-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Jawan"



చిత్రం: జవాన్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
నటీనటులు: శారుఖాన్, నయనతార, దీపికా పదుకొనే
దర్శకత్వం: అట్లీ
నిర్మాత: గౌరీఖాన్ 
విడుదల తేది: 07.09.2023



Songs List:



దుమ్మే దులిపేలా పాట సాహిత్యం

 
చిత్రం: జవాన్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: అనిరుద్ రవిచందర్, మంగ్లీ

సిన్ని గుండె నేడే ఆడమన్నదే
అయినా బిడియమేదో ఆపే… (రెడీ)

దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్
ధూలే రేగేలా ఎగిరి దుముకురా
భూమే బెనికేలా అదర అదరగొట్టెయ్
నింగే వణికేలా ఎగిరి దుముకురా

ఉడుకు దుడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చమకు ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

చిలిపితనము ఉండాలోయ్
చెలిమి గుణము ఉండాలోయ్
కరుణ తపన ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

ఊపిరి వెచ్ఛంగా, ఊహలు పచ్చంగా
హృదయము స్వచ్చంగా
ఉంటే మనిషండోయ్
హేయ్, హృదయము స్వచ్చంగా
ఉంటే మనిషండోయ్

ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
మగాళ్ళిలా చలించనే
ఆడే వాడే అందరివాడు
అందరి కోసం ఆడాలే
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే

లోకంలో నువ్వే లేవంటాను
నీలోనే లోకం ఉందంటాను
ప్రేమించే తత్వం చాలంటాను
వేరే వేదాంతం వద్దంటాను

ఎగుడు దిగుడు కలపాలోయ్
అడుగు నీడ కలవాలోయ్
కలుపుగోలుగుండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

ఉడుకు దుడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చెమకు ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

కొంచెం సరదాగా, కొంచెం మర్యాద
అంతా మనసారా ఉంటె మనిషండోయ్
అరె, అంతా మనసారా ఉంటె మనిషండోయ్

ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
మగాళ్ళిలా చలించనే
ఆడే వాడే అందరివాడు
అందరి కోసం ఆడాలే
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే




ఛలోన పాట సాహిత్యం

 
చిత్రం: జవాన్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: ఆదిత్య RK, ప్రియా మాలి

ప్రేమలో హాయి ఉందో
ప్రేమలో బాధ ఉందో ఓ
నిజంగా ఏది ఉన్నా
నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ

ప్రేమను ఆపే అడ్డు లేదట, గుట్టు లేదట
చుట్టూపక్క చూడబోదట ఓ ఓ ఓ ఓ
ప్రేమను కొలిచే పరికరాలని
సాధనాలని ఇంకెవరు కనిపెట్టలేదటా ఓఓ ఓ ఓ

ఓ చల్ చల్ ఛలోన
ఆ ఊపులోనే ఛలోన
ఆ వైపుగానే ఛలోనా
ఆపినా ప్రవాహాల పరుగాగునా
ఛలోన ఆ ఊపులోనే ఛలోన
ఆ వైపుగానే ఛలోనా
ఆపినా ప్రవాహాల పరుగాగునా

ఈ ప్రేమే ధ్యేయమై
వెయ్యేళ్ళ ఆయువై
ప్రాణాల వాయువై
వెళ్ళాలి వేగమై, వేగమై

ఈ ప్రేమే ధ్యేయమై, ధ్యేయమై
వెయ్యేళ్ళ ఆయువై, ఆయువై
ప్రాణాల వాయువై, వాయువై
వెళ్ళాలి వేగమై, వేగమై, హా

ప్రేమలో హాయి ఉందో
ప్రేమలో బాధ ఉందో ఓ ఓ
నిజంగా ఏది ఉన్నా
నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ

ప్రేమను మించే పదము లేదట
పదవి లేదట, మందీమార్బలమేమి లేదట, ఓఓ ఓఓ
ప్రేమను ఆపే శక్తి లేదట, యుక్తి లేదట
మొదలే కానీ పూర్తి కాదట, ఓఓ హో ఓ

ఓ చల్ చల్ ఛలోన
ఆ ఊపులోనే ఛలోన
ఆ వైపుగానే ఛలోనా
ఆపినా ప్రవాహాల పరుగాగునా
ఛలోన ఆ ఊపులోనే ఛలోన
ఆ వైపుగానే ఛలోనా
ఆపినా ప్రవాహాల పరుగాగునా

నువ్వంటే పరిమళాలు చిందే
కవితల పుస్తకానివంటా
నీలో మాటమాటాకింకా
ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా

నువ్వంటే పరిమళాలు చిందే
కవితల పుస్తకానివంటా
నీలో మాటమాటాకింకా
ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా

ఈ ప్రేమే ధ్యేయమై
(ప్రేమలో హాయి)
వెయ్యేళ్ళ ఆయువై
(ప్రేమలో హాయి)
ప్రాణాల వాయువై
వెళ్ళాలి వేగమై, వేగమై, హా



రామయ్య హే వస్తావయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: జవాన్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: అనిరుద్ రవిచందర్ , శ్రీరామచంద్ర, రక్షిత సురేష్ 

రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా హో

డాన్స్ విత్ మీ నౌ, ఐ కెన్ బ్రేక్ అవే
సిగ్గు ఎగ్గు వదిలేసి, షేక్ అవే షేకవే
హద్దు మనకు లేదంటా, ఆన్ ద వే
అంతులేని సంతోషం, టేక్ అవే టేక్ అవే

వర్క్ లోడు పక్కనెట్టు ఇప్పుడే
స్పార్కు నీది బయటపెట్టు ఇక్కడే ఇక్కడే
డిస్కో డాన్స్ ఫోజులన్నీ దండగే
దేసి డాన్స్ చేసి చూడు పండగే పండగే

అప్పుడేమో చయ్యా చయ్యారే
ఇప్పుడేమో తతా తయ్యా
రామయ్య వస్తావయ్యా
రామయ్య వస్తావయ్యా

రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా హో

రామయ్య వస్తావయ్యా
రామయ్య వస్తావయ్యా
(టియెనెస్ మి కొడాసోన్)
రామయ్య వస్తావయ్యా
రామయ్య వస్తావయ్యా
(టియెనెస్ మి కొడాసోన్)

దడ దడ ఊగిపోని ఫ్లో–రే ఫ్లోరే
ధగధగ రేగిపోని ఫైర్ ఫైరే
వీడు కానీ వాడు గానీ ఇమ్మెట్యూర్
అనుకొని రెచ్చిపోదాం ఇంకా మోరే

స్విచ్చే నొక్కేస్తే చందమామే
ఆగిపోతాడులే
నైటు నైటంతా చిందులోనే
తేలిపోవాలిలే

అప్పుడేమో చయ్యా చయ్యారే
ఇప్పుడేమో తతా తయ్యా
రామయ్య వస్తావయ్యా
రామయ్య వస్తావయ్యా

రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా అయ్యా హో
రామయ్య హే వస్తావయ్యా హో

రామయ్య వస్తావయ్యా
రామయ్య వస్తావయ్యా
(టియెనెస్ మి కొడాసోన్)
రామయ్య వస్తావయ్యా
రామయ్య వస్తావయ్యా
(టియెనెస్ మి కొడాసోన్)




నల్లాని చీకటిలో పాట సాహిత్యం

 
చిత్రం: జవాన్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: దీప్తి సురేష్ 

ఖైదులో కన్ను తెరిచే
కృష్ణుడు నువ్వేరా
లోకమే నీ కొరకే
ఎదురు చూసేరా

ఖైదులో కన్ను తెరిచే
కృష్ణుడు నువ్వేరా
లోకమే నీ కొరకే
ఎదురు చూసేరా

నల్లాని చీకటిలో
నిదురించే రేపటి పువ్వా, హో ఓ ఓ
నల్లాని చీకటిలో
నిదురించే రేపటి పువ్వా

లాలి లాలి జో జో
తెల్లారే వేకువగా
విహరించే రెక్కవి నువ్వా
లాలి లాలి జో జో

బాణమల్లే నువ్వే వెళ్ళాలిరా
విల్లులాగ నేనుంటా
బంధీఖానాలో బంధం నువ్వా
బ్రతికేందుకర్ధం నువ్వా
సంకెళ్ళలోని సంతోషం నువ్వా

బంధీఖానాలో బంధం నువ్వా
బ్రతికేందుకర్ధం నువ్వా
సంకెళ్ళలోని సంతోషం నువ్వా, ఓ ఓ ఓ

నల్లాని చీకటిలో
నిదురించే రేపటి పువ్వా
లాలి లాలి జో జో

ఖైదులో కన్ను తెరిచే
కృష్ణుడు నువ్వేరా
లోకమే నీ కొరకే
ఎదురు చూసేరా

ఆకసం ఆపిందంటే
హో ఓ ఓ, ఆకసం ఆపిందంటే ఓ ఓ
మెరుపై చీల్చాలిరా
ఆ, పర్వతం అడ్డు ఉంటే
పిడుగై దూకిపోరా
నువ్వు నా ఆశాజ్యోతి
అందరికీ కాంతి

ధైర్యం అంటే నా పేరే అంటా
త్యాగం నీ పేరంటా
చనుబాలు చెప్పే
పాఠం ఏదంటా

లాలి లాలి జో, లాలి లాలి జో
జో జో లాలి జో జో
జో జో లాలి, లాలి లాలి జో ఓ ఓ

నల్లాని చీకటిలో
నిదురించే రేపటి పువ్వా
లాలి లాలి జో జో

ఖైదులో కన్ను తెరిచే
కృష్ణుడు నువ్వేరా
లోకమే నీ కొరకే
ఎదురు చూసేరా




Jawan Title Track పాట సాహిత్యం

 
చిత్రం: జవాన్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: రాజా కుమారి 
గానం: అనిరుద్ రవిచందర్ , రాజా కుమారి 

Jawan Title Track



నాతో నువ్వుంటే గలాట పాట సాహిత్యం

 
చిత్రం: జవాన్ (2023)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: నకాష్ అజీజ్, జోనిత గాంధీ, అవిరు

నాతో నువ్వుంటే గలాట
గొడవే ప్రతి పూట
ప్రేమే పుడుతుంటే గలాట
తగువే ప్రతి చోట

హే గొడవే కాదా
షాదీ కి మూలం
పడదామా సరిగా
ఓ ఓ తగువే చేర్చును
తియ్యని తీరం
వెళదామా త్వరగా ఇలాగ

నాతో నువ్వుంటే గలాట
గొడవే ప్రతి పూట
ప్రేమే పుడుతుంటే గలాటా
తగువే ప్రతి చోటా

Advertisement
నువ్వు తెలుగు హంసవే
తెలుపలేవి హింసవే
చిలిపి చంద్ర జ్వాలవే
కలికి సూర్య ఛాయవే

దివ్యమైన మహిమలున్న
ప్రేమ దేవ ధూతవే
సోయగాల సైన్యమున్న
ప్రేమ యుక్త భూమివే

తెగువ తెగువ చూపినావే
మగువ జాతి రత్నమా
బిగువు బిగువు చూపమాకే
అగని తగున రూపమా

Advertisement
వదిలి వదిలి వెళ్ళమాకే
కదిలి నన్ను చేరువ
ఎదురు నుదురు ఉండిపోవే
నిధుల నిజస్వరూపమా

రాణి నేను, నువ్వే నా రాజా
జోడి ఎపుడు తాజా తాజా
కుస్తి అయిన కౌగిళ్లే అయినా
వస్తుందంట ఎంతో మజా

Advertisement
చిన్న చిన్న తప్పులు
హద్దు మీరి నడకలు
అందగత్తె ముందర
సహజమే కదా
ముద్దు ముద్దు శిక్షలు
మధురమైన బాధలు
పొందుతుంటే అదే
సౌఖ్యం కాదా

నాతో నువ్వుంటే గలాట
గొడవే ప్రతి పూట
ప్రేమే పుడుతుంటే గలాట
తగువే ప్రతి చోట

హే గొడవే కాదా
షాదీ కి మూలం
పడదామా సరిగా
ఓ ఓ తగువే చేర్చును
తియ్యని తీరం
వెళదామా త్వరగా ఇలాగ
గలాట… భలేగా
గలాట… ఇలాగా

Palli Balakrishna Friday, October 27, 2023


చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: ఆదిత్య, రఘురామ్, సాకేత్, సాయి కృష్ణ
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, ప్రసన్న, మెహరీన్ కౌర్ ఫిర్జాదా,
దర్శకత్వం: బి.వి.యస్.రవి
నిర్మాత: కృష్ణ (దిల్ రాజు సమర్పణలో)
విడుదల తేది: 2017

పల్లవి:
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్
అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన
బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్
తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్జా తూహి జవాన్
అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన
బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్
తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్జా తూహి జవాన్

చరణం: 1
కష్టం వస్తేనే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ
తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన
సేసేయ్ అనుకుందే తక్షణమున
చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున
స్వచ్చం అనునిత్యం నీ బుజమున
నిలుపుతు జన గణ మన

ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్

చరణం: 2
రోజూ నీకో యుద్ధమురా రాజీ పడితే వ్యర్ధమురా
జవాన్ జవాన్
జండా నీలో ధైర్యమురా జయమే దానికి ధ్యేయమురా
జవాన్ జవాన
నడు ఎవ్వరికొరకిక  వెతకక పదవురకెత్తే నువ్వు జవాన్
పడు పిడుగుకి జడవక పద నువ్ పుట్టిన మట్టికి ప్రాణమిడు
చూపించేయ్ యుధంతం కాలి కధం
బస్ బన్జా తూహి జవాన్

కష్టం వస్తేనే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ
తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన
సేసేయ్ అనుకుందే తక్షణమున
చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున
స్వచ్చం అనునిత్యం నీ బుజమున
నిలుపుతు జన గణ మన

ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్



******   ******   *******

చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యస్.యస్.థమన్ , శ్రేయా గోషల్

కొత్త నన్నే కనుగొన్ననా
ఉప్పెనేదో ఎగసే లోనా
పట్టుకున్నా పడిపోతున్నా
ఎందరున్నా వంటరవుతున్నా
అసలేంటీ వేదనా

అవుననా కాదనా ఉందనా లేదనా
దేనికో పేరు నే పెట్టలేనా
అవుననా కాదనా ఉందనా లేదనా
దేనికో పేరు నే పెట్టలేనా
ముందలా లేననా ఇంతలా మారినా
గుండెలో గుట్టుగా దాచుకోనా
అయోమయంగా ఇదేమిటో
అదే నయంగా ఉండేమిటో
అంతంటూ లేని కథేమిటొ
అందంగ ఉందీ అదేమిటో

ఇన్నాల్లు నాలో ఉన్నా అన్నీ తెలుసనుకుంటూన్నా
చూస్తూనే నీలో నన్నే నేనే కలిసిక వస్తున్నా
వద్దన్నా నువ్వే ఉంటే కల్లే పక్కకు లాగేనా
పర్లేదె అనుకుంటూనే మల్లి చిక్కుకుపోతున్నా
అసలేంటీ వేదనా అసలేంటీ వేదనా

సగం సగం మరో జగం
సగం సగం మరీ సుఖం
సగం సగం చెరో సగం
నువ్వో సగం నేనో సగం
సగం సగం మనోగతం
సగం సగం సహేతుకం
సగం సగం నిరంతరం
నువ్వో సగం నేనో సగం

పదానికే పెదవవుతా ని కల్లకే నిదరవుతా
ఏ పక్కనున్న ఎదురవుతా అల్లడితే కుదురవుతా
బాగుంది నీ గొదవా గోధారిలో పడవా
కల్లోను నన్ను విడవా కాస్త అల్లేసి ముడి పడవా
వద్దన్నా నువ్వే ఉంటే కల్లే పక్కకు లాగేనా
పర్లేదె అనుకుంటూనే మల్లి చిక్కుకుపోతున్నా
అసలేంటీ వేదనా అసలేంటీ వేదనా

సగం సగం మరో జగం
సగం సగం మరీ సుఖం
సగం సగం చెరో సగం
నువ్వో సగం నేనో సగం
సగం సగం మనోగతం
సగం సగం సహేతుకం
సగం సగం నిరంతరం
నువ్వో సగం నేనో సగం

******   ******   *******

చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దీపు

మనసే గట్టిగ పట్టుకు లాగావే
చెలియా లవ్ యూ బంగారూ
బంగారూ బంగారూ బంగారూ బంగారూ
బంగారూ బంగారూ బంగారూ బంగారూ

నీ చెకుముకి చూపు విసిరావే
హెయ్ చక చక నన్ను దోచావే
అలుకలుకలేవో గుండేలోన రేపావే
నడకసికలన్నీ చూసావే
నా ఎకసికలే భరించావే
ఈ తికమలన్నీ నువ్వు నేర్పుతున్నవే
అరె చాల్లే చాల్లే తూనీగా
చేసిందంతా నువ్వే గా
పైగా నన్నే అంటావే తప్పంతా నీదేగా
అరె చాల కాలం ఓపిగ్గా
ముద్దిస్తావని చుసాగా
నీతో ఇంక లాభం లేదని నేనిచ్చేసా నేరుగా

బంగారూ బంగారూ బంగరూ బంగారూ
బంగారూ బంగారూ బంగరూ బంగారూ

కోసల దేసపు రాజ కుమారివి నువ్వా
రాసులు పోసిన రంగుల జాతర నువ్వా
హేయ్ దోసిలి నింపిన వెన్నల తారవి నువ్వా
ఆశవిగా మరి ఆశలు పెంచేసావా

మనసే గట్టిగ పట్టుకు లాగావే
బంగారు బంగారు బంగారు బంగారు

ఏదొ పనిలో ఉన్నా నిన్నే తలచే క్షణం
నువ్వే ఎదురయ్యావే ఉహల్లో
ఏదో సరదా పదీ గల్లో బొమ్మేసినా
అది నువ్వయ్యావే గుండెల్లో
యెంత బాగుంది బాగుంది ఈ లాహిరీ
నన్ను లాగింది లాగింది నీ ఊపిరీ

అరె నీలో నన్నే చూస్తున్నా
నాలో నిన్నే దాస్తున్నా
నన్నే నువ్వు ఏం చేసావో నీకే తెలుసు నాయనా
బంగారూ బంగారూ బంగరూ బంగారూ
బంగారూ బంగారూ బంగరూ బంగారూ బంగారూ

నిన్నటి దాకా నాతో నడచిన చాయా
నీ వెనకాల వచ్చెను ఏంటీ మాయ
అరె ఊపిరి నాకే ఉక్కిరి బిక్కిరి హాయా
ఏం చేసావే చెప్పవే ఓ అమ్మాయా

మనసే గట్టిగ పట్టుకు లాగావే
చెలియా లవ్ యూ బంగారూ

******   ******   *******

చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాకేత్ , మోహన భోగరాజు

బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగింది
లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో
హోయ్ బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగింది
లొల్లీ జరిగిందీ గుప్పెడు గుండెల్లో
అంబా పలికింది పంబే రేగింది
రుంబ సంతోషమే రెండు కల్లలో

కుదిరిందె మనకి లగ్గం
ఇక నువ్వూ నేను తగ్గం
అరె గల్లి గల్లి మోగించేద్దం గట్టీ మేలాలే
ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ
నువు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారీ
ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ
నువ్ లిప్పు లిప్పు లిప్పు అందించాలే కన్యా కుమారీ

హోయ్ బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగిందీ
లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో
హేయ్ అంబా పలికిందీ పంబే రేగిందీ
రుంబ సంతోషమే రెండు కల్లలో

నీ చూపుల ముందూ యే మందూ గుండూ
సరిపోదు అంటున్న హల్లో అబ్బయో
నీ నడుము బెండూ చలి చీమల దండూ
నా చుట్టూ ముట్టేస్తే ఏట్టాగమ్మయో
నా పైటె కదా పక్కా..ఓ ఓ ఓ
నువ్ సుఖించరా ఇంకా..ఓ ఓ ఓ
నీ ఊగే ఊగే జుంకా
అది నాలో మోగే ఢంకా
నువు ఆగే పీచే లాగేస్తుంటే ఆగేదెలాగా

ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ
నువు తిప్పు తిప్పు తిప్పుకుంటు రావే కుమారీ
ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ
నువ్ లిప్పు లిప్పు లిప్పు అందించాలే కన్యా కుమారీ

హోయ్ బొమ్మ అదిరింది దిమ్మే తిరిగిందీ
లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో
హేయ్ అంబా పలికింది పంబే రేపిందీ
రుంబ సంతోషమే రెండు కల్లలో


******   ******   *******

చిత్రం: జవాన్ (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రీకృష్ణ ,లిప్సిక

బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా
బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా
మెడ అంచులలో ముద్దై
జడ అంచులలో తడివై
ఒడి అంచులలో తలవై
సమయం ఇచ్చెయ్ రా

ఈ వీక్షణం నిరీక్షనణం
తీరుస్తు ఉంటాను ప్రతీక్షణం
కౌగిళ్లతో శిక్షించనా
అంటుంది ప్రేమాక్షరం

చీరంచు దూరమే చెరిపెయ్
నడుమంచు చేతికే ఇచ్చెయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచెయ్

చీరంచు దూరమే చెరిపెయ్
నడుమంచు చేతికే ఇచ్చెయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచెయ్

బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా

నారింజ రంగుని ఎండలో
సారంగి తీగల సంధ్యలో
శ్రుంగార పువ్వుల పూజకే
సమయం ఇచ్చెయ్ రా

నా చేతి రాతల పంచన
కస్తూరి గీతల చెంతన
దస్తూరిలా మారేందుకే
సమయం ఇచ్చెయ్ రా

నీ సోయగం సోకే విషం
బాగుంది నాలోన ప్రవహించడం
నీ యవ్వనం యమపాశమే
అవుతుంటే ప్రాణోదయం

వయసంచు వరదలో ముంచెయ్
చెమటంచు వేడినే పెంచెయ్
తనువంచు తనువుతో కంచెయ్
అంచులు తెంచెయ్

చీరంచు దూరమే చెరిపెయ్
నడుమంచు చేతికే ఇచ్చెయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచెయ్

బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
సమయం సమయం ఇచ్చెయ్ రా

Palli Balakrishna Tuesday, October 17, 2017

Most Recent

Default