చిత్రం: మేం వయసుకు వచ్చాం (2012)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కర భట్ల రవికుమార్
గానం: రంజిత్
నటీనటులు: తనీష్
దర్శకత్వం: త్రినాధ్ రావు నక్కిన
నిర్మాతలు: కేదారి లక్ష్మణ్, బెక్కం వేణుగోపాల్ రావు
విడుదల తేది: 23.06.2012
వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి
వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడకా..
వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి
వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్ళీ రాకీకా..
నా మనసులోని సంతకాలు
గుర్తుకొచ్చే జ్ఞాపకాలు..
దాచలేనే మొయ్యలేనే తీసుకెల్లిపోవే..
మార్చుకున్న పుస్తకాలు రాసుకున్న ఉత్తరాలు
కట్టగట్టీ మంటలోనా వేసిపోవే.. హో...
అటువైపో ఇటువైపో ఎటు ఎటు అడుగులు
వెయ్యాలో
తెలియని ఈ తికమకలో తోసేసావేంటే ప్రేమా
నూవంటే నాలాంటీ ఇంకో నేనని అనుకున్నా
నా లాగా ఏనాడూ నూవ్వనుకోలేదా ప్రేమా
వెళ్ళిపోకే.. అ.. హా.. వెళ్ళిపోకే.. హా..
ఎంతలా నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో
పెట్టుకున్నాను
కన్న కలలన్ని కాలిపోతుంటే ప్రాణం ఉంటదా..
చెలి చిటికెడంతైన జాలి లేదా తట్టుకోలేను ఇంత
బాధ..
అడగలేక అడుగుతున్నా నేను నీకేమి కానా...
తలపుల్లో తడిపేసే చినుకనుకున్నా వలపంటే
కన్నుల్లో కన్నీటి వరదై పోయావే ప్రేమా
మనసెపుడూ ఇంతేలే ఇచ్చేదాకా ఆగదులే
ఇచ్చాకా ఇదిగిదిగో శూన్యం మిగిలిందే ప్రేమా
వెళ్ళిపోకే.. వెళ్ళిపోకే..
వెయ్యి జన్మాల తోడు దొరికింది అన్నమాటే
మరిచిపోలేను
ఒప్పుకోలేను తప్పుకోలేను ప్రేమా ఏంటిలా
కనుపాపలో ఉన్న కాంతి రేఖా.. చీకటయ్యింది
నువ్వు లేక
వెలుతురేదీ దరికి రాదే వెలితిగా ఉంది చాలా
ఎద నువ్వే గతి నువ్వే అనుకోటం నా పొరపాటా
చెలి నువ్వే చిరునవ్వే మాయం చేసావే ప్రేమ
అటు నువ్వూ ఇటు నేనూ కంచికి చేరని కథ లాగా
అయిపోతే అది చూస్తూ ఇంకా బ్రతకాలా ప్రేమా..
2012
,
Bekkam Venugopal
,
Madalsa Sharma
,
Mem Vayasuku Vacham
,
Niti Taylor
,
Rani (Raksha)
,
Shekar Chandra
,
Tanish
,
Trinadha Rao Nakkina
Mem Vayasuku Vacham (2012)
Palli Balakrishna
Tuesday, January 19, 2021