-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sobhan"
Varsham (2004) Telugu Songs Lyrics Album Cover

Varsham (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Varsham (2004)
Director : Sobhan
Producer : M. S. Raju
Actors : Prabhas, Gopichand
Actresses : Trisha
Release Date : 14 January 2004

Nuvvosthanante Song Lyrics in Telugu – Varsham (2004)

'Nuvvosthanante' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by K. S. Chithra and Raqeeb Alam.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర ,రాఖీబ్ ఆలమ్ (Raqueeb Alam) చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలో చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన ముద్దులొలికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా చెవులకు చక్కా జూకాల్లాగా చేరుకోవే జిలుగుల చుక్కా చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా మెళ్లో పచ్చల పతకంలాగా వగలకు నిగ నిగ నగలను తొడిగేలా నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా ఆహా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా చిన్న నాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా కన్నె ఏటి సోయగంలా నన్ను నీలో పోల్చుకోనా పెదవులు పాడే కిలకిల లోనా పదములు ఆడే కథకళి లోనా కనులను తడిపే కలతల లోనా నా అణువణువున నువు కనిపించేలా నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా నువ్వొస్తానంటే ఏయ్ ఏయ్ నేనొద్దంటానా తరికిట తరికిట త ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా (4)

Mellaga Song Lyrics in Telugu – Varsham (2004)

'Mellaga' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by S. P. B. Charan and Sumangali.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. చరణ్, సుమంగళి మెల్లగా తరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా... ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం నీ మెలికెలలోనా ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా ఆ ఉరుములలోనా నీ పిలుపును వింటున్నా ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జత పడే స్నేహమై అనునయించనా... చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునుకే ఋణపడిపోనా ఈ పైనా త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా విడుదలే వద్దనే ముడులు వేయనా... మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా... ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం మెల్లగా తరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా... ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

Nachave Nizam Pori Song Lyrics in Telugu – Varsham (2004)

'Nachave Nizam Pori' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Adnan Sami and Suneeta Rao.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అద్నాన్ సమీ, సునీతా రావ్ హోయ్... హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి హే ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హేయ్ నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి శాసిస్తే చాలు ఓ సారి సిద్దంగా ఉంది సింగారి అయ్యరే సయ్యంటుందే తయ్యారై వయ్యారి నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హే... సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరీ చాల్లెద్దూ మాట కచేరి దోచేద్దూ తళుకు తినారి ముదిరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి హే పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావె పొన్నారి పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హే... వరదల్లే హద్దులు మీరి వచ్చావా పొగడల పోరి హే సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకుపోతా నారి దాటొస్తా సిగ్గుల ప్రహరి హేయ్ చేరుస్తా చుక్కల నగరి ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓ సారి మైకంలో తూరి ఓ సారి కావ్యంలో వాలి ఓసారి వాహ్ వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

Langa Voni Song Lyrics in Telugu – Varsham (2004)

'Langa Voni' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Tippu and Usha.

SONG INFORMATION
Movie : Varsham (2004)
Singers : Tippu, Usha
చిత్రం: వర్షం(2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: టిప్పు, ఉష హే లంగా వోణీ నేటితో రద్దై పోని సింగారాన్నీ చీరతో సిద్దంకాని నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ చిందులే ఆపగా ముళ్ళు వేయని సర్లేగాని చక్కగా పెళ్లైపోని అల్లర్లన్ని జంటలో చెల్లైపోనీ లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించనీ హే లంగా వోణీ నేటితో రద్దై పోని సింగారాన్నీ చీరతో సిద్దంకాని ఓ చూడు మరి దారుణం ఈడునెలా ఆపడం వెంటపడే శత్రువయే సొంత వయ్యారం హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కళ్లెదురే ఉంది కదా ఇంత సహాయం పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధానం హే హే హే హే శిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం హే లంగా వోణీ నేటితో రద్దై పోని అరె సింగారాన్నీ చీరతో సిద్దంకాని సోకు మరీ సున్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం తాళదు నా గాలి దుమారం కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం జాలిపడే లాలనతో లొంగదు భారం ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి ఆర్చీ తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ హాయ్ హాయ్ హాయ్ హాయ్ లంగా వోణీ నేటితో రద్దై పోని సర్లేగాని చక్కగా పెళ్లైపోని హేయ్ నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ చిందులే ఆపగా ముళ్ళు వేయని

Neeti Mullai Song Lyrics in Telugu – Varsham (2004)

'Neeti Mullai' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Sagar and Sumangali.

SONG INFORMATION
Movie : Varsham (2004)
Singers : Sagar, Sumangali
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్, సుమంగళి నీటి ముల్లై నన్ను గిల్లీ వెల్లిపోకే మల్లె వానా జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండి వానా తేనెల చినుకులు చవిచూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావ సిరివానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా

Kopama Song Lyrics in Telugu – Varsham (2004)

'Kopama' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Karthik and Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్, శ్రేయా ఘోషాల్ కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... చాలులే నీ నటనా సాగదే ఇటుపైనా ఎంతగా నసపెడుతున్నా లొంగిపోనె లలనా దరి చేరిన నెచ్చెలిపైనా దయచూపవ కాస్తయినా మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ కస్సుమని కారంగా కసిరినది చాలింకా ఉరుము వెనుక చినుకుతడిగా కరగవా కనికారంగా కుదురుగా కడదాకా కలిసి అడుగెయ్యవుగా కనుల వెనకే కరిగిపోయే కలది గనుకా నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువ్వు గొడుగునే ఎగరేస్తావే జదివానా హొ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... హొ... తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనకా సులువుగా నీలాగ మరిచిపోలేదింక మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక ఎగసే అల ఏనాడైనా తన కడలిని వెతికేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో ఓ... ఓ... ఓ... ఓ... ఆఁ కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... తాననే తనినాన తాననే తనినాన తాననే తనినేనాన తన్నే నాన నానే హో

Joole Joole Song Lyrics in Telugu – Varsham (2004)

'Joole Joole' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Mallikarjun and Kalpana Raghavendar.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కల్పన రాఘవేందర్, మల్లికార్జున్ ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే పొంగే ఈ గంగనాపే శివుడేలే వాడంటే వాడే మగ వాడంటే వాడే ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే శిరసెక్కి చిందాడిందే జవరాలే ఆఁ... సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్ళై ఆ సూదంటి కళ్ళే తేనెటీగ ముళ్లే చుక్కల్ని తెంచే చూపులే పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే నీ కౌగిలింత నా కోట చేసుకుంటా చిరు చినుకంత చింతా నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా... హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే పొంగే ఈ గంగనాపే శివుడేలే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే శిరసెక్కి చిందాడిందే జవరాలే హో చిన్నరి హంస ఇష్టమైన హింస హేయ్ చిన్నరి హంస ఇష్టమైన హింస రేపావే నాలో లాలస అహ కొండంత ఆశ నీకు అందజేసా నీ సొంతమేలే బానిస నీ తాపాన్ని చూశా అరె పాపం అనేసా ఇక నీదే భారోసా వందేళ్ళ శ్వాస నీ పేరే రాసేసా హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే

Palli Balakrishna Monday, June 22, 2026



చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
నటీనటులు: రవితేజ, ఛార్మి, డైసీ బోపన్న
దర్శకత్వం: శోభన్
నిర్మాత: కృష్ణ కుమార్
విడుదల తేది: 12.11.2004



Songs List:



కోనంగి కోనంగి పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: శ్రీ కొమ్మినేని , కల్పన 

కోనంగి  కోనంగి 




వంట్లో నెత్తురు పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కార్తిక్ , అనురాధ శ్రీరామ్

వంట్లో నెత్తురు 




చెమ్మచెక్క పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కార్తిక్ , కల్పన, గ్రేస్ కరునాస్ 

చెమ్మచెక్క





రుక్కు రుక్కు పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: వేటూరి 
గానం: టిప్పు, మహతి 

రుక్కు రుక్కు 



గుప్పిడి గుప్పిడి పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తిక్ , కల్పన 

గుప్పిడి గుప్పిడి 



హ మస్తాని మస్తాని పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ కొమ్మినేని 
సాహిత్యం: సాహితి
గానం: కార్తిక్ , అనురాధ శ్రీరామ్

హ మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ
మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ
మనసే దోచుకున్న లైలా నీవె మైనా
నన్నే వద్దు అన్నా  నిన్నే వదులుతానా

చక్కని చుక్కల జాబిలి నొక్కుల చెక్కిలి నీవేనా
చిక్కని చక్కెర పెదవుల హక్కులు నీకే రాసైనా

హ మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ
అరె మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ ఓ

చరణం: 1
కైపెక్కే నిమిషానా నిన్నే తలచి వగ్గేయ్నా
పై పై తగవే పడుతున్నా నీ పై ఒలపే లో లోనా
ఎదలో ఒలపున్నా అది బయటకు తెలుపదు మరుపేంటమ్మా
నిజమే చెబుతున్నా నువ్ చీ పో అన్న పులుపేనమ్మా
అందలే చిందేవేల అధరాలే కందేవేల హో ఓ ఓ హొయ్
అల్లరి నోటికి తాళం వెయ్నా ముద్దులు పెట్టేయ్నా
ఓయ్ హత్తేరి నిన్నే ఎత్తుకుపోనా కొంగున కట్టేయ్నా

మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ
ఓ హో హో మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ

చరణం: 2
హోయ్ అందరిలో ఎంతైనా ఇట్టా పడకే పై పైనా
అంతా నీది నటనేనా అంతగ అలుసైపోయానా
లలనా ప్రియ వదనా నీ జిలిబిలి అలకలు చాలునులేమ్మా
ఇదిగో చెబుతున్నా నిను కన్నది  నాకై మరి నీ అమ్మ
గారాలా కన్నులబాల మరి ఇంతా మారామేలా హో ఓ హొయ్
ఇద్దరుమిట్టా ముద్దుల మాటై చుట్టుకుపోదామా
ఇప్పటికిప్పుడు పందిరిమంచం దుప్పటి వేద్దామా

మస్తాని మస్తాని దిల్ తేరా దివానా హో ఓ ఓ
హొయ్ మస్తానా మస్తానా దిల్ తేరా దివానా హో ఓ ఓ
మనసే దోచుకున్న లైలా నీవే మైనా
నన్నే వద్దు అన్నా  నిన్నే వదులుతానా
చక్కని చుక్కల జాబిలి నొక్కుల చెక్కిలి నీదేనా
చిక్కని చక్కెర పెదవుల హక్కులు నీకే రాసైనా


Palli Balakrishna Sunday, October 1, 2017




చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: శోభన్
నిర్మాత: కె.కృష్ణ మోహన్ రావు
విడుదల తేది: 01.11.2002



Songs List:



ఈ జెండా పసిబోసి చిరునవ్వురా పాట సాహిత్యం

 
చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శక్తి
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా
మన వెలలేని త్యాగాల ఘనచరితరా
తనచనుబాలతో పోరు నేర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి తరం

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా

చరణం: 1
శాస్ర్తానికి ధ్యానానికి ఆదిగురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతంరా భారతం
ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రంరా భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా
తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా

చరణం: 2
పిచ్చికుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా
మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్య మొక్కటే సవాలురా
మానవుడే మా వేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొక మాటరా
ఉక్కు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావు ఎదురైనా భయపడదు మా గుండెరా
శత్రువెవడైనా తలవంచదీ జెండరా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా
మన వెలలేని త్యాగాల ఘనచరితరా
తన చనుబాలతో పోరు నేర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి తరం



వా... వారెవ్వా వవ్వా రెవ్వా పాట సాహిత్యం

 
చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్. పి. బాలు, సునీత

వా... వారెవ్వా వవ్వా రెవ్వా (6)

కళ్ళల్లో ద్రాక్షరసం వళ్ళంతా చెరుకు రసం
పరువం దానిమ్మరసం చిట్టి పెదవి తేనే రసం రా
వా... వా... దీన్ని పట్టబోతే పాదరసం రా...
చూపు సప్పోట రసం వయసే బత్తాయి రసం
నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మరసం రా
వా... వా... వీడి కొంటెతనం శొంఠి రసం రా...

వా... వారెవ్వా వవ్వా రెవ్వా (2)

చరణం: 1
ఆ పక్క మాయక్క ఎన్నెల్లో గుమ్మాడి
ఈ పక్క మాసెల్లి ఎన్నెల్లో గుమ్మాడి
నడిమద్యనా నేను ఎన్నెల్లో గుమ్మాడి
నిదరోతామాగదిలో ఎన్నెల్లో గుమ్మాడి

చిమ్మ చీకటిలోన క్కూ క్కూ క్కూ
తిన్నగ నాకాడికొచ్చి క్కూ క్కూ క్కూ
బుగ్గ నిమరగలవా నువ్వు వా వా
ముద్దులెట్టగలవా నువ్వు

తలుపు కిర్రుమనకుండా గురివిందా గుమ్మాడి
తైలాలు పోసిపెట్టు గురివిందా గుమ్మాడి
గొళ్ళాలు ఎయ్యకుండా గురివిందా గుమ్మాడి
దగ్గరగ ఏసిపెట్టు గురివిందా గుమ్మాడి

కాళ్ళకింద ఎత్తుపీట క్కూ క్కూ క్కూ
పెట్టుకొని నిద్దరోతే క్కూ క్కూ క్కూ
గుర్తుపట్టి ముద్దులు పెడతా వా వా
గుట్టంత దోచుకు పోతా

వా... వారెవ్వా వవ్వా రెవ్వా (3)

చరణం: 2
మీ అమ్మ మీ నాన్న గురివిందా గుమ్మాడి
ఎదురూగ ఉన్నా గానీ గురివిందా గుమ్మాడి
ఊరి జనం అంత గూడి గురివిందా గుమ్మాడి
చూత్తానే ఉన్నగాని గురివిందా గుమ్మాడి

అటూ ఇటూ చూడకుండ క్కూ క్కూ క్కూ
తిన్నగ నాకాడికొచ్చి క్కూ క్కూ క్కూ
వదిలి పెట్టకుండా నన్ను... వా వా
వడిసి పట్టగలవా నువ్వు...

ఊరి చెరువులోన నువ్వు ఎన్నెల్లో గుమ్మాడి
కలువ పూలు కోత్తావుండు ఎన్నెల్లో గుమ్మాడి
మంచినీళ్ళ కోసం వచ్చి ఎన్నెల్లో గుమ్మాడి
కాలుజారి కేకలెడతా ఎన్నెల్లో గుమ్మాడి

కాపాడేటట్టు నువ్వు క్కూ క్కూ క్కూ
నా నడుము పట్టుకుంటే క్కూ క్కూ క్కూ
అందరు సూత్తుండగా నేను... వా వా
వంటికదుము కుంటా నిన్నూ...

చరణం: 3
సూపు సూపు కలవాలని గురివిందా గుమ్మాడి
తిరణాళ్ళు వత్తాయంట ఎన్నెల్లో గుమ్మాడి
ఇద్దరొక్కటవ్వాలని గురివిందా గుమ్మాడి
ఎదిగేనంట కంది సేను ఎన్నెల్లో గుమ్మాడి

వత్తుకో కూడదని క్కూ క్కూ క్కూ
ఇసక మెత్తగుంటదంట క్కూ క్కూ క్కూ
వయసుకొస్తే ఆడ పిల్ల క్కూ క్కూ క్కూ
ఉరుకుతాది గోదారల్లె క్కూ క్కూ క్కూ
ఇచ్చి పుచ్చు కోవాలని క్కూ క్కూ క్కూ
కుర్ర జంట కోరుకుంటే క్కూ క్కూ క్కూ
తాటిచెట్టు సాటు చాలు... వా వా
తానినాన నన్నా నా అ... అ...

చూపు సప్పోట రసం వయసే బత్తాయి రసం
నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మరసం రా
వా... వా... వీడి కొంటెతనం శొంఠి రసం రా...
కళ్ళల్లో ద్రాక్షరసం వళ్ళంతా చెరుకు రసం
పరువం దానిమ్మరసం చిట్టి పెదవి తేనే రసం రా
వా... వా... దీన్ని పట్టబోతే పాదరసం రా...




లోకం పీకే నరకాలి పాట సాహిత్యం

 
చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శక్తి
గానం: కల్పన 

లోకం పీకే నరకాలి
పెట్రోలేసి కాల్చాలి
ఈ సృష్టికే ప్రతిసృష్టే చెయ్యాలి
మనుషుల బ్రైనే వాష్ చేసి
మనషుల స్కానింగే తీసి
క్లోనింగ్ తో నవలోకం చెయ్యాలి

చీరాపి లుంగీ కట్టెయ్
వోణీ తీసేయ్ తగలెట్టేయ్యి
నిప్పులోన ఈతకొట్టెయ్
టబ్బులోన హార్ట్ వేసి సబ్బు రుద్దేయి
కన్నులుండి ఎం లాభం
కలలెప్పుడు కనుకుంటే
కలగన్నా ఏం లాభం
కలలో భయము బీభత్సం
ఓ టేక్ ఇట్ ఈజీ ఏ
స్వర్గంలాంటి ఇళ్ళు ఉన్నా ఏం లాభం
ఫ్రీడమ్ లేకుంటే

లోకం పీకే నరకాలి
పెట్రోలేసి కాల్చాలి
నవరక్తమే నరాల్లో నింపాలి
మనిషిగ పుట్టి ఏం లాభం
మనుషులకుందా ఆనందం
ప్రతి మనిషిలో పగా ద్వేషం స్వార్ధం 

సరదాగా పొగ తాగే
జల్సాగా తెగ తాగే
ఆకలేస్తే హత్య చేసై - హూ కేర్స్
డబ్బు ఉంటే తప్పు పట్టదీ లోకం
బతుకంటే చావడమే చస్తూనే బతకాలి
జగమంతా జగడాలే 
మనిషికి మనిషే విషమవుతుంటే
హేయ్ టేక్ ఇట్ ఈజీ ఏ
చద్దామన్నా హే హే హే
పుట్టడం మళ్ళీ ఖాయం మరి
చడవడమెందుకులే

ఎవరెస్ట్ నే కోక్ టిన్ చేసి 
రెయిన్బో నేమో స్ట్రా చేసి
సూర్యుడికే తాగించేద్దాం ఫ్రూట్ చేసి
చుక్కలు కోసి ఫ్రై చేసి
మెరుపుల నూడిల్స్ ఏ చేసి
తినిపించుదాం చంద్రుడికే ఆకేసి

గుండేలే బండవుతుంటే
మమతలే మసి అవుతుంటే
మనుషులే రాక్షససులైతే
నడిచే శవాలు బ్రతికేమి లాభం
నా ఒంటిలో లావా పొంగి
ఊహాలే నిప్ఫై మాడి
నిలువునా కాల్చేస్తుంటే హే
ఎన్నాళ్ళు ఏడ్చినా ఏమి లాభం

హే టేక్ ఇట్ ఈజీ 
హే టేక్ ఇట్ ఈజీ బేబీ 
టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ 

లోకం పీకే నరకాలి
పెట్రోలేసి కాల్చాలి
ఈ సృష్టికే ప్రతిసృష్టే చెయ్యాలి
డబ్బుంటే ఏం లాభం
కొనడం కష్టం సంతోషం
ఈ హిస్టరీ తిరగేసి రాసేద్దాం

నలుగురుకోసం బ్రతకొద్దు
పెద్దల మాటే వినవద్దు - డోంట్ కేర్
పది మందికై నువ్వు కారాదు ఖైదు
ఇండియన్ కల్చర్ వదిలేసి
వయసును కంప్యూటర్ చేసి
కళలే కను కళ్లే  కెమెరా చేసి





పుల్లని పుల్లట్టు పాట సాహిత్యం

 
చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భారతి బాబు 
గానం: మనో 

పుల్లని పుల్లట్టు పంటికంట గానే
జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా

ఇది అట్టంటే

పుల్లని పుల్లట్టు పంటికంట గానే
జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
వేసేటి అట్లమీద యావ పుట్టగానే
AC లో తిండి మీద ఎగటు పుట్టెరా

పుల్లని పుల్లట్టు పంటికంట గానే
జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
వేసేటి అట్లమీద యావ పుట్టగానే
AC లో తిండి మీద ఎగటు పుట్టెరా

ఫైవ్ స్టార్ మీద బెట్టు మన అట్టే బెస్ట్
మీ అందరి మీద ఒట్టు మినపట్టే టేస్ట్
ఫైవ్ స్టార్ మీద బెట్టు మన అట్టే బెస్ట్
మీ అందరి మీద ఒట్టు మినపట్టే టేస్ట్

పుల్లని పుల్లట్టు పంటికంట గానే
జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
వేసేటి అట్లమీద యావ పుట్టగానే
AC లో తిండి మీద ఎగటు పుట్టెరా

రాతిరోలులోన పిండి రవ్వలోన కలిపి
రేకు పెనం మీదన రవ్వంత నూనె దులిపి 
కట్లే పొయ్యి మీద దాన్ని అట్లకాడతో కాల్చి
పొడి కారం పైనచల్లి పొగసూరకుండ తీసి

కాలుతున్న అట్టుముక్క నాలుక మీదెట్టుకుంటే
కాలుతున్న అట్టుముక్క నాలుక మీదెట్టుకుంటే
నాషాలానికెక్కి మంచి హుషారు పుట్టిస్తదిరా
పుల్లట్టు అబ్బబ్బబ్బ

పుల్లని పుల్లట్టు పంటికంట గానే
జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
వేసేటి అట్లమీద యావ పుట్టగానే
AC లో తిండి మీద ఎగటు పుట్టెరా

కట్లెట్ లు పిజ్జా లు దీని ముందు దిగదుడుపు
నూడుల్స్ చికెన్ రోల్స్ అరగవుర పరగడుపు
హాట్ డాగ్స్ బర్గర్ లని ఇంగిలిపీసు మరిగినోడు
ఫాస్ట్ ఫుడ్ తిన్నాక టేస్ట్ మరచిపోతాడు

తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా ఓ
తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా
పదేల్లైన మరచిపోడు పదే పదే అడుగుతాడు
పుల్లట్టు అట్టు అట్టు అట్టు

పుల్లని పుల్లట్టు పంటికంట గానే
జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
వేసేటి అట్లమీద యావ పుట్టగానే
AC లో తిండి మీద ఎగటు పుట్టెరా

పుల్లని పుల్లట్టు పంటికంట గానే
జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
వేసేటి అట్లమీద యావ పుట్టగానే
AC లో తిండి మీద ఎగటు పుట్టెరా 



అడుగడుగు పాట సాహిత్యం

 
చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శక్తి
గానం: హరిహరన్, రంజిత్ 

చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శక్తి
గానం: హరిహరన్, రంజిత్ 

పల్లవి:
అడుగడుగు గుండెనడుగు
తడబడిన ఈడునడుగు
ఏ మంత్రమో వేసావే
మనసునే మగతగా కమ్మావే
నీ నవ్వుతో చంపావే
వయసునే వరదలా ముంచావే

గుండెలనుండి గుసగుసలేవో
వెన్నులో పాకాయిలే
ఊహకురాని తహ తహలేవో
తాపం పెంచాయిలే
నా నర నరం జివ్వంది
తనువుతో అనుభవం అడిగింది

చరణం: 1
కోరికేదో తొలిమొటిమై పూసే
తేనెలాగా చిరు చెమటై పోసే
మాయ ఇది ఎవరిమాయ
సిగ్గు నూనూగు చిగురే వేసే
ఉగ్గపట్టి ప్రాణాలే తీసే
మంత్రం చెలివేసే మంత్రం
చూపడిగితే చెప్పలేని వయసు కోత ఆ ఆ ఆ
వెన్నులోన చిలుకుతున్న తీపి బాధ...

గుండెలనుండి గుసగుసలేవో
వెన్నులో పాకాయిలే
ఊహకురాని తహ తహలేవో
తాపం పెంచాయిలే
నా నరం జివ్వంది
తనువుతో అనుభవం అడిగింది

అడుగడుగు గుండెనడుగు
తడబడిన ఈడునడుగు

చరణం: 2
గోరువెచ్చని ఊపిరికే 
వేడికొసలు చిరు తాకిడికే
మేను మెరుపులా మెరిసింది
ఈడు మెలికలే తిరిగింది
చెలియ తుంటరి నవ్వులకే
తలుపు తీయని కౌగిలికే
వయసు భగ్గున మండింది
తియ్య తియ్యగా కాల్చింది

చిగురాకులగా నా ఒళ్లే
సెగ చిమ్మి వణుకుతూ ఉంది
తమకాన్ని రేపే ని పెదవి
నవనాడులాపుతూ ఉంది
నా నర నరం జివ్వంది
తనువుతో అనుభవం అడిగింది...

అడుగడుగు గుండెనడుగు
తడబడిన ఈడునడుగు
గుండెలనుండి గుసగుసలేవో
వెన్నులో పాకాయిలే
ఊహకురాని తహ తహలేవో
తాపం పెంచాయిలే
ఏ మంత్రమో వేసావే
మనసునే మగతగా కమ్మవే
నీ నవ్వుతో చంపావే
వయసునే వరదలా ముంచావే  



లాలు దర్వాజా కాడ పాట సాహిత్యం

 
చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శక్తి
గానం: కార్తీక్ , కల్పన 

ఏ పిల్లా పిల్లా లస్కురి పిల్లా
లగ్గోరి పిల్లా లడాయి పిల్లా
బడాయి పిల్లా సొగసరి పిల్లా
సోకుల పిల్లా పిల్లా పిల్లా

లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి
లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి
లాలు గూడ రబ్బరు బొమ్మ
నా ముద్దుల రంభాయి
లాలు లాలు పొట్టిరో లగ్జనకరి పట్టిరో
లబో దిబో బొమ్మరో  లోలాకు గుమ్మరో

లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి
లాలు గూడా రబ్బరు బొమ్మ 
నా ముద్దుల రంభాయి
లాలు లాలు పొట్టిరో లగ్జనకరి పట్టిరో
లబో దిబో బొమ్మరో  లోలాకు గుమ్మరో

రాయే రాయే పిల్లా రాలుగాయి పిల్లా
ముందరుందే బ్రతుకు ముందుకెయ్యవే అడుగు
చింత ఎందుకు పిల్లో - ఓ చిన్నాదాన
చిందులెయ్యవే పిల్లో - ఓ కుర్రాదాన

అడుగు వెయ్యాలంటే కాలు వణుకుతుంది
పెదవి విప్పాలంటే అదురుతోంది గుండే
చెప్పలేని భయము ఓ చిన్నావాడ
తొలచి వేస్తూవుంది ఓ కుర్రావాడ

హే దమ్ములుంటే చాలే పిల్లా
రెండే రెండంట చావు బ్రతుకంట
ఇంకేం లేవంట జీవితమంటే

కలిసే బ్రతుకైన కలిసే చావైన
వదలను నీ చేయి ఏదేమైనా

కలిసే బ్రతుకంట కలిసే చావంట
వదలను నీ చేయి ఏదేమైనా

హే చార్మినార్ చౌరస్తాలో నా ముద్దుల రాంబాబు
చాందినిలో వస్తివి పిలగో నా ముద్దుల రాంబాబు
లాలు లాలు పిల్లడో లల్లాయి పోరడు
లొల్లి పెట్టే గుంటడు లవ్వంటు వదలదు

కట్టు కట్టు బండి జోడెడ్ల బండి
ఇంపైన బండి ఇరుసెయ్యని బండి
బండెక్కే పిలగా ఓ చిన్నావాడ
జోరుగెల్లర పిలగో ఓ కుర్రవాడ

మూల మలుపుల కాడ ఎత్తు వంపుల కాడ
జోడు కొండల కాడ మోటు బావి కాడ
బండి భద్రం పిల్లో ఓ చిన్నాదాన
గుండె పదిలం పిల్లో ఓ కుర్రాదాన

నువ్వే నా తోడైవుంటే...
ఒక్క రోజే చాలు పట్టు వెయ్యి స్వర్గాలు
నీ గుండె సవ్వడినై ఉంటానంటా

ఒక్క నవ్వే చాలు పిలిచొస్తా లోకాలు
గుండె నిండా నువ్వే వుంటానంటే
గుండె నిండా నువ్వే వుంటానంటే
గుండె నిండా నువ్వే వుంటానంటే

లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి
లాలు గూడ రబ్బరు బొమ్మ
నా ముద్దుల రంభాయి
లాలు లాలు పొట్టిరో లగ్జనకరి పట్టిరో
లబో దిబో బొమ్మరో  లోలాకు గుమ్మరో

లాలు లాలు పిల్లడో లల్లాయి పోరడు
లొల్లి పెట్టే గుంటడు లవ్వంటు వదలదు

లాలు లాలు పొట్టిరో లగ్జనకరి పట్టిరో
లబో దిబో బొమ్మరో  లోలాకు గుమ్మరో
లాలు లాలు పిలడో లల్లాయి పోరడు
లొల్లి పెట్టే గుంటడు లవ్వంటు వదలదు


Palli Balakrishna Thursday, July 6, 2017

Most Recent

Default