Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

President Peramma (1979)




చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, దాసం గోపాలకృష్ణ 
గానం: పి.సుశీల,యస్.పి.బాలు
నటీనటులు: కవిత, నూతన్ ప్రసాద్, రాజబాబు, రమాప్రభ 
కథ, మాటలు: దాసం గోపాలకృష్ణ 
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి.వి.యస్.రాజు
విడుదల తేది: 12.04.1979



Songs List:



తెల్లారి కలగన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తెల్లారి కలగన్న - పెళ్ళాడినట్టు
గదిలోకి రాగానే - గడియేసినట్లు
గడియ గడియకీ నిన్ను ముద్దాడినట్టు
పెళ్లాడినట్టు గడియేసినట్టు ముద్దాడినట్టు
బంజారా బంజారా బంజారా బంజారా

తెల్లారి కలగన్నా - నీ తెలివి తెల్లారినట్లు
గడిలోకి రాగానే - నే గరిటె తిరిగేసినటు
తిరగేసి మరగేసి నీ దుమ్ము దులిపేసినటు
తెల్లారినట్టు తిరగేసినట్టు దులిపేసినట్లు
బంజారా బంజారా బంజారా బంజారా

నీ పొంగు మడతెట్టే కడకొంగు ముడిబెట్టి
సరిగంగ తానాలు నేనాడినట్టు
మనసుల్లో మడిగట్టి - వయస్సుల్లో జతకట్టి
ముడుపుల్నీ, మొక్కుల్నీ చెల్లించినట్టు

ఓం తడియారకుండా మడికట్టుకోనిమ్యహం
మడిఒట్టతో నే ముడి పెట్టుకోనిమ్యహం
ముడివూడకుండా మ్యాహం
గుడిమెట్ల క్రింద మ్యహం
ఇద్దరూ మ్యాహం
ముద్దుగా ముద్దు ముద్దుగా
మూడు నిదర్లు చేస్తే - మ్యహం - మ్యహం - మ్యహం
బంజారా - బంజారా బంజారా

నునులేత నీ బుగ్గ - కొనగోట నే నొక్క
సీకట్లో నెలవంక - సిగురించినట్టు
ముప్పేట ముడికాస్తా - మూడేళ్ళ కొడుకయ్యి
మన ముద్దుకే హద్దు పెట్టేసినట్టు
చెల్లాయి కావాలి చెల్లాయి - ఇవ్వనంటే నీకు జిల్లాయి
చెల్లాయి - జిల్లాయి

సేమంతి పువ్వంటి సెల్లెల్ని ఇద్దామా
తామర పువ్వంటి తమ్ముణ్ణి ఇద్దామా
బంజారా బంజారా బంజారా

గదిలోకి రాగానే - నే గరిటె తిరగేసినట్టు
గడియ గడియకే నిన్ను ముద్దాడినట్టు
పెళ్లాడినట్టు - గడియేసినట్టు - ముద్దాడిననట్టు - ముద్దాడినట్టు
బంజారా - బంజారా - బంజారా
బంజారా బంజారా
బంజారా - బంజారా




ఏమంత తొందర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఏమంత తొందర
కాసింత ఆగరా
కడసందె కాలేదు కాలేదురా
పడకిల్లు సరిచేసి రాలేదురా
పెదవికి గిలిగింత కలగనీ -
పయ్యెదకున్న ఓపిక తొలగనీ
మరులేమొ మరికొంత పొంగనీ
మనవేమొ మరునికి లొంగనీ
అందాకా అందాకా ఆగరా...

పరువపు పన్నీరు చిలకనీ
సరసపు సిరిగంధ మలదనీ
వలవుల దండ వేయనీ
వలపులకై దండవేయనీ
తలపుల తాంబూల మీయనీ
అందాకా - ఆందాకా ఆగరా



పంచమినాడే పెళ్ళంట పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, నూతన్ ప్రసాద్

పంచమినాడే పెళ్ళంట పంచలచాపు నేయించు
దశమీ రేతిరి... అంట
ఏటంట ?
తెలవదు తెలవదు నాకంట
తెల్లచీర తెప్పించు-మల్లెపూలు రప్పించు
అబ్బా. ఇయ్యాల నన్నిట్టా పట్టుకున్నావేంటే?
పట్టుకున్నవాడే - పట్టుగొమ్మంట
పట్టుగొమ్మ నీడే పడకటిల్లంట
పడకటింటిలోనే పట్టు తేనంట

పట్టుతేనె విందూ - పగలూ రేయంట
పగలూ రేయీ ఒకటే... ఆంట
ఏటంట...?
తెలవదు తెలవదు నాకంట
తెల్లాచీరా తెప్పించు మల్లెపూలు రప్పించు
ఏయ్ ఒక్కటి కొంటానంటేనా...?
కొట్టేచెయ్యీ కోరే మనసూ ఒకటేలెమ్మంట
ఒకటీ ఒకటి కలిసే ముచ్చట మూడౌతుందంట
మూడు రాత్రుల పున్నమి
ఏడు జన్మల పున్నెమంట
పున్నెమెంత సేసినా ఈ పులకరింత దొరకదంట 
దొరికిందంతా ఇపుడే... అంట
ఏటంట...?

తెలవదు తెలవదు నాకంట
తెల్లాచీరా తెప్పించు మల్లెపూలూ రప్పించు




అందరాని చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

అంధేరేమె తూ దియాహై మేరే సనమ్మ
మిల్కర్ రహేంగే పియా హర్ జనమ్

అందరాని చందమామ నాకెందుకూ
అదంలాంటి నా మామ చాలు నాకూ
అందరాని చందమామ నీకెందుకూ...?
నే అద్దంలా వున్నాను నువ్వు సూసేందుకు
ఏటిలోని నురగల్లాగ - పైటకొంగు పొంగుతుంటే
లేతగాలి ఇసురుల్లో పూత వయసు వూగుతుంటే
ఇసకా తిన్నెలు గుసగుసమంటే మసకా కోరిక
బుసకొడుతుంటే
సూడాలి అప్పుడు - ఈ జోడుగుండె చప్పుడు

సూడాలి అప్పుడు— ఈ జోడుగుండెల చప్పుడు ॥ఆంధేరేమె॥

నీరెండి సీరకట్టీ - నీలినీడ రైక తొడిగీ
పొదుపొడుపు తిలకం దిద్ది 
పొన్నపూల నవ్వులు పొదిగి

వనలచ్చిమిలా నువ్వొస్తుంటే
ఊరూ నాడూ పడిచస్తుంటే 
సూడాలి అప్పుడు
నన్నేలినోడి దూకుడు....




కూత్ కూత్ కూత్ కూత్ కుక్కపిల్లలు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి.బాలు

కూత్ కూత్ కూత్ కూత్
కుక్కపిల్లలు
రొట్టెముక్క చూపి సే
లొట్టలేసాయి
కావు కావు కావు కావు కాకి మూకలు
చుట్టముక్క చూపిసే చుట్టు చేరాయి
కుక్కపిల్లలూ - కాకి మూకలూ
జంతర మంతర ధాం లాంతర లాంతర లాంతర తోం తనంతర ధాం

ఎత్తమంటే సెయ్యి ఎత్తేవోళ్లు ఏ ఎండకాగొడుగు పట్టేవోళ్లు 
ఎంగిలి మెతుకులు కతికేవోళ్లు ఏబరాసి బతుకులు బతికేవోళ్ళు
కలిసికట్టు లేనోళ్ళు నాయాళ్ళు - గొలుసుకట్టు మతలబోళ్ళు నాయాళ్ళు
ఈళ్ళంతా - మనవూరు ఏలేవాళ్ళు
కుక్కపిల్లలూ - కాకిమూకలూ
జంతర మంతర ధాం తనంతర - లాంతర లాంతరం తనంతర ధాం

నెగ్గిందాక మాట ఇచ్చేవోళ్ళు - నెగ్గినాక ప్లేటు మార్చేవోళ్ళు
పొట్టలు కొట్టే గొటంగాళ్ళు పొదుగులు కోసే కసాయివోళ్ళ
గోడమీద పిడకలు నాయాళ్లు గోతికాడ నక్కలు నాయాళ్ళు
ఈళ్ళంత మన ఊరు ఏలేవోళ్లు - కుక్కపిల్లలూ - కాకిమూకలు
జంతర మంతర ధాం తనంతర - లాంతర లాంతరం తనంతర ధాం 



పానకాలస్వామిని నేను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

శ్రీశైల మల్లమ్మ - అలివేలు మంగమ్మ
బెజవాడ కనకదురగమ్మో
పానకాల స్వామిని నేను పూవకం మీదున్నాను
శ్రీశైల మల్లన్న శివమెత్తి ఆడంగ -
సింహాద్రి అప్పన్న సింగమై దూకంగ
పోతరాజో పోలేరమ్మా

పోలేరమ్మో దాటి పోలేరమ్మా
బండరాయి పగలగొట్టు - బావురు కప్పను పట్టు
ఆశ్శరభ శరథ అల్లల్ల భీర

నాపరాయీ పగలగొట్టు - నల్లనీటి ఊటబట్టు
ఆశ్శరభ శరభ అల్లల్ల భీర
కంచె చేను మేస్తుంటే కంచి కామాక్షమ్మ
బురిడీలు కొట్టకమ్మో - మరిడీ మాలచ్చమ్మా
పోతరాజో పోలేరమ్మా 
పోలేరమ్మో దాటి పోలేరమ్మా
తలపైన తట్టుంది శరభా - తట్టలో బుట్టుంది శరభా
బుట్టలో గుట్టుంది పట్టుకో శరభా
అశ్శరభ శరభ అల్లల్ల భీర

తట్టాబుట్టా సర్ధి శరభా - తైతక్కలాడుకుంటూ శరభా
తలవాకిటున్నాది తందనాల బొమ్మ
అశ్శరభ శరభ అల్లల్ల భీర

పాపనాశనం కోసం తానమాడ బోతేను
వంశనాశనం కోసం మొసలెత్తు కెళ్ళింది
కటకటాలు తప్పవమ్మో కోటగుమ్మం రాయడమ్మో
పోతరాజో పోలేరమ్మో -
పోలేరమ్మో దాటి పోలేరమ్మో


No comments

Most Recent

Default