చిత్రం: పెళ్ళి చేసి చూడు (1952) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్ టి రామారావు, జి. వరలక్ష్మి, సావిత్రి దర్శకత్వం: ఎల్. వి. ప్రసాద్ నిర్మాతలు: నాగిరెడ్డి, చక్రపాణి విడుదల తేది: 29.02.1952
Songs List:
చిత్రం: పెళ్ళి చేసి చూడు (1952) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్ టి రామారావు, జి. వరలక్ష్మి, సావిత్రి దర్శకత్వం: ఎల్. వి. ప్రసాద్ నిర్మాతలు: నాగిరెడ్డి, చక్రపాణి విడుదల తేది: 29.02.1952
Songs List:
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: జి. వరలక్ష్మి , గిరిజ, హేమలత, సి. యస్. ఆర్. ఆంజనేయులు, జగ్గయ్య దర్శకత్వం: నరసింహారావు భీమవరపు నిర్మాణ సంస్థ: ప్రతిభా పిక్చర్స్ విడుదల తేది: 11.07.1958 (ఎల్. ఆర్. ఈశ్వరి గారు తెలుగులో పాడిన మొదటి పాట. చమురుంటేనే దీపాలూ ఈ నిజముంటేనే కోపాలూ అనే పాట పాడింది. దీనిలో రాజేశ్వరి అనే పేరు ఉంటుంది. ఈమె పూర్తి పేరు లూర్డ్ రాజేశ్వరి ఈశ్వరి. అందుకు ఎల్.ఆర్.ఈశ్వరి అని అంటారు)
Songs List:
వలపే పులకింత సరసాలే గిలిగింత పాట సాహిత్యం
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: యస్. జానకి, పి. బి శ్రీనివాస్ వలపే పులకింత సరసాలే గిలిగింత
అయ్యోయ్ ఏమయ్యో అలా చూస్తావేమయ్యా పాట సాహిత్యం
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) అయ్యోయ్ ఏమయ్యో అలా చూస్తావేమయ్యా
కల్ల కాదు కలా కాదు కన్నెపిల్ల బాసలు పాట సాహిత్యం
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) కల్ల కాదు కలా కాదు కన్నెపిల్ల బాసలు
చమురుంటేనే దీపాలూ పాట సాహిత్యం
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: శ్రీ శ్రీ గానం: రాజేశ్వరి (ఎల్. ఆర్. ఈశ్వరి), కస్తూరి చమురుంటేనే దీపాలూ ఈ నిజముంటేనే కోపాలూ
వినరా నాన్నా కనరా చిన్నా పాట సాహిత్యం
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: మాధవపెద్ది సత్యం వినరా నాన్నా కనరా చిన్నా విస్సన్న చెప్పే వెర్రిమాటలో
హాసమా పరిహాసమా పాట సాహిత్యం
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) హాసమా పరిహాసమా చందమామ ఓ చందమామ
ఏమనెనోయి ఆమనిరేయి పాట సాహిత్యం
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి), ఘంటసాల ఏమనెనోయి ఆమనిరేయి ఎవ్వరికోయి తీయనిహాయి
ఎరుక చెబుతానూ ఎరుక పాట సాహిత్యం
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: టి.జి. కమలాదేవి ఎరుక చెబుతానూ ఎరుక చెబుతా ఏడేడు లోకాల ఎరుక చెబుతానూ
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు నటీనటులు: హరనాథ్, జమున, జి. వరలక్ష్మి దర్శకత్వం: గుత్తా రామినీడు నిర్మాత: వి. సత్యన్నారాయణ విడుదల తేది: 01.11.1968
Songs List:
అందం ఉరికింది పాట సాహిత్యం
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల అందం ఉరికిందీ వయసుతో పందెం వేసింది. మనసులో బందీ అయింది ఇదేమి బంధం అంటుంది అందాలొలుకు చంద్రుని అందుకోవాలనుకొని ఎగసే అలలు తెలిపే దేమని ? రోహిణి : ఏమని? రవి : జగమంతా ప్రేమ బంధం సొగసంతా నీది నీదే రారమ్మని ! రోహిణి : విరిసే నిండు జాబిలి కడలి పూచిన పూవులే ఎగసే అలలబాల అదే కడుపున సంటలే అది అన్నా చెల్లి బంధం హృదయాల జన్మ జన్మల అనుబంధం ..... రవి : ఎదిగే మావి కొమ్మల కౌగలించాలనుకొని ఒదిగే మాధవీలత వలపు పిలుపే యేమని? రోహిణి : ఏమని? రవి : తనలోనే కరిగి పొమ్మని తనువంతా నీదినీదే రా రమ్మని ! రోహిణి : ఎదిగే గున్న మావిని పుడమితల్లే కన్నది ఒదిగే మాధవీలత తోడబుట్టిన చిన్నది అది అన్నా చెల్లి బంధం హృదయాల జన్మ జన్మల అనుబంధం ..
ఆడితప్పని వాడని (పద్యాలు) పాట సాహిత్యం
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: కొండల్రావు, సుమిత్ర, అప్పారావు హరి: ఆడితప్పని వాడని యశముగాంచ అఖిల రాజ్యమ్ము విడనాడి - ఆలి నమ్మి కడకు నన్నమ్ముకొన వీధి బడితి నేడు భానువంశ హరిశ్చంద్ర ప్రభుడ నేను - నన్ను కొనరండి ! రండి కొనండి! రండి నక్షత్ర : కొండంత యేనుగు కుంభస్థలము మీద తాడియంత మనిషి తాను నిలిచి రత్నమొకటి నింగి రయ్యని విసిరిన ఎంత దవ్వుపోవు, అంత ఎత్తు ధనము కుప్పపోసి వీని కొనగవలయు . వీర : తొలగండె హె బాబు .. తొలగండెహె! సిన్నోల్లో పెద్దోల్లో - తొలగండె హె ! మందు మీదున్నాను మత్తెక్కి వున్నాను మక్కిలిరగదన్నేను ఏపాటి ఓళ్లైనా ఏనాటి ఓళ్లైనా ఎప్పటికో అప్పటికి చేరేటి చోటికి ఆ కాటికి - వల్ల కాటికి కాపరిని - యీరబాహువుని...
ఎవరికి పుట్టిన పాప పాట సాహిత్యం
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా యీ పాప శాపానికి ప్రతిశాపమా. పుణ్యానికి మణి దీపమా నెత్తుట తడిసిన యీ చేతులతో నీకు పాలు పట్టేనా? పాపా ! నేను పాలు పట్టేనా ? నిప్పులు చెరిగిన యీ గొంతుకతో నీకు జోల పాడేనా, పాపా ! నేను జోల పాడేనా ? లాలీ జోగో లాలీ ఎన్ని గండములు ఎదురౌతున్నా నిన్ను వదలు కోగలనా పాపా ! నిన్ను మరువ గలనా కరచిన పాము కోరలు తీయక కన్ను మూయగలనా పాపా ! కన్ను మూయగలనా | లాలీ జో లాలీ
చతురాశాంత పరీత (పద్యం) పాట సాహిత్యం
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: కొండల్రావు చతురాశాంత పరీత భూరి వసుధన్ శాసించు చిహ్నంబుగా క్షితి రాజిల్లేడు రాజదండము బదుల్ చేతనే రహించెన్ గదా, చితిలో కాలేడు కాష్టమంచు నకటా ! చింతించకన్ సాహసో ద్ధతి, సత్కీర్తి గణించి, మించి, ఘన సత్యశ్రీని కాపాడుమా
చిన్నవాణ్ని చూడగనే పాట సాహిత్యం
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే రాగాలు సాగెనే మొహాలు మూగెనే అవేనే శృంగార శృంఖలాలు బంగారు సంకెలలు నూనూగు మీసమూ జానైన వేసమూ వానిగని, వాని విని మనసు జారి పోయెనే దినుసె మారి పోయెనే ఏమేమో ఆయెనే దీపముగని మిణుగురులు రూపముగని కన్నియలు ఒళ్లు మరచి పోయారే ఒళ్ళోవాలి సోలేరే అది ప్రేమే అంటావా ? కాదే, అది కామమే నాలో వగ మొదలాయె అది గోదావరి వరదాయె పరువముతో రొమ్ము చరచి చొరవగాను చేరగనే ఆ కోడెగాని చూపులలో అది యేమో తోచెనే ఒక్క నెమలి కన్నులో ఎన్ని వన్నె చిన్నెలో యువకుని ఒక భంగిమలో అన్ని కళలు మెరయునే పెళ్లిగాక ఆ ప్రేమల సంగతికే పోరాదే పోరాదే
మనసైన నాసామి పాట సాహిత్యం
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల మనసైన నా స్వామి రాడేలనే ! నా మదిలోని నెలరాజు లేడేలనే ! జిలిబిలి నవ్వులు చిలికినవాడే వలపే తానై పిలిచిన వాడే నంద శోరుడే నా వగ కాడే వేణుగాన ఝరిలోన ముంచెనే నితాంత లతాంత వసంత వేళల మరులు గొలిపినాడే - మరచినాడే దరికిరాడే - మగువరో అల్లరి గాలి చల్లగ వీచె సిగలో పూలె నగవులు దాచే విరివిలుకాడె తరుణము వేచె పొంచి పొంచి పులకించి మించి బిరబిరాన వరాల శరాలు దూసె కలల బరువు పెరిగె - నిదుర తరిగె రేయి కరిగె చెలియరో ...
రండయ్యా రండయ్యా (బుర్రకథ) పాట సాహిత్యం
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: ఎల్. ఆర్. ఈశ్వరి బృందం నిర్వహణ: రాఘవకుమార్ అండ్ పార్టీ విజయనగరం. క్రిష్ణ వేణి : రండయ్యా ! రండయ్యా ! పిన్నలు పెద్దలు రారండయ్యా: ఎన్నడు వినని ఎన్నడు కనని మహా ద్రోహి కధ వినరండీ ! ప్రజలే రాజ్యం చేసే రోజులు ప్రజలే తీర్పును చెప్పాలి, ప్రజలే న్యాయం చెయ్యాలి.. వంతలు : రండయ్యా రండయ్యా పిన్నలు పెద్దలు రారండయ్యా ! క్రిష్ణ వేణి : ఊరుకు పట్టిన గ్రహచారం ఘోరకలీ ! ఘోరకలీ ! వచనం : కధకాదు, కట్టుకథకాదు, ఉట్టుట్టి కథకాదు ! ఊరికి నడి బొడ్డున నడిచిన మహా పాపికధ ! వంతలు : రండయ్యా రండయ్యా పిన్నలు పెద్దలు రారండయ్యా క్రిష్ణ వేణి : ఖూనీల్ చేసిన పాపం పోవగ - చందాల్తో గుడి కట్టిస్తాడు కుప్పలు కాల్చిన పాపం పోవగ అన్న దానములు చేయిస్తాడు మగువల చెరచిన పాపం పోవగ పూజలు భజనలు చేయిస్తాడు పొగిడే వారిని చేరదీస్తడు తెగడు వాని పై తుపాకి తీస్తడు వంతలు : అమ్మలారా వినుడీ ! యీ అన్యాయము గనుడీ ! క్రిష్ణవేణి : రావణుని మించేటివాడు - కీచకుని తలదన్ను వారు కామ క్రోదాలతో వాడు కన్నె పడచుల చరచువాడు, ముందు నీతులు చెప్పి - వెనక గోతులు తీయ పెద్ద మనిషిని తెలుసుకొండయ్యా ఆ పెద్ద మనిషికి సోదరా - ఇద్దరు నమ్మిన బంట్లురా బుద్ధిలేని ఒక కుంటి నక్కరా - బుర్రలేని ఒక గడేకారిరా పైసా కోసం ఫలహారంగా - పచ్చగడ్డినే తింటారా ! వంతలు : భళానంటి భళి తమ్ముడా - మేల్ భళానోయ్ దాదానా ! క్రిష్ణ వేణి వచనం : ఈ బలగంతో ఆ పెద్ద మనిషి సాగించిన దురంతాలు ఎట్లాంటి వనగా ఎడ్ల పందెం వేయదలచి - పేద రైతును కోరి పిలిచి పందెమందున ఓడిపోయి - పౌరుషంబున పగలబడ్డాడా పగబట్టి పామై బుసలు కొట్టాడా ! పరువు నిలవదని గడేకారినే - రయమున పిలిపించె దొంగ చాటుగా రైతు కొంపకే - అగ్గిని పెట్టించే ! కణకణ మండే మంటల - రైతు కనుల జూచినాడా ఇంట సావిడిని పందెపు బెడ్లు - యిరుకున బడ్డాయి వాటి రక్షణకు తెగించి రైతు - మంటల దూకాడా! పేరు మోసిన పందెపు టెడ్లు పేద రైతుకూడా భగ భగ పొగ లెగ జిమ్మే మంటల బూడిద అయినారా ! ఆ గ్రామానికి ఏమి వచ్చినా - పెద్ద మనిషియే గతి అన్నట్టు పిల్లల నిద్దరి సాకే బాధ్యత - పెద్ద మనిషి కే కైవశమయ్యిందా ! అనాధలకు ఆశ్రయమిచ్చిన పెద్దమనిషి ఆ కన్నెపై తాను - కన్నేసి వున్నాడా ! ఇంట నెవ్వరులేని - అదునుకై జూచాడా చీకటే ముసిరింది - కోరికే రేగింది. క్రూరంగా చెరబట్టి ఘోరమే చేశాడా అతి నేరమే చేశాడా వచనం : పాపం ! ఆ దురదృష్టవంతురాలు కృష్ణవేణి : మానం పోయిన ప్రాణ మేలయని వంతలు : రామరామ శ్రీరామ రాఘవా ! కృష్ణవేణి : ఆత్మహత్యకై సాహసించగా వంతలు : రామ రామ శ్రీరామ రాఘవా ! కృష్ణవేణి : గడేకారి గని రక్షించెను - ఆ దీనురాలినండీ ! వచనం : విపరీతం, విడ్డూరం అన్నట్టు - యింకా ఏం జరిగింది . కృష్ణవేణి : పెద్ద మనిషి చెరపట్టగా - కన్య గర్భవతి ఆయెరా ! నెలలు నిండి ఒక బిడ్డనుగని - తా కన్ను మూసెనయ్యో : వంతలు : జాలిగుండెగల సోదరా! - యీ కరుణ గాధనే విన్నావా ! విషాద గాధనే విన్నావా ! వంతలు వచనం : మరి ఆగడేకారి పసి బిడ్డను ఏం చేశాడు ? వంతలు వచనం : ఒక అభాగ్యవతి గడపలో పసిపాపను వదలి పెట్టి పెద్ద మనిషి పుణ్యాన గడేకారి - జైలు పాలయ్యాడు. కృష్ణవేణి : తల్లి కాని తనలోటు తీరగా తల్లి తనము పై తీపివారగా ముద్దు ముద్దుగా పెంచినపాప కళకళలారుతు పెరిగి పెద్దదై కళారంగమున గజ్జేనుకట్టి - నర్తకిగానే ఆరితేరినది. వంతలు : అమ్మలారా వినుడు అయ్యలరా వినుడీ కృష్ణవేణి వచనం : ఇంకా శోచనీయమైన విషయం ఏం జరిగింది ? శాంతినికేతన్ చదువు పూర్తియై తిరిగి వచ్చిన నవీన యువకుడు పెద్దమనిషి ఏకైక పుత్రుడు - నర్తకి నేగని ప్రేమించాడండి! - ఎవరు చేసిన పాపం వారిని - చివరికి మానదని తెలిసి వచ్చినది నర్తకి జన్మ - తెలిసి వచ్చినది నర్తకి జన్మ తెలిసి వచ్చినది కొడుకు పట్టుదల తా కన్న కూతురే తన యింటి కోడలా దారుణంబని మధన పడ్డాడు తన పాపమే పండి బ్రద్దలై యీ నాడు తన పరువు నట్టేట గలియునన్నాడు కూడని ధర్మం సాగడమాయని - కొర కొర లాడాడ కఠిన చిత్తుడై నర్తకి నే - మటు మాయం చేశాడా ? ప్రజలే రాజ్యం చేసేరోజులు - ప్రజలే తీర్పును చెప్పాలి ప్రజలే న్యాయం చెయ్యాలి !
లోకమెల్ల నీది (అభినవ కుచేల పిల్లల నాటిక) పాట సాహిత్యం
చిత్రం: బంగారు సంకెళ్లు (1968) సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు సాహిత్యం: శ్రీశ్రీ గానం: ఉడుతా సరోజిని, సుమిత్ర లోకమెల్ల నీది లోకమే నీ పంచు కల్లబొల్లి కబురులల్లి తొల్లి మానవులను చాటు మాటు మాయచేశావు దేవుడసలు నీవు కావు కావు... తిండిని దాచే వ్యాపార్లు లంచం మరిగిన అధికార్లు మోసంచేసే మొనగాళ్లు లోకం నిండా నిండారు, తాండవించుచుండె దారిద్ర్య దేవత కాలి యినుప గజ్జె ఝల్లుమనగ ఆటలాడసాగె ఆకలి రాకాసి జనుల గుండె ఝల్లు ఝల్లుమనగ శ్రీ కృష్ణ : నీవు పలికెడి మాటలు నిక్కువములు కాని తొందర పాటును మాని, దీని అసలు నిగ్గును తేల్చుటే అవసరమ్ము బుద్ధి బలమించుక చూపుము కుచేలా ప్రజలే ప్రభువులై రాజ్య పాలనమ్ము జరుపు కొనెడు ప్రజాస్వామ్య జగతి నీది నీ ప్రభుత్వము నీవె నిందింతువేని నీవె నిన్ను నిందించు చున్నావు వినుము
చిత్రం: వాలి సుగ్రీవ (1950) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి, శ్రీరంజని, రావు బాలసరస్వతి దేవి, చిలకలపూడి సీతారామాంజనేయులు, గరికపాటి రాజారావు, కాళ్ళకూరి సదాశివరావు, ఎ.వి.సుబ్బారావు, దర్శకత్వం: జంపన చంద్రశేఖరరావు నిర్మాత: ఎస్.భావనారాయణ విడుదల తేది: 02.04.1950
Songs List:
కళావిలసమే ప్రేమ పాట సాహిత్యం
చిత్రం: వాలి సుగ్రీవ (1950) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: జంపన చంద్రశేఖరరావు గానం: ఘంటసాల, ఎస్.వరలక్ష్మి కళావిలసమే ప్రేమ
బ్రతుకే నిరాశ పాట సాహిత్యం
చిత్రం: వాలి సుగ్రీవ (1950) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: జంపన చంద్రశేఖరరావు గానం: ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి, బ్రతుకే నిరాశ
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: శోభన్ బాబు, వాణీశ్రీ, చంద్రకళ, జి.వరలక్ష్మి, అంజలీదేవి, కృష్ణ కుమారి దర్శకత్వం: వి. మధుసూధనరావు నిర్మాత: డి. రామానాయుడు విడుదల తేది: 1974
Songs List:
ఈ నదిలా నా హృదయం పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, వి. రామకృష్ణ పల్లవి: ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతూంది ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో. వెతుకుతు వెళుతూంది వెతుకుతు వెళుతూంది చరణం: 1 వలపు వాన చల్లదనం తెలియనిది వయసు వరద పొంగు సంగతే ఎరగనిది వలపు వాన చల్లదనం తెలియనిది వయసు వరద పొంగు సంగతే ఎరగనిది కలల కెరటాల గలగలలు రేగనిది కలల కెరటాల గలగలలు రేగనిది గట్టు సరిహద్దు కలతపడి దాటనిది ఏ మబ్బు మెరిసినదో ఏ జల్లు కురిసినదో ఎంతగా మారినది ఎందుకో ఉరికినది ఎంతగా మారినది ఎందుకో ఉరికినది ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతూంది చరణం: 2 అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది ఏ మనిషికి మచ్చికకు రానన్నది ఏ తోడు కలిసినదో.. ఏ లోతు తెలిసినదో వింతగా మారినది.. వెల్లువై ఉరికినది ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతూంది వెతుకుతు వెళుతూంది
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, వి. రామకృష్ణ పల్లవి: కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి పట్టపగలె తొందర పండగుంది ముందర కొత్తగా పెళ్ళైన కుర్రదానికి పట్టరాని తొందర పట్టుకుంటె బిత్తర చరణం: 1 కొంగుచాటులో వయసు పొంగులన్ని దాచావు కోలకళ్ళ జాడలో గుట్టు కాస్త చెప్పావు కొంగుచాటులో వయసు పొంగులన్ని దాచావు కోలకళ్ళ జాడలో గుట్టు కాస్త చెప్పావు కోరి వలచి వచ్చాను నీ కోసమెన్నొ తెచ్చాను కోరి వలచి వచ్చాను నీ కోసమెన్నొ తెచ్చాను గుట్టు చప్పుడు లేక నీ సొంతమే చేసుకో కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి పట్టపగలె తొందర పట్టుకుంటె బిత్తర చరణం: 2 నింగి వంగి వచ్చిందీ నిన్ను చూచేటందుకు నేల పచ్చిక పరచింది నీవు నడిచేటందుకు నింగి వంగి వచ్చిందీ నిన్ను చూచేటందుకు నేల పచ్చిక పరచింది నీవు నడిచేటందుకు మంచు జల్లు కురిసింది చలి పుట్టేటందుకు మబ్బు చాటు చేసింది గిలి తీరేటందుకు మబ్బు చాటు చేసింది గిలి తీరేటందుకు కొత్తగా పెళ్ళైన కుర్రదానికి పట్టరాని తొందర పండగుంది ముందర చరణం: 3 అల్లరి కళ్ళకు నల్లని కాటుక హద్దులే గీచావు ఎందుకూ కళ్ళకు కాటుకే చల్లదనం హద్దులో ఆడదుంటె చక్కదనం చీర కట్టులో ఎన్ని గమ్మత్తులు చిగురాకు పెదవుల్లో ఎన్ని మత్తులు బిగి కౌగిలింతలో కొత్తకొత్తలు ప్రేమ బాటంతా పూలగుత్తులు కొత్తగా పెళ్ళైన కుర్రదానికి పట్టరాని తొందర పట్టుకుంటె బిత్తర కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి పట్టపగలె తొందర పండగుంది ముందర
వీణలోన తీగలోన పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల పల్లవి: వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము వీణలోనా తీగలోనా చరణం: 1 మాటలోనా మనసులోనా ఎక్కడున్నది భావము అది ఎప్పుడౌను గానము నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటే భావము రాగ భావములేకమైనది రమ్యమైనా గానము వీణలోన తీగలోనా చరణం: 2 గతజన్మ శ్రుతి చేసుకున్నది అది ఈ జన్మ సంగీతమైనది సరిగమ పదనిసానిదమప గరిగ రాగాల ఆరోహణవరోహణైనది అనురాగ హృదయాల అన్వేషణైనది వీణలోనా తీగలోనా చరణం: 3 గుండెలోనా గోంతులోనా ఎక్కడున్నది ఆవేదన అది ఎలాగౌను సాధన గీతమునకూ బలమే వేదన రాగమునకూ మెరుగే సాధన గుండె గొంతుకలేకమైనవి నిండురాగాలాపన వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము వీణలోనా తీగలోనా
వీణలేని తీగను (Sad) పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, వి. రామకృష్ణ పల్లవి: వీణలేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను వీణలేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను జీవించలేను మరణించలేను చరణం: 1 మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది మరువలేని మనసుకన్నా నరకమేముంది ఆ నరకమందే బ్రతకమని నా నొసట నువ్వే రాసింది చరణం: 2 వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది తీగ మారినా కొత్త రాగం పలకనంటుంది పాత స్మృతులే మాసిపోక బాధపడుతుంది జీవించలేను మరణించలేను చరణం: 3 బండబారిన గుండె నాది పగిలిపోదు చెదిరిపోదు నువ్వు పేర్చిన ప్రేమ చితిలో కాలిపోదు బూదికాదు నిన్ను కలిసే ఆశలేదు నిజం తెలిసే దారిలేదు చివరికి నీ జీవితానికి చిటికెడంత విషం లేదు జీవించలేను మరణించలేను
ప్రియతమా నా ప్రియతమా పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల పల్లవి: ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన దిక్కు దిక్కుల మారుమ్రోగే..దీన హృదయావేదన దిక్కు దిక్కుల మారుమ్రోగే దీన హృదయావేదన ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన చరణం: 1 నిన్ను నేను వంచించగలనా ఈ జన్మ ఎవరికో అర్పించగలనా నిన్ను నేను వంచించగలనా ఈ జన్మ ఎవరికో అర్పించగలనా నింద నెటుల నమ్మావు నీవు నింద నెటుల నమ్మావు నీవు నన్నిదా తెలుసుకున్నావు నన్నిదా తెలుసుకున్నావు ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన చరణం::2 నిన్ను కాదని జీవించగలనా ఈ నిజానికి రుజువు కావలెనా నిన్ను కాదని జీవించగలనా ఈ నిజానికి రుజువు కావలెనా గుండె గుడిగా చేసుకున్నాను గుండె గుడిగా చేసుకున్నాను నీ కొలువుకోసమే కాచుకున్నాను నీ కొలువుకోసమే కాచుకున్నాను ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన దిక్కు దిక్కుల మారుమ్రోగే దీన హృదయావేదన ప్రియతమా నా ప్రియతమా
వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, వి. రామకృష్ణ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో ఓ కుళ్ళుమోమొతు పిల్లగా మళ్ళివచ్చేదాకా నీ కళు కాస్తా ఇచ్చిపో నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో ఉండిపో ఉండిపో వుండాలంటే వుండిపో ఓ ఒళ్ళుపొగరుపిల్లా వెళ్ళలేని కళ్ళల్లో నువ్వు వెన్నెలల్లే ఉండిపో నువ్వు వెన్నెలల్లే ఉండిపో వెన్నెలతో నన్ను పోల్చకూ అది సగం రోజులుంటుందీ నెలకు వెన్నెలతో నన్ను పోల్చకూ అది సగం రోజులుంటుందీ నెలకు ఆ మిగితాసగం నేనుంటానులే ఒద్దికంటే ఇద్దరం పంచుకోవాలిలే ఉండిపో ఉండిపో ఉండాలంటే ఉండిపో ఓకుళ్ళుమొతు పిల్లగా మల్లి వచ్చే దాకా నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో పోతే పో నాకే అన్నావుగా మరి బుంగమూతి పెట్టుకు కూర్చోన్నావేంటి మరి నీకే నువు టవునుకెలతావు స్నేహితులని సినిమాలకనీ పగలంతా హాయిగా తిరిగి రాత్రికి మత్తుగా నిద్రపోతావు నే నొంటరిగా ఎలావుండనూ మగాడివి నీకేమి పగలంతా తిరుగుతావు మాపటికి అలసిపోయి మత్తుగా నిదరోతావ్ ఆ... హా... ఆ... ఆ... మగాడివి నీకేమి పగలంతా తిరుగుతావు మాపటికి అలసిపోయి మత్తుగా నిదరోతావ్ ఆడపిల్లవు నీకేమి అద్దమెదుట కూర్చోంటావ్ ఆడపిల్లవు నీకేమి అద్దమెదుట కూర్చోంటావ్ రోజు రోజుకో కొత్త పోంగు చూసుకొంటూ గడిపేస్తావ్ సరే వెళ్ళో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో ఓ ఒల్లుపొగరుపిల్లా వెళ్ళలేని కళ్ళల్లోనువు వెన్నెలల్లే ఉండిపో నువు వెన్నెలల్లే ఉండిపో నీ జతలో నేనే మగాడినీ నువు లేకుంటే నాకు నేనే పగాడిని నీ జతలో నేనే మగాడినీ నువు లేకుంటే నాకు నేనే గాడిని పగవాడితో పోరు తెలిసినట్లుంటుంది పడుచువాడితో పొత్తు ప్రాణాలు తీస్తాది ఐతే ఉండిపో ఉండిపో ఉండాలంటే వుండిపో సరే వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో ఓ ఒల్లుపొగరు పిల్లా వెళ్ళలేని కళ్ళల్లో ఓ కుళ్ళుమొతు పిల్లగా మల్లివచ్చేదాకా నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
వీణలోన తీగలోన ఎక్కడున్నది అపశ్రుతి పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల పల్లవి: ఆ..హా.. ఆ... వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి అది ఎలాగైనది విషాద గీతి వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి అది ఎలాగైనది విషాద గీతి వీణలోనా తీగలోనా చరణం: 1 వెతికి వచ్చిన తీగతో నా వీణనే ముడివేసుకొంటిని వెతికి వచ్చిన తీగతో నా వీణనే ముడివేసుకొంటిని వెలితి రాదని కలిసి పాడితిని వెలితి రాదని కలిసి పాడితిని నేడే వికల వీణగా మిగిలిపోతిని వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి చరణం: 2 రాగమున ఒక స్వరము మారిన వలపు పాటే కలత పాటగును రాగమున ఒక స్వరము మారిన వలపు పాటే కలత పాటగును అనురాగమున అపశృతి పలికిన అనురాగమున అపశృతి పలికిన కన్నీటిలో కల కరిగిపోవును వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి చరణం: 3 గాలిలోనా గాలినై కలసిపోతాను నీ గానమై నే నందులోనే నిలిచిపోతాను మట్టిలోనా మట్టినై మాసిపోతాను నీ మనసులోని మమతగానే బ్రతికి ఉంటాను వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు నటీనటులు: సి.లక్ష్మీరాజ్యం, కె.ఎస్.ప్రకాష్ రావు, జి.వరలక్ష్మి, ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్ నిర్మాణ సంస్థ: స్వతంత్ర ఫిల్మ్స్ విడుదల తేది: 10.12.1948 ( పెండ్యాల నాగేశ్వరరావు గారికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా )
Songs List:
ఆలకించండి బాబూ పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: కె.జమునారాణి ఆలకించండి బాబూ ఆదరించండి బాబూ అదుష్టమున్నా అయ్యల్లారా అదుష్టమున్నా అమ్మల్లారా పాలు నేయి పాయసాలతో చాలినంత భోం చెయ్యండి పల్చని గంజయినా మాపాలిటికింత పోయండి రంగు రంగుల చీరలు పేరులు సింగారంగా కట్టండి చింకి పేలికలతోనైనా మా మానము కాచుకపోనీండి కారులమీదను జోరుజోరుగా జోరుజోరుగా భయ్యిభయ్యిమని హాయిహాయిగా తిరగండి దారిపక్క నొలమూలను మమ్ము కాళ్లీడ్చుకొని పోనీండి
నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: జి. వరలక్ష్మి నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు నీ పానమే లేకున్న గానమే సున్న నీ సువాసన సోకక కవితరాదు కళలకు మూలము నీవే కాఫీ కళారూపినే కదా ఆహా ఆహారమే లేకున్న ప్రేమగాథ లెటు పోయినా ప్రాణాలు పోయినా సరే నీవుమాత్రం కావాలి సిగరెట్ మహావ్యాపివేకదా ఆహా
తృణమో పణమో వెయ్యండి పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం:కె. జమునారాణి & బృందం తృణమో పణమో వెయ్యండి దీనుల బాధలు తీర్చండి ఉండడాని కిల్లు లేక తిండి మాట మొదలె లేక గాలివాన చేత చాల గట్టి బాధ పొందినారు కట్టుకోను గుడ్డలేక చెట్టుకొమ్మ నీడలేక ముక్కు చివర ఊపిరితో దిక్కుమాలి యున్నారు
పూవు చేరి పలుమారు తిరుగుచు పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: ఘంటసాల, జి.వరలక్ష్మి పూవు చేరి పలుమారు తిరుగుచు పాట పాడునది ఏమె తుమ్మెద పూవులోన తన పోలిక కన్గొని మోదము గాంచిన దేమో తుమ్మెద ఆ సెల ఏటిని తాకుచు తట్టుచు చెప్పుచున్నదది ఏమో పూపొద ఒక క్షణమైనా ఆగి పల్కవని కొరకొర లాడునో ఏమో పూపొద అలరు కౌగిటను అదిమి మావితో మంతన మాడునదేమో మాలతీ ఏకాంతముగా ప్రణయ మంత్రమును ఉపదేశించునో ఏమో మాలతీ ఏదిచూచినా ప్రేమయె జగతి కాదను వారలు పాషాణాలే
నేడే తీరె నా వాంఛా పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: జి.వరలక్ష్మి నేడే తీరె నా వాంఛా నేడే యీ డేరే జీవితాశ చేకూరే ఒంటరిపాటిక నుండదుగా జంట తలంపుల పంటగదా యింటా బయటా ఎపుడూ హాయిగ ఉంటామే సుఖములు గంటామే ఒకరి మనసులో ఒకరై ఆహా కలసి మెలసి యీ కాలంబంతా విలాసములలో వినోదములలో గడుపుదుమే గడుపుదుమే ఆహా ప్రేమ నడుపుదు మే
ప్రేమయే కదా సదా విలాసీ పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: యం.యస్.రామారావు , జి.వరలక్ష్మి ప్రేమయే కదా సదా విలాసీ ప్రేమే కదా మహా పిపాసి ఎంతో తనకుండినా యింకా తాకోరునే ప్రేమతో సాటి నహీఁ జగానా దివినైనా నిజమీ ప్రేమే కలయీ ప్రేమే సాధ్యమే కాదే ఏరికైనా యీ ప్రేమా మహిమా నోరారా పాడా యీ ప్రేమాగరిమా లో కాలా చాటా యీప్రేమాలీలా విలసాలున్నా సౌఖ్యాలికేలా స్వర్గాలేలా ఆహా ప్రేమే కదోయి జనాళి జీవన మహా
నవ్వనైన నవ్వరాదే బుల్ బుల్ పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: పిఠాపురం నవ్వనైన నవ్వరాదే బుల్ బుల్ బుల్ బుల్ నాతో మాటలైన ఆడరాదే బుల్ బుల్ బుల్ బుల్ నిన్ను నమ్ముకున్నా నే బుల్ బుల్ బుల్ బుల్ కన్నుగీటి ఔననవే బుల్ బుల్ బుల్ బుల్ లోకులేమి అనుకున్నా బుల్ బుల్ బుల్ బుల్ నీకేమె నా కేమె బుల్ బుల్ బుల్ బుల్ కన్నుగీటి ఔననవే బుల్ బుల్ బుల్ బుల్ ఎందరొస్తె మనకేమె బుల్ బుల్ బుల్ బుల్ అందర్నీ తందామె బుల్ బుల్ బుల్ బుల్
చక్కలి గింతలు లేవా పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: జి.వరలక్ష్మి చక్కలి గింతలు లేవా చక్కని ఊహలు రావా పౌరుచు తారుచు పంతాలాడే కీర దంపతుల కనగా తీవలమాఃవుల కౌగలింతలో పూలు పూచునది కనగా జోడును వీడక ఆడే పాడే జంట జంటలను చూడా
చక్కరు కొట్టుకు వచ్చావా పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: శివరావు, జి.వరలక్ష్మి చక్కరు కొట్టుకు వచ్చావా బలె టక్కరి పిల్ల వె చినదానా టమారి మాటల పిలవాడా నీ దిమాకు చూపకు నామీద చక్కరు కొట్టుకు వచ్చావా బలె టక్కరి పిల్ల వె చినదానా ఊసుపోక అటు తిరిగివచ్చితే మీసం తిప్పా వెందుల కోయ్ రోసం చూపావెందులకోయ్ పన్ను నొప్పికై నిన్న వచ్చిన చిన్న వాడికై పోలేదా పోతేనేం ? అహ పోలేదా? పోయాను పన్ను నొప్పి పోగొట్టావా ? ఒళ్లూ నొప్పని చెప్పాడోయ్ సెంటు వాసనలు గుమ్మంటున్నాయ్ ఆఁ అత్తరు సాయెబు అతడొకడా మచ్చుచూపినా డంతేనోయ్ అయితే నాపని యింతేనా
ఓహోరోజా పూలా రాజా పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: ఓహోరోజా పూలా రాజా పూలారాజా ఆహా నీదే జన్మ పూచావే తావినించా నే శిరసుల పై మెరసితివే ఆహా చిన్నారివే ఆహా పొన్నారివే ఓదినమైనా లోకులు పొగిడే జీవనమహా బ్రతుకనగా యిదియే యిదియే
ఎందుకీ బ్రతుకూ పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: కె.జమునారాణి ఎందుకీ బ్రతుకూ ఆశలేని ఎడారియేకదా ప్రాణమిచ్చిన తాతపోయె అంత పెంచిన అమ్మ బాసె ఆదరించిన బాబు మారెను ఆప్తులే చెడ తిట్టిరే ఎంత భ క్తిని సేవ చేసినా యింతగా ఆపనింద వచ్చె ఎవరు నాయను వారులేరే ఏమనందునిక
యిది యేనా నీ న్యాయము దేవా పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: యం.యస్.రామారావు యిది యేనా నీ న్యాయము దేవా యీ వలపక్షము తగునా పాలు నేయీ కొందరికిచ్చి పచ్చని గంజీలేకెందరినో పస్తులలో పడిచావమందువా దేవా పేరులు చీరలు కొందరికిచ్చి పేలికలైనా లేకెందరినో మానహానితో బ్రతుకమందువా దేవా
సరిసరి మాటల మూట పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: సరిసరి మాటల మూట సాలును తెల్చె జోలికి రాకోయి సిరసిర లాడత వేల సంగ తేమిటో సెప్పగరాదే తెస్తానని చూపితివాళ ఏది ఏది కూడూ గుడ్డ మరిసితివ ఆడినమాట సాలును తెల్చె జోలికి రాకోయి స్వరాజ్యము వచ్చెనుకదా కూటికి గుడ్డకు లోటేలేదే స్వరాజ్యమొ గిరాజ్య మొ మాటల కేమి కోరినదీవోయి సరాసరి సూడగ రాదే పరుగులతో వస్తాయన్నీ అదేకదా కోరినదంతా ఒంటికి గుడ్డ తింటకి కూడు స్వరాజ్యము వచ్ఛెనుగదా కూటికి గుడ్డకు లోటేలేదే
నరులకు ప్రేమతో చేసిన సేవే పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: నరులకు ప్రేమతో చేసిన సేవే నారాయణ సేవా మహాత్ములంతా పాటించినదీ మర్మసూత్ర మొకటే జీవన్ముక్తులకున్న కీలకము పావనజీవుల పరమరహస్యము ఎంత సూక్ష్మము ఆహా దేశంబం టే మట్టికాదు దేశంబంటే మనుష్యులే మనుషులు సేవే దేశ సేవయౌ అదియే మాధవ సేవ ఎంత సూక్ష్మము ఆహా
మనోవాంఛలు యీగతి కూలిపోయె పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: జి. వరలక్ష్మి మనోవాంఛలు యీగతి కూలిపోయె హృదయ వేదన యీగతి మారిపోయె లోకము చీకటాయె సౌఖ్యము మాయమాయె ఆశా ... జీవి తాశ ఎటో పారిపోయె ఏదరి చేరుదానా ఎవ్వరి వేడుదానా దీనా నేనే గానా యిక యీ జగానా
ధన్యవహో మాతాసీతా పాట సాహిత్యం
చిత్రం: ద్రోహి (1948) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: ధన్యవహా ధన్యవహో మాతాసీతా మరణించిననూ చిరంజీవి వహ సత్యమహింసయే శాశ్వత సుఖమని స్వాతంత్ర్యానికి రాజమార్గమని సకలలోకముల శాంతి మూలమని చావునకూడా చాటి చెప్పితివే మాతా సీతా