చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరే నిగమ ఝరే స్వరలహరే
సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ద ప ప
సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ని ద ప
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయ్యంగానె లాభసాటి బేరం
ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ?
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాదా
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపి కొండలా నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరీ
Andamgalena Song Lyrics in Telugu – Godavari (2006)
'Andamgalena' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by Sunitha Upadrashta.
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: సునీత
అందంగాలేనా అసలేం బాలేనా
అంత లెవలెందుకోయ్ నీకు ఉఁ
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే మాటవరసకి
కలికి చిలకనాయే కలత నిదురలాయే
మరువలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వోచ్చి అడగాలి అన్నట్టు
నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
నీకు మనసు ఇచ్చా ఇచ్చి నపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ
తెలుగు ఆడపడచు తెలుపలేదు మనసు
మహాతెలియనట్టు నటనలే అది
ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను
తరగల్లే నురగల్లే ఏనాడు
తాకేసి తడిపేసిపోలేదుగా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
Manasa Gelupu Song Lyrics in Telugu – Godavari (2006)
'Manasa Gelupu' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by Shankar Mahadevan, K. S. Chithra and K. M. Radha Krishnan.
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్, చిత్ర, కె.యమ్. రాధాకృష్ణన్
విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా
పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా
ఈ దేశం అందించే ఆదేశం నీకేరా
ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా
రేపు మాపు నీవేరా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవెరా
తలకుల తారల్లో వెలుగుల ధారల్లో
తలకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...
చరణం: 1
మనస్సులోనే మార్గముంది తెలుసుకోర ఇక
పూరి లేని దేని బాణమింక చేరుకోదు ఎలా
ప్రతి రోజు నీకొక పాఠమే
చదువుకుంటూ పద
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృదా
చరణం: 2
ఆమనొస్తే కొమ్మల్లన్ని కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైన రాముడైనది ప్రేమ కోసం కదా
ప్రతి జీవితం ఓ వెలుగు నీడల
బొమ్మలాటే కదా
Tippulu Tappulu Song Lyrics in Telugu – Godavari (2006)
'Tippulu Tappulu' song from Godavari (2006) movie is composed by K. M. Radha Krishnan and sung by Shreya Ghoshal.
చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: గాయత్రి
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ...
మధురవదన నళిననయన మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకి...
చరణం: 1
ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి...
చరణం: 2
ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి...
చరణం: 3
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే
చూసుకోమని మనసు తెల్పి మనసు మాటలు కాదుగా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట
ఇందువదన కుందరదన మందగమన భామా
ఎందువలన ఇందువదన ఇంతమధన... ప్రేమా...