చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: హరీష్, రోజా, సురేష్, యమున
దర్శకత్వం: కె. సదాశివ రావు
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 1992
Songs List:
ఆడదై పుట్టి పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
ఆడదై పుట్టి
జీలకర్ర లో ఉంది పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, మనో
జీలకర్ర లో ఉంది
జమకు జమకు జుం (కొంపెక్కి కూసింది నా కోడి) పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
జమకు జమకు జుం
నీలో అల గోదారి పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ
నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ
నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన
నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..
ఓసి దానిమ్మ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి
ఓసి దానిమ్మ
యమ నాజూకు పిలగాడ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి
యమ నాజూకు పిలగాడ
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, హరీష్
దర్శకత్వం: శరత్
నిర్మాత: పి. బలరాం
విడుదల తేది:02.07.1992
Songs List:
అందమా ఇలా అందుమా పాట సాహిత్యం
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
అందమా ఇలా అందుమా
చమ చమ చమ పాట సాహిత్యం
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
చమ చమ చమ
ఎంతో మధురమీ జీవితం పాట సాహిత్యం
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
పల్లవి:
ఎంతో మధురమీ జీవితం అంతే లేని ఓ అద్భుతం
అనుదినం అనుభవం పరువమే పరిమళం
సాయంత్రం తెల్లారే రేయంతా పగలాయే నా చదువు సంధ్యల్లో...
కలలన్నీ సత్యాలే కదలాడే దృశ్యాలే కాలేజీ రోజుల్లో
నవ్వేది నవ్వించేది నా పాత్ర మీ మధ్యలో
చరణం: 1
అరవై యేళ్ళా ఆనందం
ఇరవై యేళ్ళా తారంగాలే...
మనకు సొంతాలే...
సిక్సో క్లాక్ సిద్ధాంతం
సిలబస్సంతా రాద్ధాంతాలే...
తిరగరాస్తాలే...
మళ్ళీ మనసుపడి తిరిగివచ్చిందీ ఉదయం
మాళ్లే మనసులలో పిలిచే టీనేజీ హృదయం
వయస్సంటే మనసు అదే నాకూ తెలుసూ...ఓ...ఓ....ఓ...
చరణం: 2
అంతేలేని ఆకాశం
ఎంతో వున్న అవకాశం
దొరికె ఈనాడే...
సాహిత్యంసేవించాలి
శ్రుతులతో నేడే...
జానేదో లోకం మనము రాసిందే శ్లోకం
ఏమైనా రాగం మనము వేసిందే తాళం
ఒకే చాన్సు బ్రతుకు...భరోసాగా బతుకూ...ఓ..ఓ..ఓ...
రాగింగ్ అంట పాట సాహిత్యం
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
రాగింగ్ అంట
ఏమి హాయిలే పాట సాహిత్యం
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
ఏమి హాయిలే
చిత్రం: బంగారు కుటుంబం (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగేశ్వరరావు , జయసుధ, దాసరి నారాయణరావు, విక్రమ్, హరీష్ , రంభ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కైకాల నాగేశ్వరరావు
విడుదల తేది: 01.01.1994
అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
తోడునీడ తోటలో తోటమాలి సేవలో
పువ్వులారబోసుకున్నా యవ్వనాలలో
ముద్దు చల్లారబెట్టుకున్న సిగ్గు
ఇల్లు తెల్లారి పెట్టుకున్న ముగ్గు
వాంఛ రెట్టింపు చేసుకున్న వద్దు
కొత్త దాంపత్య భావాలు విద్దు
పాల మీద మల్లెపూలు
పంచుకున్నా జీవితాలు ప్రేమలో...
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
బాటసారి యాత్రలో బారసాల ఈ దినం
కోకిలమ్మ పాడుతున్న జోల పాటలో
పుల్లమావిల్లు తీపి తేనె కన్నా
మల్లెపూలేమో ముళ్ళు పక్కలోన
కల్పవృక్షాన్ని నిన్ను కట్టుకున్నా
వంశవృక్షాన్ని నేను పెంచుకున్నా
జంటలైన పావురాలు
కలలుగన్న కాపురాల జోరులో...
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
నటీనటులు: పవన్ కళ్యాణ్, హరీష్ కుమార్, రాశి, రక్ష
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: బి. శ్రీనివాస రాజు
విడుదల తేది: 22.08.1997
Songs List:
గోకుల కృష్ణా గోపాల కృష్ణా పాట సాహిత్యం
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
ఘల్లు ఘల్లుమను మువ్వ సవ్వడుల
ముద్దు బాలుడెవరే
వెన్న కొల్ల గొను కృష్ణ పాదముల
ఆనవాలు కనరే
ఆ... ఆ... ఆ...
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
పదుగురి నిందలతో పలుచన కాకయ్యా
నిలవని అడుగులతో పరుగులు చాలయ్య
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
ఏ నోట విన్నా నీ వార్తలేనా
కొంటె చేష్టలేలరా కోణంగిలా
ఆ.. ఊరంత చేరి ఏమేమి అన్నా
కల్లబొల్లి మాటలే నా రాధికా
చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా
ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా
తెలియని లీలలతో తికమక చేయకయా
మనసుని చూడకనే మాటలు విసరకలా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా
అంతతోనే ఆగెనా ఆ బాలుడు
ఆ..అవతార మూర్తిగా తన మహిమ చాటెగా
లోకాల పాలుడు గోపాలుడు
తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు
మాయని దూరము చేసిన గీతాచార్యుడు
కనుకనే అతని కథ తరములు నిలిచె కదా
తలచిన వారి ఎద తరగని మధుర సుధ
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా
అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా
అందెల సందడితో గుండెలు మురిసెనురా
నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
అందాల సీమలోని పారిజాత పుష్పమ పాట సాహిత్యం
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర
అందాల సీమలోని పారిజాత పుష్పమ
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
వరించి నన్ను చేరుమా...
సుఖాన ముంచి తేల్చుమా...
ప్రియాతి ప్రియతమ ఇదేమి సరిగమ
శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమ
అందాల సీమలోని పారిజాత పుష్పమ
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
చరణం: 1
రా రమ్మంది లేత చెక్కిలి
రేపెట్టింది కొత్త ఆకలి
సిగ్గు మొగ్గ మేలుకుంది తియ్యగ
తేనె ముద్దలారగించు హాయిగ
అంత భాగ్యమ పంచ ప్రాణమ
ఒడిలో చేరనీయుమా... హో
అందాల సీమలోని పారిజాత పుష్పమ
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
చరణం: 2
లాగించేస్తే ప్రేమ జిలేబి
ఏమౌతుందో కన్నే గులాబి
పాలపొంగులాంటిదమ్మ కోరిక
పైటచాటు దాచుకోకే ప్రేమికా
కొంగుజారితే కొంపమునగదా
వాటే రిస్కు మన్మథా
అందాల సీమలోని పారిజాత పుష్పమ
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
వరించి నన్ను చేరుమా...
సుఖాన ముంచి తేల్చుమా...
ప్రియాతి ప్రియతమ ఇదేమి సరిగమ
శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమ
మ్మ్..మ్మ్..మ్మ్...
మనసున్న కనులుంటే ప్రతిచోట పాట సాహిత్యం
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, మాల్గాడి శుభ
తళుక్ తళుక్ మని తళుకుల తార
మిణుక్ మిణుక్ మని మిలమిల తార
ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ... (2)
హా... ఆ... లాల లాల లాలా లాలలా
మనసున్న కనులుంటే ప్రతిచోట
మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా
మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా...
తళుక్ తళుక్ మని తళుకుల తార
మిణుక్ మిణుక్ మని మిలమిల తార
ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ... (2)
మనసున్న కనులుంటే ప్రతిచోట
మధుమాసం కనిపించదా...
చరణం: 1
అలలై ఎగసిన ఆశా నాట్యం చేసే వేళా
అలుపే ఎరుగని శ్వాసా రాగం తీసే వేళా
దిశలన్నీ తలవొంచి తొలగే క్షణం
ఆకాశం పలికింది అభినందనం
అదిగదిగో మనకోసం తారాగణం
తళుకులతో అందించే నీరాజనం
మన దారికెదురున్నదా...
మనసున్న కనులుంటే ప్రతిచోట
మధుమాసం కనిపించదా
చరణం: 2
నవ్వే పెదవులపైన ప్రతి మాట ఒక పాటే
ఆడే అడుగులలోన ప్రతి చోట పూబాటే
గుండెల్లో ఆనందం కొలువున్నదా
ఎండైనా వెన్నెల్లా మురిపించదా
కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా
కష్టాలు కన్నీళ్ళు మరిపించదా
జీవించడం నేర్పదా...
మనసున్న కనులుంటే ప్రతిచోట
మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా
మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా...
లాలాల లలలాల లలలాల లలలాల లాలాల (2)
చిత్రం: ప్రేమ ఖైది (1990)
సంగీతం: రాజన్- నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, కవితా కృష్ణమూర్తి
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము నీ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియ రంజని
నువ్వే ప్రాయం ప్రాణం ఓ ఓ ఓ
ఉగాదులు ఉషస్సులు వలపున రాక
పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
మోడే చిగురించే ప్రణయ కథల్లో
రాలే పూల ఆశల్లోన మధువును నేనై
పిలుపులతో అలిచితిని బదులిక లేక
నీవే జతలేని శిధిల శిలల్లో
ఉంటా వెయ్యేళ్లు చిలిపి కలల్లో
నీ నవ్వులో అందము నీ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియ రంజని
దిగులు పడే దినములతో సొగసులు సాగే
రుచులడిగే వయసులలో ఋతువులలో మారే
నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
పరువముతో పరిచయమే పరుగులు తీసే
చెరి సగమౌ చెలిమినిలా చెరలకు తోసే
ప్రేమ ఖైదీగా ప్రణయ పుటల్లో
ఇంకా ఎన్నాళ్లీ ఇరుకు గదుల్లో
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము నీ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియ రంజని
నువ్వే ప్రాయం - ప్రాణం - ఓ - ఓ
ఐ లవ్ ఫర్ యూ అన్నది ప్రేమ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ ఖైది (1990)
సంగీతం: రాజన్- నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
ఐ లవ్ ఫర్ యూ అన్నది ప్రేమ
ఓ న మహా పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ ఖైది (1990)
సంగీతం: రాజన్- నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్.పి.బాలు
ఓ న మహా
తిట్టిబా గట్టిగా పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ ఖైది (1990)
సంగీతం: రాజన్- నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్.పి.బాలు
తిట్టిబా గట్టిగా
జోడీకడితే బేడీల పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ ఖైది (1990)
సంగీతం: రాజన్- నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
జోడీకడితే బేడీల