Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: తిరగబడర సామి (2024)
సంగీతం: జెబి (JB)
నటీనటులు: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా
దర్శకత్వం: ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌
విడుదల తేది: 02.08.2024



Songs List:



చాలా బాగుందే పాట సాహిత్యం

 
చిత్రం: తిరగబడరా సామి (2024)
సంగీతం: JB (జీవన్ బాబు )
సాహిత్యం: శ్రీమణి 
గానం: లిప్సికా చైతు సత్సంగి 

చాలా బాగుందే, చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే
చాలా బాగుందే చాలా బాగుందే
మన తనువులు రెండు
మెలికల తీగవుతుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే ఈ సంతోషం
చాలా బాగుందే

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
మార్చేసింది మన జంటే

చాలా బాగుందే, చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే
ఈ సంతోషం చాలా బాగుందే

రోజూ పొద్దున్నే నీ ముద్దుల్తో
కాఫీ ఇస్తుంటే బాగుందే
లోకం గెలిచేటి ఓ ధైర్యంలా
నువ్వే ఎదురొస్తే బాగుందే

ఎన్ని పయనాలు నీతో చేసినా
చిన్న అలుపైన దరి చేరదే
ఎన్ని బంధాలు నేను చూసినా
ఈ బంధం అనుబంధం
అదిరిందే ఆనందంలా

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
మార్చేసింది మనలోనే

నీతో ఏకాంతం చాలంటానే
లోకం ఎటుపోనీ పర్లేదే
నీతో ప్రతిరోజూ ఏ కలగన్నా
నిజమైపోతుంటే ఏం చేయనే

ఎన్ని హృదయాలు నేను పొందినా
నీ ప్రేమలకు సరిపోవులే
ఎన్ని కాలాలు నేను దాటినా
నిమిషంలా ఉంటుందే
నా సగమై నువు నా జగమవుతుంటే

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
దాచేసింది మనలోనే

చాలా బాగుందే
చాలా బాగుందే
మన ఊపిరి రెండు
ఒకటై జీవిస్తుంటే
చాలా బాగుందే
చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే
ఈ సంతోషం చాలా బాగుందే

No comments

Most Recent

Default