చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఎ. వి. సుబ్బారావు
విడుదల తేది: 11.03.1977
చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ... బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....
చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
ఇవ్వాలని లేదా ఏమీ....
ఆ సాగసంతా ఇవ్వాలని లేదా ఏమీ
ఓ సిరిపాపా ఎన్నాళ్లు దాస్తావేమీ...
చరణం:1
ముట్టుకుంటే ఉలికిపడతావ్
పట్టుకుంటే జారిపోతావ్
ముట్టుకుంటే ఉలికిపడతావ్
పట్టుకుంటే జారిపోతావ్
నీ చూపుల్లో ఉందీ సూదంటూరాయీ
అది లాగుతుంటే ఒళ్లంతా హాయి
చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ...బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....
చరణం:2
చేరుకుంటే ఊరుకుంటావ్
వల్లకుంటే గిల్లుతుంటావ్
చేరుకుంటే ఊరుకుంటావ్
వల్లకుంటే గిల్లుతుంటావ్
నీ చేతల్లో ఉంది చెకుముకి రాయి
అది రాసుకుంటే చురుకైన హాయి
చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
ఇవ్వాలని లేదా ఏమీ....
ఆ సాగసంతా ఇవ్వాలని లేదా ఏమీ
ఓ సిరిపాపా ఎన్నాళ్లు దాస్తావేమీ...
చరణం: 3
నిన్ను కట్టుకోవాలని మనసాతది.
చేయి పట్టుకోవాలంటే గుబులౌతది
నిన్ను కట్టుకోవాలని మనసాతది.
చేయి పట్టుకోవాలంటే గుబులౌతది
గుబులెందుకింకా గారాల చిలకా
ఎగిరెగిరిపోదాము సెలవంక దాకా
చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ... బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....
No comments
Post a Comment