Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Abhimanam (1960)
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రి, కృష్ణకుమారి
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాతలు: టి.అస్వదనరాయణ, సుందర్ లాల్ నహత
విడుదల తేది: 26.08.1960Songs List:తల్లిని మించిన పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: జిక్కి

తల్లినిమించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా
చల్లని తల్లి దీవెనలున్న - ఇల్లే స్వర్గముగా

చేరగ వచ్చే లేగను చూచి కోరిక తీరగా దరి చేరగ ....
కడు తీయని పాలు త్రాగించి మురిసే గోమాత మా జననీ 

తీగల నిండి పూచిన మల్లి పూవుల తావితో ఎల తీగల ....
అనురాగము లొలికి ఆనంద మొసగే - భూమాత మాజననీ

ఇంటను వెలసి కంటను మెరిసే ఈ తులసీ సతి - మా ఇంటను.....
కలకాలము బ్రోచి కష్టాలు మాపి - పాలించు మా జనని 
పద పదవే పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, కె.జమునారాణి 

పద పదవే ఊయలలూగీ నా హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి.సుశీల

ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే
తీయని పాట పాడేనే ఊయలలూగీ నా హృదయం
తీవలతో సరాగాల తేలీ, పూవులతో సయ్యాటాడె గాలీ
తీవలతో సరాగాల తేలీ, పూవులతో సయ్యాటాడె గాలీ
ఎలమావి చేరీ చివురాకు మేసీ
ఎలమావి చేరీ చివురాకు మేసీ
కోయిల చనవుగ కూసేనే

రాగసుధాతరంగాల డోలా వేడుకలా విహారాల వేళా
రాగసుధాతరంగాల డోలా వేడుకలా విహారాల వేళా
చిన్నారి చెలియా విన్నాణమరయా 
చిన్నారి చెలియా విన్నాణమరయా 
నా మది పరవశమాయేనే 

ఆ...
దయగల తల్లిని పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి.సుశీల 

దయగల దల్లికి మించిన దైవం వేరే లేదురా
ఎన్ని లోకముల వెదకి చూచినా లేనే లేదురా
అప్పులపాలై ఆస్తులు పోయీ - నాయనువారే కరువైనా
చెట్టు విడిచినా పక్షివిధానా కాలం గడిపేనా
కుటుంబ బాధల కృంగి కృశించి - జీవితాశయే దిగజారీ
అన్యాయంగా నిండు ప్రాణమును ఆహుతి జేనేనా
మాతృదేవతను మన్ననజేసే పువ్వులతోను పూజించీ
అభిమానంతో కొలిచే భాగ్యం అందరి కబ్బేనా
గర్భవాసమున కని పెంచీ - ముద్దు ముచ్చటా లాలించి
చదువు సాములా చెప్పించి - సర్వము నీవని భావించి
జననికి సాటెవరూ

కొడుకు కోసమై త్యాగం చేసి కొడుకు క్షేమమే ఆశించీ
ఆనందమ్మున అసువుల వీచీ - తల్లుల మరిచేమా
మదిని నిన్ను పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, జే.వి.రాఘవులు  

మదిని నిన్ను మధురానగరిలో పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: పి.సుశీల 

తే॥ గీ॥ 
కొంగు లాగెదవేలరా కొంటెకృష్ణ:
కొంగు చాటున కలరులే దొంగవారు
దోస మొనరించు వారిని త్రోసిపుచ్చి
ఏమి నేరని వారిని ఏచతగునే

మధురా నగరిలో చల్లనమ్మ పోదు - దారి విడుము కృష్ణా
(ప్రాచీనం) మాపటి వేళకు తప్పక వచ్చెన - పట్టకురా కొంగు గట్టిగాను కృష్ణా
కొసరి కొసరి నాతో సరసము లాడకు - రాజమార్గమిది కృష్ణా!
ప్రజవనితలు నను చేరగ వత్తురు - విడువిడు నా చెయ్యి కృష్ణా

చెక్కిలిపై నొక్కులేమె చెల్లెలా - చెదెరెనేమొ ముంగురులు చెల్లెలా!
పయ్యెద పైనా కమ్మ కస్తూరీ తిలకమేమె చెల్లెలాః
జారుసిగలో జాజిపువ్వెలూ వాడినవేమె చెల్లెలా
అల్లన చేరె నల్లని వాని తొలి వలపూ చిన్నెలటే చెల్లెలా!
ఓహొ బస్తీ దొరసాని పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల
గానం: ఘంటసాల, జిక్కీ

ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని

ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్ ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్ ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది
అందచందాల వన్నెలాడి అయినా బాగుంది

ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని

కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది
మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది
హాయ్ కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది
మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది
హాయ్ ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది
అందచందాల వన్నెలాడి కోపం పోయింది

ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని

పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
హాయ్ పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
హాయ్ చివరకు చిలిపిగ నవ్వింది, చేయి చేయి కలిపింది
అందచందాల వన్నెలాడి ఆడి పాడింది

ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని
ఓహొ బస్తీ దొరసాని
ఓహొ బస్తీ దొరసాని

రామా ఇది ఏమి పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: జి.వరలక్ష్మి 

రామా రామా ఇది - యేమి కన్నీటిగాధ
లేనపుడె తన వాని విలువ - మానవులకు తెలిసేను
ఆపదలో పతి దూరము కాగా వేదనలే మిగిలేను
తొందరపాటు ఎందుకు దేవా సృజియించేపూ లోకానా
కోరుకొని వివాహమాడె కూరిమియె కరువాయె
ఆరినదా అనురాగ జ్యోతి - ఓరిమియే నలుసాయె
నేరని అబల నేరము చేయ - కలవర మాయె కాపురము
వలపు తేనెపాట పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, జిక్కి

వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
వలపించె వలపు తోట ?? ప్రేమ పసిడితోట
ఓ, ఒహొహో ...

కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాశ
నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాశ
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాశా
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాశా

వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట


Most Recent

Default