చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి.బర్మన్, మణిశర్మ, యం.యం.కీరవాణి
నటీనటులు: నాగార్జున, ఊర్మిళ మతోండ్కర్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: కె.ప్రసాద్
విడుదల తేది: 11.09.1992
Songs List:
ఓ మైనా నీ పాట సాహిత్యం
చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
ఓ మైనా నీ గానం నే విన్నా
ఎటు ఉన్నా ఏటవాలు పాట వెంట రానా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
లాల్లలలల్లల్లా లాలలాలలలల్లల్లా
లలలాలాలాలాలాలా...
ఎవరైనా... చూశారా ఎపుడైనా
ఉదయానా... కురిసే వన్నెల వానా హో
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా
నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నన్నేనా... కోరుకుంది ఈ వరాల కోనా హో
ఏలుకోనా కళ్ళ ముందు విందు ఈ క్షణానా హో
సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుకా
వనమంతా చూపించగా
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక
వివరించు ఇంచక్కగా
సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక
వనమంతా చూపించగా
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక
వివరించు ఇంచక్కగా
ఈ కారుణ్యంలో నీ రెక్కే దిక్కై రానా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా
ఆహహహహ్హహ్హా ఓహోహోహోహోహ్హోహ్హో
లలలాలా హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
డూడుడుడుడుడూ ఓహోహొహొహొహొహోహో లలలాలాలాలాలాలా...
నీ నవ్వు చెప్పింది పాట సాహిత్యం
చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి.బర్మన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ..లాలలాల.... ఓ..లాలలాల..
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ...
ఓ.. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు నీ
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
హా... ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యెందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
హాఅ...లాలలాల..హాహ..లాలలాల..
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
చలెక్కి ఉందనుకో పాట సాహిత్యం
చిత్రం: అంతం (1992)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, జోజో
పల్లవి:
చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మనుకో
చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావ
వలేస్తానంటావో ఇలాగే వుంటావో
చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మనుకో
చరణం: 1
చీకటుందని చింతతో నడిరాతిరి నిదురోలేదుగా
కోటిచుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా
చీకటుందని చింతతో నడిరాతిరి నిదురోలేదుగా
కోటిచుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా
నలుదిక్కులలో నలుపుందనుకో చిరునవ్వులకేం పాపం
వెలుగివ్వననీ ముసుగేసుకొనీ మసిబారదు ఏ దీపం
చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మనుకో
చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో
వలేస్తానంటావో ఇలాగే వుంటావో
చరణం: 2
కారునల్లని దారిలో ఏ కలలకోసమో యాతన
కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోనా
కారునల్లని దారిలో ఏ కలలకోసమో యాతన
కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోనా
కలలన్నిటినీ పిలిపించుకొని నిలవేసినా కళ్ళనీ
నెమరేసుకోని వెళ్ళీపోకుమరీ విలువైన విలాసాన్నీ
చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మనుకో
చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో
వలేస్తానంటావో ఇలాగే వుంటావో
చలెక్కి ఉందనుకో ఏ
ఎంత సేపైనా పాట సాహిత్యం
చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
పల్లవి:
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా లా ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా లా ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో
పాపర పా... పా... పాపర పా ...పా...
పాపర పా... పా... పాపర పా ...పా...
చరణం: 1
ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా ఆహా అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వెయ్యిమందున్నా ఓహో ఒక్కదాన్నే వేగిపోతున్నా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఎట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఎట్టాగె ఎదురీదనా
ఏలుకోడేవి నా రాజు చప్పునా హ హా
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
జు జు ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో
చరణం: 2
హా తోడులేని ఆడవాళ్ళంటే లా ల కోడేగాళ్ళ చూడలేరంటా
తోడేళ్ళే తరుముతూ ఉంటే తప్పుకోను త్రోవలేకుందే లా ల ల
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఏవిలాభం గాలితో చెప్పుకుంటే
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా లా ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో
గుడెల్లో ధడ ధడ పాట సాహిత్యం
చిత్రం: అంతం (1992)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, యస్. పి. బాలు
పల్లవి:
గుండెల్లో దడదడ దడ లాడే ఉరుములతో
కళ్ళల్లో భగ భగ భగ మండే మెరుపులతో
ల ల ల లా ల లా
ఊహల్ని ఉప్పొంగించే ఒత్తిడి చిత్తడి
మబ్బుల్ని మత్తెకించే సుడిగాలి
కొండల్ని ఢీకొట్టించే అల్లరి ఆవిరి
దిక్కుల్ని దిమ్మెక్కించే తొలకరి
గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో
చరణం: 1
వెన్నెలంటే వెండి మంటే
వెన్నెలంటే వెండి మంటే నిజమిదీ నమ్మవూ
కన్నులుంటే నన్ను కంటే రుజువులే కోరవూ
ఆ..ఆ..ఆ..ఆ..
చీకట్లో జ్వలించిన చుక్కలా చేరునా
ఏకాకి ఏకాంతంలో కలిసేలా
గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో
చరణం: 2
నిప్పు చెండై చుట్టుకుంటే
నిప్పు చెండై చుట్టుకుంటే కరగడా సూర్యుడు
మంచు మంటై ముట్టుకుంటే మరగడా చంద్రుడు
ఆ..ఆ..ఆ..ఆ..
గంగమ్మ ఆయువునే తాగినా తగ్గునా
సంద్రాన్ని ఆటాడించే చేడు దాహం
గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో
ఊహలేవో రేగే.. పాట సాహిత్యం
చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, కవితాకృష్ణమూర్తి
హే...ఊహలేవో రేగే
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా
హో పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
ఇదివరకెరగని దిగులును దిగనీవా
నిలువున రగిలిన నిగనిగ నీడేగా
మెలికలు తిరిగిన మెరుపై దిగినావా
కుదురుగా నిలవని కులుకుల తూనిగా
ఓ..కోరివస్తా కాదు అనుకోకా...
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
హో ఎందుకు ఏమిటి అడగని గొడవేగా
ఓడేదాకా వదలని ఆటేగా
ఓ..గుసగుసవేడికి గుబులే కరుగునుగా
కుశలములడుగుతూ చెరిసగమైపోగా
హో..ఒకరికొకరం పంచుకుందాం రా...
పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
హే... ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా...
లలలాల.. లాలలాలా.. లలలాలా
అ.ఆ...లాలలాలలాలా లాలలాలలలాలా