Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sunil Kashyap"
Lakshmi Bomb (2017)



చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
నటీనటులు: లక్ష్మీ ప్రసన్న, పోసాని కృష్ణమురళి, హేమ 
దర్శకత్వం: కార్తికేయ గోపాల కృష్ణ 
నిర్మాత: గున్నపాటి సురేష్ రెడ్డి 
విడుదల తేది: 10.03.2017



Songs List:



చిన్ని తల్లీ చిన్ని తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: కరుణాకర్ 
గానం: అశ్విని 

నీలాల కల్లనీ నీ బుజ్జి బుగ్గనీ
నా కంటి పాపలాగ చూసుకోనా
నీ చిన్ని నవ్వుని నీ కాలిమువ్వని
నా గుండె గూటిలోన దాచుకోన
నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మ
నీ పరుగులో ఉన్నాయమ్మా
నా రాత నా గీత నీ చేతి రేఖల్లో రాసాడె ఆ బ్రహ్మ…

చిన్ని తల్లీ చిన్ని తల్లి నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జి తల్లీ బుజ్జి తల్లీ నిన్నువీడి ఎడకెల్లలేనే
ఓ అలె అలె అలాలె అలె అలె
ఓ అలె అలె అలాలె అలె అలె

నీ పాదం వేసేటి నేలంత నా ప్రాణం పరిచేసి ఉందంట
నీ చూపే సోకేటి గాలంత నా శ్వాసైపోయింది నేడింక
నీ కోప తాపాలలో నేనే అల్లాడి పోతానమ్మా
నీ మాట ముత్యాలలో నేనే ఆనందమవుతానమ్మా
ఆకాశమంతున్న అంతోటి నా ప్రేమ ఎట్టాగ చూపించుకోనమ్మా

చిన్ని తల్లీ చిన్నితల్లి నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జితల్లీ బుజ్జితల్లీ నిన్నువీడి ఎడకెల్లలేనే
ఏఏ ఏఏ…

ఓ జన్మే చాలేట్టు లేదింక నా ప్రేమే నీతోటి పంచంగ
క్షణమైనా నువ్వు లేని చోటంతా విషమల్లే ఉంటుంది నా వెంట
నా గుండెసవ్వల్లనే వింటే నీ పేరే ఉంటుందమ్మా
ఓ వెండి వెన్నెల్లో ఈ ఇంట నీ నవ్వులుండాలమ్మా
ఓ నీ ముద్దు మోమింకా నా ముందు ఉంటేనె జాలింక కోరేదే లేదమ్మా

చిన్ని తల్లీ చిన్నితల్లి నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జితల్లీ బుజ్జితల్లీ నిన్నువీడి ఎడకెల్లలేనే

నీలాల కల్లనీ నీ బుజ్జి బుగ్గనీ నా కంటి పాపలాగ చూసుకోనా
నీ చిన్ని నవ్వుని నీ కాలిమువ్వని నా గుండె గూటిలోన దాచుకోన
నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మ నీ పరుగులో ఉన్నాయమ్మ
నా రాత నా గీత నీ చేతి రేఖల్లో రాసాడె ఆ బ్రహ్మ…

చిన్ని తల్లీ చిన్నితల్లి నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జితల్లీ బుజ్జితల్లీ నిన్నువీడి ఎడకెల్లలేనే




రంగు రంగు పూలలోనే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: కరుణాకర్ 
గానం: అశ్విని 

రంగు రంగు పూలలోనే



తరుము తరుము పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: శ్రీరామ్ తపస్వి 
గానం: హేమచంద్ర 

తరుము తరుము 



అగ్గై వస్తా నిన్నే బుగ్గే చేస్తా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: మనీషా ఈరబత్తిని , అశ్విని 

అగ్గై వస్తా నిన్నే బుగ్గే చేస్తా



లక్ష్మీ బాంబు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: శ్రీరామ్ తపస్వి 
గానం: మనీషా ఈరబత్తిని 

లక్ష్మీ బాంబు

Palli Balakrishna Monday, August 29, 2022
Ninnu Kalisaka (2009)



చిత్రం: నిన్ను కలిశాక (2009)
సంగీతం: సునీల్ కశ్యప్ 
నటీనటులు: చైతన్య కృష్ణ, సంతోష్ , ప్రియ వర్మ 
దర్శకత్వం: కె. శివ నాగేశ్వర రావు 
నిర్మాత: రామోజీ రావు 
విడుదల తేది: 02.10.2009



Songs List:



నిన్నటి వరకు పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కలిశాక (2009)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: లక్ష్మీభూపాల్ 
గానం: అచ్చు, సాయి శివాని 

నిన్నటి వరకు 



మౌనం మనసుల్లోన పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కలిశాక (2009)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: లక్ష్మీభూపాల్ 
గానం: యస్.పి. బాలు, గాయత్రి 

మౌనం మనసుల్లోన 



అందమైన అందమా పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కలిశాక (2009)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: హరిహరన్, సుజాత 

అందమైన అందమా 




మబ్బే నేలపైకి పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కలిశాక (2009)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: వనమాలి 
గానం: సునీల్ కశ్యప్ , ప్రణవి 

మబ్బే నేలపైకి 




ఐ లవ్యూ లవ్యూ పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కలిశాక (2009)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: లక్ష్మీభూపాల్ 
గానం: దీపు , ప్రణవి 

ఐ లవ్యూ లవ్యూ 



దిల్ సే దిల్ సే పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కలిశాక (2009)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: సునీల్ కశ్యప్, ప్రణవి 

దిల్ సే దిల్ సే

Palli Balakrishna Thursday, August 11, 2022
Liger (2022)



చిత్రం: లైగర్ (2022)
సంగీతం: విక్రమ్ మంత్రోస్, లిజో జార్జ్ , DJ చీట్స్, సునీల్ కశ్యప్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సునీల్ కశ్యప్
నటినటులు: విజయ్ దేవరకొండ , అనన్య పాండే, ఐశ్వర్య రాజేష్, రాశిఖన్నా, కేథరీన్ థెరీసా
దర్శకత్వం: పూరీ జగన్నాథ్ 
నిర్మాతలు: కరణ్ జోహార్, ఛార్మి కౌర్ , పూరి జగన్నాధ్ , హిరో యాష్ జోహార్
విడుదల తేది: 25.08.2022



Songs List:



లైగర్… (హంట్) పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: విక్రమ్ మంత్రోస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేదాల హేమచంద్ర 

యా..! దిన్ తకతక దిన్న
తకతక దిన్… తకతక దిన్న
తకతక తకదిన్ దిన్… తకదిన్ దిన్
తకతక దిమ్… తకతక దిమ్

యే, బతకాలంటే గెలవాల్సిందే
లెగు లెగు తక్ దిన్ దిన్
తక్ దిన్ దిన్నా

ఎగరాలంటే రగలాల్సిందే
లెగు లెగు తక్ దిన్ దిన్
తక్ దిన్ దిన్నా
(తకదిన్ దిన్… తకదిన్ దిన్)
(తకతక దిన్… తకతక దిన్)

నువ్ పుట్టిందే గెలిచేటందుకు
దునియా చెమడాల్ ఒలిచేటందుకు
అది గుర్తుంటే… ఇంకేం చూడకు
ఎవడు మిగలడు… ఎదురు పడేందుకు

చల్ లైగర్… లైగర్ (హంట్)
లైగర్… (హంట్)

దిన్ తకతక దిన్న తకతక
దిన్ తకతక దిన్న తకతక
తక దిన్ దిన్… తక దిన్ దిన్
తకతక దిం… తకతక దిన్న




అక్కిడి పక్కిడి పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: లిజో జార్జ్ , DJ చీట్స్, సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల,  మోశిన్  షేఖ్, అజీం దయాని 
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్యా బెహ్రా 

అక్కిడి పక్కిడి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్క దికిడి దికిడి దికిడి డికిడి డికిడి
దికీరో దికీరో దికీరో… దికీరో దికీరో

అక్డి పక్డి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
లెట్స్ గో బాయ్స్… ఫుల్లు మాంజా

అకడి పకడి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
డికిడి డికిడి దికీరో

అకడి పకడి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
డికిడి డికిడి దికీరో

ఏయ్ నిన్నే చూసి ఓ మై డార్లింగ్
మనసే ఫ్లై ఫ్లై హో గయా
తబలా నడుమే తగలగానే
వయసే షై షై హో గయా

ఏ, నిన్నే చూసి ఓ మై డార్లింగ్
మనసే ఫ్లై ఫ్లై హో గయా
తబలా నడుమే తగలగానే
వయసే షై షై హో గయా

అరె చక్కని చుక్కను పక్కన పెట్టుకు
దిక్కులు చూడకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టే
చెప్పు ఐ లవ్ యూ

అరె చక్కని చుక్కను పక్కన పెట్టుకు
దిక్కులు చూడకు
నిన్నాపతరం ఎవడితరం
లైగర్ స్టెప్పు ఆడి చూపించు

అక్డి పిక్డి తుక్డి పిక్డి వాట్ ద ఫ్…?
అక్డి పక్డి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
డికిడి డికిడి దికీరో

అక్డి పక్డి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
డికిడి డికిడి దికీరో

ప ప ప ప పప ప ప
మేరె లైగర్ దీవానా హో గయా
ప ప ప ప పప ప ప
మేరె లైగర్ దీవానా హో గయా
(పార్టీ ఓవర్ – గో హోమ్)



Waat Laga Denge పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: పూరీ జగన్నాథ్ 
గానం: విజయ్ దేవరకొండ

We are Indians
हम किसीसे कम नहीं
Hum Kisise Kam Nahin

मेरी बहन..! मेरे साथ आजा
Meri Bahan..! Mere Sath Aaja
Podaam Kotladadhaam
పోదాం… కొట్లాడ్దాం
सबकी Wa Wa..! Waat Laga Denge

Waat Laga Waat Laga
Waat Waat Waat Waat
Waat Laga Denge
Aag Hain Andar
Aag Aag Aag Hain Andar
Aag Hain Andar

Waat Laga Denge
Waat Laga Denge
Waat Laga Denge
Waat Laga Denge

We are Indians
Waat Waat Waat
Pa Pa Pa Pa Paa Paa
Waat Waat Waat
Waat Waat Waat
Pa Pa Pa Pa Paa Paa

Waat Waat Waat
Waat Waat Waat
Waat Laga Denge



ఆఫట్ పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: తనిస్క్ బాగ్చి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రావణభార్గవి

తేనె కళ్ళతోటి
పిల్లగాడు పట్టేసిండే
మందు పెట్టేసిండే
మంట పుట్టించిండే

ప్రేమ జెండ తెచ్చి
గుండెల్లోన నాటేసిండే
నాలో దూరేసిండే
నన్నే మార్చేసిండే

ఏ, చేసిందే చేసి
నన్నంటావేందీ
నా లవ్లీ లాలిపాప్

జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆ ఆ
ఫట్ కేలియే చోడ్ దో ముజే

నన్నే ఇచ్చుకుంటాను
గిల్లి గిచ్చుకుంటాను
పంటి గాటుతోటి
పచ్చ బొట్టు పెట్టుకుంటాను

నిన్నే కప్పుకుంటాను
చుట్టూ తిప్పుకుంటాను
నాలో నొప్పులేంటో
తిప్పలేంటో చెప్పుకుంటాను

హే, నువ్వడిగావంటే
కాదంటానేంటే
నువ్వే నా లబ్ డబ్

జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆ ఆ చోడ్ దో
చోడ్ దో చోడ్ దో ముజే
జవానీ తేరి… ఆ ఫట్




కొనిస్తనే కోక పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: జానీ,  లిజో జార్జ్ , DJ చీట్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రామ్ మిరియాల, గీతామాధురి

కొనిస్తనే కొనిస్తనే… కొనిస్తనే
లెట్స్ గో క్రేజీ
కొనిస్తనే కోక కోక కోక కోక కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక కోక కోక కోక కోక

కొనిస్తనే కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక
కొనిస్తనే కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక

కొనిస్తనే కుకుకుకు కుకు కోక కుకు కోక
కట్టిస్తనే కుకుకుకు కుకు కోక కుకు కోక
లెట్స్ గో..!

నల్ల ముక్కుపుడక ఎట్టుకుంటే
మగాడి గుండె ఎట్టాగుతుందే
తెల్ల పాలపిట్ట లాగ నువ్వు ఒళ్ళు
ఇరుసుకుంటే నిద్దరట్టగుందే

నల్ల ముక్కుపుడక ఎట్టుకుంటే
మగాడి గుండె ఎట్టాగుతుందే
తెల్ల పాలపిట్ట లాగ నువ్వు ఒళ్ళు
ఇరుసుకుంటే నిద్దరట్టగుందే

నీ మైకం ఎక్కి దిగదే
ఎక్కి తొక్కే రగడే
నీ అందం చెక్కిందెవడే

కొనిస్తనే కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక
కొనిస్తనే కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక

హా జీ..! ఓ బాబు ముద్దులెట్టి
తీర్చుకుంట మొక్కులే
నీకు ఇచ్చినాక రాసుకోను లెక్కలే
అసలే వెనక్కి తగ్గను ఇక మొదలే తైతకతక్కలే

బాబు ముద్దులెట్టి
తీర్చుకుంట మొక్కులే
నీకు ఇచ్చినాక రాసుకోను లెక్కలే
అసలే వెనక్కి తగ్గను ఇక మొదలే తైతకతక్కలే

ఓలమ్మో పట్టపగలే
నువ్వట్టా ఇట్టా తగిలే
అమాంతం పుట్టే తెగులే
(తెగులే తెగులే)

కొనిస్తనే కొనిస్తనే కొనిస్తనే, ఆహ
కొనిస్తనే, హ హ… కొనిస్తనే, హ హ
కొనిస్తనే, బ్రేకిట్ డౌన్ నౌ, కమాన్ లెట్స్ గో

కొనిస్తనే కోక కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక కోక
కుకుకుకు..!!

Palli Balakrishna Tuesday, August 2, 2022
Idhe Maa Katha (2021)



చిత్రం: ఇదే మా కథ (2021)
సంగీతం: సునిల్ కశ్యప్
నటీనటులు: సుమంత్ అశ్విన్, శ్రీజిత ఘోష్ , తన్య హోప్, భూమిక, శ్రీకాంత్
దర్శకత్వం: గురు పవన్
నిర్మాత: మహేష్ గొల్ల
విడుదల తేది: 19.03.2021



Songs List:



ప్రియా ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: ఇదే మా కథ (2021)
సంగీతం: సునిల్ కశ్యప్
సాహిత్యం: మంగు బాలాజి
గానం: సునిల్ కశ్యప్, హరిణి

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే
మనసంతా చేరి మార్చావే దారి

దారే మారి, ప్రియా ప్రియా ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే

నిన్న మొన్న నా కలలో నువ్వెప్పుడూ రాలేదే
నిన్నూ నన్నూ కలిపేసే నిజం ఇలా బాగుందే
ఇన్నాళ్ళు మోసా నా ప్రాణం
ఈరోజే చూశా దానందం
నాలో ఉండని ఓ మనసు
నిన్నే చూశాకే తెలుసు
నేర్పింది ప్రేమే నీ ఊసు

ప్రియా ప్రియా ప్రియా ప్రియా
యే సిల్నిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే

గపగరిసా గప గప గరిసా
గపగరిసా గప గప గరిసా
గపగరిసా గప గప గరిసా

చిన్ని చిన్ని ఆశలతో చిగురిస్తూ నీ బంధం
నన్నే నేను వదిలేసి అయిపోయా నీ సొంతం
నీతోడే చూస్తూ ఈ లోకం ఇంకెంతో బాగుందీ అందం
లోలో తీసాలే పరుగు నీవైపేసేలా ఆ అడుగు
వేస్తున్నా ఎదపై నీ ముసుగు

ప్రియా ప్రియా ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే

మనసంతా చేరి మార్చావే దారి
దారే మారి, ప్రియా ప్రియా ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా





కలలా కథ మొదలవతోంది పాట సాహిత్యం

 
చిత్రం: ఇదే మా కథ (2021)
సంగీతం: సునిల్ కశ్యప్
సాహిత్యం: మంగు బాలాజి
గానం: విష్ణు ప్రియ 

కలలా కథ మొదలవతోంది
అలలా ఎద ఎగురుతూంది
మనసే నిను కలవక ముందే ఏదో తొందర
క్షణమే తెగ నస పెడుతోంది
అడుగె నిను కలవమనంది
నడిచిన ప్రతి దారి నీదిరా
ఏమో ఏమో ఏం చేసావో గుండెను కలబడి
నాలో నిన్నే ఊహించాను ఒంటిగా నిలబడి
ఈ ప్రేమంటే సంద్రమంత… మనసేమో ముత్యమంత
ఇటు దాచుకుందో వింత… కోరాక నిన్ను జత

చూపుతో పంపనా… కళ్ళలో ప్రేమని
మౌనమే నింపనా… మాటలే నీవని
తిడుతు తీయగ పడమంటావా
అలకలు పోయినా బ్రతిమాలాలిగా
ఈ ప్రేమంటే సంద్రమంత… మనసేమో ముత్యమంత
ఇటు దాచుకుందో వింత… కోరాక నిన్ను జత
కసిరినా కొసురుతూ… కబురులే చెప్పుకో
తప్పు నే చేసినా… నీదని ఒప్పుకో
తోడై నీడగా నాతో ఉండిపో
నేనేం చేసినా… నీలా చూసుకో



Just Go for It పాట సాహిత్యం

 
Song Details




కన్నుల్లో కలలుంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇదే మా కథ (2021)
సంగీతం: సునిల్ కశ్యప్
సాహిత్యం: మంగు బాలాజి
గానం: యజిన్ నిజార్

ఓ ఓ, కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం
ఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం
నువ్వెవ్వరో నేనెవ్వరో… స్నేహాన్నిలా ముడేద్దాం
నవ్వేందుకే పుట్టామని… ప్రపంచమే చాటేద్దాం

కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం
ఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం
ఓ వ్, నీతో నువ్వుంటే… మనసునైనా మరచిపోవా
నీలో ప్రేముంటే… నిను నువ్వే వదులుకోవా
కధ నడవదు ఎపుడూ… నువ్వనుకొను దారిలో
చిరు అలజడి ఉండదా… ఈ బ్రతుకను తీరులో

కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం, ఓ ఓఓ
నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం, ఓ
లైఫే ఒక వింత… ఉరకలేద్దాం బ్రతికి చూద్దాం
లోకం మనసెంతో అడిగి చూద్దాం, కలిసిపోదాం
ప్రతిచోటొక గమ్యం… ఎవరెవరికో సొంతం
మన గెలుపుకు సూత్రం… ఇక మరువకు నేస్తం

Palli Balakrishna Thursday, October 28, 2021
Romantic (2021)



చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
నటీనటులు: పూరి ఆకాష్, కేతిక శర్మ, రమ్య కృష్ణ 
దర్శకత్వం: అనీల్ పాడూరి
నిర్మాతలు: పూరి జగన్నాధ్ , ఛార్మి కౌర్
విడుదల తేది: 29.10.2021



Songs List:



మేరా నామ్ వాస్కోడిగామా పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: పూరి జగన్నాధ్ 
గానం: పూరి ఆకాష్

మేరా నామ్ వాస్కోడిగామా
వాస్కోడిగామా అల్బెర్తో

లోగ్ ముజే బచ్చా బోల్తా హై
లేకిన్ ఏక్ దిన్ ఏ బచ్చా
సబ్ కా బాప్ బనేగా

పడుకుంటే మనకు కల రావాలి
ఆ కల మనల్ని భయపెట్టాలి
ఆ కల కోసం చావాలి
యహీ మేరా మక్సద్ హై

కర్లో యా మర్లో కర్లో యా మర్లో
కర్లో కర్లో యా మర్లో కర్లో యా మర్లో

మేరా నామ్ - వాస్కో
మేరా నామ్ - వాస్కో
వాస్కోడిగామా - వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో

ఈ ప్రపంచమే ఒక అడవి, అన్నీ జంతువులే
మై బీ ఏక్ జాన్వర్ హూ
నో రూల్స్ ఇన్ జంగల్

అడవిలో నక్కలెక్కువగా ఉన్నాయి
అదొక్కటే నచ్చట్లా
చంపేస్తార్రే సాలే

వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
ముంబై ముంబై ముంబై
కాట్ కాట్ కాట్ కాట్
కాట్ ధూంగా సాలే

కలబడి ఎగబడి నిలబడి
కనబడి చూడు నాతో
నీకు ధమ్మే ఉంటే దన్నే ఉంటే గూట్లే

నేనప్పుడు ఇప్పుడు ఎన్నడూ చెప్పేదొకటే
అది ఒకటే మాట ఒకటే బాట
కర్లో యా మర్లో మార్, 
మావ యే సారె దునియా పేట్
ఔర్ పేట్ కె నీచే కేలియే
రోటి కప్డా మఖాన్ అండ్ సెక్స్ 
కర్లో యా మర్లో

సంపుత బిడ్డా సెంటర్లో చీరేస్తా
లే, పరిగెట్టు పుట్టింది పడుకోడానికి కాదు బే
పోయాక పాడుకోరా, ఎవడడిగాడు నిన్ను
ఎవడడిగాడు నిన్ను

ఎవరెస్ట్ ఉన్నదే ఎక్కేయడానికి
హ్హహ్హహ్హా, ఎక్కేయ్
ఎక్కే ఎక్కే క్కే క్కే క్కే
ఎక్కేయ్ ఎవడడిగాడు నిన్ను
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో

లైఫ్ ఈజ్ లైక్ సిక్స్టీ నైన్
వాట్ యూ గివ్ ఈజ్ వాట్ యూ గెట్

మేరా నామ్ మేరా నామ్
మేరా నామ్ వాస్కోడిగామా
బజావూంగా సారీ కామా



నా వల్లకాదే… పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సునీల్ కశ్యప్

నా వల్ల నా వల్ల, హో ఓ
నా వల్ల నా వల్ల, ఓ ఓ

నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే… గుండె ఆగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే  బతకలేనులే

నిన్నే నా మనసుతో ఎపుడైతే చూసానో
అపుడే నా మనసుతో ముడి వేసుకున్నానే
కళ్లనుంచి నీరులాగ నువ్వు జారగా
కాళ్లకింద భూమి జారినట్టు ఉందిగా

నా వల్లకాదే  నా వల్లకాదే
నా వల్లకాదే  నా వల్లకాదే

నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా
నీకై ఆశగా చూస్తుండదా

నీకేలాగ ఉందో గాని ఈ క్షణం
చిమ్మచీకటైంది నాకు నా జీవితం
నే ఒంటరవ్వడం మంటల్లో దూకడం
ఒకలాంటిదే కదా… ఆఆ ఆ ఆ

నా వల్లకాదే
నువ్వు దూరమవ్వకే  ఊపిరాగిపోద్ది
నా వల్లకాదే
నువ్వు దూరమవ్వకే  గుండె ఆగిపోద్ది
నా వల్లకాదే
నువ్వు లేకపోతే  బతకలెనులే

నువ్వే నేననేంత  స్వార్థం కదా
నువ్వే గుర్తుకొస్తే  యుద్ధం కదా

వంద యేళ్ల పచ్చబొట్టు నీ జ్ఞాపకం
వచ్చి చూడెలాగ ఉందో నా వాలకం
నీ ధ్యాసనాపడం నా స్వాసనాపడం
రెండొక్కటే కదా… ఆ ఓ ఓ

నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే  ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే  గుండె ఆగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే  బతకలెనులే




పీనే కె బాద్… పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: పూరి జగన్నాధ్ , భాస్కరభట్ల
గానం: సునీల్ కశ్యప్

హ్యాపీ హ్యాపీ మావ దిల్ కుష్ ఐతదే
పీనే కె బాద్… పీనే కె బాద్

రావే అంటె రాదా స్వర సంగీతమే
పీనే కె బాద్… పీనే కె బాద్

ఏ ఏ, ఇష్క్ లోన ఉండు
ముష్కిల్ లోన ఉండు
ఏ రిస్కులోన ఉండు
మందే మంచి ఫ్రెండు

బాల్ కే బారాబర్ ఏ దునియా
పీనే కె బాద్
హెవెన్ కమ్స్ డౌను ఇన్ స్లో మోషను
పీనే కె బాద్  పీనే కె బాద్

ఎవడైతే నాకేంటట లక్డి కా పూల్, పూల్ పూల్
పెట్టేది నాకెవడంట చెవిలోన పూల్
ఒర్లుతామో, దొర్లుతామో ఓ ఓ
పీనే కె బాద్  పీనే కె బాద్

అర్ష్ హే, పీనే వాలోంక ఆజ్ కల్ పోలీస్ సె ప్రాబ్లెమ్
గల్లీ గల్లీ మే గుస్ గుస్ కె పకడ్ రహే, హే హే

డ్రంక్ అండ్ డ్రైవ్  కౌన్సిలింగు
పీనే కె బాద్  పీనే కె బాద్
గెలికేది నన్నెవడంటా  కిర్ కెట్ కి బాల్
పీకేది నన్నెవడంటా  పూరా నికాల్

దబిడి దిబిడో ఓ ఓ
ఎవడికెవడో ఓ  ఓ
పీనే కె బాద్  పీనే కె బాద్

కాక్ టైలో క్రొకోడైలో
పీనే కె బాద్  పీనే కె బాద్

ఓడినా తాగుతం గెల్చినా తాగుతం
నవ్వినా తాగుతం ఏడ్చినా తాగుతం
గట గట గట గట తాగుతాం ఆ ఆ, తాగుతామే
పీనే కె బాద్ పీనే కె బాద్

ఫోకు డ్యాన్సో  స్నేకు డ్యాన్సో ఓఓ
పీనే కె బాద్  పీనే కె బాద్
పీనే కె బాద్  పీనే కె బాద్




ఈఫ్ యు అర్ మాడ్ ఐయామ్ యువర్ డాడ్ పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం:  భాస్కరభట్ల
గానం: అశ్విన్ , యాజిన్ నిజార్ 

ఎం మాయో చేసావో
ఏదేదో అయిపోయా
చూస్తూనే చూస్తూనే
మైకంలో వేరే పడి పోయా

కను రెప్పలా చప్పుడు వింటే
ఎద చప్పుడు ఆగింది
అల్లాడి పోతుందే ప్రాణం

ఎం మాయో చేసావో
ఏదేదో అయిపోయా

ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్
ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్

పెదవుల్లో తియ్యదనం
ముద్దులలో పొందగలం
కోరికలో ఉన్న బలం
కౌగిలిలోనే చూడగలం

ఒకరోజు ఆపగలం
రెండ్రోజులు ఆపగలం
వయసడిగితే వెచ్చదనం
ఎవరైనా ఎం చేయగలం

ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్
హో.. ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్

ఈ పరువం పూలరథం
నువ్వే నా ఊతపదం
నువ్వెవరం నేనెవరం
ఒకరికి ఒకరం హస్తగతం

తహ తహలా నిప్పుకణం
వదలదులే ఒక్క క్షణం
మండించుట గాలి గుణం
తనకసలుండదు జాలి గుణం

ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్
ఈఫ్ యు అర్ మాడ్ 
ఐయామ్ యువర్ డాడ్




నువ్వు నేను ఈ క్షణం పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం:  భాస్కరభట్ల, పూరి జగన్నాధ్ 
గానం: చిన్మయి శ్రీపాద

దేశాన్ని ప్రేమించటం వేరు
ఆడదాన్ని ప్రేమించడం వేరు
ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చుండదు
ఐ లవ్ యు సరదా తీరిపోద్ది

రేయి పగలు ఎదురు చూశా
ఈ క్షణం కోసం
కోటి దండాలు పెట్టుకున్నా
ఈ గడియ కోసం

దిండులో మొహం దాచుకుంటే 
నా ఊపిరి నాకే 
నీ ఊపిరిలా తగులుతుంది
ఆ చలిలో వెచ్చటి దుప్పట్లో
నా కుడి చేయి ఎడమ చేయిని తాకితే
అది నీదే అనుకుంటున్నా

ఎదురు చూశాను మిత్రమా
పరితపించిపోయా

ఈ మాటలు నావి
ఈ కోరిక నాది
నువ్వు చెప్పినట్టే

ఏం నాకుండదా ఆ కోరిక
నీకు నా మీద ఎలా ఉందో
నాకు నీ మీద అలాగే ఉంది
ఇది ప్రేమో మోహమో
మరొకటో మరొకటో ఏ పేరైతేనేం
ఈ క్షణం నీతో ఉన్నా అది చాలు

మళ్ళీ మళ్ళీ కావాలిలాంటి క్షణాలు

మరో క్షణం గురించి ఆలోచిస్తూ 
ఈ క్షణాన్ని వృధా చేయను
మళ్ళీ మళ్ళీ కలుస్తామో
మళ్ళీ ఇలా బ్రతుకుతామో ఎవరికి తెలుసు
కలిసిన ప్రతీ సారి ఇదే మోహం
ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి ?
ఈ క్షణం ఈ మోహం
నువ్వు నేనూ ఈ సముద్రం

నా గుండెల్లో ప్రతీ మాట చెబుతున్నావ్
నా గుండె చప్పుడు వింటున్నావా

అమ్మాయిలకి అన్నీ వినబడతాయి
కానీ చెప్పరు నువ్వేంటో నాకు తెలుసు
నేనేంటో తెలుసుకో

ఎలా తెలుసుకోవాలి

దగ్గరకు తీసుకో ఆ ఆకాశం భూమిని ఎలా కౌగిలించుకుందో
అలా కౌగలించుకో హగ్ మీ
టేక్ మీ బ్రీత్ రెస్ట్ లిజన్ టు మై హార్ట్ బీట్

నువ్వంటే నాకిష్టం
అది నువ్వు చెప్పనవసరం లేదు
నీ ముద్దులో నాకు తెలుస్తుంది
నువ్వంటే నాకు పిచ్చి
ఆ విషయం నీ పంటి గాటు చెబుతుంది

ఏహ్.. కాసేపు మాట్లాడకు
నో లెట్ మి టాక్
అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేది
వాళ్ళ కౌగిట్లో చేరడానికి
అమ్మాయిలు అబ్బాయిల కౌగిట్లో దూరేది
వాళ్ళతో మాట్లాడడానికి నన్ను మాట్లాడనీయ్
మాట్లాడి మాట్లాడి ఆగిపోతే
ఆ తరువాత మనిద్దరి మధ్య నిశ్శబ్ధం
అదే నిజమైన స్నేహం

నువ్వింత వాగుతావని నాకు తెలియదు
నాక్కూడా తెలియదు నిన్ను చూడగానే 
రొమాన్స్ మొత్తం బయటకు వచ్చింది
రొమాంటిక్ పీపుల్ కరువైపోయారీలోకంలో
దొరక్క దొరక్క దొరికావ్ నేనెందుకొదులుతా
లెట్ సీ దిస్ వరల్డ్ రొమాంటిక్లీ
లెట్స్ డై ఇన్ రొమాన్స్
అణువణువు కరగని
నా ప్రతీ న్యూట్రాన్ నలగని



వాట్ డూ యు వాంట్ పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం:  భాస్కరభట్ల
గానం: మంగ్లీ, కృష్ణ 

ఇన్ లౌడొంకో క్లారిటీ నహి హే
హమ్ లడికియోంకో క్యా చాహియే
మాలూం నహి హే

హే బాబు వాట్ డూ యు వాంట్
హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్
రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్
కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

హే నాకు తెలుసు అందంగుంట
అయితే మాత్రం నీకేంటంట
తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

నీ చూపులే నా వీపునే
ఆలా టచ్ చేస్తూ గుచ్చేస్తున్నాయే
నీ ఊపిరే నా గుండెల్లో
దడై పెంచేస్తూ తగ్గిస్తున్నదే

ఏంటసలు మ్యాటరు ఓయ్ ఓయ్ ఓయ్
దాటుతాంది మీటరు ఓయ్ ఓయ్ ఓయ్
ఏంటసలు మ్యాటరు దాటుతాంది మీటరు

ఎం ఎరగనట్టు తెలియనట్టు
మండిస్తావే హీటరు

కళ్ళు కళ్ళు కలిసుపేస్తున్నావ్
చూపుల్తోటె నొల్లేస్కున్నావ్
కిదర్ సె తు అయారే లావుండా
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

లాక్కోలేక పీక్కోలేక
తెగ చస్తుందే నా ప్రాణం నిన్ను చూసి
ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా
ఆలా మింగేలా చూస్తావే రాకాసి

చాలు చాలు తగ్గారో ఓయ్ ఓయ్ ఓయ్
దింపమాకు ముగ్గులో ఓయ్ ఓయ్ ఓయ్
చాలు చాలు తగ్గారో దింపమాకు ముగ్గులో
ఎం తెలవనట్టు తోసినవే
అందం అనే అగ్గిలో

ఎక్కడో ఎక్కడో చెయ్యేస్తున్నావ్
ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నావ్
రాతిరిదింకా దిగలేదేంట్రా పాగల్
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్
రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్
కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్

హే నాకు తెలుసు అందంగుంట
అయితే మాత్రం నీకేంటంట
తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్




డార్లింగ్ డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం:  భాస్కరభట్ల
గానం: మేఘన శ్రీ సాయి 

డార్లింగ్ డార్లింగ్ 




పీనే కె బాద్… (Kickass Version) పాట సాహిత్యం

 
చిత్రం: రొమాంటిక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: పూరి జగన్నాధ్ , భాస్కరభట్ల
గానం: సునీల్ కశ్యప్

పీనే కె బాద్… పీనే కె బాద్
ఓ హ్యాపీ హ్యాపీ మావ… దిల్ కుష్ ఐతదే
పీనే కె బాద్… పీనే కె బాద్
ఓ రావే అంటె రాదా… స్వర సంగీతమే
పీనే కె బాద్… పీనే కె బాద్

ఏ ఏ, ఇష్క్ లోన ఉండు
ముష్కిల్ లోన ఉండు
ఏ రిస్కులోన ఉండు
మందే మంచి ఫ్రెండు

బాల్ కే బారాబర్ ఏ దునియా....
పీనే కె బాద్
హెవెన్ కమ్స్ డౌను… ఇన్ స్లో మోషను
పీనే కె బాద్… పీనే కె బాద్

ఎవడైతే నాకేంటట లక్డి కా పూల్, పూల్ పూల్
పెట్టేది నాకెవడంట చెవిలోన పూల్
ఒర్లుతామో, దొర్లుతామో ఓ ఓ
పీనే కె బాద్… పీనే కె బాద్

అర్ష్ హే, పీనే వాలోంక ఆజ్ కల్ పోలీస్ సె ప్రాబ్లెమ్
గల్లీ గల్లీ మే గుస్ గుస్ కె పకడ్ రహే, హే హే

డ్రంక్ అండ్ డ్రైవ్… కౌన్సిలింగో లింగో లింగో
పీనే కె బాద్… పీనే కె బాద్
గెలికేది నన్నెవడంటా… కిర్ కెట్ కి బాల్
పీకేది నన్నెవడంటా… పూరా నికాల్

దబిడి దిబిడో...ఎవడికెవడో...
పీనే కె బాద్… పీనే కె బాద్

కాక్ టైలో క్రొకోడైలో
పీనే కె బాద్… పీనే కె బాద్

ఓడినా తాగుతం… గెల్చినా తాగుతం
నవ్వినా తాగుతం… ఏడ్చినా తాగుతం
గట గట గట గట తాగుతాం... తాగుతామే
పీనే కె బాద్… పీనే కె బాద్

ఫోకు డ్యాన్సో… స్నేకు డ్యాన్సో ఓఓ
పీనే కె బాద్… పీనే కె బాద్
పీనే కె బాద్… పీనే కె బాద్



Palli Balakrishna Sunday, October 24, 2021
Shaadi Mubarak (2021)


 


చిత్రం: షాది ముబారక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
నటీనటులు: సాగర్ ఆర్. కె. నాయుడు, ద్రిష్యా రఘునాథ్
దర్శకత్వం: పద్మశ్రీ
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 05.93.2021







చిత్రం: షాది ముబారక్ (2021)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: వనమాలి
గానం: వేదాల హేమచంద్ర, శ్రావణ భార్గవి

నిన్న జంటగా తిరిగాము హాయిగా
ముగిసింది నేడిలా, కలగా
అనుకోని ఈ కథ, ఓ చిత్రమే కదా
మొదలవ్వదా ఇది, జతగా

మన దూరమే పెరిగిందనీ
మనసిక ఉన్న చోటే ఆగిపోతుందా
నన్నెంతగా వెలివేయనీ
నా అడుగు చూపుతున్న దారి నీదేగా

ఎందుకో కోపమాగదు ఎంతకీ ఆశ చావదు
మనసు వినదు మారిపోదు మరపురాదు
నేనుండగలనా దూరంగా అడుగేస్తుంటే నువ్వే సాయంగా
పూటలో ఎన్ని మలుపులో అనుభూతులో ఎదలో

నిన్న జంటగా తిరిగాము హాయిగా
ముగిసింది నేడిలా కలగా

బంధమే వేరు కాదని పంతమే కొంతసేపని
తెలుసుకోవా మాటవినవా తిరిగిరావా
నాతోనే ఉండే నీ గురుతే నువు లేకుంటే మనసేం బాగోదే
వీడకే చెయ్ జారకే వెలివేయకే...

నిన్న జంటగా తిరిగాము హాయిగా
ముగిసింది నేడిలా కలగా
అనుకోని ఈ కథ, ఓ చిత్రమే కదా
మొదలవ్వదా ఇది జతగా

మన దూరమే పెరిగిందనీ
మనసిక ఉన్నచోటే ఆగిపోతుందా
నన్నెంతగా వెలివేయనీ
నా అడుగు చూపుతున్న దారి నీదేగా



Palli Balakrishna Tuesday, March 16, 2021
Bewars (2018)





చిత్రం: బేవార్స్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, దివ్య
నటీనటులు: హర్షిత , రాజేంద్రప్రసాద్, సంజోష్
దర్శకత్వం: రమేష్ చెప్పల
నిర్మాత: పొన్నాల చందు
విడుదల తేది: 12.10.2018

ప్రేమ చిటికెలు వేసే క్షణం
ప్రతి గుండె గలగల కోలాహలం
హాయి పిలుపులు తాకే క్షణం
ప్రతి రోజు మిల మిల బృందావనం
చీకట్లనే వదిలించేయగా
సంతోషమే వెలుగై వాలగా
పెదవంచు ప్రమిదల్లో నవ్వు కిలకిల

కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా 
కాలమంత ఆగదా ఆనంద కేళి 
గంతులేసి ఆడగా

తారా జువ్వల్లాగా
ఈ మనసు ఎగిరెనీ వేళా
తారలు దివ్వెల్లాగా ధగధగ
దారంత మెరిసెను చాలా

హే... ఊహలోనే ఉండిపోతే
వెళ్ళిపోదా జీవితం
చేతులారా అందుకుంటే
అంతులేని సంబరం
అరె ఎటుగాలి వీస్తుంటే అటువైపుగా
వెళ్ళిపోతే ఏముంది సరికొత్తగా
అనుకున్న దారుల్లో అడుగేయగా
అసలైన గెలుపొచ్చి ముద్దాడదా..

హే హే.. కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా
హే కాలమంత ఆగదా ఆనంద కేళి 
గంతులేసి ఆడగా

అనురాగం అల్లరి చేసేయ్
అనుబంధం చిందులు వేసేయ్
సరదాలకి తలపుల తీసేయ్
నడి రేయికి రంగులు పూసేయ్

పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగా
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగా

హే చీకటేళ దీపమల్లె
వచ్చిపోవే వెన్నెలా
తళుకులీనె సొగసుతోటి
లాగుతావే నన్నిలా

నీలోనే కళకళలు చూడాలనీ
నీ చెంత చేరాను కావాలనీ
ఆ వెన్నముద్దల్లే వెలగాలనీ
నీకిచ్చుకున్నాను నా మనసునీ

హే హే కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా 
కాలమంత ఆగదా ఆనంద కేళి 
గంతులేసి ఆడగా

నీ చుట్టూ భూచక్రంలా
తిరిగానే నిజమా కాదా
విరజిమ్మే నవ్వులు చూస్తే
ఎదగూటికి పున్నమి రాదా

పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగా
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగా








చిత్రం: బేవార్స్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: హేమచంద్ర, దివ్య

తల్లీ తల్లీ నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను
శవమల్లే మిగిలానమ్మా

నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ
ప్రతి రోజు మురిసేనమ్మా..! ఆఆ...
ఏ జన్మలో పాపమే నేను చేశానో
ఈ శిక్షే వేశావమ్మా...

తల్లీ తల్లీ నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను... 
శవమల్లే మిగిలానమ్మా

ఓఓ ఓఓ ఓఓఓ...

పొద్దున్నే పొద్దల్లే నువ్ నాకు ఎదురైతే
అదృష్టం నాదనుకున్నా
సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో
నా దీపం నీవనుకున్నా
నా వెలుగంతా తీసుకెళ్లి ఏ చీకట్లో కలిపేశావే
నా ఆశల్ని మోసుకెళ్లి ఏ చితిలోన కాల్చేశావే

తల్లీ తల్లీ నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను... 
శవమల్లే మిగిలానమ్మా

లోకంలో నేనింకా ఏకాకినైనట్టు
శూన్యంలో ఉన్నానమ్మా
చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా
నీలాగే తోచేనమ్మా...
నీ నిశ్శబ్దం నా గుండెల్లో...
జలపాతమయ్యిందమ్మా
ఆ నీలి ఆకాశంలో  ఏ నక్షత్రం అయ్యావమ్మా... 

తల్లీ తల్లీ నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను
శవమల్లే మిగిలానమ్మా


Palli Balakrishna Friday, February 1, 2019
Bluff Master (2018)



చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్  
నటీనటులు: సత్యదేవ్ కంచరాన, నందిత శ్వేత
దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి
నిర్మాత: రమేష్ పి.పిళ్ళై
విడుదల తేది: 28.12.2018



Songs List:



ఏవో రంగుల పరిచయం పాట సాహిత్యం

 
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్  
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీచరణ్  జంగా 

ఏవో రంగుల పరిచయం 



ఏ మాయో ఏమో తెలియదే పాట సాహిత్యం

 
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్  
సాహిత్యం: విశ్వనాథ్ కారసాల 
గానం: సునీత  

ఏ మాయో ఏమో తెలియదే 
తెలిసేదెలా మనసుకే 
అడిగా తొలిగా నన్నే ఎవరనీ 
రోజూ చూడని తీరే నీదని 
ఏమైనదో తెలియదే 
తెలిసేదెలా మనసుకే 

మనసా నా మనసా.. 
నా మనసే.. ఓ.. ఓఓఓ.. 

తెలియని భావాలన్నీ 
తోడై నన్నే చేరీ 
నాతో చేస్తున్న సావాసమా 
అర్ధాలెన్నో చూపే వేల భాషల్లోని 
ప్రేమ గీతాల ఆలాపనా..      
కురిసే వరమై ఎదనే తడిమెనుగా 
కలిసే వరసై మనసే మురిసెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఎలా 
ప్రేమే నాలో చేరిందెలా.. 

ఏ మాయో ఏమో తెలియదే 
తెలిసేదెలా మనసుకే 

కొత్తగ నాకే నేను 
పరిచయమౌతున్నాను 
నాలో ఈ మాయ నీదే సుమా 
చిన్ని మోమాటాలే 
చెప్పే మౌనంగానే 
ప్రేమ బాగుంది నీ భావనా 
పలికే పెదవే సడినే మరిచెనుగా
ఐనా మరిలా నీ పేరే పలికెనుగా 
అయ్యయ్యయ్యో నీలా ఇలా 
ప్రేమే నాలో చేరిందెలా 

ఏ మాయో ఏమో తెలియదే 
తెలిసేదెలా మనసుకే 
అడిగా తొలిగా నన్నే ఎవరనీ 
రోజూ చూడని తీరే నీదని 
ఏమైనదో తెలియదే 
తెలిసేదెలా మనసుకే 
మనసా నా మనసా.. 
నా మనసే.. ఓ.. ఓఓఓ.. 




నీతోనే పాట సాహిత్యం

 
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్  
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సునీల్ కశ్యప్  

నీతోనే 




సత్కర్మభీశ్చ సత్ఫలితం పాట సాహిత్యం

 
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్  
సాహిత్యం: మధురకవి కోగంటి వెంకటా చార్యులు, రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజ్, సునీల్ కశ్యప్  

సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం 
సత్యంబలానుభవమిహం

ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే 
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే

ఎన్ని కన్నీళ్ళ ఉసురిది 
వెంటాడుతున్నది నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలిదండమై దండించ 
తప్పించుకోలేదు జన్మ

సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం 
సత్యంబలానుభవమిహం

పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచీ
కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి

ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే 
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే

ఏ కన్నూ చూడదనా
నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా
తప్పటడుగే నీ అలవాటు

అదృశ్య దృష్టిగా సకల సృష్టి 
నిను గమనిస్తున్నది లెక్కగట్టి
ఎంత బతుకు నీదెంత బతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు

ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... 
మనుజా...
ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా

కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ

సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం 
సత్యంబలానుభవమిహం

ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే 
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే



What The BEEP (promotional song) పాట సాహిత్యం

 
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్  
సాహిత్యం: లక్ష్మి భూపాలం
గానం: సత్య దేవ్, సునీల్ కశ్యప్  

What The BEEP (promotional song)

Palli Balakrishna Friday, January 25, 2019
Sneha Geetham (2010)


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కార్తిక్
నటీనటులు: సందీప్ కిషన్ , సుహాని కలిత, కృష్ణుడు, చైతన్య , శ్రేయా ధన్వంతరి, రియా
దర్శకత్వం: మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత: శిరీష శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 16.07.2010

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

చినుకై రాలే మేఘాన్ని ఆపేనా ఎవరైనా
వెనుకడుగెయ్యక శిఖరాన్నే చేరాలో ఏమైనా
నీ కలలను చూపేనా కని పెంచిన అమ్మైనా
నీ కలతను చెరిపేనా శ్రుష్టించిన బ్రహ్మైనా

నీకే సాధ్యం ....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

పడినా లేచే కెరటాల ప్రతిబింబం బ్రతుకేగా
నడి రాతిరిని దాటందే ఉదయం చిగురించదుగా
ఆ నింగిని తాకేలా సందిస్తే నీ బాణం
తన పరుగును ఆపేనా ఎదురయ్యే అవరోధం

గెలుపే తధ్యం .....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా


******  ******  *******


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సాయి శివాని

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

కలలే అలలై కన్నులు నదులై కలతలుగా నిలిచే
కమ్మని కబురే కాదని కదిలే కలకలమే మిగిలే
తలపే... చెదిరెనా
తపనే ....తరిమెనా

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

చిగురులు తొడిగిన తోడే కలయై చిటికెలో నను వీడే
చింతే వచ్చి చెంతన చేరి శిశిరం లా తోచే
నడకే .....తడబడే
నడిపే..... విధి ఇదే

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా


******  ******  *******


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సాయి శివాని

ఒక స్నేహమే..మము కలిపే
ఒక బంధమే... విరబూసే
సంతోషమే.. మది నిండే
నవలోకమే.. పిలిచిందే
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

ధ్యేయం ధ్యానం ఒకటై సాగే..
లక్ష్యం గమ్యం ఒకటై ఆడే..
ఒక చెలిమి కోసం వేచే క్షణం
ఒక చెలియ కోసం జరిపే రణం
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో

స్నేహం ప్రేమై మారే వైనం..
జతగా కలిసి చేసే పయనం
ఒక నవ్వు కోసం ఓ సంబరం
ఒక మెప్పు కోసం పెను సాహసం

హృదయం లోన మెరిసే స్వప్నం
ప్రణయం వరమై తెలిపే సత్యం
ఎదగదుల పైన ఓ సంతకం
మది నదులు కలిపే ఈ సంగమం
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

Palli Balakrishna Thursday, December 14, 2017
Snehamera Jeevitham (2017)


చిత్రం:  స్నేహమేరా జీవితం  (2017)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: చైతన్య వర్మ
గానం: సునీల్ కశ్యప్, ప్రణవి ఆచార్య
నటీనటులు: శివబాలజి, రాజీవ్ కనకాల, సుష్మా యార్లగడ్డ
దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి
నిర్మాత: శివబాలజి
విడుదల తేది: 17.11.2017

మెల్లగా మెల్లగా గుండెలో అలలాగ ఉరికేవే ఎలా
చూపులే మాటలై సూటిగా తగిలేలా ఉసిరావే వల
ఏమైందో ఏమో నంటూ ఆరా తీస్తే
ప్రేమైపోయిందేంటో నీతో తీరా చూస్తే

సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ
సారి సాగగామ (2)

నీ కలవారితే తెలవారదే రెయిలాగే
నా అలవాటుగా అవుతున్నదే రోజిలాగే
వయసు తీరే మారుతుందే నేలజారే తారలల్లే
మనసు తీరా నవ్వుకుందే వెన్నెలింక జాబిలల్లే
వరాలె మురిసి మురిసి మదిలో కురిసి
మరల మనకు దొరికెనే...

సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ
సారి సాగగామ (2)

ఏం పరువానివే పరుగాపవే ప్రేమవైపే
ఈ ప్రణయాలలో పడదోయక ఊరుకోవే
ప్రేమలైతే వేరుకావే దూరమింక కోరుకోవే
ఆగమంటే ఆగిపోవే మారమంటే మాట వినవే
మరింక తిరిగి తిరిగి మనసు కరిగి
మనము తిరిగి జగము కలిసెనే...

సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగ
సారి సాగగామ (2)

Palli Balakrishna Saturday, November 11, 2017
Its My Love Story (2011)


చిత్రం: ఇట్స్ మై లవ్ స్టోరీ (2011)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సునీల్ కశ్యప్, ప్రణవి ఆచార్య
నటీనటులు: అరవింద్ కృష్ణ , నిఖిత నారాయణ్
దర్శకత్వం: మధురా శ్రీధర్ రెడ్డి
నిర్మాత: మున్నా వెంకట కృష్ణారెడ్డి
విడుదల తేది: 11.11.2011

నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా
నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే

ఏదేదో తెలిపే ఈ ముగ మనసే
కవ్వించెనే భలే ఇది వింత కనుకే

కలయిక కలే ఆ కల ఇక నిజమాయేనా
కలవరమంతా ఓ వరమయి రుజువాయేనా
గడియారమైనా కరుణించి కాలాన్ని కాసేపు ఆపి చూపే వీలుందా
ప్రియ రాగమేదొ నీలోనే కదలాడి ఈనాడే కొత్త భావం రేపేనా .... అ అ అ

నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే

తెలియని మౌనం ఈ నడకకు తడబాటేనా
తలవని భారం ఈ మనసుకి సుఖమాయేనా
గడి దాటగానే ఏవేవో భావాలే ఏదేదో చేసి బందీ చేసేనా
చేయి తాకగానే ని మనసే నిను తట్టి తియంమ్మాయింక అంది నిన్నేనా

నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే

Palli Balakrishna Tuesday, September 26, 2017
Babu Baga Busy (2017)


చిత్రం: బాబు బాగా బిజీ (2017)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: కరుణాకర్ ఆడిగర్ల
గానం: సునీల్ కశ్యప్
నటీనటులు: శ్రీనివాస్ అవసరాల, మిస్థి చక్రవర్తి, తేజెస్వి మాడివాడ
దర్శకత్వం: నవీన్ మేడారాం
నిర్మాత: అభిషేక్ నామా
విడుదల తేది: 05.05.2017

ఊరినిండా పోరీలు ఊరించి చంపుతుంటారు
ఊరబెట్టి సోకును అబ్బా ఊపిరాడనివ్వరు
నాది  సిటారు కొమ్మనున్న గుండెకాయ
ఆడ చూపులకే రాలిపోయే చింతకాయ
చీర కట్టుకుంటే చెట్టుకైన ఎంత మాయ
గుండె పట్టాసు లాగ కొట్టుకుంటుందయ్య
ఉన్నదేమో జానెడు దానికుప్పెనంత ఊపుడు

హే హంటర్ వీడు హంటర్
తేనె దొంగిలించు తుమ్మెదంటే హంటర్
వీడు హంటర్ వీడు హంటర్
వీడి మీద ఉన్న కుర్రకారు మెంటర్

హా ఉప్పు కారం తిన్నది ఊరుకోదు బాడీ
గోడెల్లి దూకుతుందే ఆ పైన
మేడల్లో దూరుతుందే సందేలా
సండేలో పాకుతుండే ఇది నైటు
కోడెనాగులాగ లేసి తెల్లార్లు బజ్జోక
కంగారూ పెట్టేస్తాదో ఏదో
పాడు ఆశ మొండికేసి తెంపేది
అంటుంటే నరాలు పిండేస్తాదేమో
ఆ ఆ... నరజన్మ ఓ వరమురా
నవరసములు ఉండాలిరా

విందైనా పొందైనా ఇంకాస్త దోసుంటే
ఈ జన్మ కసలైన పరమార్ధముంటుందే


హే హంటర్ వీడు హంటర్
తేనె దొంగిలించు తుమ్మెదంటే హంటర్
వీడు హంటర్ వీడు హంటర్
వీడి మీద ఉన్న కుర్రకారు మెంటర్

Palli Balakrishna Tuesday, August 15, 2017
Oka Manasu (2016)


చిత్రం: ఒక మనసు (2016)
సంగితం: సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, ప్రణవి
నటీనటులు: నగచౌర్య , నిహారిక కొణిదల
దర్శకత్వం: రామరాజ్ వి. గొట్టిముక్కల
నిర్మాతలు: మధురా శ్రీదర్ రెడ్డి, డా౹౹ కృష్ణ భట్ట , ఏ. అభినయ్
విడుదల తేది: 24.06.2016

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం

నా మనసున తొలకరి వానలు కురిసినవే
నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే
నా కనులలో రంగుల తారలు మెరిసినవే
నా అల్లరి ఆశలు అలలుగ ఉరికినవే
 
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం

నేల మొత్తం వాన విల్లై వూగుతోందీ వింతగా
వీధులన్నీ వెన్నెలల్లే వెలిగిపోయే ఎంత బాగా
ఓ చల్లనిగాలే రోజూ నిలువెల్లా తాకినా
హా ఈరోజే మరి నన్నూ గిలి గిలిగా గిల్లెనా
నీ జతే ఉండగా.. పూటకో పండగా.. గుండెకే వచ్చిపోదా..
నా ఎదురుగ జరిగే సంగతులేవైనా
అది నీ వలనే అని గమనిస్తూ ఉన్నా
నా లోపల జరిగే వేడుక ఏదైనా
ఇక జంటగా నీతో జరపాలంటున్నా

నేను అంటే నేను కాదే నీకు ఇంకో పేరులే
నువ్వు అంటే నువ్వు కాదే నాకు ఇంకో అర్థమేలే
చూపులు కలిసిన తరుణం మహబాగా ఉందిలే
మనసుకి పట్టిన వ్యసనం అది నువ్వే అందిలే
గట్టిగా హత్తుకో.. ముద్దులే పెట్టుకో.. నన్నిలా కప్పుకోరా..
నేనున్నది అన్నది గురుతుకి రాకుండా
నా వెన్నెల వేకువ అన్నీ నువ్వైపో
ఈ లోకం కంటికి ఎదురే పడకుండా
నా లోకం మైకం అన్నీ నువ్వైపో

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం

Palli Balakrishna Monday, August 7, 2017
Loafer (2015)


చిత్రం: లోఫర్ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కారుణ్య
నటీనటులు: వరుణ్ తేజ్ , దిశ పటాని
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల తేది: 17.12.2015

సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పెదమ్మా
నువ్వే గీసిందమ్మ మాట్టాడే ఈ బొమ్మ
నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు
మన ఇద్దారి నడుమున ముడి ఏందో
అది గొంత్తెత్తి సేప్పుతాది ఇనుకోవే
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే సాలమ్మా

ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
నేనూ ఊగింది నీ ఓడూయలో
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
నువ్వే సెప్పాలి అమ్మ అమ్మేవ్వలో

సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పెదమ్మా
నువ్వే గీసిందమ్మ మాట్టాడే ఈ బొమ్మ
ఏ కాళ్ళ మీద బజ్జోబెట్టి లాల పోసినవో ఏమో
మళ్ళి కాళ్ళు మొక్కుతాను గుర్తుకోస్తనేమో సూడు
ఎండి గిన్నెల్లో ఉగ్గుపాలు పోసి నింగి సందామామను నువ్వు పిలవలేద!
అవునో కాదంటే నువ్వు అడగవమ్మా
మబ్బు సినుకై సేప్తాది నీకు ఎన్నెలమ్మ
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే చాలమ్మా

ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
నేనూ ఊగింది నీ ఓడూయలో
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో

ఓ సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
నువ్వే గీసిందమ్మ మాట్టాడే ఈ బొమ్మ

తల్లి కోడి పిల్లనోచ్చి తన్నుకేల్లె గద్ధలేక్క
ఎత్తు కేల్లినోడు నన్ను పెంచలేదు మనిషిలేక్క
సెడ్డ దారుల్లో నేనూ ఎల్లినాక సెంప దెబ్బ కొట్టేసి మార్చే తల్లిలేక
ఎట్టా పడితేను అట్ట బతికినానే
ఇప్పుడిట్టా వస్తేను తలుపు ముయ్యబోకే
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే చాలమ్మా...

ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
నేనూ ఊగింది నీ ఓడూయలో
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో

సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
నువ్వే గీసిందమ్మ మాట్టాడే ఈ బొమ్మ
నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు
మన ఇద్దారి నడుమున ముడి ఏందో
అది గొంత్తెత్తి సేప్పుతాది ఇనుకోవే
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే సాలమ్మా

ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
నేనూ ఊగింది నీ ఓడూయలో
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో

Palli Balakrishna Monday, July 31, 2017
Jyothi Lakshmi (2015)



చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
నటీనటులు: ఛార్మి కౌర్,
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: ఛార్మి కౌర్, శ్వేతలానా, వరుణ్, తేజా, సి. వి.రావు, సి.కళ్యాణ్
విడుదల తేది: 12.06.2015



Songs List:



నిను చూడంగా పాట సాహిత్యం

 
చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: బాస్కరబట్ల
గానం: హేమచంద్ర 

నిను చూడంగా




చూసింది చాలుగాని పాట సాహిత్యం

 
చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: బాస్కరబట్ల
గానం: శ్రావణభార్గవి 

చూసింది చాలుగాని



చేతికి గాజులు పాట సాహిత్యం

 
చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: బాస్కరబట్ల
గానం: శ్రావణభార్గవి 

చేతికి గాజులు 




వదొద్దు అనుకుంటూ పాట సాహిత్యం

 
చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: బాస్కరబట్ల
గానం: వేణు, ప్రణవి ఆచార్య

వదొద్దు అనుకుంటూ ఉన్నా నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మనసన్నాక మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కలతపడదా
ఇచ్చేసాకే కుదుటపడదా

ఇక నాలో నిన్ను నీలో నన్ను చూద్దాం 
సాతియా సాథియా సాథియా...

నిన్నా మొన్నా నువ్వు నాతో ఉన్నా
ప్రియమార పిలిచానా గురుతే లేదుగా
నీతో ఉన్నా క్షణకాలం అయినా
బహుమానం అనుకుంటూ బతికేస్తానుగా
నీ వల్లనే తెలిసిందిలే ప్రేమన్నదొకటుందనీ

వదొద్దు అనుకుంటూ ఉన్నా నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మనసన్నాక మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కలతపడదా
ఇచ్చేసాకే కుదుటపడదా

ఇక నాలో నిన్ను నీలో నన్ను చూద్దాం 
సాతియా సాథియా సాథియా...

నేనేమన్నా  నీక్కోపం రాదా
నేనంటే అంతిష్టం ఏంటో చెప్పవా?
నాలో ప్రాణం నువ్వయ్యాక
కోపాలు తాపాలు దరికే రావుగా
ఆనందమే ఆపేదెలా  కన్నీరులా జారగా

వదొద్దు అనుకుంటూ ఉన్నా నచ్చేసావు
ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు
మనసన్నాక మనసు పడదా
నచ్చేసాక బయటపడదా
ఇచ్చేదాకా కలతపడదా
ఇచ్చేసాకే కుదుటపడదా

ఇక నాలో నిన్ను నీలో నన్ను చూద్దాం 
సాతియా సాథియా సాథియా...




జ్యోతి లచిమి పాట సాహిత్యం

 
చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: బాస్కరబట్ల
గానం: ఉమా నేహా

గత నలబై ఏళ్లుగా సీమాంద్రా తెలంగాన్నాల్లో
ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు
కానీ ఇళ్ళమ్మ మోజుపడి పెట్టుకుందీ ఏయ్ ఏ
హొయ్ ఎం పేరు
ఓ సలామ్... సలామ్... జ్యోతి గయా
ఓ సలామ్... సలామ్... జ్యోతి గయా
జ్యోతి లచిమి జ్యోతి లచిమి ఐ యమ్ కాస్ట్లీ టు టచ్ మీ
జ్యోతి లచిమి జ్యోతి లచిమి ఐ యమ్ కాస్ట్లీ టు టచ్ మీ
హే రాసుకోర సాంబ నేనల్లాటప్పా కాదు
ట్రై చేసుకోర సాంబ నేను ఆర్ఢనరీ కాదు
మూసినాక ధఱ్వాజూ అదిరిపొధ్ది ఆవాజూ
మూసినాక ధఱ్వాజూ అదిరిపొధ్ది ఆవాజూ
ఒక్క సారి ఇంటికొస్తే చూడ లేరు సన్రైజ్
నే రెండు మూర్ల పూలు పెట్టి  మూడు మూర్ల చీరకడితే...
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లారే
జ్యోతి లచిమి జ్యోతి లచిమి ఐ యమ్ కాస్ట్లీ టు టచ్ మీ
జ్యోతి లచిమి జ్యోతి లచిమి ఐ యమ్ కాస్ట్లీ టు టచ్ మీ

నే ఘల్లు ఘల్లు నడిసొస్తే...
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
నే ఘల్లు ఘల్లు నడిసొస్తే ఘోల్లు ఘోల్లు అవుతాది 
పైట గాలి కెగరేస్తే ఆగమాగమవుతాది
నా పండు మిరప లాంటి పెదవి పంటికింద నొక్కెడితే
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లారే
హే బుగ్గలు చుస్తే మామిడి పళ్లు చెక్కిలి చుస్తే చీని పళ్లు
కళ్ళను చుస్తే నేరేడు పళ్లు సిగ్గులు సీతాఫలాలే
ఇట్టా నువ్వొస్తావుంటే...! ఇట్టా సూపిస్తావుంటే...!! ఇట్టా ఊరిస్తావుంటే...!!! ఆగేదింకా ఎట్టాగే

నా పుట్టుమచ్చ చూపెడితే
మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ
నా పుట్టు మచ్చ చూపెడితే రచ్చ రచ్చ అవుతాది
చీర పైకి ఎగ్గడితే...!!! కాకారేగి పోతాది 
ఆల్చిప్పలాంటి కళ్ళు గాని అటూ ఇటూ తిప్పేస్తే
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా
గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లా గిల్లారే




రాజా రాజా పాట సాహిత్యం

 
చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: బాస్కరబట్ల
గానం: ఉమా నేహా

రాజా రాజా 




కంటి పాపే పాట సాహిత్యం

 
చిత్రం: జ్యోతి లక్ష్మీ (2015)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: బాస్కరబట్ల
గానం: లిప్సిక 

కంటి పాపే 

Palli Balakrishna Wednesday, July 26, 2017

Most Recent

Default