-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Bellamkonda Suresh"



చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
నటీనటులు: ప్రిన్స్ , శ్రీ దివ్య, ఆనంది
రచన: నందిని రెడ్డి.వి 
దర్శకత్వం: దాసరి మారుతి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 11.11. 2012



కళలకే కనులొచ్చిన పాట సాహిత్యం

 
చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రేవంత్

కళలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది 
ని వల్లే నివల్లే కథ మొదలై ఇవాళే
జతపడి నడకలై సాగిందే 
ఓ శైలు నివల్లే నా శైలే మారెలే
పడి పడి మనసిలా ఊగిందే

కళలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది

ఇంకొంచెం అందంగా నిఎదుటనే ఒంటరిగా ఉండాలనే ప్రతినిమిషము అనుకుంటున్నా
నా సొంతం నువ్వనగా పదిమందిలో బిగ్గరగా చెప్పాలనే ఎద కదలిక వినిపిస్తున్నా
కలిసిన వేళల్లో అల్లరి నేనై
పెదవుల అంచుల్లో పుడుతున్నా

You’re my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
You’re my soul you’re in my lovely heart
Just don’t tear me apart trust me girl
Touch the soul o sailu

నువ్వుంటే దగ్గరగా ఈ సమయమే తొందరగా గడిచిందని గురుతుండదె ఏదేమైనా 
నీ వెంటే వుంటానుగా నన్నొదిలిన దూరంగా ఊహాలలో ఊపిరిలో తోడై రానా
సాగే దారుల్లో సాయంత్రం నేనై
చలి చలి గాలుల్లో తడుస్తున్నా

యూ మై లవ్లీ ప్రిసిస్ బర్డ్
మై హార్ట్ ఈస్ యువర్ సోల్ 
నెవెర్ ఎవర్ లీవ్ మీ గో
యువర్ మై సోల్
యువర్ ఇన్ మై లవ్లీబర్డ్

You’re my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
You’re my soul you’re in my lovely heart
Just don’t tear me apart trust me girl
Touch the soul o sailu




రెక్కలొచ్చిన ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా
ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమ
ఇక ఇంటికి రాదందమ్మా ఎద రాజీనామా
కురిసే కన్నీరే వరదయ్యే వేళ

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా

రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం 
గమ్యాలే మారే గమనం ఆగదు ఏమాత్రం 
బ్రతుకంతా ఈడుంటుంద చివరంత తోడుంటుంద 
నది దాటని నావల కోసం ఎందుకు ఈ ఆత్రం 
ఆకాశం ఇల్లవుతుంద రెక్కలు వచ్చాకా 
అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక 
కలలే నిజమవున కలవరమేమైన

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా

నీవే ఓ అమ్మయ్యాక నీ అమ్మే గుర్తొచ్చాక
నీ కథ నీకెదురయ్యాక రగిలింద గాయం 
పువ్వులనే పెంచే మాలి ముల్లలో వెతకడు జాలి 
తిరిగింద నిన్నటి గాలి ఏ మనసైనా మాయం 
ఏనాడో రాశాడమ్మ తలరాతే బ్రహ్మ 
ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ 
బ్రతుకే నవలైనా కథలింతే ఏవైన

గుండెలో దాగిన ప్రేమ గూటికి చేరిందా
కంటిని వీడిన పాపా కన్నుగా మిగిలిందా

Note: This Lyric was Donated by Runku Ramprasad


Palli Balakrishna Thursday, May 21, 2020



చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర ( బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా)
నటీనటులు: నాని, తనిష్, అక్ష, శ్వేత బసు ప్రసాద్
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 05.06.2009



Songs List:



రంగుల లోకం పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: క్లింటన్ , శ్రావణ భార్గవి, భార్గవి పిళ్ళై 

రంగుల లోకం 




ఏదో ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర  , శ్రావణ భార్గవి, గీతామాధురి

ఏదో ఏదో 



నా మనసంతా పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర  , సుచిత్ర 

నా మనసంతా 




దంచవే మేనత్త కూతురా పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయి శివాని, జి.వేణుగోపాల్

(ఇది రీమిక్స్ సాంగ్  బాలకృష్ణ , సుహాసిని   నటించిన మంగమ్మగారి మానవుడు చిత్రం లోనిది) 

దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా 
దంచు దంచు బాగ దంచు 
ఆ దంచు దంచు బాగ దంచు 

దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా 
దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా 
దంచు దంచు బాగ దంచు 
దంచు దంచు బాగ దంచు 
దప్పి పుట్టినా.. కాస్త నొప్పి పెట్టినా.. 
ఆగకుండ, ఆపకుండ, అందకుండ, కందకుండ.. 

దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరదర

హే దంచు దంచు దంచు...

పోటు మీద పోటు వెయ్యి..కోక వయసు పొంగనియ్యి.. 
ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు 
పోటు మీద పోటు వెయ్యి..కోక వయసు పొంగనియ్యి.. 
ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు 

ఏ చెయ్యి ఎత్తితేమి...మరి ఏ చెయ్యి దించితేమి 
కొట్టినా నువ్వే..పెట్టినా నువ్వే 
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే!! 

హ.. దంచుతా మంగమ్మ మనవడా 
ఓయ్..నేను దంచితే నీ గుండె దడదడ 
దంచుతా మంగమ్మ మనవడా 
ఓయ్..నేను దంచితే నీ గుండె దడ దడ దడ దడ 

హే దంచు బేబీ దంచు దంచు బేబీ దంచు

కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు.. 
ఎగిరెగిరీ పైన పడకు ఇగురు చూస్తే టముకు టముకు 
కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు.. 
ఎగిరెగిరీ పైన పడకు ఇగురు చూస్తే టముకు టముకు 

ఏ కంటపడితేమి ఎవ్వరేమంటే మనకేమీ 
నువ్వు పుట్టంగానే, బట్టకట్టంగానే.. 
నిన్ను కట్టుకునే హాక్కున్న పట్టాదారున్ని నేను 

అరె దంచవే మేనత్త కూతురోయ్.. 
వడ్లు దంచవే నా గుండెలదర
దంచుతా మంగమ్మ మనవడోయ్
నేను దంచితే నీ గుండె దడదడ



రైడ్ పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపు, బబ్లు 

రైడ్



మహివే పాట సాహిత్యం

 
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర 

మహివే 

Palli Balakrishna Monday, March 19, 2018




చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబు
విడుదల తేది: 01.12.2000



Songs List:



నీలి నింగిలో పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: హరిహరన్

నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే

నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

దేవుడు కనబడి వరమిస్తే వేయిజన్మలు ఇమ్మంటా
ప్రతి ఒక జన్మ నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా
దేవత నీవని గుడి కడతా దేవత నీవని పూజిస్తా

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

ప్రేమకు మరుపే తెలియదులే నిన్ను ఎన్నడు మరువదులే
తెరలను తీసి నను చూడు జన్మ జన్మలు నీ తోడు
వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే

నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి



మైనా ఏమైనావే పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: ఉన్ని కృష్ణన్ , చిత్ర

పల్లవి:
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

చరణం1:
విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
చలి గాలి సాయంత్రాల స్వాగతమే
పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
ఎదతోనే ముందుగా చేసే కాపురమే
ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా...
ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

చరణం2:
సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
కాటేస్తే కాదంటానా ఇపుడైనా
వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం



మా లోగిలిలో పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: ఎస్.పి.బాలు, చిత్ర, సుజాత మోహన్

మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం
ప్రేమకు ప్రతిరూపం

మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

రాముడు అడవికి వెళ్లేనా నువ్వే అన్నై ఉండుంటే
ఏసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే
అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే
ఆన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే
తమకున్నదొక్కన్నమ్మవై కడుపున మము దాచి
కాచిన దైవమా

మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

ఇంతటి చక్కని బంధాన్ని కాలం ఆగి చూసేను
రాత రాయు ఆ బ్రహ్మ రాయుట ఆపి మురిసేను
తపమేమి చేశామో తమ్ముల్లమ్మయ్యాములే
తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యములే
మా దేవుడు మాకుండగా మరి మాకిక లోటేది
కలతకు చోటేది

మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం
ప్రేమకు ప్రతిరూపం
మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే




పిల్ల భలే దీని ఫిగరు భలే పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి.బాలు, స్వర్ణలత

పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
మిసమిస లాడే సొగసుని మోసే 
లేత నడుము వంపు భలే
ఉయ్యాల లూగే వయసు భలే

గురుడు భలే వీడి పొగరు భలే
మనిషి భలే మగసిరులు భలే

కొత్త కొత్త ప్రేమలోనే మత్తు ఉన్నది
ముత్యమంత ముద్దులోనే మోక్షమున్నది
ముద్దులంటే అంతులేని మోజు ఉన్నది
జోడు కొస్తే పాడుమనసు బిడియమన్నది
వనికిన వయసు తొణికిన సొగసు 
తరగని ప్రేమకు సాక్ష్యము
అమ్మతోడు త్వరపడకు 
అమ్మాయి నీదే కడవరకు

పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే

కొంగుచాటు అందమేదో విచ్చుకున్నది
కాక రెచ్చి కన్నె గుండె ఝల్లుమన్నది
కోక దాటు పొంగులోనే కైపు ఉన్నది
ఘాటు కౌగిలింతలోనే స్వర్గమున్నది
తొలి తొలి వలపు తొలకరి చినుకు
ఎంతో మధురం నేస్తమా
మోతగుందే ముడిసరుకు 
ఇక రాదులే కంటికి కునుకు

పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
హొయ్ పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
మిసమిస లాడే సొగసుని మోసే 
లేత నడుము వంపు భలే
ఉయ్యాల లూగే వయసు భలే




కదిలే అందాల నది పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: సుఖ్విందర్ సింగ్, అనురాధ శ్రీరామ్

కదిలే అందాల నది అరెరే నను ముంచినది
ఇక తేలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను
ఓ ప్రియా ప్రియా సఖియా 
నీవే సుమా నా గుండె లయ
ఓ ప్రియా ప్రియా సఖియా 
నీవే సుమా నా గుండె లయ

కదిలే అందాల నది అరెరే నను ముంచినది

వాన విల్లు పూల జల్లు రూపు కడితే
నువ్వే కాదా నవ్వే కాదా
కొంటె కళ్ళు చూపు ముళ్ళు గుచ్చి పెడితే
సిగ్గు రాదా చిచ్చు కాదా
నీకు పెట్టిన పేరుది భాగ్యం
జన్మించానే ప్రతి రోజు
నీ పేరు పలికి పలికి నా పెదవి తేనెలాయె
నీ మాట వింటూ వింటూ నా మనసు ఊయలాయె

కదిలే అందాల నది అరెరే నను ముంచినది

చిలక వచ్చి వాలగానే చిట్టి కొమ్మకి
సోకులొచ్చే శోభలొచ్చే
ప్రేమ మెచ్చి తాకగానే చిన్ని గుండెకి
ఊహలొచ్చే ఊసులొచ్చే
నువ్వు ఎపుడూ పక్కన ఉంటే ఎక్కడున్నా అద్భుతమే
నీ గాలి సోకగానే నా దారి మారిపోయె
నిమిషానికున్న విలువే నువ్వు దగ్గరుంటే తెలిసె

కదిలే అందాల నది అరెరే నను ముంచినది
ఇక తేలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను
ఓ ప్రియా ప్రియా సఖియా 
నీవే సుమా నా గుండె లయ
ఓ ప్రియా ప్రియా సఖుడా
నీవే సుమా నా గుండె లయ




తాజాగా మా ఇంట్లో పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: చిత్ర, మనో, సుజాత మోహన్

తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను
దర్జాగ మా మరిది ఇక రాజాలా తిరిగేను
కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ
అంతా సంతోషంలో తేలగా 

తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను

పండుగ కాని రోజేదంట 
మనసున నేసిన మమతల పొదరింట
అందరికోసం వంటరి అయినా
అన్నకు పండుగ మా సుఖమేనంటా
ఈ ఇల్లే వెయ్యిల్లు మొదలవును
ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును

తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను

జానెడు తాడు కట్టినవాడు 
జన్మలు ఏలే నీ జోడవుతాడు
పున్నమి రెమ్మా పుత్తడి బొమ్మా
మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా
ముత్తైదు మురిపాల జీవించు
అన్న ఆనంద భాష్పాలు దీవించు

తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను
కొత్త యువరాణి రానుంది 
ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా 
ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా



నీలి నింగిలో (విషాద గీతం) పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: హరిహరన్

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే
నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే
నువులేని నేను శిలను మెలకువే లేని కలను
నిను వీడి నే లేను నే ఓడి మనలేను

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే

ప్రేమకు మరుపే తెలియదులే 
మనసు ఎన్నడు మరువదులే
తెరలను తీసి నను చూడు 
జన్మ జన్మకు నీతోడు
వాడనిదమ్మ మన వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నేల దిగిరావే నన్నేల మరిచావే

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే

దేవుడు కనబడి వరమిస్తే 
వేయి జన్మలు ఇమ్మంటా
ప్రతియొక జన్మ నాకంటే 
నిన్ను మిన్నగ ప్రేమిస్తా
దేవత నీవని గుడికడతా
జీవితమంతా పూజిస్తా
నేల దిగిరావే నన్నేల మరిచావే

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే
నువులేని నేను శిలను మెలకువే లేని కలను
నిను వీడి నే లేను నే ఓడి మనలేను

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే

Palli Balakrishna Monday, January 8, 2018


చిత్రం: బ్రదర్స్ (2012)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: విజయ్ ప్రకాష్ , కార్తీక్ , హరిణి
నటీనటులు: సూర్య , కాజల్ అగర్వాల్, ఇషా శార్వాణి
దర్శకత్వం: కె. వి.ఆనంద్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 12.10.2012

రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని
ఏ హవ రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని
మనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం కానని
నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని
నీ దాసుడ్లాగ మారని నను నేనే ఆరా తియ్యనీ..

రానీ రానీ నిను మేఘంలాగా రానీ
కానీ కానీ ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ నే నాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచే ప్రేమనీ...

ఏ రాని నన్నీ మేని కొంచం నాలో నేనే దాచని
మనసే నీమీదే  కానీ నువ్వే లేని నేనేం కానని
నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని
నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ..

రానీ రానీ నీ మేఘంలాగా రానీ
కానీ కానీ ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ నే నాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచే ప్రేమనీ...

ఒక వేకువల్లే నువ్వస్తుంటే
పరుగాపి చిరుగాలి చలి కాసుకోదా ఓ నిమిషం
కన్నుల్లో స్వప్నమే చూపిస్తూ నీ ప్రేమే చాలంటూ
మనసేమో చేసే సావాసం

ఓ పాట ఈ తనకేగ మధురం సుఖమైన తరుణం
మునిగింది మాయల్లో హృదయం
నడవకే తనువేమొ కరిగే నీ వైపు జరిగే
మరి కాస్త మరి కాస్త నీదవ్వదా
ఒడిలో ఒదుగు తొలి ప్రేమ పూజలకు

రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని
మనసే నీమీదే  కానీ నువ్వే లేని నేనేం కానని
నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని
నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ..

నను వీడి వెళ్ళగా ఓ స్నేహం హృదయంలో ఈ శోకం
చిరు ముళ్ళై గుచ్చిందే నిత్యం
హో మది నేడు ఒంటరై పోతుంటే నా కనులు నీరవగా
తన కంట ఏదో సంతోషం
నీ సొగసే మెరిసేటి వేళల్లో నా రూపంలో  ఎవరో
నిను తాకుతుంటే చూశాలే
నా గుండెలో మృతిలేని ఆరాటం మృదువైన భూకంపం
నన్నేమి చేస్తున్న చిరు ఆనందం
సత్యం స్వప్నం సరిపోల్చు తరుణమిది

రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని
మనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం ఏలహా
నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని
నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ..

రానీ రానీ - నీ మేఘంలాగా రానీ
కానీ కానీ - ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ - నే నాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచే ప్రేమనీ...

Palli Balakrishna Wednesday, October 18, 2017



చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , టబు , శ్రేయ శరన్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 25.09.2002



Songs List:



Don't Care... పాట సాహిత్యం

 
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

Don't Care...
నవ్వేవాళ్ళు నవ్వనీ ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ
పొగిడేవాళ్ళు పొగడనీ తిట్టేవాళ్ళు తిట్టని 
Don't Care Don't Care
పూలే నీపై జల్లని రాళ్ళే నీపైరువ్వనీ
ఎత్తుకు నిన్నెగరెయ్యనీ గోతులునీకే తియ్యని 
Don't Care...Don't Care
అనుకున్నది నువ్వే చెయ్
అనుమానం మానిచెయ్
నీమనసే పెట్టిచెయ్ నీదేరా పైచెయ్

చరణం: 1
ఎదిగేకొద్దీ ఒదగాలన్నది చెట్టును చూసినేర్చుకో
క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసినేర్చుకో
చిరునవ్వులతో బతకాలన్నది పువ్వును చూసినేర్చుకో
ఓర్పు సహనం ఉండాలన్నది పుడమిని చూసినేర్చుకో
ఎంత తొక్కినా నిన్నెంత తొక్కినా
అంత పైకి రావాలన్నది బంతిని చూసినేర్చుకో
నేర్చుకున్నది పాటించెయ్
ఓర్చుకుంటు పనులేచెయ్ నీదేరా పైచెయ్

చరణం: 2
ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసినేర్చుకో
పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుణ్ణి చూసినేర్చుకో
సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసినేర్చుకో
ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసినేర్చుకో
ఎంత చెప్పినా నేనెంత చెప్పినా
ఇంకెంతో మిగిలున్నది అది నీకునువ్వు నేర్చుకో
నేర్చుకున్నది పాఠం చెయ్
నలుగురికి అది నేర్పించెయ్ నీదేరా పైచెయ్





హాయ్ హాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, సునీత

పల్లవి:
హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి గజ్జాలీయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
తోడు నువ్వు లేక పోతె తోచదోయి
తోటి రాగం పాడుతుంటె నచ్చదోయి
దాని పెరు హల్లోవొయి తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనొయి తకదిన్న తకదిన్న తందాన

చరణం: 1
కొట్టే కన్ను పెట్టె నిన్ను నాలో దాచుకున్నానె
అద్దమంటి అందాలోయి తకదిన్న తకదిన్న తందాన
అంటుకుంటె ఆరట్లోయి తకదిన్న తకదిన్న తందాన
పట్టె పిచ్చి పుట్టె వెర్రి ఇట్టె తోసిపుచ్చావె
ఒంటిచేతి చప్పట్ట్లోయి తకదిన తకదిన తందాన
అల్లుకున్న బంధాలోయి తకదిన్న తకదిన్న తందాన
మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర
కూచిపుడి ఆడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
కుర్రదాన్ని ఓడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
దాని పెరు అల్లోఒవియి తకదిన్న తకదిన్న తందాన

చరణం: 2
సిగ్గా ఎర్ర బుగ్గా నిన్ను తాకీ కందిపోయింది
ముద్దులింక మద్దెళ్ళేలె తకదిన్న తకదిన్న తందాన
ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తకదిన్న తకదిన్న తందాన
ప్రేమొ చందమామొ నిన్ను చూసీ వెళ్ళిపోయింది
ములక్కాడ ఫ్లూటౌతుందా తకదిన్న తకదిన్న తందాన
ముట్టుకుంటె ముద్దౌతుందా తకదిన్న తకదిన్న తందాన
ఒడిచేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు
కన్నె మొక్కు చెల్లించేస్తా తకదిన్న తకదిన్న తందాన
చెమ్మ చెక్కలాడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు అల్లోవియి తకదిన్న తకదిన్న తందాన




బకరా బకరా పాట సాహిత్యం

 
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర

బకరా బకరా




నీ కొప్పులో నా మల్లె తోట పాట సాహిత్యం

 
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీనివాస్
గానం: యస్. పి. బాలు, కౌసల్య

నీ కొప్పులో నా మల్లె తోట



ఏం పిల్లా కుశలమా పాట సాహిత్యం

 
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, సుజాత

ఏం పిల్లా కుశలమా



తెలుపు తెలుపు పాట సాహిత్యం

 
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర

తెలుపు తెలుపు


Palli Balakrishna Wednesday, September 13, 2017



చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , ఆసీన్
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 14.01.2004



Songs List:



దేవున్నే పిలిచావంటే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

దేవున్నే పిలిచావంటే 



అందంలో ఆంధ్రా కోస్తా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, శ్రేయా ఘోషల్

అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందో బస్తా
అంతేదో చూస్త జోరుగా
అందాలే చందాలిస్తా
మందార ఘంధాలిస్తా
రాసిస్తా నన్నే తేరగా

కస్సుల బస్సుల కారప్పొడి
కసి కసామిస నా దోపిడీ
కిస్సు కి మిస్ కి వెంటే పడీ
కధే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జీవ్వంటూ కవ్వించు
కుంటాను రావే మరి
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది హొయ్

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా

మత్తెక్కే అందాల మహిళామని
చెయ్యవే తియ్యగా పూబోణి
కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి
సయ్యంటూ కలిపాను చెయ్యి చెయ్యి
ఎత్తులే వెయ్యకు అబ్బాయి
అందుకైతే మోగనివ్వు సన్నాయి

గుచ్చుకుంటే నీకు ఏడు ముళ్ళు
చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు
హత్తుకున్నాక పుట్టేది ఆ హాయి హైలెస్సలే
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది హొయ్

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా

భామ నీ బాడీ కి భంధో బస్తు
సిగ్గులే దోచితే శ్రీరస్తు
కంటితోనే ఒంటి తేనే లాగేస్తూ
పొమ్మంటే రమ్మంటు నీతో చిక్కు
గాలిలో ముద్దుల మ్యూజిక్కు
లాహిరాల కళ్ళతోటి మ్యాజిక్కు
అః జబ్బ చూస్తే పచ్చ డబ్బ పండు
నువ్వు నవ్వుతుంటే నాకు మల్లె చెండు
ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లి పేరంటమే
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా
ఓ అందాలే చందాలిస్తా
మందార ఘంధాలిస్తా
రాసిస్తా నన్నే తేరగా

కసుల భూస్సుల కారప్పొడి
కసి కాసమిస నా దోపిడీ
కిస్సు కి మిస్ కి వెంటే పడీ
కథే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జివ్వంటూ కవ్వించు
కుంటాను రావే మరి
కుడికాలే కదిలింది
అరెరే కుడి కన్నె అదిరింది హొయ్



జడతోటి కొడితే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, సుజాత

జడతోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ
కన్నె చీరమ్మ బెణికింది నారాయణ
నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ
ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ

జడతోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

ప్రేమించి పెళ్ళాడినా... ఓ ఓ పెళ్ళాడి ప్రేమించినా... ఓ ఓ
ముందుకొచ్చినా, పక్కకొచ్చినా, మీదికొచ్చినా నేనేగా
కొపమోచ్చినా, కోరికొచ్చినా, దారికొచ్చినా నేనేగా
చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ
ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా
చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ
ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా
నీ ఆటే కట్టినా, నిన్నే ఆకట్టినా
ఆ తాళి కట్టేది నాకే కదా
కొత్త కౌగిళ్ళు కడుతుంటే నారాయణ
కొంగు గొంగళ్ళు పరిచింది నారాయణ
సోకు పెద్దిల్లు కడుతుంటే నారాయణ
సిగ్గు చిన్నిల్లు కూలింది నారాయణ

చాపేసి దిండేసినా... ఓ ఓ దిండేసి చాపేసినా... ఓ ఓ
సేవ చేసినా, దాడి చేసినా, గొడవ చేసినా నేనేగా
తప్పు చేసినా, ఒప్పు చేసినా, చెప్పి చేసినా నేనేగా
గిలిగిలి గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల
మరుమరు మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా
హోయ్ గిలిగిలి గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల
మరుమరు మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా
మోమాటం పెట్టినా, ఇరకాటం పెట్టినా
అడిగింది పెట్టేది నేనే కదా
సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ
సన్న నడువమ్మ నవ్వింది నారాయణ
పాలు పళ్ళన్నీ పెడుతుంటే నారాయణ
పట్టు పరుపమ్మ ఏడ్చింది నారాయణ

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ
కన్నె చీరమ్మ బెణికింది నారాయణ
నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ
ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ




మరుమల్లి జాబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, మురళీధర్ , శ్రీవర్ధిని

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమయి జరుగుతున్న పెళ్ళి
బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్ళి 

దేవుళ్ళు దేవతలు కొలువయిలేరు కొవెలలో
బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో
ఊరు వాడా వేడుకా ప్రతి ఒక్కరి హౄదయం వేదిక
లేనే లేదు తీరికా ప్రతి నిమిషం తెలియని తికమకా
మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో
మా వాళ్ళై అయినోళ్ళై ఒక చెయ్యేసినాయి మేళంలో
పందిరిలోన పండుగలన్ని నిలుపుతున్న పెళ్ళి
నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళి

మా నాన్నా మా అన్న ఇద్దరు నాకు పుట్టిళ్ళు
అందరికి సెలవంటు నేవెళ్ళి వొస్తా అత్తిళ్ళు
చల్లని చూపే కాటుకా ఇక తరగని ప్రేమే బొట్టుగా
మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా
ఆత్రాన్నయి సూత్రన్నయి ముద్దుగా వెస్తా బంధాలు
నేస్తాన్నయి నీ వాడ్నై నీ వద్ద వుంటా వందేళ్ళు
మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటయిన పెళ్ళి
కలిసిన మనసె శక్షిగా నిలిచే స్వచ్చమయిన పెళ్ళి





పప్పేసుకో చారేసుకో పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్

పప్పేసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో 
కన్నెసుకో కాలిసుకో ముల్లే వేసీ అల్లేసుకో
దమ్మున్నొడు భలే రిమ్మున్నొడూ
అయ్యాడు నీ వాడూ...
రమ్మన్నాడు అదె ఇమ్మన్నాడూ అమ్మమ్మో చీ పాడూ...

పువ్వుల్నే తెస్తాడు కొప్పుల్లో  పెట్టేయడు
నా చీర కుచ్చిళ్ళు తురిమేస్తాడు
చీకట్లో వస్తాడు చంపల్నే గిల్లేయడు
అరికాలే గీరేస్తుంటాడు
హే పట్టిమంచం ఊయలల్లే మార్చి మంత్రాలయ్యాడు
పట్టపగలు మంచివాడే రాత్రి మహా పిచ్చోడు హేయ్ 
వేషం మార్చి సరసం నేర్చి
రామయ్యే మళ్ళీ నీకోసం పుట్టాడు

అరె పప్పేసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో 
అరె కన్నెసుకో కాలిసుకో ముల్లె వేసీ అల్లేసుకో

బైటేమో గొప్పొడూ మొనగాడు రౌడి గాడు
ఈ రాణి సేవల్లో బంటౌతాడూ
దొంగల్నె పడతాడూ తిడతాడు కొట్టెస్తాడూ
పొంగుల్లొ డంగై పోతాడూ..

హే ఆకలేస్తే అన్నం కాదూ సోకె తింటానంటాడూ
దాహం వేస్తే నీరె కాదు నిప్పె తాగలంటాడూ..
ఏదో చేసీ నన్నే దోచీ ఏడాదిలోగానె నాన్నై పోతాడూ

పప్పెసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో
హ కన్నెసుకో కాలిసుకో ముల్లె వేసీ అల్లేసుకో
దమ్మున్నొడు భలే రిమ్మున్నొడూ
అయ్యాడు నీ వాడూ...
రమ్మన్నాడు అదె ఇమ్మన్నాడూ అమ్మమ్మో చీ పాడూ...




నాతోటి నీకు పనుంది పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తిక్, మహాలక్ష్మి అయ్యర్

నాతోటి నీకు పనుంది

Palli Balakrishna



చిత్రం: కందిరీగ (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: రామ్ పోతినేని, హన్సిక మోత్వాని, అక్ష పార్ధసాని
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాత: బెల్లంకొండ
విడుదల తేది: 12.08.2011



Songs List:



జెంటిల్ మ్యాన్ పాట సాహిత్యం

 
చిత్రం: కందిరీగ (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: రంజిత్

జెంటిల్ మ్యాన్ అంటారే పది మందికి హెల్పె చేస్తె 
దండేసి పొగిడెయ్ రా నువ్ ఫ్రీగా అన్ని ఇస్తే 
కాల్ల మీదె పడిపోరా జాలి గాని చూపిస్తె 
నువ్ టెంప్ట్ ఐపోతె నీ బ్రతుకు బస్టాండు రోయ్ 

ఎందుకలగా ఎందుకలగా 
నువ్ బెందయ్యవో తేడ తెడా 
ఇప్పుడెలగా ఇప్పుడెలగా 
ఏహ్ నాలా బతికెయ్ యెడా పెడా 
అలగలగా అలగలగా 
ఈ ట్రేండుకు నేనే దడా దడా 

ఆనాలకే ఉంటాది క్రేజు 
కాబట్టి రా అంతంత పోసు 
లవ్ యూ అంటె లగెత్తుకొచ్చి 
పడిపోరె ఏ రోజు 

ప్రేమించవె ఓ సారి అంటూ 
పదే పదే తిరిగితె చుట్టు 
సారీ అంటె సడెన్ గ నువ్వె ఐపోవా పేషంటు 
నువు దగ్గర అవ్వలనుకుంటె వాల్లు దూరం పెడతారె 
ఎహె నెగ్లక్ట్ చేస్తె మాగ్నట్ లా పరిగెత్తుకు వస్తారే 
ఈ అమ్మాయిలంతా రివర్స్ గేరే రోయ్ 

చెప్పిందల్ల వినొద్దు బాసు 
తోచిందల్ల చేసెయ్యి బాసు 
ఒక్కొక్కడు ఒక్కొక్కలాగ ఇస్తారు లెక్చర్సూ 
మొఖాలలో దాచేసుకోకా 
వాడాలిరా మెదడును బాగా 
ప్రతీ క్షణం పక్కోడి సలహ వింటావ గతి లేకా 

ఎవడెవడో చెప్పేదినకండ్రా అని మొత్తుకు చెబుతుంటే 
గొర్రెల్ల నా మాటింటుంటె అది నా తప్పెంకాదే 
ఆ స్వామీజీలు బతికేది మీ మీదే రోయ్ 

ఎందుకలగా ఎందుకలగా
నువ్ మల్లి మొదటికి రావద్దు రా 
ఇప్పుడెలగా ఇప్పుడెలగా
పనికొచ్చె పనులే చూస్కోండి రా 
అలగలగా అలగలగా
మల్లడిగారంటె తంతాను రా 





చంపకమాల పాట సాహిత్యం

 
చిత్రం: కందిరీగ (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్ , సుచిత్ర

Oh Yammaa Lovely baby 
My one and only baby
I missing you  like crazy 
Oh tell me gal you always be my love 

I am flowing like a river 
Just be with me forever
I won't let you go never 
oh come to me gal you are in my mind

చంపకమాల నన్ను చంపకే బాలా
నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా
చంపకమాల నన్ను చంపకే బాలా
నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా
బాబ్బాబు నీ మంచే కోరి 
Wanna tell you something
వెంట పడినా ఏం లాభం లేదు 
I can give you nothing
నా ప్రాబ్లమ్స్ నాకున్నాయంటా 
Understand my feelings 

కల్లోకొస్తే నువ్వు లేచి నుంచుంటా 
నిద్దరంటూ రాకా జోల పాడంటా
బుజ్జిగాడి గోలే వినమంటా 
హాయో ఇష్కని వెంటే రాకంటా 
నువ్వు రిస్కున పడిపోతావంటా
హే నాకున్నదొకటేనటా 
అది నా మాట వినబోదంటా
అరె నువ్వంటే పడి చస్తదంట 
దాన్ని కంట్రోలు చేయలేని తంటా
నువ్వు లోవే చెయ్యలేనంటూ ఎస్కేపై పోతుంటే , 
నోతారు వేడెక్కి అల్లాడిపోతాదే అల్లాడిపోతాదే చిట్టి గుండే 
Understand my feelings

చంపకమాల నన్ను చంపకే బాలా

ఆస్తి పాస్తులన్నీ పిచ్చ సూపరే 
వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే
ఆగలేక అర్జెంటైనాదే 
నేను రోజా పువ్వే అవునంటా 
ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా
నేను కోరేది నీ దగ్గరుందే 
అది లేకుంటే ఏదోళ ఉందే
వయసు నీ మీద బెంగెట్టుకుందే 
దాచిపెట్టింది తెచ్చియ్యమందే
దాన్ని అత్తర్లో ముంచేసి, పాకెట్లో చుట్టేసి, పువ్వుల్లో పెట్టేసి 
నా చేతికిచ్చేయ్ నా చేతికిచ్చేయ్ నీ చిట్టి గుండే 
Wanna tell you something ee ee

Oh Yammaa Lovely baby 
My one and only baby
I missing you  like crazy 
Oh tell me gal you always be my love 

I am flowing like a river 
Just be with me forever
I won't let you go never 
oh come to me gal you are in my mind

చంపకమాల నన్ను చంపకే బాలా




నే కొడితే గత్తరే పాట సాహిత్యం

 
చిత్రం: కందిరీగ (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: నవీన్, MLR కార్తికేయన్, ఆలాప్ రాజు, రంజిత్, రనినట్ రెడ్డి, దర్శన

హేయ్ అడ్డొస్తె ఈడ్చి కొట్టూ 
ఏడ పెడ చాచి కొట్టు 
అబ్బబ్బ అదే దెబ్బ మల్లి మల్లి కొట్టూ కొట్టూ 
అటు ఇటు ఎటొ ఎటొ ఎదోటి పగలగొట్టు 
మత్తెక్కితె ఎగరగొట్టు ఎకా ఎకి ఎగర కొట్టు 
అట్టా కొట్టు ఇట్టా కొట్టూ 
యముకలన్ని ఇరగొట్టూ 

నా కొంచెం తిమ్మిరే నే కొడితే గత్తరే 
నెల రోజులు నిద్దరే ధడెల్ అనాలే 
రా రా రేయ్ 
నాకసలే టెంపరే లేపెస్తా బంపురే 
నేనొస్తె సెంటరే డమాల్ అనాలే 
రా రా రేయ్ 
ఎహ్ కొట్టు కొట్టు నేల నచ్చి ఈలె కొట్టెలా 
నచ్చి కొట్టు కొట్టు దమ్మె చూసి దండాలెట్టెలా 
జర ఉల్ట పల్ట చేసీ ఒహ్ నట్టు నట్టు లగేసి గల్లి గల్లి చేసెయ్ గలాట అడడ 

మా శ్రిను గాడు కేకే 
వీడికేమొ కొంచం క్రాకే 
వాడొచ్చాడంటె షాక్ ఏయ్ 
ఎహెయ్ కిందా మీద షేక్ ఏయ్ 

నాకొంచెం తిమ్మిరే నే కొడితే గత్తరే 
నెల రోజులు నిద్దరే ధడెల్ అనాలే 
రా రా రేయ్ 

హేయ్ అడ్డొస్తె ఈడ్చి కొట్టూ 
ఏడ పెడ చాచి కొట్టు 
అబ్బబ్బ అదే దెబ్బ మల్లి మల్లి కొట్టూ కొట్టూ 
అట్టా కొట్టు ఇట్టా కొట్టూ 
యముకలన్ని ఇరగొట్టూ 

హేయ్ ఇదిగో ఇదిగో ఇది నా సిలకా గెలికారంటె 
తాటె తీసేసి కిలో లెక్కా అమ్మేస్తాడె 
అయిన మనకేం పర్లేదంటు ఎనకే పడితే
బాబొయ్ ఐబాబోయ్ అమీ తుమీ తేల్చేస్తాడె 
కుర్రాడెవడైనా నిన్నె చూడాలె 
మేటర్ తెలిసాక చెల్లెల్లాగా ఫీల్ అవ్వాలే 
లవ్వు గివ్వంటు లైనేస్తుండాలె 
నన్నే చూసాక అటునుంచటె లగెత్తలే 

ఏయ్ కొట్టూ కొట్టూ చితకొట్టు పిచ్చె ఎక్కేలా 
ఏయ్ కొట్టు కొట్టూ ఇరగొట్టూ గగ్గొలెట్టెలా 
చలొ అబ్బొ అబ్బొ అబ్బో 
నీ దెబ్బె నా జబ్బ లబో దిబో మందే మగాడా మగడా 

మా శ్రిను గాడు కేకే 
వీడికేమొ కొంచం క్రాకే 
వాడొచ్చాడంటె షాక్ ఏయ్ 
ఎహెయ్ కిందా మీద షేక్ ఏయ్ 

అరెరే ఫిగరే అంటు కూతల్ కూస్తే 
గల్లా పట్టెసి గిరా గిరా తిప్పెస్తాడె 
సరద పెరిగి నంబర్ గింబర్ అడిగారంటె 
పీకె నొక్కేసి గొయ్యె తీసి పాతెస్తాడె 
గిఫ్టె కవాలా అని నిన్నడగాలే 
నేనె రాగానే బైక్ ఎక్కేసి జంప్ అవ్వాలే 
నీలో అందాల్ని పొగిడెస్తుండాలే 
నన్నె చూపిస్తే తట్టా బుట్టా సర్దెయ్యలే 

ఏయ్ కొట్టు కొట్టూ అల కొట్టు తుక్కె రెగెలా 
ఏయ్ కొట్టూ కొట్టూ మల్ల కొట్టూ దుమ్మె రెగేలా 
అరె గట్ట మిట్ట లాంటి ఈ పిట్ట నడుం పట్టి 
పట్ట పగల్ చుక్కల్ చూపియ్ రా పిల్లగా 

మా శ్రిను గాడు కేకే 
వీడికేమొ కొంచం క్రాకే 
వాడొచ్చాడంటె షాక్ ఏయ్ 
ఎహెయ్ కిందా మీద షేక్ ఏయ్ 





హేయ్ ఏంజెలీన పాట సాహిత్యం

 
చిత్రం: కందిరీగ (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్, రనిన రెడ్డి, సుచిత్ర

హేయ్ ఏంజెలీన ఏంజెలీన 
హౌ డూ యూ డూ హలివుడ్ సోనా
ఎప్పుడంటె అప్పుడేగా 
ఎనీ టైం కిస్ మి దీవానా
 కేథరీనా కేథరీనా హౌ ఆర్ యు మేరి సొగసు ఖజానా 
ఎక్కడంటె అక్కడె రా 
వన్ మోర్టైం జస్ట్ హగ్ మి  జాన్ 
హో డ్రీమ్ వన్ ఓ లవ్ మసాకు ఏక్ దం మస్తె మస్తె 
హో తుల్లి మాకు ఫ్యూజ్ లెగిరె 
ఒహ్ సిల్లి సిల్లి ఒహ్ హాట్ చిల్లి రొమాన్సు రందకబ్బు రంగు బర్సే 
ఒహ్ హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో 
హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో 

హేయ్ ఏంజెలీన ఏంజెలీన 
హౌ డూ యూ డూ హలివుడ్ సోనా 

వెన్నిలాకు దేట్ ఇవ్వనా స్ట్రాబెర్రి కి మాటివ్వనా 
మైండ్ బ్లాంక్ కిస్ ఇవ్వనా పార్టు పార్టు రాసివ్వనా 
హేయ్ ముప్పై ఆరు రంగులున్న హంగు చూసి పొంగు చూసి 
లిప్ లాక్ కోరుకుంది బాడీ 
హేయ్ 5స్టారు డిన్నర్ ఉంది ఫ్రంట్ దోరు ఓపెన్ ఉంది 
ఫ్రెంచ్ కిస్ పెట్టుకోర జల్దీ 
హో ఫుల్ కులాసె దిల్పటాసె నువ్వు నేను కలిసె 
హో లాస్పైలాసె 
ఈల వేసెయ్ పోటా పోటి ఆడ జోడి డబుల్స్ లో
పిచ్చ పిచ్చ రచ్చ రబసే 

ఒహ్ హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో 
హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో 

అల్ట్రా మోడల్ అనార్కలి యు అర్ మై లవ్లీ  మసాక్కలి 
మై హు తేరి మ్యంగొ జెల్లీ టేస్ట్ కరొ నా మల్లి మల్లి 
ఎహ్ హిప్ హాప్ హిప్ చూసి దాని పని నీ గ్యప్ చూసి 
లిప్ మీద నిప్పైంది వేడీ 
హెయ్ కండలోన జూస్ చూసి కల్లలొ కరెంట్ చూసి 
మైక్రోవేవ్ మంట రాజుకుందీ 
హో పీజ్జ ఉంది పాస్త ఉంది 
రెండు లగించెయ్యనా 
హో farmula 1 స్పీడ్ లోన 
చలొ ఫటాఫట్ చలో చలీస్ ఫోన్ 
షకలక స్టెప్పులెయ్యనా 

ఒహ్ హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో 
హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో 




ప్రేమే పునాదిలె పాట సాహిత్యం

 
చిత్రం: కందిరీగ (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్, హేమచంద్ర, రేవంత్, దీపు, బిందు మహిమ, గీతా మాధురి, శ్రావణ భార్గవి

మస్తు మస్తు పోరగాడే
ఇష్క్ ప్యార్ అంటె ఏంటొ నాకు నేర్పినాడే 
ప్రేమలో మత్తుందీ ఆ మత్తేదొ గమ్మత్తుగుందీ

ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే
ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే 

ఘన ఘన గుండెల్లొ ప్రేమ గంటె మోగిందే
ఘన ఘన గుండెల్లొ ప్రేమ గంటె మోగిందే 
ధన ధన బాజాలా పెళ్ళి గంటే మోగిందే 
ధన ధన బాజలా పెల్లి గంటే మోగిందే 
ప్రేమ పెళ్ళి మా ఏదైనా నువ్వు చేసిందే 
పిల్ల పిల్ల నీ హుంగామ నాకు నచ్చిందే 
వారు వీరు ఏకం అయ్యె లగ్గం రానె వచ్చిందే 
ఇల్లు పీకి పందిల్లేసె అనందాలె తెచ్చిందే 

ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే
ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే

నిన్నిల చూస్తు చూస్తు దూరానుంటె బాగొలేదంటా 
ముందూరే ఉన్న ఇంక ఆలస్యాలె చేస్తావెంటంటా హ 
హ హ హా హ హ హా హ హ హ హా 
మూడు ముల్లె వేసెస్తా ముచ్చటంతా తీరుస్తా 
శీనుగాడంటె ఎంటో సినిమా చూపిస్తా 
బొమ్మ చూపిస్తాడంటా దుమ్ము లేపెస్తాడంటా 
వీడి యవ్వరమే యమా యమా తేద గుందంటా 
హేయ్ హేయ్..వడిదో తైప్ అంటా 
వాడి జోలికెల్లొదంటా 
వాడికెంత దూరం ఉంటె అంత నీకు మంచిదంతా 
ఇక్కడింకాసెపుంటె మైండె మటాష్ ఐపొద్దంటా 

ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే
ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే

ఎవరేమన్న పిల్ల నా కోసమే పుట్టవనుకుంటా హోయ్ 
ఎక్కడెక్కడున్న నీడై నీతొపాటె వచ్చేస్తు ఉంటా 
అహహా అహహా అహ హ హ హ హ 
తప్పు లేనె లేదంటా హక్కు నీకే ఉందంటా 
నచ్చినోడె నువ్వంటా పంచునుంటా నీ జంటా 
పిల్లదేమొ పింగానం మామ మియ్యా గోషానం 
రాజ రాజన్న ముద్దుల కోరిక నేనె తీరుస్తాలే 
పక్కనే నువ్వుంటె ప్రేమ కింక పెల్లెనంటా 
అల్లుడె రెడ్య్ అంటె తెలంగాన తెప్పించేస్తా 
మంచిగున్న బావని వీడు మెంటల్ గాన్ని చేసడంటా 

ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే
ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే

ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే 
ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే

ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే
ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే

బ్రెయిన్ ఎహ్ దొబ్బిందిలె, నా బ్రెయిన్ ఎహ్ దొబ్బిందే 

Palli Balakrishna Saturday, September 2, 2017


చిత్రం: గోలీమార్ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: గీతామాధురి
నటీనటులు: గోపిచంద్, ప్రియమణి, రోజా
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 27.05.2010

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే

మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే మాలాగా లైఫులోంగు ఉండరంతే
మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే
ఈడు కూడ ఇంతే

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే

ఢంకుటకర ఢంకుటకర  టా
కాసంత ఓదార్పు కోరుకుంటామ్ కూసంత టైమిస్తే పొంగిపోతామ్
కాసంత ఓదార్పు కోరుకుంటామ్ కూసంత టైమిస్తే పొంగిపోతామ్
మగాళ్ళ గోలేంటో దారేంటో తీరేంటో యామో ఏంటో
మీకు నచ్చినట్టు మేము మారినా మాగుండే కోసి మీకు ఇచ్చినా
మీరింతే ఛీఛీ ఈడు కూడ ఇంతే

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే

కోపంలో ఏమన్న సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మే ఎట్టుకుంటామ్
కోపంలో ఏమన్న సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మే ఎట్టుకుంటామ్
మగాళ్ళ మైండేంటో మూడేంటో మాటెంటో యామో యాంటో
అడ్డమైన సేవలెన్ని చేసినా ఆకాశమంత ప్రేమ పంచినా
మీరిన్తే ఛీఛీ ఈడు కూడ ఇంతే

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే


*******   ********   *********


చిత్రం: గోలీమార్ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి, కౌసల్య

పల్లవి:
గుండెల్లో ...హ్మ్మ్
కళ్ళల్లో ...హ్మ్మ్

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి

నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని

తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ
తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి

చరణం: 1
నా పెదవంచులో నీ పిలుపున్నదీ
నీ అరచేతిలో నా బ్రతుకున్నదీ
ఇన్నాళ్ళెంత పిచ్చోణ్ణి నేను .. మనసిస్తుంటె తప్పించుకున్నా
మొత్తమ్మీద విసిగించి నిన్నూ ఏదో లాగ దక్కించుకున్నా
మనసున్నాది ఇచ్చేందుకే .. కనులున్నాయి కలిపేందుకే
అని తెలిసాక నీ ప్రేమలో .. పడిపోయానులే

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి

చరణం: 2
నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ
ఈ గిలిగింతలో నే పులకించనీ
నాకో తోడు కావాలి అంటూ ఎపుడూ ఎందుకనిపించలేదు
వద్దొద్దంటూ నే మొత్తుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో
కన్నీళ్ళొస్తె తుడిచేందుకూ .. సంతోషాన్ని పంచేందుకూ
ఎవరూ లేని జన్మెందుకూ .. అనిపించిందిలే

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తోందీ సందడి
నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని
తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ
తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ

గుండెల్లో ...హ్మ్మ్
కళ్ళల్లో ...హ్మ్మ్

Palli Balakrishna Friday, September 1, 2017



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజ, భూమిక , గోపిక
దర్శకత్వం: యస్.గోపాల్ రెడ్డి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 11.08.2004



Songs List:



మౌనంగానే ఎదగమని పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది

చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో
మార్చలేనిదేది లేదనీ గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా...
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది




గుర్తుకొస్తున్నాయి పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో... ఏ మూలనో...
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో... ఏ మమతలో...
మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు...
దొంగచాటుగా కాల్చిన బీడీ
సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం...

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెల పరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయిబు పూసిన సెంటు...
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియని తనము
మొదటి ప్రేమలో తియ్యందనము...

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో... ఏ మూలనో...
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి




దువ్విన తలనే దువ్వటం పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి

దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
అద్దం వదలక పోవడం
అందానికి మెరుగులు దిద్దడం
నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం
ఉండి ఉండి అరవడం
తెగ అరచి చుట్టూ చూడడం
ఇన్ని మార్పులకు కారణం
ఎమై ఉంటుందోయి

ఇది కాదా LOVE  (15)

ముఖమున మొటిమే రావడం
మనస్సుకు చెమటే పట్టడం
మతి మరుపెంతో కలగడం
మతి స్థిమితం పూర్తిగా తప్పడం
త్వరగా స్నానం చెయ్యడం
త్వరత్వరగా భోం చేస్తుండడం
త్వరగా కలలో కెళ్ళడం
ఆలస్యంగా నిదురోవడం
ఇన్నర్థాలకు ఒకే పదం
ఏమై ఉంటుందోయి

ఇది కాదా LOVE  (15)





మన్మదుడే బ్రహ్మను పూని పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సందీప్ భౌమిక్, గంగ , యమ్.యమ్.కీరవాణి

మన్మదుడే బ్రహ్మను పూని సుృష్టించాడేమో గానీ
యాబై కేజిల మందారాన్ని ఐదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని

మన్మదుడే బ్రహ్మను పూని సుృష్టించాడేమో గానీ
యాబై కేజిల మందారాన్ని ఐదున్నర అడుగుల బంగారాన్ని

దీన్ని తెలుగులో కారం అంటారు మరి మలయాళంలో?
ఇరివో
ఓహో ఇది తీపి! మీ భాషలో?
మధురం
మరి చేదు చేదు చేదు చేదు?
కైకు

ఆరే రుచులని అనుకున్నానే నిన్నటివరకు
ఏడొ రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
రుజిగల్లారిని న్యంకండు ఇన్నలె వరయెళ్ ఇన్నలె వరయెళ్
ఏయాం రుచియుం ఉండెన్వరిన్యుం నీ ప్రేమతో
నిన్నటి దాక నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమురాల్ నువ్వె దిక్కు ఎన్లొ దత్తిళ్...
హే వన్స్ లవ్ యు
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళమెయ్యనీ
మాధవుడే బ్రహ్మను పూని సుృష్టించాడెమో గానీ
అరవై కేజిల చిలిపితనాన్ని
అలుపన్నది ఏరుగని రవితేజాన్ని
పెదాల్ని ఏమంటారు?
చుండు
నడుం ని?
ఇడుప్పు
నా పెదాలతో నీ నడుం మీద ఇలా చేస్తె ఏమంటారు
ఆశ దోస అమ్మమంట మీస
ఏయ్ చెప్పమంటుంటె
చెప్పనా...
రెండో మూడో కావాలమ్మ బూతద్దాలు
వుందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు
పెరిగె కొద్ది తీర్చాలంటే నీ వేడిని
లెక్కకుమించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరగ చెయ్యాలంటే మదురయాత్రలు
విన్నాను నీ హృదయవాణి
వెన్నెల్లలో నిన్ను చేరనీ

మన్మదుడే బ్రహ్మను పూని స్రుష్టించాడేమొ గాని
అరవై కేజిల దుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మనీ




గామా గామా హంగామా పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, శ్రీవర్ధిని, గోపిక పూర్ణిమ

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

చరణం: 1
నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది
చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది
నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పని నను వీడి నువ్వు వెళ్లొద్దని
మళ్లీ రాయిని చెయ్యొద్దని...

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా

చరణం: 2
నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది
నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసి పోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలని...

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప



నువ్వంటే ప్రాణమని పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ యేసుదాసు

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా

మనసూ వుంది మమతా వుంది పంచుకొనే నువు తప్పా
ఊపిరి వుంది ఆయువు వుందీ ఉండాలనే ఆశ తప్పా
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమవాలి మన్ను తప్పా

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ...

వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్లావు
కరునిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపంకూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరిని నిందించాలి నిన్ను తప్పా

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా


Palli Balakrishna Tuesday, August 15, 2017


చిత్రం: ఓకే ఓకే (2012)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: హరీష్ జైరాజ్, కార్తిక్, శ్రీమధుమిత
నటీనటులు: ఉదయనిధి స్టాలిన్ , హన్సిక మోత్వాని
దర్శకత్వం: యమ్.రాజేష్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 31.08.2012

అరెరే అరెరే నడిచే స్వర్గం నీవులే
నీ అడుగే పడగా నలిగే హృదయం నాదిలే
ఐదే ఐదే నిమిషాలల్లో హాయిగా
నా ఆరో ప్రాణం నువ్వయ్యావే వింతగా
నా కంటి ఇంట్లో కలలను పరిచా
ఇంటి తలపులే నీకై తెరిచా
నిన్ను పిలవడం తీరా మరిచా
అరె వలను కొరికిన చేపవు నువ్వా
పులిని తరిమిన జింకవు నువ్వా
నిన్ను వలచిన ప్రియుడే నేనా

ఓ చిలక రా చిలక నా నిప్పుల పడకా
ఓ మొలక రసగుళిక నా పువ్వుల పలక
ఓ చిలక రా చిలక నా నిప్పుల పడకా
వాననక ఎండనక వస్తా నీ వెనుకా

అరెరే అరెరే నడిచే స్వర్గం నీవులే
నీ అడుగే పడగా నలిగే హృదయం నాదిలే

చుర చుర మంటై చూసి చిరు చిరు జల్లై చూసి
కళ్లు నన్నే కౌగిలించి ప్రేమను తెలిపే
మనసున ముల్లై గుచ్చి తనువు మాలలు వేసి
తనువు మొత్తం మనసు చేసి వెళ్లకు విడిచి
ఈ ప్రేమ అన్నది ఒక విత్తు లాంటిది
అది అణువు అణువునా వనమై పెరిగే
లాలించి అడగనా తలవంచి అడగనా
నీ నటన ఆపవే నిజము చప్పవే
నీకు నాకు నడుమ ప్రేమ కలదని

చిలక రా చిలక నా నిప్పుల పడకా
ఓ మొలక రసగుళిక నా పువ్వుల పలక
ఓ చిలక రా చిలక నా నిప్పుల పడకా
వాననక ఎండనక వస్తా నీ వెనుకా

కనులలో ఎగసెను కలలే కలలలో పలికెను కథలే
మెరుపు కథలో మలుపులేంటో అడగకు నన్నే
అలలకు వెయ్యకు వలలే
వలలకు దొరకవు అలలే
అలసిపోయి నిలిచిపోయి వదిలేయ్ నన్నే
గుడిలోన హారతి జ్వాలైన
సంగతి తెలిసింది ఇప్పుడే తగలడె మనసే
నువ్వు ప్రేమ గజినీవా మతిలేని మజ్నువా
నా వెంట నడవకు చెంత చేరకు
నీకు నాకు నడుమ ప్రేమ వలదిక

చిలక రా చిలక నా నిప్పుల పడకా
ఓ మొలక రసగుళిక నా పువ్వుల పలక
ఓ చిలక రా చిలక నా నిప్పుల పడకా
వాననక ఎండనక వస్తా నీ వెనుకా

అరెరే అరెరే నడిచే స్వర్గం నీవులే
నీ అడుగే పడగా నలిగే హృదయం నాదిలే
ఐదే ఐదే నిమిషాలల్లో హాయిగా
నా ఆరో ప్రాణం నువ్వయ్యావే వింతగా
నా కంటి ఇంట్లో కలలను పరిచా
ఇంటి తలపులే నీకై తెరిచా
నిన్ను పిలవడం తీరా మరిచా
అరె వలను కొరికిన చేపవు నువ్వా
పులిని తరిమిన జింకవు నువ్వా
నిన్ను వలచిన ప్రియుడే నేనా

ఓ చిలక రా చిలక నా నిప్పుల పడకా
ఓ మొలక రసగుళిక నా పువ్వుల పలక
ఓ చిలక రా చిలక నా నిప్పుల పడకా
వాననక ఎండనక వస్తా నీ వెనుకా

ఓ చిలక రా చిలక నా నిప్పుల పడకా
ఓ మొలక రసగుళిక నా పువ్వుల పలక
ఓ చిలక రా చిలక నా నిప్పుల పడకా
వాననక ఎండనక వస్తా నీ వెనుకా

Palli Balakrishna Friday, August 11, 2017



చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
నటీనటులు: వెంకటేష్ , అనుష్క శెట్టి, రీచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, కమిలిని ముఖర్జీ
దర్శకత్వం: పి.వాసు
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 16.12.2010



Songs List:



అభిమాని లేనిదే పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే
హీరో నువ్వే లీడర్ నువ్వే
ఓనర్ నువ్వే దైవం నువ్వే
వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా
నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే

చరణం: 1
నీ శక్తే ఆయుధము నీ ప్రేమే ఆలయము నమ్మరా ఒరేయ్ తమ్ముడా
నీ చెమటే ఇంధనము ఈ దినమే నీ ధనము లెమ్మురా నువ్వో బ్రహ్మరా
మనసే కోరే మందు ఇదే
మనిషికి చేసే వైద్యమిదే
అల్లోపతి టెలీపతీ
అల్లోపతి హోమియోపతి అన్నీ చెప్పెను నీ సంగతి

వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
 
ఒణకు బెణుకు తొణుకు వదలరా
జర ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే

చరణం: 2
సంతృప్తే చెందడమూ సాధించేదాపడమూ తప్పురా అదో జబ్బురా
సరిహద్దే గీయటమూ స్వప్నాన్నే మూయటమూ ముప్పురా కళ్లే విప్పరా
ఆ లోపాన్నే తొలగించు ఆశయాన్నే రగిలించు
దేహం నువ్వే ప్రాణం నువ్వే
దేహం నువ్వే ప్రాణం నువ్వే దేశానికి గర్వం నువ్వే

వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

చమకు చమకు చురుకు చూపైరా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా

అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే
హీరో నువ్వే లీడర్ నువ్వే
ఓనర్ నువ్వే దైవం నువ్వే
వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా
నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా





వందనాలు వందనాలు పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్ కృష్ణన్, నందిత , షమిత మల్నాడ్ 

వందనాలు వందనాలు 




గిరిని గిరిని పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు 

గిరిని గిరిని 





ఖేలో ఖేలో పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్, జోగి సునీత 

ఖేలో ఖేలో



ఓంకార పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర 

ఓంకార 




రారా రీమిక్స్ పాట సాహిత్యం

 
చిత్రం: నాగవల్లి (2010)
సంగీతం:  గురుకిరణ్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: నిత్యశ్రీ మహదేవన్, శ్రీ చరణ్ 

రారా రీమిక్స్ 


Palli Balakrishna Monday, August 7, 2017



చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ , సమంత
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 25.07.2014



Songs List:



ఓరి దేవుడో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: జేవెద్ ఆలీ, సుచిత్ర

హే వంద  టన్ల డైనమైట్ గుండెలోన పేలినట్టు
వందరన్ల సెంచరీని ఒక్క బాల్ లో కొట్టినట్టు
హే గొల్లు గొల్లుమంటున్నదే ప్రాణం
దిళ్లు వేసినట్టు కుచ్చికుందే బాణం
హే గొల్లు గొల్లుమంటున్నదే ప్రాణం
దిళ్లు వేసినట్టు గుచ్చికుందే బాణం
నా హార్ట్ బీట్ నే ఫాస్ట్ బీట్ గా
మార్చినావే పిల్ల వాట్ టూ డూ

ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో... ఇదేమి గోల రో

మబ్బులో వర్షమంత టబ్ లోన కురిసినట్టు
పబ్ లోన వేడి వేడి దిబ్బ రొట్టె దొరికినట్టు
హే తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం
అరె భళ్ళు మంటూ పగిలింది అద్దం
నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు
బ్రైట్ గయ్యరో వాట్ టూ డూ

ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో... ఇదేమి గోల రో

హే వంటిలోని వేడి కొలవడానికి
కిలోమీటర్ అంత థెర్మోమీటరే అవసరం
పెదివిలోని మాట రాయడానికి
వైట్ హౌస్ అంత వైట్ పేపరే అవసరం
హే మనసులోని ప్రేమని - ఏఏఏ
దాచి పెట్టడానికి - ఏఏఏ
హే మనసులోన ప్రేమని దాచుపెట్టడానికి
లోకమంత లాకరే అవసరం
నా పల్స్ రేట్ నే డాలర్ రేట్ లా
పెంచినావురో వాట్ టూ డూ

ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో... ఇదేమి గోల రో

నా బర్త్ డేట్ నేను మరచిన
ఫస్ట్ నిన్ను కలుసుకున్న డేట్ మరవనే మరవనే
నా సొంత పేరు నేను మరచిన
నీ సెల్ ఫోన్ నెంబరే మరవనే మరవనే
నాలోని ప్రాణమే  - ఏఏఏ
నన్ను వదలి పెట్టిన - ఏఏఏ
నాలోని ప్రాణమే నన్ను వదలి పెట్టిన
పట్టుకున్న చేయి ఒదిలిపెట్టనే
లైఫ్ లాప్టాప్ కి పాస్వర్డ్ ల
మారినావురా వాట్ టూ డూ...

ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో... ఇదేమి గోల రో





నీలి నీలి కళ్లల్లోనా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: కార్తీక్, హరిణి

నీలి నీలి నీలి నీలి కళ్లల్లోనా 
నను బంధించావే మనసంధించావే
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే 

నచ్చాక నువ్విలా వదిలేదిలేదెలా 
కడదాక నిన్ను దాచుకోన చేతిగీతలా 
నీ చేతి రేఖలో నే ప్రేమలేఖనై 
ప్రతీ రోజు నీతొ నేను నన్ను చదివించుకుంటానిలా

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 
నను బంధించావే మనసంధించావే 
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే

హే మనసే ఒకటుందంటూ 
అది ఒకరికి ఇవ్వాలంటూ
నీవల్లే తెలిసొచ్చెను గనుకా నీకే ఇచ్చేసా
తోడే కావాలంటూ ఏనాడూ అనుకోలేదూ
నీవల్లే అనిపించెను గనుకా నీతోవచ్చేసా
నీకెక్కిల్లోస్తాయంటే తలవడమే మానేస్తానూ
కలలోకైనా ఇకరానునీకు నిద్దరుండదంటే

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 
నను బంధించావే మనసంధించావే 
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే 

హో నదిలా నువ్వుండాలీ పడవై నేనుండాలీ
జీవితమంతా నీ వడిలోనే గడిపేస్తుండాలీ
నింగై నువ్వుండాలీ  జాబిల్లై నేనుండాలీ
ఆనందంగా నీ కౌగిలిలో బ్రతికేస్తుండాలీ

నినుచూసే ఉద్యోగంలో సెలవంటూ పెట్టను నేనూ
ఇక ఏరోజూ నిను తప్ప నన్ను గురుతుచేసుకోను

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 
నను బంధించావే మనసంధించావే 
నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే 




What's up అంటూ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, షర్మిల
గానం: దేవి శ్రీ ప్రసాద్, షర్మిల

What's up అంటూ





రావే నా లబ్బర్ బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సూరజ్ సంతోష్ , రనినా రెడ్డి

హే కోకాపేట కాజిపేట మల్కంపేట
బ్రాడీపేట సైదాపేట సిద్ధిపేట
అంబర్పేట అమీర్పేట షామిర్పేట
హకీమ్పేట ఏ పెటైనా నాదేనంట

నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు
నా మాట చిలక పలుకు
నా కులుకు మెరుపు తళుకు
అరే పడనివాడు లేడే నా వలపు
సిగ్గు పాడేది సిక్స్ ఓ క్లోక్ 
కన్ను కొట్టేది టెన్ ఓ క్లోక్ 
అరె లెమ్మంటే ఎలెవన్ ఓ క్లోక్ 
రగిలిస్తా రౌండ్ ది క్లోక్
తగిలిస్తాను ఫ్రంట్ బ్యాక్ 
తగ్గిస్తాను నీ హెడేక్ 
వేస్తాను న లిప్ లాక్ 
తెప్పిస్తా హార్ట్ ఎటాక్
రావే నా లబ్బర్ బొమ్మ
నిను చూస్తే తిరిగిందే దిమ్మ
రావే నా లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ

నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు

నీ నీలి కన్నులకు ఆ గాగుల్స్ ఎందుకు?
అరేయ్ పగటిని నల్లని సీకటి లాగా మార్చేటందుకు
నీ చిన్ని చేతులకు అన్ని బ్యాంగిల్స్ ఎందుకు?
ఆ బ్యాంగిల్స్ నాలో అంగెల్స్ ఎన్నో తెలిపేంటందుకు
నీ నడువంపుల్లోనే ఆ కీచైన్ ఎందుకు
నీ నడువంపుల్లోనే ఆ కీచైన్ ఎందుకు
అది తడిమి తడిమినా గుండె గుడిని
నువ్ తెరిచేటందుకు నువ్వు తెరిచేటందుకు

రావే నా లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ

అందాల పెదవుల్లో రెడ్ కలరే ఎందుకు?
ఇహ అందరి ముందర రెడ్ సిగ్నల్  ఆపేటందుకు
నీ బాడీ ప్యాక్ లో పచ్చబొట్టే ఎందుకు?
నువ్ పక్కకొస్తే పచ్చ జండా ఊపేటందుకు
నీ చేతి గోళ్లపై తెల్లని పెయింటింగ్ ఎందుకు?
నీ చేతి గోళ్లపై తెల్లని పెయింటింగ్ ఎందుకు?
నా చేత చిక్కి తెల్లార్లు ఫెయింట్ ఐపోయేటందుకు ఐపోయేటందుకు

రావే నా లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ
నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు




ఓ బుజ్జి కొండ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: జస్ప్రీత్ జస్స్ , షర్మిల

ఓ బుజ్జి కొండ




అల్లుడు శీను పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు శీను (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సింహా , ప్రియ హమేష్

శీను శీనూ... శీను శీనూ...
శీను శీను నేనే నీకు ఫాను తినిపిస్తా మీర్జా పానూ
హే క్వీన్ క్వీన్ నువ్వే లవర్ జాను తీసేస్తా బ్యూటీ స్కాను
నీ సోలో గుండెల్లో టెంటే వేస్తానూ 
నాలో నీ ఫొటో ప్రింటెచేస్తానూ
ఆకాసాన్నే ఎక్కిస్తానూ చుక్కల్లోనే పక్కేస్తానూ
తారాజువ్వలాంటి ఎన్నో ముద్దులు ఇస్తానూ

అ అ అ అ అల్లుడు శీనూ 
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడు శీనూ 
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ

శీను శీనూ... శీను శీనూ...
హేయ్ అల్లుడుశీను అల్లుడుశీను 
హీర్ కమ్స్ అల్లుడుశీను
ఎవ్రీ బడీ సే వెల్కమ్ టు అల్లుడుశీను

హే నీ నవ్వుల్లో మెరుపే ఉందీ 
ఆ మెరుపుతోటి సిటీ మొత్తం కర్రెంటిస్తానూ
హరె నీ చూపుల్లో ఉడుకే ఉంది 
ఆ ఉడుకుతోటి ఊరికిమొత్తం వంటే చేస్తానూ
హే కాఫీ కప్పులొ పంచదార బదులుగా 
సొగసనె షుగరునే కలుపుకుంటానూ
సెంటూ గింటూ వద్దే వద్దు అత్తరులేవి అక్కరలేదు 
స్వాసల్లోని పరిమలమే పూసుకుంటానూ

అ అ అ అ అల్లుడుశీనూ 
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ 
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ

నీ మనసెంతొ మెత్తగ ఉంది 
ఆ మెత్తదనం డబుల్ కాటు మంచం చేస్తానూ
అరె నీ వరసెంతొ చిలిపిగ ఉంది 
ఆ చిలిపితనం మంచం పైన దుప్పటిచేస్తానూ
హరె గదిలో ఫుల్లుగా మల్లెపూల బదులుగా
మాటల మత్తులే చల్లేస్తామూ
హే అగరబత్తులు వద్దే వద్దు పొగలు గిగ్గలు వేరే వద్దు
బాడీలోని సెగలు చాలు రగులు కుంటానూ

అ అ అ అ అల్లుడుశీనూ 
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ 
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ


Palli Balakrishna Thursday, July 27, 2017



చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: వెంకటేష్ , త్రిష , సలోని
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 14.01.2012



Songs List:



బాడీ గార్డ్ (నువు పుట్టగానే) పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: బాబా సెహగల్ , రమ్యా, నవీన్ మాధవ్ 

బాడీ గార్డ్  (నువు పుట్టగానే)





హోసన్నా (అడుగడుగునా నిను చూశా) పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: శ్రీవర్ధిని , రాహుల్ నంబియార్ 

హోసన్నా   (అడుగడుగునా నిను చూశా)



ఓ మై గాడూ పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: రంజిత్, గీతామాధురి , బిందు 

ఓ మై గాడూ




ఎవ్వరో... ఎవ్వరో... పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: కార్తిక్

ఎవ్వరో... ఎవ్వరో... 
నను తియ్యని గొంతుతొ పిలిచిందెవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో... 
తన మాటల తేనెలు పంచిందెవ్వరో
మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో
తనది ఏ పోలికరో పోల్చునది ఎవ్వరో
చిలిపి సిరి మువ్వరో కలిపి తను ఎవ్వరో
ఏమో ఏమో...
నా గుండెతొ గుసగుసలాడిందెవ్వరో
హే... ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో

ఎవ్వరో... ఎవ్వరో... 
ఈ దాగుడు మూతలు ఆడేదెవ్వరో 

హే హే... ఇంతలా ఏమార్చినా ఊరూ పేరూ జారవే
నిన్నిలా నే మరచినా నువు మాత్రం నను వీడవే
అందగాణ్ణి అంటావే మరి అందకుండ ఉంటావే
హే ఆ ప్రాణ వాయువల్లే నువుకూడ కానరావే
ఇంతిలా నన్ను ఊరిస్తావే నువ్వెంత అందానివే
ఆ అందం కళ్ళకు కట్టేదెవ్వరో 
తన చిరునామా చూపెట్టేదెవ్వరో

ఏ ఏ... నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే
తక్షణం నీవెవ్వరో తెలియదు అనిపిస్తావులే
నన్ను నువ్వు చూస్తావే మరి నిన్ను నువ్వు దాస్తావే
హే... అరె నిన్ను చూడాలని మైమరచి పోవాలని
నా ఒళ్ళే కళ్ళై వలేస్తున్నా ఆచూకి చిక్కవులే
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో 
ఆ చక్కెర పలుకుల టక్కరి ఎవ్వరో

ఎవ్వరో... ఎవ్వరో.... 
అరె ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో  




జియా జియాలే పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హరిహరన్, హరిణి 

జియా జియాలే 



ఎందుకో (కలవాలనుకున్నా ప్రేమని) పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హరిచరన్, శ్వేతా మోహన్, ఎస్. ఎస్. థమన్

ఎందుకో (కలవాలనుకున్నా ప్రేమని)

Palli Balakrishna Monday, July 24, 2017
Aadi (2002) Telugu Songs Lyrics Album Cover

Aadi (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Aadi (2002)
Banner : Sri Laxmi Narasimha Productions
Music : Mani Sharma
Director : V. V. Vinayak
Producer : Bellamkonda Suresh
Actors : N. T. Rama Rao Jr.
Actresses : Keerthi Chawla
Supporting Cast : Rajan P. Dev
Release Date : 28 March 2002
MOVIE HIGHLIGHTS

• N. T. Rama Rao Jr. won the Nandi Special Jury Award for his performance in Aadi (2002).

• Aadi (2002) established V. V. Vinayak as a successful commercial director with his debut film.

• The song "Chikki Chikki" was inspired by Turkish singer Tarkan's hit song Şımarık.

Ayyo Rama Song Lyrics in Telugu – Aadi (2002)

'Ayyo Rama' song from Aadi (2002) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and Gopika Poornima. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Aadi (2002)
Music : Mani Sharma
Lyricist : Bhuvana Chandra
చిత్రం: ఆది (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భువనచంద్ర గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యా ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడో తోకపట్టి నిన్ను కాస్త సీనులోకి దించాడు ఎర్రాబుగ్గల కుర్రవాడ్ని చూసి ఓరయ్యో ఎట్టావదలను లవ్ లో దించక ఓ హనుమయ్యో ఏంటే నీ గొప్ప జర చెప్పవే గుంపప్పా ఏముందని నిన్ను ప్రేమించాలి అదిరే సొగసుంది మతిపోయే ఫిగరుంది ఇంకేంకావలో సెలవీవయ్యో పైన ఎన్ని అందాలున్నా లోపలుంది తెలిసేదెట్టా తెలియకుండా చనువిచ్చేదెట్టా పైటచాటు పాగావేసే లోపలున్నది పసిగట్టేసే అప్పుడైనా తెలియక పోదయ్యో అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడు ఓకే అంటాలే నా ఒడ్లోకొస్తావా నే కోరింది కొరికిస్తావా ప్రేమించానంటే నా ప్రాణం ఇచ్చేయ్ నా అరె నీలోని సగమైపోనా హొయ్ పొద్దుటేళా ముద్దివ్వాలి మద్దినేళ మురిపించాలి రాతిరేళా రాణై రావాలి... ముందుకొస్తే ముద్దై పోనా ముట్టుకుంటే మధువైపోనా రాతిరేళా రెట్టించేసేయ్ నా... అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యో ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడో తోకపట్టి నిన్ను కాస్త సీనులోకి దించాడు ఎర్రాబుగ్గల కుర్రదాన్ని చూసి ఓరయ్యో ఎట్టావదలను లవ్ లో దించక ఓ హనుమయ్యో

Sunnunda Song Lyrics in Telugu – Aadi (2002)

'Sunnunda' song from Aadi (2002) movie is composed by Mani Sharma and sung by Murali and Radhika. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aadi (2002)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
Singers : Murali, Radhika
చిత్రం: ఆది (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: మురళి, రాధిక యమ యమ యమ యమా సున్నుండా తీసుకో... యమ యమ యమ యమా సిగ్గుపడక తీసుకో... సున్నుండ తీసుకో ఓ బావ సిగ్గు పడకుండా తీసుకో నా బావ సున్నుండ ఇచ్చుకో ఓ భామ ఇచ్చి నా గుండె పుచ్చుకో నా భామ ఎడా పెడా ఎడా పెడా లాగించుకో అదో ఇదో ఏదోలాగా అరిగించుకో హడా విడా హడా విడా వడ్డించుకో అందంతో కలిపేస్తే తింటా కాస్కో సున్నుండ చూసుకో... సున్నుండ ఇచ్చుకో... పడుచుతనం పైకి నువు పాములాగ పాకి చకా చకా చకా చకా తాడేసుకో పసుపు తాడేసుకో ఉడుకుతనం మెచ్చి నా ఉడుంపట్టు నచ్చి పకా పకా పకా పకా పండిచ్చుకో బ్రతుకు పండించుకో నా లేత తళుకుల్ని తాలింపేస్కో నా సిగ్గు తలుపుల్ని తోసేస్కో నీ చీకూచింతల్ని చాలించేస్కో నా చాతిఫై నువ్వు చాపేస్కో హత్తుకొని చూస్కో నన్నెత్తుకొని ఉస్కో కిందపడి మీదపడి పెట్టుబడి రాబట్టుకో సున్నుండ చూసుకో... సున్నుండ ఇచ్చుకో... సున్నుండ తీసుకో ఓ బావ సిగ్గు పడకుండా తీసుకో నా బావ ఇంటిలోకి వచ్చి నట్టింటిలోకి వచ్చి చిటా చిటా చిటా చిటా మంటేసుకో అందమంటేసుకో గడపలోకి వచ్చి అడిగింది నాకు ఇచ్చి కిటా కిటా కిటా కిటా మెక్కేసుకో మంచమెక్కేసుకో అంగట్లో నా గొప్ప చాటించేస్కో సందిట్లో నామీద చెయ్యేస్కో ముద్దుల్తో నా నోరు మూయించేస్కో పొద్దల్లా నా బరువు మోసేస్కో ఆడుమరి ఖోఖో రహదారి ఇక రోఖో వెంటబడి వెచ్చబడి రాత్రిబడి పెట్టేసుకో సున్నుండ చూసుకో ఓ బావ సిగ్గు పడకుండా తీసుకో నా బావ సున్నుండ ఇచ్చుకో ఓ భామ ఇచ్చి నా గుండె పుచ్చుకో నా భామ హా ఎడా పెడా ఎడా పెడా లాగించుకో అదో ఇదో ఏదోలాగా అరిగించుకో హడా విడా హడా విడా వడ్డించుకో అందంతో కలిపేస్తే తింటా కాస్కో ఏయ్ హా హా హా హా....

Tholi Pilupey Song Lyrics in Telugu – Aadi (2002)

'Tholi Pilupey' song from Aadi (2002) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aadi (2002)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
చిత్రం: ఆది (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో కలలను కదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చరణం: 1 ఒక చూపుతోటి ఒక చూపుకలిపి వెనుచూపు లేని జత పయనమిది ఒక చేయిలోన ఒక చేయివేసి ఒకటయ్యే చెలిమిది ఒక మాటతోటి ఒక మాట కలిపి మొగమాటమైన మగువాట ఇది ఒక గుండెతోటి ఒక గుండెచేరి ఒదిగుండే కథ ఇది ప్రతిపదమూ ప్రియా అని వలచినది ప్రతిఫలమూ ఆశించని మమతల వ్రతమిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చరణం: 2 మనసైన వేళ కనుసైగ చాలు పలు దేశభాషలిక దేనికిలే అధరాల పాల చిరుధార చాలు ఆహారం దేనికే ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు ఏ ఇల్లు వాకిలిక ఎందుకులే మన చుంబనాల సవ్వళ్ళు చాలు సంగీతం ఎందుకే ఇరువురికీ ఏడో రుచి తెలిసినదీ మనుగడకీ మరోముడై ముడి పడు ముడుపిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో నిదురను చిదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే

Nee Navvula Song Lyrics in Telugu – Aadi (2002)

'Nee Navvula' song from Aadi (2002) movie is composed by Mani Sharma and sung by Mallikarjun and Sunitha. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aadi (2002)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
చిత్రం: ఆది (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: మల్లికార్జున్, సునీత ఉపద్రస్ట నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక బదులిమ్మంటు బతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ చరణం: 1 నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు నా వైపే మొక్కిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు నాకోసం వేచే నీకైతే అది నాసిగ ఇవ్వచ్చు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు నీకే మొక్కే నాకే ఇవ్వచ్చూ... నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... చరణం: 2 నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు మరి నాకై పుట్టిన నీకైతే - అది పూర్తిగ ఇవ్వచ్చు నీ భారం మోసే అదృష్టాన్నె భూమికి సైతం ఇవ్వద్దు నీనంటే మెచ్చిన నీకైతే - అది వెంటనే ఇవ్వచ్చు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ... నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే నా పాపిట వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా... బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...

Chikki Chikki Song Lyrics in Telugu – Aadi (2002)

'Chikki Chikki' song from Aadi (2002) movie is composed by Mani Sharma and sung by Tippu. Lyrics are written by Potula Ravikiran.

SONG INFORMATION
Movie : Aadi (2002)
Music : Mani Sharma
Lyricist : Potula Ravikiran
Singer : Tippu
Special Note : The tune of "Chikki Chikki" was inspired by Turkish singer Tarkan's hit song Şımarık.
చిత్రం: ఆది (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: టిప్పు చికి చికి బం బం చికి చికి బం బం చిందులు వేసే వయసేలే చికి చికి బం బం చికి చికి బం బం చిరుతలు దాగే పొగరేలే వేటకు వేట మన ఆట వేటుకు వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట తీయని మాట అందినదేరా రా మనది మరి పొందినదేరా మనది అందనిదైనా మనదే అది అందగనే చికి చికి బం బం చికి చికి బం బం చిందులు వేసే వయసేలే చికి చికి బం బం చికి చికి బం బం చిరుతలు దాగే పొగరేలే నాటి రాముని రూపం నాకు మాత్రం సొంతం ఓటమిరుగుని వంశం ఇదిరా తాత పంచిన రక్తం చెయ్యమన్నది యుద్ధం రగులుతున్నది బంధం పదరా అందినదేరా రా మనది మరి పొందినదేరా మనది అందనిదైనా మనదే అది అందగనే చికి చికి బం బం చికి చికి బం బం చిందులు వేసే వయసేలే చికి చికి బం బం చికి చికి బం బం చిరుతలు దాగే పొగరేలే వేటకు వేట మన ఆట వేటుకు వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట తీయని మాట అందినదేరా రా మనది మరి పొందినదేరా మనది అందనిదైనా మనదే అది అందగనే కండబలమే కాదు గుండెబలమే మాది దుమ్ముదులిపే జోరు కదరా ఆ కంటిచూపులు చాలు కత్తులెందుకు వేలు సమరసింహం తీరు ఇదిరా అందినదేరా రా మనది మరి పొందినదేరా మనది అందనిదైనా మనదే అది అందగనే చికి చికి బం బం చికి చికి బం బం చిందులు వేసే వయసేలే చికి చికి బం బం చికి చికి బం బం చిరుతలు దాగే పొగరేలే వేటకు వేట మన ఆట వేటుకు వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట తీయని మాట అందినదేరా రా మనది మరి పొందినదేరా మనది అందనిదైనా మనదే అది అందగనే అందినదేరా రా మనది మరి పొందినదేరా మనది అందనిదైనా మనదే అది అందగనే

Pattu Okato Song Lyrics in Telugu – Aadi (2002)

'Pattu Okato' song from Aadi (2002) movie is composed by Mani Sharma and sung by Udit Narayan and Ganga. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aadi (2002)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
Singers : Udit Narayan, Ganga
చిత్రం: ఆది (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, గంగ పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి గుండెలు గుణించు ఓ సారి సిగ్గులు భాగించు ఓ సారి లవ్వులు లెక్కించు ఓ సారి ఆపై అందిస్త ఓ పట్టుశారీ అమ్మాయి నీ అందం సముద్రమే అందులో నా మనసే అణిగే మనిగే మునిగే అబ్బాయి నీ వేగం విమానమే అందుకే నా సొగసే వొణికే జనికే బెనికే చిన్న వయసులో పాఠశాలకి పొగరున్న వయసులో వచ్చానే పైటశాలకి ఆరు ఏళ్లలో చెమ్మచెక్కకి పదహారు ఏళ్లలో వచ్చాగా చుమ్మ చెక్కకి పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి ఇంగ్లీషులో ఎన్నెన్నో పదాలలో ఈ మూడే నచ్చినివి లివరు ఫ్లవరు లవరు లోకంలో ఎన్నెన్నో బంధాలలో ఈ మూడే తెలిసినవి మదరు ఫాదరు తమరు నేను ఇప్పుడూ బ్రహ్మ చారిని నువు కోరినప్పుడు అయిపోతా భామ చారిని నేను ఇప్పుడూ అందగత్తెని నువు తాకినప్పుడు అయిపోతా అగరుబత్తిని పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి గుండెలు గుణించు ఓ సారి సిగ్గులు భాగించు ఓ సారి లవ్వులు లెక్కించు ఓ సారి ఆపై అందిస్త ఓ పట్టుశారీ

Palli Balakrishna Thursday, July 6, 2017

Most Recent

Default