Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: DK బోస్ (2013)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: సందీప్ కిషన్, నిషా అగర్వాల్
దర్శకత్వం: AN బోస్
నిర్మాతలు: ఆనంద్ రంగా, శేషు రెడ్డి
విడుదల చేయాలనుకున్నది: సెప్టెంబర్.2013


విడుదల చేయాలనుకున్నది సెప్టెంబర్ 2013
కానీ ఎందుకు రిలీజ్ లేట్ అయ్యింది 7 సంవత్సరాల తరువాత OTT లో ఎందుకు రిలీజ్ చేశారు. దానికి కారణాలు ఏంటి?

అత్తారింటికి దారేది సినిమా  ఫస్ట్ హాఫ్ లీక్ అయిపోయింది నెట్ లో హై క్వాలిటీ లో అందుబాటులో ఎవరో పెట్టారు. అందుకు ఆ సినిమాని అనుకున్న దానికంటే 10 రోజులు ముందుగా రిలీజ్ చేయడానికి ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,  నిర్మాత బి. వి ఎస్. యన్ ప్రసాద్ గారు సిద్ధమయ్యారు. 27.సెప్టెంబర్.2013 లో రిలీజ్ చేశారు. 

దానికంటే ముందేరిలీజ్ చేయాలంటే వీళ్ళకి కుదరలేదు అందుకోసం DK బోస్ సినిమా రిలీజ్ వాయిదా వేశారు ఆ తరువాత కొన్ని సమస్యలతో 
రిలీజ్ చేయలేక పోయారు. కానీ 7 సంవత్సరాల తరువాత OTT లో రిలీజ్ చేశారు, కారణం కరోనా కారణంగా లాక్ డౌన్ వలన OTT ప్లాట్ ఫామ్స్ కు కొంచెం ఆధరణ రావటం తో OTT లో రిలీజ్ అయింది.







చిత్రం: DK బోస్ (2013)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: వనమాలి
గానం: హరి చరణ్, సుచిత్ర

పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే,
అది ప్రేమో ఏమో తెలిసేలోపు

నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నిలువెల్లా నీతోనే ముడిపడిపోయా 
నే చెడిపోయా చెడిపోయ చెడిపోయ చెడిపోయా 
తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా
పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు

నా గతము చెరిపి నిజము తెలిపి
పోల్చనంతగా నన్నే ఆణువణువూ 
మార్చెను నీ ప్రణయం
ఈ కరుకు మనసు కరిగి కరిగి రేయి పగలు
నా కళలను నీ తలపుతో మున్చినదీ సమయం
నీ ప్రేమే... నీ ప్రేమే...
ఓ వరమల్లె గుండెల్లోన కొలువు తీరద
నా ప్రేమే... నా ప్రేమే...
నను గెలిపించి నిను నాతో నడిపిస్తుందా

పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే,
అది ప్రేమో ఏమో తెలిసేలోపు

నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నీతోనే ఈ నిమిషం ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయ చెడిపోయ చెడిపోయా
ప్రేమించే నీ కొరకే మతి చెడిపోయా 


No comments

Most Recent

Default