చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
నటీనటులు: యన్. టి. రామారావు, అంజలీ దేవి
దర్శకత్వం: ఘంటసాల బలరామయ్య
నిర్మాత: ఘంటసాల కృష్ణమూర్తి
విడుదల తేది: 28.05.1954
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: జిక్కీ (పి. జి. కృష్ణవేణి)
ఆ మనసేమో ఆ సొగసేమో
ఆ మనసేమో
గారామో అది మారామో
ఆ తీరే...వేరేమో
మనసేమో సొగసేమో
లాలనగా రారా రమ్మని
లాలనగా రారా రమ్మని
మాలిమైన జవరాలిపైన
మాలిమైన జవరాలిపైన
జాలి లేదో...జాలి లేదో మరీ మరీ
బ్రతి మాలించుకోవాలో
బ్రతిమాలించుకోవాలో
ఆ మనసేమో ఆ సొగసేమో
గారామో అది మారామో
ఆ తీరే...వేరేమో
మనసేమో సొగసేమో
నీరనితనమా నెరజాణ తనమా
నీరనితనమా నెరజాణ తనమా
సరసాల వేళలో చెరసాలె సుఖమేమో
సరసాల వేళలో చెరసాలె సుఖమేమో
మనసేమో ఆ సొగసేమో
గారామో అది మారామో
ఆ తీరే... వేరేమో
మనసేమో సొగసేమో
****** ******* ******
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: జిక్కీ (పి. జి. కృష్ణవేణి)
ఎక్కడిదీ...
ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం
ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం
వెలిగే ఆనందం చెలరేగే ఆనందం
ఎక్కడిదీ ఆనందం
లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది
లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది
మారుని జవరాలికైనా వంకలు దిద్దే వన్నెది
మారుని జవరాలికైనా వంకలు దిద్దే వన్నెది
వెన్నెల దీపల్లె మెరుపూతీవల్లె
వెన్నెల దీపల్లె మెరుపూతీవల్లె
ఏడుమల్లె పూవులెత్తు
తూగే బంగారుపాప ఎవరో
ఏలేవేరెవరో కలలేలేవారెవరో
ఎన్నెన్నో ఊహలు కొసరే కోరికవేళ
ఎన్నెన్నో ఊహలు కొసరే కోరికవేళ
మేల్ మేల్ నెయ్యములు మిడిసే వేడుక వేళ
మేల్ మేల్ నెయ్యములు మిడిసే వేడుక వేళ
చిక్కని మక్కువల చక్కలి గింతలవేళ
చిక్కని మక్కువల చక్కలి గింతలవేళ
ఊహల ఉయ్యాలలో ఊగే బంగారు పాప ఎవరో
ఏలేవారెవరో కలలేలేవారెవరో
ఏలేవారెవరో
****** ******* ******
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: పి. లీల
ఒంటరొంటరిగ పోయెదానా
ఒకమాట వినిపో ఒకమాట వినిపొ
ఒంటరొంటరిగ పోయెదానా
ఒకమాట వినిపో ఒకమాట వినిపొ
ఆడేపాడే ఆడేపాడే ఈడున
తోడుండాలి సైదోడుండాలి నానా ఓ నానా
అదిగదిగో చిట్టడవి అల్లదిగో నట్టడవి
సింహాలుంటాయ్ సివంగులుంటే
రేసులుంటాయ్ దోబూచులుంటాయ్
నాన్న రేసులుంటాయ్ దోబూచులుంటాయ్
ఉసుకోమంటే....ఉసుకోమంటే
ఉలిక్కిపడతావ్ నానా ఓ నానా
తేరతేరగా దొరికిందంటూ
దొర మనసూ దోచుకుపోతావ్
తేరగా దోచుకుపోతవ్
తేరతేరగా దొరికిందంటూ
దొర మనసూ దోచుకుపోతావ్
తేరగా దోచుకుపోతవ్
నిన్నంటే కన్నెత్తనంటావ్
పలుకరిస్తే పన్నెత్తనంటావ్
ఓ మైనా... ఈ పైన
ఓ మైనా... ఈ పైన
చీటికి మాటికి కోపాలైతే
చిరాకు పెడితే చిక్కున పడతావ్
నానా ఓ నానా
ఓ నానా ఓ నానా
****** ******* ******
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: పి. లీల
అయ్ సంబరమే
అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా
అయ్ సంబరమే
మరోసారి వాదులాడ
వేడుకైనదో ఏమో ఆ జాణకు
సరేకాని ఇంకోపాటా పాడించనా
దరిజేరి ఇంకో ఆట ఆడించనా
కంటికి బందం వేసి బలేపిల్ల గీర
కంటికి బందం వేసి బలేపిల్ల గీర
ఎటు మారిపోవునో ఏమో
అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా
అయ్ సంబరమే
తనో అందగాడేలే చిందులాడి చిన్నదాని
ఒక చూపులోనే మెచ్చి తలక్రిందులాయెలే
తనో అందగాడేలే చిందులాడి చిన్నదాని
ఒక చూపులోనే మెచ్చి తలక్రిందులాయెలే
దారికి రానే రానీ దారికి రానే రానీ
సరాగాల బాణి
ఎటుమారిపోయెనా కానీ
అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా
అయ్ సంబరమే
****** ******* ******
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: పి. లీల
ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే
తలక్రిందుల మారి కలికాలంలో
చెడిపోలేనివారూ చేతకానివారే
తలక్రిందుల మారి కలికాలంలో
చెడిపోలేనివారూ చేతకానివారే
అంటుంది నానా నమ్మమంటుంది నానా
అంటుంది నానా
రూకల సంచీ రొండిన గ్రుచ్చితే
రొమ్ము విరుపొచ్చిందా మొనగాడా
కరుకుందా కాళ్ళకు కదనుందా
ఒరతీయని చురకత్తికి పదునుందా
మనలో కదనుందా పదునుందా
పాగా చుట్టావ్ పగడీ పెట్టావ్
వేషం కట్టావ్ మీసం మెలేశావ్ దొర కొడుకా
పాగా చుట్టావ్ పగడీ పెట్టావ్
వేషం కట్టావ్ మీసం మెలేశావ్ దొర కొడుకా
అడవుల్లో పులికి ఆకలేసి
నీ మీదికి ఒక దుముకు దుమికితే
నిలబడి కలబడతావా?
లాలించి లంచం పెడతావా హోయ్
నిలబడి కలబడతావా?
లాలించి లంచం పెడతావా
ఆ... లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని ఏం లాభం
లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని
ఆ... లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని ఏం లాభం
మీ జగం కాదు ఈ యుగం వేరు తాతా
తరాల్ మారి సంబరాల్ మీరినయ్ తాతా
మీ జగం కాదు ఈ యుగం వేరు తాతా
తరాల్ మారి సంబరాల్ మీరినయ్ తాతా
ఓ తాతా
ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే
No comments
Post a Comment