-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "A.S.Ravi Kumar Chowdary"



చిత్రం: తిరగబడర సామి (2024)
సంగీతం: జెబి (JB)
నటీనటులు: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా
దర్శకత్వం: ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌
విడుదల తేది: 02.08.2024



Songs List:



చాలా బాగుందే పాట సాహిత్యం

 
చిత్రం: తిరగబడరా సామి (2024)
సంగీతం: JB (జీవన్ బాబు )
సాహిత్యం: శ్రీమణి 
గానం: లిప్సికా చైతు సత్సంగి 

చాలా బాగుందే, చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే
చాలా బాగుందే చాలా బాగుందే
మన తనువులు రెండు
మెలికల తీగవుతుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే ఈ సంతోషం
చాలా బాగుందే

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
మార్చేసింది మన జంటే

చాలా బాగుందే, చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే
ఈ సంతోషం చాలా బాగుందే

రోజూ పొద్దున్నే నీ ముద్దుల్తో
కాఫీ ఇస్తుంటే బాగుందే
లోకం గెలిచేటి ఓ ధైర్యంలా
నువ్వే ఎదురొస్తే బాగుందే

ఎన్ని పయనాలు నీతో చేసినా
చిన్న అలుపైన దరి చేరదే
ఎన్ని బంధాలు నేను చూసినా
ఈ బంధం అనుబంధం
అదిరిందే ఆనందంలా

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
మార్చేసింది మనలోనే

నీతో ఏకాంతం చాలంటానే
లోకం ఎటుపోనీ పర్లేదే
నీతో ప్రతిరోజూ ఏ కలగన్నా
నిజమైపోతుంటే ఏం చేయనే

ఎన్ని హృదయాలు నేను పొందినా
నీ ప్రేమలకు సరిపోవులే
ఎన్ని కాలాలు నేను దాటినా
నిమిషంలా ఉంటుందే
నా సగమై నువు నా జగమవుతుంటే

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
దాచేసింది మనలోనే

చాలా బాగుందే
చాలా బాగుందే
మన ఊపిరి రెండు
ఒకటై జీవిస్తుంటే
చాలా బాగుందే
చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే
ఈ సంతోషం చాలా బాగుందే

Palli Balakrishna Monday, October 9, 2023


చిత్రం: ఆటాడిస్తా (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సూరజ్ జగన్
నటీనటులు: నితిన్ , కాజల్ అగర్వాల్, జయసుధ , నాగబాబు, శివప్రసాద్
దర్శకత్వం: ఎ. యస్. రవికుమార్ చౌదరి
నిర్మాతలు: సి.కళ్యాణ్, యస్. విజయానంద్
బ్యానర్:
విడుదల తేది: 20.03.2008

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

పంచె లోన పవరే అది ఉన్నవాడనే స్టైలే
పంచి ఇచ్చెమనసే కలిగున్నవాడినే స్టైలే
ప్రోబ్లేమ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ
డేంజర్ తో స్టెప్స్ వేస్తూ
స్టైలిష్ గా స్మైలే ఇస్తే స్టైల్ స్టైల్...
ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

బ్రాస్లెట్ కాదు రిస్ట్ వాచ్ కాదు
హెల్ప్ చేసే హ్యాండే సూపరు
వాలు కళ్ళు కాదు చేపకళ్ళు కాదు
జాలి ఉన్న కళ్ళే సూపరు
ట్రెండులెన్నో మారుతున్నా
ఫ్యాషనంటే పడి చస్తున్నా
ట్రెడిషనేది మారని వాడిదే   స్టైల్.. స్టైల్..
పాలరాయి ప్యాలస్ ఉన్నా
స్విమ్మింగ్ ఫూల్ లో పన్నీరు ఉన్నా
ముగ్గు వేసే కల్చరుంటే స్టైల్.. స్టైల్..

ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

షర్ట్ కి షర్ట్ కి మధ్య గాప్ లుంటే ఓకే
హార్ట్ కి హార్ట్ కి మధ్య గాప్ నో
హ్యాండ్ ను హ్యాండు ను తాకే టచ్చింగ్ ఉంటే ఓకే
లిప్ కి లిప్ టచ్చింగ్  నో నో
3 స్టార్ లో లంచ్ చేసుకో
5 స్టార్ లో డిన్నర్ చేసుకో
ముద్దపప్పులో ఆవకాయే స్టైల్.. స్టైల్..
పబ్బులోన మగ్గే వేసుకో
క్లూబ్లో న బెగ్గే తీసుకో
కోనసీమ కొబ్బరి వాటర్ స్టైల్.. స్టైల్..

ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

Palli Balakrishna Wednesday, February 21, 2018



చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , తనుశ్రీదత్తా, సదా
మాటలు ( డైలాగ్స్ ): మధురూరి రాజా
కథ, స్క్రీన్ ప్లే, ఆంజనేయ పుస్పానంద్
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాతలు: అంబిక కృష్ణ , అంబిక రామాంజనేయులు
సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్
ఎడిటర్: గౌతంరాజు
బ్యానర్: అంబికా ప్రొడక్షన్స్
విడుదల తేది: 29.04.2006



Songs List:



జనం కోసం పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాషా శ్రీ 
గానం: శంకర్ మహదేవన్ 

జనం కోసం 



అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే
వడదెబ్బ కొట్టిందే మోనాలిసా నీ కోక జారినాకా
గొడవెట్టి చంపిందే నాలో నిషా నీ చేయి తాకినాకా
ఊ కొట్టే ఉద్యోగం నీదేగా
జో కొట్టే చొరవుంది నీకేగా

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే

చరణం: 1
నీ ఒంటి వంపుల్లో ఏమిటుందో
నాకంటి చూపులతొ కొలిచా ఓ..
నీ కొంటి ఊహల్లో చేరుకుంటూ
పడకింటి తలుపుల్ని తెరిచా ఓ..
బాగున్నదే మరి మన్మధ మాసం వడ్డించుకో వడిగా
గుచ్చేయదా తమ అల్లరి మీసం నా బుగ్గపై అలా ఇలా..

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే

చరణం: 2
కొంగేమొ కంగారుపడుతోంది
ఎన్నాళ్ళు దాచేది విరహం ఓ..
ఓయబ్బో నా గుండె లాగుతోంది
నీ పొంగాలు బంగారు పరువం ఓ..
నాయుడు బావో నా ఉబలాటం తగ్గించవా త్వరగా
మరదలు పిల్లా నా సహకారం అందించుతా పరా పరా..

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే
వడదెబ్బ కొట్టిందే మోనాలిసా నీ కోక జారినాకా హ హ హ
గొడవెట్టి చంపిందే నాలో నిషా నీ చేయి తాకినాకా
ఊ కొట్టే ఉద్యోగం నీదేగా
జో కొట్టే చొరవుంది నీకేగా

అబ్బబ్బా పెదవి పూజకు హ హ హా..
అమ్మమ్మా మధన జపమే మొదలాయే




ఆ ఏడుకొండలు పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: టిప్పు. లెనిన చౌదరి 

ఆ ఏడుకొండలు




జుజుబి లల్లో పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కె.కె, మహలక్ష్మి అయ్యర్ 

జుజుబి లల్లో



సిరిమల్లి పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాయి హర్ష 
గానం: మల్లికార్జున్, శ్రివర్ధిని  

సిరిమల్లి 




బొప్పాయ్ బొప్పాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కార్తీక్, సుజాత 

బొప్పాయ్ బొప్పాయ్

Palli Balakrishna Wednesday, January 24, 2018


చిత్రం: సౌఖ్యం (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్
నటీనటులు: గోపిచంద్, రెజీనా కసండ్ర,
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
విడుదల తేది: 24.12.2015

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా
నాకేం తోచదే
నీ ప్రేమలో గడపని ఎ పూటైనా
ఏ చోట నేనున్నా నీతోనే కలిసున్నా
నీ ధ్యాస నన్ను వీడదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

మీదటిగా ఏనాడో నిన్నెలా కలిశానో
మరిచి పోలేనే ఏనాడైనా
అక్కడే ఆ చోట ఆగి నిను చూస్తున్నా
నన్ను వీడి లోకం పరుగులైన
నువ్విలాగే నాకు దొరికేస్తావంటూ
ప్రేమగా తోడుగా నేను అనుకోలేదే
మల్లెల జల్లులా నువ్వే వస్తే
మనసు తేరుకోలేదే
తీపి దాహమేదో ఇంకా తీరదే

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

మనసే పేపర్ పై రంగుల క్రియవై
ప్రేమనే చిత్రం గీశావే
పగటికి చీకటకి గీతలే చేరిపావే
కలలకే ప్రాణం పోశావే
నువ్వు తోడులేనిదే ఏక్షణమైనా
నన్ను చేరగా దరి రానే రాదే
నా దారి ప్రతి పేజ్ పైన పేరే నీదే
కాలమంతా నాకు చెలియా నీ కథే

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

Palli Balakrishna Wednesday, December 27, 2017


చిత్రం: పిల్లా నువ్వులేని జీవితం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనుదీప్ , రాహుల్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రెజీనా కసండ్ర
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాతలు: బన్నీ వాస్ , హర్షిత్
విడుదల తేది: 14.11.2014

అరె నిన్ను చూడగానే నా మనసులోనే
ఎదో ఎదో అయ్యిందే
ఓ పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే
అరె నిన్ను చూడగానే నా మనసులోన
ఎదో ఎదో అయ్యిందే

ఓ మట్టిరోడ్డు లాంటి లైఫ్ లోకి
తారురోడ్డు లాగ వచ్చినావే
నువ్ రాకపోతే బ్రతుకుమొత్తం తారుమారయ్యేదే
సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైటూ తీరాన్ని చెేరుకోదే
నీ ప్రేమ అందకుంటే నా జిందగీ ఇట్టాగే నవ్వుకోదే
పిల్లా నా చేతులెత్తి ఏనాడు
పిల్లా ఏ దేవుడ్ని మోక్కలేదే
పిల్లా అయినా ఆ దేవుడు నిన్ను పంపితే
కాళ్ళు పట్టుకున్నా తప్పులేదే

అరె నిన్ను చూడగానే నా మనసులోన
ఎదో ఎదో అయ్యిందే
పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే
అరె నిన్ను చూడగానే నా మనసులోన
ఎదో ఎదో అయ్యిందే

ఓ వైట్ పేపరంటి మనసులోన కలర్ పెన్సిలెట్టి గీసినావే
నీ గురుతులన్నీ రబ్బరెట్టి చెరిపినా చెరిగేనా
ఎక్కిళ్ళు వస్తుంటే ఇన్నాళ్లుగ ఏమేమో అనుకున్నా
అదంత నీ తలపె అనిపుడే చిత్రంగ తెలుసుకున్నా
పిల్లా నీ రాకతోటి ఒక్కసారి
పిల్లా హార్ట్ డోరు ఓపెనయ్యే
పిల్లా ఇలా వేలు పట్టి చూపిస్తూ
నా ప్రేమ నిను చేరుకుందే

అరె నిన్ను చూడగానే నా మనసులోన
ఎదో ఎదో అయ్యిందే
పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే
అరె నిన్ను చూడగానే నా మనసులోనా
ఎదో ఎదో అయ్యిందే

Palli Balakrishna Thursday, October 12, 2017

చిత్రం: ఎం పిల్లో ఎం పిల్లడో (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాష శ్రీ
గానం: రంజిత్
నటీనటులు: తనీష్ , ప్రణీత
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాత: పోకూరి బాబూరావు
విడుదల తేది: 16.07.2010

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

ఎడబాటు గాయమే దాచీ .. నీ నవ్వులలో
సెలవంటు ఆశగా చూస్తే .. నా కన్నులలో

నా మనసు నిలవదూ .. పోవే నన్ను చూడకూ
నా ముందు కదులుతూ .. ప్రేమా నన్ను చంపకూ
ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

కన్నీటీ వానల్లో .. పన్నీటి స్నానాలే
గోరింటా పూతల్లో .. మా ప్రేమే వాడేలే
నా రాణి పాదంలో పారాణి పూస్తున్నా
ఈ పూల హారాలే గుండెల్ని కోస్తున్నా

ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

మా లోనీ ఓ ప్రేమా .. మా మాటే వింటావా
పంతాలా పందిట్లో .. ప్రేమల్లే పూస్తావా
కాలాన్నే ఆపేసీ మౌనన్ని తుంచాలే
కాదంటే మా నుండీ నీ వైనా పోవాలే


ఓ తీపి గురుతులా .. నువ్వే మాకు మిగలకూ
నీ పెద్దమనసుతో .. కలిపెయ్ జన్మజన్మకూ


తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం


ఎడబాటు గాయమే దాచీ .. నీ నవ్వులలో
సెలవంటు ఆశగా చూస్తే .. నా కన్నులలో

నా మనసు నిలవదూ .. పోవే నన్ను చూడకూ
నా ముందు కదులుతూ .. ప్రేమా నన్ను చంపకూ
ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

Palli Balakrishna Wednesday, September 27, 2017



చిత్రం: యజ్ఞం (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: గోపిచంద్ , సమీరా బెనర్జీ
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాత: పోకూరి బాబూరావు
విడుదల తేది: 02.07.2004



Songs List:



చమక్ చమక్ మని పాట సాహిత్యం

 
చిత్రం: యజ్ఞం (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: సందీప్, మల్లికార్జున్ 

చమక్ చమక్ మని 




ఏం చేశావో నా మనసు పాట సాహిత్యం

 
చిత్రం: యజ్ఞం (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి.బి. చరణ్, శ్రేయా ఘోషల్ 

ఏంచేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది
ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది

నిను చేరి జతగా ఆడాన సరదాల కెలికి
ఇక చూడు రోజు అయిపోదా సరసాల హాయ్

నీ ఆలనలో నీ లాలనలో
ఇక నాకన్నా మహారాణి వేరే ఉందా

ఏంచేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది
ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది

పాపాయల్లే నా ముందు కుదురుగా కూర్చుంటే
పుత్తడి బొమ్మగా నిన్ను దిద్ది దిష్టే తీయ్యనా
పిల్లాడల్లే అల్లరిగా పరుగులు తీస్తుంటే
కళ్ళను మూసి నలుగద్ది లాలా పోయన

నునడిచి అలసి పోతుంటే నా చేతులే నిను మూసెను
ను కథలు చెప్పమని అంటే మన కదనే వినిపిస్తాను

ఏ చింత లేదంట నీ చెంత నుంటే
ఏ భాగ్యం కావలి నాకింత కంటే
ఈ దొరసాని నా అలివేణి
ఇక లోకంలో ఏదైనా పోతే పోనీ

ఏంచేసావో నా ప్రాణం 
ఏదేమైనా జీవితమే 

స్వాతి చినుకుల ముత్యలే దోసిలిలో నింపి
మురిపెం తీరా నీపైన ముద్దుగా చల్లన
చిరు మేగంలో ఏడేడు రంగులనే తెచ్చి
మరు నిమిషంలో నీచెయ్యి గాజులే చెయ్యన

కను రెప్పలాగా నీవుంటే కనుపాపై నిద్దరోతాను
మునిమాపు వేళా చలి వేస్తే నిన్ను అల్లుకు పోతానేను

అమావాస్యలే లేవంట నీవెదుట ఉంటే
అమ్మల్లే తినిపిస్త అలిగి నావంటే
ఓ స్నేహితుడా నా సహచరుడ
ఇక నూరేళ్లు నువ్వే నా తోడు నీడ

ఏంచేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది
ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది

నిను చేరి జతగా ఆడాన సరదాల కెలి
ఇక చూడు రోజు అయిపోదా సరసాల హోలీ
నీ అలనాలో నీ లాలనలో
ఇక నాకన్నా మహారాణి వేరే ఉందా




చిన్ననాటి చెలికాడే పాట సాహిత్యం

 
చిత్రం: యజ్ఞం (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, శ్రేయా ఘోషల్

చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే 
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి 
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి 

సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి
దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని
చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి
చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని
చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి
సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి
మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా
రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకెనే 

తరలి రావా ఆ తారలూ రేయి నడిజాములో
వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని
మురిసిపోవా రాదారులు వాయువేగాలతో
వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని
మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా
మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా
కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా
ఝుమ్మ్నే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ 





హాయిగా అమ్మ ఒళ్ళో పాట సాహిత్యం

 
చిత్రం: యజ్ఞం (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: గోపికా పూర్ణిమ , శ్రీవర్ధిని

హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా
తియ్యగా కొమ్మ ఒళ్ళో పున్నాగ పువ్వల్లె నవ్వమ్మా

హరివిల్లుగ నవ్వుతు ఉంటే ఎండల్లో వెన్నెల కాయదా
చిరు జల్లుగ నవ్వుతు ఉంటే కొండైనా వాగల్లె పొంగదా
నునుమెత్తగ నవ్వుతు ఉంటే ముల్లైన పువ్వల్లె తాకదా
తొలిపొద్దుగ నవ్వుతు ఉంటే రాయైనా రత్నంగా మారదా

అగ్గిలా మండిపడే నీ పంతమంతా
తగ్గితే చాలుకదా నీ జంట ఉంటా
అడుగే వేయనుగా నువ్వాగమంటే
అల్లరే ఆపు నువ్వే చెలరేగుతుంటే
బుద్ధిగా ఉంటాను అంటే నువ్వు నా బంగారు కొండ
ముద్దుగా నా మాట వింటే నువ్వు నా ముత్యాల దండ
రాముణ్ణై మంచి బాలుణ్ణై నే ఉంటా చక్కా
ఎవ్వరూ నిన్ను యముడే అనుకోరే ఇంక

హద్దులే ఎరగనిది ఈనాటి స్నేహం
వద్దకే చేరదుగా ఏ చిన్న దూరం
ఎప్పుడూ వాడనిది ఈ పూల గంధం
జన్మలో వీడనిది ఈ రాగబంధం
గూటిలో గువ్వలు సాక్షి గుడిలో దివ్వెలు సాక్షి
చెప్పుకున్న ఊసులే సాక్షి చేసుకున్న బాసలే సాక్షి
దైవమా కాపు కాయుమా ఈ పసి జంటకి
కాలమా నువు రాకుమా ఈ పొదరింటికి




తొంగి తొంగి పాట సాహిత్యం

 
చిత్రం: యజ్ఞం (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: హరిహరన్ స్వర్ణలత 

తొంగి తొంగి సూడమాకు సందమామ

Palli Balakrishna Saturday, September 16, 2017

Most Recent

Default