-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "M. R. V. Prasad"



చిత్రం: బాలగోపాలుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: బాలక్రిష్ణ , సహాసిని మణిరత్నం
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యమ్.ఆర్.వి.ప్రసాద్
విడుదల తేది: 13.10.1989



Songs List:



ఒకటే తనువంతా పాట సాహిత్యం

 
చిత్రం: బాలగోపాలుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

ఒకటే తనువంతా ఒక వింత తకధింతా
ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత
సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగే
వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే, ఓ ఓ
కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే

ఒకటే తనువంతా ఒక వింత తకధింతా
ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత

నీ చూపు పడ్డనాడే చుక్కలాడే
నీ ముగ్గు పచ్చలన్నీ ఎర్రనాయే
నీ గాలి సోకగానే సోకులాడే
నీ ఒంపుసొంపులన్నీ ఒళ్ళు చేసే

ఈ తాకిడి ఒక తారంగము
ముద్దాడితే తొలి తాంబూలము
హత్తుకుంటే హాయి పుట్టసాగే
గుడ్డు పిట్ట కూతే పెట్టసాగే

శృంగార వీధుల్లో ఊరేగుతుంటే
అందాలు కళ్ళల్లో ఆరేసుకుంటే
ఒయ్యారంగా ఒళ్ళోకొస్తాలే,హో ఓ
వన్నే చిన్నె మెల్లో వేస్తాలే ఈనాడే

ఒకటే తనువంతా ఒక వింత తకధింతా
ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత

నీ కాటుపడ్డ బుగ్గ కందిపోయే
నీ చాటు అందమంత చిందిపోయే
నీరెంట పడ్డ నీడ నిన్ను కోరే
నీ వెన్ను పూస మీద గవ్వలాడే

ఈ చీమలే చలి నారింజలై
పండించిన తొలి గోరింటలై
మత్తుగాలి వీచే మాపటేలా
కొత్త ఊపుకొచ్చే రాసలీల

సయ్యాట తోటల్లో సంపెంగ పూసే
నీ కంటి పాపల్లో జాబిల్లి కాసే
కళ్యాణాలే కల్లోకొస్తుంటే, ఓ ఓ
కట్నాలన్నీ ముందే ఇస్తాలే ఈనాడే

ఒకటే తనువంతా ఒక వింత తకధింతా
ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత
సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగే
వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే, ఓ ఓ
కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే

ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత



బావా బావా బంతిపువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: బాలగోపాలుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ
మావ మావ చందమామ సందేళ్ళకి చాపెక్కవ
మనసోటి ఉందిక్కడ వరసేరో నీజిమ్మడ
బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన
గుమ్మ గుమ్మ గూట్లో బొమ్మ దుమ్మిప్పుడే దులిపెయ్యన
దరువేస్తే ఎడపెడ గొడవేలె ఊరువాడ

బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ
బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన

పాలుగారే సొగసోచ్చింది పంచుకుంటావా
పూలుకోరే వయసోచ్చింది పుచ్చుకుంటావా
పండే పైరమ్మలో వయ్యారమె చూశా
వచ్చే గౌరమ్మతో వసంతమాడేసా
అందమే జత చేసుకో అందులో గిచ్చి చూసుకో
కదలాడే నడుమెక్కడో అదిలాగే వడుపక్కడే

బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ
బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన

చేను దున్నే పదునోచ్చింది చేతికోస్తావా
పంట కోసే అదునొచ్చింది పక్కకోస్తావా
మల్లె పూదోటలో నయ్యన మాటేసా
సంధ్య పొద్ధిల్లలో సయ్యన వాటేస
గుమ్మగా గురి చూడని కమ్మగా కసి తీరని
వలవేసే వలపెక్కడో పరువాల పరుపక్కడే

బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవా
హ హహ… హహహ
బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన
ఎహే హే ఎహే…ఎహే హే
మనసోటి ఉందిక్కడ వరసేరో నీజిమ్మడ




చక్కనమ్మ పక్కనుంటే పాట సాహిత్యం

 
చిత్రం: బాలగోపాలుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

చక్కనమ్మ పక్కనుంటే 




చిటికమీద చిటికలలే పాట సాహిత్యం

 
చిత్రం: బాలగోపాలుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

చిటికమీద చిటికలలే 



సువ్వి సువ్వి పాట సాహిత్యం

 
చిత్రం: బాలగోపాలుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

సువ్వి సువ్వి 



Don't worry be happy పాట సాహిత్యం

 
చిత్రం: బాలగోపాలుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

Don't worry be happy

Palli Balakrishna Sunday, March 25, 2018



చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , కత్రినాకైఫ్, ఛార్మి
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: యమ్.ఆర్.వి.ప్రసాద్
విడుదల తేది: 05.10.2005



Songs List:



డిక్కీ డిక్కీ డీడిక్కీ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్ , చిత్ర

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి
డిక్కీ డిక్కీ డీడిక్కీ పరువాల పండక్కి
వచ్చానయ్యో చెక్కిలి ఎరుపెక్కి
వయ్యారాలే చప్పున బరువెక్కి
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
కొల్లగొట్టేసి పోనా తెల్లారేకల్లా
రారాదు బువ్వేలేరా శృంగార కోటకి

అష్టాచెమ్మాలే  చెమ్మచెక్కాలే
జరగాలి జామురేయి జాగారాలే
గుడు గుడు గుంచాలే చడుగుడు మంచాలే
ఈదాలి సంబరాల సాగరాలే

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి

చెరువుల్లో చేపలకై వెతికేస్తుంది కొంగ
చీకట్లో చీరంతా తడిమేస్తావ దొంగ (2)
సరసాల సమరంలో సరదాల సమయంలో 
తెరచాటు ఉంటే వేగేదెలా
అడిగింది ఏమైనా వీల్లేదు అన్నానా
బాహాటమైతే బాగోదుగా
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
అల్లాడించేసి పోనా తెల్లారేకల్లా
అయితే మరి వెళ్ళొద్దామ అనువైన చోటుకి

అల్లోనేరేల్లో అమ్మో నీకళ్లు
అచ్చంగా ఉన్నావమ్మో బొమ్మలాగ
పుల్ల మావిల్లో అపుడే వేవిల్లో
విడ్డురం చూడాలమ్మో అమ్మలాలో

తెలియంది తెలియాలంటే చదవాలయ్యో బుక్స్
చూసింది కావాలంటే కలపాలయ్యో లిప్స్ (2)
నీమాటలు ముదిరాయే అధరాలే అదిరాయే
అరుదైన దాహం తీరేదెలా
తాపాలే పెరిగాక తమకంతో రగిలాక
పడకింటి తీరం చేరాలిగా
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
గిల్లి గిచ్చేసి పోనా తెల్లారేకల్లా
దుప్పట్లో దూరేద్దామ బాబు సయ్యాటకి

బంగరు బుల్లోడే బంపరుగున్నాడే
మాటల్తో మాయచేసి లాగుతాడే
తుంటరి పిల్లోడే తొందరగున్నాడే
ఎన్నెన్నో తందనాలు ఆడుతాడే

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి





మల్లెల్లోన ఇల్లెయ్రా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్, సుజాత 

మల్లెల్లోన ఇల్లెయ్రా  ఇల్లెక్కేసి ఈలేయ్ రా



చినుకులాగా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ 
గానం: రంజిత్, సుచిత్ర 

చినుకులాగా 




మా సుబ్బలచ్చమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సునీత 

మా సుబ్బలచ్చమ్మ 



ఒంగోలు గిత్తరో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, మహలక్ష్మి అయ్యర్ 

ఒంగోలు గిత్తరో 




నేడే ఈ నాడే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: మల్లికార్జున్ , శ్రీవర్ధిని

(ఈ పాటను యన్.టి.రామారావు నటించిన భలే తమ్ముడు (1969) సినిమాలో నుండి  రీమిక్స్ చేశారు)

నేడే ఈ నాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..

వాలుకన్నుల వన్నెలాడివి వగలే చాలు నిరజాణ
దోర ఆశల దొంగ చూపుల చొరవే నీవు అనుకోన
వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా
ప్రేమంటే శృంగరమా రమ్మంటే చిరు కోపమా
మహా పెంకి మగువలు మీరు 
మనసైతె మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు

నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..

ఆరుబైటిలా కన్ను గీటడం ఔరా మీకు మర్యాదా
కంటి సైగకే పైట జారడం ఐనా తమకు బాగుందా
పైపైకి పరిహాసమా బెట్టంత చెలి కోసమా
పెదవుల్లో దరహసమా అదికూడ ఓ వేషమా
మహారాజు భోగులు మీరు మరి నాకు లొంగకపోరు
పరువాల మేనకగారు నను ఇంక విడిపోలేరు

నేడే ఈ నాడే కలిపింది కన్ను చెలి తానే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
అహ హా... ఆ ఆ ఆ 
అహ హా... ఆ ఆ ఆ 


Palli Balakrishna Sunday, October 15, 2017

Most Recent

Default