Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

College Bullodu (1992)





చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, హరీష్
దర్శకత్వం: శరత్
నిర్మాత: పి. బలరాం
విడుదల తేది:02.07.1992



Songs List:



అందమా ఇలా అందుమా పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అందమా ఇలా అందుమా



చమ చమ చమ పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

చమ చమ చమ 



ఎంతో మధురమీ జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
ఎంతో మధురమీ జీవితం అంతే లేని ఓ అద్భుతం 
అనుదినం అనుభవం పరువమే పరిమళం 
సాయంత్రం తెల్లారే రేయంతా పగలాయే నా చదువు సంధ్యల్లో...
కలలన్నీ సత్యాలే కదలాడే దృశ్యాలే కాలేజీ రోజుల్లో 
నవ్వేది నవ్వించేది నా పాత్ర మీ మధ్యలో 

చరణం: 1
అరవై యేళ్ళా ఆనందం 
ఇరవై యేళ్ళా తారంగాలే...
మనకు సొంతాలే...
సిక్సో క్లాక్ సిద్ధాంతం 
సిలబస్సంతా రాద్ధాంతాలే...
తిరగరాస్తాలే...
మళ్ళీ మనసుపడి తిరిగివచ్చిందీ ఉదయం 
మాళ్లే మనసులలో పిలిచే టీనేజీ హృదయం 
వయస్సంటే మనసు అదే నాకూ తెలుసూ...ఓ...ఓ....ఓ...

చరణం: 2
అంతేలేని ఆకాశం 
ఎంతో వున్న అవకాశం
దొరికె ఈనాడే...
సాహిత్యంసేవించాలి 
శ్రుతులతో నేడే...
జానేదో లోకం మనము రాసిందే శ్లోకం 
ఏమైనా రాగం మనము వేసిందే తాళం
ఒకే చాన్సు బ్రతుకు...భరోసాగా బతుకూ...ఓ..ఓ..ఓ...




రాగింగ్ అంట పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

రాగింగ్ అంట 




ఏమి హాయిలే పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఏమి హాయిలే

Palli Balakrishna Wednesday, May 12, 2021
Maa Variki Pelli (1993)


చిత్రం: మావారికి పెళ్లి (1993)
సంగీతం: శంకర్ గణేష్
నటీనటులు: ఆనంద్ బాబు, సితార
దర్శకత్వం: రామనారాయణ
నిర్మాతలు: నార్నే శ్రీనివాస రావు, ఎన్. డి. విజయబాబు
విడుదల తేది:26.01.1993



Palli Balakrishna
Aalu Magalu (1995)


చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
నటీనటులు: సుమన్, మీనా, ఆమని
దర్శకత్వం: సాగర్
నిర్మాత: కె.విజయలక్ష్మి ప్రసాద్
విడుదల తేది: 26.01.1995

చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, ఎం. ఎం. శ్రీలేఖ

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ  మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

మృదువయిన రేఖ మధుమాస లేఖ
అది అందినాక కుదురేదికా
విరబూసినాక  దరహాస రేఖ
విరితేనెవాకా  ఎద నిండగా
వెలుగు చిలుకు కోరిక ఇలకు దిగిన తారక
మదన కధల తొలి వేదికా....
మునిమాపుల కనుపాపల మణి గీతిక నీవేనే మల్లి మల్లి...

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

సుకుమారమైన కుసుమారివైనా రసరాజ్యమేలే నా రాణివే...
నెలరాజుకైన వలరాజుకైనా విరహాలు రేపే నేర జాణవె
పడుచు కలల గీతిక కవి తలపులు కదలిక పరిమళాల స్వరమాలికా
నీ వన్నెలు నీ చిన్నెలు ఎన్నెన్నని వర్ణించనె మల్లి... మల్లి...

Palli Balakrishna
Aalu Magalu (1977)



చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఎ. వి. సుబ్బారావు
విడుదల తేది: 11.03.1977



Songs List:



ఎరక్కపోయి వచ్చానూ పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఎరక్కపోయి వచ్చానూ



చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ... బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
ఇవ్వాలని లేదా ఏమీ....
ఆ సాగసంతా ఇవ్వాలని లేదా ఏమీ
ఓ సిరిపాపా ఎన్నాళ్లు దాస్తావేమీ...

చరణం:1
ముట్టుకుంటే ఉలికిపడతావ్
పట్టుకుంటే జారిపోతావ్ 
ముట్టుకుంటే ఉలికిపడతావ్
పట్టుకుంటే జారిపోతావ్ 
నీ చూపుల్లో ఉందీ సూదంటూరాయీ
అది లాగుతుంటే ఒళ్లంతా హాయి

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ...బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....

చరణం:2
చేరుకుంటే ఊరుకుంటావ్
వల్లకుంటే గిల్లుతుంటావ్
చేరుకుంటే ఊరుకుంటావ్
వల్లకుంటే గిల్లుతుంటావ్
నీ చేతల్లో ఉంది చెకుముకి రాయి
అది రాసుకుంటే చురుకైన హాయి

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
ఇవ్వాలని లేదా ఏమీ....
ఆ సాగసంతా ఇవ్వాలని లేదా ఏమీ
ఓ సిరిపాపా ఎన్నాళ్లు దాస్తావేమీ...

చరణం: 3
నిన్ను కట్టుకోవాలని మనసాతది.
చేయి పట్టుకోవాలంటే గుబులౌతది
నిన్ను కట్టుకోవాలని మనసాతది.
చేయి పట్టుకోవాలంటే గుబులౌతది

గుబులెందుకింకా గారాల చిలకా
ఎగిరెగిరిపోదాము సెలవంక దాకా

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ... బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....




ఒక్కరిద్దరుగ మారేది పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: వి. రామక్రిష్ణ, పి.సుశీల

ఒక్కరిద్దరుగ మారేది




పరుగెత్తి పాలుతాగేకంటె పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల, మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మి శర్మ 

పరుగెత్తి పాలుతాగేకంటె




ర ర ర ర రంకెవేసిందమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

ర ర ర ర రంకెవేసిందమ్మో



తెలుసుకో ఈ జీవితసత్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: యస్.పి. బాలు

తెలుసుకో ఈ జీవితసత్యం

Palli Balakrishna
Satya Harishchandra (1965)
చిత్రం: సత్యహరిశ్చంద్ర (1965)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్ టి. రామారావు, ఎస్. వరలక్ష్మి
దర్శక నిర్మాత: కె. వి. రెడ్డి
విడుదల తేది: 22.04.1965


Palli Balakrishna Tuesday, May 11, 2021
Ratnamala (1948)
చిత్రం: రత్నమాల (1948)
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: పి. భానుమతి, గోవింద రాజుల సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, సి. ఎస్ ఆర్. ఆంజనేయులు
దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణ సంస్థ: భరణీ పిక్చర్స్
నిర్మాత: పి. ఎస్. రామకృష్ణా రావు
విడుదల తేది: 02.01.1948

Palli Balakrishna
Paape Maa Pranam (1989)



చిత్రం: పాపే మా ప్రాణం  (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, చిత్ర
నటీనటులు: కృష్ణం రాజు, సుహాసిని, బేబీ దీప్తి , శరత్ బాబు 
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: జయకృష్ణ
నిర్మాణ సంస్థ: జయకృష్ణ మూవీస్
విడుదల తేది: 21.04.1989



Songs List:



చిట్టి పొట్టి చిట్టెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: పాపే మా ప్రాణం  (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, చిత్ర

చిట్టి పొట్టి చిట్టెమ్మ




ఎదే మౌనం పాట సాహిత్యం

 
చిత్రం: పాపే మా ప్రాణం  (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, చిత్ర

ఎదే మౌనం 



అల్లి బిల్లి ఊహల్లో పాట సాహిత్యం

 
చిత్రం: పాపే మా ప్రాణం  (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, చిత్ర

అల్లి బిల్లి ఊహల్లో 




విధి ఓ గాయమై పాట సాహిత్యం

 
చిత్రం: పాపే మా ప్రాణం  (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, చిత్ర

విధి ఓ గాయమై 



గగనాలుకేగిన పాట సాహిత్యం

 
చిత్రం: పాపే మా ప్రాణం  (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, చిత్ర

గగనాలుకేగిన 

Palli Balakrishna
Geetanjali (1948)
చిత్రం: గీతాంజలి (1948)
సంగీతం: కె. ప్రకాశ రావు
సాహిత్యం:
గానం:
నటీనటులు:
దర్శకత్వం: టి. హనుమంతరావు
నిర్మాణ సంస్థ: శ్యామలా ఫిల్మ్స్
విడుదల తేది: 05.03.1948

Palli Balakrishna
Drohi (1948)



చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
నటీనటులు: సి.లక్ష్మీరాజ్యం, కె.ఎస్.ప్రకాష్ రావు, జి.వరలక్ష్మి, ఎల్.వి.ప్రసాద్
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాణ సంస్థ: స్వతంత్ర ఫిల్మ్స్
విడుదల తేది: 10.12.1948

( పెండ్యాల నాగేశ్వరరావు గారికి  మ్యూజిక్ డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా )



Songs List:



ఆలకించండి బాబూ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: కె.జమునారాణి

ఆలకించండి బాబూ
ఆదరించండి బాబూ
అదుష్టమున్నా అయ్యల్లారా
అదుష్టమున్నా అమ్మల్లారా

పాలు నేయి పాయసాలతో
చాలినంత భోం చెయ్యండి
పల్చని గంజయినా
మాపాలిటికింత పోయండి

రంగు రంగుల చీరలు పేరులు
సింగారంగా కట్టండి
చింకి పేలికలతోనైనా
మా మానము కాచుకపోనీండి

కారులమీదను జోరుజోరుగా
జోరుజోరుగా భయ్యిభయ్యిమని
హాయిహాయిగా తిరగండి
దారిపక్క నొలమూలను
మమ్ము కాళ్లీడ్చుకొని పోనీండి




నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం: జి. వరలక్ష్మి

నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు
నీ పానమే లేకున్న గానమే సున్న
నీ సువాసన సోకక కవితరాదు
కళలకు మూలము నీవే
కాఫీ కళారూపినే కదా ఆహా

ఆహారమే లేకున్న
ప్రేమగాథ లెటు పోయినా
ప్రాణాలు పోయినా సరే
నీవుమాత్రం కావాలి
సిగరెట్ మహావ్యాపివేకదా ఆహా




తృణమో పణమో వెయ్యండి పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:కె. జమునారాణి  & బృందం

తృణమో పణమో వెయ్యండి 
దీనుల బాధలు తీర్చండి
ఉండడాని కిల్లు లేక
తిండి మాట మొదలె లేక
గాలివాన చేత చాల
గట్టి బాధ పొందినారు
కట్టుకోను గుడ్డలేక 
చెట్టుకొమ్మ నీడలేక 
ముక్కు చివర ఊపిరితో
దిక్కుమాలి యున్నారు



పూవు చేరి పలుమారు తిరుగుచు పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల, జి.వరలక్ష్మి 

పూవు చేరి పలుమారు తిరుగుచు 
పాట పాడునది ఏమె తుమ్మెద
పూవులోన తన పోలిక కన్గొని 
మోదము గాంచిన దేమో తుమ్మెద

ఆ సెల ఏటిని తాకుచు తట్టుచు 
చెప్పుచున్నదది ఏమో పూపొద
ఒక క్షణమైనా ఆగి పల్కవని 
కొరకొర లాడునో ఏమో పూపొద

అలరు కౌగిటను అదిమి మావితో
మంతన మాడునదేమో మాలతీ
ఏకాంతముగా ప్రణయ మంత్రమును 
ఉపదేశించునో ఏమో మాలతీ
ఏదిచూచినా ప్రేమయె జగతి 
కాదను వారలు పాషాణాలే




నేడే తీరె నా వాంఛా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: జి.వరలక్ష్మి 

నేడే తీరె నా వాంఛా 
నేడే యీ డేరే
జీవితాశ చేకూరే
ఒంటరిపాటిక నుండదుగా 
జంట తలంపుల పంటగదా 
యింటా బయటా ఎపుడూ
హాయిగ ఉంటామే
సుఖములు గంటామే

ఒకరి మనసులో ఒకరై ఆహా
కలసి మెలసి యీ కాలంబంతా
విలాసములలో వినోదములలో
గడుపుదుమే గడుపుదుమే ఆహా
ప్రేమ నడుపుదు మే




ప్రేమయే కదా సదా విలాసీ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: యం.యస్.రామారావు , జి.వరలక్ష్మి 

ప్రేమయే కదా సదా విలాసీ
ప్రేమే కదా మహా పిపాసి
ఎంతో తనకుండినా యింకా తాకోరునే
ప్రేమతో సాటి నహీఁ జగానా దివినైనా

నిజమీ ప్రేమే కలయీ ప్రేమే
సాధ్యమే కాదే ఏరికైనా
యీ ప్రేమా మహిమా
నోరారా పాడా

యీ ప్రేమాగరిమా
లో కాలా చాటా
యీప్రేమాలీలా విలసాలున్నా
సౌఖ్యాలికేలా స్వర్గాలేలా
ఆహా ప్రేమే కదోయి
జనాళి జీవన మహా




నవ్వనైన నవ్వరాదే బుల్ బుల్ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: పిఠాపురం

నవ్వనైన నవ్వరాదే బుల్ బుల్ బుల్ బుల్ 
నాతో మాటలైన ఆడరాదే బుల్ బుల్ బుల్ బుల్
నిన్ను నమ్ముకున్నా నే బుల్ బుల్ బుల్ బుల్ 
కన్నుగీటి ఔననవే బుల్ బుల్ బుల్ బుల్ 
లోకులేమి అనుకున్నా బుల్ బుల్ బుల్ బుల్ 
నీకేమె నా కేమె బుల్ బుల్ బుల్ బుల్
కన్నుగీటి ఔననవే బుల్ బుల్ బుల్ బుల్ 
ఎందరొస్తె మనకేమె బుల్ బుల్ బుల్ బుల్ 
అందర్నీ తందామె బుల్ బుల్ బుల్ బుల్




చక్కలి గింతలు లేవా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: జి.వరలక్ష్మి 

చక్కలి గింతలు లేవా
చక్కని ఊహలు రావా 
పౌరుచు తారుచు పంతాలాడే
కీర దంపతుల కనగా
తీవలమాఃవుల కౌగలింతలో
పూలు పూచునది కనగా 
జోడును వీడక ఆడే పాడే
జంట జంటలను చూడా





చక్కరు కొట్టుకు వచ్చావా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం: శివరావు, జి.వరలక్ష్మి

చక్కరు కొట్టుకు వచ్చావా
బలె టక్కరి పిల్ల వె చినదానా
టమారి మాటల పిలవాడా
నీ దిమాకు చూపకు నామీద

చక్కరు కొట్టుకు వచ్చావా 
బలె టక్కరి పిల్ల వె చినదానా 
ఊసుపోక అటు తిరిగివచ్చితే 
మీసం తిప్పా వెందుల కోయ్
రోసం చూపావెందులకోయ్

పన్ను నొప్పికై నిన్న వచ్చిన 
చిన్న వాడికై పోలేదా 
పోతేనేం ?
అహ పోలేదా?
పోయాను
పన్ను నొప్పి పోగొట్టావా ? 
ఒళ్లూ నొప్పని చెప్పాడోయ్ 
సెంటు వాసనలు గుమ్మంటున్నాయ్ 
ఆఁ అత్తరు సాయెబు
అతడొకడా
మచ్చుచూపినా డంతేనోయ్
అయితే నాపని యింతేనా




ఓహోరోజా పూలా రాజా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:

ఓహోరోజా పూలా రాజా పూలారాజా 
ఆహా నీదే జన్మ
పూచావే తావినించా నే
శిరసుల పై మెరసితివే
ఆహా చిన్నారివే
ఆహా పొన్నారివే
ఓదినమైనా లోకులు పొగిడే
జీవనమహా
బ్రతుకనగా యిదియే యిదియే




ఎందుకీ బ్రతుకూ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: కె.జమునారాణి

ఎందుకీ బ్రతుకూ 
ఆశలేని ఎడారియేకదా
ప్రాణమిచ్చిన తాతపోయె 
అంత పెంచిన అమ్మ బాసె
ఆదరించిన బాబు మారెను
ఆప్తులే చెడ తిట్టిరే

ఎంత భ క్తిని సేవ చేసినా
యింతగా ఆపనింద వచ్చె
ఎవరు నాయను వారులేరే
ఏమనందునిక




యిది యేనా నీ న్యాయము దేవా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: యం.యస్.రామారావు 

యిది యేనా నీ న్యాయము దేవా
యీ వలపక్షము తగునా
పాలు నేయీ కొందరికిచ్చి
పచ్చని గంజీలేకెందరినో
పస్తులలో పడిచావమందువా దేవా
పేరులు చీరలు కొందరికిచ్చి
పేలికలైనా లేకెందరినో
మానహానితో బ్రతుకమందువా దేవా





సరిసరి మాటల మూట పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:

సరిసరి మాటల మూట
సాలును తెల్చె జోలికి రాకోయి
సిరసిర లాడత వేల
సంగ తేమిటో సెప్పగరాదే
తెస్తానని చూపితివాళ
ఏది ఏది కూడూ గుడ్డ
మరిసితివ ఆడినమాట
సాలును తెల్చె జోలికి రాకోయి
స్వరాజ్యము వచ్చెనుకదా 
కూటికి గుడ్డకు లోటేలేదే
స్వరాజ్యమొ గిరాజ్య మొ 
మాటల కేమి కోరినదీవోయి

సరాసరి సూడగ రాదే
పరుగులతో వస్తాయన్నీ
అదేకదా కోరినదంతా
ఒంటికి గుడ్డ తింటకి కూడు
స్వరాజ్యము వచ్ఛెనుగదా 
కూటికి గుడ్డకు లోటేలేదే





నరులకు ప్రేమతో చేసిన సేవే పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:

నరులకు ప్రేమతో చేసిన సేవే
నారాయణ సేవా
మహాత్ములంతా పాటించినదీ 
మర్మసూత్ర మొకటే 
జీవన్ముక్తులకున్న కీలకము
పావనజీవుల పరమరహస్యము
ఎంత సూక్ష్మము ఆహా 
దేశంబం టే మట్టికాదు
దేశంబంటే మనుష్యులే
మనుషులు సేవే దేశ సేవయౌ
అదియే మాధవ సేవ
ఎంత సూక్ష్మము ఆహా





మనోవాంఛలు యీగతి కూలిపోయె పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం: జి. వరలక్ష్మి

మనోవాంఛలు యీగతి కూలిపోయె 
హృదయ వేదన యీగతి మారిపోయె
లోకము చీకటాయె
సౌఖ్యము మాయమాయె
ఆశా ... జీవి తాశ ఎటో పారిపోయె
ఏదరి చేరుదానా
ఎవ్వరి వేడుదానా
దీనా నేనే గానా
యిక యీ జగానా




ధన్యవహో మాతాసీతా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:

ధన్యవహా
ధన్యవహో మాతాసీతా
మరణించిననూ చిరంజీవి వహ
సత్యమహింసయే శాశ్వత సుఖమని 
స్వాతంత్ర్యానికి రాజమార్గమని
సకలలోకముల శాంతి మూలమని
చావునకూడా చాటి చెప్పితివే మాతా సీతా


Palli Balakrishna
Yogi Vemana (1947)



చిత్రం: యోగి వేమన (1947)
సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు
నటీనటులు: చిత్తూర్ వి. నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, ఎం. వి. రాజమ్మ, పార్వతి భాయి
దర్శకత్వం: కె. వి. రెడ్డి
నిర్మాణ సంస్థ: వాహిని స్టూడియోస్
విడుదల తేది: 10.04.1947



Songs List:



మనసా మాయను పడకే పాట సాహిత్యం

 
చిత్రం: యోగి వేమన (1947)
సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం:

మనసా మాయను పడకే
మాయను పడకే మనసా
కాయము, కలిమి సతమని నమ్మి

మాయను పడకే మనసా 
మాయను పడకే మనసా 

పాయసంబుతో పెంచిన గానీ
పాతరలో రక్షించిన గానీ
కాయము, కలిమి పోయేవేలే
చేసిన పుణ్యమే చెడని పథార్థము

మాయను పడకే మనసా

నెరమెచ్చులకై చేసిన దానము
పరమునకేమి కొరగాదే
కరుణతోడే నిరుపేదకు వేసిన తిరిపెమే
ఇహపర సాధనమే ఆ తిరిపెమే ఇహ పర సాధనమే

మాయను పడకే మనసా

ఆశ పెంచి ఇల్లాలని, సుతుడని దాసిని పడకే మనసా
ఆశ పెంచి ఇల్లాలని, సుతుడని దాసిని పడకే మనసా
మోసపోకు మీ వ్యామోహముతో 
మోసపోకు మీ వ్యామోహముతో 
చేసిన పుణ్యమే చెడని పథార్థము
చేసిన పుణ్యమే చెడని పథార్థము

మాయను పడకే మనసా
మాయను పడకే మనసా





ఇదేనా ఇంతేనా పాట సాహిత్యం

 
చిత్రం: యోగి వేమన (1947)
సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: చిత్తూర్ వి. నాగయ్య

ఇదేనా ఇంతేనా జీవితసారమిదేనా
అంతులేని ఈ జీవన వైభవమంతయు తుదకు నశించుటకేనా
ఇదేనా ఇంతేనా
బోసి నవ్వులను కువ్వలు బోసే
పసి పాపాల బతుకు ఇంతేనా
జీవితా సారమిదేనా
ఆట పాటల నలరించుచూ
సెలయేటి వోలె వెలివారే బ్రతుకు ఇదేనా ఇంతేనా

కిలకిల నవ్వుచు తొలకరి వలపుల
ఉలకవోయు జవరాలి వయ్యారమా ఇదేనా ఇంతేనా
దాసుకున్న వయసంతయు మగనికి దోచి సు
ఇల్లాలి గతి ఇదేనా ఇంతేనా
పురిటి పాప చిరు పెదవుల  తాకునా
మురిసిపోవు బాలింత బ్రతుకు ఇదేనా ఇంతేనా
తన బలగము ధనధాన్యములను గని
తనిసే ముదుసలి ఏ రాశఫలము
ఇదేనా ఇంతేనా

సకల శాస్త్రములు పారచదివినా
అఖిలా దేశముల ఆక్రమించినా 
కట్టకడకు ఈ కాయము విడచి
మట్టిగలిసి పోవలెనా మట్టిగలిసి పోవలెనా

Palli Balakrishna
Gollabhama (1947)



చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు, ఎస్.హనుమంతరావు
మాటలు, పాటలు: సదాశివ బ్రహ్మం 
గానం: కె. రఘురామయ్య, సి. కృష్ణవేణి
నటీనటులు: కె.రఘురామయ్య, సి.కృష్ణవేణి, అంజలీదేవి
దర్శకత్వం: సి.పుల్లయ్య
నిర్మాణ సంస్థ: శోభనాచల స్టూడియోస్
విడుదల తేది: 22.02.1947



Songs List:



పొద్దోడిసిందే రాయె - ముద్దరాలా పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: సి. కృష్ణవేణి 

పొద్దోడిసిందే రాయె - ముద్దరాలా 
యెదురు పొదల్లోంచి - ఎలుగొచ్చిందే 
సెట్టు సేమల్లోకి సెదరీ పోతాది మందా 
కళ్ళు తెరుసుకోయె - పిల్లదానా 
మళ్ళించుకొనిరాయె గొల్లభామా

కొండెక్కి కూకున్న కోనారిగొల్లడా 
పిల్లంగో నీవూదె నల్లని పిల్లడా
మాటాడి పోదు వొకమాటు రార అల్లుడా 
గొల్లడా - పిల్లడా వకమాటురారల్లుడా
 
పొద్దుపొడి సేముందు నిద్దరోతుంటేను 
నాకాసి సూసి నువు నవ్వుతు నిలుసున్నావు 
కళ్ళు తెరసేతలికి - కనబడక పోనావు 
నీమీద నామనసు నిలిసిందోరల్లుడా




సందమామా - ఓ సందమామా పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య

సందమామా -  ఓ సందమామా
అందమైన ఓ సందమామా
తొలికొండ యెనకాలా  తొంగిసూసీ 
పండువెన్నెల తెచ్చి  పారబోసి
నువ్వు పరుగెత్తిపోతావు ఎందుకోయీ
నిన్ను  పట్టొకో రెవ్వరు బలిమి సేసి  
నువ్వు  అలసీపోతావోయి  ఆగవోయీ !

నిను మాసి ఓ సుక్క - మిలామిలా మెరిసింది
కను సైగ సేసింది తుదకి కలుసుకుంది
పలుకరించవేమి సందమామా
పలు బంగారమ  సందమామా

దూరాన మేఘాన - దోబూచులాడుదువు 
చిరునవ్వు లెందుకో తరుచు దాచుదు నీవు 
తేట తెల్లము సేయ రాదొ ప్రేమా
చాటుమాటూయేల చందమామా



ధన్యతమము నా జన్మ లలనా పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: కె. రఘురామయ్య

ధన్యతమము నా జన్మ లలనా
అగణ్యమగు నీ ప్రేమ కలనా

పుణ్య మేమి నే చేసితినో
లావణ్యరాశి నిను చేకొనగా

ప్రేమ మలచి ప్రతిమ చేసి 
ప్రేమ చిలికి ప్రాణముపోసి 
ప్రేమమంత్ర ముపదేశము చేసి
నాకై నిను నిర్మించే విరించి




ప్రేమసుధా మధురకథా పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య

ప్రేమసుధా మధురకథా 
యెవరరుంగరోయీ యీవసుధా 
కొమ్మకొమ్మకేగీ కొమ్మకొమ్మకేగీ 
తుమ్మెదవై పువ్వులతో అనవలెనా! 

కొమ్మచాటునో ఆకుమాటునో యెచటున్నావని 
అడుగుదునే ప్రేమమల్లికా వెదుకుదునే నీకొరకే॥ 

యెలమావి పైన కలకంఠముతో 
చాటుదు వెందుకు ప్రేమకథా 
గండు కోయిలా వినపడదా నా పలుకే

ప్రణయగానమున తన్మయమైనా
 ప్రేమజీవులకు మాటేలా 
చాటేలా మాటేలా ప్రేమపల్లికా జడుపేలా సిగ్గేలా! 
ప్రేమ సుధా మధురకథా దివ్య భవ్య మహా యీ వసుధ



ఓ - ఓహో యేమే నీ భాగ్యం పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: బృందగానం 

ఓ - ఓహో యేమే నీ భాగ్యం 
మాటలాడ విది యేమే
వెరపో, మరపో, వలపో, 
యేమి తెలుప విదేమే
ఓ - ఓహో - యేమీ నీ భాగ్యం !!




ప్రియతమా ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య

ప్రియతమా  ప్రియతమా 
ఆనందమాయె ప్రేమా - ప్రేమా
సుధామూర్తివి - నీ దర్శనమే
ప్రమోదావహం బౌగా
మధురమోహన రూపా  నా
మనోమందిర దీపా
పరితాప భారమాప రావోయి

జీవితమున యీ దినమే - యీదిన మే
శుభదినమౌ - అనుపమశీలా
నిముసమేని వృధ సేయక రావో
జాలమేల నో బాలా యీవేళా

పావన మీ ప్రేమా 
శుభదాయకమౌ ప్రేమా
మధుమంజుల భావనమే
శుభదాయకమా ప్రేమా 




రావోయి రావోయి ఈ రేయి పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: సి. కృష్ణవేణి

రావోయి రావోయి ఈ రేయి ఓ ప్రియతమా 
నే హాయిగ నిద్దురపోవుదునోయి
వేగమే  మేల్కొని  పోవోయి రావోయి

ప్రేమదామములో  నిను గూడి 
ప్రేమ గీతములే పాడి 
ప్రేమలోనే మునిగి తేలుడు
మానస మలరార ప్రియతమా 




హాయినిడేగా రుతుశోభా పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: 

హాయినిడేగా రుతుశోభా రుతుశోభా
నవజీవనమే జగము దోచే 
మై మరపించే రుతుశోభా
యవ్వన వేళా మధురము చాలా 
నేడే నీదౌ జీవన శోభా
యవ్వన వేళా మధురము చాలా 
నేడే నీదౌ జీవన శోభా

కాంతల కౌగిలిలోన కలలుగన 
మనసు మరచెడి వేళా

సుధలు జిలికే పూలలోనే 
ఝుమ్మని తుమ్మెద తేనెల నను
ఆనంద సామ్రాజ్య సుఖ సీమలో 
ఆశలు జిందె వసంతమే 

బ్రతికిన ఫల మనురాగమే 
యువజన వాంఛ యిహసుఖమే 
ప్రణయ సుధామున యవ్వనఫలమే 
సుఖమే యిహ సుఖమే 




వలపు తేనియ లూనిన వనజమీవు పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: కె. రఘురామయ్య, సి. కృష్ణవేణి 

పద్యం:

వలపు తేనియ లూనిన వనజమీవు 
మధుర మధు పిపాసాసక్త మదుప మేను
ఏను నీవాడ నీవు నాదానవు ఇచట 
ఎవ్వరెవరను ప్రశ్నలివేల బాల 





ప్రేమ మధువుల గ్రోల పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం:  కె. రఘురామయ్య, సి. కృష్ణవేణి 

ప్రేమ మధువుల గ్రోల అనురాగ జలదిదే
పావన శీల ఇదే ప్రేమ మధువుల గ్రోల
మధురాతి మాధుర్యమైన నీ ప్రనయంబుతో వివశ్యమాయే
ఆనంద రసానుభూతి నా మన మేమో అతివా రావో 

జీవన వినోదలిలా తమ యవ్వనమున ఈ ప్రేమ 
ప్రణయ జీవులెడబాయగ ఔనా నిముషమైనా 

మధుర మధుర ప్రణయ జలది
ఓల లాడి తన్మయమై 
నీలో నేను నాలో నీవు  లీనమైపోదాము లేదేమెరెకా




ఉన్నావా లేవా కరునింపగ ఓ దేవా పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: సి. కృష్ణవేణి

ఉన్నావా లేవా కరునింపగ ఓ దేవా 
అతి హీనపు బ్రతుకేల నన్ గొనిపోవా
నా ప్రాణపతి నీ సుతునీ మాయముచేసి 
యేకాకినిచేసే దుఃఖాంబుధి త్రోసీ 
యేనాటికి తుదిలేని నా జన్మ మికేలా 

యేపాపము నే చేసితినో కోప మీదేలా 
యేనాటికి నాకష్టముల కంతమె లేదా 
నాకెందుకు శిక్షా యిదియేమి పరీక్షా
జీవచ్ఛవమై దురితముననే మనవలెనా




వద్దువద్దంటే గుర్రాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: 

బుర్ర పాట

వద్దువద్దంటే గుర్రాన్ని పట్టుకొని చెట్టునకు గట్టేడు
యెంటనున్న రాజుకొడుకు గుర్రమడిగితే వుద్దమని వురిమేడు 
సిద్దమ ! నీ లవుడు సెయ్యికలిపేడమ్మ
రాజుకొడుకు రామబాణ మేశాడు
ధరణిమీద ఒరిగేడు నీకొడుకు

తనయా! నేనిక మనగలనా
నీ చిరునవ్వుల మోమే గననీ
జీవితమే వృధాకదా
ప్రాణవాధునీ బాసిన నాకే 
ఆశారేఖా నీవని యనుకొన్నా
నీవే లేనిచో ఘోరనిరాశా |




భూపతిఁ జంపితిన్ పాట సాహిత్యం

 

చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: సి. కృష్ణవేణి

పద్యం

భూపతిఁ జంపితిన్ మగడు భూరి 
భుజంగ ము చేతఁ జచ్చె
నే నాపద జెంది చెంది యుదయార్కుని 
పట్టణ మేగి వేళ్యనై
పాపము గట్టుకొంటి నట పట్టి
విటుండయి రాగఁ జూచి
సంతాపముజెంది యగ్గివడి దగ్ధము
గా కిటు గొల్లభామనై
యీ పని కొప్పుకొంటి నృపతీ ! 
వగ పేటికి చల్ల చిందినన్ !!

Palli Balakrishna
Chandamama (1982)


చిత్రం: చందమామ (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మురళీ మోహన్, మోహన్ బాబు, సరిత
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
దర్శకత్వ ప్యవేక్షణ: దాసరి నారాయణరావు
నిర్మాత: కోవై చెలియన్
విడుదల తేది: 22.07.1982

Palli Balakrishna Saturday, May 8, 2021
Shopping Mall (2010)


 

చిత్రం: షాపింగ్ మాల్ (2010)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్, విజయ్ ఆంటోని
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: హరిచరణ్, చిన్మయ శ్రీ పాద
నటీనటులు: మహేష్ , అంజలి
దర్శకత్వం: వసంత బాలన్
నిర్మాత: సురేష్ కొండేటి
విడుదల తేది: 06.11.2010



నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో...
యద చప్పుడు చేసే శృతి నీవే

ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే ఓ...
యద చప్పుడు చేసే శృతి నీవే

నీ పరువాల పూ జల్లే కురిపించావే
నా మనసును దోచి మాయను చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా

హో.. ఎండల్లోవెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం

నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్ప నా నీడకు అర్దమ్మా లేదే
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. 
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

Palli Balakrishna

Most Recent

Default