Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sabhash Ramudu (1959)


 చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జమునారాణి
నటీనటులు: యన్. టి. రామారావు, దేవిక
దర్శకత్వం: సి. యస్. రావు
నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, టి.అశ్వద్నారాయణ
విడుదల తేది: 10.09.1959

పల్లవి:
హల్లో డార్లింగ్ మాట్లాడవా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్
దరికొస్తే గొడవ
మాటామంతీ మనకెందుకోయ్
సరిసరిలే నిర్వాకం తెలిసింది పోవోయ్


చరణం: 1
మన ప్రేమ మరిచేవా కనికరం లేదా
కనికరం మమకారం అనకింక నాతో
ఏమే చిలుకా ఇంకా అలుకా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్
దరికొస్తే గొడవ (హల్లో)

చరణం: 2
దయగంటే మొరవింటే
నీ పాదాల పడతా
మనలోన మనకేమి తలవంపే చిలుకా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్
దరికొస్తే గొడవా (హల్లో)

చరణం: 3
పదిమంది ఇది వింటే
పరువా మరియాదా

పదిలేస్తా ఒట్టేస్తా ఇదిగో నీ మీదా
ఐతే సరిలే....
రైట్ పదవే...
మనసొకటే మాటొకటే
మనజీవాలొకటే
(2)

No comments

Most Recent

Default