Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: దగ్గరగా దూరంగా (2011)
సంగీతం: రఘుకుంచె
సాహిత్యం: కేదారినాథ్ పరిమి
గానం: రఘుకుంచె
నటీనటులు:సుమంత్ , వేదిక , సింధూ తులాని
దర్శకత్వం: రవికుమార్ చావలి
నిర్మాత: జె. సాంబశివరావు
విడుదల తేది: 2011

రూరురూరు రూరురు  రూరురూరు రూరురు

మనసు మనసు మరి దగ్గరగా
నువ్వు నేను మహ దూరంగా
కనుల కలలు మన మధ్యే వారధిగా
నీ ఊహే నాలో ప్రాణంగా నా కంటిపాపే చూడంగా
కనిపించ రావ వేగంగా ఓ ఓ ఓ...

నీ ఊహే నాలో ప్రాణంగా నా కంటిపాపే చూడంగా
కనిపించ రావ వేగంగా

నువ్వు ఎక్కడంటు నేను వెతుకుటుంటే
అంతలోనే నువ్వు దగ్గరగా దూరంగా
నువ్వు ఎక్కడంటు నేను వెతుకుటుంటే
అంతలోనే నువ్వు దగ్గరగా దూరంగా
అడుగు అడుగు నీ దగ్గరగా అడగలేనంత దూరంగా
మనసు ఎదుట నిలిచింది మౌనంగా
నువ్వంటే ఎంతో ఇష్ఠంగా చెప్పాలనుంది అందంగా
ఎద పంచుకోవ ఏకంగా ఓఓఓ...

నువ్వుంటే ఎంతో ఇష్ఠంగా చెప్పాలనుంది అందంగా
ఎద పంచుకోవ ఏకంగా...

నిన్ను చూసి ఆశే నన్ను వీడిపోయే
నిన్ను నన్ను కలిపి దగ్గరగా దూరంగా
నిన్ను చూసి ఆశే నన్ను వీడిపోయే
నిన్ను నన్ను కలిపి దగ్గరగా దూరంగా

రూరురూరు రూరురు  రూరురూరు రూరురు (2)

No comments

Most Recent

Default