-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Manjula Ghattamaneni"



చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
నటీనటులు: శ్రీకాంత్, ఛార్మి, కృష్ణ ఘట్టమనేని
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: యన్. సుధాకర్
విడుదల తేది: 04.01.2013



Songs List:



అబ్బాయి ఆంధ్రా మిర్చి పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: రంజిత్, శ్రావ్య

అబ్బాయి ఆంధ్రా మిర్చి 



ఆ దేవుడు పుట్టించాడు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: తైదల బాపు
గానం: హరీష్ రాఘవేంద్ర, చిన్మయి శ్రీపాద

ఆ దేవుడు పుట్టించాడు 



గుడ్డు గుడ్డు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: యస్.పి.బాలు 

గుడ్డు గుడ్డు




మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: గురుచరణ్
గానం: కార్తీక్, అనురాధ శ్రీరామ్

మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో



అడుగడుగో సేవకుడు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: ఈశ్వర్ తేజ, విష్ణుశర్మ
గానం: మనో

అడుగడుగో సేవకుడు 

Palli Balakrishna Wednesday, March 13, 2019


చిత్రం: కావ్యాస్ డైరీ (2009)
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హేమచంద్ర
నటీనటులు: మంజుల ఘట్టమనేని, ఛార్మి, ఇంద్రజిత్ సుకుమారన్, శశాంక్
దర్శకత్వం: వి.కె. ప్రకాష్
నిర్మాత: మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్
విడుదల తేది: 05.06.2009

హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా
పాప ప్రాణ౦ ఎన్నడైనా పువ్వులాగ నవ్వదా!

వానలోన తడిచొస్తు౦టే ఊరుకోగలదా
అ౦తలోనే ఆయొచ్చి౦దో తట్టుకోగలదా
పాఠమే చెబుతు౦డగా ఆటపట్టిస్తే
మీనాన్నతో చెబుతానని వెళుతు౦ది కోపగి౦చి
మరి నాన్నఅలా తిడుతు౦డగా తను వచ్చి ఆపుతు౦ది
మమతలు మన వె౦ట తోడు౦టే...

పాలు నీళ్ళై కలిసేవారే ఆలుమగలైతే
ప౦చదారై కలిసి౦ద౦ట పాప తమలోనే
ఆమని ప్రతి మూలలో ఉ౦ది ఈ ఇ౦టా
ప్రతి రోజున ఒక పున్నమి వస్తు౦ది స౦బర౦తో
కలకాలము కల నిజములా కనిపి౦చెనమ్మక౦తో
కళకళలే కళ్ళ ము౦దు౦టే..


********   *******   *******


చిత్రం: కావ్యాస్ డైరీ
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: ప్రణవి, గీతమాధురి

ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలెన్నో
నిన్నా మొన్నా నాతో ఉన్న ఉల్లాసాలెన్నో
బలమైన జ్నాపకాలే బతుక౦త నాకు తోడై
ఉ౦డే బ౦ధాలెన్నో...

చిలిపతనంతో చెలిమి ఎదల్లొ దోచిన విరులెన్నో...
చురుకుతన౦తో చదువుల ఒల్లో గెలిచిన సిరులెన్నో
అ౦దాల అల్లర్లే ఇ౦కా గుర్తు ఉన్నవి
ఆనాటి వెన్నెలలే నన్నే పట్టి ఉన్నవి
మళ్ళీ ఆ కాలాలే రావాలి..
అంటూ నా కన్నుల్లొ కలలెన్నో ఒహొ

నవ్వులకైనా నవ్వులుతుళ్ళే నిమిషాలెన్నెన్నో..
శ్వాసలలోనా ఆశలు రేపే సమయాలి౦కెన్నో
బ౦గారు జింకల్లె చిందే ఈడులే అది
ముత్యాల మబ్బల్లె కురిసె హాయిలే ఇది
చెదరదులే ఆ స్వప్నం ఈ రోజు..
చెరగదులే ఆ సత్య౦ ఏ రోజు..ఒహొ


********   *******   *******


చిత్రం: కావ్యాస్ డైరీ
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: టిప్పు

పొ వెళిపొ అన్న పొను
నీతొ నడిచె నీడె నెను
కొపమైతె కసురుకొ నన్ను
నిన్ను మాత్రం వదలనె నెను
నువ్వు పొ వెళిపొ అన్న పొను
నీతొ నడిచె నీడె నెను

సీతలాంటి సిగ్గు పూల బంతికి కొథి చిందులెందుకె
లెగులాబి సున్నితాల చెంపకి ఆవిరంటనివ్వకె
క్షణాల మీద కస్సు మన్న అందమా
ప్రెమనెది నెరమా ఆపవ అంతులెని డ్రామ
నా గుండెలొన గుప్పుమన్న మరువమ నిప్పులాంటి పరువమా
కొప్పులొన నన్ను ముడుచుకొమ్మ

లొకమంతా వెతికినా దొరకదె నీకులాంటి అందమె
ఎందుకంతె కారణం తెలియదె నువ్వు నాకు ప్రాణం
నీ కళ్ళలొన ఉన్న మాట దాచకె ఆగిపొకు ఉరికె
పెదవి కదిపి చెప్పుకొవె ఒకె
నా లాంటి నన్ను అంత దూరం ఉంచకె వెరుగా చుడకె
పారిపొతె నస్టమంత నీకె

Palli Balakrishna Tuesday, September 26, 2017



చిత్రం: ఏమాయ చేసావే (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: నాగచైతన్య, సమంత
దర్శకత్వం: గౌతమ్ మీనన్
నిర్మాత: మంజుల ఘట్టమనేని
విడుదల తేది: 26.02.2010



Songs List:



ఆకాశం పాట సాహిత్యం

 
చిత్రం: ఏమాయ చేసావే (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: నరేష్ అయ్యర్

ఆకాశం




ఆరోమాలే పాట సాహిత్యం

 
చిత్రం: ఏమాయ చేసావే (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: అల్ఫన్స్ జోసెఫ్

ఆరోమాలే



ఈ హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: ఏమాయ చేసావే (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్ (English Rap: Blaaz)
గానం : విజయ్ ప్రకాష్ , సుజానే , బ్లేజ్

ఈ హృదయం కరిగించి వెళ్ళకే..
నా మరో హృదయం అది నిన్ను వదలదే..
ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న
ఈ గుండెకేమవ్వలా
హొ.. నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావె
పిల్లిమొగ్గలేసిందిలా
హొసన్నా.. గాలుల్లో నీ వాసన హొసన్నా.. పువ్వుల్లో నిను చూసినా
ఏ సందు మారినా ఈ తంతు మారునా
నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా
హొసన్నా.. ఊపిరినే వదిలేస్తున్నా హొసన్నా.. ఊహల్లో జీవిస్తున్నా
హొసన్నా.. ఊపిరినే వదిలేస్తున్నా…. హొసన్నా..

everybody wanna know what’ feel like, a feel like,
I really wanna be here with you…
It’s not enough to say that we are made for each other,
It’s love that is Hosanna true…
Hosanna…be there when you’re calling out my name
Hosanna…feeling like me whole life has changed
I never wanna be the same…It’s time we rearrange…
I take a step You take a step,
I’m here calling out to you…
Hello…Hello……Hello…Yo…Hosanna..

రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా
ఆ తేనే గింజ పళ్ళున్న కొమ్మల్లే పైపైన అందకుండ ఉంటావుగా
హొసన్నా.. ఆ మబ్బు వానవ్వదా హొసన్నా.. ఆ కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవా ఈ చింత తీర్చవా
ఏమంట నేను నీకు అంత కానివాడ్ని కాదుగా
హలో హలో హలో హొసన్నా
హొసన్నా.. ఆయువునే వదిలేస్తున్నా హొసన్నా.. ఆశల్లో జీవిస్తున్నా
హొసన్నా.. ఆయువునే వదిలేస్తున్నా…. హొసన్నా..
ఈ హృదయం కరిగించి వెళ్ళకే..
నా మరో హృదయం అది నిన్ను వదలదే..
ఈ హృదయం కరిగించి వెళ్ళకే..
నా మరో హృదయం అది నిన్ను వదలదే..





కుందనపు బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఏమాయ చేసావే (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: బెన్నీ దయాల్, కల్యాణి మీనన్

ఆహా.. ఆహాహా.. బొమ్మా నిను చూస్తూ నే రెప్ప వేయటం మరిచా హే..
అయినా హే ఏవో హే కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస
నీలో నాలో లోలో నులివెచ్చనైంది మొదలైందమ్మా ఓ..
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ

నీ పాదం నడిచే ఈ చోట కాలము కనువైనా ముందే అలలై పొంగిందే
హే.. నీకన్నా నాకున్నా బలమింకేంటే ఏంటే
వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే
నన్నింక నన్నింకా నువ్వే నా అణువణువు గెలిచావే
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా

హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ

చల్లనైనా మంటలో స్నానాలే చేయించావే ఆనందం అందించావే
నీ మాట తేటిలో ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావేంటే బొమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ
నినే మరువదు ఈ జన్మ నువ్వే మనసుకి వెలుగమ్మా 




మనసా మళ్ళీ మళ్ళీ చూశా పాట సాహిత్యం

 
చిత్రం: ఏమాయ చేసావే (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం : ఏ.ఆర్.రెహమాన్, చిన్మయి, దేవన్ ఏకాంబరం

ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో
ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు.. 
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
గిల్లీ గిల్లీ చూశా జరిగింది నమ్మేశా
జతగా నాతో నిన్నే చూశా నీతో నన్నే చూశా
నను నీకు వదిలేశా పై లోకంలో వాడు
ఎపుడో ముడి వేశాడు విడిపోదే... విడిపోదే...
తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా
నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం
తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా
విడదీయలేమంటా ఎవరం... ఎవరం...
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
నీ కళ్లల్లో చూశా నూరేళ్ల మన ఆశ
జతగా నాతో నిన్నే చూశా
నాతోడల్లే చూశా నీ వెంట అడుగేశా...

తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో
హాయి మల్లె తీగలతో వేచి ఉన్నా వాకిలిలు
నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ అవిగో స్వాగతం అన్నాయి...
తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా
నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం

తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా
విడదీయలేమంటా ఎవరం... ఎవరం...
మనసా మళ్ళీ మళ్ళీ చూశా నీ కళ్లల్లో చూశా నూరేళ్ల మన ఆశ
జతగా నాతో నిన్నే చూశా నాతోడల్లే చూశా
నీ వెంట అడుగేశా... 

పై లోకంలో వాడు
ఎపుడో ముడి వేశాడు విడిపోదే... విడిపోదే...
తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా
నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం
తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా
విడదీయలేమంటా ఎవరం... ఎవరం...
ప్రేమ జగం... ఓ... ఓ...
విడుచు క్షణం... ఓ... ఓ...
పెళ్లి అనుకుంటే... ఓ... ఓ...
కలియుగమే ముగిసేది... ఓ... ఓ...
మరణమ్ముతరువాత




శ్వాసే స్వరమై పాట సాహిత్యం

 
చిత్రం: ఏమాయ చేసావే (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం : కార్తిక్

శ్వాసే స్వరమై సరదాలే పంచే
సరిగమవై వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా ఓ
శ్వాసే స్వరమై సరదాలే పంచే
సరిగమవై వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా ఓ
శ్వాసే స్వరమై సరదాలే పంచే
సరిగమవై వెంటనే రా వెలుగై రా

వయసే నిన్నే వలచి వసంతమున కోకిలై
తియ్యంగ కూసీ ఈ శిశిరంలోన
మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
వెంటనే రా వెలుగై రా నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా ననుచేరి నాతో రా





వింటున్నావా పాట సాహిత్యం

 
చిత్రం: ఏమాయ చేసావే (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్ , శ్రేయగోషల్

పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు ప్రియా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలి సారి నీ మాటల్లో
పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగానే పిలుపులు నేను విన్నా
ఓ..బతికుండగానే పిలుపులు నేను విన్నా

ఏమో ఏమో ఏమవుతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైన వింటున్నావా ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా

నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా..వింటున్నావా
వింటున్నావా వింటున్నావా

ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలమ్ కన్నా ఇది వెనుకటిది
కాలంతోన పుట్టింది కాలం లా మారే
మనసే లేనిది ప్రేమ

రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా
నీ దానినై నిన్నే దారిచేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోన
ఎవరిని తలువని వేళలలోన
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా

విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలి సారి నీ మాటల్లో

పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ..బతికుండగా నీ పిలుపులు నేను విన్నా


Palli Balakrishna Sunday, August 20, 2017

Most Recent

Default