల తేది: 08.10.2007

మైడియర్ ఫీల్ ద ఫన్ ఆనందమే మన పోలసీ
ఆల్ ది టైమ్ ఆల్‌దిరన్ మన అడుగుకి లేదిక ఎలోసి
ఏకమాన్ ఫీల్ దఫన్ ప్రతి నిమిషం మనకో ఫాంటసీ
రౌండ్ క్లాక్ ఆన్‌ది రన్ మన కలలకు తోచిందే ఖుషి
మిని మిని మూమెంట్స్ దాచుకో నీ మనసుకు మెడిసన్
చేసుకో మిని మిని మెమొరీస్ పెంచుకో నీ వయసుకు
వ్యాక్సిన్ వేసుకో గడియారం ముళ్ళై పరుగు తీద్దాం లెఫ్ట్ అండ్
రైట్ కష్టాలన్ని చూద్దాం సాల్ట్ అండ్ స్వీట్ రెండు టేస్టు చేద్దాం
లైఫంటే చూద్దాం శాట్‌లైట్‌తో పోటి పెట్టుకుందాం డేనైటికి
తేడా మరచిపోదాం రైట్ అండ్ రాంగ్ గేం తెలుసుకుందాం

నిలబడి బిస్లెరి త్రాగడం మన జోరుకు సరిపడదే హొ హొ
పరుగిడి ఫాంటా పొందడం మన ఫెయిర్ కి తెలిసిందే అలుపు
అనే మాటకు అర్ధమే మన డిక్షనరీలో లేదె బిజీ బిజీ
మెరుపులే మన యూత్ కి పవర్ అంటే అనుకుంది
చెయ్యడం ఒక వరం ఆ నేచర్  మన సొంతం సరికొత్త
నడకలో రిధమ్ మన సిగ్నేచర్ అందాం

గలగల మెలొడి నవ్వుతో గడియారం ముళ్ళై పరుగు
చిరుగాలిని ఊపేద్దాం అడుగుల సడితో భూమికి జల్సాలే
హిప్ హిప్ హుర్రే నేర్పిద్దాం లో మన లవ్‌డబ్ కలిపేద్దాం జరజర
జల్సాట్రెండ్‌లో జిందగినే నవ్విద్దాం UKG మొనలు మన
మందరు పారా ఆనందోబ్రహ్మ టీనేజ్‌లోని ప్రతిక్షణం కమ్ ఎంజాయ్ చెయ్ మామ


*********   **********   **********


చిత్రం: బద్రాద్రి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: టిప్పు, ఉష

శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి ఈడుదుప్పట్లో దొంగె
దూరినట్టుంది కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుంది
సరెసరె రా మరి హుటాహుటి ఇంతలో ఇదేమిటి ఆగలే
నంటు పైటె గోలపెట్టింద ఆదుకొమ్మంటు నాకే కన్నుకొట్టింది
ఆపసోపాలు పడలేను కాని కాస్త కరుణించు నారాయణ
రాహుకాలాన్ని రావద్దు అంటు రాత్రి తెల్లార్లు పారాయణ
వస్తాడు నువ్వేలారా ఎవ్వరేమన్నాడు
ముస్తాబు వచ్చేసింది ఏ సుగుణ

ఆవురవురు అంటునే ఆశ పడుతున్న
ఆ సంగతి ఈ రోజె ఆలకిస్తున్నా
వయసు మాగాణి నికిచ్చుకుంటూ రైతువై పంట పండించుకో
పదును చూడందె నేవదులుతానా అప్పగించేసి నువ్వురుకో
వయ్యారితో ఇవ్వాళిలా
కయ్యానికే కాలు దువ్వాలటా

ముట్ట గట్టిన బంగారం ముందరెడుతున్నా
నీ వంపుల టెంపుల్‌ లో పూజకొస్తున్నా
కూత పెడుతోంది పరువుల కోడి మూతపెట్టేసి ముద్దాడుకో
రెచ్చగొట్టాక నేనాగుతాన పుంజునవుతాను పూలకించిపో
ఏకాకీ ముఖాముఖి షికారుకే సిద్ధమవ్వలట


*********   **********   **********


చిత్రం: బద్రాద్రి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రంజిత్, రీటా

రింగా రింగా రోజ్‌ రింగ్‌ రింగా రోజ్‌ తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్‌నన్నే
దొంగ దొంగ ఫోజ్‌ కొట్టట్టె దొంగ ఫోజ్‌ ఏనాడొ దోచావు మొత్తంగ నన్నే
Yes అంటున్నావ, Jhony Jhony పాప నే చేస్తా నీతో
Jolly Jolly జల్సా
Fresh అంటున్నావ బాబా Black sheep బాబ
సాయంత్రాలు చేస్తా నీతో Styly Styly సల్సా
ఉలలలా ఉలలలలా ఊరించిందే Ice Cream అల్లె మనసిలా
ఉలలలా ఉలలలలా ఊపింది ఉయ్యాలలే వయ్యసిలా రింగా రింగా రోజ్‌

పగలంత ప్రతిగంట నాకల్లోకొచ్చి పరువంతో
మొదలెట్టేయ్‌ నీ పైలపచ్చీ
పులకింతై గిలిగింతై ఊహల్లోకొచ్చీ హృదయంతో తలెఎత్తె నీగిల్లికజ్జా
సరసంలో మనమాడాలంటా సబ్జాయిండర్‌ సరదగా మరి ఓడించాలి నన్నే నీ జోరే
షలలల షలలలలా సయ్యాటె ఆడిందమ్మ సొగిసల రింగా రింగా రోజ్‌

ఎవరైన లేకుంటె తోచెదెకాదు ఎదురంగ ఎవరున్న తోసెస్తున్నాను
సంగీతం వినకుండ నేనుంటె ఒట్టు ఇపుడెమో వినిపిసై కట్టెస్తున్నాను
తొలిప్రేమ మన నెక్కించింది టైటానిక్కే మన మధ్య ఇక రోజు రోజు లవ్‌ Topic కె
అలలల హలలలల హమయ్యా అంటుందమ్మ బ్రతుకిలా రింగా రింగా రోజ్‌


*********   **********   **********


చిత్రం: బద్రాద్రి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: గంగ, నవీన్

పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా
పొట్టి మెడ పొడుగు జడ తస్సాదియ్యా
కొంటె తనం పెంకితనం తస్సదియ్యా
మొండితనం మొరటుతనం తస్సాదియ్యా
ఒకటి ఒకటొకటి తెగ నచ్చాయెనీలో శిలగ శిగతరగ నువ్వు నడిచొస్తుంటే
అడుగు అడుగడుగును నీకేమేం కావాలో సరదాపడిపోనా నువు పొగిడేస్తుంటే
బాదంపిస్తా నీఒల్లోకొస్తా చదలాంవాదేవి రావేదేవి కాలే దువ్వే
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా

నానానాన నా చెడి పోతుందే మతి చెడిపోతుందే ముందు వెనక చూస్తుంటే
శిల్కు చీర మరి గొడవెడుతుందె చూపే తనఖిచేస్తుంటే
పుట్టుమచ్చ అందాలే రెచ్చగొట్టి రమ్మంటె తట్టుకోలేకుండ ఉన్నానే స్వయానా
మీసకట్టు తిప్పేస్తు మీద కొస్తుంటే చిటికెడు మెట్టెలతో గానాభజానా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా
కలి చూపులలో కసి కొడవలి ఉందే ఇంచి ఇంచి కొస్తుందే
నీ వంపులలో అరె తిరగలి ఉందే తిరగ మరగ చేస్తుందే
కట్టుబాటు లేదంటు కట్టుదాటి వస్తున్నా పెళపెళలాడించే తమాషా ఉంచాల
పుట్టుతేనె ఉందంటూ పట్టుబట్టిరమ్మంటె చెడుగుడులడిస్తా చూడేగజాల
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా


*********   **********   **********


చిత్రం: బద్రాద్రి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం: విజయ్ యేసుదాసు

గోరింకా గోరింకా రావా మా వంక ఏవంక లెనట్టి ఊరె
మాదింక తన ప్రాణాలు పంచించి పాకే ఈ యేరు మా
ప్రాణాలు కాచించి ఊగే ఈ పైరు పేగే కదిలించే బంధాలకు
పెట్టిన పేరు ప్రేమ పెనవేసె మా ఊరు తీరే వేరు

తెరతీసిన ఆహరివిల్లు అందంచిందే ఇల్లు, తెరిపే లేని రాని
తేనెల పూవుల జల్లూ చమరించే కన్నుల్లోని ఆరాని ఈ తడి
చాలు మనిషై ఉంటే చాలు మనవే పదికాలాలు గుండెల
లోతులు కొలవగ సరియైన సాధనం లేదుగ కష్టం కూడా
ఇష్టమే అది ఏదైన అదృష్టమే ముద్దుగ తడిసిన మనసులు
ముద్దు ముద్దుగ మురిసే మురిపాలూ ఏదో అనురాగం
వినిపించని గానం ఏదీ అంతా అనుబందం అనిపించే లోకం మాది

కన్నమ్మను మించినదంట జన్మను ఇచ్చిన ఊరు కరిగే ఊరును
చూస్తే కన్నుల నీరే ఊరు మమకారం మాసిరి కాగా మాసరి
లేనేలేరు ఎపుడు కలిసే ఉంటాం ఎవరు ఒంటరి కారు ఎవ్వరికి
ఆపద వచ్చిన అది ఆపటానికే వేదన మృత్యువు కోరలు సాచిన
చితి చేరె వరకు చింతన అందరి క్షేమం ఆశయం అందకా
అడుగే వెనకేయం ఇంతే ఈ జన్మ ఇక ఊరె ఊపిరి అంటా
ఉంటే మరుజన్మ మరలొచ్చి ఇచటే పుడతా

Palli Balakrishna Thursday, September 21, 2017



చిత్రం: మహానంది (2005)
సంగీతం: కమలాకర్
నటీనటులు: సుమంత్ , అనుష్క , శ్రీహరి
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: అనసూయ దేవి
విడుదల తేది: 03.12.2005



Songs List:



ఏమైనా ఏదేమైనా పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: బండారు దానయ్య కవి
గానం: హరిహరన్ , చిత్ర

పల్లవి:
ఏమైనా ఏదేమైనా
ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా
ఏమైనా ఏదేమైనా మనసు తెలుసుకున్న
అణువు అణువున  ఆరాధన
పెదవి దాటింది ఈ రోజున
మనసులో కొత్త ప్రియభావన
మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా

చరణం: 1
నువ్వంటే ప్రాణం నీలో నా స్థానం
పదిలమవ్వాలి  పద పద మని పదికాలాలు
ప్రేమంటే దైవం వెంటుంటే ధైర్యం
సాగిపోవాలి కనుమరుగై మన దూరాలు
ప్రేమెంతో పోసి చీటీలను రాసి కొరాను దైవాలని
ఆ ఆశను చూసి ఆశ్చర్యం వేసి
నువు నాకు కావాలనే
ఇన్నాళ్ల నా ప్రేమ నువ్వే నా చిరునామా
అని అనగా అనగా కలలు కనగ

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా

చరణం: 2
అందాల రాశి నన్నేదో చేసి తిష్ట వేసావు
తొలి వలపుల తలుపులు తీసి
పక్కింటి పెళ్లి అంటుంది తుళ్ళి
ఒప్పుకోవాలి వధు వరులం మనమైపోయి
చూపుల్లో భావం చేతల్లో జీవం
మార్చింది నీవాడిగా
మాటల్లో మాఘం ఆశల్లో భాగం
అడిగింది నిను తోడుగా
మరణాలే ధరిరాని గగనాలే విడిపోని
ప్రతి జన్మలోను ఒకటి మనము

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా
అణువు అణువున  ఆరాధన
పెదవి దాటింది ఈ రోజున
మనసులో కొత్త ప్రియభావన
మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు





టైట్ జీన్ ప్యాంట్ పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: తైదల బాపు 
గానం: టిప్పు 

టైట్ జీన్ ప్యాంట్



ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: ఈశ్వర్ తేజ
గానం: శ్రేయా ఘోషల్ 

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

స్వరాలూ ఏడూ సముద్రాలేడు
వెంకన్న వుండే కొండలు ఏడు
పెళ్లితో వేసే అడుగులు ఏడు
నువ్వు నాతోడు ఓ నేస్తం నేను ని తోడు
నేను ని తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు
నింగి నెల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

వచ్చింది ఈడు కోరింది తోడు
కన్నేసి చూడు తప్పించు కోడు
చూపులతో వాడు గాయం చేసాడు
ప్రేమించమంటే మాయమౌతాడు

ప్రతి రేయిలో ఇదే స్వప్నము
తెల్లవారితే అదే మౌనము
ఆలోచిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తా
గోల చేస్తుంది నా ఈడు గోల చేస్తుంది
ఆగనంటుంది అందాకా ఆగనంటుంది

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

చూసింది మొదలు గుండెల్లో గుబులు
ఏమైందో అస్సలు ని పైనే కళలు
కౌగిళ్ళ కధలు చెప్పాలా బదులు
ఎందయ్యో అస్సలు ఈ పిచ్చి పనులు

ప్రేమన్నది ఓ అద్భుతం
ప్రేమించడం మరో అద్భుతం
ఇదే అర్ధం ఇదే నిత్యం ఇదే సత్యం
నన్ను ప్రేమిచే మగడు ఎక్కడున్నాడో
కల్లముందొచ్చి షొక్కిస్తే ఎంత బాగుందో

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

నువ్వు నాతోడు ఓ నేస్తం నేను ని తోడు
నేను ని తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు




ఎటు చుస్తే అటు నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: వేల్పుల వెంకటేష్ 
గానం: చిత్ర 

ఎటు చుస్తే అటు నువ్వే 




చంపకమాల పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మాలతి, శంకర్ మహదేవన్ 

చంపకమాల



నా పంచప్రాణాలు పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్.పి.బాలు , చిత్ర

నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా (2)
ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం
ఏడేడు జన్మాలదే ఈ వరం
నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా

ఈ నేల అన్నదీ నా గంగ నువ్వని నీ ప్రేమ స్వాతివాననీ
ఈ గాలి అన్నదీ నువ్వంటే నిప్పని ఆ అగ్నిసాక్షి చాలనీ
తారలతోటి ప్రేమకు నింగి పందిరి వేసే నేలకి వంగి
అడగలేక అడుగుతుంటే అడుగడుగుకి తడబడే హృదయం
నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా

కార్తీక మాసమే కళ్ళల్లో ఉన్నది కల్యాణమెప్పుడన్నది
పెదాల మాటున ఏ మౌనమంత్రమో అక్షింతలేయమన్నది
అందరి మాటే మంగళవాద్యం అందెను నీకే మంగళసూత్రం
అదును చూసి పదును చూసి ముడిపడినది మనసుల ప్రణయం

నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా
ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం
ఏడేడు జన్మాలదే ఈ వరం




కత్తిలాంటి అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: వేటూరి 
గానం: అద్నాన్ సామి, సుజాత 

కత్తిలాంటి అమ్మాయి 

Palli Balakrishna Thursday, September 14, 2017




చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి
విడుదల తేది: 06.09.2012





Songs List:





దత్తాత్రేయుని అవతరణం పాట సాహిత్యం


చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం: యమ్. యమ్. కీరవాణి

దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం

అలా ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది
బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రి మహాముని పత్ని
అనసూయ పరమసాధ్వి అని పలికెను ఉమాపతి
అది విని రగిలిన ముగురమ్మలు అసూయా జలధిని మునిగి
అనసూయనే పరీక్షింపగా తమ తమ పతులను పంపిరి

దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం

అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులనాసతి కొలిచినది
దిగంబరముగా వడ్డింపమనిన దిక్పతులను చూసి
దిగ్ర్బాంతి చెందినది

కాలమూర్తులను చంటి పాపలుగ మార్చి వివస్త్రగ వెలిగినది
పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది

పతులు పసిపాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరి
గొల్లుమనుచూ పతిభిక్ష పెట్టమని కొంగుచాచి యాచించిరి
అనసూయ పాతివ్రత్యంతో పాలకులోకటిగ బాసిల్లిరి
తమ తమ పతులెవరో తెలియక ముగ్గురమ్మలే మొరడిలిరి

ముగురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశ అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది

దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం

సృష్టి స్థితి లయ కారకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలగా
అన్ని ధర్మముల ఆలవాలముగా ఆవు పృష్ఠమున అలరగా
నాల్గు వేదముల నడివడిగా నాల్గు శునకములు నానుడిగా
సమర్థ సద్గురు అంశమే ఆ దత్తుని ఐదు అంశములై
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా




నీ పదముల ప్రభవించిన పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యమ్. యమ్. కీరవాణి

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయినాథ మహరాజ్ కీ జై

పల్లవి:
నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
ఏ క్షేత్రమైనా తీర్థమైన నీవేగా
ఓ జీవమైనా భావమైన నీవేగా
నీవులేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
నీవులేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా

చరణం: 1
మనుజులలో దైవము నువ్వు
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయి
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ

కృష్ణా... రాధాకృష్ణా హే కృష్ణా
తనువులన్ని నీవుకాచుకోలేనురా కృష్ణా
త్రోవచూపు తోడు నీవే కృష్ణా
తలపులన్ని నీవరనా పోలేమురా
తరలిపోని తావి నీవే కృష్ణా
జగదేక జ్ఞానమూర్తి వసుదైక ప్రాణకీర్తి
తరగపోని కాంతి నీవే నంద నందనా
నీవులేని చోటులేదు కృష్ణా
ఈ జగమంతా నీవేలే కృష్ణా
నీవులేని చోటులేదు కృష్ణా
ఈ జగమంతా నీవేలే కృష్ణా



సాయి అంటే తల్లి పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, సినీత

పల్లవి:
సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
నువ్వోస్తావన్న ఆశతో
బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము
కన్నీటి చుక్కుల మయ్యాము

తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము

చరణం: 1
బోథలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు
బోథలు చేసేదెవరు మాలో బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు
పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు
పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు
తీయగ కసిరేదెవరూ...
తీయగ కసిరేదెవరు ఆపై ప్రేమను కొసరేదెవరు
సాయి... జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా?
నువు కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకేరాదు

తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము

చరణం: 2
మాకిచ్చిన నీ విబూదిని నీకూ కాస్త పూసేమయ్యా
లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతిచిన్నికర్రతో నిన్నే తట్టి లేపేమయ్య
లేవయ్యా బాబా లేవయ్యా
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని
యివ్వాళ మేమడిగేము నీ ప్రాణ భిక్షని
నీ ప్రాణ భిక్షని
యిచ్చేవరకు ఆగలేము
యిచ్చేవరకు ఆగలేము
నువ్వొచ్చేవరకు వూరుకోము
వచ్చే వరకు వూరుకోము
పచ్చి మంచినీరైనా తాకబోము

సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా నీ తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి (13)



ఒక్కడే సూర్యుడు పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహాదేవన్

సబ్ కా మాలిక్ ఏక్ హై
ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలించింది మీరు
ఏసునే దైవమనీ తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలించింది మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు

ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

కాషాయ ధ్వజమునెత్తి  ప్రణవ గంగ గలగలలను హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్ళతొ ఎదను తడిసి క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధమని జైన మని సిక్కు అని ఒప్పుకునే పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు

ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలీ
అది దేవదేవునీ జాలీ...
పసిడి మేడనీ పూరి గుడిసనీ బేధమెరిగి కురియబోదు వానా
అది లోకేశ్వరేశ్వరుని కరుణా
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు దీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమె ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు

ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు



ఓం సాయి శ్రీ సాయి పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: మేడిచెర్ల
గానం: సునీత

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సాయీ శిరిడి సాయి శిరిడి సాయీ
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య నామం భవతారక మంత్రం

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

యోగి ఓలే భిక్షాటన చేసి
మా పాలకు జోలిపట్టే భిక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీటితోనే జ్యోతులు వెలిగించి
తెరిపించెనులే జ్ఞాన చక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
రగిలే ధునిలో... చేతులు ఉంచి
పసి పాపను ఆదుకున్న ఆత్మబంధువూ

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

సేవించిన రోగుల దీవించి
వైద్యో నారాయణో హరి అని నిలిచాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించినాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
తిరగలి విసిరి... వ్యాధిని కసిరి
ఆపదనే తప్పించిన దీనబంధువు

శరణు శరణు శరణం గురుసాయి నాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయీ
నడవలేకున్నాను ఎదురుపడవోయీ
నిను చూడందే నా మనసు కుదుటపడదాయె
ఎపుడు చూసినా ఆత్మధ్యానమే కానీ నీ ఆకలే నీకు పట్టదా
ఏ జన్మ బంధమో మనది ఏనాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి

ప్రతిరూపం తన ప్రతిరూపమని
యుగాలకే మోక్షమిచ్చే మౌని
పెను తుఫానులే విరుచుకుపడగా
బీతిల్లిన జనులు పరుగులిడగా
ఆగిపోమ్మని ఆజ్ఞపించినా
గోవర్థన గిరిధారి షిరిడి పుర విహారీ

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ



అమరా రామా పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: కె. శివశక్తిదత్త
గానం: శ్వేతా పండిట్

అమరా రామా సుమా రామచరి
కామధేను క్షీరాలతో
సాయినాధుని పావనమూర్తికి
అభిషేకం క్షీరాభిషేకం
అభిషేకం క్షీరాభిషేకం

సురకల్పలతా సురభిడ సుమాలా
సురుచర సుమధుర మకరందంతో
సాయినాధుని మంగళమూర్తికి
అభిషేక్షం మధురాభిషేకం
అభిషేక్షం మధురాభిషేకం

మలయమై దర శిఖరవనంతార
చందన శీతల గంధంతో
సాయి నాధుని సుందరమూర్తికి
అభిషేక్షం చందనాభిషేకం
అభిషేక్షం చందనాభిషేకం

శ్రీహరి పదరాజీవ సముద్భవ
గగన గంగ పావన శ్రీకరముల
సాయి నాధుని శ్రీకర మూర్తికి
అభిషేకం నీరాభిషేకం
సాయి నాధుని శ్రీకర మూర్తికి
అభిషేకం నీరాభిషేకం

నీ భవహీజ సమీప ధూనీగత
ఆ దివ్యది నిరోధి ఊదితో
నీ భవహీజ సమీప ధూనీగత
ఆ దివ్యది నిరోధి ఊదితో
సాయినాధుని తేజోమూర్తికి అభిషేక్షం
పూజాభిషేఖం
సాయినాధుని తేజోమూర్తికి అభిషేక్షం
పూజాభిషేఖం

జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం



మానవ సేవే పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి
గానం: దీపు

మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా

చరణం: 1
మమతా కరుణా తనరక్తం
తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదంగా
ప్రియభాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని, ప్రేమే దైవమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా

చరణం: 2
సిరి సంపదలు ఎన్నున్నా
శీలం విలువ చేయవని
సుఖభోగములే నీవైనా
దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనరా బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా



ఎక్కడయ్యా సాయి పాట సాహిత్యం

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: మేడిచెర్ల
గానం: సునీత

ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయి
కడసారి కనులార దర్శనమునీయి
నీలోని ఈ ఆత్మ కలసిపోనీ

ఈ జన్మకిది చాలునోయి
నీ ఒడిలో కనుమూయానీ



సదానింబ వృక్షస్య పాట సాహిత్యం

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: ట్రెడిషనల్
గానం: యమ్. యమ్. కీరవాణి

సదానింబ వృక్షస్య మూలాది వాసాత్
సుధా స్రావిణం తిక్త మప్యప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నామామీశ్వరం సద్గురుం సాయినాథం

Sadaa nimbavrikshasya muladhivasat
Sudha sravinam tikthamapya priyantam
Tarum kalpavrikshadhikam saadhayantam
Namaameeswaram sadgurum sai nadham




రామనవమి పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం: హరిచరణ్ , మాళవిక

శ్రీ రామా జయ రామా రమణీయ నామ రఘురామా (5)
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రామనవమి చెప్పింది రామకథా సారం
రామనవమి చెప్పింది రామకథా సారం
శ్రీరామనవమి చెప్పింది రామకథా సారం
శ్రీరామనవమి చెప్పింది రామకథా సారం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
చిందేసింది అంబరం
రామ నవమి జయనామ నవమి శ్రీరామ నవమి చెప్పింది రామకథా సారం

దశరధుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను
విశ్వామిత్రుని వెంట దాశరథి విశ్వశాంతి విలసిల్లెను
పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు
పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు
శివ థనువు విరిచి నవ వధువును సీతను చేరెను రాముడు
సాయి...
ఆ రాముడు కొలిచిన పరమ శివుడవు పరమేశ్వరుడవు నీవే సాయి
పరమేశ్వరుడవు నీవే సాయి

రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ నవమి చెప్పింది రామ కథా సారం

తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము
మాయలేడితో మలుపు తిరిగింది మాధవదేవుని ప్రయాణము
వానర సేనలు వారధి కట్టగ వారధి దాటెను నరవరుడు
వానర సేనలు వారధి కట్టగ వారధి దాటెను నరవరుడు
రణ శిరమున రావణుకూర్చి  పట్టాభిరాముడాయే రఘురాముడు
సాయి...
ఆ రామసాయి శ్రీకృష్ణ సాయి శ్రీరంగ సాయివి నీవే సాయి
సకల దేవత సన్నిధి నీవే సమర్ద సద్గురు షిరిడి సాయి

రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ నవమి చెప్పింది రామ కథాసారం




సాయి పాదం పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం: యమ్. యమ్. కీరవాణి

పరమ యోగీంధ్రులకు పరమ పదమందించు
పరమ పావన విష్ణు పాదం
భవబంధ రహితమై బ్రహ్మమై బాసిల్లు
పరమ పావన విష్ణు పాదం
పరమ పావన పరబ్రహ్మ పాదం

ఘనభూమి గగనముల కొలిచి చుంబించి
ఫలితం భ్రమణంన వామనుడి పాదం
దివ్యమౌ భవ్యమౌ దివిజా గంగాజలము
జాలువారిన జగన్నాథ పాదం
కూనీగుండెల నిండి మైత్రి పండించిన
కులమాతీత రఘుకుల రామ పాదం
దశ దిశ దీపమీ పాదం దయకు ప్రతిరూపమీ ధర్మపాదం

శరణం శ్రీవిష్ణు పాదం
శరణం శ్రీరామ పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం

కపట రాక్షస వికట బహుపదాటోప
విదుషకట సువిపాటన సుచనలపటు పాదం
కాళీయు తలలపై తక్దిమ్మి తకదిమ్మి
తాండవమ్ముల కృష్ణ పాదం
కంసాది విధ్వంస హింసావిధ్రంశ
యదువంశ నరరాజ హంస పాదం
మూడు మూర్తుల ముక్తి పాదం
ముక్కోటి దేవతల మూలపాదం

శరణం శ్రీవిష్ణు పాదం
శరణం శ్రీరామ పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం



వస్తున్నా బాబా వస్తున్నా పాట సాహిత్యం



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చైత్ర , యమ్. యమ్. కీరవాణిి, రేవంత్ , యస్. పి. బాలు, సాయి కుమార్

గాలే ఆగిపోతుందంటే నమ్మాలా
నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా
నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా
దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా
అది జరగబోదు అని, జగరనివ్వనని
వస్తున్నా బాబా వస్తున్నా
ఆ మృత్యువు రాకని ఆపేయాలని వస్తున్నా
మీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా బాబా వస్తున్నా
వస్తున్నా బాబా వస్తున్నా

బాబా మిమ్మల్ని చూడకుండా
మీ చూపుకు నోచుకోకుండా ఎలా బ్రతకటం బాబా

బాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి
ఇక మా బాధల్ని ఎవరితో చెప్పుకోవాలి బాబా

భక్తులు మీరు మీ భక్తికి బానిస నేను
సూర్యచంద్రులు, చుక్కలు నేనై కనపడుతుంటాను
మిమ్ము కనిపెడుతుంటాను
బాబా నేను మీ భారం మోస్తుంటాను

సమాధి నుండే సమాధి నుండే బదులిస్తాను
సహాయమడిగితే కదిలొస్తాను
పిలిస్తే పలుకుతాను పిలిస్తే పలుకుతాను
పిలిస్తే పలుకుతాను, బాబా బాబా

వస్తున్నా బాబా వస్తున్నా
నీ బదువుగా నేనే బలిఅవుతానని వస్తున్నా బాబా వస్తున్నా
వస్తున్నా బాబా వస్తున్నా

మీ భక్తుల ఇంట్లో లేదు అనే మాటే వినపడదని మీరే చెప్పారు బాబా
మాకిప్పుడు వెలుగు లేదు నీడ లేదు అసలు మా బ్రతుక్కి అర్థమే లేదు
మీరు లేనిలోటు ఎలా తీరాలి బాబా ఎలా తీరాలి

నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో
నా రూపాన్నే తలవండి మీ లోపల కొలువవుతాను
నా నామాన్నే పలకండి మీ లోపం తొలగిస్తాను
నా హారతి దర్శించండి, మీ ఆపద ఆపేస్తాను
నా విభూది ధరియించండి, మీ వేదన నాదంటాను
నా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తాను
నా చరితను పఠియించండి మిము చరితార్థుల చేస్తాను
మరణ శయ్య కాదిది శరణు కోరినవారికి కరుణ శయ్య
సమాధి కాదిది, కష్టాల తొలగించు సన్నిధి
జ్ఞాన సిరిలనందించు పెన్నిధి
శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ షిరిడీ
శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ

Palli Balakrishna Sunday, August 13, 2017



చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీహరి, సింధు మీనన్
దర్శకత్వం: యన్. శంకర్
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
విడుదల తేది: 06.12.2001



Songs List:



ఇదే నా పల్లెటూరు పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్, ఉష

ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు
మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా
తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... 

చరణం: 1
రామునికి బాణమొకటే 
భార్య సీతమ్మ ఒకటి
ఆ రాముడంటి కొడకు 
ఇంటింటా ఉంటే ఒకడు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జోయ్ జోయ్ జోయ్...

ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది
హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... 

చరణం: 2
తొలకరిలో వానచుక్క 
రుచిచూస్తే తేనెచుక్క
భూమిపై మోముపైన 
చిన్ని గరిక నవ్వుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జోయ్ జోయ్ జోయ్...

ఆలమంద పాలధార 
మీటుతున్నదో సితార
కడుపునిండ పాలు తాగి లేగదూడలాడుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్....




ఓ ఓ చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కుమార్ సాను, స్వర్ణలత

ఓ ఓ చెలియా



కుడ కుడడ రోడ్డులో పిల్ల ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత

కుడ కుడడ రోడ్డులో పిల్ల ఉంది
అది రానంటుంది నన్నే రమ్మంది





చేనేత చీరకట్టి పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కవితా కృష్ణమూర్తి, జస్విందర్ సింగ్ నిరోల

చేనేత చీరకట్టి



ఒకటే జననం ఒకటే మరణం పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, చిత్ర

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ 
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్రే నీకొద్దు నీకేది హద్దు

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా 
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా 
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

నిదరోకా నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె 
గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో 
ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ 
దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

Palli Balakrishna Sunday, July 16, 2017
Magadheera (2009) Telugu Songs Lyrics Album Cover

Magadheera (2009) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Magadheera (2009)
Banner : Geetha Arts
Music : M. M. Keeravani
Director : S. S. Rajamouli
Producers : Allu Aravind, B. V. S. N. Prasad
Actors : Ram Charan
Actresses : Kajal Aggarwal
Cameo Appearances : Chiranjeevi, Mumaith Khan, Saloni Aswani, Noel Sean, Kim Sharma
Release Date : 31 July 2009

Bangaru Kodipetta Song Lyrics in Telugu – Magadheera (2009)

'Bangaru Kodipetta' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani and sung by Ranjith and Shivani. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Magadheera (2009)
Lyricist : Bhuvana Chandra
Singers : Ranjith, Shivani
చిత్రం: మగధీర (2009) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: భువనచంద్ర గానం: రంజిత్, శివాని ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు(2) అప్ అప్ హండ్స్ అప్ పాప హండ్స్ అప్ హా హా బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాప హే పాప హే పాప అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో చేస్తా జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాప హే పాప హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాప హే పాప హే పాప స ప మ ప ద ప ప ద ప ప ద ప స ప మ ప ద ప స ప మ ప ద ప స ప మ ప ద ప హండ్స్ అప్ పాప స ప మ ప ద ప ర ప ప ప ప పా ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు అంతంత ఉన్నాయెత్తులు బొలో బొలో నీ కన్ను పడ్డాక ఓరయ్యొ పొంగెస్తున్నాయి సొత్తులు చలో చలో సిగ్గు లేని రైక టెక్కు చూస్తా డోలమాలు కోకపొంగులో కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో కొంగుపట్టీ కొల్లగొట్టకు హే హే అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో రైక జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో ఎంటమ్మా ఎంటమ్మా అందులో అందాల చిట్టి గంపల్లో బోలో బోలో నా ఈడు నక్కింది బావయ్యొ చెయ్యెసినాకా మత్తుల్లో చలో చలో చేత చిక్కినావే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యనా తియ్యనా కాక మీద ఉన్నదాన్నిరయ్యో దాకమీద కోపమెందుకు హే హే అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో ఒకే జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాప హే పాప హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాప హే పాప హే పాప

Dheera Dheera Dheera Song Lyrics in Telugu – Magadheera (2009)

'Dheera Dheera Dheera' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani and Nikitha Nigam. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Magadheera (2009)
Lyricist : Chandrabose
చిత్రం: మగధీర (2009) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎం. ఎం. కీరవాణి, నికిత నిగమ్ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర అసమాన సాహసాలు చూడ రాదునిద్దుర నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర సఖి సా... సఖి ఆఆ ఆఆఆఆఆ ఆఆ ఆఆఆఆఆఆఆ సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా అధిపతినై అదికాస్తా దోచేదా - మ్ మ్ మ్ మ్ పోరుకైన ప్రేమైకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర సువెరాహియా... హో సువెరాహియా... హో (2) శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడదా మగసిరితో అందమే అంతు తడితే అంతేగా అణువనువూ స్వర్గమే ఐపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చెరశాలలోని ఖైదు కాని కాంక్షవుందిగ శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదునిద్దుర ప్రియ పూజలేవో చేసుకోన చేతులారా సేదతీర ధీర ధీర ధీర మనసాగలేదురా ధీర ధీర ధీర మనసాగలేదురా

Panchadara Bomma Song Lyrics in Telugu – Magadheera (2009)

'Panchadara Bomma' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani and sung by Anuj Gurwara and Rita. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Magadheera (2009)
Lyricist : Chandrabose
Singers : Anuj Gurwara, Rita
చిత్రం: మగధీర (2009) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: అనూజ్ గురువార, రీటా పంచదారా బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఎమవుతానమ్మా నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మా నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మా... పువ్వుపైన చెయ్యెస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వనిపంపిందే నువ్వు రాకు నా వెంటా ఈ పువ్వు చుట్టూ ముల్లంటా అంటుకుంటే మంటే ఒళ్ళంతా తీగ పైన చెయ్యెస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపువెంట ఉరుమంటా ఉరుము వెంట వరదంటా నే వరదలాగ మారితే ముప్పంటా వరదైనా వరమని వరిస్తానమ్మా అ అ అ మునకైనా సుకమని వడేస్తానమ్మా అ అ అ నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మా... గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా గాలి ఉపిరైయ్యిందీ నేల నన్ను నడిపిందీ ఎవిటంట నీలో అది గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతమెందుకు నా పైనా... వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలిక నీకేలా అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మా...

Jorsey Song Lyrics in Telugu – Magadheera (2009)

'Jorsey' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani and sung by Daler Mehndi and Geetha Madhuri. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Magadheera (2009)
Lyricist : Chandrabose
చిత్రం: మగధీర (2009) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: దలేర్ మెహందీ, గీతామాధురి పైట నలిగితే మాయమ్మ ఒప్పుకుంటదేటి బొట్టుకరిగితే మా బామ్మా ఊరుకుంటదేటి అదే జరిగితే...ఒలమ్మో అదే జరిగితే అత్తమ్మ తట్టుకుంటదేటి ఏటిచెప్పను నానేటి చెప్పను నానేటి చెప్పను చెప్పానే చెప్పొద్దు చెప్పానే చెప్పొద్దు చెప్పానే చెప్పొద్దు వంకా తిప్పనే తిప్పొద్దు డొంకా చేతుల్లో చిక్కకుండా జారిపోకే జింకా పారిపోతే ఇంకా మొగుతాది ఢంకా చెప్పానే చెప్పొద్దు వంకా ఇవ్వనే ఇవ్వొద్దు ఢంకా ఏనాడో పడ్డదంట నీకు నాకు లింకా నువ్వునేను సింకా వోసి కుర్రకుంకా ఎక్కడ నువ్వెలితే అక్కడ నేనుంటా ఎప్పుడు నీ వెనకే... ఏఏఏఏఏఏ జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే ఈ యాల మంగలవారం మంచిది కాదు మానేసెయ్ సే సే సే సీ సహా... సీ సహా... (2) నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టు ముడతా పంజరమై నీ సిగ్గుకోస్తా కొడవలినై నవ్వోలికిస్తా కవ్వాన్నై హ షభా అరె షభా అరె షభా షభా షభా షభా షభా నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టు ముడతా పంజరమై నీ సిగ్గుకోస్తా కొడవలినై నవ్వోలికిస్తా కవ్వాన్నై నిప్పుల ఉప్పెనలే ముంచుకువస్తున్నా నిలువను క్షణమైనా... ఏఏఏఏఏఏ జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే అలవాటు లేనే లేదు అయ్యెదాక ఆగేసేయ్ సె సె సె ఎ పిల్లడు ఎ ఎ పిల్లడు ఒయ్ పిల్లడు ఒయ్ ఒయ్ పిల్లడూ చల్లెక్కుతున్న వేళ చిమ్మ చెట్టు నీడలోకి చురుక్కుమన్న వేళ పాడు బడ్డ మేడలోకి వాగులోకి వంకలోకి సందులోకి చాటులోకి నారుమల్లతోటలోకి నాయుడోల్ల పేటలోకి బుల్లిచేను పక్కనున్న రెళ్లుగడ్డి పాకలోకి పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్డా మొస్తవా వస్తా బాణాన్నై రాస్తా బలపాన్నై మొస్తా పల్లకినై ఉంటా పండగనై నీ దారి కోస్తా బాణాన్నై నీ పేరు రాస్తా బలపాన్నై నా ఈడు మొస్తా పల్లకినై నీ తోడు ఉంటా పండగనై పిడుగుల సుడిలోనా ప్రాణం తడబడినా పయనం ఆగేనా యె యె ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే

Naakosam Nuvvu Song Lyrics in Telugu – Magadheera (2009)

'Naakosam Nuvvu' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani and sung by Deepu and Geetha Madhuri. Lyrics are written by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Magadheera (2009)
Lyricist : M. M. Keeravani
చిత్రం: మగధీర (2009) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి గానం: దీపు, గీతామాధురి బబ్బ బబ్బబ్బబాగుంది బబబ్బబ్బ బాగుంది బబ్బ బబ్బబాగుంది ఇస్... బాగుంది నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది నాకోసం నువ్వు గోడ దూకేడం బాగుంది నే కనపడక గోళ్ళు కొరికెయడం బాగుంది పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది కే వీ ఆర్ పార్కులో జాగింగుకి వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ స్విస్ వీధుల మంచులో మాట్లాడుతు ఫ్రెంచ్ లో బర్గర్ తింటున్నావంటు ఇంటిమేషన్ పాల కడలి అట్టడుగుళ్ళో పూల పరుపు మెత్తటి దిల్లో పైన పడుకునుండుంటావని కాల్కులేషన్ ఘన గోపుర భవంతిలో జన జీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడుమూతలు ఆడడమనుకుంటా నీ ఇంటెన్షన్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ హే ఇందూ హా ఓ ఓ సారీ సారీ ఇడియట్... కాన్ట్ యు సీన్ ఎవరో ఒక వనితా మనిని నువ్వేమోననుకుని పిలిచి కాదని తెలిసాకా వగచీ సర్లే అని విడిచీ వెనకడుగేయొద్దుర కన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురై పోతారేమో ఇహలో ఎపుడైనా అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికీ దొరకని దొరసానీ దరికొచ్చేదెపుడంటున్నా అంటున్నా అంటున్నా పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్

Rolling Titles Music Song Lyrics in Telugu – Magadheera (2009)

'Rolling Titles Music' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani and sung by Jessie Gift. Lyrics are written by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Magadheera (2009)
Lyricist : M. M. Keeravani
Singer : Jessie Gift
చిత్రం: మగధీర (2009) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి గానం: జెస్సి గిఫ్ట్ అనగనగనగనగ అనగనగ అనగనగనగనగనగనగ అనగనగనగనగ అనగనగనగనగనగనగనగనగనగ... హే అనగనగనగనగనగ రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలో ఒకటే ఎందుకు ఎండలేదురా... అది ఒకటే ఎందుకు ఎండలేదురా... అది ఎండేలోగ వానొచ్చిందిరా పాయింటే... ఆ వానల్లోన వరదొచ్చిందిరా చేప ఎండేలోగ వానొచ్చిందిరా ఆ వానల్లోన వరదొచ్చిందిరా ధీరా...ధీరా...ధీరా... మగువలు వలచిన మగధీరా మనసులు దోచిన మగధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగధీరా... ధీరా ధీరా ధీరా ధీరా గెట్ అన్ ది ఫీల్ నౌ ఇస్ మూవ్ ఇట్ అన్ ది స్వీట్ సే వి వాన్నా సే సంతింగ్ బెట్టర్ యు వాస్ వాట్ ద తింక్ నౌ రాక్ ఎవ్రీ వన్ వి వేర్ అన్ ది రన్ నౌ కీప్ ద ఫ్లోర్ మూవ్ మూవ్ ఎవ్రీ వన్ గెట్ ద గ్రోన్ నౌ డాన్స్ ఎవ్రి వన్ రాక్ సో నౌ కాచ్ ఎవ్రీ వన్ హె హ హ హ హే చలపతి కాలి ధూలపాక పక్కన ఉన్న సందు ఎనక ఇరగాపండిన తోటలోన నిగ నిగ మంటున్న నిమ్మా పండూ...పండూ పండూ పండూ అది మీసం మీద నిల బెట్టాలి రా నిమ్మా పండూ మీసం మీద నిల బెట్టాలి రా కొండలు పిండీ కొట్టేయ్యలిరా అహా ధిక్కుల్నైనా దున్నేయ్యాలి రా అహా కొండలు పిండీ కొట్టేయ్యలిరా అహా ధిక్కుల్నైనా దున్నేయ్యాలి రా ధీరా...ధీరా...ధీరా... వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా హే ఇరుగూ దిష్టీ పొరుగూ దిష్టి ఇంటా బయట తగిలిన దిష్టి నీది దిష్టీ నానా దిష్టీ దిష్టీ... దిష్టి... దెబ్బకు వదిలి దొబ్బేయ్యాలి రా ఈ దెబ్బకు వదిలి దొబ్బేయ్యాలి రా గుమ్మడికాయ కొట్టేయ్యాలిరా మంగళహారతి పట్టేయ్యాలిరా గుమ్మడికాయ కొట్టేయ్యాలిరా మంగళహారతి పట్టేయ్యాలిరా ధీరా...ధీరా..ధీరా... వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా ధీరా...ధీరా...ధీరా...

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default