Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kalavaramaye Madilo (2009)


చిత్రం: కలవరమాయే మదిలో (2009)
సంగీతం: శరత్
సాహిత్యం: వనమాలి (All)
నటీనటులు: కమల్ కామరాజు, స్వాతి రెడ్డి
దర్శకత్వం: సతీష్ కాశెట్టి
నిర్మాత: మోహన్ వడ్లపట్ల
విడుదల తేది: 17.07.2009








చిత్రం: కలవరమాయే మదిలో (2009)
సంగీతం: శరత్
సాహిత్యం: వనమాలి
గానం: హరిహరన్, కల్పన

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే.. రానీ
నేనంటూ ఇక లేనని నీ వెంటే వున్నానని చాటనీ
చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నా లోకాన్ని 
నీ వాణ్ణి

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే.. రానీ

మారాము చేసే మా రాణి ఊసే
నాలోన దాచానులే...
గారాలు పోయే రాగాల హాయే
నా గుండెనే తాకేనే..

నీ కొంటె కోపాలు చూడాలనే
దోబూచులాడేను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే.. రానీ

నీ నీడలాగ నీతోనే వున్నా నీ జంట నేనవ్వనా
వేరేవ్వరున్న నీ గుండెలోన నా కంట నీరాగునా
ఆ తలపు నా ఊహ కే తోచునా
నా శ్వాస నిను వీడి జీవించున
నీ కంటి పాపల్లె నే లేనా 

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే.. రానీ
నేనంటూ ఇక లేనని నీ వెంటే వున్నానని చాటనీ
చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నా లోకాన్ని
నీ వాణ్ణి 







చిత్రం: కలవరమాయే మదిలో (2009)
సంగీతం: శరత్
సాహిత్యం: వనమాలి
గానం: కె. ఎస్. చిత్ర

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ

పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా
ప్రణమిల్లి పాడనీ నా హృదయ స్పందనం
ఒక తండ్రి కలలకే సాకారముగా

జన్మను పంచిన జననీ జనకుల
ఆలనలే ఆలాపనగా
అనురాగములే ఆలంబనగా

పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా

నిప్పులలో నడిచింది నిన్నటి ఓ సీత కథ
ఆరని మంటయ్యింది ఒంటరి నా అమ్మ కథ
కడుపు తీపినే పెంచాయేమో
తను మోసిన నవ మాసాలు
కడకు భర్తనే కాదని తానే గడిపిందా వనవాసాలు

శిలనైనా కరిగించే సామవేద సంగీతం
పచ్చని ఆ దాంపత్యానికి పాడిందొక చరమ గీతం
ఏనాటికి ముడి పడుతుందో ఏడడుగుల ఈ సంబంధం
విడదీసిన ఏడు స్వరాలే కలిపేనా ఆ అనుబంధం

గగస రిరిగ ససప దదప
రిగపగస గపదసరి పదసరి

పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా

మురిపాలను తాగినదమ్మా
నీ ఒడిలో ఈ పసి ప్రాణం
సరిగమలను నేర్పినదమ్మా
నాన్నలోని అమృత గానం

తప్పటడుగులేసిన నిమిషం
తల్లి చాటు తనయే అయినా
తాళగతిని వీడని లక్ష్యం
తండ్రి వెంట నడిపించింది
గురువే... 
గురువే నా తండ్రిగా మారి
కన్న గురుతు చూపిస్తుంటే
జాలిలేని ఆ విధిరాతే
తననే బలి పెడుతూ ఉంది

ఆ మృత్యువు రాతి గుండెని
నా గానం కరిగిస్తుందా
చెదిరిన మమ గూటికి చేర్చి
తన ప్రాణం నిలబెడుతుందా

రీరీరి సరీరి సరిగగ రిరిసద
సదాప గపదప గరి
రీగ గాగ రిగాగ రిగప గాగ రిగ పగారి సదా
దసదప

పదద ససరి
దద సస రిరి గగ ప
సస రిరి గగ పప ద
రిరి గగ పప దద స
గగ పప దద సస రి
రిరిగ రిగ రిరిగ రిగ రిరిగ రిగ పగ

గగరి గగరి గగరి గరి సద
రిరిస రిరిస రిరిస రిస దప
దదప దదప దదప దప గరి
గగరి గగరి గగరి గరి సద

ససస రిరిరి గగగ పపప దదద ససస రిరిరి
రిరిరి గగగ పపప దదద ససస రిరిరి గగగ
గగగ పపప దదద ససస రిరిరి గగగ పపప

పద పద పద పగరిగ
పద పద పద పగరిగ

పప దప దప దప దప దప దప దప సా...



No comments

Most Recent

Default