Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Hare Ram (2008)

చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:
నటీనటులు: కళ్యాణ్ రామ్ , ప్రియమణి
దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 18.07.2008

ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం..
పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం..
భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం..
ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం..

హరిలో రంగా హరి ఇదేం తమాషే..కారంగా వాడే జోడి తరవాత రాసే..
భాగోతం బాగుందా ఓ సరే సభాసే..ఐసే ఐసే ఒకటే దురుసే..
ఆనందో బ్రహ్మా అంటూ షికార్లు చేస్తే..అమ్మోరు పూనినట్టు ఈరంగమేస్తే..
ఎన్నాళ్లీ చోరా చోరీ తోచింది చేస్తే..చూస్తే గీస్తే మతే మటాషే..

జంట కుదిరిన జోషే..కంటపడితే వెంటపడక ఒంటి కలతో ఉంటదా..
నిష్ట చెదిరిన మనసే వింటదా చెబితే..
కత్తి పదునై కోసే..కొత్త చినుకు గుండె తొడుగుతుంటే కునుకు పడతదా..
నరం నరం నములు గరం గరం గుబులు..క్షణం క్షణం దిగులు ఇచ్చే అంటంతా..
అదో రకం తెగులు అయోమయం సెగలు..పుట్టించడం తగని పనే కదా..

లోకుల్లారా దీవిస్తే మీకే మేలంటాం..కాకుల్లాగా కవ్విస్తే 'కేర్ ఏ పిన్' అంటాం..
ఏం చేస్తారో మీ ఇష్టం మాకేం అనుకుంటాం...మున్ముందుకు పోతాం ఆగం మీ కోసం..

***********   ************   *******

చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:

సయ్యన్నారా సరదాగా సంగతి చెప్పుకుందాం
కాదన్నారా..ఎసేయి రా..సేయి రా అనుకుందాం..
అసలెందుకులే మీ అందరి ఒప్పందం..
వై...కాపేస్తే కంచెలు తుంచుకు పోతాం..
వై..ఆపేస్తే తప్పక తప్పుకు పోతాం..
వై..కోపిస్తె కొండల నుంచి కిందికి వచ్చి కిక్కున తుంచే కొంపలు ముంచే గోదారైపోతాం..
వై..ఆవారా గాలిని బంధిస్తారా..
వై..కెరటాలకు కొరడా చూపిస్తారా..
వై..గుప్పెట్లో నిప్పును పట్టి కప్పడమంటే ముప్పని ఎవరూ చెప్పక ముందే తెలిసిందే..

పొందేయ్ లాభం..మ్..మ్..మ్..

జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..
జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..

ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం..
పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం..
భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం..
ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం..

[జంట కుదిరిన జోషే]

జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..

*********   **********  ***********

చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:

నా న నానా నానానా..నా న నానా నానానా..నా న నానా నానానా..నా..నానానానా..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
పుట్టుకొచ్చే పిచ్చి..నువ్వు నచ్చి..పట్టుకొచ్చా మెచ్చి..పంచుకోవ లవ్ రుచి..
పట్టపగలే వచ్చి..బరితెగించి..పచ్చి వగలే తెచ్చి..వెంట రాకే కొంటెగా కవ్వించి..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..

ఒంటరి ఈడు కదా..తుంటరి తొందర ఉండదా..ఎందుకు ఈ బెడదా..తగునా..
అందుకు ఆడ జతా..తప్పక అవసరమే కదా..నువ్వది కాదు కదా..అవునా..
ఇంతలేసి కళ్లు ఉన్నా గంతలేసుక్కుచున్నావా..నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడుకుంటుందా..
బాప్ రే బాప్ తెగ బెదిరానే..నమ్మవేం చెబుతున్నా..గాభరా పడుతున్నానే..చాలదా..పులి కూనా..

ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..

దక్కిన చుక్కనిలా..తక్కువ చేయకు ఇంతగా..మక్కువ దాచకలా మదిలో..
కమ్ముకు రాకే ఇలా..తిమ్మిరి పెంచకె వింతగా..గమ్మున ఉండవెలా తెరవో..
ఆశపుడితే ..దాగుతుందా.. రాసకార్యం ఇన్నాళ్లుంటే..మూతపెడితే దాగుతుందా.. చాలు రాదది జోకొడితే..
క్యా కరే నాకేం దారి..నౌకరీ పోతుందే..పోకిరి వైఖిరి చాలే..ఛోకిరి వదిలెయ్వే..

ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
పుట్టుకొచ్చే పిచ్చి..నువ్వు నచ్చి..పట్టుకొచ్చా మెచ్చి..పంచుకోవ లవ్ రుచి..
పట్టపగలే వచ్చి..బరితెగించి..పచ్చి వగలే తెచ్చి..వెంట రాకే కొంటెగా కవ్వించి..
నా న నానా నానానా..నా న నానా నానానా..నా న నానా నానానా..నా..నానానానా..

*********   *********   **********

చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:

సరిగా పడనీ ఇపుడే తొలి అడుగూ
సుడిలో పడవై ఎపుడూ తడబడకూ
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరవనీ నీ కళ్ళు
కన్నఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
మన్ను తడి తగలాల్సిందే మునుముందుకు సాగాలంటే
కిందపడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
చలో చలో

నిన్నే చూసే అద్దం కూడా నువ్వా కాదా అనదా
అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా
సూర్యుడ్లో చిచ్చల్లే రగిలించె నీలో కోపం
దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుడ్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
కుందేలై అందంగా కనపడదా
నీలా నవ్వే క్షణాలలో

చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసీ
తొక్కే కాళ్ళే మొక్కేవాళ్లై దైవం అనరా శిలను కొలిచీ
అమృతమే నువు పొందూ విషమైతే అది నావంతూ
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు
కైలాసం శిరసొంచీ నీ ఎదలో ఒదిగే వరకూ
చలో చలో

**********   *********   **********

చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఊరికే ఉసూరుమంటావే ఊహకే ఉలిక్కిపడతావే
చక్కగా సలహాలిస్తావే తిక్కగా తికమక పెడతావే

రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా
రేయంతా వెలిగించీ రంగుల లోకాన్ని

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఎదురుగా పులి కనబడుతుంటే కుదురుగా నిలబడమంటావే
బెదురుగా బరువెక్కిందంటే మది ఇలా భ్రమపడుతుందంటే

గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే
కాలైనా పెట్టవుగా సందేహాలేవీ

ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

Most Recent

Default