Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Spy (2023)




చిత్రం: Spy (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
నటీనటులు: నిఖిల్ , ఐశ్వర్య మీనన్ , సాన్య ఠాకూర్
దర్శకత్వం: గర్రి .BH
నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి 
విడుదల తేది: 29.06.2023



Songs List:



జూము జూమురే పాట సాహిత్యం

 
చిత్రం: Spy (2023)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్ర

మొదటిసారిగా చూపు తగిలే
గుండెల్లో మోగిందే నీ తొలి కబురే
మనసు వింతగా మాట వినదే
గల్లంతై పోయిందే ఊహలు మొదలే

సరిహద్ధుల్లో తను నిలబడననదే
కంగారుగా మది అటూ ఇటూ తిరిగే
ఈ యుద్ధంలో గెలుపెవరిది అనరే
సంకెళ్లు తీసిన ప్రేమదే కదే

తూటలే పేలుస్తుంటే
నీ చిరు నగవే
అందాల గాయం తగిలే నా ఎదకే
మౌనాల మరణమిదే

జూము జూమురే
గుండెల్లోన యుద్ధాలే
సిద్ధంగా ఉంచా నీకే ఏడు జన్మలే
జూము జూమురే
అదృష్టం నా సొంతూరే
నీ పేరు చివరన నేను చేరితే

నా కళ్ళలోన తదేకంగా
చూసే పనే మానుకోవా ఓ సుందరా
నీ ఊహలోన ఏమి జరుగుతోందో
కనపడుతోంది ఏం తొందర

నను కలుసుకున్న
కథ మలుపు నీవని
తెలిసి రభస ఇదీ
ఇక నిమిషమైనా నిను
విడిచి ఉండని మనసు గొడవ ఇదే

పగటి వెన్నెల మంచు తెరలా
నా చుట్టు అల్లిందే ఊహలు మొదలే
మొదటి శ్వాసలా గాలి అలల
నన్నొచ్చి తాకింది నీ తొలి పిలుపే

విధ్వంసంలో ఒక తెలియని హాయి
నీవల్లే చేరెను నీకిది తెలుసా
పూ వర్షంలా నను తడిమిన మాయే
నీ నవ్వే అన్నది నమ్ముతావుగా

అందాల విస్ఫోటనంలా
నువ్వు నన్ను దొలిచే
కల్లోలం సృష్టించావుగా ఓ మగువా
మౌనాల మరణమిదే

జూము జూమురే
నీకోసం నే తయ్యారే
సిద్ధంగా ఉంచా నీకే ఏడు జన్మలే
జూము జూమురే
అదృష్టం నా సొంతూరే
నీ పేరు చివరన నేను చేరితే



ఆజాద్ హింద్ ఫౌజ్ పాట సాహిత్యం

 
చిత్రం: Spy (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: కాల భైరవ 

నెత్తురు చిందిన భూమిదీ
మళ్ళీ పిలిచెను రమ్మని
స్వేచ్చకు మూలం రణమనీ

తుమ్ ముఝే ఖూన్ దో
చావుకే ఉనికే లేదని
తెలిపిన ప్రాణం విలువని
స్మరించుకోరా తెగువనీ

తుమ్ ముఝే ఖూన్ దో
వేసే నీ ప్రతి అడుగులో
నిన్నటి యోధుల గాధలు
రక్తం చిందిన నేలపై
నెత్తుటి తిలకమా, హా

దాచిన చరితకు ఋజువుగా
సాక్ష్యం నువ్వై సాగిపో
దేశంకే ప్రతిరూపమా
ఆజాద్ హింద్ ఫౌజ్

తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా (4)

యుద్ధంలో శాంతిని
స్థాపించడమే పోరాటం
అంతటి ఈ శ్వేచ్చని
తరములకందని

రక్షణలో శిక్షణ
నువ్వంటూ బ్రతకాలి
ఆయుషే ఆయుధం నేటికీ

ఒక్కటే ఆశయం
దేశమన్నదే మా ఆవేశం
వెలగరా గెలవరా
నీది నాది జెండా పొగరే

భగవాన్ జీ మన బోస్ రా
జండా పొగరే చూడరా
భగవాన్ జీ మన బోస్ రా
భరతమే అఖండంరా

తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా (4)

తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
తుమ్ ముజ్హే ఖూన్ దో




సదా మదే పాట సాహిత్యం

 
చిత్రం: Spy (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: VNV రమేష్ కుమార్ 
గానం: రవిప్రకాష్ చోడిమల్ల

సదా మదే




స్పై స్పై పాట సాహిత్యం

 
చిత్రం: Spy (2023)
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
సాహిత్యం: రోల్ రైడ
గానం: రోల్ రైడ , ML గాయత్రి

స్పై స్పై 

No comments

Most Recent

Default