Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Andarivaadu (2005)
చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, టబు, రిమీ సేన్
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 04.06.2005Songs List:హో పడుచు బంగారమ పాట సాహిత్యం

 
చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: మల్లికార్జున్ , సుమంగళి

హో పడుచు బంగారమ పలకవె సరిగమ
చిలిపి శృంగారమ చిలకవె మదురిమ
మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం
నిను చూసె తరుణంలో తనువంత బృందావనం...
నీ చెంత నే వాలి చెప్పుకొవాలి నువ్వు కావాలని
నిను చేరుకొవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని

అరె ఏలొ ఏలొ ఏలొ ఈ ఎన్నెల్లో
ఎండలేంటి హొయిలాలో
అరె నీలొ నాలొ లోలో
వేడి పుట్టింది ఈడు గాలిలో హొయ్

హో నా కలలో తొలిగ మలిగ చలిగ గిలిగ
కలిగె వలపే ని కంటి కాటుతో
నా ఎదలో సొదగ రొదగ అదిగ ఇదిగ
ఎదిగె తలపే నీ పైట వేటుతో
చెమ్మ చెక్క రోజునుంచి బుగ్గ చుక్క రోజు దాక
ఇంత మోజు దక్కలేదు ఏంటంట
నన్ని నువ్వు రాజుకుంటె లోన నిప్పు పుంజుకుంటె
మోజు రాక ఉరుకుంటదా...
ఒలికేటి వయ్యర మంట మొయ్యాల నేటి సయ్యాటకి
పద కొంటె కయ్యాల జంట ఉయ్యాలలూగాలి ఈ రేయికె

అరె ఏలొ ఏలొ ఏలొ ఈ ఎన్నెల్లో
ఎండలేంటి హొయిలాలో
అరె నీలొ నాలొ లోలో
వేడి పుట్టింది లేత ఈడులొ హొయ్

హో పడుచు బంగారమ పలకవె సరిగమ
హో చిలిపి శృంగారమ చిలకవె మదురిమా

ఈ కథలొ పగలె వగలె పొగల సెగల
రగిలే సరిగ సరసాల వేలలో
నీ జతలొ లతగ సతిగ రతిగ అతిగ
వతినే మరిచా మునిపంటి గోలలో
కల్లబొల్లి మాట దాటి అల్లిబిల్లి ఆట తోటి
అల్లుకున్న అశ తీరదేంటంట
బెల్లమంటి బుల్లి గుంట కల్ల ముందు
జల్లు మంటె ఆశ కంటు అంతు ఉంటదా
కొల్లెటి కోటల్లొ కొటి ఘాటుల్లొ వాటమె ఉందిలె
ఈ మంచు మీటుల్లొ మబ్బు చాటుల్లొ
మొమాటమె వద్దులె

అరె ఏలొ ఏలొ ఏలొ ఈ ఎన్నెల్లో
ఎండలేంటి హొయిలాలో
అరె నీలొ నాలొ లోలో
వేడి పుట్టింది ఈడు గాలిలో హొయ్

హో పడుచు బంగారమ పలకవె సరిగమ
హో... చిలిపి శృంగారమ చిలకవె మదురిమ

అమ్మమ్మ నీ మీసం పాట సాహిత్యం

 
చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: కల్పన, ఉదిత్ నారాయణ్ 

అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే
అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే
అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే
నా సొంపుల్లోని జింగిళ్ళన్నీ నీవేలే
నా ఓంపుల్లోని అందాలన్నీ నీకేలే
నువ్ ఓరకంటితోన ఒక్కసారి చూడ
నోరు నాకు ఊరిపోయే హయ్యయ్యయ్యయో
గుండె షక్కు రప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్లా ఓ
ఉండనీక చంపుతుంది నీ ఊపు ఓ ఓరయ్య హో
ఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓ

అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే
ఓయమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే నే నే నే

నిన్నొక్క పూట చూడకుంటే కంటినిండా
నాకొక్కపొద్దే ఒంటి నిండా
ఆ బుగ్గ నీకు ఉట్టి మీదకెక్కకుండా
ఓ ఓ నే దించుతానే మంచుకొండ
చెయ్యే నీది పట్టుకుంటే, వడ్డాణంలా చుట్టుకుంటే
వెయ్యేళ్ళైనా కవ్వింతే నీ ప్రేమ
ఒళ్ళో నిన్ను పెట్టుకుంటా, ఒళ్ళు ఒళ్ళు చుట్టుకుంటా
మళ్ళి మళ్ళి తుళ్ళింతివ్వే భామ
లంగరేసి లాగుతుంది నీ పొగరు ఓ ఓరయ్య హో
హే కొంగు దాడి చెయ్యమంది నీ వగరు ఓ ఓ పిల్లా ఓ
ఓ ఓరయ్య హో ఓరయ్య ఓ ఓ ఓ ఓ ఓ

అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే
అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే

హే ఒక్కరోజు ముద్దు నీకు మరవకుండా
నే చుక్క పొద్దు వేళకొస్తా
హే నీ రాక వేచి సిగను ముడిచి మల్లె దండ
నే దిండు పక్క సదురుతుంటా
హే చలిగా నీతో రివ్వుమంటూ, నులక మంచం జివ్వుమంటూ
గిలక మువ్వే మొగిస్తా ఈ పూట
వచ్చేదాకా ఆశై ఉంటూ, రెచ్చేదాకా సై సై అంటూ
ఇచ్చేదాకా అందిస్తా నా పైట
హే వచ్చానంటే వరసేనంటా రేయంతా ఓ ఓ పిల్లా ఓ
అ... నచ్చిందంతా నీకే ఇస్తా రమ్మంట ఓ ఓరయ్య హో
ఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓ

అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే
అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే
నా సయ్య సయ్య శంకర్ దాదా నువ్వేలే
నా వయ్యారాల చక్కర కాజా నీదేలే
నువ్ ఓరకంటితోన ఒక్కసారి చూడ
నోరు నాకు ఊరిపోయే అయ్యయ్యయ్యయో
గుండె షక్కు రప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్లా ఓ
ఉండనీక చంపుతుంది నీ ఊపు ఓ ఓరయ్య హో
ఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓహోయ్ కోడి కూర చిల్లు గారి పాట సాహిత్యం

 
చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి 
గానం: కజాస్సి గిఫ్ట్, మాలతి లక్ష్మణ్

పల్లవి:
హోయ్ కోడి కూర చిల్లు గారి హోయ్
హోయ్ కోడి కూర చిల్లు గారి కోరి వడ్డించుకోవె ఒక్కసారి
కోడి కూతే ఆపు చేస్తా నీ పక్కలోకి దూరి

హే పప్పు చారు ఉప్పు చేప ఇందా అందించుకుంది కన్నెపాప
ఎప్పుడంటే అప్పుడంటూ ఏసేయ్ నీ తుంగ చాప

ఇప్పసారలో ఉప్పి కూరలా ఇట్టా నీ నడుమునింక ఇరగదీయనా
ఉలవ చారులో ఎన్న ముద్దలా ఉడుకే తగ్గిస్తూ చలువ ముద్దులియ్యనా
అబ్బోలాంటి అందంలోన ప్రాయాల పర్వముందిరో

ఏయ్ తందూరి కన్నె చుక్కరో కొరుక్కుతింటే గోంగూర మటన్ ముక్కరో యమ్మ
హా కుర్రోడు గొబ్బ ఇగురులే కుమ్మేసుకుంటే రొయ్యల్లె చింత చిగురులే

హే కోడి కూర...య య య య
కోడి కూర చిల్లు గారి కోరి వడ్డించుకోవె ఒక్కసారి
కోడి కూతే ఆపు చేస్తా నీ పక్కలోకి దూరి
హే పప్పు చార ఉప్పు చేప ఇందా అందించుకుంది కన్నెపాప
ఎప్పుడంటే అప్పుడంటూ ఏసేయ్ తుంగ చాప హేయ్

చరణం: 1
హే బొమ్మిడాయ చేప పులుసులా పట్టుకుంటే జారిపోకలా
వరద నీటిలో పులుసు చేపలా వరస నాతో కలిసిపో ఇలా
హే వేడి వేడి గుడ్డు పగటులా ఈడు కుంపటెట్టపోకిలా
లేత ఉడుములా లివరు కూరలా ఉడుకు నాకు ఎక్కతాందిరా
హే నిప్పుకోడి చీకు ముక్క..
నిప్పుకోడి చీకు ముక్కలా నా పక్కకొచ్చి లిప్పు రుచులు ఇచ్చుకో ఇలా
పొయ్యి మీద పీత కూరలా నీ మక్కువంతా పట్టె మంచమెక్కనీ అలా... బాసు

హే కోడి కూర...రా రా రా రా
కోడి కూర చిల్లు గారి కోరి వడ్డించుకోవె ఒక్కసారి
కోడి కూతే ఆపు చేస్తా నీ పక్కలోకి దూరి
పప్పు చారు ఉప్పు చేప ఇందా అందించుకుంది కన్నెపాప
ఎప్పుడంటే అప్పుడంటూ ఏసేయ్ నీ తుంగ చాప

చరణం: 2
ఏయ్ ఇంత పెద్ద ఖైమ ఉండలే ఉట్టి మీద దాచినానులే
నాటు జింకలా మీదకొస్తివా నోటికింక ఇచ్చుకుంటలే
ఏయ్ గుడ్ల మీద కౌజు పెట్టనే రోజూ తెచ్చి వండమంటలే
జీడిపప్పులా చిగురుబబ్బులో జిలకరంతా చిలకరిస్తాలే
హేయ్ కోది కూర సంగటల్లె...
కోది కూర సంగటల్లె నా కొంగుపట్టి పొంగులన్నీ లొంగతీయరో హోరయ్యో
అడవి బాతు వేపుడల్లె ఒడియామి ఎట్టి అందమంతా లంగరెయ్యరో

కోడి కూర...
కోడి కూర చిల్లు గారి కోరి వడ్డించుకోవె ఒక్కసారి
కోడి కూతే ఆపు చేస్తా నీ పక్కలోకి దూరి
హే పప్పు చారు ఉప్పు చేప ఇందా అందించుకుంది కన్నెపాప
ఎప్పుడంటే అప్పుడంటూ ఏసేయ్ నీ తుంగ చాప ప ప ప ప
అందరివాడు పాట సాహిత్యం

 
చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అండ్రియ జరేమియా 
గానం: అండ్రియ జరేమియా 

అందరివాడు ఒకటి రెండు మూడు… పాట సాహిత్యం

 
చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్ , గ్రేస్ కరుణాస్

హే వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా, గోవింద
హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా
గ్రేటాది గ్రేటుడా, గోవింద

హే ఒకటి రెండు మూడు… ఈ గోవిందుడందరివాడు
హే ఒకటి రెండు మూడు… ఈ గోవిందుడందరి వాడు
నాడు నేడు ఎపుడూ… నమ్మింది చేస్తుంటాడు
వింటాడు గోడు, ఓఓ ఓ… ఉంటాడు తోడు, ఓఓ ఓ
హే గుండెల్లో లోడు, ఓఓ ఓ… తగ్గించుతాడు, ఓఓ ఓ

హే టెన్షన్లు తెప్పించి… ఫంక్షన్లు పెట్టిస్తే, జంక్షన్లో జామ్ అవుద్దిరో
హే వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిందు వెయ్
అరె చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చిత్తు చెయ్
హే ఒకటి రెండు మూడు… ఈ గోవిందుడందరి వాడు
నాడు నేడు ఎపుడూ… నమ్మింది చేస్తుంటాడు

హే వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా, గోవింద
హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా
గ్రేటాది గ్రేటుడా, గోవింద

హే పరిత్రాణాయ సాధునాం… వినాషాయ చ దుష్కృతాం
ధర్మ సంస్తాపనార్ధాయ సంభవామి యుగే యుగే
అచ్చ తెలుగులో సెలవిస్తా… రెచ్చినోడినిక తొలగిస్తా
స్విచ్చు నొక్కితే పెనుగిస్తా… లోకమంతా సుఖే సుఖే

బాసు బాసు బాగుంది బాసు… అరె నీలో ఫోర్సు ముందే తెలుసు
హెయ్ బాసు బాసు ఢంకా పలాసు… వాడాలంది ఆడ సొగసు
బాసు బాసు బత్తాయి జ్యూసు… వస్తే ఇస్తా బోనస్సు
హే ఒకటి రెండు మూడు… ఈ గోవిందుడందరి వాడు
నాడు నేడు ఎపుడూ హే నమ్మింది చేస్తుంటాడు

హే సిమెంట్లోన తగు ఇసకేసి… పునాదుల్లో అది నింపేసి
ఇటుకపై ఇటుక పెట్టేస్తే… అందమైన గృహే గృహే
మనసుపై ముసుగు తీసేసి… మమతనే దాన్ని జతచేసి
మనిషిగా మనిషి బ్రతికేస్తే… జీవితాన్ని జయే జయే

మేస్త్రీ మేస్త్రీ మెచ్చాను మేస్త్రీ… అరే నీకే నీకే పండు పత్రి
హే మేస్త్రీ మేస్త్రీ నచ్చావు మేస్త్రీ… నువ్వే నువ్వే ప్రేమ మంత్రి
మేస్త్రీ మేస్త్రీ కోరింది ఇస్త్రీ… సోకు సోమ్ము ఇస్తిరి

హే ఒకటి రెండు మూడు… ఈ గోవిందుడందరి వాడు
నాడు నేడు ఎపుడూ అరె నమ్మింది చేస్తుంటాడు
వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా గోవింద
హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా
గ్రేటాది గ్రేటుడా గోవింద
FTV చిరంజీవి పాట సాహిత్యం

 
చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె , సునీత సారథి

FTV చిరంజీవి

Most Recent

Default