Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Neti Siddhartha (1990)



చిత్రం: నేటి సిద్దార్థ (1990)
సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: నాగార్జున , శోభన, అయేషా జుల్కా
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 15.06.1990

పల్లవి:
ఓసి మనసా... నీకు తెలుసా...
మూగ కనులా... ఈ గుస గుసా...
ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడీ
తనువంతా వేణువూదిందీ కన్నె ఊపిరీ
ఈ లావాదేవి ఏనాటిదీ... ఓ ఓ హో

ఓసి వయసా... ఇంత అలుసా...
నీకు తగునా... ఈ గుస గుసా...
మరుమల్లెల్లోనా పుట్టింది కొత్త ఆవిరీ
మసకేసే ముందే సాగింది గుండె దోపిడీ
ఈ గిల్లి కజ్జా ఏనాటిదీ... ఓహో హో హో

ఓసి మనసా.... నీకు తెలుసా...

చరణం: 1
నింగి నేలా వంగీ పొంగీ సయ్యాటాడే ఎందుకోసమో
చూపులో సూర్యుడే పండినా సందెలో
కొండాకోనా వాగూవంకా తుళ్ళింతాడే ఎంత మోహమో
ఏటిలో వీణలే పాడినా చిందులో
తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో
పసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకీ
సిరితీగ పాపా ఊగేది తీపి కాటుకే
అహ ప్రేమో ఏమో ఈ లాహిరీ
ఓ  హో హో అహా హా...

ఓసి వయసా... ఇంత అలుసా...

చరణం: 2
తుళ్ళి తుళ్ళి తూనీగాడే పూతీగల్లో ఎందుకోసమో
గాలిలో ఈలలా పూలలో తావిలా
హోయ్ మల్లిజాజి మందారాలా పుప్పొల్లాడే ఏమి మాసమో
కొమ్మలో కోయిలా రాగమే తీయగా
ఒడిలో అలజడిలే పెరిగే వేళలో
కనుపాపలాడుకుంటాయి కౌగిళింతల్లో
చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో
ఈడొచ్చాక ఇంతే మరీ
ఆహా... హా హా హా హా

ఓసి మనసా ... నీకు తెలుసా...
నీకు తగునా... ఈ గుస గుసా...
ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడీ
మసకేసే ముందే సాగింది గుండె దోపిడీ
ఈ లావాదేవి ఏనాటిదీ ఓ ఓ హో

ఓసి వయసా... ఇంత అలుసా...
ఓసి మనసా... నీకు తెలుసా...


*******  *******  ******

చిత్రం: నేటి సిద్దార్థ (1990)
సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, కవితా కృష్ణమూర్తి

ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్
నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా
హో...ఓ చుమ్మ కొట్టి పోతానమ్మా
నీ దమ్మె ఉంటే కొట్టాలమ్మా

నుదుటి గుమ్మం మీద కొట్టాక చుమ్మా
బుగ్గల్లొ పూసిందమ్మా సిగ్గమ్మ రెమ్మా
గుమ్మెత్తి పోయె ముద్దు గుమ్మా

ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్
నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా

కవ్విస్తా నవ్విస్తా కౌగిట్లో లవ్విస్తా
సందిస్తె విందిస్తె అందిట్లో లాగిస్తా
కవ్విస్తా నవ్విస్తా కౌగిట్లో లవ్విస్తా
సందిస్తె విందిస్తె అందిట్లో లాగిస్తా
కోలాద్యం గోవిందం
లాలబ్యం ఆనదం
మాటింక డేటె ఇంక ఇస్తా

నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా
ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్
ఓ...నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా
ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్

తిప్పేస్తా కొట్టెస్తా తిక్కొస్తే పక్కెస్తా
శ్రీరస్తా సుభమస్తా సిగ్గొస్తే తగ్గొస్తా
తిప్పేస్తా కొట్టెస్తా తిక్కొస్తే పక్కెస్తా
శ్రీరస్తా సుభమస్తా సిగ్గొస్తే తగ్గొస్తా
బుద్దోహం తగ్గొహం
బుద్దొహం తగ్గొహం
చుమ్మరో చక్కల్లడించేస్తా

ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్
ఓ...నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా
ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్
ఓ...నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా

నుదుటి గుమ్మం మీద కొట్టాక చుమ్మా
బుగ్గల్లొ పూసిందమ్మా సిగ్గమ్మ రెమ్మా
గుమ్మెత్తి పోయె ముద్దు గుమ్మా


*******  *******  ******

చిత్రం: నేటి సిద్దార్థ (1990)
సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, కవితా కృష్ణమూర్తి

నీవే కదా నా స్వీటు ఫిగరు
నీ కౌగిలే నా ప్రేమనగరు
మెచ్చానులే నీ కోడెపొగరు...
అచ్చా మిలా పాలల్లో షుగరు
సుందరం సుమధురం సుమశరం
ఇద్దరం కలవటం అవసరం

నీవే కదా నా స్వీటు ఫిగరు
నీ కౌగిలే నా ప్రేమనగరు
మెచ్చానులే నీ కోడెపొగరు...
అచ్చా మిలా పాలల్లో షుగరు

సుఖాలలో సుగంధం... మజాలలో మరందం
వయస్సు ఓ వసంతం.. చెలో చెలి దిగంతం
పదాలలో సరాగం.. పెదాలలో పరాగం
తడిపొడి తరంగం.. ఎద ఎద ప్రసంగం

డోరేమీలా జాజిలీ... సారిగామా జావళి
బాంబే హైవే లావలీ.. నీతో కలిసి పాడనీ

మెచ్చానులే నీ కోడెపొగరు...
అచ్చా మిలా పాలల్లో షుగరు
నీవే కదా నా స్వీటు ఫిగరు
నీ కౌగిలే నా ప్రేమనగరు

కథాకళి కదంలో మణిపురి కళల్లో
వయ్యారమే వరిస్తే మయూరిలా నటిస్తా
నిటారుగా నిలుస్తా... గిటారుతో కలుస్తా
శృతిలయా కలిస్తే.. సితారల్లే గెలుస్తా

నిజామరాలి బదలికా... ఇంటర్ ఖయాం లిమరికా
నీకు నాకు కలయికా.. హిందుస్తానీ అమెరికా

నీవే కదా నా స్వీటు ఫిగరు
నీ కౌగిలే నా ప్రేమనగరు
మెచ్చానులే నీ కోడెపొగరు...
అచ్చా మిలా పాలల్లో షుగరు
సుందరం సుమధురం సుమశరం
ఇద్దరం కలవటం అవసరం


*******  *******  ******


చిత్రం: నేటి సిద్దార్థ (1990)
సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, కవితా కృష్ణమూర్తి

గిరిలో లాహిరి... గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి

గిరిలో లాహిరి... గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి

పడుచుల పాటలే పనసల తెనెలై..
నడుమున ఊగినా గమకపు వీణలై

మగసిరి నవ్వులే గుడిసెపు దివ్వెలై
చిచ్చరి చిందుకీ సిరిసిరి చిందులై

ఈ కోనల్లో ఇంద్రధనస్సులు..
ఈ కోనల్లో ఇంద్రధనస్సులు..
కడకొంగులు దాటిన ఈ కన్నె సొగసులు
చాలిస్తే మేలు కదా సంధే వరసలు

గిరిలో లాహిరిలో.. గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి

కలిసిన కన్నులే కౌగిట వెన్నెలై..
వగలను పొంగినా పరువపు జున్నులై
మరువపు మల్లెలే మాపటి ఆశలై..
వదిలిన మత్తులో అలిగిన ఊసులై

మా గుండెల్లో సూర్యచంద్రులు...
మా గుండెల్లో సూర్యచంద్రులు...
మా కంటికి రెప్పలు ఈ మంచి మనసులు
మీరేగా వాల్మీకి శబరి గురుతులు

హేయ్.. గిరిలో లాహిరిలో.. గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి

గిరిలో లాహిరిలో.. గిరికోన పందిరి
గుళ్ళో దేవత వన దుర్గ వాసిరి

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి... ఒడి చేరే వయ్యారి జంటకి



Most Recent

Default