Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Hi Nanna (2023)




చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
నటీనటులు: నాని, మృణాల్  ఠాకూర్
దర్శకత్వం: సౌరవ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల 
విడుదల తేది: 21.12.2023



Songs List:



గాజు బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హేషం అబ్దుల్ వహేబ్

ఇటురావే నా గాజు బొమ్మా
నేనే నాన్న అమ్మా
ఎదనీకు ఉయ్యాల కొమ్మా 
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా 
వాలిపో... ఈ గుండెపై...నే...
ఆడుకో... ఈ గూటిలో...నే...
దూరం పోబోకు మా

చిన్ని చిన్ని పాదాలని 
నేలై నే మోయనా 
చిందే క్షణంలో నువు కింద పడినా 
ఉంటావు నా నీడన 
నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా 
ఏ మాట నీ నోట మొగించినా 
వెనువెంటే వింటానే 
రానా నిమిషంలోన 
నే నన్నే వదిలేసైనా 

తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి 
కాపై నేనుండనా 
ఉచ్వాస నైన నిశ్వాస నైన 
మేలెంచి పంపించనా 
ఏ కాంతులైన అవి నన్ను దాటాకనే 
ఆ రాజు చేరాలి నీ చూపునే
నీ రెప్పై ఉంటానే పాపా కంటి పాపా 
నా పాపా కంటి పాపా 

ఇటురావే నా గాజు బొమ్మా 
నేనే నాన్న అమ్మా
ఎదనీకు ఉయ్యాల కొమ్మా 
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా 
వాలిపో... ఈ గుండెపై...నే...
ఆడుకో... ఈ గూటిలో...నే...
దూరం పోబోకు మా



సమయమా..!! పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: అనురాగ్ కులకర్ణి , సితార కృష్ణ కుమార్ 

నీ సా సా గ స, నీ సా సా గ స
నీ సా సా గ స నీ సా మ గ స
నీ సా సా గ స నీ సా సా గ స
నీ సా సా గ స నీ సా మా గ స

సమయమా..!!
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా, ఒట్టుగా
కనులకే..!!
తన రూపాన్నందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా…

సరె సరె తొరపడకో
తదుపరి కథ ఎటుకో
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకో

సమయమా..!!
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా, ఒట్టుగా
కనులకే..!!
తన రూపాన్నందిచావే గుట్టుగా

హో తను ఎవరే..?
నడిచే తారా, తళుకుల ధారా
తను చూస్తుంటే, రాదే నిద్దుర
పలికే ఏరా… కునుకే ఔరా
అలలై పొంగే అందం
అది తన పేరా..!

ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం
చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం
బంగారు వానల్లో నిండా ముంచే కాలం
చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం

భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం
చూపిస్తుందే తనలో ఇంకో కోణం
చంగావి చెంపల్లో చెంగుమంటు మౌనం
చూస్తూ చూస్తూ తీస్తువుందే ప్రాణం

తను చేరిన ప్రతి చోటిలా
చాలా చిత్రంగున్నదే
తనతో ఇలా ప్రతి జ్ఞాపకం
ఛాయా చిత్రం అయినదే

సరె సరె తొరపడకో
తదుపరి కథ ఎటుకో ఓ ఓ
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకో

సమయమా..!!
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా, ఒట్టుగా
కనులకే..!!
తన రూపాన్నందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా…
సమయమా..!!!




అసలిలా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరామ్  
గానం: శక్తిశ్రీ గోపాలన్, అనురాగ్ కులకర్ణి 

అసలిలా




అమ్మాడి పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ 

హ హ హా ఆ ఆ హ హ హా ఆ ఆ
ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటు ఉంటు
రోజంత నన్నొదలడుగా

హే ముద్దు ముద్దు
ముద్దంటూనే ముద్దొస్తాడే హే హా
కాలే నేలే తాకొద్ధంటు
ముద్దొస్తాడే హే హా

ఉప్పు మూట ఎత్తేస్తూనే
ముద్దొస్తాడే
కోపం లోను ముద్దొస్తాడే

నీ ఒళ్ళో పవలిస్తుంటే
చేతుల్తో దువ్వేస్తుంటే
పిల్లోన్నే అయిపోతాలే
మౌనంగా నవ్వేస్తాలే

నిజమే సగమే అడిగా లేరా
ఎదుటే జగమే నిలిపావా

కన్నీరే లేని కళ్ళే
నీవైతే అంతే చాలే
చూస్తుంటే నీ ఆ నవ్వే
నా కళ్ళే చెమ్మగిల్లే

ఒదిగే భుజమే అడిగా లేరా
గగనం పరిచే నడిపావా

ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటు ఉంటు
రోజంత నన్నొదలడుగా

హే ముద్దు ముద్దు
ముద్దంటూనే ముద్దొస్తాడే హే హా
కాలే నేలే తాకొద్ధంటు
ముద్దొస్తాడే హే హా

ఉప్పు మూట ఎత్తేస్తూనే
ముద్దొస్తాడే
కోపం లోను ముద్దొస్తాడే




ఎన్నో ఎన్నో పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: భావన ఇస్వి

ఎన్నో ఎన్నో 



అడిగా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కార్తీక్ 

అడిగా




ఇదే ఇదే ఇదే తొలిసారిలా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: హేషం అబ్దుల్ వహేబ్

అలా ఎగసే అలలా
పడే కురులతో పడేసినావా
అవే చిలిపి కనులా
అదే మెరుపు మరలా

ఇది కలా కదా
తిరిగిలా ఎదుట పడగా
నడిచిన నదా
కదలదే శిలే అయ్యేనా ప్రాణం

ఇదే ఇదే ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
స్వాసగా స్వాసగా

చాయే ఇసుక మెరుపా
చీరే చీకటేల ఆకాశమేగా
నిన్నే పొగిడే పుడకా
బొట్టే నిమిరే నుదురు
జరిగిన కథే

గురుతులే తిరిగి నడిచె
కమ్మేను కదే
పెగలదే మాటే
ఏంటో ఈ మౌనం

ఇదే ఇదే ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
స్వాసగా స్వాసగా




ఓడియమ్మ హీటు పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: చిన్మయి శ్రీపాద, శృతి హాసన్ , ధ్రువ విక్రమ్

పైకి తీయి లోన హాయిని
బైటవేయి లోపలోడిని
దాచుకోకు ఇంకా దేనిని
గోలే నీ పని

తొంగి చూడు కింద నింగిని
గాలికేయి కొత్త రంగుని
నిన్న నింక నేడు మింగని
దాంతో ఏం పని

ఒక షాటులో ఉత్సాహమే
ఒక షాటులో ఉల్లాసమే
ఒక షాటులో ఉక్రోషమే
ప్రతి షాటు లోపలే

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు
ఈడిఎంలో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

తాగితే మరిచిపోగలను తాగనివ్వదు
మరిచిపోతే తాగగలను మరువనివ్వదు

ఫీల్ హై ఫీల్ దిస్ హై
నాతో చెయ్ కలిపేయ్
అరె దేన్నో చూస్తావే

కాలం చల్తా హై
భేజా ఉడ్తా హై
వదిలేసెయ్ వచ్చేసెయ్
యయ్ యయ్ యా

ఒక గ్లాసులో ఆనందమే
ఒక గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే
ప్రతి గ్లాసు ఖాళీ చెయ్

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

జోరుగున్నదో జారుతున్నదో
జన్మకేమయిందో
ఊహ నిజములా
నిజము ఊహలా
తోచి తోసినాయో

జరుగుతున్నదే జరగనున్నదో
జరిగిపోయినాదో
తిరుగుతున్నదో తిప్పుతున్నదో
డే జా వు

నీ పాత్ ఓ పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంఠమే
ఈ మైకం మోక్షమే

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు





చేదు నిజం పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: గీతామాధురి, వినీత్ శ్రీనివాసన్ 

చేదు నిజం 




నీదే నీదే పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అవని మల్హర్ 

నీదే నీదే 

No comments

Most Recent

Default