Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sarada Ramudu (1979)




చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: యన్.టి.ఆర్, జయసుధ, కాంతారావు, మోహన్ బాబు మంచు
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: యస్.రైజ్ భాషా
విడుదల తేది: 14.11. 1980



Songs List:



ల ల ల ల లకోటా పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ల... ల... ల... ల... లకోటా, సా... నీ... పా... సా... సపోటా 
లవ్వాడే నా ప్రేమలకోటా సయ్యాటాడే పాలసపోటా 
ల... ల... ల... ల....లకోటా, సా .. గా.... మా.... పా.... సపోటా 
మురిపించేనా ముదుగలాటా ఆటాడించే అగ్గిబరాటా 

కంటినిండా చూడ్డానికి ఒంటినిండా అందానికి
చాటూ మాటూ లోటూలేని - చక్కదనాల సపోటా
రెక్కలు చాపి చుక్కలుదాటి ఎగిరిపోకే డకోటా

పదహారేళ్ళ వయసుతో - శృంగారాలే నేర్చుకో 
పదారువన్నెల సొగసులో
ఓహ
శృంగారాలే తీర్చుకో
ఆహా.....
మల్లెపూల తోట పడుచుపాట టా టా 
మల్లెపూల తోట పడుచుపాట  టా టా
టా టా

కౌగిలింతలో దాగటానికి - దాగి హాయిలో తేలటానికి 
సాటీ లేనే లేని - చక్కని చిక్కని గలాటా 
టక్కులమారి పందెం వేస్తే దక్కకపోదీ పరోటా
పరువు బజారున పెట్టకే పరువాలన్నీ పంచుకో 
పనిలోవుంటే  తిట్టకే - పనివాడ్నని గురుంచుకో 
ప్రాణాలసలే తియ్యకే పసివాడ్నని గుర్తుంచుకో 
మాట అంటే మాట నీ ఆట వూరి బయట 
మాట అంటే మాట నీ ఆట వూరి బయట - అహ్వ




కుర్రపిట్ట కుర్రపిట్ట పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కుర్రపిట్ట కుర్రపిట్ట కుయ్యోమంది 
గుర్రుపెట్టి గుడ్డుపెట్టి  మొర్రోమంది 
కన్నెపిట్టక కన్నుగొట్టి ముద్దుపెట్టి పోమ్మంటే
బోల్తాకొట్టి దణ్ణం పెట్టి శాల్తీ గలంతయ్యింది
లక్సో.... లక్సో..... బాక్సో..... బాక్సో

రంపం.... డడడ రంపం డడడ.... 
రంపం.... డడడ .... రంపం.... డడడ... 
ఒడ్డూ పొడుగూ చూశాను అగ్గిపిడుగనుకున్నాను 
ఏట్లో పడితే ఈతారాదు చేలో పడితే కోతారాదు
చెయ్యందిస్తే - చెలిమిచేస్తే 
చెలినేనంటే - చెరిసగమంటే 
చాతాకాదు వాతాకాదు కుయ్యో మొర్రో 
పీతబుర్ర నేతిబీర తుస్సో తుస్సో 
లక్సో... లక్సో.... బాక్సో .... బాక్సో

అరెరె కుర్రపిట్ట కుర్రపిట్ట కుయ్యోమంది 
ఆయ్ గుర్రు పెట్టి గుడ్డుపెట్టి మొర్రోమంది 
కన్నెపిట్ట కన్నుగొట్టి ముద్దుపెట్టి  రమ్మంది 
బోల్తా కొట్టి  దణ్ణం పెట్టి పెట్టి శాల్తీ  గల్లంతయ్యింది
లుక్సో .... లుక్సో .... బాక్సో.... బాక్సో ...

రం పం.... డడడ .. రం పం.... డడడ....
రం పం.... డడడ.... రం పం....డడడ ....

చుట్టమల్లె వచ్చావు చూపు మాట కలిపావు 
అల్లరి చేసే ఈడు ఉంది చిల్లరిగోలకు జోడు ఉంది చలిమీదున్నా
అహ
సలసల మన్నా
అమ్మమ్మమ్మా....
వలపిస్తున్నా వాటేస్తున్నా.. 
కూత పెడితే వాత పెడతా కుయ్యో మొర్రో
వాత పెడితే నోటి కూత లబోదిబో
లుక్సో .... లుక్సో .... బాక్సో.... బాక్సో ...




అంబ పలికిందిరా పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

యహూ .. యాహూ 
అంబ పలికిందిరా రంభ కులికిందిరా 
ఆ సిగులుచిలికే చిలకల కొలికి
చీటికి మాటికి నవ్వేసరికి
నా గుండెఝల్లందిరా యాహూ

కన్నుకొట్టిందిరా ఘల్లు మంటోందిరా
నా ఒళ్ళంత ఒక వింత తుళ్ళింతగా
సై అంటే సె ఆన్నది సన్నజాజులు బుల్లీ 
రమ్మనకే దిగివచ్చిందీ రంభా ఊర్వశి చెల్లి 
నాలో ఆశలన్నీ - ఎన్నో పూలుపూసి 
ఒంటరిగుంటే తుంటరిగుంట 
జంటగ తానే వచ్చిందిరా. యాహూఁ....

కొంగు తగిలిందిరా - రంగు తెలిసిందిరా
నా కళ్ళంత కలగన్న కవ్వింతగా ఆహా.. 
వానల్లో తానాలాడి వచ్చేనా సంపంగి 
ఎన్నెల్లో ఏడెక్కించి నవ్వే సుందరాంగి 
ఏదోబాస చేసే జాసేలేని పూసే
గిలి గిలి పెట్టు బులి బులి పిట్ట 
చెంతకుచేరి - చెప్పిందిగా 





ఒక్కరిద్దరయ్యే వేళ... పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

ఒక్కరిద్దరయ్యే వేళ... ఇద్దరొక్కటయ్యేలాగ
దుప్పటల్లే కప్పుకుందామా.... 
వయసు...ఎప్పటల్లె వుండిపోదామా 
ఆహా.. ఎప్పటల్లె వుండిపోదామా....
ఊగాలా ఊగాలా ఉయ్యాలా జంపాలా

ఒక్కరిద్దయ్యే లాగ యిద్దరొక్కటయ్యే లాగ
దుప్పటల్లె కప్పుకుందామా.... 
వయసు ఎప్పటల్లె పుండిపోదామా ఆ.. హా. 
ఎప్పటల్లె వుండిపోదామా... 
ఊగాలా ఊగాలా ఉయ్యాలా జంపాలా

గాఢమైన కౌగిట్లో గారాల ముచ్చట్లో
ప్రాణమిచ్చే గాలి ప్రాణాలు పోతుంటే
ఆరవ ప్రాణమై.. ప్రాణానికి ప్రాణమై 
ఆరవ ప్రాణమై ప్రాణానికి ప్రాణమై 
ఊపిరి తగిలిన తనువే ఊగుతువుంటే 
ఊగాలా ఊగాలా - ఉయ్యాలా జంపాలా

ఈ సంధ్య చీకట్లో - నీ వలపు వాకిట్లో 
నీ మల్లెల నవ్వుల్లో  - నా వెన్నెల వస్తుంటే 
అది తొలి రాతిరై - విర జాజుల జాతరై 
ఇద్దరి అల్లరి ఊరికి కధలవుతుంటే
ఊగాలా ఊగాలా ఉయ్యాలా జంపాలా



మంచు మొగ్గ తుంచుకొచ్చి.. పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మంచు మొగ్గ తుంచుకొచ్చి.. వానపువ్వు కోసుకొచ్చి 
కొప్పులోన పెడితే ఏం తప్పా? 
ఘుప్పుమన్న సిగపువ్వు నాతప్పా? 
ఒప్పులకుప్పా - వయ్యారిభామా

మంచుమొగ్గ తుంచుకొచ్చి.. వానపువ్వు కోసుకొచ్చి
కొప్పులోన పెడితే ఎంగొప్పా? 
ఘుప్పుమన్న సిగపువ్వు  నీ గొప్పా? 
చెప్పకుగొప్పా.. ఛాలెంజిరామా

మంచుకొండ మంచమేసి మల్లెపూల పక్కలేసి 
వెన్నెలొచ్చి కన్నుకొడితే ఏంతప్పా?
చందమామా కంచమెట్టి  అందమంత విందుచేస్తే 
ఆకలేసి రంకెలేస్తే ఏంగొప్పా?
అల్లాటప్పా అనుకోకు ఈడుగొప్పది
తప్పో ఒప్పో ఏమైనా గొప్పకాదది..నీ గొప్ప కాదది 
చెప్పకు గొప్పా ఛాలెంజిరామా

సిగ్గు మొగ్గ చిదిమివేసి పడుచుపాట పలికిస్తుంటే 
నీతో తైతక  చేరుకుంది ఎంతప్పా?
చినుకు నీలో చిటికలేసి..
వయసు నాలో వణుకు తుంటే

నీతో నీతకి చేరుకుంటే ఎంతప్పా? 
ఒణికి ఒణికి పోతుంటే ఒంటితప్పది 
ఒదిగి ఒరిగి పోతుంటే జంటతప్పది
ఈ తప్పే గొప్పది. ఆఁ - 
ఒప్పులకుప్పా.. వయ్యారిభామా 
ఒప్పులకుప్పా.. వయ్యారిభామా




అబ్బబ్బో సోకు పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

అబ్బబ్బో - అబ్బబ్బో సోకు సోకు
అబ్బబ్బో - అబ్బబ్బో సోకు సోకు 
చీర కేదిసోకు నువ్వు చీర కట్టుకుంటే సోకు 
చీరలేలా చినదానా సిగ్గు పడ్డావంటే నాకు షాకు 
బల్లిపూర్ రాణీగార్ బలదూర్
ఈయ
సోకు. సోకు
అమ్మమ్మో.. అమ్మమ్మో రాకు.. రాకు..
పైకి రాకు రాకు
నువ్వు నన్ను చూడకుండా పోకు.. 
ఈ వేళ- చిన్నోడా
ముద్దులిస్తా ముట్టుకోకు... బుల్లి బుల్లి రాజావార్ భలేజోర్
రాకు రాకు
సోకు సోకు

దాచేది దాగదు.. ఏయ్ దోచేది ఆగదు
మబ్బుల్లో మెరుపంటి మాయలాడి 
నా చూపుసోకినా ఆ తీపి తాకినా 
తబ్బిబ్బు అవుతావె చుక్కలేడి 

మెలి తిరిగే ఒళ్ళంతా చలిపెరిగే తుళ్ళింతా 
కనుచూపే కవ్వింతా ననురేపే రవ్వంతా 
ఆపూ ఆచూపు- ఆచూపే నాకైపు 
ఆపూ ఆచూపు.. చూడొద్దు.. నావైపు
రాకు రాకు 
సోకు సోకు

పరదాలు తీసే సరదాల సొగసు.. 
సరదారు నేనే యువరాణి
అరుదైన వలపు బిరుదైన పిలుపు
మనసైతే కాచుకో అలివేణి

మనసైన మహారాజా ఐ లవ్ యూ యువరాజా
రాత్రేళా రవితేజా.. రారా నా రసభోజ 
ముద్దు.. అరముద్దు.. ఈ పొద్దు.. నాకిద్దు 
ముద్దు. అరముద్దూ.. దాటొద్దు.. సరిహద్దు 
రాకు రాకు 
సోకు సోకూ




చల్లంగ జారి పాట సాహిత్యం

 
చిత్రం: సరదా రాముడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి.బాలు, పి.సుశీల

చల్లంగ జారి మెల్లంగదూరి.. 
చల్లంగజారి మెల్లంగదూరి 
మబ్బులోన వుండిపోకురా.. ఓమావా  
సిగ్గుమొగ్గలేస్తుందిరా 

చల్లంగ జారి  మెల్లంగ దూరి 
చల్లంగ జారి  మెల్లంగ దూరి 
మబ్బులోన వుండిపోనులే ఓభామా 
సిగ్గు మొగ్గకోస్తానులే

చంటిబిడ్డ సామెతల్లె మనసు తెలపవు 
ఒంటికాయ సొంటికొమ్ము వయసు కలపవు
చెంతకొస్తే చింతదీర్చి చేయి కలపవు
నిన్ను చూస్తే నన్నుచూసి కన్ను కలపవు
సరస చేరుకోరాదే తగవు దేనికి 
సరసమాడి తారాడే రట్టుదేనికి 
ఈ రట్టుదేనికి  - హహ్వహ

అందమంత సందడాయెరా- ఓమావా! 
అందుకుంటే విందులాయెరా- ఓమావా? 
అందుకుంటే విందులాయెరా

గుండెకోన ఎండకాసి దప్పికొస్తది.. 
అందరాని రాణికోసం అల్లరవుతది
కట్టుకున్న వుల్లి కోక కసురుకుంటది 
పెట్టుకున్న మల్లెగాలి ముసురుకుంటది 
గుట్టుదాటి వచ్చాక గొడవ దేనికి
ఉట్టి పొగరు దించాక బెట్టు దేనికి? 
మన పట్టు దేనికి
హహహ లోనిగుట్టు వెల్లడాయేనే.. ఓభామా! 
తేనెపట్టు వెల్లవాయేనే 
లోనిగుట్టు వెల్లడాయెనే ఓభామా  
తేనెపట్టు వెల్లడాయేనే 


Most Recent

Default