Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sagara Sangamam (1983)





చిత్రం: సాగర సంగమం (1983)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: కమల్ హాసన్, జయప్రధ, యస్. పి. శైలజ, గీత
దర్శకత్వం: కె. విశ్వనాధ్
నిర్మాత: ఏడిద నాగేశ్వర రావు
విడుదల తేది: 03.06.1983



Songs List:



బాల కనకమయ పాట సాహిత్యం

 
చిత్రం: సాగరసంగమం (1983)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: త్యాగరాజ స్వామి
గానం: యస్. జానకి

బాల కనకమయ చేల సుజన పరిపాల 
కనకమయ చేల సుజన పరిపాల 
కనకమయ చేల సుజన పరిపాల
శ్రీరమాలోల నిగృత సరజాల
శుభద కరుణాలవాల ఘననీల
నవ్య వనమాలికా భరణా
ఏలా నీ దయా  రాదూ
పరాకు చేసేవేలా సమయము కాదూ

రారా రారా రారా 
రారా దేవాది దేవా రారా  మహానుభావా
రారా దేవాది దేవా రారా మహానుభావా
రారా దేవాది దేవా రారా మహానుభావా
రారా రాజీవ నేత్రా రఘువర పుత్రా
సార తరసుధా పూర హృదయా
రారా రారా సార  తరసుధా పూర హృదయ
పరివార  జలధి గంభీర దనుజ సంహార
దశరధ కుమార భుదజన విహార
సకల శృతిసార నాదు పై ఏలానీ దయా రాదూ

సా ఠీ మరిస తకత ఝుం
దపమపదపఝుం
సనిరిస తకతఝుం
సనిస ధీం సనిసరిస  ధీం
సనిసగామరీస  నిరిస ధీం 
పద తకధిమి తకతఝుం 
పపమరి మమరిస 
సరిరిమ రిమమప 
తకఝుం  పమగమరీ మరిస రిమప 
తద్ధీంగిణతో దాదా నిపమ తద్ధీం గిణతో
ఏలా నీ దయా రాదు పరాకు చేసేవేలా

సమయము కాదు ఆ... 
ఏలా నీ దయారాదూ...



మౌనమేలనోయి... పాట సాహిత్యం

 
చిత్రం: సాగర సంగమం (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఆఆ... ఆఆ...
మౌనమేలనోయి...
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి 
 
పలికే పెదవి వొణికింది ఎందుకో
వొణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసులా విరిసే వయసులా
కలిసే మనసులా విరిసే వయసులా 
నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా 

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
 
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు
ఎంతెంతొ తెలిసిన

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల  వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల  వెలిగే కన్నుల
తారాడే హాయిలో
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి 



నాద వినోదము పాట సాహిత్యం

 
చిత్రం: సాగర సంగమం (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. పి. శైలజ

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
వందే పార్వతీప రమేశ్వరౌ

నాద వినోదము నాట్య విలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
భావములో ఆ... భంగిమలో ఆ...
గానములో ఆ... గమకములో ఆ...
భావములో భంగిమలో
గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
ఆ...ఆ...ఆ...
 
ని ని మ ద ని ని - ని
మ ద ని స ని - ని
రి స ని ద ని - ని  
మ గ మ ద ద  గ మ మ రి గ స 

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం 
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం 
ద ని స రి స ని స
జతియుత గమనం
ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం 

భరతమైన నాట్యం - ఆ...
బ్రతుకు నిత్య నృత్యం - ఆ...
భరతమైన నాట్యం - ఆ...
బ్రతుకు నిత్య నృత్యం - ఆ...
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన 
తకిట తకిటతధిమి
ధిరన ధిరననన - నాట్యం
ధిరన ధిరననన 
తకిట తకిటతధిమి
ధిరన ధిరననన - లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం -ఝం
నర్తనమే శివకవచం - చం 
నటరాజ పాద సుమరజం - ఝం
ధిరనన ధిరనన 
ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ



ఓం నమశివాయ పాట సాహిత్యం

 
చిత్రం: సాగరసంగమం (1983)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

ఓం ఓం ఓం
ఓం నమశివాయ 
ఓం నమశివాయ 
చంద్ర కళాధర సహృదయా 
చంద్ర కళాధర సహృదయా 
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా

ఓం ఓం నమశివాయ 
ఓం నమశివాయ 

పంచ భూతములు ముఖ పంచకమై 
ఆరు ఋతువులు ఆహార్యములై
పంచ భూతములు ముఖ పంచకమై 
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడిచిన 
ఏడు అడుగులే స్వర సప్తతమై 

నీ దృక్కులే అటు అష్టదిక్కులై 
నీ వాక్కులే నవరసమ్ములై 
తాపస మందారా... 
నీ మౌనమే దశోపనిశత్తులై ఇల వెలయా

ఓం ఓం ఓం నమశివాయ

త్రికాలములు నీ నేత్రత్రయమై 
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై 
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమదాదులు 
నీ సంకల్పానికి ఋగ్విజవరులై 
అద్వైతమే నీ ఆది యోగమై 
నీ లయలే ఈ కాల గమనమై 
కైలాస గిరివాసా నీ గానమే 
జంత్రగాత్రముల శృతి కలయ

ఓం ఓం ఓం నమశివాయ
చంద్ర కళాధర సహృదయా 
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా




తకిట తధిమి పాట సాహిత్యం

 
చిత్రం: సాగరసంగమం (1983)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

తకిట తధిమి తకిట తధిమి తందానా
హృదయ లయల జతుల గతుల థిల్లానా
తకిట తధిమి తకిట తధిమి తందానా
హృదయ లయల జతుల గతుల థిల్లానా   

తడబడు అడుగుల తప్పని  తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన 
తడబడు అడుగుల తప్పని  తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన 
శృతిని లయను ఒకటి చేసి
     
తకిట తధిమి తకిట తధిమి తందానా
హృదయ లయల జతుల గతుల థిల్లానా
తకిట తధిమి తకిట తధిమి తందానా
హృదయ లయల జతుల గతుల థిల్లానా

నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీ కెందుకింత తపన  
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీ కెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా
తెలుసా మనసా నీకిది  తెలిసీ అలుసా
తెలిసీ  తెలియని ఆశల లాలలా లలలా
ఏటిలోని  అలలవంటి కంటిలోని కలలు కదిపి
గుండి యలను అందియలుగ చేసి

తకిట తధిమి తకిట తధిమి తందానా
హృదయ లయల జతుల గతుల థిల్లానా
తడబడు అడుగుల తప్పని  
తరిగిడ థోమ్ తరిగిడ థోమ్ తరిగిడ థోమ్
తడిసిన పెదవుల రేగిన  ఆ...ఆ...ఆ...
శృతిని లయను ఒకటి చేసి
తకిట తధిమి తకిట తధిమి తందానా
హృదయ లయల జతుల గతుల థిల్లానా

పలుకురాగ మధురం నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం  
పలుకురాగ మధురం నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగనాడినదే
అలకల కులుకుల అలమేల్మంగా
అలరులు కురియగనాడినదే
అలకల కులుకుల అలమేల్మంగా
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగుపాట
పల్లవించు పద కవితలు పాడీ

ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

తకిట తధిమి తకిట తధిమి తందానా
హృదయ లయల జతుల గతుల థిల్లానా
తడబడు అడుగుల తప్పని  తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన 
తడబడు అడుగుల తప్పని  తాళాన
శృతిని లయను ఒకటి చేసి

తకిట తధిమి తకిట తధిమి తందానా
హృదయ లయల జతుల గతుల థిల్లానా




వేదం అణువణువున నాదం పాట సాహిత్యం

 
చిత్రం: సాగరసంగమం (1983)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

గా... మా... నీ...   
గమగస మగస గస 
నీ...సా... నిదమగ
దమగ మగ సరీ సానీ
గమగనీ గమాగ మదామ దనీదని సానిరీ

వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై

వేదం వేదం అణువణువున నాదం

సాగర సంగమమే  ఒక యోగం
నిరసనిదమగా గదమగరిసనీ 
నిరిసనిదమగా మదనిసరీ
సగారి మగదమ గమద నిసాని 
దనిమద గమ రిగస

సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయె
ఆ  మధనం ఒక అమృత గీతం
జీవితమే చిరనర్తనమాయె
పదములు తామే పెదవులు కాగా
పదములు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగా

వేదం అణువణువున నాదం

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

మాత్రుదేవో భవా పిత్రు దేవో భవా
ఆచార్య దేవో భవా ఆచార్య దేవో భవా
అతిథి దేవో భవా అతిథి దేవో భవా
ఎదురాయె గురువైన దైవం
యదలోయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షిణై పోయె జీవం
నటరాజ పాదాన తల వాల్చనా
నయనాభి షేకాన తరియించనా
నటరాజ పాదాన తల వాల్చనా
నయనాభి షేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ
నిగమము భరతముగానా

వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై 

వేదం వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం వేదం వేదం వేదం
          
జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః
నాస్తిక్లేశాం యశః కాయే జరా మరణజం భయం
నాస్తి  జరా మరణజం భయం
నాస్తి  జరా మరణజం భయం




వే వేల గోపమ్మల పాట సాహిత్యం

 
చిత్రం: సాగరసంగమం (1983)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

వే  వేల గోపమ్మల 

Most Recent

Default