Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Deepak"
Mitrudu (2009)



చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , ప్రియమణి, దీపక్ (అర్జన్ బజ్వా)
దర్శకత్వం: మహాదేవ్
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
విడుదల తేది: 01.05.2009



Songs List:



తెల్లవారితే పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: రాహుల్ నంబియార్, హేమచంద్ర, శ్రావణ భార్గవి 

తెల్లవారితే




బై బర్తే పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: శ్రేయా ఘోషాల్ 

బై బర్తే





డోంట్ టచ్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: రంజిత్, చిత్ర 

డోంట్ టచ్  మీ



జుమ్మంది వళ్ళంత పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఓరుగంటి 
గానం: కార్తీక్, సుజాత 

జుమ్మంది వళ్ళంత




ప్రియమణి అన్నాను పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సైందవి

పల్లవి: 
ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో 
ప్రియమనే ఉన్నావు నా గుండెలో
ప్రియతమా అన్నాను నేనెన్నడో
ప్రియలయే రేగింది నా గుండెలో
నువ్వు చూస్తే ప్రేమ చేర వస్తే ప్రేమ
నాలో జివ్వు జివ్వు జివ్వుమందిలే
ఓ నమః ప్రేమ ఒళ్ళో మహా ప్రేమ
నీతో సై సై సై అందిలే

చరణం: 1
నీలోనే లోకాలు నీతోనే కాలాలు
ఈ జీవితం స్వాగతం
ఈ ప్రేమ తీరాలు కావింక దూరాలు
ఇదే మా ఇద్దరం
గులాబీల నూనూగు రెమ్మా
ఎలా తాకినా హాయిలే
చాలకీల ఈ చందమామ 
ఇలా అందిన రేయిలే

ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో 
ప్రియమనే ఉన్నావు నా గుండెలో

చరణం: 2
ఈ పూల భాషల్లో  ఈ రాస లీలల్లో 
ఝుం ఝుంమని వాలిపో
ఈ మందహసాన ఈ మల్లెమాసాల
రా రమ్మని వచ్చి వాలిపో
ముకుందాల ముద్దంత తీసి 
నే ముమ్మాటు ముట్టించనా
వసంతాల పూతేని పోసి
నీ ఒళ్ళంత ముద్దాడనా

ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో 
ప్రియమనే ఉన్నావు నా గుండెలో
ప్రియతమా అన్నాను నేనెన్నడో
ప్రియలయే రేగింది నా గుండెలో




ఆకాశం నుంచి పాట సాహిత్యం

 
చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: విజయ్ యేసుదాస్, కౌసల్య 

ఆకాశం నుంచి 

Palli Balakrishna Tuesday, November 14, 2017
Nee Thodu Kavali (2002)




చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
నటీనటులు: రవి తేజ, శ్రుతి హసన్, 
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: బి.మధు
విడుదల తేది: 09.01.2021



Songs List:



బాలామణి ఎంత పని పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: ఉదిత్ నారాయణ, స్వర్ణలత

పల్లవి:
బాలామణి ఎంత పని చేశావే నువ్వు
ఈత ముల్లు గుచ్చి గుండె పెట్టావే చిల్లు
తాటి చెట్టు కింద తాగుతుంటే ముంత కల్లు
జొన్న చేలో నడిచి వచ్చి కలిపావే కళ్ళు..
సుందర ఇందరి ముందర చేయకు
చిందర వందర
గుట్ట కింద గట్టుకాడ దారి కాచి ఉండు వస్తా
పటా పటా పట్టు పట్టి నిన్ను దోచుకుంటా
నా గుండెలోన గూడు కట్టి
నిన్ను దాచుకుంటా 


చరణం: 1
నడుమే కదిలే గలగల ఆ నదల్లే
ఎదలో వరదలే జలజలమని పొంగించే
ఎంకి పాటనంటూ కమ్మగ పాడుకుంటూ కంకిపూలపైన
పిట్టల ఎగిరిపోనా
కంటి పాపవంటూ కనులో దాచుకుంటూ చంటి పాపనంటూ
మదిపై వాలిపోనా
పొదలో సుధలే చిలికీ వగలే పంచనా
పగలే సెగలే రగిలీ కథనే పెంచనా
అందగాడ సందెకాడ సందు చూసుకోర..
ఆ కంచెకాడ మంచమేసి పూలుజల్లుకోరా..
 
చరణం: 2
ఎగిసే కొలనులో కొరమేనును తెప్పించి
అదిరే పులుపుతో వలపేనే వడ్డిస్తా
అతడు. కురిసే వానలోన చినుకైపోయినట్టు
తనువే తాకినేను చీరై చుట్టుకోనా...
ఆమె. మెరిసే బుగ్గలోని విరిసే సిగ్గులన్నీ పరిచా
ఆకుమీద జోడుగ నంచుకోరా
అతడు. మిధునం మధనం కలిసి జరిపే సంబరం
ఆమె. అధరం అధరం వణికి మరిచే అంబరం
అతడు. కీచుకీచు పిట్టా నీను గంపకింద పెట్టా సందుచూసి
ముద్దు మీద ముద్దు పంచిపెట్టా




గీతం సంగీతం పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: హరిహరన్, ఉష

పల్లవి:
గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో
నిత్యం సాంగత్యం ప్రియ తనువుల మధురిమలో
శతమానం అంటూ ప్రియహారం వేయనా
సహకారం అంటూ మమకారం పంచనా
ప్రణమామి అంటూ ప్రాణమివ్వనా

చరణం: 1
ఓ చెలియా ఇది నిజమా నీ పలుకే పరవశమా
నిజమెరుగనులే సాంతం  నినుగని ఇక నిరంతం
మదిలయలకు వసంతం కలిగే
ఎంత ఎంత దూరం  అందాల ప్రేమ తీరం అంటూ
చెప్పవోయి ప్రాయంనీ ప్రేమ స్థావరం
ఉంది కొంత దూరం దాయాలి అంతవరకూ
మీరు గుండెలోనే భారం అంటుంది పావురం
నిను చూసే మదిరాసే కావ్యము
నిను చేరే ఎద హాయె ఎంత భాగ్యము
గగనాలే నీవై భువనాలే మరువనా
జవరాలే నేనై పరువాలే పంచనా
నీచెంత ఎంత హాయిలే ప్రియా

చరణం: 2
ఈ హృదయం అతి సృజనం నీ శృతిలో ప్రతి నిమిషం
శశి పరువపు అజంతం  పిలిచెనులే అచెంతం
కసి పెదవులే నా సొంతం చేసే
నిన్నలేని భావం నిన్ను చూసి నాకే నాలో
గుండేలోన చేరి గోల చేశినా
నింగినున్న స్వర్గం పంచిన్నావు నేలమీద ఎన్ని
జన్మలైన నిన్ను వీడనే
నీ సాయం నీ ప్రాయం నాకు అవసరం
ఓ నేస్తం నీకోసం నేను అంకితం
నా వలపే నీదై బహుమానం ఇవ్వగా

నా తలపే నీకై పరిహారం కట్టగా
ఈ జన్మకింత చాలులే ప్రియా
గీతం సంగీతం ప్రియ తనువుల మధురిమలో
నిత్యం సాంగత్యం చెలి పెదవుల సరిగమలో
శతమానం అంటూ ప్రియహారం వేయనా
సహకారం అంటూ మమకారం పంచనా
ప్రణమామి అంటూ ప్రాణమివ్వనా



జానేభీదో పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: సునిధీ చౌహాన్

పల్లవి:
జానేభీదో జానేభీదో  మేరేయారో...
ఆనేవాలా కల్ తోహై సాథ్ యారో
కల్ గయా డల్ గయా  ఏక్ అప్నా  బన్ కా థిఖాగయా సపనా
జీవితానికి రోజులుగా నాలుగంటే నాలుగురా
నిన్న నేటికి సాక్ష్యమురా రేపు మనకిక లక్ష్యమురా
లైఫే ఛాలెంజ్ అనుకొని

చరణం: 1
చమబ్బు చాటు ఉరిమే అమెరుపులోని వెలుగే
మురిపించి మాయమైనా కన్నుల్లో నిలిచిపోదా..
ఆకాశంలోనే కదిలే కోటి తారలున్నా...
ఆ రాలే ఉలకలవైపుకు మనసులాగిపోదా...
అలరించే అందాలన్ని క్షణికమైనవే అయినా మనకు
చిరకాలం దాని వెలుగులో నడిచిపోరా నువ్వు....
You will ...gain it ... చలో చలో !!

చరణం: 2
కంటిలోనే నిత్యం ..కదలాడు కొంటె స్పష్నం
సాధించి చూడుసత్యం కాగలదులేరా ముత్యం
ఆ సాగరతీరంలోని ఇసుక గూడులన్నీ
నిలవాలి ఆశల గూటిలో రాతిమేడలౌతూ..
చై జారిందేదో అంటూ భాదపడుట మార్చేసి ట్రెండు
గడిచిందే రేపటి కొలకు స్పూర్తిచేయి ఫ్రెండు
Shoot it...Chase it... చలో చలో

జానే భీదో జానేభదో మేరేయారో .....అనేవాలా కల్లోహై సాథ్ యారో
కల్ గయా....డల్ గయా  ఏక్ అప్నా  బన్ కా థిఖాగయా సపనా
like a diamond in the sky యే హమారా జీవన హై
What you loose is not so high
how to reach it దేఖో భాయి
shoot it...chase it...చలో చలో




అందాలకోన పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: వలీషాబాజ్జీ

పల్లవి:
అందాలకోన కోసంచుల్లో చేన ఆ చేనులోన
ఓ గుండెకూన గళమే విప్పెనుసోనా ఓ రాగమైనా
పలికే ఆ రాగము భావము జగమే మెచ్చినదోయి
యుగమే ఏ రూపుగ మారిన నిజమై నిలిచెను రేయి
మదిలో ఆకాంక్షను పెట్టి కృషినే తోడుగ చేయి
కలిగే ఆ రోజును చూడర రాజువు నీవే భాయి

చరణం: 1
కృషి వుంటే మనిషైనా ఋషులౌదురే అంటూ అన్నాడో కవిబ్రహ్మ నాడు
ఈకాంక్షే కలిగిందో గుండెల్లోనే రోజు నీకంటూ ఎదురేదినేడు
సాధ్యం కాదన్నది ఏదీ భువిలోనే లేదను సత్యము
కూసంత నడుమే కడితే దివినైన తాకుట తథ్యము
నీపైనీ నమ్మకాలే నిన్ను నడిపించు కడవరకు......

చరణం: 2
నాకంటూ ఓ రోజు ఉందంటు ఓ నేస్తం సాగించు నీ జీవ ప్రాయం
నీలోను కొలువున్న కొండంత ఆ ఆశే సాధించి పెట్టేనే గమ్యం
నీ ఓటమి నీ విజయమునకు తొలిమెట్టె నిలువక మానదు
చైజారిన ఆ అనుభవమే గెలిపించి వదలక మానదు
ఏ గ్రహణమేమి నిన్ను వంచదు గుండెల్లో దమ్ముంటే





నీతోడుకావాలి... పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: వలీషా బాబ్లీ, హరిణి

పల్లవి:
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి...... నీతోడు కావాలి....
నిను చూసి నాకు తెలిసెలే...సంతోషం అంటే ఏమిటో 
నీ నవ్వుల చిలిపి వెలుగులో..
నా బ్రతుకును నడపడానికి...

నీతోడు కావాలి

నిను కలిసినాక తెలిసెలే... 
బతుకన్నది తీపి బాటని
నీవుంటే కాలమే తెలియదని 
ఆ విలువే మనసుకు పంచుటకు 

నీతోడు కావాలి

వీచే గాలై నన్ను చేరుకొని నీవు
శ్వాసనిచ్చి ప్రాణమల్లే మారిన చెలియా నాకు

నీతోడు కావాలి

ఒకటీ ఒకటి రెండు కాదు అని నాలో నువ్వు వేరు కాదు అని
నన్నే నీలో కలుపుకొనుటకు ... ఓ నేస్తామా నీకై ఎపుడూ వేయి కళ్ళతో
ఎదురు చూపులో ఉండగలనని మాటే ఇచ్చి చెంత నిలుచుటకు .... నా ప్రాణమా
నీతోడుకావాలి....... నీతోడు కావాలి.... నీతోడుకావాలి....... నీతోడు కావాలి....




కలలో కలనే కన్నాను.. పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: వలీషా బాబ్లీ, హరిణి

పల్లవి:
కలలో కలనే కన్నాను.. ఆ కలలో నిను కనుగొన్నానే
కలను వదిలి కనబడవే కానుకగా
కలలు గన్న నా మనసుకు చేరువగా
కలలు కన్నాననీ కలను మిగిలించకు ఇలకు చేరాలని నా కలను
కరిగించకు కలత పెట్టే కలను వదిలి ఇలకు చేరే చెలి 

చరణం:  1 
చిలిపి పెదవిపైన చిరునవ్వు చిందనిస్తే
చిరుజల్లు కురిపినేను చితి నుండి లేచిరానా
కనుకాటుకల్లే నన్ను కరుణించి రాసుకుంటే
కనుపాప లాగా నీతో కలకాలముండిపోనా
నీ తీయని పలుకే నను కోరుకుంటే
కడ వరకు తోడై నేనుండిపోనా
చిత్రమల్లే మెరిసి పోయి స్వప్నమయ్యేవెలా

చరణం: 2
ఆ దేవుడొచ్చి నన్ను వరమంటూ కోరుమంటే
ఏ జన్మకైనా నేను నీతోడు కోరుకుంటా
మరుజన్మ వరకు నేను నిను వీడి ఉండలేను
మరణించి కూడ నీకై మరురూపు దాల్చినాను
కనిపించే రూపం కదలాడు తుంటే
గుర్తించని మనసే వేటాడుతుంది
కలల తీరం పక్కనుందీ ఎందుకీ కలవరం



పాతికేళ్ళ కిందటి మాట పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: రవివర్మ లెనీనా చౌదరి

పల్లవి:
పాతికేళ్ళ కిందటి మాట రాజమండ్రి రేవుకాడ
నీళ్ళకుండ నెత్తిన పెట్టి కోమలాంగి పోతూవుంటే
సూటు బూటూ వేసుకున్నా కుర్రాడొకడు చూశాడంటరో
కళ్ళూ-కళ్ళూ కలిపేశాడు మనసే ఆమెకు ఇచ్చేశాడు
పెళ్ళికి సిద్ధం అయ్యేరోజు కొరకొర మీసపు ముసలోడొచ్చి 
ఖంఠములో నా ప్రాణము ఉండగ పెళ్ళే జరగనివ్వను అన్నాడూ

ఆ సూటూ బూటు కుర్రాణ్ణి నేనేనయ్యా
కోర మీసాలోడు బాసు భట్టాచార్య 
తాను అచ్చంగా నన్నుగన్న మా నానాన్నయ్యా
ఏజ్ వన్నెట్ సెవెన్ నాటౌటైయ్యా..

ఆఖంఠములో ప్రాణమింక పోయేదెపుడో
నన్ను నువ్వు పెళ్ళాడీ తీరేదెపుడో

పాతికేళ్ళ కిందటి మాట రాజమండ్రి రేవుకాడ
నీళ్ళకుండ నెత్తిన పెట్టి కోమలాంగి పోతూవుంటే
సూటు బూటూ వేసుకున్నా కుర్రాడొకడు చూశాడంటరో

పాతికేళ్ళ కిందటిమాట లూధియాన గల్లీలోన
పగడాబన్ కే ఏక్ ముండా గూటీ బిళ్ళ ఆడుతూ ఉంటే
లచలచత్ ఏక్ కుడియా  మట్కా పట్టి ఎదురుగ
పోయెనురో 
లకడీతోటి బిళ్ళను కోడితే దిల్ కా మటకాపగిలిపోయి
ఇద్దరు ఒకటై పోయినాక లంచ్ లోన కుడియానాతో దాల్ తదాకా రోటీ తింటూ
సడన్ గా స్వర్గానికే పోయెనురో

అప్పటి నుండీ రోటీ మానేశాను 
పంజాబే వదిలేసి వచ్చేశాను
ఆంధ్రాలో గోంగూర చూశాను
అవకాయ నంజుకొనుట షురూ చేశాను

అందుకనే గోంగూర కరువాయోనూ
మామిడికాయ రేటు పెరిగి దురువాయెను

పాతికేళ్ళ కిందటిమాట లూధియాన గల్లీలోన
పగడాబన్ కే ఏక్ ముండా గూటీ బిళ్ళ ఆడుతూ ఉంటే
లచలచత్ ఏక్ కుడియా  మట్కా పట్టి ఎదురుగ
పోయెనురో 

పాతికేళ్ళ కిందటి మాట పాకిస్తాను బార్డర్ లోన
ఏ.కె. 47ఏ పట్టి చెడుగుడు ఆటే ఆడుతు ఉంటే
కాలికి పక్కన బాంబుపేలి 
మెడికల్ గా Unfit అయ్యారో
పట్టిన పట్టే వీడనంటూ ప్రాణం లెక్క చేయనంటూ 
శత్రువు దడదడలాడిపోయి వణుకే తట్టి బెణుకే పుట్టి తోకలు ముడుచుకుపోయే వరకు
నిదురేపోనని శపథం చేశారో

ఎన్ని తరాలైన పోరు ఆపను అంటూ 
చేశాను అల్లుడినే లెఫ్టినెంటూ
మిలటరీకి ఇంతటితో సేవలాపను
వారసుడిగా మనవణ్ణి పంపిస్తాను

దేశం దేశం అంటూ అల్లుడక్కడా
వారసుడేం పుడతాడు నీకు ఇక్కడా? 

పాతికేళ్ళ కిందటి మాట పాకిస్తాను బార్డర్ లోన
ఏ.కె. 47ఏ పట్టి చెడుగుడు ఆటే ఆడుతు ఉంటే
కాలికి పక్కన బాంబుపేలి 
మెడికల్ గా Unfit అయ్యారో

పాతికేళ్ళ కిందటి మాట పాలకొల్లు మండలాన
రావిచెట్టు సందులోన అరుగుల వారి ఇంటిలోన
బొరుగులు తినే గుమ్మను చూసి
చిలిపే కృష్ణుడు చిటికెలు వేసెనురో

ఆ చిటికెలు వేసిన పాండుగారు
వరుసకు మా తాతగారు  
ప్రేమనగరూ ఏ.ఎన్.ఆర్.
ఎవ్వర్ గ్రీను ఎన్.టి.ఆర్
మీసం పండిన హీరోగారు
వీరికి ఎవరూ సాటి లేరండోయ్

ఈస్ట్మన్ కలర్ నాటి మా స్టోరీలు
చెప్పేందుకు మీ చెంతన ఎన్నో ఉన్నై
చేతనైతే మీరూ చేసి చూపండి
లవ్ చేసి గిన్నిస్ బుక్ లో ఎక్కండి

మీ స్టోరీ చదివినాక బొంబాయోళ్ళు
దిల్ వాలే దుల్హానియా మరచిపోవాలి 
మునిగి పోయినా టైటానిక్కే మళ్ళీ
మీ లవ్ చూసి తేలుకుంటూ గంతులేయాలి

మునిగి పోయినా టైటానిక్కే మళ్ళీ
మీ లవ్ చూసి తేలుకుంటూ గంతులేయాలి



శ్వాసల్లో శ్వాసల్లే పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: వలీషా బాబ్జి

శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే
నీడల్లో తోడల్లే నా గుండె జోరల్లే
ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటు నీవు వస్తుంటే
సాగరాన ఎగసే అలవై దోబూచులాడేవో
కడలికి కన్నీటిని తరలించీ
దప్పిక నా మనసుకు మిగిలించి

ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే
ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే

వాలిపోయిన పొద్దులు ఓ దీపమల్లే వెలిగి
రాలిపోయిన ఆశలన్ని రేపిపోయినావే
మోయలేని ఓ పూలకొమ్మకు జీవమంటు పోసి
ప్రాణమిచ్చిన ఆ చిట్టి రెమ్మకు ధ్యానమయ్యినావే
బ్రతుకే పచ్చతోరణములా ప్రేమ సాగరములా
మర్చివేసి నను విడిచిపోయినావే
నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని
నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని
అనుకుంటే ఓ ప్రియ నను విడిచి పోయావే

నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే
ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే


రాతికైన నేర్పించుకుంటే మాట పలుకుతుందే
కాటి నైన బ్రతిమాలుకుంటే మంటలార్పుతుండే
ఏ నాటికైన సరిదిద్దుకుంటే రాత మారుతుందే
ప్రేమలోన పడిపోయినాకే మనసు మారుతుందే
మనసే చంపుకోని నేను మరచిపోయి నిన్ను
అడుగు తీసి అడుగేసి కదులుతుంటే
దూరమని నేను వెళ్తువుంటే దగ్గరగ మనసు లాగుతుంటే
దూరమని నేను వెళ్తువుంటే దగ్గరగ మనసు లాగుతుంటే

ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే
ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే

ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటు నీవు వస్తుంటే
సాగరాన ఎగసే అలవై దోబూచులాడేవో
కడలికి కన్నీటిని తరలించీ
దప్పిక నా మనసుకు మిగిలించి

ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే
ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటు ఎదగాయం చూశావే




నీతోడుకావాలి.... నీతోడు కావాలి.... పాట సాహిత్యం

 
చిత్రం: నీతోడు కావాలి (2002)
సంగీతం: వలీషా బాబ్జి , సందీప్
సాహిత్యం: భాషశ్రీ
గానం: సునీత

నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....

నిను చూసి నాకు తెలిసెలే...
సంతోషం అంటే ఏమిటో 
నీ నవ్వుల చిలిపి వెలుగులో...
నా బ్రతుకును నడపడానికి...

నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....

నిను కలిసి నాకు తెలిసెలే... 
బతుకన్నది తీపి బాటని
నీవుంటే కాలమే తెలియదని 
ఆ విలువే మనసుకు పంచుటకు 

నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....

వీచే గాలై నన్ను చేరుకొని నీవు
శ్వాసనిచ్చి ప్రాణమల్లే మారిన ప్రియుడా నాకు

నీతోడుకావాలి....... నీతోడు కావాలి....
నీతోడుకావాలి....... నీతోడు కావాలి....

ఒకటి ఒకటి రెండు కాదు అని 
నాలో నువ్వు వేరు కాదు అని
నన్నే నీలో కలుపుకొనుటకు.... ఓ నేస్తామా 
నీకై ఎపుడూ వేయి కళ్ళతో
ఎదురు చూపులో ఉండగలనని మాటే ఇచ్చి చెంత నిలుచుటకు..... నా ప్రాణమా

నీతోడుకావాలి...... నీతోడు కావాలి..... నీతోడుకావాలి...... నీతోడు కావాలి....

Palli Balakrishna Sunday, October 22, 2017
Sampangi (2001)



చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
నటీనటులు: దీపక్, కాంచి కౌల్
దర్శకత్వం: సానా యాది రెడ్డి
నిర్మాత: శ్రీమతి కళ్యాణి వెంకటేష్
విడుదల తేది: 13.07.2001



Songs List:



పేంటేస్తేగాని తెలియలేదురా మామా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: వరికుప్పల యాదగిరి , ఘటికాచలం

పేంటేస్తేగాని తెలియలేదురా మామా 




గుండె నెందుకిచ్చావురా దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: యస్.పి.బాలు 

గుండె నెందుకిచ్చావురా దేవుడా 
ఎండమావి చేసావురా దేవుడా
అమృతమంటి ప్రేమను కురిపిస్తావు
మరు నిముషంలో విషముగా మరిగిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 

మనసు మనసుతో ముడివేసి మౌన ప్రేమతో పెనవేసి
ఒకరినొకరిగా తోడును చేస్తావు
ఒకరి నీడలో ఒకరిని చూస్తావు
వలపు దీపాలు వెలిగించి
వేళా వెన్నెలలు కురిపించి
కళల కాలాన్ని కరిగించేస్తావు
శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు

ఆడినంతసేపడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు
ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు
ఏమాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరికొడతావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 

ఎదను గుడిలాగా మార్చేసి
ఎదుట దేవతను చూపించి
ప్రేమ పూజలే జరిపించేస్తావు
వింత మాయలో పడదోసేస్తావు
బ్రతుకు హారతిగా వెలిగించి
వెతల పాత్రలో కరిగించి
వెలుగు రేఖలను నిలువునా కోస్తావు
విలువ చీకటిగా మిగిలించేస్తావు

నిండు ప్రాణాలు కదిలిపోతుంటే కన్నె నీటితో కాల్చేవు
బండరాయిలా నువ్వుంటావు కనుకనే బాధపడలేవు
ఈ మాయలన్ని ఇక నీకే తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 
ఎండమావి చేసావురా దేవుడా
అమృతమంటి ప్రేమను కురిపిస్తావు
మరు నిముషంలో విషముగా మరిగిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా  



అందమైన కుందనాల బొమ్మరా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: వరికుప్పల యాదగిరి

కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే
ఓపెనర్ జారిపోయే
వీడి గుండె ఓపెనైపోయే
మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే
అంతలోనే మాయమాయె
వాడి మనసు దాటి వెళ్లిపోయే
అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా
బైక్ వాడు స్టార్ట్ చేస్తే
రైల్ ఉ గేట్ దాటి వెళ్లిపోయే
వీడి గుండె గిల్లి వెళ్లిపోయే

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ ఇంటి వనితో మరీ
నా ఎద మీటి పోయే చెలీ
ఏచోట ఉందొ మరీ
నా ప్రియమైన ఆ సుందరీ

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

అనుకోకుండానే నేను చూసాను ఆమెనూ
ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ
అనుకోకుండానే నేను చూసాను ఆమెనూ
ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ

ఎక్కడని వెతకాలి ఆ ప్రేమనూ
చూడకుండా ఉండలేను ఏం చెయ్యనూ
ఏమో ఏ మెడల్లో దాగి ఉందొరా

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడీ
చూపుల వలా వేసి తీసుకెళుతుంది తన వెంబడీ
ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడీ
చూపుల వలా వేసి తీసుకెళుతుంది తన వెంబడీ

ఒక్కసారి చేరాలి ఆ నీడనూ
విన్నవించుకోవాలి ఈ బాధనూ
ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ ఇంటి వనితో మరీ
నా ఎద మీటి పోయే చెలీ
ఏచోట ఉందొ మరీ
నా ప్రియమైన ఆ సుందరీ

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా




చెలియా నిను చూడకుండా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరాం 

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పొయ్యవే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

నేచ్ఛేలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలినై
నా చెలి నుదుటికి అందానిచ్ఛే సిందూరమై
కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై
హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై

గున్నమావి తోటల్లోనా నే ఎదురు చుస్తాలే
గుప్పెడంత గుండెల్లోనా చోటిస్తా రావయ్యో
నా ప్రేమ రాశివి నువ్వే హా
నా ఊపిరి చిరునామా నువ్వే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

మానస వాచా నీ మదిలోన కొలువుండానా
నా నిలువెల్లా దాసోహాలే చేసేయనా
ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా
ఏడడుగులతో కొంగు ముడేస్తా ఏదేమైనా

నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా
నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా
నా రెండు కన్నులు నువ్వే హా
నా చంటి పాపవు నువ్వే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగుల్లో అడుగేస్తూ నా మది లోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పొయ్యవే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా




నచ్చావే భామా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సుఖ్విందర్ సింగ్ 

నచ్చావే భామా 




సంపంగి రెమ్మ పూబంతి వమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: ఉన్ని కృష్ణన్

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా
ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే
ఓ… నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే
పరిసరి పసనిస నినిపమరిస రిపమప
మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే
ఓ…యదను తాకగనే ఏదో హాయి రగిలేనే
చాటుమాటుగా నిన్నే నే చూస్తున్నానే
గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే
ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే

సంపంగి రెమ్మా... పూబంతి వమ్మా...
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా

రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే
ఓ… కలలో నిన్నే చూసి మురిసిపోతానే
ఆ ఆ ఆ ఆ ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే
ఓ… కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని
ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే
ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే
నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా

Palli Balakrishna Friday, July 28, 2017
Premalo Pavani Kalyan (2003)





చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
నటీనటులు: దీపక్ , అంకిత
దర్శకత్వం: పోలూర్ ఘటికాచలం
నిర్మాతలు: బి.ఏ. రాజు, జయ
విడుదల తేది: 13.12.2003



Songs List:



చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా
ఇప్పుడే ఇక్కడే వాలిపోమ్మా
ఎద తలుపు తెరుచుకుందమ్మా

నీదే ఆలోచన ఎటు వైపు చూపు వెళుతున్నా
ఓ కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఊహా వెనక మాటైన వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా

చరణం: 1
నీ రూపురేఖల బొమ్మ నా తలపులో తోచక
నా చూపు జాడలకైన ఆ ఛాయలే అందక
నీ స్నేహ గీతిక కోసం వేచింది ఎదవేదిక
నీ చూపు సోకేదాకా నిదురైన రాదే ఇక
గుండెలో గుప్పున ఎన్నెన్నో చిగురాశలే
కళ్ళల్లో కమ్మని కలలే కదిలించెనే
చిలిపి వయసు వలపు కవిత చెదిరె
కన్నెవనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఉహ వెనక మాటైనా వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా

చరణం: 2
నిన్ను చూడగానే నాలో ఏ భావం ఉప్పొంగునో
అనుకుంటే నాలోలోనే ఒక వింతగా ఉన్నదే
ఏ తీరుగా నను నీతో పరిచయము కలిగించునో
ఆ తీపి కలయిక నాలో ఏ రాగమొలికించునో
ముందుగా అందితే తియ్యని సంకేతమే
చేతికే అందదా అందని ఆకాశమే
మనసు పడిన వరము దొరికిపోదా
కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడ లేక నీ ఊహ వెనక
మాటైన వినక తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా
ఇప్పుడే ఇక్కడే వాలిపోమ్మా
ఎద తలుపు తెరుచుకుందమ్మా
నీదే ఆలోచన ఎటు వైపు చూపు వెళుతున్నా
ఓ కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఊహ వెనక మాటైన వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా...



తెలిమంచులోన పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: కె. జె. ఏసుదాసు

పల్లవి:
తెలిమంచులోన 
తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి

చరణం: 1
తొలిచూపుతోనే దోచావు మనసుని
కదలించావులే నాలోన ప్రేమనే
నిను చేరుగాలి నా చెంత చేరగా
నా మది ఊయలై ఊగేను హాయిగా
విధినైన గెలిచే ఓ వింత ధైర్యమే
నిన్ను కలిశాక కలిగే నాలోన చిత్రమే
రాచెలి నిచ్చెలి జాబిలీ

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి

చరణం: 2
చెక్కిల్లపైనే తొలి సంతకానికై మది ఆరాటమే రేపింది మోహమే
చిరునవ్వులోనే దాగుంది అందమే
ఎదలోగిళ్ళలో వేసింది బాణమే
నువ్వు అన్నదే నా లోకమన్నది
నీ కోసమే ఈ ప్రాణమున్నది
అందనే అందని అందమా

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి 

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
తెలిమంచులోన చెలి అదర సవ్వడి




ముద్దుగుమ్మా పైడిబొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: హేరిస్ రాఘవేంద్ర

పల్లవి:
ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా
ముద్దుగుమ్మ పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమ
చెప్పకుండా పోతావేమ్మా చక్కనైనా మీనమ్మా
మనకు మనకు గొడవేంటమ్మా మర్చిపోవే చిట్టమ్మా
మెహమాటమో కోపమో నేనేలకనుగొందునో
మెహమాటమో కోపమో నేనేలకనుగొందునో

ముద్దుగుమ్మా పైడిబొమ్మ అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమ

చరణం: 1
నిన్ను చూసి నవ్వానా లేదులే చెలీ
కన్నుగీటి పిలిచానా కాదులే మరీ
మూతి ముడుచుకెళ్తుంటే ముగ్ధసుందరీ
ముద్దు ముద్దుగా ఉందే సొగసు వైఖరీ
చెప్పాలనుకున్నదేదో చెప్పేసెయ్ సూటిగా

ఓ.కె. చేస్తావా కిస్ కోరితే
ఓ.కె.చేస్తావా కిస్ కోరితే

ముద్దుగుమ్మ పైడిబొమ్మ అదిరిందోయమ్మా
నాజూకుతనమా సమ్మవమ్మా నువ్వంటే ప్రేమా

చరణం: 2
ఒట్సు పెట్టి చెబుతున్నా నమ్మవే చెలీ
నువ్వు తప్ప ఇంకెవరూ నచ్చరే మరీ
మాట ఇచ్చి వచ్చానే ఇంటివాళ్ళకీ
నిన్ను గెలుచుకుంటేనే థిల్ మనసుకీ
అలిగి అలిగిపోవద్దే నువ్వు అట్టా సుందరి
అలిగి అలిగిపోవద్దే నువ్వు అట్టా సుందరి
జోడికట్టేసై ఎందుకల్లరీ జోడికట్టేసై ఎందుకల్లరీ

ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా
చెప్పకుండపోతావేమ్మా చక్కనైన మీనమ్మా
మనకు మనకు గొడవేంటమ్మా
మరిచిపోవే చిట్టమ్మా
మోహమాటమో కోపమో నేనేల కనుగొందునో
మోహమాటమో కోపమో నేనేలకనుగొందునో
ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా...




అనురాగం మా పేరు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
అనురాగం మా పేరు అభిమానం మా ఊరు
ఆప్యాయత గలవారు మా వియ్యంకులవారు
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
శుభమంటూ పిలిచారు ఆహ్వానం పలికారు
కమనీయం మీ తీరు మా వియ్యంకులవారు
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ...

చరణం: 1
జేబు రుమాలు పట్టుకుపోయే పందెం వేద్దాం రండి
సై అంటే మరి సై అంటాము మీరిక కాసుకోండి
ఆటపాట అన్నింటా మేం మీకేం తీసిపోము
తాడో పేడో తేలేదాక మేము ఊరుకోము
ఆటలో గెలుపు మాదండీ
మాటతో గెలుపురాదండీ
కిటుకులే మాకు తెలుసండీ
అదేదో చేసి చూపండి
ఓడితే ఏం చేస్తారండీ
ఆ మాట మేము ఎరగమండీ

అనురాగం మా పేరు...అభిమానం మా ఊరు
ఆప్యాయత గలవారు మా వియ్యంకులవారు
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ

చరణం: 2
మనసులు కలవని పెళ్ళికి అర్థం లేనేలేదు కదండీ
ఆ మనసులు కలిపిన జంటకు నేడు మనువే జరిగేనండీ..
కొంగులు రెంటిని కలిపే ముడినే బ్రహ్మముడి అంటారండీ
మరి ఆ పెళ్ళిళ్ళంటూ జరిగేది ఆ స్వర్గంలోనే కదండీ
రెండుగా వున్న ఈ జంట నేటితో ఒక్కటవునంటా
అందాల పెళ్ళి కొడుకండీ గుణములో రాముడేనండీ
బంగారు బొమ్మ ఇదిగోండి మీ వాడి జోడు తగునండీ

శుభమంటూ పిలిచారు ఆహ్వానం పలికారు
కమనీయం మీ తీరు మా వియ్యంకులవారు
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ



అడగక్కర్లేదు నా బావ ఎక్కడని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: టిప్పు, స్వర్ణలత

పల్లవి:
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని 
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని
సింపిరి, సింపిరి జుట్టుతోటి 
చిరిగిన నిక్కరు వేసుకుని
వంకర చూపులు చూసుకుంటూ 
వాగుల వెంట పోతా ఉంటాడే

వాడేనా బావంటే... వాడేనా బావంటే
వాడేనా బావంటే... వాడేనా బావంటే

చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని 
అడగక్కర్లేదు నా మరదలు ఎక్కడని
బొబర్లంక చీరకట్టి...జబ్బలదాక జాకెట్ వేసి
కొప్పునిండా మల్లెలు పెట్టి తిప్పుకుంటు తిరుగుతుంటదే

అదే నా మరదలని...అదే నా మరదలని
అదే నా మరదలని...అదే నా మరదలని

చరణం: 1
మంచినీళ్ళ నల్లకాడ బిందెనెత్తుకుంట వుంటే
తొంగి తొంగి చూస్తాడే 
మల్లెపూల తోటలోన మంచం వేసుకుని వుంటే
దొంగలాగ చేరతాడే
పొద్దుకూడ పొడవకుండా రయ్యమంటూ ఇంటికొచ్చి దుప్పటంతా లాగుతుందే 
నిద్దరంతా పాడుచేసి లేవమంటు గోలచేసి
నీళ్ళు చల్లి నవ్వుతుందే

కల్లోకొచ్చి ఏదేదేదో అడిగేస్తాడే
కన్నేకొట్టి తికమకలో ననుతోసేస్తుందే
బుజ్జిగాడిలా ఒళ్ళో వాలిపోతాడే 
ఎంత చెప్పిన వల్ల నోల్లనంటాడే
పూతరేకు తెస్తానంటూ వత్తాలేక పారిపోతాడే

వాడేనా బావంటే...వాడేనా బావంటే 
వాడేనా బావంటే...వాడేనా బావంటే

అడగక్కర్లేదు నా బావ ఎక్కడని
చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని

చరణం: 2
కొత్త కొత్త ఫ్యాషనంటూ జబ్బలు చూపే జాకెట్ వేసి
నిబ్బరంగా వుండనీయదే 
ఊసుపోదలేదు అంటు ఏడవుంటే ఆడికొచ్చి
పోదమంటూ సంపుతుంటదే
వేపచెట్టు నీడలోన అష్ట చెమ్మ ఆడుతుంటే
గుళకరాళ్ళు విసురుతాడే వెనకనుంచి దూసుకొచ్చి కళ్ళు రెండు మూసి
నన్ను ఇరికు నెట్టి నవ్వుతాడే
ఒక్కోసారి కోపంతో తెగ అరిచేస్తుందే
సుతారంగా దువ్వి దువ్వి మురిపిస్తాడే
ఎన్ని చేసినా ఎంత సతాయించినా 
అప్పుడప్పుడు దాన్ని కష్టపెటనా 
నన్ను విడిచి దూరమైతే బతకలేను బావ అంటదే... 

అదేనా మరదలటా...అదేనా మరదలటా
అదేనా మరదలటా...అదేనా మరదలటా

అడగక్కర్లేదు నా బావ ఎవ్వరని 
చెప్పక్కర్లేదు వాడి మోటు మోజులని
పొద్దున్న లేస్తే ముద్దు అంటాడే సద్దులేమో చెప్పేస్తాడు 
వద్దంటే దగ్గరకొచ్చి తుంటరివాడు చుట్టుకుంటాడే 

వాడేనా బావంటే...వాడేనా బావంటే
వాడేనా బావంటే...వాడేనా బావంటే

పిలవక్కర్లేదు నా కొంటె మరదలని
చెప్పక్కర్లేదు నా స్వీట్ సరసాన్ని
చూపులతోనే చుట్టేస్తుంది మాటలతోనే కట్టేస్తుంది
సైగలోనే ఒప్పించి చప్పున ముద్దు పెట్టుకుంటదే

అదేనా మరదలటా....అదేనా మరదలటా
అదేనా మరదలటా...అదేనా మరదలటా



ఓ ప్రియా ఓ ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: హరిహరన్, గోపిక పూర్ణిమ

పల్లవి:
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

చరణం: 1
చిరునగవుల్లో తొలకరి జల్లు కురిసే వేళలో
ప్రేమ పురాణం పల్లకి రాగం సాగే వేళలో
ఊసులుతోని ఊహల ఊయలలూపే వేళలో
చూపులతోని కమ్మని కథలు తెలిపే వేళలో
ప్రేమలో పావనితో జావళీలు పాడన
జావళీలు పాడుకోనె జాగరాలు చేయన
నీ తడిసిన పెదవిని పెడవులతో 
నే ముద్దుల ముద్రే వేయన

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

చరణం: 2
తుమ్మెద నీవై రమ్మని పిలిచే కమ్మని రేయిలో
ఝుమ్మని తేనెలు తీయని వానై కురిసే వేళలో
వన్నెల పైట వెన్నెలలోన జారే వేళలో
వెచ్చని ప్రాయం నెచ్చెలి సాయం కోరే వేళలో
నిన్ను చూసి చూడంగానే చెప్పలేని హాయిలో
గుండెచాటు కోరికలన్నీ గుప్పుమన్న వేళలో
తడబడు అడుగుల సవ్వడిలో నీ జంటై నేనుంటాలే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా


Palli Balakrishna Monday, June 12, 2017

Most Recent

Default