-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Priyamani"



చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాణా దగ్గుబాటి, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్
దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాతలు: డి. సురేశ్ బాబు,  సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ చుండి
విడుదల తేది: 2022



Songs List:



కోలు కోలో కోలోయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి

కోలు కోలో కోలోయమ్మ
కొమ్మా చివరన పూలు పూసే, కోలో
పువ్వులాంటి సిన్నదేమో
మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని
గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా

కుర్రగాడి చూపులన్ని
కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా

వాడి గూర్చి ఆలోచనే
వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట
పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా

అక్షరాలు వాడివంట
అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా

ప్రాణమంతా వాడేనంటా
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే




వీర తెలంగాణ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర 

వీర తెలంగాణ




నగాదారిలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: ద్యావారి నరేందర్ రెడ్డి, సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: వరం 

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి
నేడు తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది
ధన్యమాయెరో, ఓ

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్దమవ్వదా
సత్యం అన్నది

కోరుకున్న బతుకు బాటలో
నన్ను చూసి నిందలేసినా
బంధనాలు తెంచివేసినా
నిన్నే చేరగా

ఆడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో




చలో చలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: జిలుకర శ్రీనివాస్ 
గానం: సురేష్ బొబ్బిలి

మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం, మారదులే
రౌద్రపు శత్రువు దాడిని
ఎదురించే పోరాటం మనదే

చలో చలో చలో చలో
చలో చలో చలో చల్ పరిగెత్తు
అడుగే పిడుగై రాలేలాగా
గుండెల దమ్ముని చూపించు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
శ్రీకాకుళంలో రాలిన పువ్వులను
గుండెకు అద్ది నినదిద్దాం

సిరిగల భూములు చర విడిపించి
నిరుపేదలకు పంచేద్దాం
చలో చలో చలో
చలో చలో చలో

దొరోడి తలుపుకు తాళంలా
ఘడీల ముంగట కుక్కల్లా
ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు
మన బతుకులు మారేదెన్నాళ్ళు

ఆడబిడ్డ రక్షణకై పోరాటం
దళితుడి ఆత్మగౌరవంకై పోరాటం
పేదోడి ఆకలి ముద్దకై పోరాటం
రైతు నాగలి సాలుకై పోరాటం
హ, ఎన్నాళ్ళు… ఇంకెన్నాళ్లు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
చలో చలో చలో చలో
చలో చలో చలో

కనబడలేదా తుక్కిట జాబిలి
వినబడలేదా వేదనాగ్ని రవళి

అమరుల రక్తం
పాతులు గట్టే పాటలు గట్టే
ఎర్రని మల్లెలు నింగిన వెలిగే
వసంత మేఘం మరింత గర్జనై
ఆఖరి సమరం అన్నార్తుల విజయం

ఇదిగో ఇదిగో అరుణ పతాకం
అజేయ గీతం టెన్ టు ఫైవ్
అదిగో అదిగో అదిగో
అదిగో ఎర్రని కిరణం

అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు

Palli Balakrishna Tuesday, June 28, 2022




చిత్రం: నారప్ప (2021)
సంగీతం: మణి శర్మ
నటీనటులు: వెంకటేష్, ప్రియమణి
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాతలు: డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. తాను
విడుదల తేది: 2021



Songs List:



చలాకీ చిన్నమ్మి పాట సాహిత్యం

 
చిత్రం: నారప్ప (2021)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: ఆదిత్య అయ్యంగార్, నూతన్ మోహన్

తందానే నా నేననేన నానా
తందానే నా నేన నేన నానా
తందానే నా నేన నేన నానా
తందానే నా నేన నేన నానా

చిలిపీ చూపుల చలాకీ చిన్నమ్మి, చలాకీ చిన్నమ్మి
ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది చలాకీ చిన్నమ్మి
రాగి ముద్దవి నువ్వెర్రాని కారము
నేనెలాగే నిన్నిడిచి.... 
ఎలాగే ఉండేది చలాకీ చిన్నమ్మి

రానా నీతోటి ఇలాగే నిను నమ్మి 
ఇలాగే నిను నమ్మి
రాలసీమంటి వయ్యారి వన్నెల్లో
వరాలే విరజిమ్మి, వరాలే విరజిమ్మి

కిండాలెన్నైనా చేత్తానే నీతో
ఉండే నూరేళ్ళు చూడాలే ఎంతో
రేగడి నేనైతే నాగలి నీ నవ్వే
దున్నితే పండాలె నా పంటా

మంచే కట్టాలోయ్ ఈడు పొలంలో, ఓ ఓ
కంచె తెంచాలోయ్ కన్నె కలల్లో
పంచై చేరాలోయ్  కొక చివర్లో, ఓ ఓ
కంచై మోగాలోయ్ రైక కొనల్లో

యాలో యాల గంకెలై కాయాల 
శణాలే ఈయేలా నువ్వు నేన్ తొయ్యాల
జతై మోసెయ్యాల

కందీ చేలోన జోరీగల్లాగా
జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా
వేమన అవతారం ఎన్నడె బంగారం
అన్నది నా ఆత్రం భారంగా

చాల్లే చాలబ్బి సంబడమిట్టా, ఆ ఆ
లగ్గాల్లేకుండా సందడులెట్టా
నీకై దాచానీ పల్లము మిట్టా
నువ్వే దాటెయ్ నా సిగ్గుల కట్టా

పిల్లా గాలే పిచ్చిగా ఊదాలే
పి పి పీ డుండుంలే... 
పిపి పీ డుండుంలే... 
పిపి పీ డుండుంలే... 




ఓ… నారప్ప పాట సాహిత్యం

 
చిత్రం: నారప్ప (2021)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: ధనుంజయ్, వరం

ఓ… నారప్ప
నువ్వంటే ఇట్టంగుందే నారప్ప
నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప
ఓ… కన్నమ్మ
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ
నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ

ఇనేయ్ వా ఇట్టా ఇట్టా
నా గుండె ఏమంటుంటదో
ఇన్నాలే ఆశల చిట్టా
ఆ ఎరుకే ఎం అవుతుండదో
భలేగా బాగుందే సిలకా నీ మాయ
తలకాయ్ ఆడించే పిలకాయ్ అయిపోయా
కలకే నోరూరే ఎలుగె మనపై
పడుతుండాదే హోయా

ఓ… నారప్ప
నువ్వంటే ఇట్టంగుందే నారప్ప
నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప
ఓ… కన్నమ్మ
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ
నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ




నరకరా నరకరా పాట సాహిత్యం

 
చిత్రం: నారప్ప (2021)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: శ్రీ కృష్ణ , రేవంత్, సాయి చరణ్ భాస్కరుని

రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరగరా
మెడని మెడని విడిగా
రా తరామరా తురమారా
నరము నరము విరగ
కత్తి గొంతులో నెత్తురేయ్యారా
మట్టి నోటిలో దండ ముద్ద కలిపి వేయరా
నీలి నింగిని గాలి రంగుని
ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా
ఆయుధానికే ఆయుదానివై
ఆయువుల్ని తీసి చేసుకోరా చావు జాతర

రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చేరగరా
మెడని మెడని విడిగా
రా తరామరా తురమారా
నరము నరము విరగ

గుండెలోకి గుణపమై కడుపులోకి కొడవలై
దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్నీ తొలిచివేయి
గాయపడ్డ మనసువై మోసపడ్డ మనిషివై
లోపలున్న రాక్షసుణ్ణి దాచకింకా పైకి తీయి
క్రూర మృగమువై క్రూర క్రూర మృగమువై
గొర్ల కోరలతో వాళ్ళ రొమ్ములని వొలిచివేయి
కాల యముడువై పూనకాలా యముడువై 
పాశం విసిరివేయి వెన్ను పూసలన్నీ విరిచివేయి

రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చేరగరా
మెడని మెడని విడిగా
రా తరామరా తురమారా
నరము నరము విరగ





తల్లి పేగు పాట సాహిత్యం

 
చిత్రం: నారప్ప (2021)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైంధవి

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్లిపోకయ్యా
నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా
ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా

రాకాసి చీకటిలో ఏ కీడు తాకిందో 
ఏకాకివై పోయావా చంద్రయ్యా
కళ్లెర్ర జేసి రేయిని చుడయ్యా
తెల్లారి సూరిడల్లే రావయ్యా

నీ సెమట తడి ఇంకా ఇంకనేలేదయ్యా
ఈ తోటనంతా తడిమి సుడయ్యా
నీ నవ్వు సడిలేక గూడు సిన్నబోయెనయ్యా
ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా
మట్టిని చిల్చుకొచ్చే విత్తనమై రావయ్యా
సావుని కూడా సంపే సత్తువ నీదయ్యా
అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా
ఇట్టేనెట్టి సప్పున ఇంటికి రావయ్యా

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్లిపోకయ్యా
నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా

కన్నొదిలి చూపెల్లీ మసకేసి పోయేలే
గుండెల్లో మంట నిన్ను చూపేనా...
నన్నొదిలి నువ్వెళ్ళి కోడి కట్టి ప్రాణాలే
నా ఆశకాయువింకా ఇంకా మిగేలేరా
కటిక నిజం నీదని ఏ రుజువెదురవని
నమ్మాలంటే కష్టం కదా నాయనా
ఆకైనా అల్లాడదే చూడయ్యా...
నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా....
నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా...
ఇంతలోనే ఏమయ్యావో సెప్పయ్యా

రాకాసి చీకటిలో ఏ కీడు తాకిందో
ఏకాకివై పోయావా చంద్రయ్యా...
కళ్ళేర్ర జేసి రేయిని చూడయ్యా...
తెల్లారి సూరిడల్లే రావయ్యా




ఊరు నట్టనడివాయే పాట సాహిత్యం

 
చిత్రం: నారప్ప (2021)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి

ఊరు నట్టనడివాయే
దారి కంట పడదాయే
నీ జాడ చెప్పేదెవరు నాకింకా...
నిన్ను చూడగలనో లేదో నేనింకా

వేళ చూడు వేటాయే
వెలుగు కూడా ఈటాయే
ఓపలేని బరువైపోయే బాణాలు...
ఆపలేని పరుగైపోయే పాదాలు

Palli Balakrishna Monday, July 12, 2021


చిత్రం: టాస్ (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం:
నటీనటులు: ఉపేంద్ర, రాజా అబెల్, ప్రియమణి, కమిలిని ముఖర్జీ
దర్శకత్వం: ప్రియదర్శని రామ్
నిర్మాతలు: కె.కె.రాధామోహన్
విడుదల తేది: 14.07.2007

Palli Balakrishna Tuesday, March 26, 2019



చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్ , ప్రియమణి
దర్శకత్వం: జె. కరుణ్ కుమార్
నిర్మాత: డి.యస్. రావ్
విడుదల తేది: 20.02.2009



Songs List:



వద్దంటాన పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ప్రణవి ఆచార్య, రెహాన్ ఖాన్

వద్దంటాన 




వాడే వాడే పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రేయా ఘోషల్

వాడే వాడే




సయ్యారే సయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సాహితి
గానం: కల్పన

సయ్యారే సయ్యా





ఏం మాయో చేశావే పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హర్షిక , రంజిత్

ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే

ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే

కౌగిలించావంటే నా కొంప మునిగిందే
ముద్దులిచ్చావంటే నా మాతిపోయేట్టు అయ్యిందే

యు ఆర్ బ్యూటీ యు ఆర్ మై స్వీటీ
యు ఆర్ నాటీ యు ఆర్ మై టీ

ఓ ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే

ఓ ప్రపంచమంతా అయోమయంగా ఉన్నాదే
నిశ్శబ్దమైనా  అదో భయంగా నాకు తోచిందే
ఎందుకో ఆ తడబాటు ఇక్కడేమి జరగందే
చేసుకోవోయ్ అలవాటు చెక్కిలే అందకముందే
కళ్ళు రెండు తాగుతుంటే ఏమి జరిగిందంటవా 
ఉన్న ప్రాణం ఊడకుండా వచ్చి కాపాడే

యు ఆర్ లవ్లీ యు ఆర్ మై బబ్లీ
యు ఆర్ జిగిలి యు ఆర్ మై లవ్

ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే

ఎటేపు చూస్తే అటేపు నువ్వే కనిపించీ
ప్రతీక్షణం నా వయస్సు నాకే  గుర్తు చేస్తావే
చలులేవోయ్ వెటకారం చాలదోయి శృంగారం
ముందరుందే సుకుమారం జారుకుంటే అది నేరం
ముందు నున్నా వెనుకనున్నా పక్కనున్నా ఏడున్నా
ముందుకొస్తే బట్టబయలే సోకు బండారం

యు ఆర్ లవ్లీ యు ఆర్ మై బబ్లీ
యు ఆర్ జిగిలి యు ఆర్ మై లవ్

ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
ఏం మాయో చేశావే నను మైకంలో  ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే
ఓ నేను సేసిందేముంది మరి నీకు నాపై  ప్రేముంది
ఇంతకాలం ఆగింది ఇప్పుడే పై కొచ్చింది
కౌగిలించావంటే నా కొంప మునిగిందే
ముద్దులిచ్చావంటే నా మాతిపోయేట్టు అయ్యిందే

యు ఆర్ బ్యూటీ యు ఆర్ మై స్వీటీ
యు ఆర్ నాటీ యు ఆర్ మై టీ




వెన్నెల వాన పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ఉదిత్ నారాయణ్, సౌమ్యా

వెన్నెల వాన




ద్రోణ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: మురళీధర్, సిద్ధార్థ్, రఘురామ్

ద్రోణ


Palli Balakrishna Monday, March 5, 2018


చిత్రం: సాధ్యం (2010)
సంగీతం: చిన్ని చరణ్
సాహిత్యం:
గానం: నరసన్ కసల , గీతామాధురి
నటీనటులు: జగపతి బాబు, ప్రియమణి
కథ: శ్యామ్ మనోహర్
మాటలు (డైలాగ్స్): మదురూరి మధు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ
నిర్మాతలు: కుమార్ బ్రదర్స్ ( డి.రత్నకుమార్, డి.కర్ణాకర్, డి.సురేష్ బాబు)
సినిమాటోగ్రఫీ: మారో ఫళణి కుమార్
ఎడిటర్: గౌతమ్ రాజు
బ్యానర్: కుమార్ బ్రదర్స్ సినిమా
విడుదల తేది: 05.03.2010


అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నేనే
అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నేనే
పైటే జారితె కదలదు గాడి
హీటెక్కిందిరో టోటల్ బాడీ
కిందపడి మీద పడి ఎందుకలా హడావిడి

కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి
కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి

అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నేనే
అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నేనే

ఓ రంగమ్మో హొయ్ హోయ్ రంగమ్మో
నీ యవ్వారం యమా జోరుగుందమ్మో
ఓ చిట్టెమ్మో హొయ్ హోయ్ చిట్టెమ్మో
నీ ఊరేదో పేరేదో చెప్పమ్మో

నా పేరు మాయలేడి నా పాట మెలోడీ
పుట్టిపెరిగినూరు పర్లాకిమిడి
నేనేమొ ఆకు రౌడీ ఐనా బీ రెడీ
మీ వాళ్ళతో మాటాడి అవుతా జోడి

ఏడున్నారో మమ్మీ డాడీ తెలియదు బోడి
కాలం వృధా చెయ్యకురో బేరాలాడి
చింతలపూడి చిలకల్ పూడి అన్నీ తోడి
నీ లాంటి దానికోసమే చూస్తున్నా నిలబడి

కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి
కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి

నే ఖతర్నాక్ లేడీ ఆడొద్దు కబాడ్డీ
మొనగాళ్లే ఓడినారు నాతో ఆడి
ఒంట్లోన ఉంది వాడి వదలొద్దు కిలాడి
వందేళ్ల దాక వేస్తా నీకే బేడీ
చిందెయ్యారా మందెయ్యారా నాతో కూడి
ఇంకా ముందుకు వెళ్లొద్దురా ఆపే గాడి
అగ్గే రేపి బుగ్గెయ్యకే కులుకుల కేడి
అందాలన్నీ ముందే ఉంచి పెంచొద్దే అలజడి

కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి
కొక్కరకో కొక్కరకో కోడి
చిక్కెనురో చక్కర చగోడి

అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నీవే
అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నీవే

Palli Balakrishna Tuesday, February 27, 2018


చిత్రం: ప్రవరాఖ్యుడు (2009)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం:  చైతన్య ప్రసాద్ (All)
గానం: అనుజ్ గురవార
నటీనటులు: జగపతిబాబు , ప్రియమణి
దర్శకత్వం: ఆర్.ఆర్. మధన్
నిర్మాత: గణేష్ ఇందుకూరి
విడుదల తేది: 04.12.2009

ఏమైపోయానో ఏమైపొతున్నానో
నీతోనే సావాసం మొదలెట్టాకా
నీ నీడది నా పేరే అని తెలిసాకా
మాటాడాలంటు చూడాలంటు చేరాలంటు తాకాలంటు
నీలో ఏకం కావాలంటు ఆలోచిస్తూ ఆలోచిస్తు
ఏమైపోయానో ఏమైపోతున్నానో

ఏ ఏ ఏ ఏ చోట తిరిగినా నీ రూపే కనపడుతోంది
ఏం చెయ్యను ఏంచెయ్యను ఏంచెయ్యను

ఏ ఏ ఏ ఏ గాలి తాకినా నువ్వు తాకినట్టే ఉంది
కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్

Oh My Love Deep in Love
Don't know how tell me now

నువ్వుంటే స్వర్గం అంటూ
లేకుంటే శూన్యం అంటూ
నా మనసే నన్నే వెలి వేస్తుంటే
నీ దగ్గరకే తరిమేస్తుంటే

ఏమైపోయానో ఏమైపోతున్నానో

ఏ ఏ ఏఏకాంత వేళలో నా జంట కలవయ్యిందీ
నువ్వేనా నువ్వేనా నువ్వేనా నువ్వేనా

ఏ ఏ ఏఏ జన్మ బంధమో ఈనాడు జత కమ్మంది
ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా

Oh My Love Mad in Love
Don't know how tell me now

కను తెరిచే నిదురిస్తున్నా
నిదురిస్తు నడిచేస్తున్నా
ఇక స్వప్నం ఏదో సత్యం ఏదో
తేడా తెలియని ఆరాటం లో
ఏమైపోయానో ఏమైపోతున్నానో

Palli Balakrishna Wednesday, December 13, 2017



చిత్రం: రగడ (2010)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణి
దర్శకత్వం: వీరు పోట్ల
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 24.12.2010



Songs List:



మీసమున్న మన్మధుడ  పాట సాహిత్యం

 
చిత్రం: రగడ (2010)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్ , రీటా , హిమబిందు

మన్మధుడా... మగాడా... మగాడా... 
యే మీసమున్న మన్మధుడ 
మస్తు మస్తు సుందరుడ 
చాకులంటి చందురుడ అదరహు నీ రగడా 

యే మీసమున్న మన్మధుడ 
మస్తు మస్తు సుందరుడ 
చాకులంటి చందురుడ అదరహు నీ రగడా 

ఇదంతా కలకుమనే కతకలిగా 
కదిలెను నీ రగడా, దినకు దిన్ 
దరువులుగా సొగసులనే కుదిపెను నీ రగడా 

ఇయ్యాల రాని పిల్ల కోరుతుంది కుంత్టె రగడా 
గిచ్చి గిల్లి చేసుకోర జంట రగడా 

హెయ్ సునో సునో 
హెయ్ సునో సునో న పేరే రగడా 
హెయ్ సవాలనే నా స్టైలే రగడా 
హెయ్ నదారికే ఎదురొస్తే రగడా 
నా దమునే డీకొడితే రగడా 

చడుగుడు ..... 
హె చడుగుడు చడుగుడు చడుగుడు చడుగుడు 
పిడుగుల చెడుగుడు వాడుతాంది నీ రగడా 

అసద్యం అనుకుంటే పనులేవి జరగవు రా 
తెగించె గునమే నీ బలమంటు తలపడ రా 
హెయ్ హెయ్ హెయ్... బతుకంటే బయమంటే 
వెనుకడుగై ఉంట మంటే ఎదురీతే తెలిసుంటే 
ప్రతి గెలుపూ ఇక నీవెంటే 

మసీగ మగసిరిగా తనువంత 
తగిలను నీ రగద 
గరం మసాల గుమ గుమ గా 
మనసు నిలా తడిమెను నీ రగడా 
నీ చిచ్చుబుడ్డి చూపులోన 
గొప్పు మందీ గుండె రగడా 
ముట్టగించి చెయ్యమంది ముద్దు రగద 

హెయ్ సునో సునో 
హెయ్ సునో సునో న పేరె రగడా 
హెయ్ సవాలనే నా స్తైలే రగడా 
హెయ్ నదారికే ఎదురొస్తే రగడా 
నా దమునే డీకొడితే రగడా 

యే నువ్వే నీ పనివాడు పైవాడు ఎపుడైనా 
సూరీదై కదలాలి గగనాల పైపైనా హే... 
కరిమబ్బే ఎదురొస్తే సుడిగలై తరిమెయ్యంతే 
మెదడుంటె పదునుంటే టల రాతైనా నీ తొత్తే 

నిదర్లో మెలకువరా మెలకువలో మెరుపే నీ రగడా 
ఉలికి పడు పరువమునే ఒసిగొలిపే ఉరుమే నీ రగడా 
నీకంటి రెప్ప చప్పుడైతే చాలు నాకు చలి రగడా 
ఎపుడెపుడన్నది చెలి రగడా 

హెయ్ సునో సునో 
హెయ్ సునో సునో న పేరె రగడా 
హెయ్ సవలనే నా స్తైలే రగడా 
హెయ్ నదారికే ఎదురొస్తే రగడా 
నా దమునే డీకొడితే రగడా 





ఏయ్ శిరీషా శిరీషా పాట సాహిత్యం

 
చిత్రం: రగడ (2010)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్, శ్రీవర్ధిని

మాయె మాయె మాయమాయ్  మాయె మాయె మాయమాయ్ 
మాయె మాయె మాయ్
మాయె మాయె మాయమాయ్  మాయె మాయె మాయమాయ్ 
మాయె మాయె మాయ్

ఏయ్ శిరీషా శిరీషా ఎంత పని చేసావే శిరీషా శిరీషా 
ఏయ్ శిరీషా శిరీషా నన్నే లవ్లో దించెసావే శిరీషా 

ఉలికిపడి ఉన్నపాటు మేలుకుందా చిలిపి సదా 
వెంటపడి నీ జంట కోరే నా కోరికేంటో 
నెమ్మదిగా నెమ్మదిగా నీకు నేడే తెలిసిందా 

మాయె మాయె మాయమాయ్  మాయె మాయె మాయమాయ్ 
మాయె మాయె మాయ్
మాయె మాయె మాయమాయ్  మాయె మాయె మాయమాయ్ 
మాయె మాయె మాయ్

ఏయ్ శిరీషా శిరీషా ఎంత పని చేసావే శిరీషా శిరీషా 
ఏయ్ శిరీషా శిరీషా నన్నే లవ్లో దించెసావే శిరీషా 

నీ చాకొలేట్ లొక్సుతో నన్ను పడగొట్టేసావే 
లెఫ్ట్ రైటు నా మతి చెడగొత్ట్టేసావే 
నీ బాడీ వొంపులో నన్ను మడ్తెట్టేసావే 
నేను అంటే ఎంత క్రేజో చుపెట్టేసావే 
నీ గుండెల్లొన జోకొట్టెసి ముద్దెట్టెసేవే 
అయ్య బాబొయ్ అమ్మయె మాయె మాయె 

వరిస్తున్నా వలేస్తున్నా కన్నెత్తి చుల్లేదిన్నాల్లూ 
అడగ్గానె ప్రేమిస్తున్నా అన్నవదేంత్టో ఈనాడు 

హెయ్ నిన్నా మొన్నటి కథ వేరే ఇప్పున్నది వేరే మూడేలే 
ఆ సన్నా సన్నని నడుమిట్టా అందించే సంగతి చూడాలే 
ఓ మేరి శిరిషా ఓ మేరి శిరిషా మైన్ హు తేర బాదుషా 

హెయ్ నీలాంటి వాడు ఎప్పుడంటే అప్పుడంటూ జత పడన్నా 
దాపెట్టుకున్న సోకులన్నీ ఏకరువెట్టి 
అక్కరగా ఆకలిగా నీ కైవసమైపోనా 

మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ 
మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ 

అదే కన్నూ అదూ నన్నూ అదెంటదోలా చూస్తుందే 
ఏదో ఏదో చేసెయ్ నన్ను అదేగ నేనూ కోరిందీ 

హెయ్ నచ్చి మెచ్చక ఉరుకోనూ చెలి ముచట తీరుస్తానూ 
హెయ్ కమ్మా కమ్మంగ వొల్లుకొను కథ కంచికి చేరుస్తాను 
ఓ మేరి శిరిషా ఓ మేరి శిరిషా ఐ లవ్ యు హమేష 

హెయ్ పదునుగల మాటలున్న చేతలున్న ప్రియమదనా 
సొగసు పొద తీగ లాగి రేగిపోరా 
ఇప్పటికి ఎప్పటికి ఈ చెలి బారం నీదేరా… 

మాయె మాయె మాయమాయ్  మాయె మాయె మాయమాయ్ 
మాయె మాయె మాయ్
మాయె మాయె మాయమాయ్  మాయె మాయె మాయమాయ్ 
మాయె మాయె మాయ్



ఒక్కడంటె ఒక్కడే పాట సాహిత్యం

 
చిత్రం: రగడ (2010)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్య యన్.యస్, సుచిత్ర

ఒక్కడంటె ఒక్కడే  హ్యాండ్సం
వీడి వుక్కు లాంటి బాడి  ఆసం
ఒక్కడంటె ఒక్కడే హ్యాండ్సం
వీడి వుక్కు లాంటి బాడి  ఆసం
వీడు యెప్పుడైన నాకె సొంతం 
వీడి చూపులోన న్యూక్లియర్ దాడీ 
వీడి వూపిరేమొ సూరిడంత వేడీ 
వీడి తట్టుకునె మొనగాడేడి 
ఆ కింగు లాంటి వాడి కేడీ 
వీడి టచ్ లోన పొంగుతాది నాడీ 
వీడి లవ్ లోన లొంగుతాది లేడి 
వీడి పేరు చాలు పెదవికి మెలొడీ 
వీడె వీడె వీడె నాకు తగ్గ జోడీ 

ఒక్కడంటె ఒక్కడే హ్యాండ్సం
వీడి వుక్కు లాంటి బాడి  ఆసం
వీడు యెప్పుడైన నాకె సొంతం 

ఎక్కడెక్కడని వెతికిస్తాడే 
పక్క పక్క నుండి కవ్విస్తాడే 
తికమకతిక కలిగిస్తాడే రకరకములుగా 
ఒక్క నన్నే కొంటె కన్నై 
అతి కలివిడిగా కదిపాడే 
జంట కోరుకున్న ఒంటరిగా 
వీడి ఇంటి పేరు అరువిచడో 
నా వొంటి పేరు ముందు అతికిస్తా 
చిట్టి గుండె మీద చోటిచ్చాడో 
నే పక్క దిందు పరిచేస్తా 
యెంత మంది వీడి వెంట పడ్డారో 
నా కంటి రెప్పల్లోన దాచేస్తా 
వీడినెంత మంది ఇష్టపడ్డారో 
ఓ ముద్దు పెట్టి దిష్టీ తీస్తా 

వయసడిగిన వ్యాక్సిన్ వీడే 
మనసడిగిన మోసం వీడే 
కలలడిగిన క్యుపిడ్ వీడే కనిపించాడే 
మనువాడే మగవాడే అని మరి మరి మురిపించాడే 
మతి చెడగొట్టేసాడే 
ఒక్క ముక్కలో చెప్పాలంటే 
వాడి పక్కనున్న కిక్కే వేరే 
ఈ సక్కనోడు దక్కితే చాలే ఇంకా వేరేంకావాలే 
నా టెక్కుల్లని పక్కనెదతాలే 
సర్వ హక్కులులన్ని ఇచుకుంటాలే 
జంట లెక్కలన్ని తక్కువవ్వకుండా 
నే మొక్కు తీర్చుకుంటా 

ఒక్కడంటె ఒక్కడే హ్యాండ్సం
వీడి వుక్కు లాంటి   బాడి  ఆసం
వీడు యెప్పుడైన నాకె సొంతం





బోలొ అష్ట లక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: రగడ (2010)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్ , గీతామధురి

పరవసాల ప్రియ రమని మనీ 
అదుపు దాటి నది కలనుగనీ 
గట్టు దాటించిందా, గాల్లొ తేలించిందా 

ఇంతో ఇంతో నచ్చవురా సుందరా 
అంతో ఇంతో కొంతొ కౌగిల్లకి అందరా 

నిన్న మొన్న లేనే లేని తొందరా ఇపుడెందుకిలా 
ఏదో మాయమంత్రం వేసడయ్యొ నీలో అందగాడు 
పసి మందారంలా ముందే వున్న అందిస్తావ తోడు 

హెయ్ హద్దెదాటి ముద్దు ముచ్చట కోరిందా నీ ఈడూ 
నువ్వడిగింది ఇచ్చేస్తాలే నే అందం అమ్మ తోడు 

బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి 
వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం 
బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి 
వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం 

ఇంతో ఇంతో నచ్చవురా సుందరా 
అంతో ఇంతో కొంతొ కౌగిల్లకి అందరా 

ఇన్నల్లుగా గిచ్చి గిల్లి చెయ్యలేక 
నొచ్చుకుంది చిట్టిబుగ్గ పట్టి చూస్తావా 

నువ్వింతగా రచ్చ రచ్చై 
మచ్చి కైతే రెచ్చి పోలేన 

వాస్తువంపుల్తో బందనాలన్నా 
అస్తి మొత్తంగా నన్నందుకోమన్నా 

ఇంకాస్త చాలన్న, ఇంకాస్త లిస్తూనే 
నిన్నస్తమానం ఆదుకోలేనా న న న... 

బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి 
వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం 
బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి 
వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం 

నీ కోసమే పచ్చి వల్లు పచ్చ బొట్టు 
పుట్టు మచ్చ దాచి పెట్టి వేచి చూస్తున్న 

నీ జంటకే పన్లు మత్తం 
పక్కనెట్టి దూసుకొస్తున్న 

పూల వత్తుల్తో స్వాగతిస్తున్న 
వూత విస్తర్లో విందులిస్తూన్న 

మెత్త మెత్తంగా హత్తుకుంతూనే 
మహ మస్తుగా నీపొత్తై పోతున్న 

బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి 
వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం 
బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి 
వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం 




రగడ పాట సాహిత్యం

 
చిత్రం: రగడ (2010)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బాబా షెహగల్ , చిత్ర , రీటా

హెయ్ రగడ రగడ రగడా రగడా 
ఇది జడల జడల జగడా జగడా 
హెయ్ రగడ రగడ రగడా రగడా 
ఇది జడల జడల జగడా జగడా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ... 

యె జానె జాన నీ కట్ అవుట్ నచ్చినాది రా 
నా కంట్లొ లవ్కరంటు తెచ్చినాది రా 
అమాంతం పల్సు రేటు పెంచినాది రా 
క్రేజి గా మతులోకి దించినాది రా 

అంటి పెట్టుకున్నదాన్ని రా 
నే పైనే వొట్టు పెట్టుకున్నదాన్ని రా 
నీ వల్లే అగ్గి మంట అంటు కుంది రా 
సై అంటే అందమంత అందుతుంది రా 

అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా 
చంపుతోంది చాకులేటు దగ దగ దగ 
హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ 

హెయ్ రగడ రగడ రగడా రగడా 
ఇది జడల జడల జగడా జగడా 

హై ఫీవర్, లవ్ ఫీవర్ 
నా వుంట్లో చేరి నిన్నే కోరి గోల పెడుతుంటే 
తమాష చూస్తూ వుంటావా 
జాలి గా జంటై పోలేవా 

ఆ అష.. అ అ అ ఆష.. 

నీ వుల్లొ వాలి జొజొ లాలి పాడు కుంటారా 
రమ్మంటు చైయ్యందిస్తావా.. 

మ మ మ మాసూ, క క క క్లాసూ 
మీలొ ఎవరికి దక్కుతుందో చాన్సూ 
హ హ హ హెడ్సూ, ట ట ట టైల్సూ 
టాసు గిలిచినగుంతో రుమాన్సూ 

పెదవుల మూమెంట్సూ నీ పేరే పెలిచెను రా బాసూ 
తయరై తళుకుల వోనీసూ 
నా కోసం పలికెను వెల్కంసూ 

అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా 
చంపుతోంది చాకులేటు దగ దగ దగ 
హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ 

ఔనన్నా కాదన్నా 
నీ నోరూరిసూ ముందే ఉన్న ముందుకుస్తున్న 
నీ కోసం యెం కావాలన్నా 
క్షణాల్లో అందిస్తా కన్నా 

ఆజ ఆ ఆజ 

నా లవ్లీ బూటీ 
లకర్ తెరిచి తాలలిస్తున్నా 
సమస్తం రాబెరి చెయ్మన్న 

రపిన్ ఆజ చెపిన్ ఆజ 
అయ్య పాపమన హార్టు దోరు తెరిచా 
అ విచె ఆజ గలే లగ్ జా 
కుర్ర తొతలోకి కూత పెట్టి పిలిచా 

ఒక్కటంటె రెండు లెక్కనా 
ఇల కొటి లెక్క పెట్టి ముద్దులివ్వనా 
స్వయనా సిగ్గులన్నీ కత్తిరిచినా 
కజానా మొత్తమంత కుమ్మరించనా 

అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా 
చంపుతోంది చాకులేటు దగ దగ దగ 
హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ 

వన్, టూ 
వన్, టూ, త్రీ, ఫోర్ 

ఇట్స్ మీ, ఇట్స్ మీ ఫర్ రగడా 
ఇట్స్ మీ, ఇట్స్ మీ ఫర్ రగడా 

i feel lonely without you uptake 
everybody knows you by the name of chocolate 
i feel lonely without you uptake 
everybody knows you by the name of chocolate 

i love the taste, aroma of my chiklet 
baby hit me one more time with your bullet 
i am real not fake just do it do it 
its the rhythm of the dhol just kick it kick it




ఏం పిల్లో ఆపిల్లో పాట సాహిత్యం

 
చిత్రం: రగడ (2010)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్ , అనురాధ శ్రీరాం

ఏం పిల్లో ఆపిల్లో ఏ బొమ్మ కదిలిందో నీ కల్లో  



Palli Balakrishna Sunday, December 3, 2017



చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
నటీనటులు: సుమంత్, ప్రియమణి, విమలారామన్
దర్శకత్వం: వి.యన్.ఆదిత్య
నిర్మాతలు: కుమార్ బ్రదర్స్
విడుదల తేది: 18.03.2011



Songs List:



సూటిగా చూశావా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: అవినాష్ 
గానం: వేదాల హేమచంద్ర  , సునీత

సూటిగా చూశావా



అందంతో పందెమా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: కేధారినాథ్ పరిమి 
గానం: సిద్దర్ద్, మాళవిక 

అందంతో పందెమా




కల కాదుగా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: కందికొండ 
గానం: శశి కిరణ్, అంజనా సౌమ్యా

కల కాదుగా 





నన్నే నేను మరచిపోయా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: పావని మణిచంద్ర
గానం: దీపు శ్రావణ భార్గవి 

నన్నే నేను మరచిపోయా 




ప్రతి కలా నాలో పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: అవినాష్ 
గానం: శ్రీకృష్ణ , ప్రణవి 

ప్రతి కలా నాలో 




భీమవరం బుల్లోడా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: శ్రీకృష్ణ , సునీత

(ఈ పాట నాగార్జున గారు నటించిన ఘరానా బుల్లోడు (1995)  సినిమాలో నుండి రీమేక్ చేశారు. దీనికి సంగీతం: యమ్. యమ్. కీరవాణి, సాహిత్యం: వెన్నెలకంటి, గానం: యస్. పి. బాలు, చిత్ర )

పల్లవి:
జింకు చకం  జింకు చకం
జింకు చకం  జింకు చకం (2)

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మా
నీ చెక్కెర చుమ్మా
జింకు చకం  జింకు చకం
పచ్చిపాలు మీగడా
జింకు చకం  జింకు చకం
అచ్చతెలుగు ఆవడా
పెదవుల్లోనే దాచావమ్మో ఓ ఓ ఓ ఓ

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా
జింకు చకం  జింకు చకం

చరణం: 1
మావుళ్ళమ్మ జాతరలో
జింకు చకం  జింకు చకం
కౌగిళ్ళమ్మ సెంటర్లో
జింకు చకం  జింకు చకం
ఒళ్ళో కొచ్చి పడతావని ఒళ్ళంతా కళ్ళు చేసి 
నీ కోసం ఎదురుచూస్తి మావో
జారే పైట జంక్షన్ లో 
జింకు చకం  జింకు చకం
జోరే ఎక్కు టెన్సన్ లో 
జింకు చకం  జింకు చకం
కారాకిళ్ళీ లాంటి కిస్సు ఆరార పెట్టమంటు 
నోరార అడిగినాను పిల్లో
కుర్రోడి కొరుకుళ్ళకి ఎదే ఎర్రెక్కి పోతుంది పాడు
కుర్రీడు చిరు తిల్లుకి ఏదో ఎర్రెక్కి పోతుంది చూడు
అరె అందుకో బాసు ఆటీను ఆసు ఓ ఓ ఓ ఓ
జింకు చకం  జింకు చకం

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా
జింకు చకం  జింకు చకం

జింకు చకం  జింకు చకం

చరణం: 2
తపాలమ్మ సావిట్లో 
జింకు చకం  జింకు చకం
దాహాలమ్మ సందిట్లో
జింకు చకం  జింకు చకం
రేపు మాపు నీతోని లంగరేసుకుందామని
చెంగు చాటుకొచ్చినాను పిల్లో
మొహాపురం స్టేషన్లో
జింకు చకం  జింకు చకం
ముద్దాపురం బస్సెక్కి
జింకు చకం  జింకు చకం
చెక్కిలి పల్లి చేరాలని అక్కరతో వచ్చినావు 
అందుకనే నచ్చినావు మావో
వరసైన దొరసానికి ఇక కరుసేలె ఇరుసంత రోజు
దరువేసే దొరబాబుకి 
ఈ పరువాల బరువెంతో మోజు
అ వయ్యారి జాణ ఒళ్లోకి రానా ఓ ఓ ఓ ఓ హ
జింకు చకం  జింకు చకం

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా
చుమ్మా చుమ్మా చుమ్మా చుమ్మా

Palli Balakrishna Wednesday, November 22, 2017



చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , ప్రియమణి, దీపక్ (అర్జన్ బజ్వా)
దర్శకత్వం: మహాదేవ్
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
విడుదల తేది: 01.05.2009



Songs List:



తెల్లవారితే పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: రాహుల్ నంబియార్, హేమచంద్ర, శ్రావణ భార్గవి 

తెల్లవారితే




బై బర్తే పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: శ్రేయా ఘోషాల్ 

బై బర్తే





డోంట్ టచ్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: రంజిత్, చిత్ర 

డోంట్ టచ్  మీ



జుమ్మంది వళ్ళంత పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఓరుగంటి 
గానం: కార్తీక్, సుజాత 

జుమ్మంది వళ్ళంత




ప్రియమణి అన్నాను పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సైందవి

పల్లవి: 
ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో 
ప్రియమనే ఉన్నావు నా గుండెలో
ప్రియతమా అన్నాను నేనెన్నడో
ప్రియలయే రేగింది నా గుండెలో
నువ్వు చూస్తే ప్రేమ చేర వస్తే ప్రేమ
నాలో జివ్వు జివ్వు జివ్వుమందిలే
ఓ నమః ప్రేమ ఒళ్ళో మహా ప్రేమ
నీతో సై సై సై అందిలే

చరణం: 1
నీలోనే లోకాలు నీతోనే కాలాలు
ఈ జీవితం స్వాగతం
ఈ ప్రేమ తీరాలు కావింక దూరాలు
ఇదే మా ఇద్దరం
గులాబీల నూనూగు రెమ్మా
ఎలా తాకినా హాయిలే
చాలకీల ఈ చందమామ 
ఇలా అందిన రేయిలే

ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో 
ప్రియమనే ఉన్నావు నా గుండెలో

చరణం: 2
ఈ పూల భాషల్లో  ఈ రాస లీలల్లో 
ఝుం ఝుంమని వాలిపో
ఈ మందహసాన ఈ మల్లెమాసాల
రా రమ్మని వచ్చి వాలిపో
ముకుందాల ముద్దంత తీసి 
నే ముమ్మాటు ముట్టించనా
వసంతాల పూతేని పోసి
నీ ఒళ్ళంత ముద్దాడనా

ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో 
ప్రియమనే ఉన్నావు నా గుండెలో
ప్రియతమా అన్నాను నేనెన్నడో
ప్రియలయే రేగింది నా గుండెలో




ఆకాశం నుంచి పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: విజయ్ యేసుదాస్, కౌసల్య 

ఆకాశం నుంచి 

Palli Balakrishna Tuesday, November 14, 2017



చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
నటీనటులు: రవితేజ, అల్లరి నరేష్ , శివబాలాజీ, సునీల్, సముద్రఖణి, ప్రియమణి, రోజా, అభినయ
దర్శకత్వం: సముద్రఖణి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 14.01.2010



Songs List:



చింతామణి పాట సాహిత్యం

 
చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, యం. యం. శ్రీలేఖ

చింతామణి




బావ బావ పాట సాహిత్యం

 
చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర, గీతామాధురి

బావ బావ



ఎవరేమన్నా ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: హరిహరన్

పల్లవి:
ఎవరేమన్నా ప్రేమా ఎదకోతేనుగా
ఎదురీతల్లొ ప్రేమ ఎదుగును వింతగా
ప్రేమను ప్రళయమే వీడిపోదూ
తనతో ఆడితే ప్రేమ తానే కాదు
ప్రతి కథలో ఇది సహజం
పరులకిదే అపార్ధం

చరణం: 1
కడలిని వీడి అడుగులు వేయవు అలలేనాడు
నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడూ
దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు
ఓ దైవమా...ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా
నా కన్నులలో కన్నీరేల 
తుడిచే నేస్తం కనపడదేలా

చరణం: 2
హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగిందీ
ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది
కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది
ఆ కన్నులలోనే కన్నీరై కలవర పరిచింది
ఓ నేస్తమా...ఓ నేస్తమా నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమా
అడుగే పడదు అలికిడి లేకా
మరణంలోనూ నిను మరువను ఇంక





అడండిరా బాబు పాట సాహిత్యం

 
చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: మనిక్కా వినయగం

అడండిరా బాబు



కనుపాపల్లో ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: సాధనా సర్గమ్

పల్లవి:
కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా
మరునిమిషంలో ప్రేమా కలతే రేపినా
పూవే అందునా ముళ్ళనే దాటక
ప్రేమే చేరునా మనసునే వేధించక
ప్రతి కథలో ఇది సహజం 
పరులకిదే అపార్ధం

చరణం: 1
కడలిని వీడి అడుగులు వేయవు అలలేనాడు
నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడూ
దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు
ఓ దైవమా...ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా
నా కన్నులలో కన్నీరేల 
తుడిచే నేస్తం కనపడదేలా

చరణం: 2
హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగిందీ
ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది
కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది
ఆ కన్నులలోనే కన్నీరై కలవర పరిచింది
ఓ నేస్తమా...ఓ నేస్తమా నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమా
అడుగే పడదు అలికిడి లేకా
మరణంలోనూ నిను మరువను ఇంక




శంభో శివ శంభో పాట సాహిత్యం

 
చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శంకర్ మహదేవన్

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీలకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడని
చూపర ధైర్యాన్ని...

నరాలు తెగిపడి నెత్తురు రానీ
నరమేధాలే కలిగిన గాని
స్నేహం కోసం ప్రాణం పోనీ
చెయ్యర యుద్ధాన్ని...

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే
లోకంలో సోఖం లేదు మనుషుల్లో లోపం లేదు
చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా
నవ్వుల్లో బాధల్లోను విడిపోనిది స్నేహమేగా
ప్రపంచమే తలకిందైనా...
ప్రేమ వెంట స్నేహం ఉంటే.. విజయమే

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీలకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడని
చూపర ధైర్యాన్ని...

నరాలు తెగిపడి నెత్తురు రానీ
నరమేధాలే కలిగిన గాని
స్నేహం కోసం ప్రాణం పోనీ
చెయ్యర యుద్ధాన్ని...

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

ఓ ఓ ఓ
కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా
నదిలోన భోగ్గే పెడితే క్షణమైనా నిలుచుంటుందా
ప్రేమన్నది దైవం లేరా స్నేహం తన బీజమేనురా
నీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా
స్నేహానికి జన్మ హక్కురా...
నీ తప్పు ఒప్పున దిద్దేయ్.. బాధ్యత

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

చంద్రం  రౌద్రం ఔతుందేంటి
మంచే అగ్నిగ మరిగిందేంటి
ప్రేమకు గ్రహణం పడుతుందేంటి బదులే రాదేంటి
దిక్కులు దిశలే మారాయేంటీ
పడమట సూర్యుడు పొడిచాడేంటి
గుండెల్లో ఈ గుణపాలేంటి అసలీ కథయేంటి

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో





జగడం జగడం పాట సాహిత్యం

 
చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శంకర్ మహదేవన్

జగడం జగడం

Palli Balakrishna Thursday, November 9, 2017


చిత్రం: ఎవరే అతగాడు (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బి.చరణ్ , శ్రీవర్ధిని
నటీనటులు: వల్లభ కె.యస్, ప్రియమణి, జయ షీల్
దర్శకత్వం: పి.బానుశంకర్
నిర్మాత: కిరణ్
విడుదల తేది: 11.01.2003

(నిర్మాత కె.యస్.రామారావు గారి కొడుకు వల్లభ)

ఎవరమ్మా అతగాడెవరమ్మా
వివరాలే దాచక తెలుపమ్మా
కళ్ళలో కలలు కలిసే మనసే
కదిలించె మరులు కురిపించె
కొత్త విరహాన ముంచినాడే
ఎవరమ్మా...

ఎవరమ్మా అతగాడెవరమ్మా
వివరాలే దాచక తెలుపమ్మా

భలేదొంగవమ్మ నువ్వు ఖలేజాలు ఎన్ని నీకు చిలకమ్మా
మాటవరసకైన నాకు చెప్పలేదు ఎవరమ్మా...
నిన్నా మొన్నటిదాన్ని నామాట కేమిగాని
చెట్టంత ఫ్రెండ్ కైన చెప్పలేదా
పలుకే బంగారమాయే కులుకే సింగరమాయే
చాల్లే బెట్టు ఎవరమ్మా
ఎవరో మాకు చెబితే లగ్గం చూసి పెడతాం
అమ్మడు విధిగా విదియో తదియో
సుముహూర్తమెట్టి శుభలేఖలేసి
నీ పెళ్లి జరపలేమా... ఎవరమ్మా...

ఎవరమ్మా అతగాడెవరమ్మా
వివరాలే దాచక తెలుపమ్మా

మరీచెప్పరాని వాడ మహా గొప్ప అందగాడా
ఎవరమ్మా...    కోరస్: ఎవరమ్మా...
సరగాల ఇంటిదొంగ చలాకీల చంటి దొంగ
ఎవరమ్మా...
కోలాటమాడుకన్ను సయ్యటలాడు చూపు
ముద్దుల్లో ముంచినోడు
కోరస్: ఎవరమ్మా...
సందేళ్ల కోడి కుసే పందిళ్ళ ఈడు వేసే
ప్రేమించింది ఎవరమ్మా...
అసలే తోచదాయే ఒకటే తొందరాయే
ఎవ్వరాఘనుడు ప్రియుడు వరుడు
నిను మాయ చేసి మత్తేదో జల్లి
మనసిచ్చు కున్నవాడు ఎవరమ్మా...

ఎవరమ్మా అతగాడెవరమ్మా
వివరాలే దాచక తెలుపమ్మా
కళ్ళలో కలలు కలిసే మనసే
కదిలించె మరులు కురిపించె
కొత్త విరహాన ముంచినాడే
ఎవరమ్మా...

Palli Balakrishna Sunday, October 22, 2017


చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: రమేష్ వినయగం
నటీనటులు: విశాల్ కృష్ణ, ప్రియమణి
దర్శకత్వం: భూపతి పాండ్యన్
నిర్మాత: విక్రమ్ కృష్ణ
విడుదల తేది: 28.09.2007

చెలి నా యెదనే నే నిన్ను చూచుకోని క్షణం
అణువు అణువు పులకించే నువ్వు నన్ను చూచుమరుక్షణం
నీ కనుల్లో వెలిగే కర్పూరమల్లే ప్రియాని కరిగే
నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి న పువ్వులుగా
సందెవేళవీచే నీ చల్లగాలిని నేనేగ
ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకానా

నీ నున్నని బుగ్గలపలకపై నా పెదవితో రాసే విధమెలా
నీ నుదుటను బొట్టే జాబిలై సిరివెన్నెల కాచెను పగలెలా
నీ పడుచుగుండెలో చొరబడిగిలిగా ఒక ఒడి వరిగేదెన్నడు
నీలేత నడుమునే తడిమి చూడన అలజడి కలిగే దెప్పుడు
నువ్వు ఆమే అనకవా నా కానుకవా రెండూ నీవై వెలిశానే
నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా
సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా
ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకనా

నీ యెంగిలి ఉద్దేశం మతం అది ఏక్షణమైన సమ్మతం
నీ చిలిపి కౌగిలి సమ్మతం అది నను బలికొన్న సమ్మతం
నీ చెవుల పక్కగా ఎగిరేజుట్టును నిమరగ ఎంతో సమ్మతం
నీ చీరకడితే ఓ చినుకల్లే ఇలపైపడినా సమ్మతం
ఇక నా జీవితం నీ కల్పనం నువ్వేకదా నా ప్రాణం
నిన్ను నడిపించే నా శృతివి నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా
సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా
ప్రతి నిత్యం నీ మౌనగీతమై జతకానా


********   *********   **********


చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: రాహుల్ నంబియర్

యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతం
బేబి నువ్వు పూలనందనం యో బేబి నువ్వు దీపావళి బేబి నువ్వు
అనార్కలి బేబి నువ్వు వెన్నెల జాబిలి
అమ్మమ్మో ఆ పాదం చిక్కితే కుమ్మే బంగారం
అబ్బబ్బో చెలి చెయ్యేపడితే నీరే సారాయే
అయ్యోయ్యో తనుతాకితే ఎటూకాదూ నాదేహం

ఈ చిలక పలికే పలుకే రామ చిలక నేర్చే కులుకు
తనకాలి ముద్దు కొరకే విలచేపలన్నీ ఉరుకు
అరె కంచిపట్టు చీరే అది కుచ్చీళ్ళనే కోరు
నాగమల్లి పువ్వే ఆమె బాసలకే తుళ్ళు
పిల్లే పతంగిలా పైటని ఎగరేయింగా
చచ్చినోళ్ళంతా మళ్ళా బతికి వచ్చారుగా
ప్రేమను పూజారిలా కలలు పూజలు చేయంగా
రెండునే ఉయ్యాల ఊగితల తిరిగింది

నా ఆలమంత వెలుగా తన కంటి తళుకు చాలు
నా ఆశలన్నీ తీర ఒహా కాలి మెరుగు చాలు
ఎహే తాళికట్టు వేళ నిను సిగ్గుపడితే చాలు
నే మత్తు పిల్ల నడగ నను నసగకుంటే చాలు
మిర్చి బజ్జీలా మనసంతా ఊరించేలా
పిచ్చినాకు పట్టించేసి రెచ్చగొట్టేరా
కంటికి కనపడని గాలెల్లో కలిసేరా
కలలో శ్రీదేవిలా కలలు చెప్పేరా


********   *********   **********


చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: నవీన్

అయ్యాసామి శివుని కుమార నాచిన్న కోర్కె నెరవేర్చు
చక్కని చుక్కతో కావాలి పెళ్ళి నాకొక పిల్లను జతజేర్చు
పావడి పరిణిదొరికాక కావడీ తెస్తాము
నెమలికి బదులు నీకొక ప్లైటు బహుమతి ఇస్తాము
వల్లివి నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా

నాన్నగారి తిట్లు తిన్నాములేరా పరీక్షల్లో
సున్నా తెచ్చుకున్నావేరా చదువుచించేశాం చించీ చదివేశాం
బస్సులో వెల్తే టాక్టుల మోత బైకులో వెళ్తే గ్యాప్‌ల మోత
నడిచిన పిల్లవస్తే నడిచే పోతామురా
ఆడపిల్ల మనసే ముదురు దానికుండాదులేరా కుదురు
గాలం చేస్తారు బ్రదరూ పడితే నీపని అదురు
బూకంపం అయినా అణిగెను గురువా అమ్మాయి మనసు అణగదులే
వల్లిని నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా

కొత్తసినిమాకు ముందేవుంటాం ప్రెండ్స్‌కు ఎప్పుడు వెనకే వుంటాం
పోటీ వచ్చిందో మధ్యలో మేముంటాం
టీ కొట్టు ప్రక్కన మీటింగులు పెడతాం ఫిగరులుచ్వస్తే పువ్వులు పెడతాం
పిల్లేనవ్విందా పార్తీలు మేమిస్తాం
అరె బరిలోకి వచ్చే భయ్యా నువు పంతం వెయ్యరా మియ్యా
సయ్యంటేను సయ్యా హూసుకుపోరా అయ్యా
ఫిగర్స్ వల్లో పడ్డా కూడ బ్రదర్స్ తోటి వెగరేమి
వల్లిని నువ్వు హరోంహరా హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా


********   *********   **********


చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: దీపు

దేవత నీవే నా దేవత నీవే
కనుపాపగ కాస్త నినునే రిబ్బనై
నా జత నీవే ఇక నా కత నీవే ఎడ బాయక ఉంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే ఇది మన మనసుకు కలయిక

చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను
కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను
పులిలా నన్ను తాకా ఓ సింహానవుతాను
నీ ఊపిరితో ఋమెదురైనా వేణువుకాగా
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెలరాగా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగనా
నీవేనేనై బతకనా తలపుల తలపులు తెరిచినా

జోరున కురిసే వానలు ఎండే నువ్వంట
దిక్కులు చెరిగే ఎండలు వానే నువ్వంట
ఏకాంతాన్ని వెలివేసేతోడే నువ్వంట
శోకాలన్నీ తరిమేసే జాడే నువ్వంట
నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా
నీ నడకల్లో మోగేటి మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపము గుండెన వెలిగే దీపము
పంచే తీయని పాపము వలపుల పిలుపులు తెలిపెను


********   *********   **********


చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మురళీధర్, విజయలక్ష్మి

హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
అరే వస్తా వస్తానమ్మా వేడిగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
ఈరే అక్కుం బక్కుం జాజిమల్లే అల్లుకుందామ్రా పిల్లా
హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
గడ గడ గడ వేశస్తా వయ్యారం గడియ
గుమ గుమ గుమ కమాన్ బేబి పోదాం తనయ

ఆ మేఘం వచ్చింది ఆకాశం మూసింది అదురు తెలిపినది
అత్తర్లు పూచాను అందాలు దాచాను ఎగిచే ఎద అలలో
పడుచు మనసుకు వెండి తెర వేస్తావా
తళుకు వలపుల తొలి కస నీవమ్మా
మారని ఇదీ ఇదీ కోరికలే వరింది తీరుబడి కలిసాం మరి తెలుసుకో

నా ప్రేమ గుప్పెట్లో నీగుండె చప్పుల్ని నా ఈడు పోటుందిరా
ప్రేమించే కళ్ళుంటే ఆడెండి ఈడేండి వాడిక వాటాలకూ
ఎగిసే వలపులు అల్లరికే బెదరవు రవ్వంత మెరుపుకు నా మనసు బెదరదు
మనస మనస మనసకి నీ నస తెలియని వరసె పాయసమే మనసై మతి చితికెనె

Palli Balakrishna Saturday, September 23, 2017


చిత్రం: పెళ్ళైన కొత్తలో (2006)
సంగీతం: అగస్థ్య
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: కార్తిక్ , రీటా
నటీనటులు: జగపతిబాబు , ప్రియమణి
దర్శకత్వం & నిర్మాత: ఆర్.ఆర్.మధన్
విడుదల తేది: 08.12.2006

చెలివో, నా చిలిపి కలవో...
శిలవొ సంకెలవో...చిరుత పులివో...
నిను చెరాలనె చిరు ఆసా...మదిని అణిచెస...
తెలుసుకోవ ని వాడినని...తెలుపరావ...నా దానివని...కలకాలం...
పతివో...న హౄదయ జతి వో...
యతి వో నా గతి వో...మందమతివో...
నాలొ రెగె... తపనా...ఒకసరి వినవా...
మదనపడి మనసు చెడి... మిగిలస్ను నీఎ కొసం...
ఇలా సిల ల....

వయసిది వెల్లమన్నది...
మనసిది అపుతున్నది...
ఎవరికి చెప్పలెనిది..
ఎట్ట బ్రతికెదీ...
ఎదలకు గదులు ఉన్నవి..
తలుపులు తెరుచుకున్నవి..
కలలకు స్వాగతం అని...
ఎల తెలిపెదీ...
ఓకరికి ఓకరు ఎవరిమో..
తపనలు ఎందుకొసమో..
తెలియని జంట జీవులం..
భలె సంసారం...

మనసుకు మమత దురమా..
పెదవికి పలుకు దురమా..
వదలని హౄదయ భారమ...
ఓసెయ్ వెళ్ళిపోవె...

Palli Balakrishna Friday, September 15, 2017


చిత్రం: గోలీమార్ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: గీతామాధురి
నటీనటులు: గోపిచంద్, ప్రియమణి, రోజా
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 27.05.2010

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే

మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే మాలాగా లైఫులోంగు ఉండరంతే
మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే
ఈడు కూడ ఇంతే

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే

ఢంకుటకర ఢంకుటకర  టా
కాసంత ఓదార్పు కోరుకుంటామ్ కూసంత టైమిస్తే పొంగిపోతామ్
కాసంత ఓదార్పు కోరుకుంటామ్ కూసంత టైమిస్తే పొంగిపోతామ్
మగాళ్ళ గోలేంటో దారేంటో తీరేంటో యామో ఏంటో
మీకు నచ్చినట్టు మేము మారినా మాగుండే కోసి మీకు ఇచ్చినా
మీరింతే ఛీఛీ ఈడు కూడ ఇంతే

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే

కోపంలో ఏమన్న సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మే ఎట్టుకుంటామ్
కోపంలో ఏమన్న సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మే ఎట్టుకుంటామ్
మగాళ్ళ మైండేంటో మూడేంటో మాటెంటో యామో యాంటో
అడ్డమైన సేవలెన్ని చేసినా ఆకాశమంత ప్రేమ పంచినా
మీరిన్తే ఛీఛీ ఈడు కూడ ఇంతే

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే


*******   ********   *********


చిత్రం: గోలీమార్ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి, కౌసల్య

పల్లవి:
గుండెల్లో ...హ్మ్మ్
కళ్ళల్లో ...హ్మ్మ్

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి

నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని

తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ
తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి

చరణం: 1
నా పెదవంచులో నీ పిలుపున్నదీ
నీ అరచేతిలో నా బ్రతుకున్నదీ
ఇన్నాళ్ళెంత పిచ్చోణ్ణి నేను .. మనసిస్తుంటె తప్పించుకున్నా
మొత్తమ్మీద విసిగించి నిన్నూ ఏదో లాగ దక్కించుకున్నా
మనసున్నాది ఇచ్చేందుకే .. కనులున్నాయి కలిపేందుకే
అని తెలిసాక నీ ప్రేమలో .. పడిపోయానులే

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి

చరణం: 2
నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ
ఈ గిలిగింతలో నే పులకించనీ
నాకో తోడు కావాలి అంటూ ఎపుడూ ఎందుకనిపించలేదు
వద్దొద్దంటూ నే మొత్తుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో
కన్నీళ్ళొస్తె తుడిచేందుకూ .. సంతోషాన్ని పంచేందుకూ
ఎవరూ లేని జన్మెందుకూ .. అనిపించిందిలే

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి
నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని
తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ
తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ

గుండెల్లో ...హ్మ్మ్
కళ్ళల్లో ...హ్మ్మ్

Palli Balakrishna Friday, September 1, 2017


చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:
నటీనటులు: కళ్యాణ్ రామ్ , ప్రియమణి
దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 18.07.2008

ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం..
పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం..
భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం..
ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం..

హరిలో రంగా హరి ఇదేం తమాషే..కారంగా వాడే జోడి తరవాత రాసే..
భాగోతం బాగుందా ఓ సరే సభాసే..ఐసే ఐసే ఒకటే దురుసే..
ఆనందో బ్రహ్మా అంటూ షికార్లు చేస్తే..అమ్మోరు పూనినట్టు ఈరంగమేస్తే..
ఎన్నాళ్లీ చోరా చోరీ తోచింది చేస్తే..చూస్తే గీస్తే మతే మటాషే..

జంట కుదిరిన జోషే..కంటపడితే వెంటపడక ఒంటి కలతో ఉంటదా..
నిష్ట చెదిరిన మనసే వింటదా చెబితే..
కత్తి పదునై కోసే..కొత్త చినుకు గుండె తొడుగుతుంటే కునుకు పడతదా..
నరం నరం నములు గరం గరం గుబులు..క్షణం క్షణం దిగులు ఇచ్చే అంటంతా..
అదో రకం తెగులు అయోమయం సెగలు..పుట్టించడం తగని పనే కదా..


లోకుల్లారా దీవిస్తే మీకే మేలంటాం..కాకుల్లాగా కవ్విస్తే 'కేర్ ఏ పిన్' అంటాం..
ఏం చేస్తారో మీ ఇష్టం మాకేం అనుకుంటాం...మున్ముందుకు పోతాం ఆగం మీ కోసం..


***********   ************   *******


చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:

సయ్యన్నారా సరదాగా సంగతి చెప్పుకుందాం
కాదన్నారా..ఎసేయి రా..సేయి రా అనుకుందాం..
అసలెందుకులే మీ అందరి ఒప్పందం..
వై...కాపేస్తే కంచెలు తుంచుకు పోతాం..
వై..ఆపేస్తే తప్పక తప్పుకు పోతాం..
వై..కోపిస్తె కొండల నుంచి కిందికి వచ్చి కిక్కున తుంచే కొంపలు ముంచే గోదారైపోతాం..
వై..ఆవారా గాలిని బంధిస్తారా..
వై..కెరటాలకు కొరడా చూపిస్తారా..
వై..గుప్పెట్లో నిప్పును పట్టి కప్పడమంటే ముప్పని ఎవరూ చెప్పక ముందే తెలిసిందే..

పొందేయ్ లాభం..మ్..మ్..మ్..

జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..
జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..

ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం..
పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం..
భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం..
ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం..

[జంట కుదిరిన జోషే]

జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..



*********   **********  ***********



చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:

నా న నానా నానానా..నా న నానా నానానా..నా న నానా నానానా..నా..నానానానా..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
పుట్టుకొచ్చే పిచ్చి..నువ్వు నచ్చి..పట్టుకొచ్చా మెచ్చి..పంచుకోవ లవ్ రుచి..
పట్టపగలే వచ్చి..బరితెగించి..పచ్చి వగలే తెచ్చి..వెంట రాకే కొంటెగా కవ్వించి..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..

ఒంటరి ఈడు కదా..తుంటరి తొందర ఉండదా..ఎందుకు ఈ బెడదా..తగునా..
అందుకు ఆడ జతా..తప్పక అవసరమే కదా..నువ్వది కాదు కదా..అవునా..
ఇంతలేసి కళ్లు ఉన్నా గంతలేసుక్కుచున్నావా..నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడుకుంటుందా..
బాప్ రే బాప్ తెగ బెదిరానే..నమ్మవేం చెబుతున్నా..గాభరా పడుతున్నానే..చాలదా..పులి కూనా..

ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..

దక్కిన చుక్కనిలా..తక్కువ చేయకు ఇంతగా..మక్కువ దాచకలా మదిలో..
కమ్ముకు రాకే ఇలా..తిమ్మిరి పెంచకె వింతగా..గమ్మున ఉండవెలా తెరవో..
ఆశపుడితే ..దాగుతుందా.. రాసకార్యం ఇన్నాళ్లుంటే..మూతపెడితే దాగుతుందా.. చాలు రాదది జోకొడితే..
క్యా కరే నాకేం దారి..నౌకరీ పోతుందే..పోకిరి వైఖిరి చాలే..ఛోకిరి వదిలెయ్వే..

ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
పుట్టుకొచ్చే పిచ్చి..నువ్వు నచ్చి..పట్టుకొచ్చా మెచ్చి..పంచుకోవ లవ్ రుచి..
పట్టపగలే వచ్చి..బరితెగించి..పచ్చి వగలే తెచ్చి..వెంట రాకే కొంటెగా కవ్వించి..
నా న నానా నానానా..నా న నానా నానానా..నా న నానా నానానా..నా..నానానానా..



*********   *********   **********


చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:

సరిగా పడనీ ఇపుడే తొలి అడుగూ
సుడిలో పడవై ఎపుడూ తడబడకూ
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరవనీ నీ కళ్ళు
కన్నఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
మన్ను తడి తగలాల్సిందే మునుముందుకు సాగాలంటే
కిందపడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
చలో చలో

నిన్నే చూసే అద్దం కూడా నువ్వా కాదా అనదా
అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా
సూర్యుడ్లో చిచ్చల్లే రగిలించె నీలో కోపం
దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుడ్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
కుందేలై అందంగా కనపడదా
నీలా నవ్వే క్షణాలలో

చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసీ
తొక్కే కాళ్ళే మొక్కేవాళ్లై దైవం అనరా శిలను కొలిచీ
అమృతమే నువు పొందూ విషమైతే అది నావంతూ
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు
కైలాసం శిరసొంచీ నీ ఎదలో ఒదిగే వరకూ
చలో చలో

**********   *********   **********


చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఊరికే ఉసూరుమంటావే ఊహకే ఉలిక్కిపడతావే
చక్కగా సలహాలిస్తావే తిక్కగా తికమక పెడతావే

రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా
రేయంతా వెలిగించీ రంగుల లోకాన్ని

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఎదురుగా పులి కనబడుతుంటే కుదురుగా నిలబడమంటావే
బెదురుగా బరువెక్కిందంటే మది ఇలా భ్రమపడుతుందంటే

గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే
కాలైనా పెట్టవుగా సందేహాలేవీ

ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

Palli Balakrishna Monday, August 14, 2017


చిత్రం: నవ వసంతం (2007)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఈ.యస్.మూర్తి
గానం: యస్.పి. బాలు
నటీనటులు: తరుణ్ , ప్రియమణి, రోహిత్, సునీల్
దర్శకత్వం: కె.షాజహాన్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 09.11.2007

పాటలె ప్రాణమని పాడన పాటలని
గాలిలొ తేలి తేలిపూలతావి కాద సంగీతం
మనసు మీటె పాట ఉంటె స్వర్గమె నీ సొంతం

కలతె లేదు కొయిలకి పాటె ఉంటె
అలుపె రాదు తుమ్మెదకి ఝుం ఝుం అంటె
తుళ్ళింతల మదిలొ అలలకి తెలిసెని తకధిమి తాళం
కవ్వింతల చలి గాలికి తెలియనిద ఇందొళం
అందరికి అనుభవమేగ పాటలలొ ఆ సంతొషం
శివుడైన ఆడక మానడు వింటె చక్కని సంగీతం
పాటలె ప్రెమించె మనసు నందనం

పాటె మనిషి అనందం పాటె అందం
పాటె ప్రెమసందెశం పాటె బంధం
గాలి సైతం పాటకు మురిసి కురిసెను జల్లుగమేఘం
శ్రికృఇషునుడి మనసె దొచెను మీర తీయని గానం
ఆవెశం నిప్పై రగిలె నా పాటె నా గాండివం
జగమంతో దాస్యం చెసే అధ్బుతమె నా సంగీతం
నమ్మకమె ఆయుధం బ్రతుకులొ పొరులొ


*********  **********   ***********


చిత్రం: నవ వసంతం (2007)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఎస్.ఏ.రాజ్ కుమార్, ఏ. శ్రీనివాస్
గానం: ఉదిత్ నారాయణ్ , రీటా

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

అల్లరి వయసుల్లొ ఆనందం చూశాను
చూశాను చూశాను ఆది నాలో దాచాను
వేల కోటీ తారాల్లోనా జాబిళమ్మా నువ్వే కదా
వంద కోటీ అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా

నీతో పాటూ ఉంటానంటూ కోరిన మనసును చూశానూ
నీ తోడుగా ఉండాలంటూ వెళ్ళిన నీడను చూశాను
మూడో మనిషే లేని ఓ సుందర లోకం చూశా
నువ్వు నేనే కాదు నీ ప్రేమను కూడా చూశా
నువు నా లోనే సగమైతే నన్నే కొత్తగ చూశాను

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

సీతా కోక సిగ్గుల్లోనా ఎన్నెన్నో మెరుపులు చూశాను
వీచే గాలీ పరుగుల్లోనా ఏవేవో మలుపులు చూశాను
ఆశల జలపాతంలో అరవిరిసిన అందం చూశా
శ్వాసల సంగీతం లో వినిపించే గానం చూశా
జడి వానలలొ జల్లులలో చినుకె నువ్వానీ చూశాను

చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను





Palli Balakrishna Tuesday, August 1, 2017



చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: జూనియర్ ఎన్ టీ ఆర్ , ప్రియమణి, మమతా మోహన్ దాస్
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత: ఊర్మిళ గుణ్ణం, పి. చెర్రీ
విడుదల తేది: 15.08.2007



Songs List:



నువ్వు ముట్టుకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రంజిత్, ప్రణవి

నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటా
నువు పట్టుకుంటే నే చుట్టుకుంటా
నువు మర్చిపోతే నే సచ్చిపోతా…
నువు గిచ్చుకుంటే నే విచ్చుకుంటా
నువు పర్చుకుంటే వెచ్చ వెచ్చగుంటా
నువు మెత్తగుంటే మెత్తమెత్తగుంటా
ఓల ఓలాల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓలాల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల…
ఓల ఓలాల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి

చెప్పకుండా చెయ్యి లాగితే చెంపమీద చెంప కోరతా
అప్పనంగా అందమడిగితే అప్పడంగా నేను మారతా
తళుకుమంటే తుల్లిపడ్డ కూన కలుక్కుమంది కుర్ర గుండెలోనా
కదుపుతుంటే కంటి సైగతోన కుదుపు ఆగేనా
ఓల ఓల ఓలా, ఓల ఓల, ఓల ఓలా… 
ఓల ఓలాల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓల ఓల ఓలాల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి

సున్నిపిండి ముందరుంచితే స్నానం వేళ నీకు అందుతా
సున్నితంగా నన్ను తాకితే సుబ్బరంగా నీకు చెందుతా
చిటుక్కుమంటే చింగిలాల జాణ లటుక్కుమంటూ లొంగదీసుకోనా
వణుక్కుతుంటే ఇంత వేడిలోన దినకు దింతానా
ఓల ఓల ఓల, ఓల ఓల, ఓల ఓలా…
ఓల ఓలాల ఓల ఓలా ఓసారి ఒప్పుకుంటే పోలా
ఓల ఓలాల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి నాగమల్లి నాగమల్లి





రబ్బరు గాజులు పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: దలర్ మెహంది, ప్రణవి

రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని  హత్తరి  నీ దరి కొచ్చానే
నువ్వంటే‍ పడి పడి, నువ్వంటే‍ పడి పడి
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే

చల్లని గాలిని  చల్లని గాలిని  చెప్పిన చోటికి తెచ్చేయ్ రో
వెన్నెల కుండలు వెన్నెల కుండలు వెచ్చని వేలకి పట్టెయ్ రో
తట్టెలు నిండుగ బుట్టలు నిండుగ మొగ్గలు పట్టుకు వచ్చేయ్ రో

నువ్వంటే‍ పడి పడి, నువ్వంటే‍ పడి పడి
నువ్వంటే‍ పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో 
నువ్వంటే‍ పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో  

రయ్  రయ్... రయ్  రయ్...
రాజూగారి ఏనుగు మీద రయ్  రయ్ రప్పారై 
రయ్  రయ్ రప్పారై అని ఊరేగిస్తానే పిల్లా
రాణీగారీ  పానుపుమీద దాయి దాయి అమ్మా దాయి
దాయి దాయి అమ్మా దాయి అని బజ్జోబెడతానే పిల్లా
అట్టాగంటే ఐసౌతానా ఇట్టాగొస్తే క్లోజౌతానా
అంతందంగా అలుసవుతానా
బీ హానీ నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి
జుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే

నువ్వంటే‍ పడి పడి, నువ్వంటే‍ పడి పడి 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే‍ పడి పడి వస్తానే 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే‍ పడి పడి వస్తానే  

రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే

రోజు రోజు తోటకు వెళ్లి డీ డీ డిక్కుమ్ డీ
డీ డీ డిక్కుమ్ డీ అని లవ్వాడేద్దామే పిల్లా
డీ డీ డిక్కుమ్ డీ, డీ డీ డిక్కుమ్ డీ
ఏదోరోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ
పీ పీ డుండుం అని పెళ్ళాడేద్దామే పిల్లా
అట్టా చెబితే సెట్టైపోతా పుస్తేకడితే జట్టైపోతా ఆకులోన వక్కైపోతా
దా అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా
ధూమ్ అని ధామ్ అని జబ్బలు జబ్బలు తగిలించేస్తాలే

నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే‍ పడి పడి వస్తానే 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే‍ పడి పడి వస్తానే

రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు... తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు... తెచ్చానే
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని  హత్తరి  నీ దరి కొచ్చానే
నువ్వంటే‍ పడి పడి, నువ్వంటే‍ పడి పడి
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే 
నువ్వంటే‍ పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే



ఓలమ్మి తిక్కరేగిందా పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: ఎన్.టి.ఆర్ ,   మమత మోహన్ దాస్

అబ్బయా...ఆఁ 
అబ్బయా... ఏంటే
లవ్వలక... ఆఁ
బిలపిచ్చిపిచ్చి... పిచ్చా
ఊ ఊ కిక్కిరి... ఓయ్
కులుకులో పబ్బలబ... ఏంభాషిది
జింజికా... ఏమయింది నీకు
హూ ఊ... ఏంకావాలెహే

కస్స చెలక చిక చెపక్కు చికిచా 
పబ్బాలబ దబ దబ లబాంగ్ జుంబా
చెమ్చాక లంసప రస రస విపుట
భంచిక తుక తుమ వలక్కి దిమ్సా
చికిబికి చిం హోయ్ బికి చిం హోయ్ 
బికి చిం ఎహేహే చిం

ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా

ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టుకోమందా
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

చరణం: 1
చువ్వ నడుమే దువ్వుతుంటే జివ్వుమంటోందా
చెయ్యివేస్తే పోటుదనమే పొంగి పోతుందా
ఎగ దోసయ్యావే దొంగా
ఎదురొచ్చే సత్తా ఉందా
పొగరాపే ఊపే ఉందా
బరిలోకీ దూకేదుందా
కొండనైనా పిండిచేసే కోడె గాడి చేత చిక్కి 
గుమ్మ పాప గుండె జారిందా...

ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

చరణం: 2
అధి అబ్బో యమ యమయమ
యమ యమయమ ఏసేయ్...

ప్రభూ లైటు లైటు అబ్బా దీపసికండి బాబు

చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా
ధగధగధగధగ దీపముంటే రంజుగుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకులన్నీ నీకు చూపాద్దా
మరిమరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా అహా ఓహొ

అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాం దా
పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాం దా
కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోల చేస్తే హాయిగా ఉందా...

ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా 
ఓలమ్మి తిక్కరేగిందా
ఓరబ్బి తిక్కరేగిందా 
ఓలమ్మి తిక్కరేగిందా





నాచోరే నాచోరే ఓ ఓ పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: దీపు, గంగా

నాచోరే నాచోరే ఓ ఓ 
నాచోరే నాచోరే ఓ ఓ 

ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ కస కసయత పోసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ

నాచోరే నాచోరే ఓ ఓ 
ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఓ ఓ
ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ దొంగ

వన్నా బేబీ నౌ

పెదవి కరిగించి మధువు కురిపించే
మధిని మరిపించి నిదుర తరలించే

ఏక్ పల్ ఎగబాకి వస్తా
ఏక్ పల్ సెగ బాకీలిస్తా
ఏక్ పల్ సుఖ సోఖాలే పెస్తా
ఏక్ పల్ నిను మాటాడిస్తా
ఏక్ పల్ మోహమాటోడిస్తా
ఏక్ పల్ సిరి మూటలు విప్పిస్తా ద ద దా...

నాచోరే నాచోరే ఓ ఓ 
ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ దొంగ

రసిక గుణ రామా సరసకుల సోమా 
వలపు రణ ధీమా మొదలు పెడదామా

దిల్బరా పొరపాటవుతున్న
దిల్బరా పరిపాటవుతున్న 
దిల్బరా చెలి పాటలు ఆగేనా
దిల్బరా తడబాటవుతున్న
దిల్బరా తడి బాటవుతున్న
దిల్బరా విడిపోడం జరిగేనా ద ద దా...

నాచోరే నాచోరే ఓ ఓ 
ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ కస కసయత పోసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ

నాచోరే నాచోరే ఓ ఓ 
ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఓ ఓ
ఎవడీ దొర దొంగ  దర్జాగా దూరిన దొంగ దొంగ




నూనూగు మీసాలోడు పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ఎమ్. ఎమ్. కీరవాణి  , సునీత

డ డడడి డిడిడు డుడుడు
డ డడడి డిడిడు
ఊఁ... ఊఁ...
ఊఁ... నూనూగు మీసాలోడు
ఊఁ... నీ ఈడు జోడైనోడు
ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు
ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు
ఊఁ... కండల్లో పస ఉన్నోడు
ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు

నన్ను ఎంచేస్తాడో ఏమో ఈనాడు
జొన్న పొత్తులతోటి గూడె కట్టి
ఏంచేస్తాడు… ఇచ్చేస్తాడు…

ఊఁ... నూనూగు మీసాలోడు
ఊఁ... నీ ఈడు జోడైనోడు
ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు

చరణం: 1
చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే 
చెంతకొచ్చి ఆరా తీస్తాడు
బిందె నిండి పోయిందంటె బరువు మొయ్యలేవంటు 
సాయంచేస్తె తప్పేటంటాడు
సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి 
నడుముకి పైపైనే ఆనిస్తాడు
తస్సదియ్య అట్టా పట్టలేదే పిట్టా ఇకపై ఆ పనినే కానిస్తాడు
పెద్ద దొంగోడమ్మ బాబోయ్ బుల్లోడు
ఇంత బంగారమే ముందే ఉంటె ఏంచెస్తాడు... దోచేస్తాడు…

ఆఁ... నూనూగు మీసాలోడు
ఆఁ... నీ ఈడు జోడైనోడు
ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు
ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు
ఊఁ... కండల్లో పస ఉన్నోడు
ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు

ఇంక ఏంచేస్తాడో మళ్ళీ ఈనాడు
లంకె బిందెల్లోన పాలే పోసి 
అబ్బ ఏంచేస్తాడో ...ఆ తోడేస్తాడు

చరణం: 2
ఓ రోజు… రేణిగుంట సినిమ హాల్లో రెండో ఆట కెళ్ళాక
సీటు ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చిన్నోడు
పాపమేమి చేసాడండి పల్లెటూరి చిన్నోడు పాపుకారన్ పొట్లం ఇచ్చాడు
ఇచ్చినట్టే ఇచ్చి మీద మీద పోసి అరరె అరరె అని తడిమేశాడు
అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
ఎంత నాటోడైన వీడే నావోడు
ఇంత బంగారమే సొంతం ఐతే ఏంచేస్తాడు… దాచేస్తాడు…

ఊఁ... నూనూగు మీసాలోడు
ఊఁ... నీ ఈడు జోడైనోడు
ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు
ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు
ఊఁ... కండల్లో పస ఉన్నోడు
ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు

వీడు ఏంచెస్తాడో తెలుసా ఈనాడు
కోడి కూరే చేసేకాలం నేడే వచ్చిందంటు కూర్చుంటాడు… వంటింట్లోనే తిష్టేస్తాడు…




యంగ్ యమా యంగ్ యమా పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యమ్. యమ్. కీరవాణి,  మనో (నాగూర్ బాబు), ప్రణవి,  శంకర్ మహాదేవన్ 

పల్లవి:
రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
కదలిరా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలా
ఒదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా

షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకుదక్కాలా
అప్సర బాల నా స్టేప్సేనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునోయ్ 
అన్నదే తారక మంత్రం

యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో

షేక్ షకాలా షేక్‌ షకాలా షేపులన్ని నాకుదక్కాలా
అప్సర బాల నా స్టేప్సేనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా
యాయాయా యమా యాయాయా యమ యాయాయా యమా యాయాయా
యాయాయా యమా యాయాయా యమ
యాయాయా యమా యాయాయా

చరణం: 1
కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
ఎక్కి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా...
వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేశావంటే
పోయే దేది లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం

కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో

షేక్ షకాలా షేక్‌ షకాలా షేపులన్ని నాకుదక్కాలా
అప్సర బాల నా స్టేప్సేనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా

చరణం: 2
ఆనాటి రాముడు అహ అహా అహా ఆహా
ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో
నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు

ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా
సంఘమించరా పురోగమించరా నువధిగమించరా
రింగు రోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా...
ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపట్టి కధంతొక్కి
ఆటాపాటా కానిచ్చేయాలన్నదే తీరిక మంత్రం

దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ పోటుగ కోటనే దున్నేసుకో
దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ పోటుగ కోటనే దున్నేసుకో

యుంగ్ యమా యుంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకి ఎరవేసుకో
 




శ్రీకరాకారుండ పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మనో

శ్రీకరాకారుండ బీఖరాకారుండ 
నరకాది నాదుండ సురవరుండ
భువన భౌతమ్ములన్ క్రోదండ సూరుండ 
మార్తాండ తనుజుండ మారకృండ ఆయ్...
చండ ప్రచండ పాషండ ప్రాకాయుండ 
కాల పాశధరుండ కర్కసుండ
జై జై యమాగ్రని 
జై యమాగ్రని యని వతకోటి పొగడు సమవర్ధనుండ అవ్ హా...
అట్టి నను గూర్చి రవ్వంత అధరకుండ
మంచి మర్యాదలెవ్వి పాట్టించ కుండ
యముడు రానప్పుడీసబ అపకుండ
చేయుదురే మీరే ఎవరు మీరు
చేయుదురే మీరే నను లెక్కచేయకుండా...




చల చల్లగా గాలి పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఎమ్. ఎమ్. కీరవాణి, సంగీత

చల చల్లగా గాలి 
మెల మెల్లగా తేలి
మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
ఆహా... ఓహో... ఓ ఓ ఓ ఓ ఓ ఆహా ఓ ఓ

కసి ఉసిగొలిపే గుస గుసలో రసికత పండాలి
అవసర సుమశర స్వర్గములే చూపించాలి
మ్మ్... మగసిరి గడసరి డోలికలో మన జత ఊగాలి
యమ సుర వరునికి అమృతమే అందించాలి

లాహిరి ఖేలి ఈ జిలిబిలి 
నావ సరళి నీవు కదలి
చలి గిలి అళి

చల చల్లగా గాలి ఉఁ
మెల మెల్లగా తేలి
మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి

ఆహా... ఓహో... ఓ ఓ ఓ ఓ ఓ ఆహా ఓ ఓ





బంభరాల చుంబనాల రంభ పాట సాహిత్యం

 
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మనో, ప్రణవి

బంభరాల చుంబనాల రంభ
పనస తొణల వయసు లలన ఊర్వశి
జలక జలక ఎదలోతులో మునక మేనక
పూట పూట మీతో ఆటా పాటా

సనిపమ రి రి మ ప
ఈ సార్వభౌమునికే మీ ఓటు
యమ సార్వభౌమునికే మన ఓటు

సరి సరి సరి మపని మపని సస ససస సరి రిస రిప మప 
సస రిరి రిరి సస పమ పని సరిపమ  ఓటు 
నిపమ ఓటు తమ ఓటు ఓటు...

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default