-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Raj Tarun"



చిత్రం: పాంచ్ మినార్ (2025)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్
దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, ఎం.ఎస్.ఎం రెడ్డి
విడుదల తేది: 21.09.2025



Songs List:

Palli Balakrishna Saturday, May 2, 2026



చిత్రం: చిరంజీవ (2025)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు
దర్శకత్వం: అభినయ కృష్ణ
నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్
విడుదల తేది: 07.09.2025

Palli Balakrishna



చిత్రం: భ‌లే ఉన్నాడే (2024)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, అభిరామి	
దర్శకత్వం: శివ సాయివర్ధన్
నిర్మాత: ఎన్.వి. కిరణ్ కుమార్
విడుదల తేది: 13.09.2024



Songs List:

Palli Balakrishna



చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్ 
దర్శకత్వం: విజయ్ బిన్నీ 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి 
విడుదల తేది: 14.01.2024



Songs List:



ఎత్తుకెళ్ళి పోతావా పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రామ్ మిరియాల 

ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉన్నవాళ్ళ పిల్లనంటవా గుమ్మా

రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా

బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బైటకడుగు పెట్టనంటవ భామా

రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా

(ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా
ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా)

బెల్లం సెరుకు సూపుల దాన
అల్లం మిరప మాటలదాన
బొండుమల్లి నడుము దాన
బండెడు సోకుల ఓ నెరజాన

నువ్వట్ట పోతుంటే ఓ ఓ ఓ
నిన్నిట్ట సూత్తుంటే ఓఓ ఓ ఓ

ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె

నారెట్టి సుట్టేసి మోపల్లె కట్టేసి
నా నెత్తి మీదెట్టి గోదారి గట్టెంట
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె

కడవల్లో నింపేసి కావిల్లో పెట్టేసి
ఇడిసి పెట్టకుండ నిన్నింక కడదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే

నువ్వు నడిచెళ్ళితే నీ కాలి అంచు తాకి
మట్టి బెడ్డలన్ని మువ్వలయ్యాయే
నువ్వు నవ్వుతుంటే ఆ నవ్వు తీపి సోకి
చెట్టు కొమ్మలన్నీ తేనే పట్టులయ్యాయే

ఎంత ఎంత, ఎంత ముద్దుగున్నావంటే
ఒక్క ఒక్క మాటలోన చెప్పాలంటే
చందమామకే పిల్లలు పుడితే
హే, చందమామకే పిల్లలు పుడితే
నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే
(మరి అట్టా ఉంటె ఏం చేస్తాం)

ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె

నా గుండెకోటలో రాణివి నువ్వంట
నా రెండు కాళ్ల పల్లకిలోనా
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె

మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి
పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే



నా సామిరంగా పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ 

మా జోలికొస్తే మాకడ్డువస్తే
మామూలుగా ఉండదు
నా సామిరంగా, (నా సామిరంగా)
ఈ గీత తొక్కితే, మా సేత సిక్కితే
మామూలుగా ఉండదు
నా సామిరంగా, (నా సామిరంగా)

ఒక్కడు అంటే ఊరందరు
మా ఊరంటే ఒక్కొక్కడు
ఒక్కరు అంటే… ఊరందరు
మా ఊరంటే… ఒక్కొక్కడు

మాతోటి, మాతోటి
మాతోటి పేచీ పడితే

సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా

సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా

ఈ గాలిలో పౌరుషముంది
ఈ మట్టిలో పంథం ఉంది
ఈ నీటిలో ప్రేమా ఉంది

ఈ నీటిని తాగి, మట్టిని తాకి
గాలిని పీల్చి, ఎదిగిన ఈ దేహంలో

శ్వాస ఉన్నంత వరకు
విశ్వాసం ఉంటాది
ప్రాణమున్నంత వరకు
అభిమానం ఉంటాది

మాతోటి, మాతోటి
మాతోటి పేచీ పడితే

సామిరంగా… నా సామిరంగా
అరె సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా

సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా



దేవుడే తన చేతితో పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: యం.యం.కీరవాణి  
గానం: శాండిల్య పీసపాటి 

దేవుడే తన చేతితో
రాసిన ఒక కావ్యం
అంజిది, కిష్టయ్యది
విడదియ్యని ఒక బంధం

చిరునవ్వులు పూసే స్నేహం
చిరుగాలికి ఈల నా పాఠం
కడతేరని ఆనందంలో
కడదాకా సాగే పయనం

దేవుడే తన చేతితో
రాసిన ఒక కావ్యం
ఏరా, ఒరే అనేటి ప్రాణమిత్రులు
పరాచకాలతోటి ఆటపాటలు

అన్నయ్య ఉంటే చాలుగా
ప్రాణాలు పంచే తీరుగా
కలిసింది పాలు తేనెలా
కలిపింది కాలం ప్రేమ పొంగేలా

దేవుడే తన చేతితో
రాసిన కమ్మని ఒక కావ్యం
అంజిది, కిష్టయ్యది
విడదియ్యని ఒక అనుబంధం




దుమ్ము దుకాణం పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: సాహితి చాగంటి, కరిముల్ల, సాయి చరణ్, లోకేష్, అరుణ్ కౌండిన్య, హైమత్ 

ఆ కుర్చీలోన అమ్మాయి
ఈ కుర్చీలోన అబ్బాయి
ఆ కుర్చీలోన అమ్మాయి
ఈ కుర్చీలోన అబ్బాయి

వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా
ముందుకు వచ్చిన వాళ్ళు
బంధుమిత్రులు అన్నదమ్ములు
పిల్లాపాపలు కుర్రమూకలు పెద్దొళ్ళు చిన్నోళ్ళు
ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసిన సందడి పేరే

దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం

ఈలలు వేస్తారు
కొందరు గోలలు చేస్తారు
కేకలు పెడతారు
కొందరు అరుపులు అరిచేరు
ఈ అరుపులకన్నా కేకలకన్నా
అల్లరికన్నా గడబిడకన్నా

అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే
ప్రేమ తబలా ఢోలకులే
అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే
ప్రేమ తబలా ఢోలకు మోతలే

దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం

పనిస గరిగమగమపమగరిగమప
నిరినిస నిదమగరి గనిసమమగరి
మమగరి మమగరినిస
మమప నిసగమపనిస

చెట్టూ ఊగింది, ఆటకు చేనూ ఊగింది
పిట్టా ఊగింది, కోడిపెట్టా ఊగింది
ఆ చెట్టూ పిట్టా ఇల్లు గడప
తలుపు కిటికీ అన్నీ ఊగి…..

పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు
జిల్లాలో పాతికూల్ల పైదాక
పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు
జిల్లాలో పాతికూల్ల పైదాక

పాకింది చూడు, పాకింది చూడు
పాకింది చూడు

దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం



ఇంకా ఇంకా పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: యం.యం.కీరవాణి 
గానం: సత్యయమిని, మమన్ కుమార్ 

ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే

తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే

నిన్ను చూసి… నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే… ఏమని?

గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ

గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ

ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే

తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే

నిన్ను చూసి… నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే… ఏమని?

గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ

గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ



సీసా మూత ఇప్పు పాట సాహిత్యం

 
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రేవంత్, మల్లికార్జున్, సచిన్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండిన్య 

పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే
ప్రేమ బండి చలో అంటే
రైస్ మిల్లు నెల జీతం
రై రైమని పెరిగిందంటే

ఫెవరేట్ హీరో బొమ్మ
హౌస్ ఫుల్లు పడిందంటే
ఇండియా కప్పు కొట్టుకొస్తే
ఇల్లాలే రాజీకొస్తే
పక్కింటోడికి లాసొస్తే
హ హ ఆడ్ని ఓదార్చే ఛాన్సే వస్తే

ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు

బోరు కొడితే బీరు కొట్టు
బాధ పడితే బ్రాందీ కొట్టు
ఇసుకు పుడితే ఇస్కీ కొట్టు
మూడంతా పాడైపోతే
పై మూడు కలిపి కొట్టు

కట్టుకుందాన్తో కల్లే కొట్టు
అన్నదమ్ముల్తో జిన్నే కొట్టు
సోదర సోదర అన్నోల్తో
సోడా కలిపి కొట్టు
రా రా పోరా అన్నోల్తో
రా గానే కొట్టు
మనకన్నా పెద్దోల్లొస్తే
మస్కా కొట్టు… సాటుగ మందే కొట్టు

మొదటి పెగ్గు ఎయ్యగానే
మత్తు కమ్ముకొస్తాది
రెండో పెగ్గు పడగానే ఒళ్ళు తేలిపోతాది
మూడు నాలుగైదు పెగ్గులు
గొంతులోకి దిగగానే…
నా సామిరంగ…
సిత్రాలే సిత్రాలు
నా సామిరంగ…

పెరటిలోని పిల్లి కూన బౌ బౌ అంటాది
నూతిలోని సేపపిల్ల సుట్ట కాల్చుతాది
సేతిలోని ఇసనకర్ర
సికెను ముక్కై పోతాది

మూలకున్న ఇసుర్రాయి
ఎండి కంచమే అది
తొంబై రూపాయల నోటు
జేబులోంచి జారుతాది
తొడుక్కున్న గల్ల లుంగీ
సొక్కా అయిపోతది

ఆ ముంగటేడు పోయిన
మా ముసలి తాత ఎదరకొచ్చి
ఏరా అబ్బీ..! తినలేదా, ఏమి తాగట్లేదా
బక్క సిక్కి పోయావు..! ఏందిరా ఇదీ?
అని పలకరిస్తాడు,
ప్రేమగ హెచ్చరిస్తాడు…

ఈ మందుని కనిపెట్టినోడు యాడున్నాడో
అరెరెరె మందుని కనిపెట్టినోడు యాడున్నాడో
ఆడి కంటికి ముక్కుకి సెవులకి
కాళ్ళకి మూతికి సేతులకి
దండాలెట్టి, అరెరెరె దండాలెట్టి

ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు

ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు


Palli Balakrishna Tuesday, February 13, 2024



చిత్రం: తిరగబడర సామి (2024)
సంగీతం: జెబి (JB)
నటీనటులు: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా
దర్శకత్వం: ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌
విడుదల తేది: 02.08.2024



Songs List:



చాలా బాగుందే పాట సాహిత్యం

 
చిత్రం: తిరగబడరా సామి (2024)
సంగీతం: JB (జీవన్ బాబు )
సాహిత్యం: శ్రీమణి 
గానం: లిప్సికా చైతు సత్సంగి 

చాలా బాగుందే, చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే
చాలా బాగుందే చాలా బాగుందే
మన తనువులు రెండు
మెలికల తీగవుతుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే ఈ సంతోషం
చాలా బాగుందే

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
మార్చేసింది మన జంటే

చాలా బాగుందే, చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే
ఈ సంతోషం చాలా బాగుందే

రోజూ పొద్దున్నే నీ ముద్దుల్తో
కాఫీ ఇస్తుంటే బాగుందే
లోకం గెలిచేటి ఓ ధైర్యంలా
నువ్వే ఎదురొస్తే బాగుందే

ఎన్ని పయనాలు నీతో చేసినా
చిన్న అలుపైన దరి చేరదే
ఎన్ని బంధాలు నేను చూసినా
ఈ బంధం అనుబంధం
అదిరిందే ఆనందంలా

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
మార్చేసింది మనలోనే

నీతో ఏకాంతం చాలంటానే
లోకం ఎటుపోనీ పర్లేదే
నీతో ప్రతిరోజూ ఏ కలగన్నా
నిజమైపోతుంటే ఏం చేయనే

ఎన్ని హృదయాలు నేను పొందినా
నీ ప్రేమలకు సరిపోవులే
ఎన్ని కాలాలు నేను దాటినా
నిమిషంలా ఉంటుందే
నా సగమై నువు నా జగమవుతుంటే

ఆకాశం ఆయువుకన్నా
చాలా ఎక్కువ మన ప్రేమే
ఆనందం చిరునామానే
దాచేసింది మనలోనే

చాలా బాగుందే
చాలా బాగుందే
మన ఊపిరి రెండు
ఒకటై జీవిస్తుంటే
చాలా బాగుందే
చాలా బాగుందే
మన పెదవులు రెండు
జతపడి దీవిస్తుంటే

నువ్వు నేనే, హే హేహే
మనమంటుంటే
ఈ సంతోషం చాలా బాగుందే

Palli Balakrishna Monday, October 9, 2023



చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
నటీనటులు: రాజ్ తరుణ్, వర్ష బోల్లమ్మ 
దర్శకత్వం: సంతూ మోహన్ వీరంకి 
నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
విడుదల తేది: 2022



Songs List:



అలా ఇలా పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: సత్య యామిని , స్వీకర ఆగస్తి 

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే
పెదవులపైనా మెరిసే ఈ నవ్వులే
ఇది వరకైతే ఎపుడు కనిపించలే
ఇన్నాళ్ళీ వెన్నెల్లన్నీ లోలోపలే

ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నే నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే

పని తెలియని పసితమట నాది
అది తెలిసిన పెద మనసట నీది
అనువుగ మరి జరగదు కద ఏది
అనుకువగల మగువకు తిరుగేదీ

నీ వలనే అవుతుందేమో నేనెపుడూ కోరే పని
నీ జతగా ఉండె గుండె అంటుందే ఇంతే చాలని
వందేళ్ళీ వర్ణాలన్నీ తోడుండనీ

ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నీ నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం

అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే




పదా పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2022)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: యాజిన్ నిజార్

పదా…
పదమంటోంది పసి ప్రాయం
సదా…
నిను చేరేటి ఆరాటం

ఆగే వీల్లేదు కదా
నా… కలా నిజాల మెలకువలోన
నిన్ను చూపే వేళ
పాడెలే పెదాలు కదలక పాటలే

నా అడుగులు ఉరుకులు
పరుగులు తీస్తుంటే
మైమరపులు మెరుపులు
ఎ హే హేహే హే

ఆ వలపులు తలపులు
తపనలు పెంచేస్తుంటే ఆశలే

పదా…
పదమంటోంది పసి ప్రాయం
సదా…
నిను చేరేటి ఆరాటం

బయటికి రాకున్నా
నీవేనా లోలోన
ఎదురుగ నువ్వున్న
జారేనా ఓ మాటైనా

అనుమానం లేదింకా
అనుకోని ఏదో వైఖరి
మార్చిందే ఈరోజే కధలన్నీ
సందేహం బంధించి పెంచిందే
లోలో అలజడి
వివరించే దారేదో మరీ

ఏమిటో క్షణాలు కదలక
ఆగిపోయే ఆరాదీస్తే
ఊపిరే తపించి అడిగెను నీ జతే

ఈ పలుకులు పదములు
మెలికలు వేస్తుంటే
ముందెనకలు మునకలు
ఈ చొరవలు చనువులు
కబురులు ఊపేస్తుంటే ఊగెలే



తప్పా..? పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: రఘురాం 
గానం: బెన్నీ దయాల్ 

మా ఇంటి గేటు పక్కన
ఎవడో స్పోర్ట్స్ కారు పార్కు చేస్తే
ఫోజులిచ్చి సెల్ఫీ కోసం దానికానుకుంటే
ఇంతలోనే డ్రైవరొచ్చి గేరు వేసి తొక్కితే
నా తప్పా..?

అమాయకంగా రెండు పెగ్గులేసి
సొంత స్ట్రీటు బైటే
చిన్ననాటి దోస్తు తోటి బైక్ రైడుకెల్తే
పట్టపగటి పూట డ్రంకన్ డ్రైవ్ పెట్టి
దొరికిపోతే తప్పా..?

వెకేషనే వచ్చేసినా
లొకేషనే చేంజ్ అవ్వని
పోసిషనే శపించనే
అయ్యయ్యో ఏమిటీ జిందగీ
డెస్టినీ తప్పా..?

జాలీగా బ్యాచ్ తోటి మేడ మీద
పార్టీ ప్లాన్ చేస్తే టెన్ టు ఫైవ్
డీజే పెట్టి మస్తు మస్తు స్వింగులోన ఉంటే
వేళకాని వేళలోన వర్షమొచ్చి వెక్కిరిస్తే
తప్పా..?

ఆన్లైన్ లో ఆఫర్ ఏదో చూసి
నేను టెంప్ట్ అయిపోయి
బెస్ట్ ప్రైస్ తోటి కొత్త స్మార్టు ఫోన్ కొంటే
జస్ట్ ఎ వీక్ గ్యాప్ లోనే
నెక్స్ట్ మోడల్ వస్తే నాది తప్పా..?

పిల్ల నాకు నచ్చి లవ్వు చెప్పబోతే
బెస్ట్ ఫ్రెండే వచ్చి
వాడి గర్ల్ ఫ్రెండంటే తప్పా, తప్పా..??

సెల్ ఫోన్ నుంచు పేటిఎం చేస్తూ
బిల్లు కట్టే లోపు స్విఛాప్ ఐపోతే
తప్పా, నా తప్పా..?

రెంటు కట్టలేక పెంట్ హౌస్ వదిలి
టెంటు వేసుకుంటే నా తప్పా..?
జంట అంటూ లేక మెంటలెక్కి పోయి
కంటనీరు వస్తే నా తప్పా..?

ప్రమోషనే కొట్టేసిన
ఎమోషనే చేంజ్ అవ్వని
కండిషనే వచ్చేసెనే
అయ్యయ్యో ఏమిటీ జిందగీ
ట్రాజెడీ తప్పా..?

జూమ్ కాల్ లోనా ఫేసు కాస్త చూపి
నచ్చినట్టే నాకు కింద నిక్కరేస్తే
నా తప్పా, తప్పా..?
రివ్యూలన్నీ చూసి సినిమాకి వెళ్తే
రేటింగ్ ఉన్నా గాని రొట్టలాగ ఉంటే
తప్పా, నా తప్పా..?

ఛాన్స్ వస్తే తప్పా
డాన్స్ వస్తే తప్పా
ఫాన్స్ ఉంటే తప్పా, నా తప్పా
బ్యాండ్ ఉంటె తప్పా
బ్రాండ్ ఉంటే తప్పా
డిమాండ్ ఉంటే తప్పా, నా తప్పా





షాలో కలల వ్యాలీలో పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: శ్రీమణి 
గానం: షాన్

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే నీతో
జంటవ్వాలని ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే
నీతో జంటవ్వాలని
ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా, షాలో

మౌనం పలికిందా తానె మాటలే మలిచి
ప్రాణం నిండా సంగీతం కురిసేలా
తీరం వచ్చిందా తానే వద్దకే నడిచి
నీతో అడుగేస్తే హాయిగా ఇలా

నిదురెరుగని మదిలోన
గతిచెదిరిన గమనములోన
శృతికుదిరిన సమయాన
నీతో సాగే సావాసానా

షాలో కలల వ్యాలీలో నడిచే మనసురో
ఫ్లోలో ఫాంటసీల మారెరో
హైలో హార్టు బీటే రిథమేదో పెంచెరో
లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చెరో

మారుతున్న ఒంటరి నేనే
నీతో జంటవ్వాలని
ఒక లవ్లీ డేట్ లా సాగిపోనా
ఈ క్షణం నీతో ఆకాశాలే తాకుతూ
ఒక ఫ్లైయింగ్ ఫ్లైటులా, షాలో




ఉండి లేనట్టుండి పాట సాహిత్యం

 
చిత్రం:  Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి 
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఉండి లేనట్టుండి అందంగా
ఎదురైన బంధం నాకడ్డంగా
వెంటే వెంటే ఉండి ఏ దారి
పోయిందో అర్ధం కానట్టుందా

ఉన్నన్నాళ్ళు ఎన్నో ఆశల్ని చూపించి
సొంతం కానంటుందా
గాయాలెన్నో నిండి నీ లోకం
నీ నుండి దూరం అయినట్టుందా

సందేహంగా సాగే దారంతటా
సంతోషంగా ఉండే వీలంటూ లేదట

కలో అవునో బదులు అడుగు మనసుని
ఉందో లేదో మనసుపడిన ప్రేమ జాడనీ

పొందేనేదో పోయెనేదో తేలిందా నీకీనాడైనా
పోనీ నీలో మిగిలేదేదో తెలిసిందా కొంతైనా

ఆగేదేనా ఆలోచనా ఆపేయ్
నీ పంతంనే అంటున్నా
తీరేదేనా ఈ వేదన
దూరంగా ఉంటూ ఏ తీరం చేరినా

కలో అవునో బదులు అడుగు మనసుని
ఉందో లేదో మనసుపడిన ఆ క్షణాలనీ

Palli Balakrishna Wednesday, January 19, 2022


చిత్రం: పవర్ ప్లే (2021)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాజ్ తరుణ్, హెంల్ ప్రిన్స్, పూర్ణా, పూజా రామచంద్రన్, అజయ్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాతలు: మహిధర్, దేవేష్
విడుదల తేది: 05.03.2021


Palli Balakrishna Tuesday, March 9, 2021



చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే
దర్శకత్వం: జి. ఆర్. కృష్ణ
నిర్మాత: శిరీష్ (దిల్ రాజు సమర్పణ)
విడుదల తేది: 25.12.2019



Songs List:



You Are My Heart Beat పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: బాలాజీ
గానం: అనురాగ్ కులకర్ణి

You Are My Heart Beat



లా లా లా లా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీ మణి
గానం: సమీరా భరద్వాజ్

లా లా లా లా… నిజంలా నా కల..
లా లా లా లా… నీ వల్లే నేనిలా..

కనుపాపకిన్ని కాంతులా… చిరునవ్వుకిన్ని చిందులా..
ఒక నిన్నలోంచి నన్ను కోరి పూసే నేడిలా..

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా
ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

లా లా లా లా… నిజంలా నా కల..
లా లా లా లా… నీ వల్లే నేనిలా..

చుక్కలందుకున్న రెక్కలా… చిక్కు తెంచుకున్న లేక్కలా..
వెన్నెలడ్డుకున్న రేయిలా… ఉన్నానివాల…

ఒక్కొక్క క్షణమిలా… ఒక్కొక్క ఋతువులా.. మారుతోందిలా
నీవెంటే అడుగనీ… నీకంటే ఎవరనీ.. అడుగుతున్న మదిలా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా
ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

చెప్పలేని మాటలన్నిలా… చెప్పమంటూ గొడవే ఎలా
విప్పమంటు పెదవే ఇలా… పదాలు చాలా

నీ నీడ భుజముపై.. నా నీడ హాయిగా తల వాల్చేలా
ఇన్నాల ప్రేమలో… ఈ ప్రేమ లేదని.. తెలుసుకున్న మదిలా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా
ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా






అదే ఊరు పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: నూతన మోహన్

అదే ఊరు




చిరునవ్వే పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: బాలాజీ
గానం: ఇషాక్ వాలి

చిరునవ్వే




హోలా హోలా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీ మణి
గానం: అనురాగ్ కులకర్ణి, అదితి భావరాజు

హోలా హోలా



అనగనగా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: బాలాజీ
గానం: మోహన భోగరాజు

అనగనగా

Palli Balakrishna Tuesday, March 2, 2021


చిత్రం: సినిమా చూపిస్త మావ (2015)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, అవిక గోర్
దర్శకత్వం: నక్కిన త్రినాథ రావు
నిర్మాతలు:  బెక్కం వేణుగోపాల్, జి. సునీత, రూపేష్ డి గోలి, బోగాధి అంజి రెడ్డి
విడుదల తేది:  14.08.2015

చిత్రం: సినిమా చూపిస్త మావ (2015)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: లక్కీ రాజ్

వెల్లకే వదిలెళ్ళకే
నా ప్రాణమా నడి రేయిలో
ముంచకే నను ముంచకే
ఓ మౌనమా కన్నీటిలో

నాలో ప్రాణమే పోయేంత శూన్యమే 
మిగిలేంత దూరం అయ్యానే నీ కోసం నేనిలా
గుండె నే కోసేంత ఊపిరి తీసేంత
గాయం అయ్యిందే నా వల్లే నాకిలా

వెల్లకే, వదిలెళ్ళకే
నా ప్రాణమా నడి రేయిలో
ముంచకే నన్ను ముంచకే
ఓ మౌనమా కన్నీటిలో

ప్రేమే లేదని తిరిగి రాదనీ
న కంట జారే కన్నీరే చెబుతోంది నాకిలా
ఒంటరై పోవాలి ఓటమై మిగలాలి అంటూ
చెయ్యి జారే నీ ప్రేమే అందిలా



Palli Balakrishna Monday, March 1, 2021








చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అర్మాన్ మాలిక్, పి. మేఘన
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నయ్యర్, హెబా పటేల్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాత: కె. కె. రాధామోహన్
విడుదల తేది: 02.10.2020

ఓ ఓ.. కురిసెనా కురిసెనా కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసెనా మురిసెనా కళలకి కనులకి కలిసేనా..
నింగిలో తారలే జేబులో దూరెనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన

విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..

ఓ ఓ.. కురిసెనా కురిసెనా 
తొలకరి వలపులే మనసున
మురిసెనా మురిసెనా కళలకి కనులకి కలిసేనా

ఒక వరము అది… నన్ను నడిపింది
పసితనముకు తిరిగిక తరిమింది
పెదవడిగినది నీలో దొరికినది
ఒక్కసారి నన్ను నీలా నిలిపినది
చూస్తూ చూస్తూ నాదే లోకం
నీతో పాటే మారే మైకం
ఇద్దరి గుండెల చప్పుడులిప్పుడు అయ్యే.. ఏకం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..

కొత్త మలుపు ఇది.. నిన్ను కలిపినది
నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది
చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది
ఎక్కడున్నా పక్కనుండే తలపు ఇది
నిన్న మొన్న బానే ఉన్నా
నిద్దుర మొత్తం పాడౌతున్నా
నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్నా

కురిసెనా కురిసెనా తొలకరి వలపుల మనసున
మురిసెనా మురిసెనా కళలకి కనులకి కలిసేనా
నింగిలో తారలే జేబులో దూరెనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన

విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో
విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం



Palli Balakrishna Saturday, January 23, 2021


చిత్రం: లవర్ (2018)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాజిన్ నిజార్
నటీనటులు: రాజ్ తరుణ్, రిద్ది కుమార్
దర్శకత్వం: అనీష్ కృష్ణ
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 20.07.2018

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహలేమిటో
చూపలేని దాచలేని అల్లరిలా
తియ్యని ఈ వేదనేమిటో
మాటలే మోయలేని మౌనంలా

ఎంత ఉప్పెనో నాలోన
ఎంత చప్పుడో గుండెలోన
చెప్పమంటే ఎన్ని తిప్పలో
చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా

నీకు నాకు మధ్య దూరమైనా
లెక్క వేస్తే ఒక్క అడుగేనా
ఒక్క అడుగులో జీవితం దాగినట్టు
దాటలేకపోతున్నా

ప్రేమనే రెండక్షరాలతో
నీకు నాకు మధ్యనే వంతెనేయనా
నింగిలో ఆ లక్ష తారలే కలుపుతూ
ప్రేమలేఖ నీకు రాయనా

నిసని గరిస నిసని గరిస
నిసని గరిస నిసనిపమగమపని
నిసని గరిస నిసని గరిస
నిసని గరిస నిసనిపమగమపని

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహలేమిటో
చూపలేని దాచలేని అల్లరిలా
తియ్యని ఈ వేదనేమిటో
మాటలే మోయలేని మౌనంలా

నిసని గరిస నిసని గరిస
నిసని గరిస నిసనిపమగమపని

Palli Balakrishna Friday, February 1, 2019


చిత్రం: రాజుగాడు (2018)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, అమైరా డస్టర్
దర్శకత్వం: సంజనా రెడ్డి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 01.06.2018

రాజుగాడు మన రాజుగాడు
లవ్వులోన పడిపోతన్నాడు
రాజుగాడు మన రాజుగాడు
లవ్వులోన పడిపోతన్నాడు

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ
ఓ ఎస్ అంటే చాలంటా
నిను గుండెకు లోపల మడతెడతా..ఆఅ..
జి.ఎస్.టి కి భయపడక
నువు కోరినవన్నీ కొనిపెడతా..ఆఅ...

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ

ఫాక్స్ టైలే తొక్కానే
ది బెస్ట్ నిన్నే చేరానే
నిలువెత్తున నీలో గ్లామరు
క్యూటే సో హాటే
ఫాస్ట్ ఫార్వార్డ్ చేశానే
మన లైఫ్ సినిమా చూశానే
ఒక ఫ్రేములో నువ్వూ నేనూ
ఉంటే బొంబాటే
వెయిటింగ్ చేసీ వేలంటైన్ ఐ
నిను చేరానే
వాల్యూం పెంచీ పదిమందికిలా
లౌడ్ స్పీకర్ లా ఈ న్యూసే
హాపీ గా చెప్పాలే

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ

రేసు హార్సై దూకానే
ఆ మార్సు దాకా ఎగిరానే
ఏ నిమిషం చెప్పావో నువు
ఓకే డబుల్ ఓకే
దిల్ బ్యాటరీలే పగిలేలా
లవ్ లాటరీలా తగిలావే
శుభవార్తై చేశావే అటాకే కిర్రాకే
అపుడో ఇపుడో
ప్రేమవుతుందనుకున్నా గానీ
ఇంతటి త్వరగా
నీ కంపెనిలో లవ్ సింఫనిలో
మునకేస్తా అనుకోలే సరెకానీ

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ
ఓ ఎస్ అంటే చాలంటా
నిను గుండెకు లోపల మడతెడతా..ఆఅ..
జి.ఎస్.టి కి భయపడక
నువు కోరినవన్నీ కొనిపెడతా..ఆఅ...

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ

Palli Balakrishna Saturday, January 26, 2019


చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: యాజిన్ నజీర్, యామిని ఘంటసాల
నటీనటులు: రాజ్ తరుణ్ , చైత్ర శుక్ల
దర్శకత్వం: శ్రీ రంజిని
నిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్
విడుదల తేది: 2018

ఏమైంది బుజ్జి కన్నా ప్రేమైందా చెప్పమన్నా
నీతోటే నేను అన్నా సందేహం వద్దు చిన్నా
అయ్య బాబోయ్ ప్రీమెక్కినట్టుగ పిచ్చయి పొందెనే
మా ఇంట్లోన ఏకంగా వింతలు ఏడూ చూడగ
రా ముద్దు లియ్యవా హద్దు దాటవా
యుద్ధమే లిప్పుతో చెయ్యవా

ఏదో గిలి - మాయరోగమా మళ్ళీ
గదిలో కెళ్ళి - తంతా గిచ్చి గిల్లి
ఇది న్యాయమా చెలి - పోరా డోంట్ బి సిల్లీ
చలిగాలికె బలి కోరే కౌగిలి

రావా ముద్దు లియ్యవా హద్దు దాటవా
యుద్ధమే లిప్పుతో చెయ్యవా

అందాల ఆడపిల్ల
తాకేవో ఆడపిల్ల
చూపుల్తో గుండె గుల్ల
చేద్దాం రా లల్ల లాల

నాతో పదా - ఒల్లే కొవ్వెక్కిందా
ఫీలింగ్ లేదా నీకేదో అయ్యిందా
ఏమైనా బాగుందా - పో పోరా నా బొంద
అందలూరిస్తుంటే పిచ్చె పట్టదా

ఏమైంది బుజ్జి కన్నా ప్రేమైందా
నీతోటే నేను అన్నా సందేహం
అయ్య బాబోయ్ ప్రీమెక్కినట్టుగ పిచ్చయి పొందెనే
మా ఇంట్లోన ఏకంగా వింతలు ఏడూ చూడగా
రా ముద్దు లియ్యవా హద్దు దాటవా
యుద్ధమే లిప్పుతో చెయ్యవా


******  *******  *******


చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్సప్రాగడ
గానం: శ్రీచరణ్ పాకల

ఎన్నో ఎన్నో సందేహాలే ప్రేమా
ఉందో లేదు ఈ లోకంలో ప్రేమా
ఎన్నెనెన్నో యుద్దాలునా ప్రేమా
నీదో కాదో గెలుపే లేని ప్రేమా
నీలో ఉన్నా నీతో ఉన్నా
నీ సొంతం కాదే ప్రేమా

గుండెల్లొ దాగి నిప్పల్లె మారి
రెప్పల్నె దాటె ప్రేమా
ముంచేస్తున్న కాల్చేస్తున్నా
మౌనంగ చూస్తూనే ఉందీ ప్రేమా
నిషబ్దంలో ఓ స్వప్నంలా
నిద్దట్లో నీ వెంటె ఉందీ ప్రేమా

ఎన్నో ఎన్నో సందేహాలే ప్రేమా
ఉందో లేదు ఈ లోకంలో ప్రేమా

సమరం ప్రేమా...సమరం ప్రేమా
సరసం ప్రేమా...విరహం ప్రేమా

ఎన్నో ఎన్నో సందేహాలే ప్రేమా
ఉందో లేదు ఈ లోకంలో ప్రేమా
ఎన్నెనెన్నో యుద్దాలునా ప్రేమా
నీదో కాదో గెలుపే లేని ప్రేమా
నీలో ఉన్నా నీతో ఉన్నా
నీ సొంతం కాదే ప్రేమా

దారే కాని తీరం లేని
గోరంలా తోచె ప్రేమా
ఏ కాంతి లేని ఏకాంతం లోన
నిన్నుచి చూసే ప్రేమా
బంధాలన్నీ బందిస్తున్నా
నిందిస్తు చూస్తూనే ఉందీ ప్రేమా
గుర్తొస్తున్నా మరిపిస్తున్నా
పోనట్టు నీలోనె దాగే ప్రేమా

ఎన్నో ఎన్నో సందేహాలే ప్రేమా
ఉందో లేదు ఈ లోకంలో ప్రేమా
ఎన్నెనెన్నో యుద్దాలునా ప్రేమా
నీదో కాదో గెలుపే లేని ప్రేమా


******  *******  *******


చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కాల భైరవ

నువ్వు లేని రోజు నాకు ఎదురైతె
పట్టుకున్న వేలు నన్ను వదిలేస్తె
ఏమవాలో చెప్పలేదు ఏమమ్మ
ముందుగానె నేర్పలేదు ఏలాగమ్మా
ఏం చేయనమ్మా ఏం తోచదే
ఎటు వెల్లనమ్మా అంతా చీకటె
నమ్మేదెలాగమ్మ నువు లేవంటే
బతికేదెలాగమ్మ అది నమ్మితే
ఒడిని వీడి అడుగైన నడవలేదెటూ

సుడిని పడిన పడవైనాను చూడిటూ
అమ్మ ఉందిగా మరింక నాకేం లోటు
అనుకోవడమేనేమొ నా పొరపాటు

పాతికేల్ల నుంచి నేను చంటి పాపనే
ఉన్నపాటుగా ఇవాలెలాగ ఎదగనే
నువ్వే తినిపించగా మెతుకే దిగదే
నువ్వే కనిపించక పగలు రేయి దిగులే

సుడిని పడిన పడవైనాను చూడిటూ
అమ్మ ఉందిగా మరింక నాకేం లోటు
అనుకోవడమేనేమొ నా పొరపాటు

రెప్పదాటి వెల్లకంటు కంటి పాపలా
నన్ను దాచి కన్ను తెరవనంటె ఇంకెలా
పిలిచా అమ్మా అనీ విననే వినవా
ఎదరే నిలిచా మరీ చూసా నాన్న అనవా

సుడిని పడిన పడవైనాను చూడిటూ
అమ్మ ఉందిగా మరింక నాకేం లోటు
అనుకోవడమేనేమొ నా పొరపాటు




******  *******  *******


చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: రాజ్ తరుణ్
గానం: పూజన్ కోహ్లీ

ప్రేమ ప్రేమ ప్రేమా
హా...ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమా
హా...ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమా
హా...ప్రేమ ప్రేమ ప్రేమా

నీహ్రుదయం మొదటి సారి ఎగసే చిరు గాలిలా
తాకెనులే మలుపు తిరిగి ఎదకేదొ హాయిలా
కల కాదె ఇది నిన్న లాగా
కదిలాడె మది ఊరుకోదా
కడలై పొంగె మనసులో మాటలు తీరం కోరవా
కనులలో నిండుగా నువ్విల చేరగా
మాటలే పాటగా మనసులో మారవా

నీడ వెంబడే నడిచిన నిండు వెన్నెలవి నీవా
చీకటన్నదె తెలుపనివెలుగువి నీవయ్యవా
కదిలే కాలమంతా నీకై బ్రతకనా
కడనే దాటి నీతో అడుగులు వేయనా
ఈ లోకం సగం జంట చేర్చి నీ పాదము వద్ద విడిచిపోనా
నీ ప్రేమలొ అది సగము తూగి ఆ రుణమే తీరునా
అందని స్నేహమే వీడని బంధమై
అమ్మలో ప్రేమనే ఇచ్చనే కానుకై

Palli Balakrishna Thursday, January 4, 2018


చిత్రం: ఈడోరకం ఆడోరకం (2016)
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయి చరణ్, అపర్ణ
నటీనటులు: మంచు విష్ణు , సోనారిక భడోరియ, రాజ్ తరుణ్, హెబా పటేల్
దర్శకత్వం: సంపత్ గుండ్రారపు
నిర్మాత: సాయి తేజ నాయక్
విడుదల తేది: 14.04.2016

పట్టుకో నను పట్టుకో పట్టుకో పడనంటూనే పడిపోతున్నా
లవ్ లో లవ్ లో చెలియా నీతో లవ్ లో
అందుకో చెయ్ అందుకో అందుకో
నాతో నేనే విడిపోతుంన్నా
లేలో లేలో ముజ్కో దిల్ మే లేలో
డడడా డడడా ధడ్కన్ మే ఫుల్ డిస్కో డీజే సంబరమే
పటపట పటపట పటాసులై గుండెల్లో పేలెను ప్రేమే

ఓ సోనియే ఓ ఓ సోనియే
జర్ మే ఈ జిందగీ తేరేలియే
ఓ సోనియే ఓ ఓ సోనియే
ఎదలో నీ చిత్రమే గీశావులే

నాలో ఏం చూశావే నిన్నే రాసిచ్చావే
అంతిదిగా నీ మనసుకు నే నచ్చేశానా
ప్రపంచమే నను కాదన్నా
నీ జంట కావాలనుకున్నా
ఫలించిన కల ఇవ్వాలిలా నీ కౌగిల్లో ఒదిగున్నా

ఓ సోనియే ఓ ఓ సోనియే
ఎదలో నీ చిత్రమే గీశావులే

నిన్నా మొన్నల్లోనా నేనిట్టా లేనంటా
మల్టీ ప్లక్స్ బొమ్మల్లే రంగుల్లో మెరిశా
పదే పదే మరి ప్రేమంటే పదే పదే జరిగే ఉంటే
ఎన్నెన్ని మాయలు చూస్తావు నువ్వు నీ ప్రేమ తీరంటే

ఓ సోనియే ఓ ఓ సోనియే
ఎదలో నీ చిత్రమే గీశావులే

Palli Balakrishna Sunday, October 15, 2017


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కార్తిక్
నటీనటులు: రాజ్ తరుణ్, ఆర్తన బిను
దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి
నిర్మాతలు: యస్.శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
విడుదల తేది: 29.01.2016

మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు

స్టెప్ స్టెప్ లోన వచ్చి ఎదురు దెబ్బలెన్ని తాకినా
మరింత దూసుకెల్లె సత్తువుందింక నీదె
వుంటె వుంద్ని పొతె పొనియి గెలవలెని ప్రనం ఎందుకు
రానంతు పత్తు బత్తె జత్తు మీధెలె
జాగొ జాగొ రె జాగొ జాగొ
గెలుపు వైపుకె భాగొ భాగొ రే
ఇదే తుది సమరం ఏ
మీ కరంటు గుండలలొని మంట
ఆరెది కదులె చలొ చలొ
ఆ జయన్ని ముద్దు పెట్టె జమ్ము-దమ్ము
నీదె వుటో వుటో వుటో
మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు

ఆనడు కుడ రావన-సేన
రామున్ని చూసి ఒ వెక్కెరించెనంట
వానర-సేన సమరములొన
పొరాడి మాతొ గెలిచెది కల అంటు
కొతులె కద అన్న రక్కసులు నాడు
నింగి నీల బొక్క బొర్ల పడ్డ తీరు
ఎం తెలుసు అన్ని గల్ల ఎత్తె
బట్చ్ దిమ్మ తిరిగె-తట్టు కొట్టు కొట్టు
జాగొ జాగొ రె జాగొ జాగొ
గెలుపు వైపుకె భాగొ భాగొ రె
ఇదే తుది సమరం ఏ
మీ కరంతు గుండలలొని మంట
ఆరెది కదులె చలొ చలొ
ఆ జయన్ని ముద్దు పెట్టె జమ్ము-దమ్ము
నీదె వుటో వుటో వుటో
మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు


**********  **********  **********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరన్

నువ్వెనా హొ నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా
నాకు పసి ప్రపంచమైన
నాకు ప్రతి వసంతమైన
నా కదకు సుకంతమైన నువ్వెనా
నాకు చిరు సంతొషమైన
నాకు తొలి కన్నీటివైన
నా కలకు నిజానివైన నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా

నువ్వున్నా మదిలొ ఈ గుండె గదిలొ
నీ గురుతు మెలిపెడుతోందె ఒక్కొ క్షనము
నీ స్నెహ-మడిగే నాలొని కలకు
ఎ నిదుర రానంటోందె కలిసే వరకు
నీ తొడు లెక నె ప్రేమ లక
నెనుండలేనె నీతొరాని నన్నింక
నీ గ్నాపకం విదిచెల్లదె ఎంచెసినా
ఎన్నాల్లుగ లెదేమిటొ ఈ యాతనా
నువ్వెనా హొ నువ్వెనా


**********  **********  **********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: కార్తిక్ , దివ్య యస్.మోహన్

ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆక్షం తుంచి
ఒక్కో నిమిషంలొ నీకొసం దాస్తున్న
ఒక్క్ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న
ఒక్కొ వాన జల్లు ఒక్కొ మెఘం నుంచి
ఒక్కొ చందమామ ఒక్కొ విష్వం నుంచి
భరించి హరించి ప్రేమించె నీకొసం
నా ప్రానం ఏసి దాచన
ఒక్కొ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న

ఎ మెరుపు పువ్వు నువ్వె చెలి
ని చిలిపి నవ్వె గీథంజలి
నీ వూహె నాకు ఒ జాబిలి
నీ పలుకె గుండెల్లొ జిలిబిలి
ఒక్కొ వయిధ్యన్ని ఒక్కొ అల్లరి అడిగి
ఒక్కొకొ ప నుంచి ఒక్కొ పల్లవి తెచి
ఆడించి పడించి లలించె నీకొసం
నా ప్రానం ఎసి దాచన
ఒక్కొ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న

కన్నుల్లొ వుండె కన్నీరులా
గుండెల్లొ పొంగె సెలేఅరులా
నీ కలల పూల తోటై ఇలా
ఎ కలలు అక్కర్లెనంతల
పుట్టెదాక మల్లి నీకై చచ్చె ఆష
చచ్చె దాక మల్లి నీతొ బ్రతికె ఆష
ప్రానం లొ ప్రానం ల
మౌనం లొ మౌనం లా
నా జీవితన్ని పంచనా
ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆక్షం తుంచి
ఒక్కో నిమిషంలొ నీకొసం దాస్తున్న


**********  **********  **********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సచిన్ వేరియర్, దివ్య యస్.మోహన్

పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

ఆహా అంటోంది నా సంబరం
వొడి లో వాలింది నీలాంబరం

మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీ క్షణం

కథలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం

పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

నింగీ నీలం, ఆకూ పచ్చ
నువ్వూ నేనూ జంట వీడి పోమూ

అలుకూ రాగం, మెరుపూ మేఘం
దేహం ప్రాణం మనమై కలిశామూ

జతగా ప్రతి జన్మకీ
నువ్వే చెలి జానకి
నీలో సగమై జీవించనీ

యదలో సహవాసమై
వ్యధలో వనవాసమై
నీతో నీడై పయనించనీ

ఆహా అంటోంది నా సంబరం
వొడి లో వాలింది నీలాంబరం
మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీ క్షణం
కథలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే


**********  **********  **********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: యాజిన్ నజర్

సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
ఈ క్షనం కలయా నిజమా
కుడికన్నైతే అదురుతు వుందె
చిలిపిగ నవ్వితె చెలియా
యెదనె నలిపెసవె దూదిలా
ఆపై కుదిపెసవె నన్నిలా
కళ్లకు మతెక్కించె సూదిలా
గుచ్చెసవె పిల్ల జివ్వంటుందే
సీతా నువ్వె నా విధి రాతా
సీతా మార్చెసవె గీతా

సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
కిందడొ మీదడొ చెస్తా
కన్నుల కలవా వెన్నుల బరువ
నీకొసమె మొస మగువ
నీకొసమే నా రెయి తెల్లరెన
మా కొడినె కుయ్యలిలె అంటున్న
తెల్లవరుజము ఇంటి ముందు ముగ్గులాగ
సంధెవెల ముందు ఆకసం లొ బొద్దులాగ
సొయగల పిల్ల దాచుకున్న సిగ్గులగ
తల్చుకున్న వెల వందయెల్లు నీవికగ
తెల నీతొ న వూహల్లొ
సీతా నువ్వె నా విది రాతా
సీతా మార్చెసవె గీతా

సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
ఈ క్షనం కలయా నిజమా

యెందకు గొడుగ నీటికి పడవ
నాకై నువ్వె ఊ.. చాల్లె మగువా
అలనటి ఆ సావిత్రి నువ్వంటున్న
మిస్సమ్మనె ప్రెమించ మంటున్న
కాటికంచుల్లొన వెచ్చగున్న కల్లు చుడు
లెతవుల్లగున్న గొల్లపైన రంగు చుడు
ముక్కు సూటి పిల్ల మాటల్లొన పదును చుడు
మెచ్చుకున్న వల్ల నన్ను యెవడు ఆపలెడు
తేల నీతొ న వూహల్లొ

సీతా నువ్వె నా విధి రాతా
సీతా మార్చెసవె గీతా


**********  **********  **********


చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుచిత్ సురేషన్

తారజువ్వకి దారం కట్టి ఆకసంలొ ఎగరేస్తుంటం
దెఖొ రె దెఖొ రె దెఖొ రె రె రె
సీతాకోక చిలకలకెమొ కోక రేక కట్టించెస్తం
దెఖొ రె దెఖొ రె దెఖొ రె
చెయ్యాలి అనుకుంటె చాలు
ఎదైన చెస్తం నిద్దట్లొ లెస్తం
చెయ్యొదు అనిపిస్తె మాత్రం
కొట్లైన రాని పట్టించుకొం పొతెపొని
లైఫ్ అంటె కూసింత తీపి కూసింత బిపి ఖూసింత హాప్పి
కాబట్టె నచ్చింది చెస్తం నచ్చంది తొస్తం
ఫ్రెండ్షిప్ లోనె తింటు తాగి బతికెస్తం


పొదు పొదున్నె ఒసి గ చై యె కొడతం
ఆపై ఫేZబుక్ స్టటుస్ పెడతం
what a next అంటు ఊరోల్ల గొడవల్లో
దిగుతం తిడతం కొడతం
దూమపనం మద్యపనం ఆరొగ్యనికి హాని
ముట్టొదు ఇంచు మించు మెము అంతేగా
చదువంటె మా బుర్రలకి అస్సలు ఎక్కదుగాని
షాచ్క్ లు మీద షాచ్క్ లు ఎచె తెలివుంధి

బ్రాండెడ్ జీన్స్ ఏస్తం బూటేస్తం హై ఫై గుంటాం
ఉక్కపొస్తుంటె లుంగిలె కడతాం
ఫిగరే వెల్తుంటె ఎనకాలె ఫాలో ఐపోదాం విజిలే కొడదాం
తూఫాన్ అయిన వచ్చేముందు హెచ్చరికె ఎస్తరొయ్
మేమెప్పుడు దూకెస్తమొ మాకె తెలవదురొయ్
మనిషంటె మంకీ నుంచి పుట్టినవాడె కాద
అల్లరి వేషాలేయకపొతె ఎట్టాగా

Palli Balakrishna Sunday, August 20, 2017


చిత్రం: ఉయ్యాలా జంపాలా (2013)
సంగీతం: సన్నీ M.R
సాహిత్యం: వాసు వలబోజు
గానం: హర్షిక గుడి, అనుదీప్ దేవ్
నటీనటులు: రాజ్ తరుణ్, అవికాగోర్
దర్శకత్వం: విరించి వర్మ
నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ , పి.రామ్మోహన్, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 25.12.2013

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ
ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల
వెన్నెల్లొ ఊగాలిలా
ఒహో... నీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయ
ఒహో... నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా

తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్..
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..

చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది
చందమామ నీలామారి నా పక్కనుంది
నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా
ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది
రేపంటూ మాపంటూ లేనేలేని
లోకంలో ఇద్దరినే ఊహించని

ఎటువైపు చూస్తున్న
నీరూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
ఒహో... నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఒహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ

నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఒహో... ఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల
ఒహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా

గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం

Palli Balakrishna


చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సాగర్
నటీనటులు: రాజ్ తరుణ్, హేబా పటేల్
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్
నిర్మాతలు: సుకుమార్ , విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి
విడుదల తేది: 20.11.2015

న న న నాన నా నా
న న న నాన నా నా
నీతొ తిరిగిన అడుగె యు టర్న్ తీసుకుందె
నా ఈ సింగల్ స్టేటస్ సడ్డెన్ గ నువ్విచ్చిందే
ఓహొ... ఓహొ...
నీ ప్లేస్ ఏ రీప్లేస్ అయ్యిందె
ఒహొ... ఓహొ...
కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చేసిందే

Baby I Know You Gonna Miss Me

Miss Me (7)

Baby I Know You Gonna Miss Me  (4)

నీ పాత కిస్సుల్లొ ఫ్లేవర్ కన్న
ఈ కొత్త కిస్సేదో టేస్టిగుందే
నీ పాత హగ్గుల్లొ వేడి కన్న
ఈ కొత్త టచ్ ఎదొ స్వీటుగుందె
ఒహొ... ఒహొ...
ఈ ఫ్రీడం నువ్విచ్చిందే
ఒహొ... ఒహొ...
నా సెల్ఫీ తన DP అయ్యిందె

Baby I Know You Gonna Miss Me (4)

నువు లవ్ చెసిన హార్ట్ పైన
తానోచ్చి తాపిగ తల వాల్చిందె
నువు చేతులేసేటి షోల్డర్ పైన
తన పంటి తొ టాట్టూ వెసెసిందె అ అ
ఒహొ... ఒహొ...
నీ కల్లల్లొ జలసి ఉందె
ఒహొ.. ఒహొ...

నీ మిస్టేక్ ఏ ప్లస్ అయ్యిందె

Baby I Know You Gonna Miss Me

Miss Me (7)

Baby I Know You Gonna Miss Me (3)



********   *********   ********


చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: యాజిన్ నజీర్

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్ని నీ వల్లేనా
వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐనా వెన్నలే
అది నీ అల్లరేనా..
ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీ వల్లేనా

కోపముంటే నేరుగా చూపకుండా ఇలా
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా
మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పోలమరుతుంటే అసలింత జాలి లేదా
నేను కాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా..ఆఅ..

మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగా గిల్లిచేప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం
కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట
ఓ.. మన మద్య దారంకైన దారి ఎందుకంటా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్నీ నీ వల్లేనా
ఓ.ఉ.ఓ..


********   *********   ********

చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, రనైనా రెడ్డి, రీటా

మ్యుసిక్ ఒక్
దిస్కొ ఒక్
మూవ్ ఇట్ ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

పార్టి పార్టి పార్టి
లెట్స్ టుగెదర్ పార్టి
క్యుటి క్యుటి క్యుటి
బేబి కమాన్ షేక్ యువర్ బూతి
నాటి నాటి
మేమంత చాల నాతి
కమాన్ బేబి
కమాన్ బేబి
లెట్స్ గెట్ డర్టి

బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్
సింగ్ సొంగ్ పింగ్ పొంగ్
డింగ్ డింగ్ డింగ్ డొంగ్ డింగ్ డొంగ్
ఎం చెయాలొ చెసేధం
ఇంక అన్ని రైట్-అ నతింగ్ రోంగ్

మ్యుసిక్ ఒక్
దిస్కొ ఒక్
మూవ్ ఇట్ ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

సేం సేం బట్ డిఫరెంట్
నొ మనీ నొ హనీ
గుడ్ బొఇ గొస్ టూ హెవెన్
బాడ్ బొఇ గొస్ టూ బాంగ్కాక్
వాకింగ్ స్ట్రీట్ లొన మస్తి చెయలె
అరె రొక్కింగ్ చ్లుబ్ లొ
డంచె ఇర్రగదియ్యలె మారె

వొడ్క బొట్టిల్ మూత ఓపెన్ చెయ్యాలె ఇలా
ఫుల్ గ నిజం చెయ్యాలె
మిండ్ లొ ఉండె ప్రతి కల

బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్

మస్సాజ్ ఒక్
సండ్విచ్ ఒక్
హ్యాప్పి ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

ప్రైవేట్ బూత్ లొన
మూన్ లైట్ నైట్ లొన
సే లొ సెంటర్ కెల్లి వాన్న హావ్ ఎ బాష్
తాఇలండ్ పాకిస్తాన్ ఒ పక్క
చైన కజకిస్తాన్ ఒ పక్క
సన్లైట్ వచ్చె వరకు
వాన్న హావ్ ఎ రొమాంటిక్ క్లాష్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్

టూక్ టూక్ ఒక్
గొ గొ ఒక్
బూం బూం ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

సేం సేం బట్ డిఫరెంట్
నొ మనీ నొ హనీ
గుడ్ బొఇ గొస్ టూ హెవెన్
బాడ్ బొఇ గొస్ టూ బాంగ్కాక్



********   *********   ********

చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్. మానసి

టంకు టకుం టం
టంకు టకుం టం
అంబర్పెట సెంటర్ నుండి
అమీర్పెటకు పొయెటప్పుడు
షేరె ఆటొ లొ
కలిసాడు సొఫ్ట్వేర్ కుర్రడు
టంకు టకుం టం
టంకు టకుం టం

నా ఫిగర్ మస్తని పొగిడాడు
ఫట్టున లవ్ లొ దింపాడు
స్త్రైట్ గ మాట్టర్ కొచాడు
గాటుగ ముద్దిమన్నడు
టంకు టకుం టం
టంకు టకుం టం

సిగ్గుతొ నేను ముద్ధిట్టాంతె
అరె రె సిగ్గుతొ నేను ముద్ధిటాంతె
చెల్ల్ ఫోన్లో సిత్రించడు
వద్దు వద్దు వద్దు అన్న
మాటె వినెలెదు
ఎహె నెనెవరికి చూపిస్తానె
నేను చూసుకొవటానికె
అంటూ ఇదరి మద్య
సిక్రెట్ సీన్
ఇంటర్నెట్లో ఎట్టెసాడు
ఇంటా బయటా ఇమేజ్ మొత్తం
డ్రైనేగ్ లోనె కలిపెసాడు

అంతె అప్పూ అప్పూ
ఐపొయింది బ్రేకప్పూ
అబ్బి అబ్బి నీతో అవుతా
పాచప్పూ

అప్పుడప్పుడు ఐపొయింద బ్రేకప్పూ
అమ్మి అమ్మి రాయె అవుదాం పాచప్పూ

ఫేస్బూక్ లొని కలిసాడు
యుఎస్ లొని కుర్రొడు
సెలెబ్రిటీస్ తొని దిగిన
సెల్ఫీలెన్నొ పెట్టాడు
టంకు టకుం టం
ఆఇర్ఫొర్చె లొన
పెద ఉద్యొగం అని చెప్పడు
Yఔంగ్ తిగెర్ ణ్టృ ల
ఉన్నడని టెంప్ట్ అయ్యనొ
టంకు టకుం టం
ఎ చాట్టింగ్ లొన లవ్ అయ్యింది (2x)
మీటింగ్ అయ్యె టైం ఒచింది
యుఎస్ అంటె వుయ్యురు పక్కన
సంకరపల్లని తెలిసింది
ఆ ఎయిర్ ఫోర్స్  ఉద్యోగం అంటె
గాలి తిరుగుడు అని ఎరుకైంది
ఫొటొలన్ని ఫొటొషొప్
డప్పని ప్రూవ్ అయ్యింది
మరీ చాట్టింగ్ లోన చెసిందంత
చీటింగ్ అని తెలిసొచింది

అంతె ఉప్ ఉప్ పూ
ఐపొయింది బ్రేకుప్పూ
అబ్బి అబ్బి నీతొ ఔత
పాచుప్పూ

చెప్పిన టైం కి రాలేదని
చెప్పుల షొప్ టిప్పుతోటి
గుర్రు గుర్రు గురకెట్టాడని
గురువ రెద్ద్య్ కొడుకు తోటి
బ్రేకప్ బ్రేకప్
అ హెడ్ పైన డండ్రుఫ్ఫ్ ఉందని
హెడ్ కానిస్టేబుల్ తోటి
బెద్ మీద దుప్పట్టి మొతం
లాగేసాడని రెడ్డితోటి
బ్రేకప్ బ్రేక్ప్
నా కుక్కని చి చి అన్నాడని
నా కుక్కని చి చి అన్నాడని
లెక్కల మాస్టర్ విక్రంతోటి
పువ్వుల సొక్క ఏసాడని
స్టవ్ ల రిపేర్ షంకర్ తోటి
ఏగ్ దాచిపెట్టాడని
ఇన్సురెన్స్ ఏజెంట్ తోటి
మాటి మాటికి మూడె మార్చి
మ్యారేజ్ బ్యూరో నీరజతోటి
ఇట్టా సిల్లీ సిల్లీ రీజన్ తోటి
గల్లి గల్లి కొక్కడితొటి
అప్ అప్ అయిపోయింది బ్రేకప్
అబ్బి అబ్బి నీతో అవుతా
పాచ్ అప్ పూ

ఇంతె ఇంతె ఎ కాలంలో
బ్రేకప్
ఇట్టె ఇట్టె అయిపోతారు పాచప్ (2x)



********   *********   ********


చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నరేంద్ర

హేయ్ బార్ కెళ్తుంది బీర్ కొడుతుంది
పబ్ కెళ్తుంది డాన్స్ చేస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

షార్ట్ లేస్తుంది హాట్ గుంటుంది,
దమ్ము కొడుతుంది చూయింగ్ గమ్ వేస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

హేయ్ వాట్సప్ లో  ఎయిట్ ఓ క్లాక్ కి గుడ్ నైటంది
కాని లాస్ట్ సీన్ టుడే 12.30 ఉంది
సాటర్ డే  నైట్ పార్టీకి రమ్మంది
ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

యో బోయ్ టెల్ మీ
లవ్ చెయ్యాలా వద్దా..?
ఎవ్రిబడి సే నౌ
లవ్ చెయ్యాలయ వద్ద..?
come on come on come on
పుట్ యువర్ హాండ్స్ అప్
లవ్ చెయ్యాలయ వద్ద..?
షేక్ఇట్ షేక్ఇట్ షేక్ఇట్ నౌ
లవ్ చెయ్యాలా వద్దా..?

హేయ్ లాంగ్ డ్రైవంటే లైక్ అంటుంది
ఎవడి బైకైనా మొగాడిలా  కూర్చుంటుంది .

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

మిడ్ నైట్ దాటాక ఇంటికొస్తుంది
డ్రాప్ చేసింది ఎవడంటే ఫ్రెండంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్ట్ 5K ఉంది
ఆ లిస్టులోన ఒక్కతైన అమ్మాయ్ లేకుంది
గుంట కొక్క selfie అపలోడ్ చేస్తుంది
కామెంట్ పెట్టిన ప్రతోడికి స్మైలే ఇస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది
ఫోనేమో అల్వేజ్ బిజీగా ఉంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

గుండెల్లో నేనే ఉన్నానంటుంది
కానీ fb లో ఫ్రొఫైల్ పిక్ బన్నీ దుంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

Palli Balakrishna



చిత్రం: కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: రాజ్ తరుణ్,అను ఇమ్మాన్యూల్
దర్శకత్వం: వంశీకృష్ణ
నిర్మాత: ఏ.కె.ఎంటర్ టైన్మెంట్
విడుదల తేది: 03.03.2017

అర్ధమైందా ఓ అర్ధమైందా?
అర్ధమైందా ఓ అర్ధమైందా?

ఇన్నాళ్ళుగ  నాతో నేను
బాగానే ఉంటున్నాను
నిను కలిసిన నిన్నటి నుండి
నను నేనే ఎవరన్నాను
అదోలా మారిపోయాను

ఏం జరిగిందంటు తెలుసు
కనిపెట్టేసింది మనసు అదే నీతో...
అనాలని ఉన్నాగాని అనేదెలా

అర్ధమైందా... అర్ధమైందా?
ఓ అర్ధమైందా ఓ అర్ధమైందా నీకే...

ఇన్నాళ్ళుగ  నాతో నేను
బాగానే ఉంటున్నాను
నిను కలిసిన నిన్నటి నుండి
నను నేనే ఎవరన్నాను
అదోలా మారిపోయాను
ఓ అర్ధమైందా?

ఓ పొలమారుతోంది నీ ఊహలోనే
తెలవారుతోంది మది హో
పదివేల మంది నడి మద్యనున్నా
నీ జాడ చెబుతుంది
ఇపుడే ఇలా నీ రాకే అయినా
అపుడే ఎలా నన్నింత మార్చుతోందని
అనాలని ఉన్నాగాని అనేదెలా

అర్ధమైందా  అర్ధమైందా?
ఓ అర్ధమైందా అర్ధమైందా నీకే...

ఓ పేరేమో నాది మనసంత నీది
నాకింత చోటు లేదే  హో
అణుబాంబు నాపై పడుతున్న గాని
ద్యాసంతా నీ మీదే
ఏమైనా చెలి బావుంది ఇది
ఇదిలా నాలో అయ్యేది అందుకేనని
అనాలని ఉన్నాగాని అనేదెలా...

అర్ధమైందా  అర్ధమైందా?
అర్ధమైందా  అర్ధమైందా?
అర్ధమైందా  అర్ధమైందా?
అర్ధమైందా  అర్ధమైందా?
ఓ అర్ధమైందా?



*********   ********  *********


చిత్రం: కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: గీతా మాధురి

ఒలె ఒలె ఒలె ఒలె ఒలెమ్మో
సారీ ఫర్ ద లేటు లేటైంది ఫ్లైట్
మై డియర్ ఆడియన్స్
మేరే జాన్ జిగిరి ఫాన్స్
గజ్జె కట్టి మీ కోసం మొదలెడుతున్నా డాన్స్
ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్

కేరాఫ్ బెంజి సెంటర్
బేబీ హోటల్ నా అడ్డా
మిడ్ నైట్ మిర్చి బిరియానికి
ఫేమస్ నేనంటా
నో  ఎంట్రీ బోర్డే లేదు
ఏవ్రీబడీ వెల్కమ్ అంట
నరాలు అదిరే టేస్ట్ కి నేను గ్యారంటీ ఇస్తా
నషాలాన్నంటే మసాలా దినుసు
నా వంపు సొంపుల అందాల  స్పైసీ
కలేసి మీకు కరంటు షాక్ బోనస్ గిఫ్ట్ ఇస్తా

నా పేరే... నా పేరే సింగపూర్ సిరిమల్లి
నేనంటే పాపులర్ గల్లీ గల్లీ
నా అందం హాట్ హాట్ రెడ్ చిల్లీ
కొంటె కుర్రాళ్ళ గుండెల్లో లొల్లి లొల్లి


నా చూపే వోడ్కా గ్లాసు
నా నవ్వే జిలేబి పీసు
మొత్తంగా నే ఊర మాసు దివాలి టపాను
నా ఝలకే బ్రేకింగ్ న్యూస్
నా కుళుకే రికార్డు డాన్స్
నేనట్టా చెయ్యేస్తే చాలు
పోరగాళ్ళు ఫుల్ టాస్
డైలీ వచ్చే నా కస్టమర్స్
నా గ్లామర్ కే ఫుల్ టు ఖల్లాస్
ఒక్కటంటే ఒక్కసారి ఈడకొచ్చి ఎల్లకుండ
ఇంటికెళ్లి మంచమెక్కరో

నా పేరే... నా పేరే సింగపూర్ సిరిమల్లి
నేనంటే పాపులర్ గల్లీ గల్లీ
నా అందం హాట్ హాట్ రెడ్ చిల్లీ
కొంటె కుర్రాళ్ళ గుండెల్లో లొల్లి లొల్లి

గూగుల్ లో నా పేరే కొడితే
వేలల్లో గాసిప్పులుంటాయ్
నేనంటే తెలియని మగాళ్లు
కోయ్ బి నహి హై
నేనట్టా కనిపిస్తే చాలు
కుర్రాళ్ళ విజిల్స్ పడతాయ్
ఆటోగ్రాఫ్ సెల్ఫీల కోసం
గల్లాట్ట హోతా హై
ఈ కాలానికి నేనే గా సిల్క్
నా కళ్లల్లో కసక్ కిక్కు
మొత్తమంత రెండు స్టేట్స్
నన్ను మెచ్చుకున్న ఫాన్స్
అయినా వాళ్ళే నాకు అందరు...

నా పేరే... నా పేరే సింగపూర్ సిరిమల్లి
నేనంటే పాపులర్ గల్లీ గల్లీ
నా అందం హాట్ హాట్ రెడ్ చిల్లీ
కొంటె కుర్రాళ్ళ గుండెల్లో లొల్లి లొల్లి

కేరాఫ్ బెంజి సెంటర్
బేబీ హోటల్ నా అడ్డా
మిడ్ నైట్ మిర్చి బిరియానికి
ఫేమస్ నేనంటా

Palli Balakrishna Friday, July 28, 2017

చిత్రం: అందగాడు (2017)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దనుంజయ , శేఖర్
నటీనటులు: రాజ్ తరుణ్, హెబా పటేల్
దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
నిర్మాత: రాంబ్రహ్మం సుంకర
విడుదల తేది: 02.06.2017

నా హార్త్ బీట్ ఏమొ
ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే
నా పల్సె రేట్ ఏమొ
ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే
నా జిందగీలోనె
ఫర్స్త్ టైమె సన్ రైస్ వొచ్చిందె
నీ వల్ల నీ వల్లె
ఫర్స్త్ టైమె నా లైఫె నచ్చిందె

దెబ్బకి పోయె పోయె
నా మైండ్ పాగల్ ఐపోయె
దెబ్బకి పోయె పోయె
నిద్దరె కరువే ఐపొయే

దెబ్బకి పోయె పోయె
దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె
దెబ్బకి పోయె పోయె
నా జన్మ ధన్యం ఐపొయే

నా హార్త్ బీట్ ఏమొ
ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే
నా పల్సె రేట్ ఏమొ
ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే

షి ఈస్ రీల్ల్య్ సూపర్, చేసింది ఫేవర్
ఇచ్చింది ఆఫ్ఫర్, మార్చింది ఫ్యుచర్
ఖుదిరింది మీటర్, మొదలైంది మాట్టర్
మర్రే ఆఫ్టర్, లైఫ్ హెలిచోఫ్టర్

టోర్చ్ లైట్ కోసం వెతికేస్తుంటె
సాటిలైట్ లాగ దూఇకెసావె
దారి తప్పిపొయి తిరిగేస్తుంటె
గూగుల్ మాప్ ఐ వచ్చెసావె

ఒక్క టచ్ కె గుండె హై పిచ్ లొ
అల్టిమేట్ లవ్ సోంగ్ పాడుతున్నదె
ఒక్క మాటకె చూడు కొత కైట్ లా
నా మనసు ఎగిరేసి
నీ చుట్టు తిరిగేసి
గిరికీలు కొడుతున్నదె

దెబ్బకి పోయె పోయె
నా మైండ్ పాగల్ ఐపోయె
దెబ్బకి పోయె పోయె
నిద్దరె కరువే ఐపొయే

దెబ్బకి పోయె పోయె
దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె
దెబ్బకి పోయె పోయె
నా జన్మ ధన్యం ఐపొయే

పర్ఫ్యుం నదిలొ ముంచేసినట్టుగ
వొల్లంత నీ ఫ్లేవర్ నింపెసావె
హై బీం లైతింగ్ కమ్మేసినట్టుగ
దిమాక్ మొతం కమ్మెసావె

ఒక్క స్మైల్ తొ లెక్కకందనంతగ
తిక్క తిక్క ఉక్కపోత పెంచెసావె
ఇప్పుడిప్పుడె లక్ దక్కుతుందిర
ఒ చిన్న తప్పైన
ఒ రాంగ్ స్టెప్ ఐన పడకుండ
చూడు దేవుడ

దెబ్బకి పోయె పోయె
నా మైండ్ పాగల్ ఐపోయె
దెబ్బకి పోయె పోయె
నిద్దరె కరువే ఐపొయే

దెబ్బకి పోయె పోయె
దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె
దెబ్బకి పోయె పోయె
నా జన్మ ధన్యం ఐపొయే

నా హార్త్ బీట్ ఏమొ
ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే
నా పల్సె రేట్ ఏమొ
ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే

Palli Balakrishna Monday, June 12, 2017

Most Recent

Default