Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rajakota Rahasyam (1971)




చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
నటీనటులు: N.T. రామారావు, దేవిక 
దర్శకత్వం: బి. విఠలాచార్య 
నిర్మాత: M.K. గంగరాజు 
విడుదల తేది: 12.03.1971



Songs List:



ఈ నేల బంగారు నేల పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

పల్లవి:
ఆహా హా హా హా హా ఆహా హా హా హా హా
ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను  ఉయ్యాలా
మనసూగెను ఊగెను ఉయ్యాలా
ఈ నేల బంగరు నేల

చరణం: 1
పూచే పూవులన్నీ ఏ పుణ్యమూర్తుల హృదయాలో
ఊగే తరువులన్నీ ఏ యోధులు గాచిన జండాలో
వీచే గాలీ వినిపించేది వీచే గాలీ వినిపించేది
ఏ వేణులోలుని గీతాలో

ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను ఉయ్యాలా
ఈ నేల బంగరు నేల

చరణం: 2
ఎగిసే పావురాలూ ఏ శాంతిదేవి సందేశాలో
కదలే నీ రధాలు ఏ కరుణామయుని దీవెనలో
పొంగే అలల పులకించేవి 
పొంగే అలల పులకించేవి
ఏ కవిరాజు భావనలో

ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను ఉయ్యాలా
మనసూగెను ఊగెను ఉయ్యాలా

ఆహా హా హా హా హా ఆహా హా హా హా హా
హహహహహా ఓ హె హె హె హెూ.. ఆ



కరుణించవా పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, బృందం 

పలవి : 
కరుణించవా వరుణదేవ 
నిరుపమ కరుణ సురగంగ కురిపించి 

కోరస్: కరుణించవా వరుణదేవ 

అమృతాంతరంగుడు ఆచార్యదేవుడు 
ఆరని జ్వాలల అలమటించగా 
మాతృదేవియై మము నడిపించిన 
విద్యానిలయము విలవిలలాడగ 
అంబర వీధుల దాగున్నావా 
ఆర్త నాదమే వినకున్నావా 

కోరస్ : కరుణించవా వరుణదేవ 
నిరుపమ కరుణ సురగంగ కురిపించి  
కరుణించవా వరుణ దేవ 

ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ జలదరాలు గార్జించగా
కోరస్ : ఆ ... ఆ.... 
తళతళ తళతళతళ తటిల్తతలు దీవించగా 
కోరస్ : ఆ.... ఆ... 
కుంభిని ఆనందాంబుధిలో విహరించగా 
కోరస్ : ఆ.... ఆ.... 
కుంభివృష్టి కురిపించవా 
కోరస్ : ఆ.... ఆ 
గురుదేవుని కరుణించవా 
కరుణించవా కరుణించవా 




నా వల్లో చిక్కినా పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

హ హ హ హ సుందరా 
చూడరా, నాదొరా 
రావా, ఇటురావా 
నిన్ను చేరాను, చేరిపిలిచాను 
చెంతవున్నాను చేయిచాచాను రా రా 

కామినీ మోహినీ ఆడూ ఆడూ, పాడూ పాడూ 

నావల్లో హాయ్, నావల్లో చిక్కినవాడు పోనేపోలేడు 
హాయ్ గమ్మత్తు కైపులోస ముంచేసాను చూడు చూడు. 

నవ్వులతోటి ఎవ్వరినైనా వూరిస్తాను నాటకమాడి 
కాళ్ల చుటూ తిప్పిస్తాను వాల్చూపుతోనే తిమ్మిని బమ్మిని చేస్తాను 
వయ్యారంతోనే పుక్కిరి బిక్కిరి చేస్తాను 
నెరజాణ తునకను నేను, రాజ రాజ రా రా 

హ్వ ! హ్వ : బలే : బలే : ఆ   ॥నావల్లో॥ 

గడ్డంబెంచిన స్వాముల్నైనా కవ్విస్తాను, హాయ్ 
జంతర్ మంతర్ బొమ్మల్లాగా ఆడిస్తాను 
అరచేతిలోన వైకుంఠం చూపిస్తాను 
అందాల కౌగిటో, ఆనందం కురిపిస్తాను 
చేయి చేయి కలుపుతాను సిగ్గు కాస్త దులిపేస్తాను 
రాజ ! రాజ ! రా! రా! 

ఆ ఆ బాగు బాగు  ఆ 





అలివేణి నీ రూపము పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

పల్లవి:
అలివేణీ... నీ రూపము మలచిన సుందర శిల్పము
విరిబోణీ... నీ అందము అరవిరిసిన అరవిందము

చరణం: 1
చిరుగాలికి ఊగిన ముంగురుల మరులు కనుగొంటిని
ఎదపొంగుల దాచిన పై ఎద గుసగుసలే వింటిని

చరణం: 2
నీ చెక్కిలి అద్దమున నీడ చూసుకోనా
నీ బింబాధరమున తేనీయలు దోచుకోనా

చరణం: 3
నీ అగమ్య లావణ్య ధునితరంగ డోళలందు
పగలు ఎరుగక రేయి ఎరుగక పరవశించిపోనా పరవశించి పోనా 




నను మరువని పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
తొలి సిగ్గుల తొలకరిలో తలవాల్చిన చంద్రముఖి
తెరలెందుకు నీకు నాకు దరి జేరవె ప్రియసఖి 

నను మరువని దొరవని తెలుసు
నను మరువని దొరవని తెలుసు
నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు

నను వలచిన చెలివని తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు

చరణం: 1
చెంపల కెంపులు దోచాలని 
సంపంగి నవ్వులు దూయాలని

ఆ .. ఆ .. ఆ
చెంపల కెంపులు దోచాలని 
సంపంగి నవ్వులు దూయాలని
నడుమున చేయి వేసి నడవాలని
నా ... నడుమున చేయి వేసి నడవాలని
అంటుంది అంటుంది నీ కొంటె వయసు 

నను వలచిన చెలివని తెలుసు
నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు

చరణం: 2
నీ రాజు తోడుగ నిలవాలని
ఈ ఏడు లోకాల గెలవాలని

ఆ .. ఆ .. ఆ
నీ రాజు తోడుగ నిలవాలని
ఈ ఏడు లోకాల గెలవాలని
బ్రతుకే పున్నమి కావాలని 
నీ ...బ్రతుకే పున్నమి కావాలని
కోరింది కోరింది నీ లేత మనసు

నను మరువని దొరవని తెలుసు
నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు




నెలవంక తొంగి చూసింది పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది 

నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెల్లి విరిసింది 

నెలవంక తొంగి చూసింది

చరణం: 1
ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికె
ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికె
ఏ పూలనోము ఫలమో నీ రూపమందు నిలిచె
సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసె 

నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది

చరణం: 2
ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత
ఏనాటికైన ఏ చోటనైన విడిపోనిదోయి మన జంట 

నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక  నిలువెల్ల వెల్లి విరిసింది 
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది




రోజాకొక్క మోజుగా పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ 
ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝు 
ఘననాట్యము ఆడేఎడ తూలేవోయ్ ఎదమీద ॥ఝుణ॥ 

చరణం: 1
రోజున కొక మోజుగ 
మోజున కొక హాయిగ 
హాయికి ఒక తీపుగ 
తీపున కొక మత్తుగా
ఘన నాట్యము ఆడేయెడ తూలేవోయ్ 
ప్రియగానము చేసేయెడ సోలేవోయ్   ॥ఝణ || 

చరణం: 2
భావనకొక రాగముగ 
రాగముకొక సంగతిగ.... ఆ.... ఆ 
సంగతికొక మాధురిగ 
మాధురికొక మైకముగ 
ఘననాట్యము ఆడేయెడ తూలేవోయ్ 
ప్రియగానముచేసేయెడ సోలేవోయ్ సోలేవోయ్ ॥ఝణ || 





నీవు నాకు రాజా పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

నీవునాకు రాజా 
మరినీకు నేను రోజా 
నీ చెంతచేరి నా వింతచూపి 
నీ తంతు చూతులేరా 

చరణం: 1
మగువో మధువో తేలాలిరా 
తేలక నేను పోనురా 
హ హ హ అలాగా ఆ 
పొగరో, నగరో 
నీవో నేనో చూతురా 

చరణం: 2 
నీతో నాకు చెలగాటరా 
నీ కౌగిలి నా కోటరా 
ఆహ హ హ ఎట్లా 
చాటూ మాటూ 
అరసీ, మురిసీ పోదురా 
హ హ హ హ ఆ 




కన్నవారి పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

కన్నవారి కన్నీరును తుడిచే 
తనయుని బ్రతుకే ధన్యమురా
గుణవంతుడైన తనయుణ్ని కన్న 
తలి దండ్రులదే పుణ్యమురా

చరణం: 1
ఏతల్లి దండ్రుల, ఎదపైన పెరిగానో 
ఎవ్వరి నీడలో యిన్నాళ్లు మెలిగావో 
ఆ కన్నవారికే కన్నయ్యవై 
కావడిలో మోసి వెళుతున్నావా 
నిత్యము నీజన్మ చరితార్ధము 
నిజధర్మమే నీ పరమార్ధము 
 
చరణం:  2 
సామ్రాజ్యము వీడి, సంపదలు విడనాడి 
సహనము, శీలము కవచాలుగా దాల్చి 
కన్నవారికే కంటిరెప్పవై 
కానలనే పడి పోతున్నావా 
నిత్యము నీజన్మ చరితార్ధము 
నిజధర్మమే నీ పరమార్ధము 





ఈశ్వరీ జయము నీవే పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల, బృందం

శ్లోకం:
సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే

పల్లవి :
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే

చరణం: 1
సూర్యులు కోటిగ చంద్రులు కోటిగ
మెరసిన తేజము నీవే దేవి
శక్తి వర్ధనివి వరదాయినివే (2)
ఇహమూ పరమూ నాకిక నీవే

చరణం: 2
మంత్రతంత్రముల మాయల ప్రబలిన
క్షుద్రుల పీడకు బలియగుటేనా
దుష్టశక్తులను రూపుమాపగ...  (2)
మహా మహిమనే నాకిడ లేవా

చరణం: 3
నిరపరాధులగు తల్లిదండ్రులు సతి
క్రూరుని హింసకు గురియగుటేనా
దుర్మార్గులనిక నాశము చేసి (2)
తరించు వరమిడి దయగనరావా

ఓం నారాయణి... ఓం నారాయణి

చరణం: 4
ప్రాణము లైదుగ వేదనలైదుగ
పరిపరి విధముల నినువేడితినే
అమోఘ మహిమల ఆదిశక్తివే
ఓం నారాయణి... ఓం నారాయణి
అమోఘ మహిమల ఆదిశక్తివే
చలమూ బలమూ నాకికనీవే దేవి... దేవి...
ఓం నారాయణి... ఓం నారాయణి (2)


No comments

Most Recent

Default