Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sri Divya"
Rayudu (2016)



చిత్రం: రాయుడు (2016)
సంగీతం: డి. ఇమ్మాన్
నటీనటులు: విశాల్, శ్రీ దివ్య
దర్శకత్వం: ముత్తయ్య
నిర్మాత: జె.వెంకటేష్
విడుదల తేది: 27.05.2016



Songs List:



కరుకు చూపు కుర్రోడ పాట సాహిత్యం

 
చిత్రం: రాయుడు (2016)
సంగీతం: డి. ఇమ్మాన్
సాహిత్యం: శ్రీమణి
గానం: జతిన్ రాజ్, జయ మూర్తి

కరుకు చూపు కుర్రోడ… నాతో కడ వరకు వస్తావా
మల్లె పువ్వు మనసోడ… నాకే ముద్దుల ముడి వేస్తావా
కాలాన్నే మన్నవనే… హ హ
కౌగిలినే విడువనని… హ హ హ
నీ మీసం మీద ఒట్టేస్తావా… ఆ ఆ, నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా… ఆ ఆ, వందేళ్ళు ప్రేమ పంచేస్తావా
కరుకు చూపు కుర్రోడ… నాతో కడ వరకు వస్తావా
మల్లె పువ్వు మనసోడ… నాకే ముద్దుల ముడి వేస్తావా

ఒంటరి దాన్ని శానా… ఇది నీళ్ళు లేని మీన
పసుపు తాడు తోన… నీ వశం అయిపోతున్నా
అందం అనే సిరిలో… అంతులేని దానా
గుండె లోతుల్లోన… నిను దాచిపెట్టుకోనా
గలగల గాజులు చేతుల కోసం… నాలో మోజులు నీ కోసం
పువ్వుల వెన్నెల దేవుడి కోసం… నాలో వన్నెలు నీ కోసం
చుక్కలది లెక్కలది… టక్కున లెక్క తేలిపోద్దే
అదేమిటో నీ ఒంటిపై… పుట్టుమచ్చ లెక్కతేలదే

నీ మీసం మీద ఒట్టేస్తావా… ఆ ఆ, నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా… ఆ ఆ, వందేళ్ళు ప్రేమ పంచేస్తావా
కరుకు చూపు కుర్రోడ… నాతో కడ వరకు వస్తావా
మల్లె పువ్వు మనసోడా…

ఏ పాశం నిండిన ఎదలో… నే వాసం ఉండి పోనా
వారం తీరక మునుపే… మధుమాసం తెప్పించెయ్నా
జాము రాతిరేళా… నీ జతే చేరుకోన
నువ్వొక ముద్దు ఇస్తే… జంట చక్కరకేళి పుయ్యనా
పిలువక ముందే పలికేస్తున్నా… అడగక ముందే ఇచ్చెయ్వా
నీ చిరునవ్వులే చాలంటున్నా… చితి నుంచైనా వచ్చెయ్నా
ఉసురుని, ఊపిరిని… ఎనాడో నీకు ఇచ్చుకున్నా
ఏడేడు నా జన్మలకి… ఏడడుగులు ఇవ్వగలవా

నీ మీసం మీద ఒట్టేస్తావా… ఆ ఆ, నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా… ఆ ఆ, వందేళ్ళు ప్రేమ పంచేస్తావా
కరుకు చూపు కుర్రోడా…


Palli Balakrishna Tuesday, April 26, 2022
Bus Stop (2012)



చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
నటీనటులు: ప్రిన్స్ , శ్రీ దివ్య, ఆనంది
రచన: నందిని రెడ్డి.వి 
దర్శకత్వం: దాసరి మారుతి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 11.11. 2012



కళలకే కనులొచ్చిన పాట సాహిత్యం

 
చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రేవంత్

కళలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది 
ని వల్లే నివల్లే కథ మొదలై ఇవాళే
జతపడి నడకలై సాగిందే 
ఓ శైలు నివల్లే నా శైలే మారెలే
పడి పడి మనసిలా ఊగిందే

కళలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది

ఇంకొంచెం అందంగా నిఎదుటనే ఒంటరిగా ఉండాలనే ప్రతినిమిషము అనుకుంటున్నా
నా సొంతం నువ్వనగా పదిమందిలో బిగ్గరగా చెప్పాలనే ఎద కదలిక వినిపిస్తున్నా
కలిసిన వేళల్లో అల్లరి నేనై
పెదవుల అంచుల్లో పుడుతున్నా

You’re my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
You’re my soul you’re in my lovely heart
Just don’t tear me apart trust me girl
Touch the soul o sailu

నువ్వుంటే దగ్గరగా ఈ సమయమే తొందరగా గడిచిందని గురుతుండదె ఏదేమైనా 
నీ వెంటే వుంటానుగా నన్నొదిలిన దూరంగా ఊహాలలో ఊపిరిలో తోడై రానా
సాగే దారుల్లో సాయంత్రం నేనై
చలి చలి గాలుల్లో తడుస్తున్నా

యూ మై లవ్లీ ప్రిసిస్ బర్డ్
మై హార్ట్ ఈస్ యువర్ సోల్ 
నెవెర్ ఎవర్ లీవ్ మీ గో
యువర్ మై సోల్
యువర్ ఇన్ మై లవ్లీబర్డ్

You’re my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
You’re my soul you’re in my lovely heart
Just don’t tear me apart trust me girl
Touch the soul o sailu




రెక్కలొచ్చిన ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా
ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమ
ఇక ఇంటికి రాదందమ్మా ఎద రాజీనామా
కురిసే కన్నీరే వరదయ్యే వేళ

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా

రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం 
గమ్యాలే మారే గమనం ఆగదు ఏమాత్రం 
బ్రతుకంతా ఈడుంటుంద చివరంత తోడుంటుంద 
నది దాటని నావల కోసం ఎందుకు ఈ ఆత్రం 
ఆకాశం ఇల్లవుతుంద రెక్కలు వచ్చాకా 
అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక 
కలలే నిజమవున కలవరమేమైన

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా

నీవే ఓ అమ్మయ్యాక నీ అమ్మే గుర్తొచ్చాక
నీ కథ నీకెదురయ్యాక రగిలింద గాయం 
పువ్వులనే పెంచే మాలి ముల్లలో వెతకడు జాలి 
తిరిగింద నిన్నటి గాలి ఏ మనసైనా మాయం 
ఏనాడో రాశాడమ్మ తలరాతే బ్రహ్మ 
ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ 
బ్రతుకే నవలైనా కథలింతే ఏవైన

గుండెలో దాగిన ప్రేమ గూటికి చేరిందా
కంటిని వీడిన పాపా కన్నుగా మిగిలిందా

Note: This Lyric was Donated by Runku Ramprasad


Palli Balakrishna Thursday, May 21, 2020
Kerintha (2015)

చిత్రం: కేరింత (2015)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్
నటీనటులు: సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్వి మాడివాడ, సూకీర్తి, విస్వంత్ దుద్దుమ్పూడి, పార్వతీశం
కథ: అబ్బూరి రవి
దర్శకత్వం: సాయి కిరణ్ అడవి
నిర్మాత: దిల్ రాజు
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. చక్రవర్తి
ఎడిటర్: మధు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేది: 12.06.2015

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం
ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను
చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడిగాలిలా నను మత్తున తోసే
ఎత్తుకుపోయే ఎద

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం

నల్లని పుట్టు మచ్చ దిస్టే తీసిందా
కొత్తగా అందాన్ని ఇంకొంచం పెంచిందా
పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా
తనవెలుగే మెరుగైపోగా
హృదయం నిండుగా అచ్చయ్యావుగా
తొలి తొలి చూపులో ప్రేమను పండుగ రాగా

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం

ఆలలా అలా అలా వచ్చావో
కలలా జోలలు పాడి ఏమైపోయావో
మరలా చెలి నిన్ను చూసేదెలాగో
నిను చేరే దారెటు ఉందో
అది తెలిపేందుకే నను పిలిచేందుకే
వదిలెల్లవుగా నీ చెవి ఝంకి నాతో

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం
ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను
చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడిగాలిలా నను మత్తున తోసే
ఎత్తుకుపోయే ఎద

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం


Palli Balakrishna Sunday, February 11, 2018
Manasara... (2010)


చిత్రం: మనసారా... (2010)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కృష్ణ చైతన్య
నటీనటులు: విక్రమ్ , శ్రీవిద్య
దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: ప్రకాష్ బాబు కడియాల
విడుదల తేది: 12.10.2010

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగ ఇన్నిన్ని కవ్వింతలా
నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

చూడాలి చూడాలి అంటు నీ తోడే కావాలి అంటు
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల
ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటు ఏ మూల ఉంది
గుండెల్లోన గుచ్చేస్తుంది సూటిగా
పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది
అంతా చిత్రంగా ఉందె ఈ రోజు ఎమైందిలా

నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా

కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

చంద్రున్నె మింగేసిందేమొ వెన్నెల్ని తాగేసిందేమొ
ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా
తారల్ని ఒళ్ళంత పూసి మబ్బుల్తొ స్నానాలు చేసి
ముస్తాబై వచేసిందేమొ దేవతా
మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే
నన్నే లాగేస్తునట్టు నీపై తోసేస్తునట్టు
ఎంటో దొర్లేస్తునట్టు ఎదేదో అవుతోందిలా

నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా


*********   **********   *********


చిత్రం: మనసారా (2010)
సంగీతం: శేఖర్‌చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: గీతామాధురి

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వు ఎవ్వరైనా పర్లేదు
ఓ... నీకు నాకు స్నేహం లేదు
నువ్వంటే కోపం లేదు
ఎందుకే దాగుడుమూతలు
అర్థమే లేదు
మచ్చేదో ఉన్నాదనీ మబ్బుల్లో
జాబిల్లి దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ అయినా
మరి పర్లేదు
మసిలాగ ఉంటుందని
తిడతామా రాతిరిని
తనలోనే కనలేమా
మెరిసేటి సొగసులనీ
అందంగా లేను అనీ
నిన్నెవరూ చూడరని
నువ్వెవరికి నచ్చవనీ
నీకెవ్వెరు చెప్పారు
ఎంత మంచి మనసో నీది
దాని కన్న గొప్పది లేదు
అందగాళ్లు నాకెవ్వరూ ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నానని
కోకిల కొమ్మల్లో దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

హాఅ..ఆఆహహహాఅ..హా...
అంతలేసి కళ్లుండకున్నా
నాకు పర్లేదు
కోరమీసం లేకున్నా గాని
మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్లిలా
అని నిన్నే అడగమనీ
సరదాగా తరిమిందే మది
నీపై మనసుపడి
మురిపించే ఊహలతో
ఒకచిత్రం గీసుకొని
అది నువ్వు కాదోనని
సందేహం ప్రతిసారీ
చేరదీసి లాలించలేదు
నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరూ
ఇంత నచ్చలేదు
ఎవరేమన్నా సరే
నా చేయి నిన్నింక వదిలేదిలేదు

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

Palli Balakrishna Saturday, August 19, 2017

Most Recent

Default