చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద , అంబిక, గీత, రామానాయుుడు దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: డి. రామానాయుడు విడుదల తేది: 19.09.1981
Songs List:
ప్రేమ మందిరం.. పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: ప్రేమ మందిరం.. ఇదే ప్రేమ మందిరం ప్రేమ మందిరం.. ఇదే ప్రేమ మందిరం.. నిరుపేదలు తల దాచుకునే నింగి కుటీరం కలవారలు కలలు కనే పసిడి పంజరం నిరుపేదలు తల దాచుకునే నింగి కుటీరం కలవారలు కలలు కనే పసిడి పంజరం ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం ఊ...ఊ..ఊ.. చరణం: 1 ఎనిమిది దిక్కుల నడుమ సంసారం ఎనభై నాలుగు లక్షల సంతానం ఎనిమిది దిక్కుల నడుమ సంసారం ఎనభై నాలుగు లక్షల సంతానం సప్తస్వర సంగీతం నవరసాల సాహిత్యం రంగరించుకున్నదీ రంగుల వలయం రిసరిగ గసగమ సగమదనిస నిదపమగరిసనిద సప్త స్వర సంగీతం నవరసాల సాహిత్యం రంగరించుకున్నదీ రంగుల వలయం మనసంఘమ నిలయం... నవసాగర మధనం...ఇది శాశ్వత ప్రణయం సుందరం.. సుమధురం.. ప్రేమ మందిరం నిరుపేదలు తలదాచుకొనే నింగి కుటీరం కలవారలు కలలు కనే పసిడి పంజరం ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం చరణం: 2 నీలో విన్నా వలపుల ఓంకారం నీలో కన్నా వెలుగుల ఆకారం నీలో విన్నా వలపుల ఓంకారం నీలో కన్నా వెలుగుల ఆకారం ఉదయారుణ మందారం... హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన... కళ్యాణ మంటపం రిసరిగ గరిదప దపదప దపదస ఉదయారుణ మందారం... హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన... కళ్యాణ మంటపం ఇది సృష్టికి ప్రాణం.. మన ముక్తికి మూలం ఇది ఇలలో స్వర్గం... సుందరం... సుమధురం... ప్రేమ మందిరం నిరుపేదలు తల దాచుకొనే నింగి కుటీరం కలవారలు కలలు కనే పసిడి పంజరం ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం
చంద్రోదయం పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల చంద్రోదయం
ఎక్కడో.. పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: ఎక్కడో... ఎప్పుడో... ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు బాలరాజువా దేవదాసువా బాటసారివా కాళిదాసువా ఎక్కడో... ఎప్పుడో... ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు చంద్రలేఖవా శశిరేఖవా భద్రకాళివా చండీప్రియవా చరణం: 1 మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ చూసుకున్న చూపులన్ని అదో మాదిరి మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ చూసుకున్న చూపులన్ని అదో మాదిరి ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి అవి చెదరగానే కలత రాతిరి ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి అవి చెదరగానే కలత రాతిరి కలల రాతిరీ కథల రాతిరి ప్రేమ కథల రాతిరి కలత రాతిరీ బరువు రాతిరి గుండె బరువు రాతిరి ఎప్పుడో... ఎక్కడో... ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు చంద్రలేఖవా శశిరేఖవా బాటసారివా కాళిదాసువా చరణం: 2 ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ నువ్వు ఊరుకుంటే మీద పడతది ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ నువ్వు ఊరుకుంటే మీద పడతది మీద పడతదీ మోజుపడతదీ పెళ్ళి మోజు పడతది గట్టి పడతదీ కట్టమంటది తాళి కట్టమంటది ఎక్కడో... ఎప్పుడో... ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు బాలరాజువా దేవదాసువా భద్రకాళివా చండీప్రియవా పాటల ధనుస్సు ఎక్కడో... ఎప్పుడో...
ఆటా తందాన తానా తానా పాట పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, యస్. జానకి ఆటా తందాన తానా తానా పాట
తోలిసారి పలికేను పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు తోలిసారి పలికేను
ఉదయమా ఉదయంచకు పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు ఉదయమా ఉదయంచకు
అమరం అమరం పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దాసరి గానం: యస్.పి. బాలు అమరం అమరం
మా ఇంటి అల్లుడా... పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ మందిరం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల , యస్. జానకి మా ఇంటి అల్లుడా... మాపటేల గిల్లుడా మహా జనానికి మరదలు పిల్లనురో

No comments
Post a Comment