Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ala Ninnu Cheri (2023)




చిత్రం: అలా నిన్ను చేరి (2023)
సంగీతం: సుభాష్ ఆనంద్ 
నటీనటులు: దినేష్ తేజ్ హెబ్బ పటేల్ , పాయల్ రాధా కృష్ణ 
దర్శకత్వం: మరేష్  శివన్ 
నిర్మాత: కొమ్మలపాటి సాయి సుధాకర్ 
విడుదల తేది: 2023



Songs List:



కొద్ది కొద్దిగా ప్రేమిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: అలా నిన్ను చేరి (2023)
సంగీతం: సుభాష్ ఆనంద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: జావేద్ ఆలీ

స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా

నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా
రేపటికంటే తక్కువగా నిను ప్రేమిస్తా
నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా
రేపటికంటే తక్కువగా నిను ప్రేమిస్తా

నిన్న నేడు రేపు నిన్ను
నిదురలోను వదలకుండా

కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా

స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా

నీ రెండు పెదవులను
నిండుగా ప్రేమిస్తా
పెదవుల్లోని చిరునవ్వులను
పిచ్చిగా ప్రేమిస్తా

నీ నీలి కన్నులను
చూపుతో ప్రేమిస్తా
కన్నులలోని కలవరమంతా
మనసుతో ప్రేమిస్తా

నిన్నే ప్రేమించడం అంటే
నిన్నే ప్రేమించడం అంటే
నను నేను ప్రేమించడమే

కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా

స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా

నీ నోటి ప్రతి మాట
మత్తుగా ప్రేమిస్తా
మాటల్లో పొరపాటు
పూర్తిగా ప్రేమిస్తా

నువ్వేసే ప్రతి అడుగు
అంతగా ప్రేమిస్తా
ఆ అడుగు నాతో వేస్తే
మరింతగా ప్రేమిస్తా

నీతో జీవించడం అంటే
నీతో జీవించడం అంటే
స్వప్నాన్ని జీవించడమే

కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా

స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స అలా నిను చేరి



అబ్బా అనిపించాడే పాట సాహిత్యం

 
చిత్రం: అలా నిన్ను చేరి (2023)
సంగీతం: సుభాష్ ఆనంద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: సింహ, ఇంద్రావతి చౌహాన్

బారుంది నాలో
బీరుంది నాలో

బారుంది నాలో
బీరుంది నాలో
రమ్ముంది, జిన్నుంది
నాలో నాలో

గ్లాసుంది నాలో
ఐసుంది నాలో
అందించే వయసుంది
నాలో నాలో

నాలోనే బేసుంది
నాలోనే బాసుంది
బద్మాషు మనసుంది
లేనిది ఏందీ




కోడి బాయే లచ్చమ్మది పాట సాహిత్యం

 
చిత్రం: అలా నిన్ను చేరి (2023)
సంగీతం: సుభాష్ ఆనంద్ 
సాహిత్యం: ట్రెడిషినల్ ఫోక్
గానం: మంగ్లీ

రేయ్ గణేష్..! మందేస్తే
మా ఊరు యాదికొస్తది
మా పాట యాదికొస్తది
మా ఆట యాదికొస్తది
మరింక లేటెందుకు షురు జేస్తా

కోడి బాయే లచ్చమ్మదీ
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ, హీ

కోడి బాయే లచ్చమ్మదీ
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ
కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ

ఎడ్లు బాయే… గొడ్లు బాయే
యలమ దొరల మంద బాయే
ఎడ్లు బాయే… గొడ్లు బాయే
యలమ దొరల మంద బాయే
గొడ్లు నేను గాయబోతే
కందిరీగ కరిసిపాయే

కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మది
కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మది

బర్లు బాయే… గొర్లు బాయే
బాటపొంటి బండి బాయే
బర్లు బాయే, గొర్లు బాయే
బాటపొంటి బండి బాయే
బండి మీద పోదమంటే
గిర్రలన్ని ఊసిపాయె

కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ
కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ

ఈతకల్లు తాటికల్లు
రెండు కలిపి గుద్ధుతాంటే
మూతి కాడ రాఖపెట్టి
గుట్ట గుట్ట గుంజుతాంటే

బొబ్బర్ల గుడాలన్ని
బగ్గ బగ్గ బుక్కుతాంటే
బొబ్బర్ల గుడాలన్ని
బగ్గ బగ్గ బుక్కుతాంటే
పాణమంత అల్కగయ్యి
తల్కాయి తిరుగుతాంటే

సోయి బాయే లచ్చమ్మదీ
ఫుల్లు సోయి బాయే లచమ్మదీ
సొలుగుడాయే లచ్చమ్మదీ
పెయ్యి సొలుగుడాయే లచ్చమ్మదీ

కోడి బాయే లచ్చమ్మదీ
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ
కోడి బాయే లచ్చమ్మదీ
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ

ఈని మీద దుమ్ము పడా
ఈని మీద దుబ్బ పడా
ఈని మీద శారడంత
దోషడంతా మన్నుబడా

దునియా నా ఎనకబడా
ఈనెనక నేనుబడా
అరె, దునియా నా ఎనకబడా
ఈనెనక నేనుబడా
దిల్లంతా ఊడిబడా
దిమాకంతా ఉలికిబడా

గడబిడాయే లచ్చమ్మదీ
గుండెల గుడగుడాయే లచ్చమ్మదీ
కిరికిరాయే లచ్చమ్మదీ
మాకి కిరికిరాయే లచ్చమ్మదీ
మాకి కిరికిరాయే లచ్చమ్మది
మాకి కిరికిరాయే లచ్చమ్మది
మాకీ– కిరికిరాయే లచ్చమ్–దీ


No comments

Most Recent

Default