Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rohit"
Anaganaga O Kurradu (2003)



చిత్రం: అనగనగా ఓ కుర్రాడు (2003)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొండ, భువనఛంద్ర 
నటీనటులు: రోహిత్, రేఖ వేదవ్యాస్ 
కథ: పూరీజగన్నాథ్
దర్శకత్వం: ఎల్.పి.రామారావు 
నిర్మాత: కట్టా రాంబాబు 
విడుదల తేది: 15.08.2003



Songs List:



నేనే నువ్వని పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ కుర్రాడు (2003)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొండ 
గానం: కౌశల్య, వేణు 

నేనే నువ్వని 



సెల్ ఫోన్ ధ్వని పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ కుర్రాడు (2003)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొండ 
గానం: గోపికా పూర్ణిమ , చక్రి 

సెల్ ఫోన్ ధ్వని 




సక్కు సక్కు పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ కుర్రాడు (2003)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొండ 
గానం: సునీత, రఘుకుంచె 

సక్కు సక్కు 




చిన్న డ్రెస్సు లో పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ కుర్రాడు (2003)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొండ 
గానం: సుధా, రవివర్మ 

చిన్న డ్రెస్సు లో 



విజయం మన సొంతం పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ కుర్రాడు (2003)
సంగీతం: చక్రి 
సాహిత్యం: భువనచంద్ర
గానం: టిప్పు, అనురాధ శ్రీరామ్

విజయం మన సొంతం 



కల తెలవారని పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ కుర్రాడు (2003)
సంగీతం: చక్రి 
సాహిత్యం: కందికొండ 
గానం: కౌశల్య 

కల తెలవారని 

Palli Balakrishna Friday, August 5, 2022
Sontham (2002)



చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
నటీనటులు: ఆర్యన్ రాజేష్, నమిత, రోహిత్, నేహా పెండ్సే 
దర్శకత్వం: శ్రీను వైట్ల 
నిర్మాతలు: యస్. సోంపల్లి , వి. ఆర్. కన్నెగంటి 
విడుదల తేది: 23.08.2002



Songs List:



సొంతం పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: టిప్పు 

Close Your Eyes And Open Your Dreams
The World Is So Large Sontham
Spread Your Arms And Give All Your Love
The World Is So Large Sontham
ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఐనాటికి ఇది మిన్నగా మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం

ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏనాటికి ఇది మిన్నగా మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం
ఆ తారలే సాక్షం ఈ చిరునవ్వుల సాక్షం
వారమల్లే అందిన స్నేహం మన సొంతం
సొంతం సొంతం భూమి మొత్తం మన సొంతం
సొంతం సొంతం ఆకాశం మన సొంతం

Close Your Eyes And Open Your Dreams
The World Is So Large Sontham
Spread Your Arms And Give All Your Love
The World Is So Large Sontham

ఊపిరిలో ఉరకలేసే వుత్సవాహం మనకు సొంతం
ఉప్పెనతో పందెమేసే ఉల్లాసం మనకు సొంతం
రెప్పల్లో స్వప్నాలు సొంతం గుప్పిట్లో పంతాలు సొంతం
అనుకుంటే ఎదైన సొంతం అనిపించే నమ్మకం సొంతం
తనకేలే ప్రతి నిమిషము సొంతము
సొంతం సొంతం ప్రతి ఋతువు మన సొంతం
సొంతం సొంతం ప్రతి మలుపు మన సొంతం

Aa Give Me ‘S’
Give Me ’O’
Give Me ’N’
Give Me ’T’
Give Me ‘H A M’
Say Sontham
సొంతం సొంతం సొంతం సొంతం సొంతం
సొంతం సొంతం సొంతం సొంతం సొంతం

దిక్కులనే ధిక్కరించే ఉడుకుతనం మనకు సొంతం
చిక్కులనే వెక్కిరించే చిలిపితనం మనకు సొంతం
గువ్వల్లో వేగాలు సొంతం ఊహల్లో లోకాలు సొంతం
ఎగిరొచ్చ్ ఉదయాలు సొంతం
ఎదిరించే శిఖరాలు సొంతం
ఆణువణువూ ఈ యవ్వనం సొంతము
సొంతం సొంతం ఆశలన్నీ మన సొంతం
సొంతం సొంతం సరదాలే మన సొంతం

ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏనాటికి ఇది మిన్నగా మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం
ఆ తారలే సాక్షం ఈ చిరునవ్వుల సాక్షం
వారమల్లే అందిన స్నేహం మన సొంతం
సొంతం సొంతం భూమి మొత్తం మన సొంతం
సొంతం సొంతం ఆకాశం మన సొంతం
ఆశలన్నీ మన సొంతం సరదాలే మన సొంతం
లోకమంతా మన సొంతం ఈ సృష్టే మన సొంతం



తెలుసునా తెలుసునా పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.యస్.చిత్ర 

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏవిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండి పొయిందే
నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏవిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా



ఎపుడు నీకు నే తెలుపనిది పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మల్లికార్జున్ 

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసె మోయగలదా జీవితాంతం
వెతికె తీరమె రానంది
బతికె దారినె మూసింది
రగిలె నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమె నీడగా మారింది

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసె మోయగలదా జీవితాంతం

జ్ఞాపకం సాక్షిగా పలకరించవు ప్రతి చోట
జీవితం నీవని గురుతు చేశావు ప్రతి పూట
ఒంటిగా బ్రతకలేనంటూ వెంటతరిమావు ఇన్నాళ్లు
మెలుకువే రానీ కలగంటు గడపమన్నావు నూరేళ్లు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే కానీ ఊపిరిగా సొంతం కాదా





ఈనాటి వరకు పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: షాన్ , సుమంగళి 

ఈనాటి వరకు నా గుండెలయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు మొదలైంది మొదలు
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా

ఈనాటి వరకు నా గుండెలయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు మొదలైంది మొదలు
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
అరెరే ఎన్నడు ఈ రంగులు నేను చూడనేలేదే
ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే
మనసా ఆ ఆ
ఈనాటి వరకు నా గుండెలయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
are u in love
are u in love

ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే
ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే
ఎంతమాత్రం నమ్మనంటు నాలో నేను నవ్వుకుంటే
నన్ను సైతం వదలనంటు వచ్చి కమ్ముకుందే
కథలు విన్నా ఎదరే వున్నా అసలు సంగతి తేలదుగా
అనుభవంతో చెబుతూ ఉన్నా ఋజువునేనేగా
ఈనాటి వరకు నా గుండెలయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా

ఒక్కచోటే కలిసి ఉన్న తనతో పాటు ఇంత కలం
ఒక్క పూట కలగలేదు నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్న ఎగిరొచ్చాక ఇంత దూరం
ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
కంట పాడనీ ప్రాణం లాగా గుండె లోనే తానున్న
జ్ఞాపకాలే తరిమే దాక గుర్తు రాలేదే
ఈ తిపిడిగులు మొదలైంది మొదలు
ఎన్నెన్ని కళలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా



అక్కడో ఇక్కడో ఎక్కడో పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: రవికిరణ్ 
గానం: మల్గాడి శుభ 

అక్కడో ఇక్కడో ఎక్కడో సెగ రేగే నాలో ఎక్కడో
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చలి రేగే నాలో ఎప్పుడో 




హే నాయుడో నాయుడో...పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: దేవిశ్రీ ప్రసాద్ 

హే నాయుడో నాయుడో... జమ్మప్పల నాయుడో
హే నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
హోయ్ చూపులతో సుందరికి గాలమెయ్యాల
చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల
హోయ్ డండనక డండనక ముద్దులియ్యాల
హే నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో భూలోకం బద్దలయ్యేలా
కుమ్మెయ్యరో ఏ ఏ ఏ అరె దులిపెయ్యరో ఏ ఏ పపపప్ పపపప్
అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
చూపులతో సుందరికి గాలమెయ్యాల
చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల ఏ ఏ ఏ
అరె ఊదరా

ఏయ్ అప్పప్ప సోడిపప్ప మాడిపోయిందే
అప్పప్ప సోడిపప్ప మాడిపోయిందే
ఏయ్ పక్కనున్న రైలుబండి పారిపోయిందే
పక్కనున్న రైలుబండి పారిపోయిందే
ఏయ్ పిడతలోన పప్పు చారు కారిపోయిందే
పిడతలోన పప్పు చారు కారిపోయిందే
అయ్యో సూరులోన సుట్ట ముక్క రాలిపోయిందే
సూరులోన సుట్ట ముక్క రాలిపోయిందే
అప్పప్ప సోడిపప్ప ఏయ్ అప్పప్ప ఏయ్ సోడిపప్ప
ఏయ్ అప్ప ఏయ్ అప్ప ఏయ్ అప్ప పప్ప అప్ప
ఏయ్ అప్ప ఏయ్ అప్ప ఏయ్ అప్ప పప్ప అప్ప ఏయ్

ఏలో – ఏలో ఏలేలో – ఏలేలో
అల్లరి పాటలు పాడాలయ్యో నూరేళ్ళు – నూరేళ్ళు
ఏయ్ ఐస్సా – ఐస్సా అరె హైలెస్సా – హైలెస్సా
గుండెలో చప్పుడు ఉండేదాకా సందళ్ళు – సందళ్ళు
అరె వేళాపాలంటూ ఏదీ లేకుండా బేలాగోలలు చేసుకోవాల
అమ్మో కుర్రాళ్ళు పందెం కుర్రాళ్ళు అంటూ ఊరంతా జడుసుకోవాల
అరె ఈలే వెయ్యాల గోలే చెయ్యాల చిన్నా పెద్దా తేడా లేకుండా
కుమ్మెయ్యరో ఏ ఏ ఏ అరె దులిపెయ్యరో ఏ ఏ పపపప్ పపపప్
అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
అరె చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల

హయ్యో – హయ్యో హయ్యయ్యో – హయ్యయ్యో
ఏయ్ ఉక్కిరి బిక్కిరి చేసే అందం చూడయ్యో – చూడయ్యో
హయ్యో – హయ్యో అబ్బాయో – అబ్బాయో
ఏయ్ చక్కని చుక్కకు చక్కిలి గింతలు పెట్టయ్యో – పెట్టయ్యో
పక్కోళ్ళింట్లోన ఓణీ పాపలకి రోజాలిస్తూనే చెయ్యి తాకాల
తేడా వస్తేను చెల్లీ అంటూనే జాదూ చేసేసి జారుకోవాల
ఏయ్ తాజా అందాల బాజాబందుల వయ్యారితో జిత్తులు తొక్కాల

కుమ్మెయ్యరో ఏ ఏ ఏ అరె దులిపెయ్యరో ఏ ఏ పపపప్ పపపప్
అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
హోయ్ చూపులతో సుందరికి గాలమెయ్యాల
అరె చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల
హోయ్ డండనక డండనక ముద్దులియ్యాల




ఎపుడూ నీకు నే తెలుపనిది (Female) పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సుమంగళి 

ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమేనీడగా మారింది ఓ ఓ

ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

గుండెలో ఆశని తెలుపనేలేదు నా మౌనం
చూపులో బాషని చదవనేలేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా
కలుసుకోలేను ఎదురున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా
అడగవే ఒక్కసారైనా
నేస్తమా నీ పరిచయం
కల కరిగించేటి కన్నీటి వానేగా

Palli Balakrishna Tuesday, August 2, 2022
Janaki weds Sriram (2003)




చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
నటీనటులు: రోహిత్, గజాల, రేఖ వేదవ్యాస్, ప్రేమ
దర్శకత్వం: అంజి
నిర్మాత: యస్.రమేష్ బాబు
విడుదల తేది: 11.09.2003



Songs List:



మేరా దిల్ తుజుకో దియా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: కుమార్ సాను & కోరస్

పల్లవి: 
మేరా దిల్ తుజుకో దియా 
గుండెల్లో నువ్వే ప్రియా 
మేరా దిల్ తుజుకో దియా
యదలో చూడే ఇలా ఎపుడూ నీదే లయా
యదలో చూడే ఇలా 
ఎపుడూ నీదే లయా
మేరా దిల్ తుజుకో దియా

చరణం: 1
అడుగు తీసి అడుగేయబోతే
ఆ అడుగే అడిగింది
నీ వైపే పదమంది
పెదవి విప్పి మాటాడబోతే
నీ పేరే పలికింది 
నువ్వే నేనంటుంది
ఎటు చూసినా,  ఏం చేసినా 
నీ రూపు రేఖలే కనిపించెనే
ఏ సవ్వడి వినిపించినా 
నువ్వు పిలిచినట్టుగా అనిపించెనే
మేరా దిల్ తుజుకో చియా

చరణం: 2
ఇన్నినాళ్ళుగా మూగబోయి
ఉందే నా మనసిపుడే
తెగ తొందర పడిపోతుంది
ఎంత చెప్పినా ఆగనంటూ
మాటే విననంటుంది తన బాటే తనదంటోందే
ఏమైందనీ, నేనడిగితే తన పెదవి ముడిని అపుడిప్పిందిలే
నీ కోసమే ఈ పరుగని చెవిలోన చిన్నగ చెప్పిందిలే
మేరా దిల్ తుజుకో దియా




పండువెన్నెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: టీనా కమల్

పల్లవి: 
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం 
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం
నీ పేరే పాడుతున్న మౌనసంగీతం 
ఎద నీ రాక కోసం పలికే స్వాగతం

చరణం: 1
ఎగిరే గోరింకా ఇటురావా నా వంక 
నువ్వు ఎందాకా పోతావో నేను చూస్తాగా 
చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్కా అలిసాకా నీ రెక్క
నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురుతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపును నేనేగా
రప్పించు కోనా నిను నా దాకా 

చరణం: 2
కన్నె సీతమ్మకీ పెళ్లీడు వచ్చిందని కబురు
వెళ్ళిందిగా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకె పుట్టిందని
తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి
వేదించే దూరమంతా కరిగేలా
విరహల విల్లు ఇట్టే విరిగేలా
విడిపోని బంధమేదో కలిపేలా 
మెడలోన వాలనుంది వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలా



రివ్వున ఎగిరే గువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: సునీత, ఉష, సంజీవిని ఘంటాడి,
ఘటికాచలం, వరికుప్పల యాదగిరి & కోరస్

పల్లవి: 
రివ్వున ఎగిరే గువ్వా...
నీ పరుగులు ఎక్కడికమ్మా ...
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...

చరణం: 1
అల్లరి పిల్లకు నేడు వెయ్యాలిక మెళ్ళోతాడు
ముడివేసే సిరిగల మొనగాడు ఎవరే వాడు
చక్కని రాముడు వీడు నీ వరసకు మొగుడౌతాడు
ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు ఈ పిరికోడు
ఆ కృష్ణుడి అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే
గోపికలే వస్తే అటే పరిగెడతాడే
ఓ గడసరి పిల్లా నీ కడుపున కొడుకై పుడతానే
కూతురుగా పుట్టు నీ పేరే పెడతాలే
గొడవెందుకు బావతో వెలతావా
పదబావా పాలకోవా...

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...

చరణం: 2
చిటపట చినుకులు రాలి 
అవి చివరకు ఎటు చేరాలి
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి
నిండుగ నదులే ఉరికి అవి చేరునది ఏదరికి
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి
అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి
బతుకంతా ఒకటై ఇలా జత కావాలి
మన బొమ్మల పెళ్ళి నువ్వే తాళిని మెళ్ళో కడతావా
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా
ఓబావా ఒట్టే పెడుతున్నా ...
నే కూడ ఒట్టేస్తున్నా...

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 

నా రాజు నువ్వేనంటా... 
ఈ రోజే తెలిసిందంటా...
నా రాజు నువ్వేనంటా... 
ఈ రోజే తెలిసిందంటా...




అందాల భామలూ ... పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: సందీప్ బేమెక్, సునీత, నిష్మా & కోరస్

పల్లవి: 
అందాల భామలు  క్యాట్‌వాకు చేపలు
ఆడతరా మాతో సైయ్యాటలు
మీరంతా కోతులుమీ తోనా ఆటలూ
వద్దంటే వినరే  మా మాటలూ 

ఎందుకలా  ఊరికనే నిందిస్తారే 
మాతో పోటీ అంటే భయమేమోలే 
అబ్బబ్బో మీకంత సీను లేదులే
మీ కంటే సీనియర్లని చూసినాములే
ఐతే లేదు ఎందుకంట  చప్పున వచ్చేయ్యరే 

అందాల భామలూ

చరణం: 1
గోడమీది బొమ్మ  ఆ గొలు సులున్న బొమ్మ 
ముట్టుకుంటే మొట్టికాయ వేస్తదమ్మా 
దాని పేరేంటో నువ్వు చెప్పవమ్మా
ఇంత సిల్లి క్వశ్చన్  అది కాదు మాకు కష్టం 
ఇంత సిల్లి క్వశ్చన్  అది కాదు మాకు కష్టం
దాని పేరు తేలు అని అంటారంట
ఒళ్ళంతా గొలుసులుగా ఉంటుందంట
మామా కాని మామా మరి ఎవ్వరే 
నింగిలోని నిందు చందమామ లే
కాయకాని కాయ మరి ఏమిటే
కాయకాని కాయ నీ తలకాయలే

అందాల భామలూ

చరణం: 2
హలో హలో సారు జరదేఖో ఒక మారు 
ఆ దాచేసిన పెళ్ళి బట్టలిచ్చుకోండి
ఇక మా ముందు మీ ఆటలు చెల్లవండి 
ముద్దు ముద్దుగుమ్మ  మురిపాల పూల రెమ్మ
అరె ముద్దు ముద్దుగుమ్మ  మురిపాల పూల రెమ్మ
ముందు మేము అడిగింది ఇచ్చుకోమ్మ 
ఆ తర్వత ఆ బట్టలు పుచ్చుకోమ్మ 
అంత హెడ్డు వెయిట్ మీకు ఎందుకూ 
ఇవ్వకుండా మారము లెందుకు
ఎంతైన మగపెళ్ళి వారమే
మరీ మర్యాదలు మాకెన్నో చెయ్యాలిలే

అందాల భామలూ 




రివ్వున ఎగిరే గువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట ఓ అందమైన ప్రేమకథ. 

రెండు గువ్వలు చిలక, గోరింక, 
రెండు రవ్వలు తార, నెలవంక
కలలు కన్నాయి కథలు చెప్పుకున్నాయి
ఆకాశం సాక్షిగా భూదేవి సాక్షిగా
పసి వయసులో బొమ్మల పెళ్లి చేసుకున్నాయి.
కడవరకు నిలవాలని బాసల వీలునామా రాసుకున్నాయి. ఇంతలో కాలం కన్నెర్ర చేసింది,
ఆ జంటను విడదీసింది. ఇక ఒకే వెతుకులాట,
ఇప్పుడు అదే నా ఈ పాట

పల్లవి:
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా
నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
ఓ ఓ ఓ..... ఏ ఏ ఏ.....

చరణం: 1
వీచే గాలుల వెంట నా వెచ్చని ఊపిరినంత
పంపించానే అది ఏ చోట నిను తాకనే లేదా
పూచే పూవుల నిండా మన తీయని జ్ఞాపకమంతా
నిలిపుంచానే నువ్వు ఏ పూటా చూడనే లేదా

నీ జాడను చూపించంటు ఉబికేనా ఈ కన్నీరు
ఏ నాడు ఇలపై పడి ఇంకిపోలేదు
నడిరాతిరి ఆకాశంలో నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు
ఆ దారిని తూరుపువై రావా
నా గుండెకు ఓదారుపు

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా 
నిను ఎక్కడవెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా

చరణం: 2
కిన్నెరసాని నడక నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా కడదాక తోడై రాక
బతుకే బరువై పోగా మిగిలున్న ఒంటరి శిలగా
మన బాసల ఊసులు అన్ని కరిగాయా ఆ కలగా
ఎన్నెన్నో జన్మలదాక ముడివేసిన మన అనుబంధం
తెగి పోయిందంటే నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నది ఆంటే ఇంకా ఈ నా దేహం
క్షేమంగ ఉన్నట్టే తనకూడా నాస్నేహం
ఎడబాటే వారదిగా చేస్తా
త్వరలోనే నీ జతగా వస్తా

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా నిను ఎక్కడ వెతికేదమ్మా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా




ఈఫిల్ టవరయినా...పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: శంకర్ మహదేవన్, సురేఖా మూర్తీ

పల్లవి: 
ఈఫిల్ టవరయినా...
మన చార్మినార్‌ తో సాటిరాదురా
వాషింగ్టన్ అయినా 
మన వాగులముందు దిగదుడుపేరా
ఈఫిల్ టవరయినా
మన చార్మినార్‌ తో సాటిరాదురా
వాషింగ్టన్ అయినా 
మన వాగులముందు దిగదుడుపేరా

సుబ్బలక్ష్మి ముందు మదోన్నా వేస్టు
ఫాస్ట్ బీట్ కన్నా మెలోడి టేస్టు
అచ్చమైన ఆవకాయే మనకు నచ్చునురా

ఈఫిల్ టవరయినా....

చరణం: 1
క్రికెట్లో వీరుల్లా ఎవరికి వారే అనుకున్నా
ఉరుమల్లే ఊరిమేటి సచ్చిన్ తో సరితూగేనా
ఆ మైఖేల్ జాక్సన్ తెగ ఊపే స్టెప్పుల కన్నా
మెరుపై మెలితిరిగే చిరునగువే మిన్నా

గంగి గోవుపాలు గరిటెడు చాలు కడివెడు ఎందుకురా
గుండె నిబ్బరంతో సాధించేందుకు ఒక్కడు చాలునురా
నోరు తెరిచి పలకరాని భాషలెన్నున్నా
స్వచ్చమైన తేట తెలుగే అన్నిటా మిన్నా

ఈఫిల్ టవరయినా...

చరణం: 2
ISI ని తరిమేసేయ్ పోలిమేరల్లోకి రాకుండా
హిందుస్తాన్ హమారహై అని ఒట్టేయ్యాలి ప్రతి ఇంటా
మువ్వన్నెల జెండా - అది ఎగరాలి ఎదనిండా
చూసేద్దాం శతువుతో ఇక నిదురే రాకుండా
మువ్వన్నెల జెండా
కుప్పిగంతులేసే ముషారఫ్ ని రఫ్ ఆడించేద్దాం
మన అటల్ బిహరి వాజ్ పేయ్ కి చేయూత అందిద్దాం...
హద్దుమీరి చేయిజారే సాంప్రదాయాల్లో
కమ్మనైనా కల్చరంటే ఇండియాదే రోయ్

ఈఫిల్ టవరయినా....




ఏ దూర తీరాలలో పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: రాజేష్ , నిత్య సంతోషిని 

ఏ దూర తీరాలలో... వుందో నా చెలి
ఎనాడూ నా కంటికీ... కనిపిస్తుందో మరీ

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ
హృదయమనే ఈ కోవెలలో తన
రూపే ప్రతిమై వుందనీ
ఆమనికై ఇల కోయిలలా నే తనకై చూస్తున్నానని
నువ్వైనా కబురందించాలి చల్లని చిరుగాలీ
ఎన్నడు తరగని ప్రేమకు నువ్వే ఊపిరి పోయాలి

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా

చరణం: 1
హ...పువ్వు నవ్వితే
తన నవ్వే అనుకొని చూస్తున్నా
అటుగా పరుగులు తీస్తున్నా
మువ్వ మోగితే ఆ అలికిడి తనదే అనుకున్నా
పొరబడి ఎదురే చూస్తున్నా
రెక్కలు తొడిగిన గువ్వను నేనై
దిక్కులు అన్నీ వెతికాను
దివిలో తారలు నా కన్నులుగా
భువినంతా గాలించాను
ఆశే నేనై శ్వాసే తానై నిలిచా తనకోసం
నాలో చదరని ప్రేమకు సాక్షం నేలా ఆకాశం

వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ

చరణం: 2
చిన్ని గుండెలో కలిగిందే కమ్మని తుళ్ళింతా
యేదో తెలియని పులకింతా
పిలిచినంతలో మనసంతా తియ్యని గిలిగింతా
నాలో ఏమిటీ ఈ వింతా
వేకువ పొద్దున మందారాన్నై
వాకిట ఎదురే చూస్తున్నా
పాపిట దిద్దిన సిందూరానికి
పరమార్థం లా నేనున్నా..
జగములు యేలే జానకిరాముని సగమే నేనమ్మా
జతగా తానే కలిసే వరకు బతికే శిలనమ్మా

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ...

హృదయమనే ఈ కోవెలలో తన
రూపే ప్రతిమై వుందనీ...
ఆమనికై ఇల కోయిలలా నే తనకై చూస్తున్నానని
నువ్వైనా కబురందించాలి చల్లని చిరుగాలి
ఎన్నడు తరగని ప్రేమకు నువ్వే ఊపిరి పోయాలి



నిన్ను ఎంత చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: ఉదిత్ నారాయణ్, టీనా

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు
ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే
అరే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు
నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టే ఉండదు

ప్రేమన్న మాటేమో రెండు ముక్కలే 
నీతోని చెబుదమంటె ఎన్ని తిప్పలే
ఆడిగేస్తానంటూ ముందు కడిగేస్తాడే
తీరా నేనెదురుపడితే తడబడతాడే
పచ్చి మిరపకాయ తిన్న బహు తీపిగున్నదే
మరి మందు తాగకున్న మత్తెక్కుతున్నదే 
నాకు కూడా బాబు అట్టాగే ఉందిలే
మరి నువ్వు పక్కనుంటే గమ్మత్తుగావుందిలే
హలో పిల్ల శుభానల్లా నీకు ఇవాళ 
ఇలా నిన్నే చూసి నా మనసు పడిపోయే వెల్లకిలా

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

పొద్దున్న లేవంగ ముద్దు అంటాడే
వద్దన్నా వినకుండా ఎగబడతాడే 
బొత్తిగ ఈ లోకం బహు కొత్తగున్నదే
మొత్తంగ మాయేదో అవుతున్నదే
అయ్యో చంటి పిల్లడల్లే మారేముచేస్తాడే
మరి చిలిపి చేష్టలల్లా అహ చిన్ని కృష్ణుడే
ఇక నిన్ను చూడకుండ ఆ పొద్దు గడవదే
ఈ రాణిని చూశాక నా మనసు నిలవదే
వద్దని అన్నా వద్దకు వచ్చి కలబడతాడే
వాడే సందే చూసి చప్పున్న వచ్చి గిలిగింతలుపెట్టేస్తాడే

అయ్యో అయ్యో రామ 
ఇది ఏమీ మాయో ప్రేమా
అయ్యో అయ్యో రామ 
ఇది ఏమీ మాయో ప్రేమా

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే
అరే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

Palli Balakrishna Tuesday, October 31, 2017
Maa Annayya Bangaram (2010)


చిత్రం: మా అన్నయ్య బంగారం (2010)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం:
గానం: కార్తీక్ , ప్రియదర్శిని
నటీనటులు: రాజశేఖర్, కమలినీ ముఖర్జీ, రోహిత్, ఆదిత్య ఓం
దర్శకత్వం: జొన్నగడ్డల శ్రీను
నిర్మాత: నట్టి కుమార్
విడుదల తేది: 31.07.2010

పల్లవి:
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
ఆనంద రాజ్యపు రాణివి నీవు
నాముందు నిలిచావు
అదృష్ట గీతాల భాణీవు నీవు
నాలోన పలికావు

అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు

చరణం: 1
మేఘాలకు విలువేముంది నీ కురులై మెరవకపోతే
గగనాన్నే వదిలేసి కలిశాయంట నీలో
ముత్యాలకు విలువేముంది నీ మాటై వెలకపోతే
సంద్రాన్నే విడిచేసి చేరాయంట నీలో
పువ్వుకు విలువేముంది నీ నవ్వై నిలవక పొతే
నవ్వుకు విలువేముంది నువు నవ్వకుంటే
నువ్వేలేని నాకు విలువేది
యవ్వనమంటు నీది అన్నాలే

అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు

చరణం: 2
సూర్యుడికే వెలుగొచ్చింది నీ చూపులు సోకంగానే
లోకాన్నే లెమ్మంటు చూపించాడు నిన్నే
కోవెలకే వెలిగొచ్చింది నీ అడుగులు తాకంగానే
దైవాలే మేల్కొంటు దీవించేను నిన్నే
కలలకు వెలుగొచ్చింది కనులెదుటే నువ్ కనిపించి
కవితకు వెలిగొచ్చింది నిను వర్ణించి
నేనే నీతో వెలిగాలే నాలో వెలుగు నీవనేదిలే

అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
ఆనంద రాజ్యపు రాణివి నీవు
నాముందు నిలిచావు
అదృష్ట గీతం భాణీవు నీవు నాలోనే పలికావు

అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు

Palli Balakrishna Sunday, October 15, 2017
Girlfriend (2002)

చిత్రం: గర్ల్ ఫ్రెండ్ (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయణ్
నటీనటులు: రోహిత్, సంతోష్ పవన్, బబ్లూ, అనిత పాటిల్ , రుతిక
దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
నిర్మాత: యమ్.కుమారస్వామి
విడుదల తేది: 06.07.2002

నువ్వు యాడికెల్తె ఆడికొస్తా సువర్ణా
నీ ఇంటిపేరు మారుస్తా సువర్ణా
బంగారం మారు పేరు సువర్ణా
నా బంగారం నువ్వమ్మా సువర్ణా
నా వాలు చూపుల రోజా చేస్తాను ప్రేమ పూజ..
ఓ తీపి పెదవులమ్మ తిడుతున్న బాగుందమ్మ
మర్యాద కాదు ఇంక నన్ను ఏడిపించకే వినవే
కసిరే అమ్మాయి..నడుమే సన్నాయి
నడిచే శిల్పమోయి నువ్వు సొంతమైతే హాయి

యంగ్ గల్ కి బుల్లి బుగ్గలు
ఉన్నవెందుకో నీకు తెలుసునా
హాయ్ హాయి గా బొయ్ ఫ్రెండ్ తో
ముద్దు కోసమే తెలుసుకోవే
లిప్స్టిక్ పెదవులకు రాసేది ఎందుకో
చెబుతా రీసనింగ్ ఓ భామా తెలుసుకో
కుర్రాడి చూపు పడేందుంకేలే
ఇలాంటి సోకు..అవునా మైనా
తిడుతూ తిడుతూనే నను చూస్తున్నావే
నీ మనసు నాకు చెప్పే ఐ లవ్ యు
ఆ బ్రహ్మ నిన్ను పంపినాడు నాకు గిఫ్ట్ గా నిజమే
నువ్వే నా పవర్.. నువ్వే నా ఫిగర్
నువ్వె లా లివర్.. నువ్వె నా లవర్
నువు కరుణిస్తే దాసుణవుత సువర్ణ
నువు కాదంటె చచ్చిపోతా సువర్ణ

నా అనుమతి తీసుకోకనే
గుండెలోకి దూసుకొస్తివే
హే ఎన్ని గుండెలే నీకు అమ్మడూ
మనసు మొత్తము దోచుకెల్తివే
కిల కిల నీ నవ్వు గుర్తొస్తూ ఉన్నదే
నే నిదరపోతున్నా డిస్టర్బ్ చేస్తున్నదే
నరాల లోన కరెంట్ నింపే
మిరకిల్ ఏదో నీలో ఉన్నదే
సీ ఎం పదవైనా బిల్ గేట్స్ ధనమైనా
ఇట్టే వదిలేస్తా నీ కోసం
ఆ బ్రహ్మ నన్ను పుట్టించెను నీకు హాఫ్ గా..ప్రామిస్
ఇట్తు రావే పిట్టా..నా జిలేబీ బుట్టా
నిను చూస్తుంటే అట్టా నా ప్రాణమాగ దెట్టా

Palli Balakrishna Saturday, September 23, 2017
Nava Vasantham (2007)


చిత్రం: నవ వసంతం (2007)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఈ.యస్.మూర్తి
గానం: యస్.పి. బాలు
నటీనటులు: తరుణ్ , ప్రియమణి, రోహిత్, సునీల్
దర్శకత్వం: కె.షాజహాన్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 09.11.2007

పాటలె ప్రాణమని పాడన పాటలని
గాలిలొ తేలి తేలిపూలతావి కాద సంగీతం
మనసు మీటె పాట ఉంటె స్వర్గమె నీ సొంతం

కలతె లేదు కొయిలకి పాటె ఉంటె
అలుపె రాదు తుమ్మెదకి ఝుం ఝుం అంటె
తుళ్ళింతల మదిలొ అలలకి తెలిసెని తకధిమి తాళం
కవ్వింతల చలి గాలికి తెలియనిద ఇందొళం
అందరికి అనుభవమేగ పాటలలొ ఆ సంతొషం
శివుడైన ఆడక మానడు వింటె చక్కని సంగీతం
పాటలె ప్రెమించె మనసు నందనం

పాటె మనిషి అనందం పాటె అందం
పాటె ప్రెమసందెశం పాటె బంధం
గాలి సైతం పాటకు మురిసి కురిసెను జల్లుగమేఘం
శ్రికృఇషునుడి మనసె దొచెను మీర తీయని గానం
ఆవెశం నిప్పై రగిలె నా పాటె నా గాండివం
జగమంతో దాస్యం చెసే అధ్బుతమె నా సంగీతం
నమ్మకమె ఆయుధం బ్రతుకులొ పొరులొ


*********  **********   ***********


చిత్రం: నవ వసంతం (2007)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఎస్.ఏ.రాజ్ కుమార్, ఏ. శ్రీనివాస్
గానం: ఉదిత్ నారాయణ్ , రీటా

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

అల్లరి వయసుల్లొ ఆనందం చూశాను
చూశాను చూశాను ఆది నాలో దాచాను
వేల కోటీ తారాల్లోనా జాబిళమ్మా నువ్వే కదా
వంద కోటీ అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా

నీతో పాటూ ఉంటానంటూ కోరిన మనసును చూశానూ
నీ తోడుగా ఉండాలంటూ వెళ్ళిన నీడను చూశాను
మూడో మనిషే లేని ఓ సుందర లోకం చూశా
నువ్వు నేనే కాదు నీ ప్రేమను కూడా చూశా
నువు నా లోనే సగమైతే నన్నే కొత్తగ చూశాను

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

సీతా కోక సిగ్గుల్లోనా ఎన్నెన్నో మెరుపులు చూశాను
వీచే గాలీ పరుగుల్లోనా ఏవేవో మలుపులు చూశాను
ఆశల జలపాతంలో అరవిరిసిన అందం చూశా
శ్వాసల సంగీతం లో వినిపించే గానం చూశా
జడి వానలలొ జల్లులలో చినుకె నువ్వానీ చూశాను

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను





Palli Balakrishna Tuesday, August 1, 2017
6 Teens (2001)


చిత్రం: 6 టీన్స్ (2001)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సుద్దాల ఆశోక్‌తేజ
గానం: కుమార్‌సాను
నటీనటులు: రోహిత్, రుతిక
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత:
విడుదల తేది: 08.06.2001

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
ఆ... నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే
ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే...

ఆ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో
ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో
ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో
ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో

చరణం: 1
మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నా... మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లునే కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా
నీ మదినిండనేనుండగా...

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

చరణం: 2
ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూనిన్ను వేడుకుంటున్నా
ఆ... ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా
నా కలలన్నీ నీ కనులు చూడాలని
బతిమాలాను నీ కంటిలో పాపని
మన్నించేసి నా మనసునీ
ప్రసాదించు నీ ప్రేమనీ

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే...
ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
దేవుడు వరమందిస్తే... నే నిన్నే కోరుకుంటాలే...


Palli Balakrishna Wednesday, July 26, 2017

Most Recent

Default