చిత్రం: మిస్ ఇండియా (2020)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: శ్రేయా ఘోషల్
నటీనటులు: కీర్తీ సురేష్ , నవీన్ చంద్ర, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నదియా, నరేష్
దర్శకత్వం: నరేంద్ర నాథ్
నిర్మాత: మహేష్ ఎస్. కోనేరు
విడుదల తేది: 04.11.2020
కొత్తగా కొత్తగా కొత్తగా
రంగులే నింగిలో పొంగే సారంగమై
లిప్తలో క్షిప్తమే కానని
కాలమే మొలకలే వేసే నా సొంతమై
నిన్నలో ఉన్న నీటి చారని
కన్నులే తొంగి చూసుకోవని
అందుకోలేని అంతులేదని
అంతటా సంతసం ఉందని
దారియే మారిపోయిందని
దాగిపోలేదుగా ఆమని
చెయ్యి చాస్తున్న ఈ చెలిమిని
చూడనీ కొత్తగా కొత్తనీ
సారిగామ రిగరిస సారిగామ రిగరిస
సారిగామ రిగరి సాగ రీస రీస నీస (2)
కోరబోయిన రేవైనా తెరుపై పోయేనా
కోరబోయిన రేవైనా తెరుపై పోయేనా
గురుతైనది చేదైనా మరుపై నీలోన
వెదురులోన మధుర గానమే వింటూవున్నా
పరుసవేది మనసు కోణమే చుస్తువున్నా
కరుసులేని నగవు బంధనాలు తీస్తూవున్నా
నాలోన నే లేని ఈ వేళన
తూరుపై ఉన్న చీకట్లని
వేకువే వేరు చేస్తుందని
చేరువౌతున్న దూరాలలో
చూడనా వెలుగులో వేడిని
సారిగామ రిగరిస సారిగామ రిగరిస
సారిగామ రిగరి సాగ రీస రీస నీస (2)
కొత్తగా కొత్తగా కొత్తగా
కొత్తగా కొత్తగా కొత్తగా

No comments
Post a Comment