Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bharateeyudu (1996)చిత్రం: భారతీయుడు (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: కె.జె. యేసుదాసు
నటీనటులు: కమల్ హాసన్, మనిషా కొయిరాలా, ఊర్మిళ, కస్తూరి, సుకన్య
దర్శకత్వం: శంకర్
నిర్మాత: ఏ. యమ్. రత్నం
విడుదల తేది: 1996

తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే  తందానానే తానానే ఆనందమే

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియా
వయసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరుజన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు


********   *********   ********


చిత్రం: భారతీయుడు (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి.బాలు, సుజాత

తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తై దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా...
ఇంటి వాకిలి వెతికి...
ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో మరిగే శోకం అంతా
నేడు...॥

చరణం: 1
వన్నెల చిన్నెల నీటి ముగ్గులే
బుగ్గపై కన్నులే వేయ
ఇంకను తప్పదా పోరాటం
ఈడ నే ఆడ ను పోరాడ
నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
నేనో నదిని చినుకై రావా
అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటినే నేడు..

చరణం: 2
నేస్తమా నేస్తమా నీకోసం
గాలినై వచ్చినా నేడు
పువ్వులో తేనెలా నీరూపం
గుండెలో దాచినా చూడు
నీ కాలికి మట్టినై తోడువుండనా
కనుపాపకి రెప్పలా కావలుండనా
ఆశనై కోరి శ్వాసనై చేరి
కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా నేడు..************  ***********   *************


చిత్రం: భారతీయుడు (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: హరిహరన్, హరిణి

టెలిఫోన్ ధ్వని లా నవ్వే దానా..
melbourne మెరుపుల మెరిసే దానా..
digitalalo చెక్కిన స్వరమా..
elizibeth taylor తరమా..
జాకీర్ హుస్సేన్ తబలా నువ్వేనా..ఆ..
సోనా సోనా నీ అందం చందనమేనా..
సోనా సోనా నువ్వు లేటెస్ట్ cellular phone ఆ..
కంప్యూటర్ తో నిన్ను ఆ బ్రహ్మమే మలిచేనా..


చరణం: 1
నువ్వు లేని నాడు ఎండే ఉండదు లే..చిరు చినుకే రాలదు లే..
నువ్వు లేని నాడు వెన్నెల విరియదు లే..నా కలలే పండవు లే..
నీ పేరు చెబితే శ్వాస పెదవి సుమ గంధమౌను చెలి..
నువ్వు దూరమైతె వీచే గాలి ఆగిపోవునులే..
నువ్వు లేకపోతే ఝరులే ఉండవు లే..కొండకి అందం ఉండదు లే..
నువ్వు రాకపోతే ప్రాణం నిలువదు లే..వయసుకి ఆకలి పుట్టదు లే..
నీవే నదివై నను రోజు నీలో ఈదులాడని..
సిగ్గేస్తుంటే నీ కురులతో నిన్నే దాచేసుకో..


చరణం: 2
నీ పేరు ఎవరు పలుకగా విడువను లే..ఆ సుఖమును వదలను లే..
నీ జళ్ళో పుఉలు రాలగ విడువను లే..ఆ ఎండకు వదలను లే..
ఏ కన్నె గాలి నాదే తప్ప నిను తాకనివ్వను..
ఏనాడు నిన్ను mother theresa తో తప్ప పలుకనివ్వను..
నువ్వు వెళ్ళే దారి పురుషులకొదాలను లే..పర స్త్రీలను విడువను లే..
నీ చిలిపి నవ్వు గాలికి వదలను లే..ఎద లోయలో పదిలము లే..
షోరూముల్లో స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను..
ఈ చేతితో కలలో సైతం నిను దాటనివ్వను..


***********  ***********   *************


చిత్రం: భారతీయుడు (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి.బాలు, స్వర్ణలత

మాయా మశ్చింద్రా మచ్చని చూడ వచ్చావా
మాయలే చేసి మోసం చెయ్యకు మహవీరా
మన్మధ కళలన్నీ మచ్చాల్లోనే పుడతాయే మేస్త్రి కామశాస్త్రి
మైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే రాతిరి రెచ్చి పోకిరి
సుకుమారి సుకుమారి ఇంద్ర లోకపు వయ్యారి
వస్తానే వలపందిస్తానే
జడపట్టి మగధీరా తొడగొట్టి రణదీరా
డమ్మురా నీదే సుందరా
ఉడుకెత్తే నడిరేయి ఓడికొస్తే యమహాయి
కిన్నెరా కొట్టేయ్ కంజిర

చరణం: 1
ఉడికించే సందిట్లో ఒకటైతే ఒళ్ళంతా
తకధిమి తకధిమి తాళం
ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై
సరిగమలే పలికించేయదా తాపం
పంచుకుంటే తీయని తేనె తరిగేదేమి
ముద్దుతోనే చక్కర రోగం వస్తేనేమి
దినము తకధిమి కొడదామా
తడిగా పొడిగా చెడదామా
కిచ్చిడి సొం పాపిడి
చేలో దిగితే చిలకమ్మా మీనం మేషం అవసరమా
మెక్కరా నీదే లక్కురా

చరణం: 2
అబ్బా నా పేరేదో నేనుండే ఊరేదో
సోద మరిచి నిన్నే అడిగా నేస్తం
పిల్లా నా పాటేదో నేనాడే మాటేదో
మతి మరిచి తపియిస్తోందే ప్రాణం
కౌగిలించుకున్న వేళ పశ్నేంటయ్యా
కామశాస్త్రం నేర్పించేయ్రా తస్సాదియ్యా
ఇలలో కలగా ఉందామా కరిగే కవితై పోదామా
అందమా తేనె గంధమా
వలపై ఒడిలో కలిసామా
లోకం మనమే అయిపోమా
మన్మధా రారా తుమ్మెద

Most Recent

Default