Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kavitha"
Cheppindi Chestha (1978)



చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
మాటలు, పాటలు: రాజశ్రీ
నటీనటులు: కృష్ణ, జయచిత్ర, నరసింహరాజు, కవిత
దర్శకత్వం: యస్. యస్. గోపీనాథ్ 
నిర్మాతలు: Dr. A.V.కృష్ణారెడ్డి, Dr. T.V.మోహనరంగా రెడ్డి, Dr. S.D.అహ్మద్, Dr. C.నటేషన్, M.A. అజీజ్
నిర్మాణ సంస్థ: సరోజినీ ఆర్ట్స్
విడుదల తేది: 21.09.1978



Songs List:



హ్యాపీ బర్త్‌డేపాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

హ్యాపీ బర్త్‌డే 



చిన్నదాని పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, విజయలక్ష్మి శర్మ

చిన్నదాని 



కోటి ఊహల పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కోటి ఊహల 




ఆడాలా పాడాలా పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి.సుశీల, విజయలక్ష్మి శర్మ 

ఆడాలా పాడాలా 



ఒకానొక్క కన్నె పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు

ఒకానొక్క కన్నె



కన్నె పిల్లల్లం పాట సాహిత్యం

 
చిత్రం: చెప్పిందే చేస్తా (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, విజయలక్ష్మి శర్మ

కన్నె పిల్లల్లం 

Palli Balakrishna Saturday, February 3, 2024
Lawyer Viswanath (1978)



చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి
గానం: పి.సుశీల , యస్.జానకి , యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: యన్.టి.రామారావు, రంగనాథ్, శరత్ బాబు, జయసుధ, కవిత, సుజాత
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: యస్.డి.లాల్
నిర్మాత: వై వి రావు
విడుదల తేది:17.11.1978



Songs List:



పిలిచె పిలిచె అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

పల్లవి: 
పిలిచె పిలిచె అనురాగం
పలికే పలికె నవగీతం
అతడు నను చేరగానే
బ్రతుకు పులకించె తానే

చరణం: 1
ఈపడుచు గాలీ నా పైన వాలీ
ఏమమ్మో యింత సిగ్గు ఎందు కన్నది
ఏ బదులు రాక నిలువ లేక
జవ్వాడే నామనసేమో నవ్వుకున్నది

చరణం: 2
రవ్వంత బిడియం పువ్వంత ప్రణయం
నారాజు చూపుల్లోనే దాచుకున్నాడు
నే దాచలేక ప్రేమ లేఖ
అందాల మబ్బుల ద్వారా అందచేస్తాను




షరాబీ! పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.జానకి

సాకి: షరాబీ!

పల్లవి: 
వచ్చిందిరా ఈ గులాబీ
రేకు విచ్చిందిరా ! సోకు మెచ్చిందిరా!
లేత పరువాలు తెచ్చిందిరా

చరణం: 1
వలచింది ఒకరు నిలచింది ఒకరు నాకోసం
నా దోర వయసు ఈ లేత మనసు నీకోసం
ఈ తళుకు ఈ కులుకు నా బతుకు నీకొరకు
కలలోని వలపు వెలలేని ముడుపు నీదే

చరణం: 2
ఆడింది ఆట పాడింది పాట ఒకనాడు
నావాడి కొరకు నేనాడు తాను ఈనాడు
కన్నీరు దాచాను పన్నీరు జిల్లాను
ఏనాటికైనా నాదారిలోకి రావా




రాముడెప్పుడూ రాముడే! పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
రాముడెప్పుడూ రాముడే ! 
రఘురాము డెప్పుడూ రాముడే
అయోధ్యలో తానున్నా! 
కారడవులలో పోతున్నా

చరణం: 1
మబ్బులెన్ని కమ్ముకున్నా-మాసిపోదు సూర్యగోళం !
చీకటెంత భయపెడుతున్నా - చెదిరిపోదు చంద్ర బింబం !
ఎన్ని తలలు ఏకమైనా-ఎందరు మారీచులున్నా
ఎదురొడ్డి నిలిచేవాడు-ఎత్తైన విల్లు దించనివాడు

చరణం: 2
కడలి హద్దు దాటిందంటే పుడమినే ముంచేస్తుంది
గోవు మనసు రగిలిందంటే
కొమ్ములతో కుమ్మేస్తుంది అందుకే
వజ్రమును కోయాలంటే వజ్రమే కావాలబ్బీ
కోటలను కూల్చాలంటే ఫిరంగులు పేల్చాలబ్బీ
జిత్తులను మాపాలంటే ఎత్తులే వేయాలోయీ
కత్తులను తుంచాలంటే కత్తులే విసరాలోయీ
ఏరూపంలో నీవుంటున్నా
తోడుంటాడు యీహనుమన్న




కలకాలం వుండవులే కన్నీళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
కలకాలం వుండవులే కన్నీళ్ళు
కలలైనా కలతైనా కొన్నాళ్ళు
కలలన్ని మరిచి కన్నీరుతుడిచి
ఈ పాట పాడాలి నూరేళ్ళు

చరణం: 1
ఏగుండెలోన ఏగొంతువుందో
తెలిసేది నీబాధ లోనే ఏగొంతులోన ఏకోయిలుందో
పలికేది నీపాట లోనే
నిట్టూర్పు తగిలి తొలితూర్పు రగిలి
వెలిగేది నీచూపు లోనే

చరణం: 2
ఆ కన్ను మరిచె నా కన్ను తడిసే
నాఆశ అడియాసలాయె
దీపాలు వెలిగే పెనుచీకటాయె
నా నీడ నను వీడి పోయె-నడిరేయిలోనే కొడిగట్టె దీపం
వలపంత తెలవారిపోయె




భం భం భం భం శంఖునాదముతో పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

భం భం భం భం శంఖునాదముతో
జగ జగ జగ జగదంబ పలుకుతో
కొండ దేవరను దిగివచ్చా
నేజన్మ కుండలిని చూస్తా బచ్చా

చేతిలో రాత చూడు రాతలో గీత చూడు
ఈ ఒంటరి గువ్వ జంటగ గూటికి
చేరే యోగం వుందా చూడు

బ్రహ్మిని తిమ్మిని చేస్తా-తిమ్మిని బ్రహ్మిని చేస్తా
ఆబ్రహ్మరాతలో ప్రేమగీతని
ఇప్పుడు ఇక్కడ పుట్టించేస్తా

నిప్పులాంటి నామనిషి–నీటి పాలై పోతుంటే
మంచిని పెంచి తలనేవంచని
వాడు వంచనకు బలిఅవుతుం టే
నిప్పును నేరగిలిస్తా ఆనీటిని ఆవిరిచేస్తా
మీవలపు కోవెల తలుపులు తెరిచి
ఇప్పుడు ఇక్కడ దీపం పెడతా

Palli Balakrishna Sunday, November 19, 2023
President Peramma (1979)



చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, దాసం గోపాలకృష్ణ 
గానం: పి.సుశీల,యస్.పి.బాలు
నటీనటులు: కవిత, నూతన్ ప్రసాద్, రాజబాబు, రమాప్రభ 
కథ, మాటలు: దాసం గోపాలకృష్ణ 
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి.వి.యస్.రాజు
విడుదల తేది: 12.04.1979



Songs List:



తెల్లారి కలగన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తెల్లారి కలగన్న - పెళ్ళాడినట్టు
గదిలోకి రాగానే - గడియేసినట్లు
గడియ గడియకీ నిన్ను ముద్దాడినట్టు
పెళ్లాడినట్టు గడియేసినట్టు ముద్దాడినట్టు
బంజారా బంజారా బంజారా బంజారా

తెల్లారి కలగన్నా - నీ తెలివి తెల్లారినట్లు
గడిలోకి రాగానే - నే గరిటె తిరిగేసినటు
తిరగేసి మరగేసి నీ దుమ్ము దులిపేసినటు
తెల్లారినట్టు తిరగేసినట్టు దులిపేసినట్లు
బంజారా బంజారా బంజారా బంజారా

నీ పొంగు మడతెట్టే కడకొంగు ముడిబెట్టి
సరిగంగ తానాలు నేనాడినట్టు
మనసుల్లో మడిగట్టి - వయస్సుల్లో జతకట్టి
ముడుపుల్నీ, మొక్కుల్నీ చెల్లించినట్టు

ఓం తడియారకుండా మడికట్టుకోనిమ్యహం
మడిఒట్టతో నే ముడి పెట్టుకోనిమ్యహం
ముడివూడకుండా మ్యాహం
గుడిమెట్ల క్రింద మ్యహం
ఇద్దరూ మ్యాహం
ముద్దుగా ముద్దు ముద్దుగా
మూడు నిదర్లు చేస్తే - మ్యహం - మ్యహం - మ్యహం
బంజారా - బంజారా బంజారా

నునులేత నీ బుగ్గ - కొనగోట నే నొక్క
సీకట్లో నెలవంక - సిగురించినట్టు
ముప్పేట ముడికాస్తా - మూడేళ్ళ కొడుకయ్యి
మన ముద్దుకే హద్దు పెట్టేసినట్టు
చెల్లాయి కావాలి చెల్లాయి - ఇవ్వనంటే నీకు జిల్లాయి
చెల్లాయి - జిల్లాయి

సేమంతి పువ్వంటి సెల్లెల్ని ఇద్దామా
తామర పువ్వంటి తమ్ముణ్ణి ఇద్దామా
బంజారా బంజారా బంజారా

గదిలోకి రాగానే - నే గరిటె తిరగేసినట్టు
గడియ గడియకే నిన్ను ముద్దాడినట్టు
పెళ్లాడినట్టు - గడియేసినట్టు - ముద్దాడిననట్టు - ముద్దాడినట్టు
బంజారా - బంజారా - బంజారా
బంజారా బంజారా
బంజారా - బంజారా




ఏమంత తొందర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఏమంత తొందర
కాసింత ఆగరా
కడసందె కాలేదు కాలేదురా
పడకిల్లు సరిచేసి రాలేదురా
పెదవికి గిలిగింత కలగనీ -
పయ్యెదకున్న ఓపిక తొలగనీ
మరులేమొ మరికొంత పొంగనీ
మనవేమొ మరునికి లొంగనీ
అందాకా అందాకా ఆగరా...

పరువపు పన్నీరు చిలకనీ
సరసపు సిరిగంధ మలదనీ
వలవుల దండ వేయనీ
వలపులకై దండవేయనీ
తలపుల తాంబూల మీయనీ
అందాకా - ఆందాకా ఆగరా



పంచమినాడే పెళ్ళంట పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, నూతన్ ప్రసాద్

పంచమినాడే పెళ్ళంట పంచలచాపు నేయించు
దశమీ రేతిరి... అంట
ఏటంట ?
తెలవదు తెలవదు నాకంట
తెల్లచీర తెప్పించు-మల్లెపూలు రప్పించు
అబ్బా. ఇయ్యాల నన్నిట్టా పట్టుకున్నావేంటే?
పట్టుకున్నవాడే - పట్టుగొమ్మంట
పట్టుగొమ్మ నీడే పడకటిల్లంట
పడకటింటిలోనే పట్టు తేనంట

పట్టుతేనె విందూ - పగలూ రేయంట
పగలూ రేయీ ఒకటే... ఆంట
ఏటంట...?
తెలవదు తెలవదు నాకంట
తెల్లాచీరా తెప్పించు మల్లెపూలు రప్పించు
ఏయ్ ఒక్కటి కొంటానంటేనా...?
కొట్టేచెయ్యీ కోరే మనసూ ఒకటేలెమ్మంట
ఒకటీ ఒకటి కలిసే ముచ్చట మూడౌతుందంట
మూడు రాత్రుల పున్నమి
ఏడు జన్మల పున్నెమంట
పున్నెమెంత సేసినా ఈ పులకరింత దొరకదంట 
దొరికిందంతా ఇపుడే... అంట
ఏటంట...?

తెలవదు తెలవదు నాకంట
తెల్లాచీరా తెప్పించు మల్లెపూలూ రప్పించు




అందరాని చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

అంధేరేమె తూ దియాహై మేరే సనమ్మ
మిల్కర్ రహేంగే పియా హర్ జనమ్

అందరాని చందమామ నాకెందుకూ
అదంలాంటి నా మామ చాలు నాకూ
అందరాని చందమామ నీకెందుకూ...?
నే అద్దంలా వున్నాను నువ్వు సూసేందుకు
ఏటిలోని నురగల్లాగ - పైటకొంగు పొంగుతుంటే
లేతగాలి ఇసురుల్లో పూత వయసు వూగుతుంటే
ఇసకా తిన్నెలు గుసగుసమంటే మసకా కోరిక
బుసకొడుతుంటే
సూడాలి అప్పుడు - ఈ జోడుగుండె చప్పుడు

సూడాలి అప్పుడు— ఈ జోడుగుండెల చప్పుడు ॥ఆంధేరేమె॥

నీరెండి సీరకట్టీ - నీలినీడ రైక తొడిగీ
పొదుపొడుపు తిలకం దిద్ది 
పొన్నపూల నవ్వులు పొదిగి

వనలచ్చిమిలా నువ్వొస్తుంటే
ఊరూ నాడూ పడిచస్తుంటే 
సూడాలి అప్పుడు
నన్నేలినోడి దూకుడు....




కూత్ కూత్ కూత్ కూత్ కుక్కపిల్లలు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి.బాలు

కూత్ కూత్ కూత్ కూత్
కుక్కపిల్లలు
రొట్టెముక్క చూపి సే
లొట్టలేసాయి
కావు కావు కావు కావు కాకి మూకలు
చుట్టముక్క చూపిసే చుట్టు చేరాయి
కుక్కపిల్లలూ - కాకి మూకలూ
జంతర మంతర ధాం లాంతర లాంతర లాంతర తోం తనంతర ధాం

ఎత్తమంటే సెయ్యి ఎత్తేవోళ్లు ఏ ఎండకాగొడుగు పట్టేవోళ్లు 
ఎంగిలి మెతుకులు కతికేవోళ్లు ఏబరాసి బతుకులు బతికేవోళ్ళు
కలిసికట్టు లేనోళ్ళు నాయాళ్ళు - గొలుసుకట్టు మతలబోళ్ళు నాయాళ్ళు
ఈళ్ళంతా - మనవూరు ఏలేవాళ్ళు
కుక్కపిల్లలూ - కాకిమూకలూ
జంతర మంతర ధాం తనంతర - లాంతర లాంతరం తనంతర ధాం

నెగ్గిందాక మాట ఇచ్చేవోళ్ళు - నెగ్గినాక ప్లేటు మార్చేవోళ్ళు
పొట్టలు కొట్టే గొటంగాళ్ళు పొదుగులు కోసే కసాయివోళ్ళ
గోడమీద పిడకలు నాయాళ్లు గోతికాడ నక్కలు నాయాళ్ళు
ఈళ్ళంత మన ఊరు ఏలేవోళ్లు - కుక్కపిల్లలూ - కాకిమూకలు
జంతర మంతర ధాం తనంతర - లాంతర లాంతరం తనంతర ధాం 



పానకాలస్వామిని నేను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

శ్రీశైల మల్లమ్మ - అలివేలు మంగమ్మ
బెజవాడ కనకదురగమ్మో
పానకాల స్వామిని నేను పూవకం మీదున్నాను
శ్రీశైల మల్లన్న శివమెత్తి ఆడంగ -
సింహాద్రి అప్పన్న సింగమై దూకంగ
పోతరాజో పోలేరమ్మా

పోలేరమ్మో దాటి పోలేరమ్మా
బండరాయి పగలగొట్టు - బావురు కప్పను పట్టు
ఆశ్శరభ శరథ అల్లల్ల భీర

నాపరాయీ పగలగొట్టు - నల్లనీటి ఊటబట్టు
ఆశ్శరభ శరభ అల్లల్ల భీర
కంచె చేను మేస్తుంటే కంచి కామాక్షమ్మ
బురిడీలు కొట్టకమ్మో - మరిడీ మాలచ్చమ్మా
పోతరాజో పోలేరమ్మా 
పోలేరమ్మో దాటి పోలేరమ్మా
తలపైన తట్టుంది శరభా - తట్టలో బుట్టుంది శరభా
బుట్టలో గుట్టుంది పట్టుకో శరభా
అశ్శరభ శరభ అల్లల్ల భీర

తట్టాబుట్టా సర్ధి శరభా - తైతక్కలాడుకుంటూ శరభా
తలవాకిటున్నాది తందనాల బొమ్మ
అశ్శరభ శరభ అల్లల్ల భీర

పాపనాశనం కోసం తానమాడ బోతేను
వంశనాశనం కోసం మొసలెత్తు కెళ్ళింది
కటకటాలు తప్పవమ్మో కోటగుమ్మం రాయడమ్మో
పోతరాజో పోలేరమ్మో -
పోలేరమ్మో దాటి పోలేరమ్మో


Palli Balakrishna Monday, October 30, 2023
Jeevitha Ratham (1981)



చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: శోభన్ బాబు, రతి అగ్నహోత్రి, కవిత, సుమలత, రంగనాథ్, శరత్ బాబు
దర్శకత్వం: వి. మధుసూధనరావు 
నిర్మాతలు: గూడపాటి గోపీ మురళి, జ్యోతి కుమార స్వామి 
విడుదల తేది: 29.07.1981



Songs List:



భలే ఇబ్బందిగా ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

భలే ఇబ్బందిగా ఉంది




ఇదే ఇదే జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు

ఇదే ఇదే జీవితం 



చిగురాకులలో ఒక చిలకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: పి. సుశీల 

చిగురాకులలో ఒక చిలకమ్మా 




కోడేమో కూరైపోయే పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

కోడేమో కూరైపోయే 



ఓలమ్మి చిందెయ్యనా పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఓలమ్మి చిందెయ్యనా 



అల్లరంటే అల్లరి పాట సాహిత్యం

 
చిత్రం: జీవిత రథం (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

అల్లరంటే అల్లరి 

Palli Balakrishna Saturday, August 20, 2022
Sardar (1984)



చిత్రం: సర్దార్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: కృష్ణం రాజు, జయప్రధ, శారద, కవితా 
దర్శకత్వం: నందం హరిశ్చంద్ర  రావు 
నిర్మాత: కె.సి.శేఖర్ బాబు 
విడుదల తేది: 07.01.1984



Songs List:



చిలిపి చైత్ర మాసము పాట సాహిత్యం

 
చిత్రం: సర్దార్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

చిలిపి చైత్ర మాసమా నీకు నా సలాం



పోరా పోరా పాట సాహిత్యం

 
చిత్రం: సర్దార్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

పోరా పోరా సూరీడా పోకిరి కళ్ళ సూరీడా



మనసొక పాడని పాట పాట సాహిత్యం

 
చిత్రం: సర్దార్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

మనసొక పాడని పాట అది చెప్పదు చెలిమికి 




పంచాంగం పాట సాహిత్యం

 
చిత్రం: సర్దార్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల

పంచాంగం చూడొద్దురోయి ఇయ్యాల

Palli Balakrishna Monday, April 18, 2022
Palleturi Pidugu (1983)



చిత్రం: పల్లెటూరి పిడుగు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మోహన్ బాబు, కవిత
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
నిర్మాత: జి.వి. యస్. రాజు
విడుదల తేది: 1983

Palli Balakrishna Monday, August 30, 2021
Agni Jwala (1983)

చిత్రం: అగ్ని జ్వాల (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మోహన్ బాబు , కవిత, ముచ్చర్ల అరుణ, నరేష్ 
డైలాగ్స్: సత్యానంద్
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
నిర్మాత: జి.వి. కృష్ణ రావు
విడుదల తేది: 14.07.1983 

Palli Balakrishna Monday, May 17, 2021
Agni Samskaram (1980)



చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
నటీనటులు: చిరంజీవి, కవిత, సుభాషిణి
దర్శకత్వం: జి.వి.ప్రభాకర్
నిర్మాతలు: పి. రమాదేవి, జి వసుమతీ దేవి 
విడుదల తేది: 21.02.1980



Songs List:



మంచున తడిసిన మల్లికవో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

మంచున తడిసిన మల్లికవో 



శివ శివ శంకర పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: యస్.జానకి 

శివ శివ శంకర 



కొండమీద కాపురం ఉన్న పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: రమోల, శ్రీనివాస్ 

కొండమీద కాపురం ఉన్న 




మనిషై మతములు వెలయించాడు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని సంస్కారం (1980)
సంగీతం: ఎమ్. జనార్ధన్
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: వి. రామకృష్ణ 

మనిషై మతములు వెలయించాడు మతమే మనిషిని

Palli Balakrishna Monday, January 28, 2019
Aarani Mantalu (1980)



చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి, కవిత
దర్శకత్వం: కె.వాసు
నిర్మాతలు: కె.మహేంద్ర, త్రిపరమల్లు వెంకటేశ్వరులు
విడుదల తేది: 15.03.1980



Songs List:



నీ చూపు నా చూపు కలిశాక పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి

నీ చూపు నా చూపు కలిశాక



కమ్మని నా పాట పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

కమ్మని నా పాట 




ఓ అమ్మో టక్కరి గుంట పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

ఓ అమ్మో టక్కరి గుంట 





అన్నయ్య దీవెన పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

అన్నయ్య దీవెన 




నలుగురి కోసం వెతుకుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: ఆరని మంటలు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

నలుగురి కోసం వెతుకుతున్నది

Palli Balakrishna
Prema Natakam (1981)





చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మురళీమోహన్, శారద, శరత్ బాబు, సంగీత, పుష్ప కుమారి
ప్రత్యేక పాత్రలో (Friendly Appearance)  చిరంజీవి, కవిత
కథ, మాటలు: కాశీవిశ్వనాధ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాతలు: ఎమ్. శంకరయ్య, నందకుమార్, స్వామి, బాలనాగయ్య
విడుదల తేది: 18.04.1981



Songs List:



ఓ ఊర్వశి ప్రేయసి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్. పి.బాలు, పి.సుశీల

ఓ ఊర్వశి ప్రేయసి 





ప్రేమించు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల

ప్రేమించు 



నిన్నటి నా గతి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్.జానకి

నిన్నటి నా గతి 




వస గొంతున కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్.జానకి

వస గొంతున కోయిల 



ప్రేమ నాటకం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం:  ఎస్. పి.బాలు

ప్రేమ నాటకం ఇదే ప్రేమ నాటకం 



కూనలమ్మ కులికిందంటే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం:  ఎస్. పి.బాలు, ఎస్.జానకి

(చిరంజీవి, కవిత సాంగ్)

కూనలమ్మ కులికిందంటే 

Palli Balakrishna
Pasupu Parani (1980)

చిత్రం: పసుపు పారాణి (1980)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: మురళీమోహన్, సుజాత, కవిత
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
నిర్మాతలు: కొటికల పూడి గోవిందరావు, ఆకుల బుల్లి అబ్బాయి
విడుదల తేది: 1980

రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోనా ..  చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ .. చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది
పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది
ఇసుక తిన్నెపై గవ్వలు నవ్వులెండ పెడుతున్నాయి

రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది
ఓహో..ఆఆఅ..ఆఆఆ...
జలతారు జిలుగు పైట చదరంగం ఆడుతోంది
లలలల లలల లలల హో...

జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట చదరంగమాడుతోంది
జలదరించి పై పెదవి చలివెందర పెడుతోంది
బాజాలకు మాటిద్దామా...  బాసికాలు కట్టిద్దామా
బాజాలకు మాటిద్దామా...  బాసికాలు కట్టిద్దామా

రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది

ఈ కళ్ళతో ఆ కళ్ళు గస్తీలు కాస్తున్నాయి
ఓహో..అఆఅ...ఆఆ...ఆఅ
ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నాయి
లలలలల్ లలల లలల అహాహ హ..
ఆ కళ్ళతో ఈ కళ్ళు గస్తీలు కాస్తున్నయ్
ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నయ్
మురిపించే ఆ పలుకులు స్వస్తి పలుకుతున్నాయి
తోరణాలు కట్టిద్దామా... తొలివలపులు పండిద్దామా
తోరణాలు కట్టిద్దామా...  తొలివలపులు పండిద్దామా

రేవులోనా  చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటుంది
ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

Palli Balakrishna Friday, November 17, 2017
Punadhirallu (1979)

చిత్రం: పునాదిరాళ్ళు (1979)
సంగీతం: ప్రేమ్జీ
సాహిత్యం: జాలాది (ఆశలే మసకేసిన రేయి), గూడపాటి రాజ్ కుమార్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి, జి. ఆనంద్, మాధవపెద్ది రమేష్, రమణ
నటీనటులు: చిరంజీవి , విజయ కృష్ణ, కె.డి.ప్రభాకర్, రామన్ గౌడ్, రాజేష్, సావిత్రి, రోజారమణి, కవిత, జయమాలిని
దర్శకత్వం: గూడపాటి రాజ్ కుమార్
నిర్మాత: యస్.ఫజులుల్లాహక్
విడుదల తేది: 21.06.1979

భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాద్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం

కార్మిక కర్షక శ్రామిక జీవులు
మనదేశానికి వెన్నుపూసలు
వారి రక్షణే దేశ రక్షణ
వారి పరీశ్రమె మన జీవనము
వారి పరీశ్రమె మన జీవనము

విజ్ఞానానికి ఉపాధ్యాయులు
ప్రజా సేవకై యన్ జి ఓ లు
ఐకమత్యతకు నాయకత్వము
వారి పరీశ్రమె దేశ పురోగతి
వారి పరీశ్రమె దేశ పురోగతి

స్వార్ధపరులకు సాయపడుటకై
సమ్మెలు సవాళ్లు చేయం చేయం
ప్రతిపని కోసం ప్రభుత్వమనక
ప్రజాశక్తిని కలుపుట న్యాయం
ప్రజాశక్తిని కలుపుట న్యాయం

సోమరితనముకు సమాధి కట్టి
అహకారంతో సాధన చేసి
ప్రాపంచాన్ని నిలబెడదాం
సమ సమాజాన్ని సాదిద్దాం
సమ సమాజమే సాదిద్దాం

భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాద్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం

మనం మనం ఒక పల్లె బిడ్డలం
అనం అనం నేను నాదని
పదం పదం కలుపుదాం
ప్రగతి పదంలో పయనిద్దాం
ప్రగతి పదంలో పయనిద్దాం

తరం తరం కలవాలని
నిరంతరం నిలవాలని
వేద్దాం పదండి వెలుగు బాటకు
కదలని చెదరని పునాది రాళ్ళు
కదలని చెదరని పునాది రాళ్ళు

భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాద్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం

వందేమాతరం (4)

Palli Balakrishna Tuesday, October 10, 2017
Oorukichchina Maata (1981)

చిత్రం: ఊరికి ఇచ్చిన మాట (1981)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు,  సుశీల
నటీనటులు: చిరంజీవి, సుధాకర్, మాధవి, కవిత
దర్శకత్వం: యమ్.బాలయ్య
నిర్మాతలు: సూర్యనారాయణ అలపర్తి,
విడుదల తేది: 21.06.1981

పల్లవి:
చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
రామ రామ.. పరంధామ.. నా గుండె కొట్టుకొనె ఝల్లుఝల్లుమని

చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
అమ్మదొంగ.. పూలరంగ.. నా ఒల్లు తుళ్లిపడె ఝిల్లుఝిల్లుమని
చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి చేతుల్లో కట్టేసినావు

చరణం: 1
ఆ.. అహాహాహ.. హ.. హా..
ఆహాహా.. ఓహోఓ... ఆ... హ... హా..
ఏహేహే...

సెగ రేపే ఈ సమయం.. ఎగరేసే బిగి పరువం.. లే.. లే.. లెమ్మటుంది
కులుకేసే ఈ నిమిషం.. వెనుదీసె నా హృదయం.. నో.. నో.. నో.. అంటోంది
సెగ రేపే ఈ సమయం.. ఎగరేసే బిగి పరువం లే.. లే.. లెమ్మటుంది
కులుకేసే ఈ నిమిషం.. వెనుదీసె నా హృదయం.. నో.. నో.. నో.. అంటోంది

హోయ్.. కుదిరెను జత.. అహహ.. నవమన్మధ.. అహహ
మొదలాయెలే మొన్నటి కథ..
కనరాని మెలికేసి నను లాగావు.. ఊ..

చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
అమ్మదొంగ.. పూలరంగ.. నా ఒల్లు తుళ్లిపడె ఝిల్లుఝిల్లుమని

చరణం: 2
నడయాడె శశిరేఖ.. నా వలపుల తొలిరేఖ.. నన్నే లోగొన్నావు
ఎదలోని.. పొదలోన.. చదివే ప్రతి పుటలోనా.. నీవే దాగున్నావు
నడయాడె శశిరేఖ.. నా వలపుల తొలిరేఖ.. నన్నే లోగొన్నావు
ఎదలోని.. పొదలోన.. చదివే ప్రతి పుటలోనా.. నీవే దాగున్నావు

అహహా.. నా పని సరి.. ఓ గడసరి.. అహ..
ఆగదు మరి.. సాగిన ఝరి..
నిలువెల్లా పులకింతలు నింపేశావు.. ఊ..

చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
అమ్మదొంగ.. పూలరంగ.. నా ఒల్లు తుళ్లిపడె ఝిల్లుఝిల్లుమని

చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
రామ రామ పరంధామ.. నా గుండె కొట్టుకొనె ఝల్లుఝల్లుమని

Palli Balakrishna Friday, September 29, 2017

Most Recent

Default