Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tiger Nageswara Rao (2023)




చిత్రం: టైగర్ నాగేశ్వరరావు (2023)
సంగీతం: GV ప్రకాష్ కుమార్ 
నటీనటులు: రవితేజ, నుపూర్ సనూన్ , గాయత్రీ భరద్వాజ్ 
దర్శకత్వం: వంశీ 
నిర్మాత: అభిషేక్ అగర్వాల్ 
విడుదల తేది: 20.10.2023



Songs List:



ఏక్ దమ్... ఏక్ దమ్ పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ నాగేశ్వరరావు (2023)
సంగీతం: GV ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే
ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే
చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే
మందుగుండు కూరి మంటే పెట్టావే

బందోబస్తు బాగున్నా
బంగలావే నువ్వు
దోచుకోడానికే గోడే దూకి వచ్చానే
తాళమే వేసిన
ట్రంకు పెట్టెవే నువ్వు
కొల్లగొట్టి పోకుండా
ఎన్నాళ్లని ఉంటానే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

కోపంగా కళ్లతో కారప్పొడి జల్లొద్దే
ఘోరంగ పూటకో యుద్ధం చెయ్యొద్దే
మొత్తంగ ఆశలే పెట్టుకున్న నీ మీదే
అడ్డంగా అడ్డంగా తలాడించి చంపొద్దే

పుట్టక పుట్టక ఇప్పటికిప్పుడు
పిచ్చిగ ప్రేమే పుట్టిందే
ముద్దని ముట్టక నిద్ర పట్టక
తేడా కొట్టిందే

నచ్చక నచ్చక నచ్చిన పిల్లని
ఎవ్వడు వద్దనుకుంటాడే
కాబట్టే నా ప్రాణం
నిన్నే తెచ్చి ఇమ్మంటున్నాదే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

తీరిగ్గా నువ్వలా ఆలోచిస్తా కూర్చుంటే
ఈలోగా పుణ్యకాలమంతా పోతాదే
కాబట్టే ఇప్పుడే నచ్చానని చెప్పేస్తే
ఈరోజే ఈరోజే మోగించేద్దాం బాజాలే

అచ్చట ముచ్చట తీరకపోతే
వయసే వెర్రెక్కిపోతాదే
అచ్చిక్క బుచ్చిక్క లాడకపోతే
ఉసూరంటాదే

వెచ్చగ వెచ్చగ మచ్చిక అయితే
లోకం పచ్చగ ఉంటాదే
పచ్చల్లో పడకుండా
కచ్ఛా బాదంలాగ ఉండొద్ధే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే
ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే
చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే
మందుగుండు కూరి మంటే పెట్టావే

బందోబస్తు బాగున్నా
బంగలావే నువ్వు
దోచుకోడానికే గోడే దూకి వచ్చానే
తాళమే వేసిన
ట్రంకు పెట్టెవే నువ్వు
కొల్లగొట్టి పోకుండా
ఎన్నాళ్లని ఉంటానే



వీడు పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ నాగేశ్వరరావు (2023)
సంగీతం: GV ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

పంతం కోసం ఆకలే… వీడు
అధికారం కోసం మోహమే… వీడు
ఐశ్వర్యం కోసం అత్యాశే… వీడు

అందరు ఆగిపోయిన చోట
మొదలౌతాడు వీడు
అందరిని భయపెట్టే చీకటినే
భయపెడతాడు వీడు
అవసరమనుకుంటే తన నీడను
వదిలేస్తాడు వీడు
సచ్చిపోయేటప్పుడు ఏదో
తీసుకుపోయే వాడు వీడు

హే, నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే
తా నన్నన్నే నానే నానే నానా
హే, నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే
తా నన్నన్నే నన్నెన్నానే నానా

వీడు, హా… వీడు, హా
ఎదురొచ్చిన వాన్ని తొక్కేస్తాడు వీడు
వీడు, హా… వీడు, హా
ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు
వీడు, హా… వీడు, హా
ఎదగడమే జన్మహక్కంటాడు వీడూ…

కామం అంటే కోరుకోవడం
కోరిక లేని బ్రతుకే శూన్యం
కరుణే లేని ఈ లోకంలో
క్రోధం అన్నది కాచే కవచం

నష్టం చేసే నలుగురిలోన
లోభం అన్నది ఎంతో లాభం
మెత్తగ ఉంటే మొత్తేస్తారు
మదమే ఇప్పుడు ఆమోదం

వేడికి వేడే శీతలం
మత్సరమే మంచి ఔషధం
దుర్జనులుండే ఈ లోకంలో
దుర్గుణమే సద్గుణమంటాడు, వీ–డు

నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే
తా నన్నన్నే నన్నెన్నానే నానా

వీడు, హా… వీడు, హా
ఎదురొచ్చిన వాన్ని తొక్కేస్తాడు వీడు
వీడు, హా… వీడు, హా
ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు
వీడు, హా… వీడు, హా
ఎదగడమే జన్మహక్కంటాడు వీడూ…



ఇచ్చేసుకుంటాలే పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ నాగేశ్వరరావు (2023)
సంగీతం: GV ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: సిందూరి విశాల్ 

ఇచ్చేసుకుంటాలే
నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేసుకుంటాలే
నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే

కొప్పుల్లో ఓ మల్లెచెండులా
నిన్ను ముడిచేసుకుంటాలే
బువ్వలో ఉల్లిపాయలా
నిన్ను కొరికేసుకుంటాలే

నా పంచ ప్రాణాలు
నా ముద్దుమురిపాలు
ముడుపల్లె కట్టాను నీకోసమే
నువ్వొచ్చీ రాగానే నీకిచ్చుకోకుంటే
నా మనసు తిడతాదిలే

ఇన్నాళ్లు ఈ సిగ్గు ఏ సంతకెళ్ళిందో
ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే
గుండెల్లో ఉన్నోడు గుమ్మంలోకొచ్చాడు
అని ఎవరో చెప్పుంటారే

చెప్పింది నాతో ఈ తాళిబొట్టు
తనలోన నిన్నే దాచేసినట్టు
పట్టింది అంటే, హా ఆ ఆ, ఈ చెమట బొట్టు
నీ చూపు నన్నే చుట్టేసినట్టు

హే ఎక్కువ చప్పుడు చెయ్యొద్దు అంటూ
పట్టీల కాళ్ళట్టుకోవాలే
అల్లరి కొంచం తగ్గించమంటు
గాజుల్ని బతిమాలుకోవాలే
కావిళ్ల కొద్దీ కౌగిళ్లు తెచ్చి
మన మధ్య పొయ్యాలే

ఇచ్చేసుకుంటాలే
నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేసుకుంటాలే
నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే

నా ఒంటిమీద నీ గోటిముద్ర
చెరిపేసేనంటా నా కంటినిద్ర
నా గుండె పైనా, మ్ మ్, నీ వేలిముద్ర
దాచేది ఎట్టా ఓ రామసెంద్రా

హే రేయిని తెచ్చి రాయికి కట్టి
మనతోటే ఉంచేసుకోవాలే
తెల్లారిందంటూ కూసేటి కోడిని
కోసేసి కూరండుకోవాలే
నా బొట్టుబిళ్లకి రెక్కలు వచ్చి
నీ మీద వాలాలే

ఇచ్చేసుకుంటాలే
నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేసుకుంటాలే
నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే

పిచ్చిగా నచ్చినట్టుగా
నిన్ను పిలిచేసుకుంటాలే
చక్కగా మొక్కజొన్నలా
నిన్ను ఒలిచేసుకుంటాలే

నా పంచ ప్రాణాలు నా ముద్దుమురిపాలు
ముడుపల్లె కట్టాను నీకోసమే
నువ్వొచ్చీ రాగానే నీకిచ్చుకోకుంటే
నా మనసు తిడతాదిలే

ఇన్నాళ్లు ఈ సిగ్గు ఏ సంతకెళ్ళిందో
ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే
గుండెల్లో ఉన్నోడు గుమ్మంలోకొచ్చాడు
అని ఎవరో చెప్పుంటారే


No comments

Most Recent

Default