చిత్రం: రత్నమాల (1948)
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: పి. భానుమతి, గోవింద రాజుల సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, సి. ఎస్ ఆర్. ఆంజనేయులు
దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణ సంస్థ: భరణీ పిక్చర్స్
నిర్మాత: పి. ఎస్. రామకృష్ణా రావు
విడుదల తేది: 02.01.1948
Ratnamala (1948)
Palli Balakrishna
Tuesday, May 11, 2021
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి రామకృష్ణ
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాత: పి.ఎస్.రామకృష్ణారావు
సమర్పణ: భానుమతి రామకృష్ణ
విడుదల తేది: 10.12.1954
(పి.ఎస్.రామకృష్ణారావు గారు భానుమతి గారి భర్త)
పల్లవి:
విరహే.. ఏ.. ఏ.. ఏ.. ఏ.. తవ దీనా... ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా
చరణం: 1
నిందతి చందన మిందు కిరణమను విందతి ఖేద మదీరం
వ్యాల నిలయ మిలనేన గరళమివ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వ్యాల నిలయ మిలనేన గరళమివ కలయతి మలయ సమీరం
సావిరహే తవ దీనా
చరణం: 2
కుసుమ విషిఖసర తల్పం అనల్ప విలాస కళా కమనీయం
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం
సావిరహే తవ దీనా
చరణం: 3
ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ
నిగదతి మాధవ
నిగదతి మాధవ తవ చరణే పతితాహం
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా
కృష్ణ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తావవిరహే తవ దీనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
****** ****** ******
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఏ. ఎం. రాజా
పల్లవి :
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూచి విరులు
విరితేనెలాని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాళి లేచెను నిదురా
చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది వేళాయె పూజలకు
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
చరణం: 1
పరిమళద్రవ్యాలు బహువిధములౌ నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ముపూని మహర్షి పుంగవులు
మురువుగా పాడ తుంబురు నారదులును
నీ సేవకై వచ్చె నిలచియున్నారు
సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని మొగసాల కాచియున్నారు
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
చరణం: 2
దేవరవారికై పూవుల సరులు తెచ్చిన
తొండరడిప్పొడి మురియ
స్నేహదయాదృష్టి చిల్కగా జేసి
పెద్దను విడి కటాక్షింప రావయ్యా
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
****** ****** ******
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఏ. ఎం. రాజా
పల్లవి:
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
కరుణాంతరంగ శ్రీరంగా...
పాలించర రంగా..
చరణం: 1
మరువని తల్లివి... తండ్రివి నీవని...
మరువని తల్లివి... తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా...
మొరవిని పాలించే..ఏ.. దొరవని
మొరవిని పాలించే..ఏ..ఏ.. దొరవని
శరణంటినిరా... శ్రీరంగా
పాలించర రంగా...
చరణం: 2
మనసున నీ స్మృతి మాయకమునుపే ...
మనసున నీ స్మృతి మాయకమునుపే
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా... ఆ... ఆ...
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా ..ఆ..ఆ...రంగా
కనియద మనసారా...
పాలించరా రంగా ...పరిపాలించరా రంగా
చరణం: 3
కరులును హరులును మణిమందిరములు
కరులును హరులును మణిమందిరములు
సురభోగాలను కోరనురా ...సురభోగాలను కోరనురా
దరి కనరానీ భవసాగరమును....
దాటించుమురా గరుడ తురంగా...
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
పాలించర రంగా..
****** ****** ******
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఏ. ఎం. రాజా
పల్లవి:
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా
బృందావనిలో నందకిషోరుడు...
బృందావనిలో నందకిషోరుడు... అందముగా దీపించే లీల
చూడు మదే చెలియా కనులా... చూడు మదే చెలియా
చరణం: 1
మురళీకృష్ణుని మోహనగీతికి...
మురళీ కృష్ణుని మోహనగీతికి...పరవశమైనవి లోకములే...ఏ..
పరవశమైనవి లోకములే... విరబూసినవి పొన్నలు.. పొగడలు
విరబూసినవి పొన్నలు పొగడలు...
పరిమళం ఎగసెను మలయానిలమున తూలెను .. యమునా
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా
చరణం: 2
నారి నారి నడుమ మురారి...
నారి నారి నడుమ మురారి...
హరికి.. హరికి నడుమ వయ్యారి
హరికి.. హరికి నడుమ వయ్యారి...
తానొకడైనా ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ
తానొకడైనా ... తలకొక రూపై
తానొకడైనా... తలకొక రూపై...
మనసులు దోచే రాధా మాధవ కేళి నటనా...
చూడు మదే చెలియ ...కనులా...చూడు మదే చెలియా
****** ****** ******
చిత్రం: విప్రనారాయణ (1954)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి రామకృష్ణ
పల్లవి:
ఓ..ఓ..ఓ..ఓ..ఓ....ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా....
చరణం: 1
వన్నెవన్నె చిన్నెలేను ఈ విలాసం...
వన్నెవన్నె చిన్నెలేను ఈ విలాసం
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం...
నిన్నేలువాని లీలలేరా..
నిన్నేలువాని లీలలేరా..
కన్నార కనరా ఏలుకోరా..
కన్నార కనరా ఏలుకోరా...
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
చరణం: 2
అందరాని విందుపైన ఆశలేలా
అందరాని విందుపైన ఆశలేలా..
పొందుకోరు చిన్నదాని పోందవేలా...
అందాలరాయా అందరారా...
అందాలరాయా అందరారా...
అనందమిదియే అందుకోరా
అనందమిదియే అందుకోరా...ఓ..ఓ..ఓ..
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
Vipra Narayana (1954)
Palli Balakrishna
Friday, March 15, 2019
చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: యన్.టి.రామారావు, యస్.వి.రంగారావు, సావిత్రి, శారద దర్శకత్వం: పి.యస్.రామకృష్ణా రావు నిర్మాత: వై. ఆర్.కృష్ణప్రసాద్ విడుదల తేది: 12.12.1962
Songs List:
అనగనగా ఒక రాజు పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి చరణం: 1 ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువుసంధ్యలుండి కూడా చవటలయ్యారు ఒఠ్ఠి చవటలయ్యారు చరణం: 2 పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు అయ్యొ ఇంటి దీపమార్పివేయు నెంచెక్కడు తల్లీ దండ్రులు విషమని తలచెనొక్కడు పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు... భ్రమసెనొక్కడు... చరణం: 3 కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెను కంటిపాపకంటె ఎంతో గారవించెను దానిగుండెలోన గూడుకట్టి వుండసాగెను తానుండసాగెను చరణం: 4 నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా కూరిమిగలవారంతా కొడుకులేనురా జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా... కుక్కమేలురా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఈ బిట్ చిత్రం చివర్లో వస్తుంది: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ ప్రేమయనే పాలు పోసి పెంపుచేసెను కొన్నాళ్ళకు ఆ రాజు కన్నుమూసెను కుక్క చల్లనైన చూపువల్ల ఇల్లు నిలిచెను నా ఇల్లు నిలిచెను
చదువు రాని వాడవని పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సినారె గానం: సుశీల పల్లవి: చదువు రాని వాడవని దిగులు చెందకు .. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు .. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో.. జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు .. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చరణం: 1 ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను... కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను చదువు రాని వాడవని దిగులు చెందకు .. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చరణం: 2 తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు.. కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు చదువు రాని వాడవని దిగులు చెందకు.. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు.. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
ఎవరో ఏ ఊరో పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: ఘంటసాల ఎవరో ఏ ఊరో
చీరగట్టి సింగారించి.. పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల పల్లవి: చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్ చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్ చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్ చరణం: 1 ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా పెళ్ళికొడుకును పట్టినావా .. పెళ్ళికొడుకును పట్టినావా .. ఓసి కోడలుపిల్లా ఛాన్సు కొట్టినావా చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్ చరణం: 2 చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు.. నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు ఏడాది తిరగకుండ వచ్చు.. ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్ చరణం: 3 ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం వలపు దాచావంటే పరితాపం .. వలపు దాచావంటే పరితాపం.. అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్
తీయని ఊహలు పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, జమునారాణి తీయని ఊహలు
మారదు మారదు పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పి.సుశీల మారదు మారదు
దక్కెనులే పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: శ్రీ శ్రీ గానం: పి.బి.శ్రీనివాస్ , జమునారాణి దక్కెనులే
1962
,
Aatma Bandhuvu
,
K.V. Mahadevan
,
N. T. Rama Rao
,
P. S. Ramakrishna Rao
,
S.V. Ranga Rao
,
Savitri
,
Sharada
,
Y.Rama Krishna Prasad
Aatma Bandhuvu (1962)
Palli Balakrishna
Friday, December 8, 2017
చిత్రం: బ్రతుకు తెరువు (1953)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్, ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల
నటీనటులు: అక్కినెని నాగేశ్వర రావు, సావిత్రి
దర్శకత్వం: పి.యస్. రామకృష్ణా రావు
నిర్మాత: కోవెలమూడి భాస్కరరావు
విడుదల తేది: 06.02.1953
అందమె ఆనందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
పడమట సంధ్యా రాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
పడమట సంధ్యా రాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహన రాగం
ఒడిలో చెలి మోహన రాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
పడిలేచే కడలి తరంగం ఓ...
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో... ఓ...
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటక రంగం
జీవితమే ఒక నాటక రంగం...
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
ఓ... ఓ...ఓ...
******** ******** *********
చిత్రం: బ్రతుకు తెరువు (1953)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్, ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల
అందమె ఆనందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
పడమట సంధ్యా రాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
పడమట సంధ్యా రాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి తీయని రాగం
ఒడిలో చెలి తీయని రాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
చల్లని సాగర తీరం
మది గిళ్లను మళయ సమీరం
చల్లని సాగర తీరం
మది గిళ్లను మలయ సమీరం
మదిలో కదిలే సరాగం
మదిలో కదిలే సరాగం
జీవితమే అనురాగ యోగం
జీవితమే అనురాగ యోగం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
లాలాలా లాలాలా లాలాలా
లాలాలా లాలాలా
Bratuku Teruvu (1953)
Palli Balakrishna
Saturday, July 15, 2017



