-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K. M. Radha Krishnan"



చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: చంద్రబోస్, వేటూరి, సాహితి 
నటీనటులు: శ్రీకాంత్, లక్ష్మీ రాయ్ 
దర్శకత్వం: పార్థసారథి 
నిర్మాతలు: పొట్లూరి సత్యన్నారాయణ, కె. వి. కృష్ణారావు 
విడుదల తేది: 09.07.2005



Songs List:



కాంచన మాల కేబుల్ టీవీ పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: సందీప్, శ్రీకాంత్, సునీల్, లలితా సాగరి 

కాంచన మాల కేబుల్ టీవీ



కంట్లో కావేరీ పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: కార్తీక్, హరిణి 

కంట్లో కావేరీ 



కృష్ణ కోలాటాలు పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: శంకర్ మహదేవన్, కల్పన 

కృష్ణ కోలాటాలు 




నాదిరి దిన్నా పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: శంకర్ మహదేవన్, కల్పన 

నాదిరి దిన్నా 




ఓ నీలవేణి పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్. పి. చరణ్,  కె.యస్.చిత్ర 

ఓ నీలవేణి 



సై అంటే పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సాహితి చెరుకుపల్లి 
గానం: లలితా సాగరి 

సై అంటే 

Palli Balakrishna Friday, August 5, 2022
Siddu From Srikakulam (2008) Telugu Songs Lyrics Album Cover

Siddu From Srikakulam (2008) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Siddu From Srikakulam (2008)
Director : Eashwar
Actors : Allari Naresh
Release Date : 14 August 2008

Na Nababa Nanana Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Na Nababa Nanana' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by K. M. Radha Krishnan and Swetha.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Bhoopal
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: భోపాల్ గానం: కె. ఎం. రాధాకృష్ణన్, శ్వేత నా నాబాబా నా నానా

Jampandu Lanti Pilla Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Jampandu Lanti Pilla' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Ranjith.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Vanamali
Singers : Ranjith
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వనమాలి గానం: రంజిత్ జాంపండు లాంటి పిల్ల

O Kshanamainaa Chaalu Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'O Kshanamainaa Chaalu' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Hemachandra and Sahithi.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Veturi
Singers : Hemachandra, Sahithi
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం:హేమచంద్ర, సాహితి ఓ క్షణమైనా చాలు

Thellariponiku Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Thellariponiku' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Gayathri.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Peddada Murthy
Singers : Gayathri
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం: గాయత్రి పల్లవి: తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని మనసు కనక మనవి వినక చలికి మరి దూరాన ఉంటే ఎలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని చరణం: 1 ఆ నింగి జాబిలమ్మ తొడుగానే ఉందిగా చుక్కే నీదంటు పక్కే రమ్మంటే చూస్తావే అలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని చరణం: 2 ఏమంత లేనిదాన్ని కానిదాన్ని కానుగా ఇలా చీ పో లు పై పై కోపాలు నాపై నీకిలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని మనసు కనక మనవి వినక చలికి మరి దూరాన ఉంటే ఎలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని

Sarasangi Rathanangi Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Sarasangi Rathanangi' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by N. C. Karunya.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Sai Sriharsha
Singers : N. C. Karunya
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: శ్రీ సాయి హర్ష గానం: ఎన్.సి. కారుణ్య సరసాంగి రతనాంగి మదనాంగి ఐ లవ్ యు రా

Palli Balakrishna Friday, February 15, 2019


చిత్రం : శుభలేఖ+లు (2018)
సంగీతం : కె.ఎమ్.రాథాకృష్ణన్
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : కె.ఎమ్.రాథాకృష్ణన్
నటీనటులు: శ్రీనివాస సాయి, ప్రియ వడ్లమని, దీక్ష శర్మ రైనా
దర్శకత్వం: శరత్ నర్వదే
నిర్మాత: విద్యాసాగర్
విడుదల తేది: 07.12.2018

పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ....
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ...

కోరుకున్న కల శిల్పమైన శిల
నిజమయ్యే నిమిషం
ఎదురు చూసినది ఎదను దాచినది
ఎదురయ్యే సమయం
కోరుకున్న కల శిల్పమైన శిల
నిజమయ్యే నిమిషం
ఎదురు చూసినది ఎదను దాచినది
ఎదురయ్యే సమయం
మనసు దేనికై పరుగు తీయునో
మదికి నెమ్మదిని ఎచట ఇచ్చునో
అది వెతికిన ప్రతి ఒకరికి దొరికేనా
ఏమో...

పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ...

ప్రేమతోన పెనవేసుకున్న
ప్రతి పయనం అతి మధురం
మాట మాట కలిపేసుకుంటె
మధువొలికిన రుతు పవనం
ప్రేమతోన పెనవేసుకున్న
ప్రతి పయనం అతి మధురం
మాట మాట కలిపేసుకుంటె
మధువొలికిన రుతు పవనం
నిన్ను నిన్నుగా ఏది ఉంచునో
నిన్ను రేపులతొ ఊరడించునో
ఆ చెలిమిని మరువకు మరి ఏనాడైనా
తోడే...

పద్మనాభ పాహి
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ... శౌరీ... శౌరీ..

Palli Balakrishna Friday, February 1, 2019


చిత్రం: లక్ష్మీ రావే మా ఇంటికి (2014)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణ
సాహిత్యం: భాస్కరబాట్ల
గానం: కె. యమ్. రాధాకృష్ణ
నటీనటులు: నాగ చౌర్య , అవికా గోర్
దర్శకత్వం: నంద్యాల రవి
నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి
విడుదల తేది: 05.12.2014

దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారే
దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారే
ఒక్కొక్క మాట పిస్తోలు తూటా పేలినట్టు ఉంటదంట
ఒక్కొక్క నవ్వు టెంపుల్లో గంట మోగినట్టు ఉంటదంట
కొత్తగాలే తాకుతుంటే పైరగాలి ఎందుకంటా
అందరు చుస్తే అమ్మోరు ఏదో పూనినట్టు అవుతదంట
టచ్చింగ్ ఇస్తే భూకంపమేదో వచ్చినట్టు ఉంటదంట
ఆవరికే మాకువుంటే అష్టదిక్కులెందుకంట

దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారే

పిల్ల వచ్చే కళ్ళోకొచ్చే
పిల్ల వచ్చే గుళ్ళోకొచ్చే
పిల్ల వచ్చే ఒళ్ళోకొచ్చే

చరణం: 1
బ్లూ టూత్ ఏదో ఆన్ చేసినట్టు
బ్యూటిఫుల్ బేబీని చూస్తుంటే
కొత్త ఫీలింగ్స్ పొంగేస్తూ ఉంటాయే
తీపి య సేదో ఆటివ్వు చేసి ఇందాక జరబెట్టి కొడుతుంటే
మేం జిల్లాలు దాటేస్తు ఉంటామే
రెండు కళ్ళల్లో స్క్రీన్ సేవర్ వీల్లేగా
చిట్టి గుండెల్లో వాల్ పేపర్ వీల్లేగా
నువ్ చూడకు నైకో అంతా డల్లేగా

దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారి

చరణం: 2
ఐ ఫోన్లో కూడా ఉండని ఫీచర్స్ అందాల పాపల్లో ఉంటాయే
మా మైండంత కెలికేస్తు ఉంటాయే
లిక్కర్లో లేని మత్తైన చక్కెర్ అమ్మాయి చెయ్ గాల్ల ఉంటాయే
తెగ ఊరిస్తు కొరికేయ్ మంటాయే
జంటా రెప్పల్లో కెమెరాలే ఉంటాయే
టిక్కు టిక్కంటు మాకు ఫ్లాసే కొడతాయే
మేం లడకి కోసం కుచ్ బి కరేగా

దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారి

పిల్ల వచ్చే కళ్ళోకొచ్చే
పిల్ల వచ్చే గుళ్ళోకొచ్చే
పిల్ల వచ్చే ఒళ్ళోకొచ్చే

Palli Balakrishna Sunday, October 15, 2017



చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
నటీనటులు: రవితేజ, అనుష్క , కృష్ణ ఘట్టమనేని
దర్శకత్వం: కె.ఆర్ ఉదయ్ శంకర్
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 15.08.2008



Songs List:



ఎటు పోదాం పాట సాహిత్యం

 
చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: నవీన్, రీటా 

ఎటు పోదాం




అందమైన పాట సాహిత్యం

 
చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య 

అందమైన 




నువ్వు కొంచం తేడా పాట సాహిత్యం

 
చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్

నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడా
ఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడా
నువ్వు కొంచం తేడా నీ నడక కొంచం తేడా
నీ సరుకు కొంచెం తేడా నీ శకలు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావే అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా

చీర చుట్టుకొని రమ్మంటే వోణి కట్టుకొని వస్తావు
వోణి కట్టుకొని రమ్మంటే నైటీ లోనే వస్తావు
గేటు తీసుకొని రమ్మంటే గోడదూకి నువ్వొస్తావు
గోడదూకి నేను రమ్మంటే కిటికీ లోంచే వస్తావు
అందరుంటే కొంతే తేడా ఒంటిగుంటే చాలా తేడా
పట్టపగలు కొద్దిగ తేడా చీకటైతే బాగా తేడా
ఎంతని ఎన్నని చెప్పలోయ్ ఒకటా రెండా ముడా

నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడా
ఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా

హే రపప్పా... హే రపప్పా...
హే రపా రపా రపా రపా హే రపా రపా
హే రపా రపా రపా రపా హే రపా రపా ఆ...
బల్లవేసి బజ్జోమంటే మంచమేయ్యమని అంటావు
మంచమేసి నిదరోమంటే నన్నే ముంచేస్తుంటావు
బుగ్గపైన చెయ్యేస్తుంటే సిగ్గు అంటు అటు జరిగేవు
సిగ్గు అనుకొని వెళుతుంటే సిగ్నల్స్ ఏవో ఇస్తావు
తప్పు అంటే మినిమం తేడా ఒప్పుకుంటే మొత్తం తేడా
బుజ్జగిస్తే స్వల్పం తేడా రెచ్చగొడితే సర్వం తేడా
ఈడును ఎక్కడ దాచాలోయ్ ఎడా ఈడా ఏడా

నువ్వు కొంచం తేడా నీ పనులు కొంచం తేడా
నీ కథలు కొంచెం తేడా సంగతులు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడా

నువ్వు కొంచం తేడా నీ రూటు కొంచం తేడా
నీ టేస్ట్ కొంచెం తేడా నీ బుద్ది కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావే అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా





రంగు రంగు పాట సాహిత్యం

 
చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సుజాత మోహన్

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరి రానా తెర తెంపేయనా
శాన పరిశాన సిరి వంపేయన
కానా జతకాన చలి చెంపేయన
మైనా తడిమేయ్ నా తడి సంపాదన
నాకు నీకు నీకు నాకు వానే కదా వంతెన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా

ఊదిలాగ ఒకటి అరె సూదిలాగ ఒకటి
చిరుచినుకులన్ని కురిసే ఈ పైనా
బంతిలాగా ఒకటి అణుబాంబు లాగ ఒకటి
తొలి చినుకులన్ని తగిలాయి లోన
చేయాలంది వాన నీతోనే రవాణా
చూడాలంది వాన నీలోనే దిఖానా
బావిలోన నిలిచిపోర మనసుపైకి నిచ్చన

చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా

చినుకు చీర కట్టి అరె ఒణుకు పూలు పెట్టి
వరదల్లే కదిలి వస్తుంది జాణ
మబ్బు గొడుగు పట్టి మెరుపిట్ట అడుగుపెట్టి
హరివిల్లులాగ ఒళ్లే పరిచేనా
ముంచేసింది వాన నీతోని సుఖానా
పంచేసింది వాన నాలోని నమూనా
వాన లాగా చల్లిపోన వలపు మూల మూలన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరి రానా తెర తెంపేయనా
శాన పరిశాన సిరి వంపేయన
కానా జతకాన చలి చెంపేయన
మైనా తడిమేయ్ నా తడి సంపాదన
నాకు నీకు నీకు నాకు వానే కదా వంతెన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా




గుండెలొ ఇల్లుంది పాట సాహిత్యం

 
చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య, చిత్ర

గుండెలొ ఇల్లుంది ఇంట్లొ చొటుందీ
అందులొ నువ్వె వుంటావా అతిగా ముద్దె ఇస్తావా
గుండెలొ ఇల్లుంటె ఇంట్లొ చొటుంటె
అందులొ నెనె వుంటాగా అతిగా అతిగా నన్నె ఇస్తగా
వెంటనె త్వరపడి వస్తావ
నూరెళ్ళుండె నొటె రాస్తవ వ వ వ వ

నెపురు వయ్యరి దెయ్యం
నీవైపు చూస్తెనె భయం
అయ్యింది నీతొటి కయ్యం
అది ప్రెమకు ప్రారంభం
తీరంగ చూసావు సొద్యం
తగ్గింది నాలొని పైత్యం
ఇది ఇద్దరి సంబందం
మయ్యల నువ్వె ఒచ్చి హాయినె తెచ్చవా
మంత్రమై నువ్వె ఒచ్చి మత్తులొ ముంచవా
కొపించి తప్పించి నాలొన వ్యాపించి ప్రెమ పంచవా

ఇన్నళ్ళు నువ్వంటె భారం
ఒళ్ళంత పూసావు కారం
ఇవ్వళె వెసావు హారం
ఇక నువ్వె నా తీరం
ఇన్నళ్ళు పెట్టాను శాపం
ఇలొన పెట్టాను కొపం
తెలిసింది నాలొని లొపం
ఇక నువ్వె నా లొకం
ఎండల నువ్వె ఒచ్చి నీడల మారవా
ఉప్పెనై ముందె ఒచ్చి ఊయలై చెరవా
సాదించి వాదించి ఆపైన స్పందించి
ప్రాణం అయ్యవా




తెల్ల చీర పాట సాహిత్యం

 
చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: పెద్దాడ మూర్తి 
గానం: సుఖ్విందర్ సింగ్ , అనురాధ శ్రీరాం 

తెల్ల చీర 

Palli Balakrishna Sunday, October 1, 2017
Godavari (2006) Telugu Songs Lyrics Album Cover

Godavari (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Godavari (2006)
Director : Sekhar Kammula
Producer : G. V. G. Raju
Actors : Sumanth
Release Date : 19 May 2006

Uppongele Godavari Song Lyrics in Telugu – Godavari (2006)

'Uppongele Godavari' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Godavari (2006)
Lyricist : Veturi
చిత్రం: గోదావరి (2006) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు షడ్జమాం భవతి వేదం పంచమాం భవతి నాదం శృతి శిఖరే నిగమ ఝరే స్వరలహరే సా స పా ప ప ప ప మ రి స స ని స సా స పా ప ప ప ప మ ద ప ప సా స పా ప ప ప ప మ రి స స ని స సా స పా ప ప ప ప మ ని ద ప ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయ్యంగానె లాభసాటి బేరం ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ? నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాదా ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అల పాపి కొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరీ

Andamgalena Song Lyrics in Telugu – Godavari (2006)

'Andamgalena' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by Sunitha Upadrashta.

SONG INFORMATION
Movie : Godavari (2006)
Lyricist : Veturi
చిత్రం: గోదావరి (2006) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: సునీత అందంగాలేనా అసలేం బాలేనా అంత లెవలెందుకోయ్ నీకు ఉఁ అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకి కలికి చిలకనాయే కలత నిదురలాయే మరువలేక నిన్నే మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వోచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా నీకు మనసు ఇచ్చా ఇచ్చి నపుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ తెలుగు ఆడపడచు తెలుపలేదు మనసు మహాతెలియనట్టు నటనలే అది ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

Manasa Gelupu Song Lyrics in Telugu – Godavari (2006)

'Manasa Gelupu' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by Shankar Mahadevan, K. S. Chithra and K. M. Radha Krishnan.

SONG INFORMATION
Movie : Godavari (2006)
Lyricist : Veturi
చిత్రం: గోదావరి (2006) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శంకర్ మహదేవన్, చిత్ర, కె.యమ్. రాధాకృష్ణన్ విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా  పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా  ఈ దేశం అందించే ఆదేశం నీకేరా  ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా  రేపు మాపు నీవేరా  మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవెరా  తలకుల తారల్లో వెలుగుల ధారల్లో  తలకుల తారల్లో వెలుగుల ధారల్లో  మనసా గెలుపు నీదేరా.... నీదేరా...  చరణం: 1 మనస్సులోనే మార్గముంది తెలుసుకోర ఇక  పూరి లేని దేని బాణమింక చేరుకోదు ఎలా  ప్రతి రోజు నీకొక పాఠమే  చదువుకుంటూ పద  ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృదా  చరణం: 2 ఆమనొస్తే కొమ్మల్లన్ని కోయిలమ్మలు కదా  ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా  దేవుడైన రాముడైనది ప్రేమ కోసం కదా  ప్రతి జీవితం ఓ వెలుగు నీడల  బొమ్మలాటే కదా 

Tippulu Tappulu Song Lyrics in Telugu – Godavari (2006)

'Tippulu Tappulu' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Godavari (2006)
Lyricist : Veturi
Singers : Shreya Ghoshal
చిత్రం: గోదావరి (2006) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయ గోషల్ టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడల చినుకుమన్న జాడలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు గాలి వాన తోడై వచ్చీ ఊయ్యాలూపగా వాన రేవు పిల్ల పెద్ద సయ్యాటాడగా గూటి పడవలో కోటి జంటలు కూత పెట్టు లేత వలపులు లంగరేసినా అంది చావని రంగసాని చాటు పిలుపులు రాకడో పోకడో రాములోరికెరుకలే టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు ఏరు నీరు ఓ దారైతే ఎదురీదాలిలే ఎండా వాన కొండా కోనా నీళ్ళాడాలిలే ఘల్లు ఘల్లున సాని కిన్నెర ఓటమింక గజ్జె కట్టెలే నింగి నంటని గంగ వంటిది పండు ముసలి శబరి పళ్ళివే వాన రా ఓ నరా తోకలేని వానరా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడల చినుకుమన్న జాడలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు

Manasa Vaacha Song Lyrics in Telugu – Godavari (2006)

'Manasa Vaacha' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by K. S. Chithra and P. Unnikrishnan.

SONG INFORMATION
Movie : Godavari (2006)
Lyricist : Veturi
చిత్రం: గోదావరి (2006) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: ఉన్నికృష్ణన్, చిత్ర మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా... మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా అ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా... మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా రాముని కోసం సీతలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

Raama Chakkani Song Lyrics in Telugu – Godavari (2006)

'Raama Chakkani' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by Gayathri.

SONG INFORMATION
Movie : Godavari (2006)
Lyricist : Veturi
Singers : Gayathri
చిత్రం: గోదావరి (2006) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: గాయత్రి నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ...  మధురవదన నళిననయన మనవి వినరా రామా  రామ చక్కని సీతకి అరచేత గోరింట  ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట  రామ చక్కని సీతకి...  చరణం: 1  ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే  ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే  ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో  రామ చక్కని సీతకి...  చరణం: 2  ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే  చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి  నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు  రామ చక్కని సీతకి...  చరణం: 3  చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా  నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే  చూసుకోమని మనసు తెల్పి మనసు మాటలు కాదుగా  రామ చక్కని సీతకి అరచేత గోరింట  ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట  ఇందువదన కుందరదన మందగమన భామా  ఎందువలన ఇందువదన ఇంతమధన... ప్రేమా... 

Palli Balakrishna Wednesday, August 16, 2017



చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్  
నటీనటులు: నవదీప్, శివబాలాజీ, కాజల్,  సింధు మీనన్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: సి.కళ్యాణ్, యస్.విజయానంద్
విడుదల తేది: 06.09.2007



Songs List:



రేగుముళ్ళోలె పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కార్తీక్, యమ్.యమ్. శ్రీలేఖ, నోయెల్

రేగుముళ్ళోలె నాటు సిన్నాది బొడ్డు మల్లెను సూడు అన్నది
మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టిపోతాను
కుచిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా...

కోనేటి నీళ్ళల్లో వంగిందిరో
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గొడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి తన జడను విసిరి వయ్యరి
చిరు నగవు చిలికి ఒకసారి కొస పెదవి కొరికి ప్రతిసారి
యహ మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దడతావా నువ్వు

ఆ జొన్న చేలళ్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సై అంటేరో
దాసొహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే  తెగ కులుకులొలికె ఆ సిలక
మీసాలు గుచ్చకుండా ఒసే భామ ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దాడుతావా అంది




బుగ్గే బంగారమా పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం:  పెద్దాడ మూర్తి
గానం: రాజేష్ కృష్ణన్

సాకీ:
పచ్చిపాల యవ్వనాల గువ్వలాట 
పంచుకుంటే రాతిరంత జాతరంట

పల్లవి: 
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 
పట్టుచీరల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ 
కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లొ ముద్దుగుమ్మ

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 

చరణం: 1
ఎదురే నిలిచే అధర మధుర దరహాసం 
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం 
వెలిగే అందం చెలికే సొంతం వసంతం 
వరమై దొరికే అసలు సిసలు అపురూపం 
కలిసే వరకు కలలో జరిగే విహారం 
పుష్యమాసాన మంచునీవో భోగిమంటల్లొ వేడి నీవో 
పూల గంధాల గాలినీవో పాల నురగల్లొ తీపి నీవో 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 

నగమల్లి పూల తోడ నంజుకున్న ముద్దులాట
సందెకాడ కొత్తగానే ఆరుబయట ఎన్నేలెంత 
సర్దుకున్న కన్నె జంట సర్దులాయెరో
యో నారుమల్లి తోటకాడ నాయుడోరి ఎంకిపాట
నగమల్లి పూల తోడ నంజుకున్న ముద్దులాట
సందెకాడ కొత్తగానే ఆరుబయట ఎన్నేలెంత 
సర్దుకున్న కన్నె జంట సర్దులాయెరో

చరణం: 2
ఎదలో జరిగే విరహ సెగల వనవాసం 
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం 
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో 
జతగా పిలిచే అగరు పొగల సహవాసం 
జడతో జగడం జరిగే సరసం ఎపుడో 
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే 
అన్ని రంగుల్లో ఆమె రూపే 
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే 
నన్ను మొత్తంగా మాయచేసే 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 
పట్టుచీరల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ 
కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లొ ముద్దుగుమ్మ



ఘల్లు ఘల్లు ఘల్లుమన్న పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వనమాలి
గానం: గాయత్రి, కారుణ్య

ఛెంగు ఛెంగు ఛెంగుమంటు తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి 
ఏరువాక సాగుతుంటే చెంత చేరవా
ఏయ్ ఎర్ర మిరప కన్ను ఆ ఎండ పొద్దుకు
చుర్రు చుర్రంటూ గుచ్చే ఈ పల్లె బుగ్గకు
కోలో కోయిల పాట ఈ కొమ్మ గొంతుకు
ఏలో ఎన్నెల్లో ఊట ఆ కొండ కోనకు

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

చెంగు చెంగు చెంగుమంటూ తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా

నూనూగు మీసాల ఊరి పెద్దలం
ఎవడెంతటోడైన మాది పెత్తనం 
పక్కవాడు ఏడిస్తే ప్రాణమిస్తాం
బక్కవాడు కనిపిస్తే ఏడిపిస్తాం
ఎన్నుపూస లేనోణ్ణి ఎండగడతాం
ఎన్నపుస మనసుంటే ఎంట పడతాం
కాడి పట్టి దున్నుతున్న బాలచంద్రులం
ఆకలేసి అరిసినోళ్ళకన్నదాతలం హే
చిట్టిగువ్వ రెక్క రంగు చీర కట్టుకున్నది
ఉట్టిమీది ఎన్న లాగ ఊరిస్తా ఉన్నది
కొబ్బరాకు పచ్చలాంటి కొంగు తిప్పుతున్నది
జబ్బ చూసి నాటి నుంచే బెంగ పెట్టుకున్నది
నా లేత తమలాపాక నా రాజా నిమ్మలపండా
నా గున్న మామిడి మొగ్గా నాకున్న మాపటి దిక్కా

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో 
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

మేలుకోవే ఓ మనసా
మేళుకోవే ఓ మనసా
బొమ్మనే చేశాడు ప్రాణమే పోశాడు
సిరులిచ్చి దీవించి చింతలే తీర్చాడు
ఉన్ననాడే మేలుకొని ఉట్టికెక్కమన్నాడు
ఊపిరాగిపోయిందా మట్టిపాలే వీడు
మేలుకోవే  ఓ మనసా
మేలుకోవే ఒ మనసా

ప్రాయమంతా పండగే చేశావు
తల పండినాక తత్వమే చెబుతావు
అనుభవించనివ్వు ఈ వైభోగం
వయసు ఉడిగి పోయాకే వైరాగ్యం హే 

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

ఛెంగు ఛెంగు ఛెంగుమంటు తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి 
ఏరువాక సాగుతుంటే చెంత చేరవా





నాలో ఊహలకు పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: ఆషా భోంస్లే, కె.యమ్. రాధాకృష్ణన్

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ...
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ... ఆ...ఆ... ఆ...ఆ...

సనిసస నినిసస నిస సనిసస నినిసస నిస

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

ససనిపస ససనిపరి (3)
ఆ... రారెరెరా...

కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
ఆ... ఆ...
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ... రారెరెరా...
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 



హే సక్కుబాయినే పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: లక్ష్మి భోపాల్
గానం: జాస్సి గిఫ్ట్, మమతా మొహన్ దాస్

హే సక్కుబాయినే సక్కంగ ఉంటనే పక్కమీదనే నేనొక్కదానినే 
టక్కులాడినే తైతక్క లేడినే ఒక్కసారికే నే పొక్కిపోతనే
మల్లెపూల పక్క ఓ పంచదార చెక్క గల్లుమంది తిక్క వేడెక్కవేంది టెక్కా

హే సక్కుబాయినే  నేనొక్కదానినే హే సక్కుబాయినే

పచ్చి కొబ్బరాకు అబ్బ గిచ్చి చంపమాకు
ఇచ్చి లేచి వస్తే నువు గజ్జకట్టమాకు

డిల్లా డిల్లా డిల్లా డిల్లా  డిల్లా డీల్లారే (2)

సక్కుబాయివే నా సక్కుబాయివే
సక్కుబాయినే నే సక్కుబాయినే

నలుగు పెడితే కందే ఒళ్ళు
నాదస్వరమే జడ కుచ్చిళ్ళు
నలుగు పెడితే కందే ఒళ్ళు
నాదస్వరమే జడ కుచ్చిళ్ళు
నడుము సన్నా నాధ దానినే

ముడతపడ్డా నడుమే చూసే మెలిక పడ్డా నడకే చూసే
ముడతపడ్డా నడుమే చూసే మెలిక పడ్డా నడకే చూసే
ముడత ముంజం పడతావెందుకే 
హే ఆకు వక్క సున్న కట్టి చిలకలిస్తవా
చీకు చింత సిగ్గు ఎగ్గూ వదిలిపెడతవా
హే కోక రైక కట్టు బొట్టు చెదరనీకురో
గిల్లీ గిచ్చి ఆడేయ్ మంటూ గీతలేందుకే
కాలు కింద పెట్టకుండ మల్లెలేస్తవా
బొండు మల్లె చెండు నీకు మల్లెలెందుకే
అబ్బో బీటక్కరోడివే మా సక్కనోడివే
పక్కమీదనే నేనొక్కదానినే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ

అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు
అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు
గుత్తమొత్తం కౌలే నాదిలే 
సడలనీకు కసి కౌగిల్లు బెదిరిపోతాయ్ పసి మావిళ్ళ
సడలనీకు కసి కౌగిల్లు బెదిరిపోతాయ్ పసి మావిళ్ళ
పోంకమంతా జంకేట్టుందిరో 
హే గోలపెట్టి కాదు అంటే విడిచిపెట్టలే
హే మాటమంతి కట్టిపెట్టి బరిలొ దిగుతవా
ఎండా వానా ఉన్నా కూడా బెండు తీస్తానే
హే ఒంపు సోంపు వయ్యారాల గండికోడతవా
ఎంత సేపు సంత గోల చెంత చేరవే 
ఎగిరి అందుకుంటె నే పండుతీయన
టక్కులాడివే తైతక్క లేడివే
అబ్బా టెక్కు చూపినా నీ పక్కకోస్తినే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ
పిల్లా పిల్లా పిల్లా పిల్లా కళ్ళే తిరిగెనే... అయ్యో
చిల్లా చిల్లా మళ్ళా మళ్ళా వెలికి చూస్తినే
అల్లం మల్లం ఎగా దిగా చూసే వస్తినే
కళ్ళు ఒళ్ళు తెల్లా మల్లె దారే చూపెనే
మంచ మీదనే నీ అంతు చూస్తనే కంచె దాటినా కోర కంచరిస్తనే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ




ముక్కుపై ముద్దు పెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: హరిచరన్, సుజాత

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయెట్టు
చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయెట్టు
మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు

మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు
మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు
గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు
బుగ్గ పండు కోరికేసె రౌడీ ముద్దు
కొంటె ఈడూ కాజేసే కేడి ముద్దు
కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు
కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ...
ముక్కుపై ముద్దు పెట్టు 

వగల నడుము మడత మీద వడ్డానం ముద్దు
ఈ నాభి చుట్టు వేడి సెగల సిగ్గానం ముద్దు
ఒంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు
అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు
అల్లసాని పద్య మంత అల్లిక ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ...

ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు
ముక్కుపై ముద్దు పెట్టు


Palli Balakrishna Tuesday, August 1, 2017



చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
నటీనటులు: తరుణ్ ,ఇలియానా
దర్శకత్వం: కె.విజయ్ భాస్కర్
నిర్మాత: శాఖమురి పాండు రంగారావు
విడుదల తేది: 11.04.2008



Songs List:



రోమియో జూలియట్ పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: సాహితి 
గానం: టిప్పు 

రోమియో జూలియట్ 




నీతోనే కలిసి పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: వనమాలి 
గానం: షాన్ , గీతామాధురి 

నీతోనే కలిసి 




పంచదార ఎడారిలో పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: వేటూరి 
గానం: టిప్పు, గాయత్రీ 

పంచదార ఎడారిలో 




మనసులో నువ్వేనా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర 

మనసులో నువ్వేనా 



పసందైన వేళా వయ్యరాల కోయిలా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: కె.యమ్.రాధకృష్ణన్
గానం: చిత్ర, కె.యమ్.రాధకృష్ణన్

పసందైన వేళా వయ్యరాల కోయిలా 
ఒడే చేర రమ్మంది వస్తావా ఇలా 
హుఁ హుఁ హుఁ రా...

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

హే వంటరిగుంటే పోరు గుండెల్లోన హోరు 
లవ్వో గివ్వో ఏదో లాగించేయ్ గురూ
చూశాలే నీ జోరు ఎందుకు ఆ కంగారు 
నే రెచ్చానంటే వేడెక్కదా వింటరూ
హే ముద్దొచ్చేలా ముద్దిచ్చేయ్ నా 
మత్తెక్కేలా మురిపించే నా
రారా ఇల్లా రారాజులా సాగించేద్దాం ముక్కాబ్బులా
వద్దే నాటి నారి ఇంకొద్దే ముద్దుల ప్యారి 
కితకిత లెడితే పోరి కుమ్మేస్తాడీషికారి 
నీ తట్టా బుట్టా సర్దే జల్దీ జాంగిరి

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి

కావాలంటూ బోణి కటేస్తుందోయ్ వోణి 
కాస్తో కూస్తో కానీ జవానీ పని
చెప్పొద్దే కహానీ చెయ్యొద్దే ఖుర్బానీ 
చల్లా కొచ్చి ముంతా దాచోద్దే హనీ
నీతో ఇల్లా ఉండాలనీ ఏదేదేదో చెయ్యాలని 
రమ్మన్నాలే రాజాజాని ఓ ఎస్ అంటే నీ బాంచనీ
వద్దన్నా వయ్యారి పడమాకే ఒల్లో జారీ 
లెఫ్టో రైటో చేరి దరువెయ్యోద్దే తందూరి 
నీ నకరాలింక చాల్లే చెక్కే చోకిరీ

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి 

ఈ మల్లిమొగ్గ నీదే ఈ బుల్లీ బుగ్గ నీదే
కన్నే సిగ్గు నీదే కాటేసే ముద్దు నీదే
పాలు పళ్ళు నీవే బంగారు ఒళ్ళు నీదే
కొంటె నవ్వు నీదే గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తారారా పోకిరి హోయ్...




చోటా చోటా పాట సాహిత్యం

 
చిత్రం: భలే దొంగలు (2008)
సంగీతం: కె.యమ్.రాధకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు 

చోటా చోటా 

Palli Balakrishna
Anand (2004) Telugu Songs Lyrics Album Cover

Anand (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Anand (2004)
Director : Sekhar Kammula
Producer : Sekhar Kammula
Actors : Raja Abel
Release Date : 15 October 2004

Vachhe Vachhe Song Lyrics in Telugu – Anand (2004)

'Vachhe Vachhe' song from Anand (2004) movie is composed by K. M. Radha Krishnan and sung by Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Anand (2004)
Lyricist : Veturi
Singers : Shreya Ghoshal
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్ వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా చరణం: 1 పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన గాలి వానతో కబడ్డి వేడి వేడి పకోడి ఈడు జోడు ఢీ ఢీ ఢీ తొడుండాలి ఓ లేడి ఇంద్రధనస్సులో తళుకుమనే ఎన్ని రంగులో ఇంతి సొగసులే తడిసినవి నీటి కోంగులో శ్రావణ మాసాలా జల తరంగం జీవన రాగాలకిది ఓ మృదంగం చరణం: 2 కోరి వచ్చిన ఈ వాన గోరు వెచ్చనై నాలోన ముగ్గుల సిగ్గు ముసిరేస్తే ముద్దు లాటలే మురిపాలా మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు గాలి వానలా పందిళ్లు కౌగిలింతలా పెళ్లిల్లు నెమలి ఈకలా ఉలికి పడే ఎవరి కన్నుల్లో చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో నల్లని మేఘాలా మెరుపులందం తీరని దాహాలా వలపు పందెం

Yamunatheeram Song Lyrics in Telugu – Anand (2004)

'Yamunatheeram' song from Anand (2004) movie is composed by K. M. Radha Krishnan and sung by K. S. Chithra and Hariharan.

SONG INFORMATION
Movie : Anand (2004)
Lyricist : Veturi
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్ , చిత్ర పల్లవి: యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో చరణం: 1 ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కథా మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కథా చరణం: 2 ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలి మంటై రగిలెదే ప్రేమ చిగురించే ఋతువళ్ళే విరబూసే ప్రేమ మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కథా మరువుకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కథా

Nuvvena Naa Nuvvena Song Lyrics in Telugu – Anand (2004)

'Nuvvena Naa Nuvvena' song from Anand (2004) movie is composed by K. M. Radha Krishnan and sung by Shreya Ghoshal and K. M. Radha Krishnan.

SONG INFORMATION
Movie : Anand (2004)
Lyricist : Veturi
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్, కె.యమ్. రాధాకృష్ణన్ పల్లవి: నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా చరణం: 1 మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలలేనా కన్నీరేనా తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా చరణం: 2 కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మగొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు ఏ రాగం..ఇది ఏ తాళం మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా

Charumati I Love You Song Lyrics in Telugu – Anand (2004)

'Charumati I Love You' song from Anand (2004) movie is composed by K. M. Radha Krishnan and sung by Lucky Ali.

SONG INFORMATION
Movie : Anand (2004)
Lyricist : Veturi
Singers : Lucky Ali
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: లక్కీ ఆలి చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు (2) రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు  A E I O U అన్ని ఐ లవ్ యు  లవ్ యు లవ్ యు   చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు   ఎదనె నీవు నిదరె లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లె  కునుకె రాని ఉలుకై తీపి కలవైనావు ఎద నీడల్లె  అడిగా నిన్ను వరమిస్తావా  విడిగ నన్ను వదిలేస్తావా  Yes No Yes No చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు  (2) ఫ్లవరై విచ్చి కలరె ఇచ్చి వికసించావు తొలి ఊహల్లొ  చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడి జాముల్లొ  క్షణమె నేను యుగమౌతావ  సఖివై నాకు సగమౌతావ  Yes No Yes No చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు  (2) రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు  A E I O U అన్ని ఐ లవ్ యు  లవ్ యు లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

Telisi Telisi Song Lyrics in Telugu – Anand (2004)

'Telisi Telisi' song from Anand (2004) movie is composed by K. M. Radha Krishnan and sung by Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Anand (2004)
Lyricist : Veturi
Singers : Shreya Ghoshal
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రేయా గోషల్ పల్లవి: తెలిసి తెలిసి వలలో పడెనే వయసు తలచి వలచి కలలే కనెనే మనసు తనువున ఎన్నో తపనలు రేగే తహ తహలోనే తకదిమి సాగే చరణం: 1 పొద్దసలే పోక నిద్దుర పోనీక ఎవ్వరిదో కేక ఎదలోతులదాక భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా నీగాలి సోకేనా నా ఊపిరాడేనా తెలిసి తెలిసి వలలో పడెనే వయసు తలచి వలచి కలలే కనెనే మనసు అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే చరణం: 2 నాకొద్దీ దూరం వెన్నెల జాగారం బాత్రూం సంగీతం లేత ఈడు ఏకాంతం కోపమొచ్చే నామీద తాపమాయె నీ మీద దేహాలు రెండైన ప్రాణాలు నీవేగా విసిగించు పరువాన విధిలేక పడివున్న తెలిసి తెలిసి వలలో పడెనే వయసు తలచి వలచి కలలే కనెనే మనసు

Yedalo Ganam Song Lyrics in Telugu – Anand (2004)

'Yedalo Ganam' song from Anand (2004) movie is composed by K. M. Radha Krishnan and sung by K. S. Chithra and Hariharan.

SONG INFORMATION
Movie : Anand (2004)
Lyricist : Veturi
చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్ , చిత్ర ఎదలో గానం పెదవే మౌనం  సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో  మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో  చరణం: 1 కట్టుకథలా ఈ మమతే కలవరింత  కాలమొకటే కలలకైనా పులకరింత  శిల కూడా చిగురించే విధి రామాయణం విధికైనా విధిమార్చే కథ ప్రేమాయణం  మరవకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథ ఎదలో గానం పెదవే మౌనం  సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో  మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో చరణం: 2 శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో  శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో  పూచే సొగసులో ఎగసిన ఊసులు మూగే మనసులో అవి మూగవై  తడి తడి వయ్యారాలెన్నో ప్రియా ప్రియా అన్న వేళ

Palli Balakrishna Wednesday, July 26, 2017

Most Recent

Default