Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Alluri Seetarama Raju (1974)




చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
నటీనటులు: కృష్ణ, విజయనిర్మల
దర్శకత్వం: వి.రామచంద్ర రావు
నిర్మాతలు: జి. హనుమంతరావు, జి. అదిశేషగిరి రావు
విడుదల తేది: 01.05.1974



Songs List:



రగిలింది విప్లవాగ్ని పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

రగిలింది విప్లవాగ్ని ఈరోజు
అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు

తనువులోన అణువణువూ తరతరాల పోరాటం
తన రూపే దాల్చింది ఝాన్నీరాణి కరవాలం
జలియన్ వాలాబాగున జరిగిన మారణ కాండ
తలచి ఎగురవేశాడు తిరుగుబాటు జెండా
తిరుగుబాటు జెండా

కన్నెగంటి హనుమంతు వెన్నలోని బాకు
కత్తిగట్టి సాగమంది కడవిజయం వరకు
ఎలుగెత్తెను ఆ కంఠం మనదేరాజ్యం
జపియించెను ఆ వదనం "వందేమాతరం”

వందేమాతరం మంటూ నినదించిన బంగారం
స్వరాజ్యమ్మ జన్మహక్కని చాటిన మహరాష్ట్ర,
హించకు ప్రతి హింస అన్న వీరభూమి పాంచాలం
అన్నిటికి నెలవాయను ఆంధ్ర వీర హృదయం




వస్తాడు నా రాజు ఈ రోజు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: డా౹౹. సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాల పైన
కార్తీక పున్నమి వేళలోన

కలికి వెన్నెల కెరటాల పైన
తేలి వస్తాడు నా రాజు ఈ రోజు

వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి
వీచే గాలీ వినిపించేను
ఆతని పావన పాదధూలికై
అవని అనువనువు కలవరించేను
అతని రాకకై అంతరంగమె
పాల సంద్రమై పరవసించేను
పాల సంద్రమై పరవసించేను

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

వెన్నెలలెంతగ విరిసినగాని
చంద్రున్నీ విడిపోలేవూ
కెరటాలెంతగ పొంగినగానీ
కడలిని విడిపోలేవూ
కలిసిన ఆత్మల అనుబంధాలు
ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైన దారులు వేరైన
తనువులు వేరైన దారులు వేరైన
ఆ బంధాలే నిలిచేనులే
ఆ బంధాలే, నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాల పైన
వస్తాడు నా రాజు ఈ రోజు




జంబైలే జోరు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల

జంబైలే జోరు జంబరు హైలేసా హైలేసా
ఎయ్ ఎయ్ ఎయ్ రా - పుంజు
అడుగు ముందుకు ఎయ్ పుంజూ
జారు జారు సినదానా చారడేసి కళ్ళదానా
జారుసిగా వాలిపోయే జాజిపూలు రాలిపోయే
పట్టుర పట్టు హైలేసా ఒదిలితె ఒట్టు హైలేసా
లాగిలాగి రొప్పొచ్చే కంట్రాక్టరు చిప్పిచ్చే
అప్పులోడి పీడ ఎచెప్ప - చెప్పరాని తిప్పలొచ్చే
జంబైలే
ఆరణాల కూలి అని ఆరు కాసులిచ్చారు
ముఠాదారు నాయాళ్లు కొంప కెసరు పెట్టారు

ఆయ్యో ఆడవోళ్ళ యెంటపడి సిగ్గుదీశారు
అయ్యో - మొగ వాళ్ళ ఎముకలన్నీ నుగ్గుజేశారు
ఏ దేవుడైన దిగివచ్చి ఆదుకోడా
ఈ దిక్కులేని వారి
వాళ్ళ ఎతలు తీర్చిపోడా
హైలేసా హైలేసొ




శ్లోకము పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: 
గానం: బాలమురళికృష్ణ, యస్.పి.బాలు

కలమురళీ వరవాజిత కూజిత కోకిల మంజుల మంజురతే
మిళిత మిళింద మనోహర గుంభిత రంజితశైల నికుంజగతే
మృగగణ భూత మహా శబరీగణ రింగణ సంభ్రుత కేళిభ్రుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక వన్దిని శైలనుతే

దనుజ సుసంగ రక్షణ శుంగ వరిన్పుర వంగ నటత్కటకే, కనక
నిషంగ ప్రుష్కత నిషంగ రసద్భట బ్రుంగ హటావట కే హతి
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక వన్దిని శైలనుతే



కొండదేవత పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి

కొండదేవత నిన్ను కొలిచేనమ్మా
కోటికోటి దండాలు ఓలమ్మా
వేయి కళ్ళతో మమ్ము సూడాలమ్మా
యెన్ను కాచి వుండాలి ఓలమ్మా
కొండ
పోతుగడ్జపై పుట్టామమ్మా విల్లంబులు చేపట్టామమ్మా
వీర కంకణం కట్టామమ్మా జాతి పౌరుషం నిలబెడతాం
ఏటుకొక్క తల ఎగరేస్తాం
తుపాకి గుళ్ళకు ఎదురు నిలుస్తాం
మర ఫింగులను మసి మసి చేస్తాం
మాపై దయవుంటే తల్లీ నింగిని నేలకు దించేస్తాం
పరాయితొత్తుల పాతేస్తాం
భద్రాచల శ్రీ రామచంద్రుడే మా సీతారామరాజు
అలనాటి ఆ బాలచంద్రుడే మా సీతారామరాజు
మా కోయగూడెముల కొచ్చాడే, కొండంతబలం మా కిచ్చాడే
మా రాజుకు ఆండగ కలవాలమ్మా
పిలిచిన ఓయని పలకాలమ్మా



తెలుగు వీర లేవరా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, వి.రామకృష్ణ 

పల్లవి:
ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ ఓ...

తెలుగు వీర లేవరా.. ఆ ఆ ఆ.. 
దీక్ష బూని సాగరా.. ఆ ఆ ఆ..

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా..
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....

చరణం: 1
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ ఆ ఆ
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా.. ఆ ఆ ఆ 
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా

నిదురవద్దు..బెదరవద్దు
నిదురవద్దు..బెదరవద్దు
నింగి నీకు హద్దురా.. నింగి నీకు హద్దురా
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....

చరణం: 2 
ఓ ఓ ఓ ఓ ఓ...
ఎవడువాడు?..ఎచటివాడు?
ఎవడు వాడు? ఎచటి వాడు?
ఇటువచ్చిన తెల్లవాడు
కండబలం గుండెబలం
కబళించే దుండగీడు.. కబళించే దుండగీడు
మానధనం.. ప్రాణధనం
దోచుకొనే దొంగవాడు.. దొచుకొనే దొంగ వాడు
ఎవడు వాడు ఎచటి వాడ ఇటు వచ్చిన తెల్లవాడు

తగినశాస్తి చేయరా...తగిన శాస్తి చేయరా ...
తరిమి తరిమి కొట్టరా.... తరిమి తరిమి కొట్టరా..

తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా!
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా!
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....

చరణం: 3
ఈ దేశం... ఈ రాజ్యం...
ఈ దేశం ఈ రాజ్యం .. నాదే అని చాటించి.. నాదే అని చాటించి
ప్రతిమనిషి తొడలు గొట్టి...
శృంఖలాలు పగులగొట్టి..శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపెట్టి...
తుది సమరం మొదలుపెట్టి.. తుది సమరం మొదలుపెట్టి..

సింహాలై గర్జించాలీ... సింహాలై గర్జించాలీ
సంహారం సాగించాలీ... సంహారం సాగించాలీ

వందేమాతరం... వందేమాతరం..
వందేమాతరం... వందేమాతరం..

చరణం: 4
ఓ ఓ ఓ ఓ ఓ...
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
అందుకో మా పూజ లందుకో.. రాజా..
అందుకో మా పూజ లందుకో.. రాజా..
అల్లూరిసీతారామరాజా.. ఆ...అల్లూరిసీతారామరాజా..

ఓ ఓ ఓ ఓ ఓ...
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
మానిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
మా నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా

త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం...
నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం...





ఓ స్వతంత్ర వీరుడా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: 
గానం: 

ఓ స్వతంత్ర వీరుడా స్వరాజ్య భాసుడా
అల్లూరి సీతారామరాజా
అందుకో మాపూజ లందుకో రాజా  
అల్లూరి సీతారామరాజా
తెల్లవాడి గుండెల్లో నిదురించు వాడా!
మా నిదురించిన పౌరుషాన్ని రగిలించినవాడా
నిశ్చయముగ, నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం




Happy Happy Christamas పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: పి.ఆదినారాయణ రావు
గానం: రీటా త్యాగరాజన్

Happy Happy Christamas
Merry Merry Christamas
Let us swing and sway
Swing and sway together

Make we merry Both more and less
For now is the time of
Christamas Christamas Christamas 

Come on Rejoice Rejoice
With Heart and soul and voice
For now is the time of
Christamas Christamas Christamas 




విప్లవం మరణించదు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
విప్లవం మరణించదు వీరుడు మరణించడు
వేయి వేలరూపాల వెలుగుతుంది విప్లవాత్మ

పల్లవి:
ఓ విప్లవజ్యోతి జోహారు ఓ పరిప్లవశక్తి జోహార్లు
నీ పేరే ప్రజాశక్తి సంకేతం నీ బ్రతుకే దేశానికి సందేశం 

చరణ: 1
నీ వెగరేసిన సమర పతాకం నేతాజీ దరియించాడు
సాయుధ శక్తులు జై హిందంటూ సంగ్రామమ్మను సలిపారు

చరణం: 2
మధుర స్వప్నం మహిత స్వరాజ్యం
గాంధీ నెహ్రూ తెచ్చారు
జననికి విడుదల జాతికి పండగ
జెండా ఉంచా రహే హమారా


Most Recent

Default