Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్
నటీనటులు: నాగ శౌర్య, మెహరీన్, జిష్షు శంగుప్త
దర్శకత్వం: రమణ తేజ
నిర్మాత: ఉమా మల్పురి, శంకర్ ప్రసాద్ మల్పురి
విడుదల తేది: 31.01.2020



Songs List:



అశ్వద్ధామ పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: దివ్యా కుమార్ 







నిన్నే నిన్నే ఎదలో నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రమేష్ వాక చర్ల
గానం: అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే

ఆదరాలే మధురంగా కలిసాయి ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా
అమావాస్యే పున్నమిగా తోచే నువ్ నవ్వంగ
నీలో నను చూసాక నను నేనే మరిచెనుగా

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే

నా గుండెలో ప్రియ రాగాలే 
మోగే నీ కను సైగల్లో
నా కన్నుల్లో చెలి అందాలే 
నలిగే నీ నడువొంపుల్లో

కలలో ఇలలో ప్రతి ఊహల్లో
నువ్వే నా కనుపాపల్లో
మొదలో తుదలో ప్రతి ఘడియల్లో
చెలియా నువ్వే నాలో

ఆదరాలే మధురంగా కలిసాయి ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా

అమావాస్యే పున్నమిగా
తోచే నువ్ నవ్వంగ
నీలో నను చూసాక
నను నేనే మరిచెనుగా

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే




మహి పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: పూజాన్ కోహ్లి 

మాహి మాహి
చూస్తుంటే నువ్వులా
అందాల బొమ్మలా

చూస్తుంటే నువ్వలా అందాల బొమ్మలా
వేలు పట్టి నడిచినావే మీ అన్నతో ఇలా
కళ్ళలో కాంతితో, గుండెల్లో ఆశతో
సిగ్గుపడుతూ బుట్టబొమ్మై ఎదిగావు ఇంతలో
మా అందరి ఊపిరై పెరిగావే
నీలా అల్లరి ఇక నేనే చెయ్యనా

తధీం ధీంతనక ధీంత ధీంతక పెళ్ళి కొడుకు వెనక
తధీం ధీంతనక ధీంత ధీంతక మహారాణి నడక
తధీం ధీంతనక ధీంత ధీంతక అత్తారింటి దాకా
తధీం ధీంతనక ధీంత ధీంతక అడుగులేడు గనక

మాహి
మాహి

రెండు మనసులే ఒకటయ్యే వేళలో
కలపనా ఈ జంటనే
నాకే తెలియని కల నిజమౌతున్నది.
తెలపనా ఈ క్షణమునే
విడి విడిగా మనమున్నా
వీడని నీడను నేనులే
ముసి ముసి నీ నవ్వులకే తోడుగా నేస్తం తానులే
మా ప్రాణమే దూరమై వెళుతున్నా
నువ్వే ప్రాణమై బ్రతికే జత దొరికెనే

తధీం ధీంతనక ధీంత ధీంతక పెళ్ళి కొడుకు వెనక
తధీం ధీంతనక ధీంత ధీంతక మహారాణి నడక
తధీం ధీంతనక ధీంత ధీంతక అత్తారింటి దాకా
తధీం ధీంతనక ధీంత ధీంతక అడుగులేడు గనక 






అండగా అన్నగా పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: వి.యన్.వి.రమేష్ కుమార్ 
గానం: వేదాల హేమచంద్ర 

అండగా అన్నగా 

No comments

Most Recent

Default