Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kirrak Party (2018)

చిత్రం: కిర్రాక్ పార్టీ (2018)
సంగీతం: బి. అజనేశ్ లోక్ నాథ్
నటీనటులు: నిఖిల్, సంయుక్త , సిమ్రాన్ పరీంజా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శరన్ కొప్పిషెట్టి
నిర్మాత: సుంకర రామబ్రంహం
విడుదల తేది: 16.03.2018Songs List:దంద‌రె దంద‌రె పాట సాహిత్యం

 
చిత్రం : కిరాక్ పార్టీ (2018)
సంగీతం : బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం : వనమాలి 
గానం : బి. అజినేష్ లోకనాథ్ / హరిచరన్

దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌
దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం

ఎన్నెన్నీ ఆశ‌లు అడుగ‌డుగున ఈ కాలేజీలో
క్యాంప‌స్‌లో ఫైటులు కాఫీ షాప్‌ ట్రీటులు
సాగెలే... స‌ర‌దాల‌లో ఈ రోజులు
ఫ్రెండ్‌షిప్‌కై ప‌రుగులు

దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌
దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం

వ‌న్‌బై ఫోర్‌లో క‌లిసింది
స్నేహం క్యాంటీన్ ఛాయిలా
అటెండెన్స్ త‌గ్గిపోకుండ
ఉందిగ ప్రాక్సీ ఫార్ములా
సూప‌ర్ స్టారు ఫ‌స్ట్ షోకి మాకు
మాస్‌బంక్ మంత్ర‌ముంది
ఎగ్జామ్స్‌లోన బ్యాక్‌లాగ్స్ వ‌ల్ల
ఎక్స్‌పీరియెన్సు ఎంతెంతో పెరిగిందీ

వ‌న్‌బై ఫోర్‌లో క‌లిసింది
స్నేహం క్యాంటీన్ ఛాయిలా
అటెండెన్స్ త‌గ్గిపోకుండ
ఉందిగ ప్రాక్సీ ఫార్ములా

సూప‌ర్ స్టారు ఫ‌స్ట్ షోకి మాకు
మాస్‌బంక్ మంత్ర‌ముంది
ఎగ్జామ్స్‌లోన బ్యాక్‌లాగ్స్ వ‌ల్ల
ఎక్స్‌పీరియెన్సు ఎంతెంతో పెరిగిందీ

దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌
దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం

ఎన్నెన్ని ఆశ‌లు
నిను చూస్తుంటే మా మ‌న‌సులో
ఆ చిలిపి న‌వ్వులో ప‌డిపోయా చూపులో
ఓ మీరా.. మా అంద‌రి క‌ల నీవెగా
మా ఎద‌లో నీవెగా

బ్రాంచుల్లోన తేడాలు ఉన్నా బ్యాచు ఒక్క‌టే
మ‌చ్చా అన్న మావా అన్న ఫ్రెండ్‌షిప్ ఒక్క‌టే
సాధించాల‌నుందేదో హీటు ఎంచెయ్యాలో డౌటు
కాలేజ్ లైఫ్‌లో చ‌దువు లైటు
ఫుల్‌టైం మేము కొడ‌తాము లే సైటు

దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌
దంద‌రెదం దంద‌రె ద‌రె దందందంగురువారం సాయంకాలం పాట సాహిత్యం

 
చిత్రం: కిర్రాక్ పార్టీ (2018)
సంగీతం: బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: విజయ్ ప్రకాష్

గురువారం సాయంకాలం కలిసొచ్చింది రా
అదృష్టం అర మీటరు దూరంలో ఉందిరా
నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలరై పోయెలే 
చక చక సమయం బ్రేకులేసి నాకు సైడిచ్చిందిలే

కలలోన - అరెరరెరే
కనిపించి - అలెలలలే
ముద్దాడి - అయ్యయ్యయ్యో
పిచ్చి పిచ్చి ఊహలేవో - వన్స్ మోర్

కలలోన - అరెరరెరే
కనిపించి - అలెలలలే
ముద్దాడి - అయ్యయ్యయ్యో
పిచ్చి పిచ్చి ఊహలేవో 

గాల్లో తేలా యూనెక్కి ఊగేశా
తొలిప్రేమల్లో ఆప్కోర్స్ ఇది మామూలే
మాయో హాయో నీ కన్నుల్లో ఉంది
ఉన్నట్టుండి తలకిందులు అయ్యాలే

మతిపోయెనే అతిగా
అడిగింది నీ జతగా
పద పదమంటూ పరుగుతీసే అపలేని తొందర
నిన్ను చూడగానే చిందులేసే మనసు చిందరవందర

కలలోన - అరెరరెరే
కనిపించి - అలెలలలే
ముద్దాడి - అయ్యయ్యయ్యో
పిచ్చి పిచ్చి ఊహలేవో - వన్స్ మోర్

కలలోన - అరెరరెరే
కనిపించి - అలెలలలే
ముద్దాడి - అయ్యయ్యయ్యో
పిచ్చి పిచ్చి ఊహలేవో 

గురువారం సాయంకాలం కలిసొచ్చింది రా
అదృష్టం అర మీటరు దూరంలో ఉందిరా
నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలరై పోయెలే 
చక చక సమయం బ్రేకులేసి నాకు సైడిచ్చిందిలే

కలలోన - అరెరరెరే
కనిపించి - అలెలలలే
ముద్దాడి - అయ్యయ్యయ్యో
పిచ్చి పిచ్చి ఊహలేవో - వన్స్ మోర్

కలలోన - అరెరరెరే
కనిపించి - అలెలలలే
ముద్దాడి - అయ్యయ్యయ్యో
పిచ్చి పిచ్చి ఊహలేవో 
లాస్ట్ బెంచ్ పాట సాహిత్యం

 
చిత్రం: కిర్రాక్ పార్టీ (2018)
సంగీతం: బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శశాంక్ శేషగిరి, చింతన్ వికాస్, వరుణ్ రామచంద్ర


లాస్ట్ బెంచ్
సర్ బేవర్సు బ్యాచ్చు మాది పాట సాహిత్యం

 
చిత్రం: కిర్రాక్ పార్టీ (2018)
సంగీతం: బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: శశాంక్ శేషగిరి

సర్ బేవర్సు బ్యాచ్చు మాది కానె కాదు 
కాని లైఫ్ ఎ ఆప్షన్ ఇవ్వలా 
కారులోన బీరు తాగె గ్యాంగు కానె కాదు 
కాని వేరె దారి తోచలా 
లాస్ట్ బెంచ్ ని న్యూటన్స్ ని న్యూసెన్సు అంటు తరిమితే 
కాలేజి పరువు పోద్ది మేమంత రోడ్డు ఎక్కితే 

స్యాములైన్ స్కీములైన దుమ్ము దులుపుతాములే 
ఫ్రెండు క్రిష్న గాడి బ్లెస్సింగ్స్ ఉంటే 
హాస్టలైఅన్ జనత బారు చేసె టాలెంట్ ఉన్నా 
మంత్ ఎండ్ పాకెట్ మన్య్ ఉండదే 
ప్లానులే బోలెడున్నాయిలా చెయ్యగా చ్రేజి తింగ్స్ ఏ 
వట్ టు డు మాకు టైం లేదులే కాలమే కాటు వేసే 
ఇంత ఏజి లోన అంత కష్టమా స్టుడెంటు లైఫు నేరమా 

సర్ బేవర్సు బ్యాచ్చు మాది కానె కాదు 
కాని లైఫ్ ఎ ఆప్షన్ ఇవ్వలా 
కారులోన బీరు తాగె గ్యాంగు కానె కాదు 
కాని వేరె దారి తోచలా 
లాస్ట్ బెంచ్ ని న్యూటన్స్ ని న్యూసెన్సు అంటు తరిమితే 
కాలేజి పరువు పోద్ది మేమంత రోడ్డు ఎక్కితే 
నీచమైన కుల్లు పాట సాహిత్యం

 
చిత్రం: కిర్రాక్ పార్టీ (2018)
సంగీతం: బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: వశిష్ఠ యన్. సింహా

నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా 
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా 
నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా 
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా 

నరం లేని నాలుకున్న మనిషి కూడ మృగమేగా 
మృగములను వేటాడే మనిషై నే వచ్చాగా 
అమాయపు ఆడపిల్ల బ్రతుకుపైన అబాండాలు 
చేసె వాల్లు బ్రతకడనికాదు ఎన్నడర్హులూ 
రౌద్రములే రగిలిపోవు రక్కసులను చూస్తుంటే 
రుదిరములే మరిగిపోవు మాట తూలిపోతుంటే 
కత్తుకకు చెవులగ్గె కీచకులను తెగ బాది 
అబద్దాన్ని నిజం నుండి విడదీసె పని నాది 
ఉక్కు పాదమేసితొక్కి నార తీసి తొలిచైనా 
ఉక్రోషం ఉడుకుతుంటె ఉరి తీసి చంపైనా 

నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా 
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా 

విషాదాన్ని వెక్కిరించి వివదాలు శ్రుష్టిస్తే 
విలయ ప్రలుల జ్వాలాగ్నులు పిడికిలిలో పుట్టిస్తా 
ఉప్పు పట్టి తప్పు చేస్తె చెప్పు దెబ్బలు తినిపిస్తా 
నిప్పు కక్కు ఉప్పెనలా ఇప్పుడు నే వణికిస్తా 
రా రా రా రా నీ కింకా చావేరా 
కోతల్లో దుర్మార్గం విజ్రుంబన చేస్తుంటే 
శివమెత్తి తాండవమే ఆడేనే ముక్కంటే 
రా రా రా రా 
చూస్కో మునుముందూ జరిగే ఈ జగడంలో రగడేమిటొ 
రా రా రా రా 
నీలో నిన్ను పాట సాహిత్యం

 
చిత్రం: కిర్రాక్ పార్టీ (2018)
సంగీతం: బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రేయఘోషల్

నీలో నిన్ను చూశా నేను 
ఇకపై ఏటు కను పాపను మరలించనూ 
నాలో నిన్ను దాచేశానూ 
పొరపాటునా నువ్వడిగినా తిరిగివ్వనూ 
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా 
మనసు పడి దూసుకెలుతుంది నీ కలవైపుగా 
భగ భగ భగ వెలుగు నింపుకొని 
నిదరలు చెరుపుతు తిరిగే సూర్యుడా 
ఎద సడి తెలుపుకోగ మరి దొరకడు 
నీలో ప్రేమికుడెక్కడా 

నువ్వంటె నాకు పిచ్చి ప్రేమరా 
మాటల్లొ దాన్ని చెప్పలేనురా 
నా కల్లల్లోన మెరుపు చూడరా 
నీ పాటె అది పాడుతుందిరా 

మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా 
మనసు పడి దూసుకెలుతుంది నీ కలవైపుగా 

నీ రూపం నీ రూపం అపురూపం 
చిరునవ్వులేని చిరు లోపం 
ఏదో చెబుతొంది ఎదలోతు లోటునీ నే రానా జత కానా 
ఏదిలా మనసు అందించూ వీలుగా 
ప్రేమగా దానిపై నా పేరే రాయగా 

నీలో నిన్ను చూశా నేను 
ఇకపై ఏటు కను పాపను మరలించనూ 
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా 
మనసు పడి దూసుకెలుతుంది నీ కలవైపుగా 
భగ భగ భగ వెలుగు నింపుకొని 
నిదరలు చెరుపుతు తిరిగే సూర్యుడా 
ఎద సడి తెలుపుకోగ మరి దొరకడు 
నీలో ప్రేమికుడెక్కడా 

నువ్వంటె నాకు పిచ్చి ప్రేమరా 
మాటల్లొ దాన్ని చెప్పలేనురా 
నా కల్లల్లోన మెరుపు చూడరా 
నీ పాటె అది పాడుతుందిరా 

మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా 
మనసు పడి దూసుకెలుతుంది నీ కలవైపుగా పానమంతా పాట సాహిత్యం

 
చిత్రం: కిర్రాక్ పార్టీ (2018)
సంగీతం: బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కాల భైరవ

పానమంతా సుప్రభాతం సంద్యస్వరాల కోలాహలం 
పాడుతోందా కొత్త రాగం ఇన్నాల్ల చేదు ఆలాహలం 
వేవేల నేడు వెలిగింది నయనం 
ఏటు వెలుతోందొ ఈ నాటి పయనం 
ఇదే నా కోరిన పిలుపూ 
ఇదే నా బ్రతుకున మలుపూ 
ఇదే నా రేపటి గెలుపూ.... 

నేటి రహదారిలొ తగిలిన పిల్ల గాలి మరి ఏమన్నదో 
నిన్నటిలొ గుండెలు అలసిన గ్ఞాపకాల అల జుమ్మన్నదో 
తడి చెమ్మగా ఓ అలజడీ కనుపాపలో మొదలైనదీ 
ఈ జన్మలో మరు జన్మగా ఏ పండుగో ఎదురైనదీ 
పెను మౌనం దాటి మాటాడు సమయం 
బారాలన్ని వదిలింది హృదయం 

ఇదే నా కోరిన పిలుపూ 
ఇదే నా బ్రతుకున మలుపూ 
ఇదే నా రేపటి గెలుపూ.... మీరలేని తలపు నీది పాట సాహిత్యం

 
చిత్రం : కిరాక్ పార్టీ (2018)
సంగీతం : బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం : రాకేందు మౌళి
గానం : సమీరా భరద్వాజ్

మీరలేని తలపు నీది మేఘశ్యామ మాధవా
ఆరాదించు రాదే నేనై ప్రాణం పంచనా కృష్నా
చెప్పలేని మూగ ప్రేమ కల్లలోన కనపడదా
కన్నె మనసు వెన్న దొంగై దోచె చిన్ని కృష్నయ్యా

మీరలేని తలపు నీదే.....

వేణువూది మాయ చేసి వేలిపైన కొండను మోసి
వేల గోపి మదిలో వెలసీ అలసినావ కృష్నయా
విశ్రమించరా గోపాలా చాలు చాలు నీదు లీలా
ఊహ నీదే ఊసు నీదే ఊపిరై నను చేరరా

మీరలేని తలపు నీదే.....దంద‌రె దంద‌రె పాట సాహిత్యం

 
చిత్రం: కిర్రాక్ పార్టీ (2018)
సంగీతం: బి. అజనేశ్ లోక్ నాథ్
సాహిత్యం: వనమాలి
గానం: బి. అజనేశ్ లోక్ నాథ్

దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌
దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం

ఎన్నెన్ని గురుతులు అణువనువున ఈ కాలేగిలో 
క్యంపుస్ లో ఫైటులూ కాఫీ షాప్ ట్రీటులూ 
చాలవే సరదాలలో ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులూ 

తొలితొలి సారి ఈ చిన్ని గుండె జారిందిక్కడే 
ప్రాణం పంచు స్నేహానికర్దం తెలిసిందిక్కడే 
నేస్తం మీద గొడవల్లొ గెలిచీ ఓడిందిక్కడేగా 
అర్దం కాని ఈ జీవితాన్ని పాటంలాగ నేర్చింది ఇక్కడేగా 
కలిసింది ఇక్కడే విడిపొతుంది ఇప్పుడు ఇక్కడేగా 

దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌
దంద‌రెదం దంద‌రె ద‌రె దందందం

ఎన్నెన్ని గురుతులు అణువనువున ఈ కాలేగిలో 
క్యంపుస్ లో ఫైటులూ కాఫీ షాప్ ట్రీటులూ 
చాలవే సరదాలలో ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులూ 

1/4 లొ కలిసింది స్నేహం క్యాంటీన్ చాయిలా 
అట్టెండెన్స్ తగ్గిపోకుండ ఉందిగా ప్రోక్సి ఫార్ములా 
సూపర్ స్టారు ఫస్ట్ షో కి మాకు మాస్ మంత్ మంత్రముందీ 
ఎగ్సాంస్ లోనా బ్యాక్లాక్స్ వల్లా ఎక్స్పీరియన్స్ ఎంతెంతొ పెరిగిందీ 

No comments

Most Recent

Default