Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sri Krishna Pandaveeyam (1966)




చిత్రం: శ్రీక్రిష్ణపాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్ టీ ఆర్ , శోభన్ బాబు, ఎస్. వరలక్ష్మి 
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 13.01.1966



Songs List:



మత్తువదలరా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల 

కృష్ణుడు ముసలి బాహ్మణుడు:
అపాయమ్ము  దాటడాని కుపాయమ్ము కావాలి!
అంధకార మలమినపుడు వెలుతురుకై  వెదకాలి!
ముందు చూపులేనివాడు ఎందునకూ కొరగాడు!
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు!
మత్తువదలరా నిద్దుర మత్తువదలదా!
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తౌదువురా!  

జీవితమున సగబాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగబాగం చిత్తశుద్దిలేకపోవు
అతి నిద్రా లోలుడు  తెలివిలేని మూర్ఖుడు
పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు       

సాగినంతకాలం నా  అంతవాడు  లేడందురు
సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు
కండబలముతోటే ఘనకార్మము సాధించలేరు
బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు   

చుట్టు ముట్టు ఆపదలును మట్టుబెట్ట బూనుమురా!
పిరికితనము కట్టిపెట్టి దైర్యము చేపట్టుమురా!
కర్తవ్యము నీ వంతు కాపాడుట నావంతు!
చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం  




ఛాంగురే ఛాంగు ఛాంగురే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

హిడింబి: 
ఛాంగురే ఛాంగు ఛాంగురే
ఛాంగురే  బంగారు రాజా!
ఛాంగు ఛాంగురే బంగారురాజా!
మజ్జారేమగరేడా మత్తైన వగకాడా!
అయ్యారే! అయ్యారే నీకే మనసియ్యాలని వుందిరా   

ముచ్చటైన మొలక మీసముంది
భళా! అచ్చమైన సింగపు నడుముంది!
జిగిబిగీ మేనుంది సొగసులొలుకు   మోముంది
మేటి దొరవు  అమ్మక చెల్ల!నీ సాటి ఎవ్వరుండుట కల్ల          
కైపున్న మచ్చకంటిచూపు అది చూపుకాదు పచ్చలపిడిబాకు
పచ్చలపిడిబాకో విచ్చిన పువురేకో!
గుచ్చుకుంటె తెలుస్తుందిరా
మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా                           

గుబులుకొనే కోడెవయసు  లెస్స   దాని గుబాళింపు ఇంకా హైలెస్స
పడుచుదనపు  గిలిగింత  గడుసు గడుసు పులకింత
ఉండనీయమేమి సేతురా కైదండలేక నిలువలేనురా   



ఏమిటయా నీ లీల పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్ 
గానం: పి.బి.శ్రీనివాస్ 

నారదుడు: 
ఏమిటయా నీ లీల కృష్ణా! ఏమిటయా నీలీల
ఎందులకీ గోల  మాయాలోలా                                                 

మట్టి బొమ్మలకు ప్రాణముపోసి మతినొసగి మదమత్తులజేసి
అధార్మికుల అణగార్చునెపాన అవతారము ధరియింతువయా    
 
పరమాత్ముడవై   నరులవిధాన సరసాల గొడవలో చొరబడియేవు
కన్నియ ఇంట కలతలురేపి  కళ్యాణానికే  సిద్ధమయేవు    

పల్లవి:
(అగ్నిద్యోతనుడు)
కృష్ణా!  యదుభూషణా!హేకృష్ణా!యదుభూషణా!
గోవిందా!ముకుందా!హే పావనా!                   

చరణము: 1
(అగ్నిద్యోతనుడు)
దీనులపాలిట  దైవము నీవట అమరులనేలెడి అయ్యవు నీవట!
భక్తకోటికి చింతామణివట నినునెరనమ్మిన లోటేరాదట         

చరణము: 2
(అగ్నిద్యోతనుడు)
అఖిలము నెరిగిన అంతర్యామికి వివరించే పని లేదుగదా!
నమ్మిన కొమ్మను ఏలుకొమ్మని కృష్ణా రమ్మని పిలచుట నాభాగ్యమెగా 




ప్రియురాల సిగ్గేలనే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీక్రిష్ణపాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల,  పి. సుశీల

ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే 
నీ మనసేలు మగవానిజేరి
ప్రియురాల సిగ్గేలనే 
నాలోన  ఊహించిన నాలోన  ఊహించిన 
కలలీనాడు ఫలియించె స్వామి
నాలోన  ఊహించిన 

ఏమీ ఎరగని గోపాలునికి  ప్రేమలేవో నేరిపినావు
ఏమీ ఎరగని గోపాలునికి  ప్రేమలేవో నేరిపినావు
మనసుదీర పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే

ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే 

ప్రేమలు తెలిసిన దేవుడవని విని  
నా మదిలోన కొలిచితిని 
ప్రేమలు తెలిసిన దేవుడవని విని  
నా మదిలోన కొలిచితిని
స్వామివి నీవని తలచి  నీకే 
బ్రతుకే కానుక జేసితిని                   

నాలోన  ఊహించిన నాలోన  ఊహించిన 
కలలీనాడు ఫలియించె స్వామి
నాలోన  ఊహించిన 

సమయానికి  తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓభామా!
సమయానికి  తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓభామా!
ఇపుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే

ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే 
నీ మనసేలు మగవానిజేరి
ప్రియురాల సిగ్గేలనే 




నల్లని వాడైనా ఓ చెలీ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి), ఎల్.ఆర్.ఈశ్వరి 

రుక్మిణి, చెలియలు : 
నల్లని వాడైనా  ఓ చెలీ  చల్లనివాడేలే !
గోవుల గాచెడి వాడైనా  నీ గొప్పకు తగ్గని వాడే చెలీ    

మురళీ మోహనుని  చెలీ, మురిపించిన జాణవులే !
మా గోపాలుని ఇల్లాలివౌట  నీ భాగ్యమె భాగ్యము
ఇలవేలపులౌ మిమ్ముల జూచి  తరియించెను మా జన్మలే

మనసే పందిరియై చెలీ, నీ వలపులు పూలతలై
అనురాగాలే పరీమళించి ఆనందము నీయగా
మీ ప్రియగాధ  యుగయుగాలకు కథగా నిలచునులే ఓ చెలీ



భళా భళా నా బండీ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం 

భీముడు: ఓహో.. హో...
భళా భళా నా బండీ  పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ  బ్రహ్మకు నోరూరునండి 

తిండి లేనిదే కండ లేదురా! కండ లేనిదే గుండె రాదురా! హే తమ్ముడూ!
గుండె దిటవుగా నున్నచో  బ్రహ్మాండములోనే ఎదురు లేదురా
కరకర ఆకలి మండుతువుంటే  కమ్మని భోజన మెదురుగవుంటే
గుటకలు మ్రింగుచు కూర్చొనువాడు  ఉంటే వాడు వెర్రివాడు     

అట్టురా ! మినపట్టురా! దీన్నొదిలి పెట్టేదెట్టురా!
తీపి తీపి బొబ్బట్టురా ! అహ తింటే ఆకలి కట్టురా!
పప్పుతోటి ముద్ద గలిపి  పచ్చడితో అనుపానమేసి
బక్క పేగులకు పట్టిస్తుంటే  చెప్ప శక్యమా దీని రుచి        

సాటి లేని జగజెట్టి భీముని  చేతుల తీట తీరునులే
అరి చేతుల తీట తీరునులే
ఏక చక్ర పురావాసుల బెడద  నేటి తోనె పరి మారునులే
తల్లి రుణమ్మును తీర్చెద  నా ధర్మమ్మును నెరవేర్చెద
ఓ ఆత్మబంధూ ! నీ అండ వుంటె ఎవరడ్డమైన పరిమార్చెద   




స్వాగతం సుస్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీక్రిష్ణపాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం:  పి. లీల, పి. సుశీల

స్వాగతం... స్వాగతం సుస్వాగతం
స్వాగతం కురుసార్వభౌమ స్వాగతం సు స్వాగతం
శత సోదర సంసేవిత సదనా అభిమానధనా సుయోధనా
స్వాగతం సు స్వాగతం
మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వల రాజువు నీవే
రాగభోగ సుర రాజువు నీవే
రాజులకే రారాజువు నీవే
ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా
స్వాగతం సు స్వాగతం
తలపులన్ని పన్నీటి జల్లులై
వలపులన్ని విరజాజిమల్లెలై
నిన్ను మేము సేవించుటన్నది
ఎన్ని జన్మముల పున్నెమో అది
కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు శౌర్యా భరణా
స్వాగతం సు స్వాగతం


Most Recent

Default